జీవితం లో ముందికు సాగేందుకు కాళ్ళు ఆరోగ్యము గా ఉండడము ఎంతో అవసరము . కాళ్ళకు సంబంధించిన ఓ సాధారణ వ్యాధి వెరికోస్ వీన్స్ . కాళ్ళలో సిరరు (వాడుక భాషలో నరాలు) వాచి అసాధారణము గా ఉబ్బిపోవడాన్ని వెరికోస్ వీన్స్ గా పరిగణిస్తారు . వెరికోస్ వీన్స్ వ్యాది ఎక్కువగా 30 నుండి 70 సం . మధ్య వయసుండే వ్యక్తులలో కనిపిస్తుంది . దీర్ఘకాలము పాటు నిలబడి లేదా కూర్చొని పనిచేసే వారికి కాళ్ళలో వెరికోస్ వీన్స్ తలెత్తే ప్రమాదం ఉంటుంది . మహిళలలో .. ముఖ్యము గా గర్భిణీ సమయము లో ఈ సమస్య ఎక్కువగా ఏర్పడే అవకాశము ఉన్నది .
రోగ లక్షణాలు :
- కాళ్ళలో నొప్పి ,
- కాళ్ళు బరువెక్కిన భావన ,
- కాళ్ళలో మంట ,
- కండరాలు బిగుసుకోవడం వంటి సమస్యలు ,
- చాలాసేపు కూర్చున్నా , నిలబడినా నొప్పి మరింత తీవ్రమవుతుంది ,
- ఏదైనా సిర లేదా సిరలచుట్టూ దురద పుట్టి చర్మపు రంగు మారి (నలుపు) పుండ్లు ఏర్పడడము ,
- అరుదుగా ఈ సూక్ష్మ రక్తనాళాలు పగిలి హఠాత్తుగా రక్తం బయటకు చిమ్ముకొస్తుంది . మడమల చుట్టూ, పాదాల మీద వాపు రావచ్చు. ఈ లక్షణాలు ఒకదాని తర్వాత ఒకటి రావాలనే లేదు. 20 ఏళ్ళుగా వెరి కోస్ వీన్స్ ఉండి కూడా ఇప్పటికి ఎలాంటి నొప్పి లేకుండా ఉన్నవారు కనిపిస్తారు. కొందరికి ఏడాదిలోపు పుండ్లు పడొచ్చు కూడా. కాబట్టి సమస్య తీవ్రత ఒక్కొక్కరిలో ఒక విధంగా ఉంటుంది.
కారణాలు :
- వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. రెండోది ఈ సమస్య స్త్రీలలో అధికం. ముఖ్యంగా గర్భిణుల్లో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వారిలో సిరల్లోని కండర కవాటాలు వదులుగా తయారవుతాయి. ఫలితంగా రక్తం కిందకి జారిపోతుంటాయి. ఇవి వచ్చే అవకాశం మొదటి మూడు నెలల్లో ఎక్కువ. మళ్ళీ కాన్పూ తర్వాత మూడు నెలల్లోపు వాటంతట అవే తగ్గిపోతాయి. వయసుతో పాటు వెరికోస్ వీన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
- అలాగే ఎక్కువసేపు నిలబడే వృత్తుల్లో వారికి ఈ రిస్కు ఎక్కువే. ముఖ్‌యంగా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది, సర్జన్ల వంటి వారలో ఎక్కువే. సహజంగానే ఈ సమస్య వచ్చే ముప్పు ఉన్నవారికి ఈ వృత్తులు మరింత అజ్యం పోస్తాయి. చాలాసార్లు కాళ్ల మీద సిరలుపైకి ఉబ్బి స్పష్టంగానే కనిపిస్తుంటాయి. వీటిని చూస్తూనే గుర్తించవచ్చు. అయితే అందరిలోనూ ఇలాగే ఉండాలనేం లేదు. కొందరిలో ఇవి పైకి కనిపించవు. చర్మం రంగు మారటం, పుండ్లు పడటం, వాపు వంటివి మాత్రం ఉంటాయి. మరికొందరిలో