Friday, 30 November 2012

Winter related illness - శీతాకాలము సంబంధిత అనారోగ్యాలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Winter related illness - శీతాకాలము సంబంధిత అనారోగ్యాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    శీతగాలి. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు  కొంత కష్టమే. చలికాలం పిల్లలనూ, వృద్ధులనూ కంటికి రెప్పలా కాపాడుకోవటం చాలా అవసరం. చలికాలం అందర్నీ వణికిస్తుంది. చలికాలంలో చిన్నపిల్లలు, వృద్ధుల మరణాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం. వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఈ కాలంలో కేవలం వెచ్చదనం కోసమే మన శరీరం పెద్దమొత్తంలో శక్తిని ఖర్చు పెడుతుంటుంది. ఈ ఒత్తిడికి తట్టుకోలేక మనలోని రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీంతో జీవక్రియలు గతి తప్పి రకరకాల ఇన్‌ఫెక్షన్లు చుట్టుముట్టటానికి ఆస్కారం పెరుగుతుంది. చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో ఇదే పెను ముప్పుగా పరిణమిస్తుంది.

పసిపిల్లలకు వెచ్చదనం :
చలితో మరణాల గురించి ఏటా వార్తలు చూస్తూనే ఉంటాం. పెద్దల సంగతే ఇలా ఉంటే ఇక ఇప్పుడే పుట్టిన శిశువులు, తక్కువ బరువుతో పుట్టిన వారి సంగతి చెప్పనవసరం లేదు. అందుకే ఈ సీజన్లో పిల్లలు పుట్టినపుడు ముందు వాళ్లు వెచ్చగా ఉండేలా చూడాలి. తల్లిగర్భంలో శిశువులు వెచ్చదనంలో ఉంటారు. పుట్టగానే బయట ఒక్కసారిగా భిన్నమైన వాతావరణంలో మనగలగాల్సి వస్తుంది. ఇది తట్టుకోలేక చాలామంది పిల్లలు చల్లగా అయిపోయి మరణిస్తుంటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరం వెచ్చగా ఉండాలంటే తగినంత గ్లూకోజు, ఆక్సిజన్‌ అవసరం. అయితే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు శరీరంలో గ్లూకోజు, ఆక్సిజన్‌ అంత స్థాయిలో ఉండవు. దీంతో వారు ఎక్కువ శక్తిని ఖర్చు పెట్టలేరు. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఇది 95 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తగ్గితే ఒంట్లో అన్ని ఎంజైమ్‌లు, అన్ని కణాల జీవక్రియలూ నిలిచిపోతాయి. దీంతో కీలక వ్యవస్థలు కుంటుబడి, చివరికి ప్రాణాపాయం సంభవిస్తుంది. కాబట్టి శిశువులకు వెచ్చదనం అనేది ఎంతో అవసరమని గుర్తించాలి. మన దేశంలో శిశు మరణాల రేటు అధికంగా ఉండటానికి పుట్టగానే వెచ్చగా ఉంచే పద్ధతులు పాటించకపోవటం కూడా ఒక ముఖ్య కారణం. సంప్రదాయంగా కాన్పు కాగానే మన ఇళ్లలో బిడ్డలకు స్నానం చేయించటం రివాజు. అయితే ఈ సమయంలో స్నానం కంటే కూడా వెచ్చగా ఉంచటం ముఖ్యం. తల్లి గర్భంలో ఉమ్మనీరులో ఉన్నప్పుడు శిశువు చర్మంపై రక్షణగా 'వర్నిక్స్‌ కేసియోసా' అనే పొర ఉంటుంది. శిశువు చల్లగా కాకుండా ఇది రక్షణగా నిలబడుతుంది. కాబట్టి స్నానం చేయించి దీన్ని వెంటనే తొలగించాల్సిన పని లేదు. బిడ్డ పుట్టగానే వెంటనే పొడిగా ఉండే, ముందుగా వెచ్చబెట్టిన వస్త్రాల్లో శిశువును తీసుకోవాలి. తర్వాత ఆ వస్త్రాలతో తడినంతటినీ సున్నితంగా తుడిచి.. గోరువెచ్చగా ఉండే వార్మర్‌ కింద ఉంచాలి. తర్వాత- తల్లి దగ్గర వెచ్చగా పడుకోబెట్టాలి. తలతో పాటు శిశువు శరీరమంతటినీ వస్త్రాలతో చుట్టి పడుకోబెడితే బాగా వెచ్చదనం లభిస్తుంది. పాలు పడితే శక్తి పుంజుకుంటుంది. ఇలా ఒక పూట గడిచిన తర్వాత.. శిశువు శరీరంలో వ్యవస్థలన్నీ కుదురుకున్నాక.. అప్పుడు స్నానం చేయించొచ్చు. శిశువు బతికి బట్టకట్టటానికి ఇది ముఖ్యమని గుర్తించాలి.

ఆస్థమా, అలర్జీలు :
చలికాలంలో ఆస్థమా, అలర్జీలు ఉద్ధృతమవుతాయి. ఆస్థమా ఉన్నవారికి ఈ కాలంలో... తుమ్ములు, ముక్కు దిబ్బడ, రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, రోజువారీ పనుల్లో ఇబ్బంది, బడికి వెళ్లలేకపోవటం, ఆయాసంతో బాధపడటం, రాత్రిపూట లేచి కూచోవటం, దమ్ము, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటివి బాధిస్తాయి. అందుకే ఆస్థమా, అలర్జీలున్న వారికి చలికాలం మరింత ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆస్థమా, అలర్జీలున్నవారు ఈ కాలం ఒక్కరోజు కూడా విడవకుండా, డాక్టరు ఆపమని చెప్పే వరకూ కూడా విధిగా 'కంట్రోలర్‌' రకం ఇన్‌హేలర్లు వాడాలి. దీంతో ఆస్థమా దాడి చేయకుండా చూసుకోవచ్చు. ఆస్థమా ఉద్థృతమైతే 'రిలీవర్‌' ఇన్‌హేలర్‌ వాడుకోవాలి. అసలు కంట్రోలర్‌ను క్రమం తప్పకుండా వాడితే రిలీవర్‌ అవసరమే ఉండదు.

పొడిచర్మం :
చలికాలం రాగానే వాతావరణంలో తేమ తగ్గుతుంది. దీంతో చర్మంలోని తేమ ఇగిరిపోయి పెదవులు, చెంపలు పగలటం.. చేతులు, కాళ్లు పొడిబారటం.. దురద మొదలవుతాయి. చలికాలంలో చర్మం మీదుండే రక్షణ వ్యవస్థ కూడా క్షీణిస్తుంది. కాబట్టి దురద పెట్టినపుడు గోకితే పిల్లల్లో ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. పొడిబారటం మూలంగా పగిలిపోయే చర్మానికి అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. పొడి చర్మం గలవారికి అటోపిక్‌ డెర్మటైటిస్‌, ఎండుగజ్జి వస్తుంది. 10-20% మంది పిల్లలు అటోపిక్‌ డెర్మటైటిస్‌తో బాధపడుతున్నారని అంచనా. ఇందులో జరిగేదేమంటే- దురద పెట్టటం.. గోకటం.. గోకినందువల్ల తిరిగి దురద పెట్టటం.. ఇదోవిష వలయంలా తయారవుతుంది. దీంతో చర్మం దెబ్బతిని, ఎర్రగా తయారవుతుంది. రాత్రిళ్లు సరిగా నిద్రపోరు. క్రమేపీ గోకిన చోట బ్యాక్టీరియా చేరి, చీముపట్టి (సెకండరీ ఇన్‌ఫెక్షన్ల) సమస్యలు పెరుగుతాయి. దీంతో పిల్లలతో పాటు తల్లిదండ్రులకూ వేదన మొదలవుతుంది. చూడటానికి వికారంగా ఉందని, బాగా గోకుతున్నారని, తరచూ ఏడుస్తున్నారని పెద్దలకూ మనసు స్థిమితంగా ఉండదు. కాబట్టి ఈ సీజన్లో పిల్లల చర్మం పొడిబారకుండా, గోకకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవటం పెద్దల కనీస బాధ్యత.

బ్రాంకియోలైటిస్ :
ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా ఈ సీజన్లో కొన్ని రకాల వైరస్‌లు విజృంభిస్తాయి. వీటిల్లో ముఖ్యమైంది శ్వాస సమస్యలు తెచ్చిపెట్టే 'రెస్పిరేటరీ సిన్‌సీషియల్‌ వైరస్‌(ఆర్‌ఎస్‌వీ). ఇది మొగుళ్లవాపు (బ్రాంకియోలైటిస్‌) తెచ్చిపెడుతుంది. మూణ్నెల్ల నుంచి రెండేళ్ల లోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువ. కొద్దిగా జలుబు, దగ్గు, గురగుర, పిల్లికూతలు, డొక్కలు ఎగరేయటం, శ్వాస అందకపోవటం, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, పాలు తాగకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు పడే ఈ బాధ చూడలేక తల్లిదండ్రులు గిలగిల్లాడిపోతుంటారు. సమస్య తీవ్రమైతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స తప్పనిసరి అవుతుంది. కాబట్టి సమస్యను ముందే పట్టుకుని వైద్యులకు చూపించి తగిన చికిత్స, జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి ఒంట్లో నీరు తగ్గకుండా చూడటం ముఖ్యం. ఒంట్లో తగినంత నీరు లేకపోతే శ్వాసనాళాల్లోని జిగురు ద్రవాలు పిడచ కట్టుకుపోయి, ఆ నాళాలు మూసుకుపోతాయి. ఊపిరితిత్తుల పని కష్టమై.. శరీరానికి తగినంత ఆక్సిజన్‌ అందని పరిస్థితి తలెత్తుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గితే ఎంత దగ్గినా జిగురుద్రవాలు బయటకు రాలేక.. ఆయాసం వస్తుంది. కాబట్టి శరీరంలో తగినంత నీరు ఉండేలా చూడటం చాలా అవసరం. అయితే ఈ బ్రాంకియోలైటిస్‌ బారినపడ్డ పిల్లలు ఒకేసారి ఎక్కువ మొత్తంలో పాలు తాగలేరు కాబట్టి కొద్దికొద్దిగా ఎక్కువసార్లు పడుతుండాలి. ఆర్నెల్లు దాటినవారికి తరచుగా నీళ్లు తాగించాలి. పిల్లలు మగతగా ఉండి, పాలు తీసుకోలేని పరిస్థితిలో ఉండి, డొక్కలు ఎగరేస్తుంటే బ్రాంకియోలైటిస్‌ తీవ్రంగా ఉందని అర్థం. వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి. అక్కడ వీరికి సెలైన్‌ పెట్టి, ఆక్సిజన్‌ ఇస్తారు. యాంటీబయోటిక్స్‌, నెబులైజేషన్‌, సాల్‌బుటమాల్‌ వంటి మందుల అవసరమేం ఉండదు. ఇలా 2, 3 రోజులపాటు జాగ్రత్త తీసుకుంటే సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. చలికాలంలో ''ఆర్‌ఎస్‌వీ''తో పాటు మామూలు జలుబు వైరస్‌లూ తరచుగానే దాడిచేస్తాయి. ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వాటంతట అవే తగ్గేవే అయినా.. పిల్లలకు జలుబు, జ్వరం కనిపిస్తే అవే తగ్గుతాయని సరిపెట్టుకోటానికి లేదు. ఎందుకంటే పిల్లల్లో రక్షణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. పైగా ఈ బ్రాంకియోలైటిస్‌ ముప్పు ఎక్కువ. కాబట్టి వైద్య సహాయం తీసుకోవటం శ్రేయస్కరం.

