బంక విరేచనాల వంటి దీర్ఘవ్యాధుల విషయంలో వ్యాధి లక్షణాలతోపాటు వ్యాధిగ్రస్థుల లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రోగికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది, వ్యాధి తిరగబెట్టకుండా ఉంటుంది.
జిగట విరేచనాలను బంక విరేచనాలని కూడా వ్యవహరిస్తారు. ఇది పెద్దపేగులకు సంబంధించిన వ్యాధి. క్రానిక్ అమీబియాసిస్, క్రోన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్ వంటి వేర్వేరు పేర్లతో వ్యవహరించే సమస్యలు ఈ తరగతికి చెందిన వ్యాధులే.
పెద్దపేగుల లోపలి జిగురుపొరలలో పుండ్లు (అల్సర్స్) ఏర్పడతాయి. ఈ లోపలి జిగురు పొరలను గీకినట్లుగా జిగురు (మ్యూకస్) వచ్చి చేరుతూ, జిగట విరేచనాలు కనిపిస్తాయి. కొద్దిపాటి జ్వరం, ఒంట్లో ద్రవాలు లవణాలు తగ్గి పాలిపోవటం, రక్తహీనత, నీరసం లాంటి శారీరక లక్షణాలు కీలకమైనవి. అమీబియాసిస్ కేసుల్లో లివర్ కూడా వ్యాధిగ్రస్థమయ్యే అవకాశం ఉంటుంది.
క్రానిక్ అమీబియాసిస్ రోగులలో ఎంటమీబా హిస్టొలిటికా ఇన్ఫెక్షన్‌ను గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఈ వ్యాధికి గురవుతున్నట్లు ఒక అంచనా.
శారీరక పరమైన బాధలే కాకుండా ఈ రోగులలో మానసిక ఒత్తిళ్లు కూడా కనిపిస్తాయి. వాస్తవానికి ఈ రోగ బాధలకు అవి ముఖ్య కారణం కావచ్చు కూడా. వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధులకు గురవుతున్నట్లు గుర్తించటం జరిగింది.
పైన చెప్పిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నట్లయితే వారసత్వం, ఇన్ఫెక్షన్- ఉమ్మడిగా దీర్ఘ వ్యాధులకు ముఖ్యకారణంగా నిలుస్తున్నాయని గుర్తించవచ్చు.
- ==================================
No comments:
Post a Comment