చీలమండల ప్రాంతంలో దురదతో ఎండు గజ్జిలా కూడా వస్తుంది. దాన్ని కేవలం చర్మ సమస్యగా పొరబడి, సకాలంలో సరైన చికిత్స తీసుకొని వారూ ఉంటారు. కాబట్టి కాళ్ళ మీద రక్తనాళాలు ఉబ్బినట్లు కనబడినా లేకున్నా, ఈ లక్షణాల ఆధారంగా సమస్యను పట్టుకోవటం కీలకమైన అంశమని గుర్తించాలి. వెరికోస్ వీన్స్‌ని గుర్తించటానికి చాలా తేలికైనదీ, సులువైనదీ కలర్ డాప్లర్ పరీక్ష, దీనిలో నాళాలు లోపల రక్తప్రవాహం ఎలా ఉందన్నది తెలుస్తుంది. ఈ పరీక్షను పడుకున్నప్పటి కంటే నిలబడి ఉన్నపుడే చేయటం మేలు. దీనిలో సమస్య నిర్థారణ కావటమే కాదు, ఒకవేళ ఆపరేషన్ అవసరమైతే అదెలా చేయాలో నిర్ణయించేందుకూ తోడ్పడుతుంది.
ఏయే సిరలు ప్రభావితం అవుతాయి ?
- కాళ్ళల్లో - చర్మం కిందే ఉండే సూపర్ ఫిషయల్ సిరల్లో కూడా ప్రధానంగా రెండు సిరలుంటాయి. ఒకటి మోకాలు నుండి తొడలు ద్వారా గజ్జల వరకుండేదాన్ని ''లాంగ్ సఫెనస్ వీన్'' అంటారు. రెండోది కాలు వెనుక భాగంలో మడమ నుంచి మోకాలు కీలు వరకు ఉండే ''షార్ట సఫెనస్ వీన్'' సాధారణంగా వెరికోస్ వీన్స్ సమస్య ఎక్కువగా ఈ రెంటిలోనే తలెత్తుతుంది. అయితే చర్మం కిందే ఉన్నా సాధారణంగా ఇవి బయటకు కనబడేవి కావు. కాలి మీద మనకు ఉబ్బి కనిపించేవి నిజానికి వీటికి చెందిన సూక్ష్మ శాఖలే.
చికిత్స :
- నిత్యం వ్యాయామం చెయ్యటం వల్ల కండరాల పనితీరు మెరుగై, విరికోస్ వీన్స్ సమస్య ముదరకుండా ఉంటుంది. జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలన్నీ మేలు చేసేవే గాని దీనికి నడక మరింత మంచిది. బిగుతైన మేజోళ్ళు వేసుకుని నడపటం అవసరం. కూర్చున్నపుడు కాళ్ళు ఎత్తు మీద పెట్టుకోవడం, పడుకునేటపుడు కాళ్ళ కింద ఎత్తు పెంచుకోవటం మేలు. ఊబకాయం, అధిక బరువు వెరికోస్ వీన్స్ బాధలను మరింత పెంచటమే కాదు. వాటివల్ల చికిత్స కూడా కష్టంగా తయారవుతుంది.
- సర్జరీ :పురాతన కాలము నుండీ శస్త్ర చికిత్సావిధానము వాడుకలో ఉన్నది. ఎన్నోపద్దతులు ఉన్నాయి. ముఖ్యమైనవి . సెఫనస్ స్ట్రిప్పింగ్ (saphenous stripping) , అంబులేటరీ ఫ్లెబెక్టమీ (Ambulatory Phlebectomy) , వీన్ లిగేషన్ (Vein ligation) , క్రయోసర్జరీ(Cryosurgery).
- ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ : శరీర ఆకృతి చెడకుండా కాలిపై శస్త్ర చికిత్స గుర్తులు కేకుండా చేయగలగడమే దీని ప్రత్యేకత . హాస్పిటల్ లో ఉండవసైన అవసరము , ఎనస్థీసియా అవసరము ఉండవు .
- =================================
No comments:
Post a Comment