ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Attention Deficit Disorder(ADD), సావధానత లోపం డిజార్డర్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
సావధానత లోపం డిజార్డర్ (కూడా ADD పిలుస్తారు) మరియు సావధానత లోటు అధికకార్యశీలత లోపం (ADHD) పాఠశాల వయస్సు పిల్లలకు చాలా తరచుగా
కనిపించే ప్రవర్తన శైలులు వివరించడానికి వాడే పదాలు. ఈ లోపాలు ఉన్న పిల్లలు hyperactive, ADHD విషయంలో, అతిగా హఠాత్తు, శ్రద్ధ లేని మరియు.
ఎక్కువ కాలము కూర్చుని లేదా సుదీర్ఘ కాలం ఒక వస్తువుపై క్రియాశీల కలిగి ఉండటానికి ఇబ్బంది పడతారు. ఇది ఒక రకమైన మానసిక రుగ్మత. సుమారు 8%-
10% చిన్నపిల్లలలోనూ , బడికి వెళ్ళే చిన్నరులలోనూ , కొంతమంది పెద్దవారినోనూ కనబడుతూ ఉంటుంది.
లక్షణాలు :
ఏ పనిమీదా ఏకాగ్రత చూపలేరు ,
ఎక్కువ సమయం పట్టే విషయం పై విసుగు చెంది అతి గా ప్రవర్తిస్తారు .
పెద్దవారైతే రెస్ట్ లెస్స్ గా (విశ్రాంతి లేనట్లు ) ప్రవర్తిస్తారు.
పనిచేయడము లో ఏకాగ్రత లేకపోవడము వలన చిన్న చిన్న విషయాలకే తప్పులు చేస్తూ ఉంటారు.
తరచుగా ఒక పనినుండి వేరె పనికి మారుతూ ఉండే స్వభావము కలిగిఉంటారు.
ఒక పద్దతి లేని పని విధానాలు ప్లాన్ చేస్తూ ఉంటారు .. మధ్యలో విడిచిపెట్టే స్వభావము ఉంటుంది .
మతిమరుపు తో కొన్ని పనులు, వెళ్ళవలసిన ఫంక్షన్ లు మిస్సవుతుంటారు.
ఎక్కడా ఒక దగ్గర నిలకడగా కూర్చోలేరు అటూ ఇటూ పవార్లు కొడుతూ ఉంటారు.
చీటికీ మాటీకీ అసహనము ప్రవర్తిస్తూ ఉంటారు .
ప్రశ్న పూర్తికాకుండానే జావాబు చెప్పేందుకు ప్రయత్నిస్తారు .
తరచుగా ఇతరుల పనిలో లేదా ప్రవర్తనలో అంతరాయములు కలుగజేసే స్వభావము ఉంటుంది.
అవసరము లేనిచోట కల్పించుకొని మాట్లాడుతూ ఉంటారు.
ఎటెన్సన్ డెఫిసిట్ డిశార్డర్ తో ఇతర సమస్యలు :
గాబరా (anxiety) ,
సూక్ష్మ గ్రహణ శక్తి లోపించుడము (learning disorders),
మాట్లాడే లేదా వినికిడిలో సమస్యలు (speech and hearing problems),
చేస్తున్న పనినే మళ్ళి మళ్ళీ చేసే స్వభావము (obsessive compulsive disorder),
ప్రవర్తన లో వ్యతిరేక స్వభావము , విమర్శించే మనస్తత్వము కలిగిఉంటారు (conduct disorder)
చికిత్స :
రెండు విధానాలు . 1. మానసిక చికిత్స , 2. మందూలతో వైచ్యము .
సైకొలాజికల్ చికిత్స : తల్లి దండ్రుల పాత్ర చాలా ముఖ్యము . విసుగు గమ్నించి ... వేరే పనిమీద ఏకాగ్ర పెట్టే విధము గా ట్రినింగ్ ఇస్తూఉండాలి. నెగటివ్ గా అస్సలు
మాట్లాడకూడదు. తరచు ఇతర పిల్లలతో కలిసి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి.
మందులు : మెదడును ఉత్తేజ పరచే మందులు అంటే .... methylphenidate (Ritalin),
Amphetamines (Dexedrine),
మంచి డైట్ అన్ని విటమిన్ల తో కూడుకున్న పోషకాహారము ఇవ్వాలి .
- ======================
,+%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%A4+%E0%B0%B2%E0%B1%8B%E0%B0%AA%E0%B0%82+%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B0%B0%E0%B1%8D.jpg)
No comments:
Post a Comment