పురుషాంగం వంకరగా ఉండే కండిషన్‌ను కార్డీ అంటారు. చాలామందిలో పురుషాంగం కుడి, ఎడమ వైపులకు గానీ, కిందికి గానీ, పైకి గానీ 20, 30 డిగ్రీల వరకు వంగి ఉండటం సహజమే. సెక్స్ చేసేటప్పుడు సమస్య లేకపోతే దీనికి ఎలాంటి చికిత్స అవసరం లేదు. ఈ వంపు చాలా ఎక్కువ ఉండి, సెక్స్ చేయడానికి అడ్డంకిగా ఉంటే, అంగంపై గడ్డలాగా ఉంటే, దాన్ని తీసివేసి లోపల కొత్త చర్మం అమర్చాల్సి ఉంటుంది. ఇలా పురుషాంగంపై గట్టిగా ఉండే పొరలు వస్తే దాన్ని పెరోనిస్ డిసీజ్ అంటారు. ఒకటే పెద్ద పొర ఏర్పడి, అది గట్టిగా ఉంటే, దాన్ని సరిచేయడానికి సర్జరీ మంచి మార్గమే అయినా, చాలామందికి సర్జరీ అవసరం రాని సందర్భాలే ఎక్కువ.
హైపోస్పిడియాస్ వున్నవారు చాలామంది చిన్న వయస్సులో డాక్టరుకి చూపించుకోరు. ఆపరే షన్ చేయించుకోరు. ఎదుగుతున్న కొద్దీ అంగం కూడా ఆర్చ్‌లాగా మారుతుంది. దీనిని ‘‘కార్డీ’’ అంటారు. అలా తయారైన వారికి ఆప రేషన్ చేసి వంకరని సరిచేయాలి. కొందరికి కార్డీ వుండదు. కానీ కొద్దిపాటి వంకర కింద కో, పక్కకో వుంటుంది. దీనికి సర్జరీ ఏ మా త్రం అవసరం వుండదు. హైపోస్పిడియాస్ వున్నప్పటికీ సెక్స్ లైఫ్‌లో పాల్గొనడానికి ఎటువంటి ఆటంకం వుండదు. సెక్స్ తృప్తి కలగడంలోనూ లోపం ఉండదు. స్ర్తీ కూడా మామూలుగా తృప్తి చెందు తుంది.
- =======================================
No comments:
Post a Comment