ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వ్యాయామం-స్థూల జన్యువును ఓడిస్తుంది. Exercise nullify Obesity gene effects - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
స్థూలకాయం మూలాలు జన్యువుల్లోనే ఉండొచ్చు. అంతమాత్రాన అధిక బరువును మనమేం చెయ్యలేమని వదిలేయటానికి లేదని నిపుణులు సూచిస్తున్నారు. స్థూలకాయానికి కారణమయ్యే జన్యువు (ఫ్యాట్ మాస్ అండ్ ఒబేసిటీ అసోసియేటెడ్-ఎఫ్‌టీవో) ప్రభావాలను వ్యాయామం చేయటం వల్ల తగ్గించుకోవచ్చని వీరు గుర్తించటం పెద్ద ఊరట. ఈ ఎఫ్‌టీవో జన్యువు బరువు పెరగటానికి దోహదం చేస్తుందని, ఇది స్థూలకాయం ముప్పును పెంచుతున్నట్టు గత అధ్యయనాల్లో తేలింది. శారీరకశ్రమ చేయటం ద్వారా ఈ జన్యువు ప్రభావాలు 30% వరకు తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడటం విశేషం. అధిక బరువును నియంత్రించుకోవటానికి ముఖ్యంగా ఎఫ్‌టీవో జన్యువు గలవారికి వ్యాయామం చేయటమే అత్యుత్తమ మార్గమని పరిశోధకులు చెబుతున్నారు. బ్రిటన్‌లోని వైద్య పరిశోధన మండలి విభాగం ఇటీవల 2.18 లక్షల మంది వివరాలను పరీశీలించి.. ఎఫ్‌టీవో జన్యువు స్థూలకాయానికి దోహదం చేస్తున్నట్టు గుర్తించింది. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ఈ ముప్పు 33% తక్కువగా ఉంటున్నట్టు కనుగొంది. ఎఫ్‌టీవో జన్యువు రోజుకి సగటున 200 కేలరీలు అధికంగా తినాలనే కోరిక పుట్టిస్తుంది. రోజుకి 3 కిమీ నడవటం ద్వారా దీన్నుంచి తప్పించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. జన్యు ప్రభావాలను తగ్గించేలా మందులను తయారుచేయటానికీ తాజా అధ్యయనం దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
===============================
Visit my website - > Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment