పురుషుల కన్నా స్త్రీల ఆయుర్దాయం ఎక్కువ. కానీ వారి మెదళ్లు మాత్రం త్వరగా క్షీణస్తున్నట్టు తాజాగా బయటపడింది. ఇందుకు ఒత్తిడితో కూడిన జీవనమే కారణమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా వయసు మీద పడుతున్నకొద్దీ కొన్ని జన్యువులు చురుకుగా మారుతుంటే మరికొన్ని నీరసించి పోతుంటాయి. ఇలాంటి మార్పులు స్త్రీలల్లో వేగంగా జరుగుతున్నట్టు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. మగవారి కన్నా ఆడవారు ఎక్కువకాలం జీవిస్తుంటారు కాబట్టి వారి మెదడులోనూ వయసుతో పాటు కలిగే మార్పులు నెమ్మదిగా సాగుతాయని పరిశోధకులు వూహించారు. కానీ భిన్నమైన ఫలితాలు కనబడటం ఆశ్చర్యకరం. దీనికి లింగభేదం కన్నా ఒత్తిడితో కూడిన జీవన విధానమే దోహదం చేస్తుండొచ్చని అధ్యయనకర్త సోమెల్ వివరిస్తున్నారు.
- ========================
No comments:
Post a Comment