Thursday, 24 November 2011

చిన్న పిల్లల్లో స్థూలకాయం , Obesity in children



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --చిన్న పిల్లల్లో స్థూలకాయం , Obesity in children-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • పిల్లలు పెరిగే కొద్దీ సాంఘిక నియమాలు, అలవాట్లు మారిపోయాయి. ఇప్పుడున్న చాలా స్కూళ్లల్లో ఆడుకోవడానికి స్థలం లేదు. ఇంటి దగ్గర కూడా ఆడుకోవడానికి స్థలం లేదు. కేవలం విద్య, మార్కులు, చదువుపైనే పిల్లలపై తల్లిదండ్రులు, టీచర్లు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో పిల్లలకు ఆడుకోవడానికి సమయం వుండడం లేదు. 8 నుంచి 15 ఏళ్ల వయసులో శరీరంలో కొవ్వు కణాలు తయారౌతాయి. అతి ముఖ్యమైన ఈ వయసులో ఆటలాడకపోవడం వల్ల కొవ్వు కణాలు పేరుకుపోతున్నాయి. ఇది స్థూలకాయానికి దారితీస్తుంది.

స్థూల కాయం (Obesity) అనగా శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి చెరుపు చేసే ఒక వ్యాధి. ఒక వ్యక్తి తన ఎత్తుకు ఎంత బరువు ఉండాలన్నది బాడీ మాస్ ఇండెక్స్ (Body Mass Index) సూచిస్తుంది. ఏ వ్యక్తికైనా ఇది 30 కె.జి/ చదరపు మీటరుకు పైన ఉంటే స్థూలకాయంగా లెక్కిస్తారు. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిస్, నిద్రలో సరిగా ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం (గురక), కీళ్ళకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

  • కారణాలు :
  • మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం,
  • సరైన వ్యాయామం లేకపోవడం,
  • కొన్ని సార్లు వారసత్వం ....................
........... దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

చికిత్స :
  • సరైన రీతిలో ఆహారం తీసుకోవడం,
  • క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం దీనికి ముఖ్యమైన చికిత్సలు.
  • వీటి వల్ల కాకపోతే స్థూలకాయానికి వ్యతిరేకంగా ఆకలి తగ్గించేందుకు కొవ్వులను సంగ్రహించే సామర్థ్యాన్ని తగ్గించేందుకు కొన్ని మందులు ఉన్నాయి.

  • స్కూలు పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయం

మన దేశంలోని 15 నుంచి 20 శాతం స్కూలు పిల్లలు స్థూలకాయలే. ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. జంక్‌ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం, ఎలాంటి ఆటలు ఆడకపోవడం, వ్యాయామం లేకపోవడం దీనికి కారణాలు. ఈ అంశంపై ఫొర్టిస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ డయాబెటిస్‌ అధ్యయనం చేసింది. ఈ స్థూలకాయం మధుమేహానికి దారిస్తుందని సెంటర్‌ ఆందోళన వ్యక్తం చేసింది.
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment