Saturday, 22 December 2012

High B.P,low B.P.awareness -హై బి.పి , లో బి.పి.అవగాహన

  •   












  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - High B.P,low B.P.awareness -హై బి.పి , లో బి.పి.అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, కీళ్ళ నొప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం, ఏదైనా తింటే ఆరోగ్యం చెడి పోతుందని తెలిస్తే చాలు, దానికి అన్ని రకాలుగా ఉండటానికి ప్రయత్నిస్తాం, అదే క్రమంలో అప్పుడప్పుడు బి. పి. ని కూడా చెక్ చేస్తూ ఉండటం మరిచిపోకూడదు. ఎందుకంటే హై బి. పి. అయినా లో బి. పి. అయినా సమస్య తీవ్రమైతే గానీ, దాని లక్షణాలు పైకి కనబడవు, సమస్య తీవ్రమయ్యాక ఇబ్బందులు పడే కంటే దాని గురించి ముందుగానే తెలుసుకుని జాగ్రత్తలు పాటించడం మంచిది.

హై బ్లడ్ ప్రెజర్ లక్షణాలు
  • తొందరగా అలసిపోవడం, నీరసంగా ఉండటం, చెమటలు పట్టడం... తల తిరగడము , తూలిపోవడము ,

బ్లడ్ ప్రెజర్ రీడింగ్
  • సిస్టాలిక్ - డయాస్టాలిక్
  • 210 - 120 - స్టేజ్ 4 హై బ్లడ్ ప్రెజర్
  • 180 - 110 - స్టేజ్ 3 హై బ్లడ్ ప్రెజర్
  • 160 - 100 - స్టేజ్ 2 హై బ్లడ్ ప్రెజర్
  • 140 - 90 - స్టేజ్ 1 హై బ్లడ్ ప్రెజర్
  • 130 - 85 - హై నార్మల్ బ్లడ్ ప్రెజర్ స్టేజ్
  • 120 - 80 - నార్మల్ బ్లడ్ ప్రెజర్
  • 110 - 75 - లో నార్మల్ బ్లడ్ ప్రెజర్
  • 90 - 60 - బార్డర్ లైన్ లో బ్లడ్ ప్రెజర్
  • 60 - 40 - టూ లో బ్లడ్ ప్రెజర్
  • 50 - 30 - డేంజర్ బ్లడ్ ప్రెజర్

హై బి.పి. కి కారణాలు :
  •  కొన్ని సార్లు మనం వాడే మందులు కూడా హై బి.పి. కి కారణం కావచ్చు, ఉదాహరణకు అస్తమా, థైరాయిడ్, లేదా ఇంకేవైనా మందులు వాడుతున్నప్పుడు హై బి.పి. కి గురయ్యే అవకాశముంది.ముఖ్యంగా మహిళల్లో ప్రెగ్నెన్సీ రాకుండా మందులు వేసుకోవడం వల్ల హై బి.పి. సమస్య రావచ్చు, అందుకే ఏ చికిత్స తీసుకుంటున్నా ఎప్పటికప్పుడు బి. పి.లెవెల్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. దానితో పాటు ఆల్కహాల్ తీసుకోవడం, సిగరెట్లు కాల్చడం,ఆహారంలో సోడియం శాతం అధికమవ్వడం వల్ల కూడా హై బి.పి. కి గురి అయ్యే అవకాశాలున్నాయి. వంశపారంపర్యము ఒక కారణము .

హై బి. పి. శరీరానికి జరిగే నష్టాలు
  • హార్ట్ ఎటాక్,
  • పెరాలిసిస్ స్టోక్ ,
  • గుండెకు సంబంధిన వ్యాధులు.
  • కిడ్నీ ఫెయిల్ అవ్వడం.
  • కంటి చూపు తగ్గడం.
  • పెరిఫెరల్ డిసీజ్ వచ్చే అవకాశాలు అధిమవ్వడం.

చికిత్స : కారణము గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. వీటికి ఎన్నో రకాల మందులు ఉన్నాయి.
  • ఆల్ఫా బ్లోకర్స్ ,
  • బీటా బ్లోకర్స్ ,
  • సెలక్టివ్ బీటా బ్లోకర్స్ ,
  • క్యాల్సియం చానల్ బ్లోకర్స్ ,
  • సార్టాన్స్ ,
  • ఎసిఇ  ఇన్హిబిటార్స్ ,
  • డైయూరిటిక్స్

Low B.P - లో బ్లడ్ ప్రెజర్ :
  • మన రక్తపోటు ఈ క్రింద రీడింగు లలో ఉంటే వారిని.. లో బి.పి. ఉన్న వారిగా అంటాము .
  • 90 - 60 - బార్డర్ లైన్ లో బ్లడ్ ప్రెజర్ .
  • 60 - 40 - టూ లో బ్లడ్ ప్రెజర్ .
  • 50 - 33 - డేంజర్ బ్లడ్ ప్రెజర్ .

లో బ్లడ్ ప్రెజర్ లక్షణాలు
  • చిన్న పనులకే అలసిపోవడం, నీరసంగా ఉండటం, అస్తమానం నిద్ర మత్తులో ఉండటం, చివరిగా బి.పి లో అయితే కోమా లోకి వెళ్ళే ప్రమాదముంది.

కారణాలు : లో బ్లడ్ ప్రజర్ కి 'ఇది' కారణము అని సరిగా చెప్పలేము . ఈ కింది వాటితో సంబంధము(associated) కలిగి ఉండవచ్చును .
  • గర్భము దరించిన వారిలో,
  • హార్మోనుల సమస్యము -- hypothyroidism, diabetes, hypoglycemia.
  • కొన్ని మందులు దుశ్పరిణాము వలన ,
  • హార్ట్ ఫైల్యూర్ ఉన్నవారిలో,
  • కాలేయం వ్యాధులలోను ,

ముఖ్య  కారణాలు :
  • రక్త స్రావము ,
  • శరీరఉష్ణోగ్ర బాగా తగ్గినపుడు (చలవలు కమ్ముట ),
  • శరీర ఉష్ణోగ్ర బాగా పెరిగినపుడు (తీవ్రమైన జ్వరము ),
  • గుండె కండరాల వ్యాధులు (హార్ట్ ఫైల్యూర్ )
  • సెప్సిస్ ( రక్తము అధికము గా ఇన్పెట్క్ అయిపోవడము ),
  • వాంతులు ,విరోచనాలు మూలాన డీహైడ్రేషన్‌ వలన ,
  • కొన్ని మందులు రియాక్షన్‌, ఆల్కహాల్ రియాక్షన్ (మితిమీరిన తాగుడు) ,
  • సివియర్ ఎలర్జిక్ అంటే anaphylaxis shock వలన .
  • శస్త్ర చికిత్స సమయములో మత్తుమందు దుస్పరిణామము వలన ,

చికిత్స : కారణాన్ని బట్టి చికిత్స చేయాలి . లో బి.పి ఉన్న చాలామందికి చికిత్స అవసము ఉండదు. కొద్దిసేపు  విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. Low Pressure కి మందులు అవసరం ఉండదు .
  • నీరసంగా ఉన్నప్పుడు ... పడుకొని రెస్ట్ తీసుకోవాలి .
  • నీరు , మజ్జిక త్రాగాలి ,
  • అవసరమైతే .. డాక్టర్ సలహాతో సెలైన్ ఎక్కించుకోవాలి .
  • బి .కాంప్లెక్ష్ మాత్రలు వాడితే లోప్రెజర్ అంతగా రాదు .
  • సాదారణము గా మినరల్ వాటర్ , ఎలక్ట్రో లైట్స్ (electrolytes) తీసుకుంటే సర్దుకుంటుంది .

వైద్యులు చేసే ట్రీట్మెంట్ --
  • వాల్యూమ్‌ పునరుజ్జీవనం -Volume resuscitation (usually with crystalloid).
  • రక్తపోటుని పెంచే రసాయనిక పదార్ధములు-Blood pressure support with a vasopressor (all seem to be equivalent).
  • తగినంత కణజాల పెర్ఫ్యూషన్‌-Ensure adequate tissue perfusion (maintain SvO2 >70 with use of blood or dobutamine).
  • అంతర్జీవ సమస్య సరిచేయుట -Address the underlying problem (i.e. antibiotic for infection, stent or CABG (coronary artery bypass graft surgery) for infarction, steroids for adrenal insufficiency, etc...).
  • Medium-term (and less well-demonstrated) treatments of hypotension include:
  • రక్తములో చెక్కెర అదుపు చేయడము -Blood sugar control (80-150 by one study).
  • ప్రారంభ పోషణ -Early nutrition (by mouth or by tube to prevent ileus).
  • స్టిరాయిడ్ మద్దతు -Steroid support.

  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Woman brain gets old early-స్త్రీ మెదడుకు ముందే వృద్ధాప్యం

  •  
  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పురుషుల కన్నా స్త్రీల ఆయుర్దాయం ఎక్కువ. కానీ వారి మెదళ్లు మాత్రం త్వరగా క్షీణస్తున్నట్టు తాజాగా బయటపడింది. ఇందుకు ఒత్తిడితో కూడిన జీవనమే కారణమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా వయసు మీద పడుతున్నకొద్దీ కొన్ని జన్యువులు చురుకుగా మారుతుంటే మరికొన్ని నీరసించి పోతుంటాయి. ఇలాంటి మార్పులు స్త్రీలల్లో వేగంగా జరుగుతున్నట్టు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. మగవారి కన్నా ఆడవారు ఎక్కువకాలం జీవిస్తుంటారు కాబట్టి వారి మెదడులోనూ వయసుతో పాటు కలిగే మార్పులు నెమ్మదిగా సాగుతాయని పరిశోధకులు వూహించారు. కానీ భిన్నమైన ఫలితాలు కనబడటం ఆశ్చర్యకరం. దీనికి లింగభేదం కన్నా ఒత్తిడితో కూడిన జీవన విధానమే దోహదం చేస్తుండొచ్చని అధ్యయనకర్త సోమెల్‌ వివరిస్తున్నారు.

  • ========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

islet cell transplantation in Diabetes-మధుమేహం లోఐలెట్‌ కణాల మార్పిడి ప్రత్యేకత



  •  image : courtesy with Eenadu news paper @sukhibhava


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - islet cell transplantation in Diabetes-మధుమేహం లోఐలెట్‌ కణాల మార్పిడి ప్రత్యేకత- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మధుమేహం.. ప్రపంచాన్ని కమ్ముకొస్తున్న ఈ ఆధునిక ఉపద్రవాన్ని జయించేదెలా? అయితే మందులు.. లేదంటే ఇన్సులిన్‌! ఈ రెండేనా మార్గాలు?
విజ్ఞానశాస్త్రం అనూహ్యవేగంతో విస్తరిస్తున్న ఈ ఆధునిక కాలంలో కూడా మధుమేహం విషయంలో మన వైద్య పరిశోధనా రంగం అంతగా పురోగతి సాధించ లేదనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34.6 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఇక మన భారతదేశం సంగతి చెప్పనే అవసరం లేదు. దాదాపు 6 కోట్ల మంది మధుమేహులతో ప్రపంచంలోనే మనం అతి పెద్ద బాధిత దేశంగా ముందు వరుసలో నిలబడ్డాం. 2030 నాటికి మన దేశంలో ఈ బాధితుల సంఖ్య 9% దాటిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా.. అది అనూహ్యంగా పెరుగుతున్నా.. నిత్యం కోట్లాది మంది మధుమేహం తెచ్చిపెట్టే రకరకాల దుష్ప్రభావాలతో తల్లడిల్లిపోతున్నా.. ఇప్పటికీ ఈ చక్కెర వ్యాధి విషయంలో విప్లవాత్మకమైన చికిత్సా విధానాలేవీ అందుబాటులోకి రాకపోవటం విషాదకర వాస్తవం. బెస్ట్‌, బాంటింగ్‌ శాస్త్రవేత్తలు ఎప్పుడో 1922లో ఇన్సులిన్‌ను ఆవిష్కరించారు. అప్పటి నుంచీ అది సంజీవనిలా కోట్లాది జీవితాలను
ఆదుకుంటున్న మాట వాస్తవమే అయినా... ఈ తొంభై ఏళ్లలో మనం సాధించిన ఘనత ఏమంటే ఈ ఇన్సులిన్‌ను నిరంతరం, సమర్థంగా ఇచ్చేందుకు అనువైన 'పంప్‌'లను ఆవిష్కరించుకుని, వాటిని శరీరానికి తగిలించుకునే స్థాయికి చేరుకోవటం. అంతకు మించి చెప్పుకోదగిన స్థాయి విజయాలేం లేవు. అయితే ఈ స్తబ్ధతను చీల్చుకుంటూ 90వ దశకం మధ్య నుంచీ 'ఐలెట్‌ కణాల మార్పిడి' మీద ప్రత్యేక దృష్టి ఆరంభమైంది. క్లోమగ్రంథిలో ఉండి, మన శరీరంలో నిరంతరం సహజంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుండే ఐలెట్‌ కణాలను- మరొకరి నుంచి ఏ ఇబ్బందీ లేకుండా మార్పిడి చెయ్యగలిగితే అంతకు మించిన విజయం మరోటి ఉండదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఐలెట్‌ కణాల మార్పిడిపై విస్తృతంగా పరిశోధనలూ, ప్రయోగాలూ సాగుతున్నాయి. ఈ కణాల మార్పిడి విషయంలో అంతర్జాతీయంగా పరిశోధకులంతా కూడా ఎన్నో పరిమితులను, ప్రతిబంధకాలను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమంటే తాజాగా హైదరాబాద్‌లోని 'ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)' పరిశోధకులు ఈ దిశగా ఓ కీలకమైన ముందడుగు వేయబోతున్నారు. సులభంగా,
సమర్థంగా ఐలెట్‌ కణాల మార్పిడికి అవసరమైన విధానాన్ని ఆవిష్కరిస్తూ ఇప్పటికే జంతువులపై ప్రయోగాలు పూర్తి చేశారు. మనుషులపైనా విజయవంతమైన ఫలితాలను రాబట్టేందుకు ఉద్యుక్తులవుతున్నారు. ఈ సందర్భంగా అసలు ఐలెట్‌ కణాల మార్పిడి ప్రత్యేకత ఏమిటి? దీనిలో ఎదురయ్యే సాధక బాధకాలేమిటి? తెలియ జేసే విధానమే ఈ వ్యాసము
  • ఐలెట్‌ కణాలే కీలకం
మధుమేహానికి మూలం క్లోమగ్రంథి. చూపుడువేలు ఆకారంలో.. మన పొట్టలో ఎక్కడో జీర్ణాశయం వెనకాలగా నక్కినట్టుండే ఈ గ్రంథి మన శరీరంలో అత్యంత కీలకమైన 'ద్విపాత్రాభినయం' చేస్తుంటుంది. ఒకటి- మనం తిన్న ఆహారంలోని కొవ్వులు, మాంసకృత్తుల వంటివాటిని  అరిగించుకునేందుకు అవసరమైన 'జీర్ణ రసాలను' ఉత్పత్తి చెయ్యటం. రెండోది- మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చటంలో కీలక పాత్ర పోషించే ఇన్సులిన్‌ వంటి హార్మోన్లను ఉత్పత్తి చెయ్యటం. దీనికి ప్రధానంగా క్లోమ గ్రంథిలో ఉండే 'ఐలెట్‌ కణాల సముదాయం' (ఐలెట్స్‌ ఆఫ్‌
ల్యాంగర్‌హాన్స్‌) మూలం. ఈ ఐలెట్‌ కణాలు క్లోమ గ్రంథి అంతటా వ్యాపించి ఉంటాయి. వీటిలో- బీటా, ఆల్ఫా, డెల్టా, పీపీ, ఎప్సిలాన్‌ వంటి చాలా రకాలున్నాయి. ఒక్కో రకం కణం వేర్వేరు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటుంది. ఉదాహరణకు మొత్తం ఐలెట్‌ కణాల్లో 60% వరకూ ఉండేవి బీటా కణాలు. ఇవి ఇన్సులిన్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంటాయి. అలాగే ఆల్ఫా కణాలు గ్లూకోగాన్‌ అనే హార్మోన్‌ను, డెల్టా కణాలు సొమటోస్టాటిన్‌, పీపీ కణాలు పాంక్రియాటిక్‌ పాలీపెప్త్టెడ్‌, ఎప్సిలాన్‌ కణాలు ఘ్రెలిన్‌ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఐలెట్స్‌లో ఇంకా ఇతర కణాలూ ఉంటాయి కానీ వాటికంత ప్రాముఖ్యత లేదు. ఈ ఐలెట్‌ కణాలు ప్రధానంగా రక్తంలో గ్లూకోజు మోతాదు 80-120 మధ్య ఉండేలా నియంత్రిస్తుంటాయి.బీటా కణాలకు అత్యంత సున్నితమైన గ్రాహకాలుంటాయి. ఇవి నిరంతరం మన రక్తంలో గ్లూకోజు మోతాదును గమనిస్తుంటాయి. ఒకవేళ గ్లూకోజు మోతాదు 120 కన్నా పెరుగుతుంటే వెంటనే గుర్తించి, ఇన్సులిన్‌ విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. అదే గ్లూకోజు స్థాయి 80 కన్నా తగ్గితే ఇన్సులిన్‌ ఉత్పత్తిని వెంటనే నిలుపుచేస్తాయి. ఈ ప్రక్రియ అంతా కూడా ఒక క్రమపద్ధతిలో, నిరంతరం జరుగుతుంటుంది. అయితే ఒక్క బీటా కణాలే కాదు.. మిగతా కణాలు ఉత్పత్తి చేసే గ్లూకోగాన్‌, సొమటోస్టాటిన్‌,పాలిపెప్త్టెడ్‌ వంటివీ గ్లూకోజు మోతాదును ఎంతోకొంత నియంత్రిస్తూనే ఉంటాయి. మధుమేహుల్లో (టైప్‌-1) ప్రధానంగా ఈ ఐలెట్‌ కణాలు దెబ్బతింటాయి. వీరికి మనం ప్రస్తుతం బయటి నుంచి కీలకమైన ఇన్సులిన్‌ హార్మోన్‌ ఒక్కటీ ఇవ్వగలుగుతున్నాంగానీ మిగతా వాటి విషయంలో ఏమీ చెయ్యలేకపోతున్నాం. వాస్తవానికి వీరికి ఐలెట్‌ కణాలు విడుదల చేసే అన్ని రకాల హార్మోన్లూ అవసరమే. కాకపోతే మిగతా వాటిని ఎలా ఇవ్వాలో తెలియదు కాబట్టి అత్యంత కీలకమైన ఇన్సులిన్‌ ఒక్కటీ ఇచ్చి ఊరుకుంటున్నాం. ఈ కోణం నుంచి చూసినప్పుడు దెబ్బతిన్న ఐలెట్‌ కణాల స్థానాన్ని తిరిగి ఐలెట్‌ కణాలతో భర్తీ చెయ్యటం, వాటిని మార్పిడి చెయ్యటం అత్యుత్తమ విధానమని గుర్తించి, వైద్యపరిశోధనా రంగం ఎప్పటి నుంచో ఈ దిశగా కృషి చేస్తోంది.

  • మార్పిడి ఎవరికి ఉపయోగం?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మధుమేహం 4 రకాలు.
  • టైప్‌-1: మనలోని రోగనిరోధక వ్యవస్థ మన క్లోమంపైనే దాడి చేయటం వల్ల ఐలెట్‌ కణాలు దెబ్బతినిపోయి.. ఇన్సులిన్‌ ఉత్పత్తి నిలిచిపోయే రకం ఇది. ఈ రకం సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
  • టైప్‌-2: ఎక్కువగా పెద్దల్లో కనిపించే రకం ఇది. వీరిలో ఐలెట్‌ కణాలు పని చేస్తూనే ఉంటాయి, ఇన్సులిన్‌ తయారవుతూనే ఉంటుందిగానీ అది సమర్థంగా, ప్రభావవంతంగా ఉండదు. ముఖ్యంగా వీరి శరీర కణజాలంలో ఇన్సులిన్‌ నిరోధకత (ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌) పెరగటం వల్ల- ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతూనే ఉన్నా అది సమర్థంగా వినియోగం అవుతుండదు. ఇలా పది, పదిహేనేళ్లు గడిచాక ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరిగి, చివరికి తగ్గిపోతుంది. 
  • టైప్‌-3: క్లోమ గ్రంథికి దెబ్బలు తగలటం, పాంక్రియాటైటిస్‌ వంటి వ్యాధులకు గురికావటం వంటి వాటి మూలంగా వచ్చే మధుమేహం ఇది.
  • టైప్‌-4: గర్భిణుల వంటి వారిలో తాత్కాలికంగా మధుమేహం వచ్చి, తర్వాత తగ్గిపోతుండే రకం ఇది.

వీరిలో టైప్‌-1 మధుమేహుల్లో ఐలెట్‌ కణాలు పూర్తిగా దెబ్బతింటాయి కాబట్టి వీరికి ఐలెట్‌ కణాల మార్పిడి బాగా ఉపయోగపడుతుంది. ఐలెట్‌ కణాలను మార్పిడి చేస్తే అవి వెంటనే పని చేయటం ఆరంభిస్తాయి. అలాగే క్లోమగ్రంథి దెబ్బతినటం వల్ల మధుమేహం బారినపడే టైప్‌-3 వారికీ ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది.ఇక టైప్‌-2 రకం వారికీ మున్ముందు ఐలెట్‌ కణాల మార్పిడి ప్రక్రియ అందుబాటులోకి రావొచ్చు. ఎందుకంటే ఈ టైప్‌-2 బాధితుల్లోనూ చివరిదశలో ఐలెట్స్‌ దెబ్బతింటాయి. అందువల్ల వీరికీ వీటి అవసరం ఉంటుంది.
  • మార్పిడి పద్ధతేమిటి?
1. స్వీయ కణ మార్పిడి పద్ధతి: పాంక్రియాటైటిస్‌ వంటి వ్యాధుల బారిన పడిన వారికి- ఒక్కోసారి క్లోమ గ్రంథిని తొలగించాల్సి వస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో తొలగించిన క్లోమం నుంచి ఐలెట్‌ కణాలను వేరుచేసి, వాటిని తిరిగి అదే వ్యక్తి శరీరంలో ఎక్కించవచ్చు. ఇందులో ఆ ఐలెట్‌ కణాలు తమవే కాబట్టి వాటిని వారి శరీరం తిరస్కరించటం వంటి ఇబ్బందులేమీ ఉండవు. అమెరికాలోని మినెసోటా వంటి విశ్వవిద్యాలయాల్లో ఈ రకం మార్పిడి ఎక్కువగా చేస్తున్నారు.
2. ఇతరుల నుంచి మార్పిడి పద్ధతి: మన శరీరంలో ఇతర అవయవాలకూ, క్లోమానికీ చాలా తేడా ఉంది. కాలేయం నుంచి కొంత భాగం తొలగిస్తే అది మళ్లీ తిరిగి పెరుగుతుంది, కాబట్టి దాతల నుంచి కాలేయం ముక్క తీసుకుని మార్పిడి చేసే అవకాశం ఉంది. అలాగే రెండు కిడ్నీల్లో ఒకదాన్ని దాత నుంచి తీసుకుని మార్పిడి చెయ్యచ్చు. కానీ క్లోమంతో ఇలా సాధ్యం కాదు. క్లోమం నుంచి చిన్న ముక్క తీసినా సరే.. పాంక్రియాటైటిస్‌ వంటి తీవ్ర సమస్యలు వస్తాయి. కాబట్టి జీవించి ఉన్న వారి నుంచి ఐలెట్‌ కణాలను సేకరించటం కష్టం. అందుకే ప్రమాదాల
వంటి వాటి బారినపడి జీవన్మృతులైన (బ్రెయిన్‌డెడ్‌) వారి నుంచి క్లోమాన్ని సేకరించి, వారి ఐలెట్‌ కణాలను మార్పిడి చేసే పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్నే 'కెడావర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌' అంటారు. ఈ రకం ఐలెట్‌ కణాల మార్పిడి టైప్‌-1 మధుమేహ బాధితులకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇవి ఇతరుల నుంచి సేకరించిన ఐలెట్‌ కణాలు కాబట్టి వీటిని మన శరీరం ఆమోదించకుండా తిరస్కరించే
ప్రమాదముంది. కాబట్టి తిరస్కరించకుండా చూసేందుకు- మనలోని రోగనిరోధకశక్తిని అణిచిపెట్టి ఉంచేందుకు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఇతరుల నుంచి సేకరించే ఐలెట్లతో ఇదే కాదు, మరో ఇబ్బందీ ఉంది. ఒక వ్యక్తికి- ఒక జీవన్మృతుడి నుంచి సేకరించిన ఐలెట్‌ కణాలే సరిపోకపోవచ్చు. చాలినన్ని ఐలెట్‌ కణాలు కావాలంటే- కనీసం రెండు పాంక్రియాస్‌లు అవసరమవ్వచ్చు. జీవన్మృతుల అవయవదానం అన్నది ఇంకా అంతగా ప్రాచుర్యంలోకి రాని మన దేశంలో ఒక వ్యక్తికి రెండు పాంక్రియాస్‌లు దొరకటం కొంత కష్టంతో కూడుకున్న పని.
  • కణాలు ఎలా తీస్తారు?
క్లోమగ్రంథి చాలా సున్నితమైనది. కాబట్టి దీన్ని దాత నుంచి చాలా జాగ్రత్తగా సేకరించాల్సి ఉంటుంది. దాత శరీరం నుంచి క్లోమాన్ని బయటకు తీసిన తర్వాత ప్రత్యేకమైన పద్ధతిలో ఐలెట్‌ కణాలను వేరుచేస్తారు. ముందు ఆ క్లోమం లోకి ఇంజెక్షన్‌ ద్వారా 'కొలాజెనేస్‌' అనే ద్రావణాన్ని ఎక్కిస్తారు. దీంతో క్లోమంలోని ఐలెట్‌ కణాలు వేరవుతాయి. అప్పుడు ఆ క్లోమాన్ని ముక్కలు చేసి 'రికార్డి ఛాంబర్‌' అనే పరికరంలో ఉంచుతారు. ఇందులో ఐలెట్‌ కణాలు పూర్తిగా వేరుపడి, బయటకు వస్తాయి. వీటిని శుద్ధి చేసి, మార్పిడికి తగినట్లుగా సిద్ధం చేస్తారు.
  • మార్పిడి చేసేదెలా?
ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానం- శుద్ధిచేసి సిద్ధంగా ఉన్న ఐలెట్‌ కణాలను- కాలేయానికి రక్తం తీసుకువెళుతుండే కీలకమైన 'పోర్టల్‌ సిర'లోకి నేరుగా ప్రవేశపెట్టటం. ఇలా ప్రవేశపెట్టిన కణాలు ఆ పోర్టల్‌ సిర నుంచి ముందు కాలేయంలోకి చేరుకుని, కాలేయం కణాల మధ్య కుదురుకుంటాయి. ఎక్కించిన ఓ పది రోజుల్లో ఇవి పని చేయటం.. అంటే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చెయ్యటం ఆరంభిస్తాయి. రెండు వారాల్లో పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. వీటి నుంచి విడుదలైన ఇన్సులిన్‌ కాలేయం నుంచి బయటకు వచ్చే రక్తం ద్వారా ఇతర భాగాలకు ప్రసరిస్తుంది. మినెసోటా యూనివర్సిటీతో సహా ప్రపంచ వ్యాప్తంగా చాలా కొద్ది కేంద్రాల్లో ఈ విధానంలోనే మార్పిడి చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 700 మందికి ప్రయోగాత్మకంగా మార్పిడి చేశారు. మార్పిడి తర్వాత వీరిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి బాగుంటోంది, బయటి నుంచి ఇన్సులిన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉండటం లేదు కూడా. కాకపోతే ఈ విధానంలో ఉన్న ఇబ్బందేమంటే- ఇలా కాలేయంలోకి మార్పిడి చేసిన ఐలెట్‌ కణాలు ఓ రెండేళ్లలోనే 50% వరకూ పనిచేయటం ఆపేస్తున్నాయి. దాదాపు నాలుగేళ్లు గడిచే సరికి వీటి పనితీరు పూర్తిగా నిలిచిపోతోంది. దీంతో మధుమేహ నియంత్రణ కోసం మళ్లీ ఇన్సులిన్‌ తీసుకోవాల్సిన అవసరం తలెత్తుతోంది. ఇవి దీర్ఘకాలం ఎందుకు పని చేయటం లేదన్నది పరిశీలించినప్పుడు ప్రధానంగా కాలేయంలో... క్లోమంలో మాదిరి వాతావరణం ఉండదు. రోగనిరోధక వ్యవస్థ ఈ కణాల మీదా దాడి చేసి, వీటి పనితీరు దెబ్బతీస్తుండవచ్చు. అందుకే ఇప్పటి వరకూ ఐలెట్‌ కణాల మార్పిడి అన్నది వేగంగా ముందుకు పోవటం లేదు. దీనికి విరుగుడుగా ఇప్పుడు 'ఏషియన్‌
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ' పరిశోధకులు వినూత్న విధానానికి తెర తీశారు. ఈ ఐలెట్‌ కణాలను నేరుగా లివర్‌లోకి ప్రవేశపెట్టటం కాకుండా.. వాటిని 'థెరసైట్‌' అనే ఒక చిన్న తిత్తిలో ఉంచి.. చర్మం కింద అమర్చటం ఈ విధానం ప్రత్యేకత. ఇలా థెరసైట్లను ఇతర అవసరాలకు ఇప్పటికే వాడుతున్నారు. వాటిని ఐలెట్‌ కణాల మార్పిడికి వినియోగించటం 'ఏఐజీ' పరిశోధకుల కృషి. రెండు అంగుళాల పొడవు, అరంగుళం వెడల్పుండే ఈ తిత్తి పైన పల్చటి పొర (మెంబ్రేన్‌) ఉంటుంది. ఇది స్రావాలను మాత్రం అటూఇటూ పోనిస్తుందిగానీ దీనిగుండా కణాలు మాత్రం పోలేవు. అందుకే ఐలెట్‌ కణాల నుంచి విడుదలయ్యే ఇన్సులిన్‌, ఇతర హార్మోన్లు దీని గుండా బయటకు వస్తాయి, ఐలెట్‌ కణాలు మాత్రం బయటకు రాలేవు. దీన్ని శరీరంలో ఎక్కడైనా అమర్చొచ్చు. వీపు భాగంలో అమరిస్తే ఫలితాలు మరింతగా బాగుంటున్నాయని గుర్తించారు. ఈ థెరసైట్‌ను చర్మం కింద అమర్చిన వెంటనే కణాలకు అవసరమైన రక్త సరఫరా జరుగుతుంది. పోషకాలు అందుతాయి. ముఖ్యంగా- ఈ తిత్తిలోకి కణాలేవీ వెళ్లలేవు కాబట్టి మన రోగనిరోధక శక్తికి సంబంధించిన కణాలూ లోపలికి వెళ్లలేవు, ఐలెట్‌లపై దాడి చెయ్యలేవు. కాబట్టి ఈ విధానంలో రోగనిరోధక వ్యవస్థను అణిచిపెట్టి ఉంచేందుకు 'ఇమ్యూనో సప్రసెంట్‌' మందులనూ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఐలెట్‌ కణాల నుంచి ఇన్సులిన్‌తో పాటు సొమటోస్టాటిన్‌, గ్లూకోగాన్‌ వంటి ఇతర హార్మోన్లు కూడా విడుదల అవుతాయి.

  • తొలిసారి మనుషులకు!
ఐలెట్‌ కణాల మార్పిడి అన్నది మన దేశంలో ఇంత వరకూ ఎవరూ చేయలేదు. దీనిపై 'ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ' పరిశోధకులు కొంతకాలంగా లోతుగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఐలెట్‌ కణాలను ఉంచిన థెరసైట్‌ను కోతులకు అమర్చి చూశారు. మంచి ఫలితాలు వెలువడ్డాయి. అమర్చిన ఏడాది తర్వాత కూడా ఐలెట్‌ కణాలు సమర్థంగా పని చేస్తుండటమేకాదు.. వాటి సంఖ్య పెరుగుతోందనీ, ఇన్సులిన్‌ ఉత్పత్తి కూడా మెరుగవుతోందని గుర్తించారు. దీనిపై పరిశోధన పత్రాలు ప్రచురించారు. ఫలితాలు బాగుండటంతో దీన్ని ప్రయోగాత్మకంగా మనుషులకూ అమర్చి చూసేందుకు మార్గం సుగమమైంది, 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ' అనుమతించింది. దీంతో ఏఐజీ పరిశోధకులు ప్రయోగాత్మకంగా ఈ మార్పిడి ప్రక్రియను చేపడుతున్నారు. కోతులపై ఫలితాలను బట్టి చూస్తే ఈ విధానం విజయవంతమైన ఫలితాలను ఇవ్వటం తథ్యమని భావిస్తున్నారు.
  • లాభాలేమిటి?
* ఇన్సులిన్‌ తీసుకునేవారిలో 20% మందిని తరచుగా 'సుగర్‌ పడిపోవటం' (హైపోగ్త్లెసీమియా) సమస్య వేధిస్తుంటుంది. ముఖ్యంగా టైప్‌-1 బాధితుల్లో ఇది మరీ ఎక్కువ. ఇలాంటి వారికి ఐలెట్‌ కణాల మార్పిడి బాగా ఉపయోగపడుతుంది. గతంలో ఈ ప్రక్రియ అంతగా అందుబాటులో లేకపోవటం వల్ల ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు థెరసైట్‌ విధానంలో రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందుల అవసరమూ లేకపోవటం మరిన్ని ఆశలు రేకెత్తిస్తోంది. పైగా ఐలెట్‌ కణాల మార్పిడిలో ఇతర హార్మోన్లను విడుదల చేసే కణాలూ ఉంటాయి. ఇవన్నీ కూడా మధుమేహ నియంత్రణకు తోడ్పడతాయి.

* మధుమేహ నియంత్రణకు ఇన్సులిన్‌ తీసుకుంటున్నా కూడా దీర్ఘకాలంలో కిడ్నీలు, కళ్ల సమస్యల వంటి సూక్ష్మరక్తనాళాల సమస్యలు తలెత్తుతుంటాయి. ఐలెట్‌ కణాల మార్పిడితో ఈ తరహా దుష్ప్రభావాలను సమర్థంగా నివారించుకోవటం సాధ్యమని వెల్లడైంది.

* థెరసైట్‌ ప్రక్రియలో థెరసైట్‌ తిత్తిని కేవలం చర్మం కిందే అమరుస్తుండటం వల్ల ఒకవేళ భవిష్యత్తులో ఐలెట్‌ కణాలు తగ్గిపోయినా చాలాతేలికగా కొత్తవాటిని తిత్తిలోకి ఇంజెక్ట్‌ చేసే వీలుంటుంది.

* కడుపులోని కొవ్వు కణాల నుంచి మూలకణాలు తీసి, వాటిలోంచి ఐలెట్‌ కణాలను సృష్టించటంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది మున్ముందు అందుబాటులోకి రావొచ్చు. వీటిని కూడా థెరసైట్‌ ద్వారా ఇవ్వొచ్చు.

థెరసైట్‌ తరహాలోనే న్యూజిలాండ్‌లో 'మైక్రో క్యాప్సూల్‌' అనే పద్ధతినీ రూపొందించారు. దీన్ని కూడా శరీరంలో ఎక్కడైనా ప్రవేశపెట్టొచ్చు. కాకపోతే అందులో పందుల నుంచి తీసిన ఐలెట్‌ కణాలను వినియోగిస్తున్నారు. పందుల కణాలను అమరిస్తే రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని తప్పించేందుకు వాళ్లు క్యాప్సూల్‌ వాడుతున్నారు. థెరసైట్‌ పద్ధతిలోనూ పందుల నుంచి తీసిన కణాలను వాడితే, రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులను వాడాల్సిన అవసరం ఎలాగూ ఉండదు కాబట్టి ఫలితాలు చాలా బాగుంటాయని నిపుణులు భావిస్తున్నారు.

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, 21 December 2012

Role of Facet Joints in backbone-వెన్నులో ఫెసెట్‌ జాయింట్స్‌ కీలకం



  •  
  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --వెన్నులో ఫెసెట్‌ జాయింట్స్‌ కీలకం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 




శాక్రమ్‌,కాక్షిక్స్ మినహాయిస్తే ఇరవైనాలుగు ఎముకలతో వెన్నెముక నిర్మాణం జరుగుతుంది. ఈ ఒక్కో చిన్నెముకని ‘వెర్టిబ్రే’ అంటారు. ఈ వెర్టిబ్రే ఒక దానిమీద ఒకటి ఉంటాయి. వెర్టిబ్రే కాలం నిర్మాణంలో రెండు చిన్న ఎముకల మధ్య రెండు ఫెసెట్‌ జాయింట్స్‌ ఉంటాయి. ఒక్కోటి ఒక్కో పక్క ఉంటుంది. ఒక మనిషి వెనకా ముందు వంగటానికి ఫెసెట్‌ జాయింట్స్‌ తోడ్పడతాయి. ఈ ఫెసెట్‌ జాయింట్స్‌ మీద కార్టిలేజ్‌ మూత ఉంటుంది. ఇది చాలా మెత్తగా రబ్బర్‌లా సాగేపదార్థం. దీని సాయంతో ఎముకల చివర్లు ఒకదాని వైపు ఒకటి మెత్తగా ఒత్తిడి లేకుండా కదలడానికి వీలుంటుంది. ఆర్థరైటిస్‌ వల్ల ఈ కార్టిలేజ్‌ పొర చినిగి పోతుంది. ప్రతి వెర్టిబ్రే తరువాత ముందు భాగానే డిస్క్‌ వెనుక ఈ ఫెసెట్‌ జాయింట్స్‌ ఉంటాయి.

=వెర్టిబ్రే అనే ఎముకలో గాని, జాయింట్స్‌లో గాని, డిస్క్‌లో గాని ఏ ఇబ్బంది ఉన్నా నరాల మీద ఒత్తిడి కలిగి నొప్పి ఆ ప్రాంతంలోనే కాకుండా వెన్ను పైభాగంలో నూ , వెన్ను కిందభాగంలో అయితే కాళ్ళల్లోకి పాకే ప్రమాదముంది. అలాగే ఈ ముడింట్లో వెన్ను పూస, డిస్క్‌, ఫెసెట్‌ జాయింట్స్‌లలో ఏది దెబ్బతిన్నా దాని ప్రభావం మిగిలిన రెండింటి మీద తప్పకుండా ఉంటుంది. డిస్క్‌ అరిగిపోయినా, జారిపోయినా రెండు వెన్నుపూసల మధ్య దూరం తగ్గిపోతుంది. దాంతో ఫెసెట్‌ జాయింట్స్‌ సన్నబడడం ప్రారంభి స్తాయి. ఈ అధిక ఒత్తిడికి శరీరం కూడా స్పందిస్తుంది. దాంతో కార్టిలేజ్‌ పొర దెబ్బతినవచ్చు. దాంతో జాయింట్‌ ఇన్‌ప్లేమ్‌ అయ్యి అక్కడ వాస్తుంది. నొప్పి ఉంటుంది. ఇదే ఆస్టియో ఆర్థరైటిస్‌.

ఆర్థరైటిస్‌ హఠాత్తుగా అభివృద్ధి చెందదు. క్రమక్రమంగా కలుగుతుంది. ఎక్కువ కదలికలు, బాగా మెలితిరడం వీపు కింద భాగంలో వెనుకకు కదలికలు ఎక్కువగా ఉండటం ఫెసెట్‌ జాయింట్స్‌ దెబ్బతినవచ్చు. వెంటనే లక్షణాలు కనిపిస్తాయి. ఫెసెట్‌ జాయింట్స్‌ ఆర్థరైటిస్‌ వల్ల వచ్చే నొప్పి సధారణంగా నిద్రలేచిన తరువాత లేక, విశ్రాంతి తీసుకున్న తరువాత ఎక్కువగా ఉంటుంది. నడుం పక్కకి లేదా వెనక్కివంచడం వల్ల నొప్పి ఎక్కువవుతుంది. వెన్ను కింద భాగం మధ్య నొప్పి ఎక్కువై అది పిరుదుల్లోకి వ్యాపిస్తోంది. కొన్నిసార్లు ఆ నొప్పి తొడలు, మోకాలు వరకు కూడా వ్యాపించవచ్చు. నరాల మీద ఒత్తిడి పడటం వల్ల మొద్దుబారినట్లు అవడం. టింగ్‌లింగ్‌ సెన్సేషన్‌ కలగవచ్చు. ఫెసెట్‌ జాయింట్స్‌ ఆర్థరైటిస్‌ వల్ల ఇలాంటి నొప్పులు రావు.

మెకానిక్‌ పేయిన్స్‌ రావచ్చు. అంటే అతిగా కదలికల వల్ల వెన్నులో ఈ నొప్పి కలుగుతుంది. ఫెసెట్‌ ఆర్థరైటిస్‌ వల్ల కలిగే నొప్పితో పాటు కొన్నిసార్లు నరాల ఒత్తిడి వల్ల కలిగే లక్షణాలు కనిపించవచ్చు. వెన్నుపాములోంచి నరాలు బయటికి వెళ్ళే ప్రదేశంలో ఆర్థరైటిస్‌ వల్ల ఎముకలు కొసైతే ఇలాంటి నొప్పిరావచ్చు. వెన్నుపూసలోంచి నరాలు అటు ఇటూ వెళ్ళటానికి ఉన్న ద్వారాన్ని పొరామిన్‌ అంటారు. ఈ పొరామిన్‌ ప్రాంతంలో ఎముక కొనగా ఏర్పడితే అది నరాల మీద గీసుకొని నరాలు ఇరిటెట్‌ అవుతాయి. ఈ నరం ఎక్కడి దాకా వ్యాపిస్తే ఈ ఇరిటేటేషన్‌ అక్కడి దాకా ఉండవచ్చు. ఇరిటేషన్‌ వల్ల కలిగే లక్షణాలు మొద్దుబారటం, టింగ్‌లింగ్‌ ప్రతిస్పందన ఎక్కువవడం, కండరాలు నీరసపడడం జరుగుతుంది.


అరిగిన ఫెసెట్‌ జాయింట్స్‌లో దగ్గరగా ఉన్న వెన్నుపూసలు ఎలా ఉన్నాయో ఎక్స్‌రే ద్వారా తెలుసుకుం టారు. అవసరమైతే ఎమ్‌ఆర్‌ఐ కూడా చేయిస్తారు. దీనివల్ల ఫెసెట్‌ జాయింట్స్‌ వాచాయో, పెద్దవి అయ్యాయో తెలుసుకోవచ్చు. సీటీ స్కాన్‌ కూడా చేయవచ్చు. బోన్‌టిష్యూ తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. పెసెట్‌ జాయింట్స పైన ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఒక్కసారి అనారోగ్య నిర్ధారణకు వచ్చిన తరువాత... పరిపూర్ణ రోగ నిర్ధారణ జరిగిన తరువాతే చికిత్స చేస్తారు. పెసెట్‌ జాయింట్స్‌ ఆర్థరైటిస్‌ని ప్రారంభదశలో గమనిస్తే శస్తచ్రికిత్స లేకుండా తగ్గించవచ్చు. ఇన్‌ఫ్లమేషన్‌, నొప్పి తగ్గటానికి వైద్యులు ఒకటి రెండు రోజుల విశ్రాంతి తీసుకోవాలి . గట్టిబల్లలాంటి దానిమీద పడుకోవాలి . ఇలాంటి భంగిమలతో కొంతవరకు ఒత్తిడిని నివారించవచ్చు.

అవసరమైతే మందులతో పాటు ఫిజియోథెరపీ సూచిస్తారు. మందులతో, ఫిజియోథెరపీలతో నొప్పి తగ్గనప్పుడు ఆ జాయింట్‌లో ఇంజక్షన్‌ ఇస్తారు. ఫెసెట్‌ జాయింట్స్‌ నుంచి వచ్చే నొప్పిని తగ్గించడానికి ఈ మత్తును కలిగించే మందు ఉపయోగపడుతుంది. ఈ ఫెసెట్‌ జాయింట్స ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి అరుదుగా శస్తచ్రికిత్సతో నొప్పిని కలిగించే నర్వ్‌ను కట్‌ చేస్తారు. పెసెట్‌ జాయింట్స్‌కి సరఫరా అయ్యే చిన్న చిన్న నర్వ్‌ని ఫెసెట్‌ రైజోటమి అనే శస్తచ్రికిత్సతో తొలగిస్తారు. రెండు లేక మూడు వెన్నుపూసల్లో జాయింట్స్‌ దెబ్బతింటే ప్యూజన్‌ శస్తచ్రికిత్స చేస్తారు. దీని వల్ల ఆర్థరైటిస్‌ వచ్చిన ఫెసెట్‌ జాయింట్స్‌ కదలకుండా ఉంటాయి, నొప్పి తగ్గుతుంది.

courtesy with -డా మాదవ్‌,-సై్పన్‌ సర్జన్‌,-గ్లోబల్‌ స్పిటల్‌,-లక్డీకాపూల్‌,-హైదరాబాద్‌ @Surya Telugu daily Sunday edition Dec17, 2012.

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, 20 December 2012

What happens if Gallblader removed-పిత్తాశయాన్ని తొలగిస్తే ఏమవుతుంది?




  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- పిత్తాశయాన్ని తొలగిస్తే ఏమవుతుంది?-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




మానవ శరీరంలో అతి చిన్న భాగాల్లో ఒకటిగా పిత్తాశయాన్ని చెప్పుకోవచ్చు. కడుపులో కుడి వైపున పై భాగంలో ఇది అమరి ఉంటుంది. కాలేయానికి కింది భాగంలో ఉండే సంచీ వంటి భాగం ఇది. ఒక రకంగా చెప్పాలంటే కాలేయానికి అనుసంధానంగా వ్యవహరించే భాగం అనుకోవచ్చు. ఎందుచేతనంటే కాలేయంలో నిరంతరాయంగా పైత్య రసం ఊరుతూ ఉంటుంది. ఇది అవసరం అరుునప్పు డల్లా జీర్ణ వ్యవస్థకు అందతూ ఉండాలి. అలాగని ఎల్లప్పుడు అక్కడ ఉంచటానికి వీల్లేదు. అందుచేత ఈ పైత్య రసాన్ని తాత్కాలికంగా నిల్వ ఉంచే ఒక సంచీ వంటి భాగం అవసరం. సరిగ్గా ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించటమే పిత్తాశయం విధి.

-పైత్య రసంలో వాస్తవానికి ఎటువంటి ఎంజైములు ఉండవు. కానీ, జీర్ణక్రియకు సహకరించే రసాయనాలు ఇందులో ఉంటాయి. కొలెస్టిరాల్‌, బైలి రుబిన్‌ అనే రెండు పదార్థాలు ముఖ్య అనుఘటకాలు అనుకోవచ్చు. ఇందులో కొలెస్టిరాల్‌ అనేది కొవ్వుకు సంబంధించిన ఉత్పన్నకాలుగా చెప్పుకోవచ్చు. బైలిరుబిన్‌మాత్రం కాలేయంలో ఉత్పన్నం అవుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ లో కీలక పాత్ర వహించే ఎర్ర రక్త కణాలు శాశ్వతమైనవి కాదు. ప్రతీ ఎర్ర రక్త కణాల జీవిత కాలం 120 రోజులు ఉంటుంది. ప్రతీ 120 రోజులకు ఒకసారి ఈ రక్త కణాలు శిథిలం అయిపోయి కొత్తవి పుట్టుకొని వస్తాయి. ఈ రక్త కణాలు శిథిలమయ్యే వేదికగా కాలేయం నిలుస్తుంది. నిరంతరాయంగా జరిగే ఈ ప్రక్రియ ఫలితంగా ఈ శిథిల పదార్థాలు కాలేయంలో ఒక చోట చేరతాయి. జీవ రసాయన చర్యల వలన ఇది బైలిరుబిన్‌గా మారుతుంది.

-ఈ రెండు సహజ సిద్దంగా ఉత్పన్నం అవుతుంటాయి. వీటి ఉత్పత్తి మామూలుగా ఉన్నంత కాలం అంతా సజావుగానే ఉంటుంది. కానీ ఈ రెండు అనుఘటకాలు ఎక్కువగా పోగు పడినప్పుడు మాత్రం సమస్య తప్పదు. సరిగ్గా ఆ పరిస్థితి తలెత్తినప్పుడే పిత్తాశయానికి ఇబ్బంది పుట్టుకొని వస్తుంది. ముందుగానే చెప్పిన ట్లుగా పిత్తా శయం అనేది కాలేయం స్రవించే పైత్య రసానికి తాత్కాలిక రిజర్వాయర్ గా పని చేస్తుంది. ఈ పైత్య రసం అక్కడ నిల్వ ఉన్నప్పుడు ఈ అనుఘటకాల వాటా పెరగటం సంభవిస్తుంది. అంటే కొలిస్టిరాల్‌కానీ, బైలిరుబిన్‌ కానీ ఎక్కువగా పేరుకొని పోతుంది. అటువంటప్పుడు ఈ పదార్ధాలు ఘన రూపంలోకి మారి రాళ్లుగా పరిణామం చెందుతాయి. కొలిస్టిరాల్‌ కానీ రాళ్లుగా మారితే కొలిస్టిరాల్‌ రాళ్లు అనీ, బైలిరుబిన్‌ ఘన పదార్థంగా మారితే పిగ్మెంట్‌రాళ్లు అని వ్యవహరిస్తారు.

-ఈ రెండు రకాల విభజన అన్నది పదార్థ స్వభావం ఆధారంగా చేసుకొన్నదే. రాళ్లు ఎంత పరిణామంలో ఉన్నాయి, ఎంత సంఖ్యలో ఉన్నాయి, ఎంత ప్రదేశాన్ని ఆక్రమించాయి అన్న దాన్ని బట్టి వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. ఈ రాళ్లు కొన్నిసార్లు పిత్తాశయానికి పరిమితం కావచ్చు. మరి కొన్ని సార్లు ఇతర ప్రాంతాలకు అంటే పైత్య రస వాహిక లేదా చిన్న పేగులోకి వ్యాపించవచ్చు. అనేకసార్లు ఈ రాళ్లు పేరుకొనటం వలన పైత్య రస ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతుంది. దీంతో కడుపులో గడబిడ మొదలవుతుంది. అదే వ్యాధి రూపంలో బయట పడుతుంది. అప్పటిదాకా ఇటువంటి ఇబ్బంది ఉందన్న సంగతికూడా తెలియనే తెలియదు.

-అసలు ఈ రాళ్లు ఏర్పడటానికి నిర్దిష్టమైన పరిస్థితులు కారణం అనుకోలేం. ప్రధానంగా కొలిస్టిరాల్‌, బైలిరుబిన్‌, ఎక్కువగా పోగు పడటంతో రాళ్లు ఏర్పడవచ్చు. పైత రసంలో ఇతర పదార్థాల శాతం పెరిగిపోయినా ఇది తలెత్తవచ్చు. కాలేయ వ్యాధులు, రక్త ప్రసరణ వ్యాధులు తలెత్తినప్పుడు కూడా రాళ్లు వస్తుంటాయి. పైత్య రసం ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు కూడా దీన్ని గమనించవచ్చు. రాళ్ల తో నేరుగా వచ్చే ప్రమాదం కంటే ఇతర సమస్యలతో ఇబ్బందులు ఉంటాయి. పైత్య రసంతో కలిసినప్పుడు ఇన్‌ ఫెక్షన్‌ సోకే చాన్సు ఉంటుంది.

-పైత్యరసంలోని కొలిసిస్టిన్‌ ఎక్కువగా ఏర్పడినప్పుడు ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో పాటు పిత్తాశయంలో వాపు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని కొలిసిస్టిటిస్‌ అని వ్యవహరిస్తారు. నొప్పి తీవ్రత ద్వారా దీన్ని గుర్తించవచ్చు. కుడి వైపు పై భాగంలో ఇది మొదలవుతుంది. తర్వాత కుడిపైపు స్కాప్యులా ఎముక ఉండే చోటికి వ్యాపించవచు. చాలాసార్లు వేపుళ్లు, నూనె దినుసులు, జంక్‌ ఫుడ్‌ తిన్న తర్వాత తలెత్తుతుంటుంది. కొద్ది పాటి జ్వరం, డయేరియా, వాంతులు, నాసియా వంటి లక్షణాల్ని కూడా గమనించవచ్చు. కొన్ని సార్లు పిత్తాశయం గోడల్లో వాపు గమనించవచ్చు. తీవ్రమైన కేసుల్లో నెక్రోసిస్‌, గోడల్లో ధ్వంసం జరగటాన్ని చూడవచ్చు. గోడలు వాపు ఏర్పడిన పరిస్థితిని సాధారణ కొలిసిస్టిటిస్‌ గా వ్యవహరిస్తారు. తర్వాత కాలంలో పిత్తాశయం లో కదలికలు బాగా మందగిస్తాయి. వ్యాధి ముదిరిన దశను తీవ్రతర కొలిసిస్టిటిస్‌ గా చెబుతారు.

-ఈ ఇన్‌ఫెక్షన్‌ క్లోమానికి సోకినప్పుడు పాన్‌ క్రియాటిటిస్‌ గా చెబుతారు. క్లోమంలో స్రవించే ఎంజైమ్‌ లు పేగుల్లోకి వచ్చి అక్కడ ఆహారాన్ని జీర్ణ ంచేయాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఈ ఎంజైమ్‌లు క్లోమంలోనే ఉండిపోయి అక్కడ పనిచేయటం మొదలు పెడతాయి. ముఖ్యంగా ట్రిప్సిన్‌ ఇటువంటి పనులకు పాల్పుడుతుంది. దీని వల్ల క్లోమంలోపలి గోడలు పాడై పోతాయి. క్రమంగా మొత్తం క్లోమం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే పాన్‌క్రియాటిటిస్‌ గా వ్యవహరిస్తారు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం ద్వారా తలెత్తే ప్రధాన సమస్యల్లో ఇది రెండోది. ఇక, రాళ్ల సమస్య పెద్దది గా అయినప్పుడు ఇతర జీర్ణ భాగాలకు ఇబ్బది తలెత్తవచ్చు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడినప్పుడు పెద్ద గా వ్యాధి కారక లక్షణాలు చెప్పే పరిస్థితి లేదు. కానీ తీవ్రమైన నొప్పిని గుర్తించవచ్చు. ఈ నొప్పికి కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉన్నాయి.

-కడుపులో కుడి వైపున పై భాగంలో నొప్పి జనిస్తుంది. ఇది తీవ్రంగా ఉంటుంది. కొన్ని రోజులకు ఒక్కసారి, లేదా కొన్ని వారాలకు ఒక్కసారి బాధ పెడుతుంటుంది. భోజనం చేశాక అరగంట లేదా గంట తర్వాత ఇది మొద లు అవుతుంది. సాధారణంగా అర్థ రాత్రి ఈ నొప్పిని గమనించవచ్చు. ఒక గంట నుంచి ఐదు గంటల దాకా నొప్పి బాధిస్తుం టుంది. వ్యాధి ఒక్కోసారి వెనక్కి లేదా పై భాగంలోకి వ్యాపిస్తుంటుంది. అప్పుడప్పుడు దీంతో పాటు జ్వరం, వాంతులు, అజీర్ణం వంటి లక్షణాల్ని గమనించవచ్చు. ఈ నొప్పి వచ్చినప్పుడు రోగి విలవిల్లాడిపోతుంటాడు. అసహనం, చిరాకు పెరిగిపోతుంది కొన్ని సార్లు తట్టుకోలేనంతగా నొప్పి వచ్చేస్తుంటుంది. వె ల్లకిలా పడుకోవటం, పక్కకు ఒదగటం వంటి పనులు చేస్తుంటారు. తెల్ల వారు జాము సమయంలో ఈ నొప్పి ఉపశమిస్తుంటుంది.

-పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు కడుపు నొప్పిని బట్టి సాధారణంగా గుర్తిస్తారు. దీని నిర్దారణ కోసం ఎక్సురే, అల్ట్రా సౌండ్‌పరీక్షలు అవసరం అవుతాయి. కొన్ని సార్లు సీటీ స్కాన్‌, ఈఆర్సీపీ పరీక్షలు చేయించాలి. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఆలస్యం చేయటం మంచిది కాదు.పిత్తాశయంలో రాళ్లను గుర్తించాక అది ప్రాథమిక దశలో ఉందా, లేక వ్యాధి తీవ్రం అవుతోందా అన్నది తేల్చుకొంటారు. చాలా ప్రాథమిక దశ అయినప్పుడు మందులతో వాటిని కరిగించేందుకు యత్నిస్తారు. లేని పక్షంలో కొలిసిస్టెక్టమీ అనే ఆపరేషను అవసరం అవుతుంది. పూర్వం కడుపుని కోసి ఈ ఆపరేషను చేయాల్సి వచ్చేది. ఇప్పుడు లాపరోస్కోపీ విధానంలో ఇది చాలా సురక్షితంగా మరియు తేలికగా మారింది. అంటే కడుపు లో 5-10 మిల్లీ మీటర్ల మందంలో చిన్నపాటి రంధ్రం చేస్తారు.

-అందులో ఒక సూదిని పంపుతారు. దీని చివర ఉండే చిన్నపాటి వీడియో కెమెరా ద్వారా కడుపులోపలి జీర్ణవ్యవస్థ బాగాలు ఎదురుగా ఉండే తెర మీద కనిపిస్తాయి. ఆ తెర మీద భాగాల్ని గమనిస్తూ పరిక రాల్ని కదుపుతూ ఆపరేషన్‌ పూర్తి చేస్తారు. ఈ క్రమంలో కొన్ని సార్లు రాళ్లను కరిగించేయటం సాధ్యం అవుతుంది. మరి కొన్ని సార్లు పిత్తాశయాన్ని తొలగించాల్సి ఉంటుంది. మొత్తం మీద లాపరోస్కోపీ విధానం ద్వారా చాలా తేలిగ్గా సురక్షితంగా ఈ ఆపరేషన్‌పూర్తి చేయవచ్చని మాత్రం చెప్పవచ్చు.పిత్తాశయం లో చేసే ఈ ఆపరేషన్‌చాలా సురక్షితంగా తేలిగ్గా పూర్తి చేయవచ్చని గుర్తుంచుకోవాలి. ఆపరేషను పూర్తయితే మర్నాడే పేషంట్‌ను డిశ్చార్జ చేసేయచ్చు. తర్వాత ఇన్‌ ఫెక్షన్‌ ఏమైనా ఏర్పడిందా అన్న పరీక్షలు చేసి చెక్‌చేస్తారు. అంతటితో చికిత్స పూర్తవుతుంది. తర్వాత కాలంలో మాములూగా జీవనాన్ని సాగించవచ్చు. ఇది ఆధునిక టెక్నాలజీ తో కూడిన ఆపరేషన కాబట్టి నిపుణులైన సర్జన్‌ లతో చేయించుకోవటం మేలు.


-Courtesy with డా ఆర్‌ వి రాఘవేంద్ర రావు,M.S., M.Ch., (sgpgi)F.H.P.B., F.L.T.,(snuh)@Surya Telugu daily
(సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ మరియు లివర్‌ట్రాన్సుప్లాంటు సర్జన్‌-హైదరాబాద్‌)

  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, 19 December 2012

Rhinoplasti Awareness- రైనోప్లాస్టి అవగాహన

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Rhinoplasti Awareness- రైనోప్లాస్టి అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ముక్కు మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. వాసన చూడ్డానికే కాకుండా ముఖానికి అందాన్నివ్వడంలో కూడా ముక్కుకి చాలా ప్రాధాన్యత ఉంది.కావ్య నాయికలకి ముక్కు కోటేరేసినట్లు ఉంటుంది.  ముక్కు షేపు బాగా లేకపోతే దేవుడ్ని తిడుతూ కూర్చోనే రోజులు కావు ఇప్పుడు. కాస్మెటిక్ సర్జన్ దగ్గరకు వెళితే కావలసిన సైజుకి, షేపుకి మన ముక్కుని  మార్చి పారేస్తాడు. రైనోప్లాస్టి అని పిలిచె ఈ ఆపరేషన్‌ని క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలోనే మనదేశంలో సుశ్రుతుడు చేశాడు. ఇప్పటికీ ఈ ఆపరేషన్‌ని  ఇంచుమించు అదే పద్దతిలో చేస్తున్నారు.

సినీ తారలు ఎక్కువగా ఈ ఆపరేషన్‌ని చేయించుకుంటారు. శ్రీదేవితో మొదలుపెట్టి కత్రినా కైఫ్, రాణీ ముఖర్జీ, కంగన రనౌత్, మినిషా లంబా, కరీనా కపూర్ లాంటి తారలందరూ తమ ముక్కుని కాస్మెటిక్ సర్జన్ తో రైనోప్లాస్టి చేసుకున్నవారే .

 తీరైన ముక్కుకు రైనోప్లాస్టి---తీరైన ముక్కుతోనే ముఖారవిందం రెట్టింపవుతుంది. అందంతోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి చట్టి ముక్కు ఉన్న వారి మాటేమిటి? ముక్కుఅందాన్ని మెరుగు పరుచుకునే అవకాశమే లేదా? అంటే రైనోప్లాస్టితో ముక్కు సమస్యలను సరిచేసుకోవచ్చని అంటున్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డా. వై. వెంకటరమణ.

అందానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఆ మాటకొస్తే అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఉన్నతోద్యాగాలు సాధించడంలోనూ కీలకంగా మారుతోంది.అందుకే కాస్మెటిక్ సర్జరీలకు ప్రాధాన్యం పెరిగింది. ముక్కు ఆకారం సరిగా లేని వారికి, ముక్కు అందం మరింత మెరుగుపడాలని కోరుకునే వారికి రైనోప్లాస్టి సర్జరీ ఒక వరమని చెప్పవచ్చు.

  • ముక్కు ఎత్తు తక్కువగా ఉంటే(చట్టిముక్కు)
దీన్ని శాడిల్ నోస్ అంటారు. వీరిలో పుట్టుకతో, పెరుగుదలలో ముక్కు ఎత్తు తక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా వంశపారపర్యంగా వస్తుంది. కొంత మందిలో మాత్రం ఏదైనా గాయం, సర్జరీ లేదా ఇన్‌ఫెక్షన్ వల్ల ఎత్తు తగ్గిపోతుంది. ఈ రకమైన ముక్కును రైనోప్లాస్టి ద్వారా సరిచేయవచ్చు. దీన్ని అగుమెంటేషన్ రైనోప్లాస్టి అంటాము. దీనిలో ముక్కు ఎత్తును కృత్తిమమైన ఇంప్లాంట్ ద్వారా లేక శరీరంలో సహజసిద్ధమైన ఎముక ముక్క అమర్చటంద్వారా సరిచేయడం జరుగుతుంది. సర్జరీ ఒక గంటలో పూర్తవుతుంది. వారంలో ఫలితం కనిపిస్తుంది.

  • కొనభాగం మందంగా ఉంటే..
కొందరిలో ముక్కు కొనభాగం చాలా మందంగా ఉంటుంది. చర్మం మందంగా ఉండటం, కొనభాగంలో కొవ్వు ఎక్కువగా కేంద్రీకృతమై ఉండటం, ముక్కు కొన ఎముకలు(మృదులాస్థి) వెడల్పుగా ఉండటం వంటి కారణాల వల్ల ముక్కు కొనభాగం లావుగా ఉంటుంది. ఈ సమస్యను చాలా వరకు రైనోప్లాస్టి ద్వారా సరిచేయవచ్చు. దీన్ని 'టిప్ ప్లాస్టి' అంటాము. అంటే ముక్కు కొనకు చేసే ప్లాస్టిక్ సర్జరీ. దీనిలో కృత్రిమ వస్తువు ఏదీ అమర్చడం జరగదు. ఆపరేషన్ తరువాత కొన్ని నెలల నుంచి ఏడాది వరకు ముక్కు అందం మెరుగుపడుతూనే ఉంటుంది. దీర్ఘకాలిక మార్పుతో ముక్కు కొన సన్నగా, అందంగా తయారవుతుంది.

  • వంకరగా పెరుగుతుంటే...
ముక్కు అంతా బాగానే ఉంటుంది. కానీ పెరుగుదలలో వంకర కనిపిస్తుంది. ముక్కు ఎదిగే వయసులో గాయం కావడం లేదా విరగడం, గ్రహణమొర్రి ఏర్పడటం, సర్జరీ వంటి కారణాల వల్ల ముక్కు వంకరగా పెరుగుతూ ఉంటుంది. ఏ కారణం లేకుండా కూడా ముక్కు వంకరగా పెరగవచ్చు. దీన్ని క్రూక్‌డ్ నోస్ అంటారు. దీన్ని సెప్టో రైనోప్లాస్టి సర్జరీ ద్వారా సరిచేయవచ్చు. ముక్కు ఎముకలు, మధ్యఎముకలను సరిచేయడం ద్వారా ముక్కు చక్కగా పెరిగేలా చేయవచ్చు.

  • పెద్దదిగా ఉంటే...
దీన్ని హంప్ నోస్ అంటారు. వీరిలో ముక్కు ఎత్తు, పొడవు అవసరం కన్నా ఎక్కువగా పెరుగుతుంది. కొంతమందిలో గద్దముక్కులా అవుతుంది. దీన్ని రిడక్షన్ రైనోప్లాస్టి ద్వారా సరిచేయవచ్చు. ఏ విధమైన మచ్చలు, కుట్లు ఏర్పడవు. ఒక వారంలో ఫలితం ఉంటుంది.

  • చర్మం పెరిగితే(రైనోఫైమా)
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో, మొటిమలు ఏర్పడే వారిలో ముక్కు కొన చర్మం కాయలాగా పెరగటం జరుగుతుంది. సమస్య చర్మంలో మాత్రమే ఉంటుంది. కింద ఎముకలు, ఫ్రేమ్ వర్క్ నార్మల్‌గానే ఉంటుంది. పెరిగిన చర్మాన్ని లేజర్ లేక ఆర్ఎఫ్ సహాయంతో తీయవచ్చు.

  • ఏ వయసులో సర్జరీ బెటర్
ఒక వ్యక్తి సహజసిద్ధమైన పెరుగుదల పూర్తయిన తరువాత చేయాల్సి ఉంటుంది. అంటే 16 సంవత్సరాలు నిండిన తరువాత రైనోప్లాస్టి సర్జరీ చేయించుకోవచ్చు. ఇది కొంచెం కొంచెంగా చేసే ఆపరేషన్ కాదు. ఒకే సిట్టింగ్‌లో ముఖారవిందం  మెరుగయ్యేలా చేయాల్సి ఉంటుంది. అందుకే అనుభవం ఉన్న వైద్యులను దగ్గరే ఆపరేషన్ చేయించుకోవాలి.

  • ఆపరేషన్‌కు తరువాత
- సాధారణంగా 16 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి చేస్తాము. కాబట్టి ఆరోగ్యరీత్యా సమస్యలు ఏర్పడవు.

- ఆపరేషన్‌కు ముందు కొన్ని రక్తపరీక్షలు, అవసరాన్ని బట్టి ముక్కు ఎక్స్‌రే చేయించుకోవాల్సి ఉంటుంది.

- పూర్తి మత్తులో లేదా ముక్కు వరకే మత్తు ఇచ్చి చేసే ఆపరేషన్ ఇది. సర్జరీ, సమస్యను బట్టి ఒక గంట నుంచి రెండున్నర గంటలు సమయం పడుతుంది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్జికల్ సెంటర్‌లో ఉంటే సరిపోతుంది.

- సర్జరీ తరువాత పూర్తి విశ్రాంతి అవసరంలేదు. మరుసటి రోజు నుంచే సాధారణ పనులు చేసుకోవచ్చు. కేవలం ముక్కుమీద ఒత్తిడి పడకుండా  చూసుకుంటేసరిపోతుంది.

- ముక్కు వాపు 48 నుంచి 72 గంటలలో తగ్గిపోతుంది. వారం తరువాత విధులకు హాజరుకావచ్చు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో, అత్యాధునికసదుపాయాలున్న ఆసుపత్రిలో చేయించుకున్నప్పుడే మంచి ఫలితం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

  • రైనోప్లాస్టిపై అపోహలు
ముక్కు మీద మచ్చలు : ఇందులో ఏ మాత్రం నిజంలేదు. ఈ ఆపరేషన్ ముక్కు లోపల నుంచి చేయడం జరుగుతుంది. బయటకు ఎలాంటి మచ్చలు కనిపించవు.

శ్వాస, వాసన గుర్తించడంలో తేడా : ఇది కూడా అపోహే. రైనోప్లాస్టి ద్వారా శ్వాస, వాసన గుర్తించడంలో ఎలాంటి తేడా ఉండదు.

ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేయాలి : ఆ అవసరమే ఉండదు. ఇది ఒక్కసారే చేసే సర్జరీ. ఒకవేళ ఏదైనా కారణం చేత మళ్లీ చేయాల్సి వచ్చినా చేయడం సాధ్యమవుతుంది.

- డా. వై. వెంకటరమణ-ప్లాస్టిక్ సర్జన్,కాంటూర్స్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్,ఎస్‌బీహెచ్ పైన, శ్రీనగర్‌కాలనీరోడ్.--హైదరాబాద్, @ swathi
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, 14 December 2012

Medicine looty,Drug Exploitation,Medicine Robbery-ఔషధన దోపిడీ


image : courtesy with Eenadu newspaper.

  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఔషధన దోపిడీ-  గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




కంపెనీల పడగనీడలో మందులు-సుప్రీంకోర్టు తీర్పునకు తూట్లు పొడిచే యత్నం . ధరల నిర్ణాయక సంస్థపై ఒత్తిడి , నియంత్రణ పరిధిలోకి రాకుండా రకరకాల యత్నాలు, స్పష్టమైన నిబంధనలతోనే అడ్డుకట్ట వేయగలమంటున్న నిపుణులు

ఏ వ్యాపారంలోనైనా వందశాతం లాభం వస్తుందంటే దానిని ఎంతో ఆకర్షణీయమైన రంగంగా భావిస్తాం. కానీ, 5,000 శాతం లాభం వస్తే..? ఆశ్చర్యపోకండి.. నిజంగానే ఐదువేలశాతం లాభం. అంటే వంద రూపాయలు ఖర్చు చేస్తే ఐదువేల రూపాయల రాబడి అన్నమాట. ఇక్కడ ఎవరికైనా ఒక ధర్మసందేహం రావచ్చు. వంద రూపాయల ఖర్చుతో 5,000 రూపాయలు సంపాదించటం వ్యాపారం ఎలా అవుతుంది? దోపిడీలోనో దొంగతనంలోనో తప్ప మరెక్కడ సాధ్యమవుతుంది? అని ప్రశ్నించవచ్చు. కానీ, మనదేశంలో మాత్రం దశాబ్దాలుగా ఇది చట్టబద్ధంగా సాగిపోతోంది. మరెక్కడో కాదు... ప్రాణాలను నిలిపే ఔషధ తయారీ రంగంలో.

* జలుబు, అలర్జీలకు ఉపయోగించే సిట్రిజిన్‌ మాత్రలను పదింటిని తయారుచేయటానికి 75 పైసలు ఖర్చవుతుంది. కానీ ఔషధ కంపెనీలు వీటిని రూ.34- 37కు అమ్ముతున్నాయి. కంపెనీలకు 4,533 శాతం నుంచి 4,933 శాతం లాభం వస్తోంది.

* నొప్పి నివారణకు ఉపయోగించే నిమ్స్‌లైడ్‌ మందు తయారీకి అయ్యే ఖర్చు రూ.1.95 పైసలు (15 మాత్రలకు). కానీ, ఒక ప్రముఖ కంపెనీ ఇదే ఔషధం 15 బిళ్లల ప్యాక్‌ను రూ.52.30కు అమ్ముతుండగా, మరో కంపెనీ రూ.58కు విక్రయిస్తోంది. ఈ కంపెనీలకు వచ్చే లాభం 2,682-2,974 శాతం.

ఈ పరిస్థితిని వివరిస్తూ ఆల్‌ ఇండియా డ్రగ్స్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రాణాధార మందులను ఈ ధరాఘాతం నుంచి తప్పించాలని, లేదంటే సామాన్యుడికి ప్రాణాలు నిలుపుకోవటం కష్టసాధ్యమవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధరల నియంత్రణ జాబితాలో ఉండే అత్యవసర మందులను 74 నుంచి 348కి పెంచాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది అక్టోబర్‌లో తీర్పునిచ్చింది. ఈ మేరకు జాతీయ ఔషధాల ధరల నిర్ణాయక సంస్థ తగినచర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఔషధ కంపెనీలు ఈ సంస్థపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తూ నిర్ణయం తీసుకోకుండా అడ్డుపడుతున్నట్లు సమాచారం.



  • పరిశ్రమ ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కారు

ఉత్పత్తి వ్యయంతో పోల్చితే అనేక రెట్లు అధికంగా మందులను విక్రయిస్తూ ప్రజలను ఔషధ కంపెనీలు నిట్టనిలువునా దోచుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం గతంలో కొన్ని చర్యలు చేపట్టింది. 1974లో హాథి కమిటీని నియమించింది. ఈ కమిటీ 347 రకాలమందులు ధరల నియంత్రణ విధానంలో ఉండాలని సిఫారసు చేసింది. 1979 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనివల్ల చాలా నష్టపోతున్నామని, కొన్ని మందులను జాబితా నుంచి మినహాయించాలని ఔషధ పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి చేయటంతో 1987లో వీటిని 142కి తగ్గించారు. ఆ తరవాత సరళీకరణ ఆర్థిక విధానాల నేపథ్యంలో 1995లో ఈ సంఖ్య 74కు చేరుకుంది. తాజాగా సుప్రీంకోర్టు వీటిని 348కు పెంచాలని ఆదేశించింది. అంతేకాదు, మందుల ధరలను ప్రభుత్వం 1999లో ఏర్పాటుచేసిన విధానం మేరకు నిర్ణయించాలని కూడా స్పష్టం చేసిందని అఖిలభారత ఔషధ నియంత్రణ అధికారుల సమాఖ్య సెక్రటరీ జనరల్‌ రావి ఉదయ్‌భాస్కర్‌ 'ఈనాడు'తో చెప్పారు. 1999 విధానం ప్రకారం ఉత్పత్తి వ్యయానికి గరిష్ఠంగా 100 శాతం లాభం కలిపి ధరను నిర్ణయించాలి. కానీ, ఈ విధానం అమలు కాకుండా మందుల కంపెనీలు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తున్నాయని ఉదయభాస్కర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ధరల నిర్ణాయక సంస్థ 2010లో సిట్రిజన్‌ పది మాత్రలకు ఏడు రూపాయలను గరిష్ఠ ధరగా నిర్ణయించింది. ఈ మందు అత్యవసర మందుల జాబితాలో ఉంది. అంటే ప్రభుత్వం సూచించిన ధరకే విక్రయించాలి. కానీ, నియంత్రణ పరిధి నుంచి తప్పించుకోవటానికి కంపెనీలు సిట్రిజన్‌కు మరో మందును కొద్దిమోతాదులో కలిపి రూ.34-37కు అమ్ముతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అమలయ్యే కొత్త విధానం ప్రకారం సిట్రిజన్‌ను రూ.ఏడుకే విక్రయించాలి. కానీ, అమ్మకం ధరపై 20-25 శాతం వరకు మాత్రమే తగ్గిస్తామని మందుల కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. అంటే ఏడు రూపాయలకు అమ్మాల్సిన సిట్రిజన్‌ను రూ.27కు విక్రయిస్తామని చెబుతున్నాయి. ఈ మేరకు జాతీయ మందుల ధరల నిర్ణాయక సంస్థపైనా ఒత్తిడి తెస్తున్నాయి.


  • కంపెనీల ఎత్తులు, ప్రలోభాలు

ధరల నియంత్రణ పరిధిలో ఉన్న ఔషధాలను ఆ పరిధి నుంచి తప్పించి అమ్ముకోవటానికి ఔషధ కంపెనీలు రకరకాల పనులు చేస్తున్నాయి. ఉదాహరణకు, 'ఎ' అనే మందు ధరను ప్రభుత్వం నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తే.. కంపెనీలు ఆ మందుకు 'బి' అనే మరో మందును కొద్దిమోతాదులో కలుపుతున్నాయి. దీంతో 'ఎ' ధరల నియంత్రణ పరిధిలో లేకుండా పోతోంది. నిబంధనలను అమలు చేస్తున్నామంటూ 'ఎ' మందును కొద్దిమొత్తంలో ఉత్పత్తి చేస్తున్నాయి. అదే సమయంలో 'ఎ' మందును వైద్యులు సిఫార్సు చేయకుండా.. ఎ, బి మందులు కలిసి ఉన్న వాటినే సిఫార్సు చేయాలని చెబుతున్నాయి. దీనికోసం వైద్యులకు నగదు, బహుమతులు, విదేశీ పర్యటనలు వంటివి ఇస్తూ పలురకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. అలాగే, ధరల నియంత్రణ పరిధిలో ఒక మందు పదిమాత్రల ప్యాక్‌ ఉంటే.. పదిహేను మాత్రల ప్యాక్‌ను తయారుచేసి ఆ పరిధిలో లేకుండా కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి. నిమ్స్‌లైడ్‌ మందు విషయంలో ఇదే జరుగుతోంది.


  • మార్గదర్శకాలేవి?

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రప్రభుత్వం 348 మందులను ధరల నియంత్రణ పరిధి జాబితాలో చేర్చింది. దీనివల్ల దాదాపు 650 రకాల ఔషధాల ధరలు తగ్గడానికి అవకాశం ఉంది. అయితే, కంపెనీలు దీనిని అడ్డుకుంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు వారు కొన్ని పరిష్కారమార్గాలు కూడా సూచిస్తున్నారు. 1999 నాటి విధానం ప్రకారం అత్యవసర మందుల ధరలను నిర్ణయించిన తరవాత, ఒక్కో కంపెనీ ఈ మందులను తప్పనిసరిగా ఏడాదికి ఎంత పరిమాణంలో (క్వాంటిటీ) ఉత్పత్తి చేయాలనే దానిని కూడా స్పష్టం చేయాలని చెబుతున్నారు. దీనివల్ల కంపెనీలు తప్పించుకోవటానికి వీలుండదని అంటున్నారు.

భారతదేశంలో మందుల ఉత్పత్తి రూ.లక్ష కోట్లు దాటినా, జనాభాలో దాదాపు 50-65 శాతం మందికి అత్యవసర మందులు అందుబాటులో లేవు

  • - ప్రపంచ ఆరోగ్య సంస్థ

మందుల ధరలను నిర్ణయించడంలో ఒక నిర్దిష్టమైన విధానం లేదు. ఉత్పత్తివ్యయంతో పోల్చితే చాలారకాల మందుల ధరలు 1000 నుంచి 3000 శాతం అధికంగా ఉంటున్నాయి. దీనివల్ల రోగం వస్తే సామాన్యులు మందులు కొనలేకపోతున్నారు. ఈ విధానాన్ని మార్చాలని గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం. కంపెనీలు మందుల ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు గడిస్తున్నప్పుడు.. అత్యవసరమైన కొన్ని ఔషధాలనైనా కనీస లాభానికి ఇవ్వటానికి ముందుకు రావాలి. ఈ మేరకు ప్రభుత్వం కూడా నిబంధనలు రూపొందించాలి.


- రావి ఉదయ్‌భాస్కర్‌, సెక్రటరీ జనరల్‌,అఖిల భారత ఔషధ నియంత్రణ అధికారుల సంఘం సమాఖ్య@ఈనాడు - హైదరాబాద్‌


  • =====================

 Visit my website - > Dr.Seshagirirao.com/ 

Thursday, 13 December 2012

Coronary Artery diseases in young age awareness-చిన్న వయసులోనే గుండెకు గండం...అవగాహన



  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --చిన్న వయసులోనే గుండెకు గండం...అవగాహన -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 


చిన్న వయసులోనే గుండెజబ్బులు రావడం... అది గుండెపోటుకు దారితీయడం ఇప్పుడు మరింత పెరిగింది. మనదేశంలో ప్రతి ఏడాదీ కొత్తగా 14 లక్షల నుంచి 16 లక్షలమంది గుండెజబ్బులు ఉన్నవారి జాబితాలో చేరుతున్నారు. ఇది గుండెజబ్బుల తీవ్రతను తెలిపే విషయం. ఇటీవల మనలో పెరుగుతున్న పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లు, వేగంగా కొనసాగుతున్న నగరీకరణతో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాంతో చిన్న వయసులోనే గుండెజబ్బులు (కరోనరీ ఆర్టరీ డిసీజెస్) పెరుగుతున్నాయి. ఆహార అలవాట్లలో, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులతో ఆ గండాన్ని చాలావరకు నివారించవచ్చు. ఆ ముందుజాగ్రత్తలు తెలుసుకోవడం కోసమే చాలా అవసరము .

‘ఫలానా వారికి గుండెజబ్బుట, గుండెపోటు వచ్చిందట’ అని వినిపించడం ఈమధ్య మామూలయిపోయింది. ఆ కబురు చెప్పీచెప్పగానే ఎదుటివారు ‘అరె... ఆయనది చిన్న వయసే కదా’ అని స్పందించడం కూడా ఎక్కువయ్యింది. అంటే... గుండెజబ్బులు ఒక వయసు దాటిన తర్వాత వస్తాయనేది గతంలోని అభిప్రాయం. అభిప్రాయాలు వేరు... అనుభవాలు వేరు. అనుభవం వల్ల అభిప్రాయాలు మారతాయి. గుండెజబ్బుల గురించి ఇటీవల జరుగుతున్న అనుభవాలు, పెరుగుతున్న కేసులు అభిప్రాయాలను మారేలా చేస్తున్నాయి. పాశ్చాత్యులు, ఇతరులతో పోలిస్తే మన దేశవాసుల్లో స్వతహాగానే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికి తోడు పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లు... అంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండటం కోసం ఉపయోగించే మార్జరిన్ వంటి నూనెలు, కొవ్వులు ఉండే పదార్థాలు వాడటంతో పాటు ఇటీవల శరీరంలో ఎక్కువగా కదలికలు లేని తరహా వృత్తులు పెరగడం, దాంతో శరీరానికి అవసరమైన కొద్దిపాటి కదలికలు కూడా లేకపోవడంతో చిన్న వయసులోనే గుండెజబ్బులు (కరోనరీ ఆర్టరీ డిసీజెస్) పెరుగుతున్నాయి. ఈ గుండెజబ్బుల వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడంతో గుండెపోటు వస్తున్న సంఘటనలూ ఎక్కువగా చూస్తున్నాం.

  • నివారణ ఇలా...
వృత్తిపరంగా శరీరానికి తగినంత శ్రమ లేని వాళ్లు నడక, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. రోజులో కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. యుక్తవయస్కులు రన్నింగ్, ఈత వంటి వ్యాయామాలు చేయడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. చక్కెర, రక్తపోటు ఉన్నవాళ్లు తప్పనిసరిగా వాకింగ్ వంటి ఎక్సర్‌సైజ్ చేస్తూ తమ చక్కెరపాళ్లను, రక్తపోటును అదుపులోపెట్టుకోవాలి.

పొగతాగడం గుండెపోటుకు ప్రధాన కారణం. దాన్ని తక్షణం ఆపేయాలి. పొగాకు వినియోగం ఏ రూపంలో ఉన్నా దాని వల్ల గుండెకు ప్రమాదం అని గుర్తించాలి. పొగాకులోని రసాయనాలు రక్తపోటును, గుండెవేగాన్ని పెంచి, రక్తంలోని ఆక్సిజన్ పాళ్లను తగ్గిస్తాయి. అందువల్ల పొగాకు ఏ రూపంలో ఉన్నా ప్రమాదమే.

అధికర రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాలి. హైబీపీని నివారించే ఆహార నియమాలను ‘డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న వూటలకు సంక్షిప్తరూపమే ఈ డ్యాష్. హైబీపీ ఉన్నవాళ్లు... పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఉప్పు (సోడియుం) తగ్గించాలి. బరువు పెరక్కుండా చూసుకోవాలి. హై బీపీ ఉంటే దాన్ని నియుంత్రించుకోవడం కోసం జీవన విధానం (లైఫ్‌స్టైల్) లో వూర్పులు పాటించాలి. అంటే... ఉప్పుతో పాటు సోడియుం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్‌డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. అలాగే తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ తీసుకోకూడదు. కొలెస్ట్రాల్, నూనెలు తక్కువగా తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొనను తీసుకోకూడదు. తాజా పళ్లు, ఆకుపచ్చటి కూరగాయలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) చాలా మంచివి. వేటమాంసం (రెడ్ మీట్), కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండే పాల ఉత్పాదనలు, వెన్న, కొబ్బరి లాంటివి తీసుకోకపోవడమే మంచిది.

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకు యోగా, ప్రాణాయామం వంటివి చేయవచ్చు. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు విధిగా నిద్రపోవాలి.

  • నడుం కొలత కూడా ఒక సూచనే...
మీ నడుం కొలతను ఒకసారి పరీశీలించుకోండి. మీరు పురుషులైతే మీ నడుం కొలత 40 అంగుళాల కంటే ఎక్కువగా, స్త్రీలు అయితే 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే మీకు గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ అని గుర్తించండి.

పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్, స్థూలకాయం, నడుం కొలత పెద్దదిగా ఉండటం వంటివి ఉన్నవారు యుక్తవయస్కులైనా ఒకసారి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన మేరకు పరీక్షలు చేయించుకుని నిశ్చింతగా ఉండవచ్చు.

  • మన దేశంలో రిస్క్ ఫ్యాక్టర్స్
రక్తపోటు (హైబీపీ) అనే అంశం కరోనరీ ఆర్టరీ డిసీజ్‌కు ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్.
గుండెజబ్బులకు దారితీసేందుకు దోహదం చేసే రిస్క్ ఫ్యాక్టర్స్‌లో అత్యంత ప్రధానమైనది డయాబెటిస్.
దూమపానం మరో పెద్ద రిస్క్ ఫ్యాటర్.
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఇటీవల పెరిగింది. దీంతో పాటు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం కూడా పెరుగుతోంది.
ఇటీవల చిన్న వయసులో స్థూలకాయం వస్తుండటం మన దేశ వాసుల్లో పెరుగుతోంది. ఈ అంశం కూడా చిన్నవయసులో వచ్చే గుండె సమస్యలకు దారితీస్తోంది.
ఒత్తిడి కూడా కరోనరీ ఆర్టరీ డిసీజ్‌కు ఓ ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్.కాబట్టి వీలైనంత వరకు మితిమీరిన ఒత్తిడికి దూరంగా ఉండటం అవసరం.
కుటుంబ చరిత్రలో గుండెజబ్బులు ఉంటే వంశపారంపర్యం అనే అంశాన్ని ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా పరిగణించవచ్చు.
మన దేశంలో సగటు ఆయుఃప్రమాణం కూడా పెరగడంతో గుండెజబ్బులు ఎక్కువగా బయటపడుతున్నాయి.
ఇటీవల నగరీకరణ పెరగడంతో జీవనశైలిలోని మార్పులు అంటే పనిగంటలు, పనుల్లో ఒత్తిడి పెరగడం, నిద్ర వ్యవధి తగ్గడం వంటి వాటి వల్ల గుండెజబ్బులు పెరుగుతున్నాయి.
ఈ తరం వృత్తులలో ఎక్కువగా శరీరానికి పెద్దగా అలసట కలిగించనివే ఉంటున్నాయి. ఫలితంగా దేహానికి తగినంత వ్యాయామం ఉండట్లేదు. దీంతో చిన్న వయసులోనే హార్ట్ డిసీజెస్, హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి.

  • ఈ జాగ్రత్తలు తీసుకోండి...
నూనెల్లో పాలీ అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ - (ప్యూఫా) అంటే పొద్దుతిరుగుడు నూనె, కుసుమనూనెల్లాంటివి; మోనో అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (మ్యూఫా) - అంటే ఆలివ్ నూనె, వేరుశనగ నూనెలనుమార్చి మార్చి తీసుకోవడం వల్ల గుండెకు ఆరోగ్యం.
శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అయిన నెయ్యి, వెన్న, పామాయిల్ చాలా తక్కువ పాళ్లలో తీసుకోవాలి.
వంట వండే విధానం కూడా గుండెజబ్బులకు దోహదపడుతుంది. నూనెలో వేగాక మంచి కొలెస్ట్రాల్ సైతం చెడు కొలెస్ట్రాల్‌గా మారిపోతుంది. కాబట్టి వేపుళ్లను సాధ్యమైనంతగా తగ్గించాలి.
ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడకూడదు.
ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే తాజా పళ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి.
బర్గర్ వంటి బేకరీ ఐటమ్స్‌కు బదులు ఆరోగ్యకరమైన సంప్రదాయ ఆహారాలు... కిచిడి, పొంగల్, ఇడ్లీ వంటివి మంచిది.
మొలకెత్తిన ధాన్యాలు (స్ప్రౌట్స్) తీసుకోవాలి.
అప్పడాలు, పచ్చళ్లు, కారపు వస్తువుల్లో ఉప్పు ఎక్కువ కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి.

--Courtesy with Dr.Premchand MD.DM ,Sunshine hos.Hyd.@saakshi Telugu news paper.
         

  • =================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, 5 December 2012

Gastric bypass surgery for obesity-భారీకాయులకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --భారీకాయులకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అధిక బరువు, స్థూలకాయంతో సతమతమవుతున్నారు. సుమారు 120 కోట్ల మంది అధిక బరువుతో.. 30 కోట్ల మంది వూబకాయంతో బాధపడుతున్నారని అంచనా. వీరిలో 13 శాతం మంది, పిల్లలు యువకులే కావటం విశేషం. గత పదేళ్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలో పట్టణాల్లో ఉన్నత, మధ్య తరగతి మహిళల్లో 30-50 శాతం మంది.. పురుషుల్లో 32 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని ఇటీవల జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అధిక బరువు, స్థూలకాయం వివిధ జబ్బులకు దారితీస్తుండటంతో వీటిని తగ్గించుకోవాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నివారించదగిన 10 ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం కూడా ఒకటి. ముఖ్యంగా స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతుండటానికి టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడుపుతుండటం.. పిల్లలకు ఆటస్థలాలు కనుమరుగు అవుతుండటం.. వ్యాయామం చేయకపోవటం.. శారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలు.. ఆహారంపై అవగాహన లేకుండా చిరుతిళ్లకు అలవాటు పడటం వంటి జీవనశైలి దోహదం చేస్తోంది.

మన సమాజంలో కేలరీలు అధికంగా ఉండే పిండి పదార్థాలు, వేపుళ్లు, నూనె, నెయ్యి, కొవ్వు పదార్థాల వాడకం ఒకప్పటికన్నా నేడు బాగా పెరిగిపోయింది. ఇలా ఎక్కువెక్కువగా తింటూ అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయకపోవటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరగటానికి దారి తీస్తోంది. దీనికి దురలవాట్లు కూడా తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుంది.

వ్యాధుల దాడి
స్థూలకాయం కారణంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, సంతాన సమస్యలు, క్యాన్సర్‌, వూపిరితిత్తుల జబ్బులు, పిత్తాశయంలో, కిడ్నీల్లో రాళ్లు, అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యల వంటివన్నీ చుట్టుముడుతున్నాయి. భారీ కాయాన్ని మోయాల్సి రావటంతో మోకాలి కీళ్లు అరిగే ప్రమాదమూ ఉంది. కాలేయం దెబ్బతింటుంది. ఇన్స్‌లిన్‌ రెసిస్టెన్స్‌ పెరుగుతుంది. దీంతో మధుమేహ నియంత్రణ కష్టమవుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) పెరిగి, మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) తగ్గుతుంది. ఇవి పక్షవాతానికి, గుండెజబ్బులకు దారితీస్తాయి. మనం కిలో బరువు పెరిగితే రోజుకి అదనంగా 30 కిలోమీటర్ల దూరం వరకు రక్తాన్ని నెట్టాల్సిన భారం గుండెపై పడుతుంది. దీంతో గుండె ఎక్కువ బలంతో పని చేస్తూ గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.

బరువెందుకు పెరుగుతారు?
ఏ వయసులోనైనా బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. చాలామంది మధ్యవయసులోనే ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. కొందరు చిన్నతనంతోనే అధిక బరువుతో ఉండొచ్చు.
*
కొందరు వంశపారంపర్యంగా అధిక బరువు సమస్య బారిన పడొచ్చు. తల్లిదండ్రుల్లో ఇద్దరూ స్థూలకాయులైతే సుమారు 73 శాతం మంది పిల్లలకూ అది రావొచ్చు. ఎవరో ఒకరు స్థూలకాయులైతే పిల్లల్లో 45 శాతం మంది దీని బారినపడొచ్చు.
*
స్త్రీలల్లో కొన్ని గ్రంథుల స్రావాలు అధిక బరువును తెచ్చిపెట్టొచ్చు. రజస్వల అయినపుడు, గర్భం ధరించినపుడు, ముట్లుడిగిన తర్వాత మహిళలు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. స్టిరాయిడ్లు, గర్భ నిరోధకమాత్రలు, ఇన్స్‌లిన్‌ వంటివి తీసుకోవటమూ దీనికి దోహదం చేయొచ్చు. మానసిక అలసట, అశాంతి, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం, స్వీట్లు ఎక్కువగా తినటం, వంటివన్నీ బరువు పెరగటానికి కారణమవుతున్నాయి.

సాధారణంగా ఊబకాయం తగ్గడానికి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, ల్యాప్‌బ్యాండ్, గ్యాస్ట్రిక్ బైపాస్ లాంటి చికిత్సపూన్నో అందుబాటులో ఉన్నాయి.

  • స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ
ఈ సర్జరీని పూర్తిగా లాప్రోస్కోపిక్ విధానంలో చేస్తారు. పొట్ట మీద అయిదు చిన్న రంధ్రాలను వేస్తారు. ఒక గంటలో సర్జరీ పూర్తవుతుంది. జీర్ణాశయంలో 80 శాతాన్ని తొలగించి, ఒక చిన్న సంచిలా తయారుచేస్తారు. జీర్ణాశయ పేగులకు వెళ్లే చిన్న నాళాన్ని మాత్రం అలాగే ఉంచుతారు. దీనితో జీర్ణాశయ పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది. కొద్దిపాటి ఆహారం తీసుకున్నా కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. ఈ సర్జరీ చేయించుకున్నవారు రెండు మూడు రోజులు ఆసుపవూతిలో ఉండాల్సి వస్తుంది. రెండు వారాల్లో దైనందిన కార్యక్షికమాలను యథావిధిగా నిర్వర్తించుకోవచ్చు.

  • ల్యాప్ బ్యాండ్
ఈ విధానంలో జీర్ణాశయం పై భాగంలో ఒక బ్యాండు వేస్తారు. దాంతో అది ఒక చిన్న సంచిలాగా తయారవుతుంది.
ఈ సర్జరీని కూడా లాప్రోస్కోపిక్ పద్ధతిలోనే చేస్తారు. అయితే దీనికోసం ఒక రోజు ఆసుపవూతిలో ఉంటే సరిపోతుంది. తరువాతి కాలంలో అవసరాన్ని బట్టి ఈ బ్యాండ్‌ను వదులుచేసుకోవడం లేదా బిగుతుగా చేయడం సాధ్యపడుతుంది. అవసరమైతే ఈ బ్యాండ్‌ను తొలగించుకోవచ్చు. రిస్క్ ఉండకపోవడం, చికిత్సా విధానం సులువుగా ఉండడం, తిరిగి మార్చుకునే సౌకర్యం కలిగివుండడం వల్ల ఈ సర్జరీ పట్ల ఎక్కువ మంది మొగ్గు చూపుతారు.

  • గ్యాస్టిక్ బైపాస్
దీనిలో జీర్ణాశయాన్ని సుమారు 60 నుంచి 70 శాతం ఉపయోగంలోకి రానివ్వరు. ఈ క్రమంలో జీర్ణాశయాన్ని రెండు వేరు చేస్తారు. పైభాగాన్ని కోడిగుడ్డు పరిమాణంలో ఒక చిన్న సంచిలాగా తయారు చేస్తారు. కింది భాగాన్ని మాత్రం తొలగించరు. దీనివల్ల అందులోకి ఆహారం ప్రవేశించనప్పటికీ అక్కడ ఉత్పత్తి అయ్యే జీర్ణరసాలు జీర్ణక్షికియలో తోడ్పడుతాయి. జీర్ణాశయాన్ని వేరుచేయడానికి స్టాప్లింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. పైభాగంలో ఆహారం కింది భాగానికి చేరే అవకాశం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండదు. ఈ సర్జరీ చేసుకున్న రోగులు రెండు మూడు రోజులు ఆసుపవూతిలో ఉండాల్సి ఉంటుంది.

  • సర్జరీ తరువాత...
ఆపరేషన్ అనంతరం రోగులు శరీరంలో చోటుసుకున్న మార్పులకు అలవాటు పడేందుకు కొద్దిరోజులు పడుతుంది. సర్జరీ తరువాత మొదటి ఆరు నెలలు మితంగా ఆహారం తీసుకోవడం, నెమ్మదిగి తినడం అలవాటు చేసుకోవాలి. రోజుకు మూడుసార్లు చేసే బదులు నాలుగు నుంచి ఆరుసార్లు మితంగా ఆహారం తీసుకోవాలి. స్థూలకాయం పోవడానికి సర్జరీ ఒక వైద్యవిధానం మాత్రమే. ఆహార అలవాట్లను, జీవనశైలిన మార్చుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలుంటాయి.

-- Courtesy with Dr. Venugopal pareek (MS.DNB,FAIS, FMAS,FIAGES) @Swathi weekly magazine.
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, 3 December 2012

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/