ఫ్లూ జ్వరం :
ఈ మధ్య ఫ్లూ భూతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇది చలికాలంలో ఎక్కువ వస్తుంది. ఇది వచ్చినపుడు తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా ఎక్కువైతే న్యుమోనియాకూ దారి తీస్తుంది. 1902లో స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు యూరప్‌, అమెరికా ఖండాల్లో 20% మందిని పొట్టన పెట్టుకుంది. ఫ్లూ వచ్చాక శరీర రక్షణ వ్యవస్థ బలహీనపడి వాళ్లందరికీ న్యుమోనియా (సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌) వచ్చింది. దీంతో మరణాలు సంభవించాయి. 1944లో యాంటీబయోటిక్‌ మందులు కనుగొన్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ మందులతో న్యుమోనియా వంటి ఇన్‌ఫెక్షన్లను సమర్థవంతంగా నివారించొచ్చు కాబట్టి ఇప్పుడు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయితే ఇప్పటికి కూడా ఫ్లూ వచ్చిన వారికి న్యుమోనియా ముప్పు ఎక్కువగానే ఉంటోంది.  ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి తొందరగా సోకకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవటం.. దగ్గు, తుమ్ములు వచ్చినపుడు ముక్కుకు, నోటికి రుమాలు అడ్డం పెట్టుకోవటం.. వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్లూ రాకుండా టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారికి ఫ్లూ వల్ల తీవ్రమైన ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి వీరికి ఫ్లూ టీకా ఇప్పించటం మంచిది. ఈ టీకాలు ఏటా తీసుకోవాల్సి ఉంటుంది.

చలివిరేచనాలు :
వేసవి, వర్షాకాలాల్లో నీరు కలుషితమై వాంతులు, విరేచనాలు ఎక్కువ. అవి బ్యాక్టీరియా కారణంగా వచ్చేవి. అయితే చలి కాలంలోనూ ఈ సమస్య ఎక్కువే, దీనికి వైరస్‌లు కారణమవుతుంటాయి. అందుకే వీటిని 'వింటర్‌ డయేరియా' అనీ, 'స్టమక్‌ ఫ్లూ' అనీ అంటారు. ఈ చలికాలం డయేరియా సాధారణ డయేరియా కన్నా తీవ్రంగా ఉంటుంది. ఇది జ్వరంతో వస్తుంది. త్వరగా ఒంట్లో నీరింకిపోయి (డీహైడ్రేషన్‌) ప్రమాదం ముంచుకొస్తుంది. వాంతులు ఎక్కువగా ఉంటాయి. మొదటిరోజు జ్వరం, వాంతులు.. రెండోరోజు విరేచనాలు ఎక్కువగా కనిపిస్తాయి. మూడోరోజు ఇవి తీవ్రమై డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. కాబట్టి పిల్లల్లో తీవ్రమైన విరేచనాలు, వాంతులు, జ్వరం ఉన్నప్పుడు రోటా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందేమోనని అనుమానించాలి. వెంటనే వీరికి శరీరం నుంచి ఎంత నీరు పోతోందో అంతా భర్తీ చేసే ప్రయత్నం చేయాలి. అవసరమైతే వైద్యులు సెలైన్‌ కూడా పెడతారు. చాలామంది నీళ్లు తాగిస్తే ఇంకా విరేచనాలు అవుతాయని పొరపడుతుంటారు. ఇది తప్పు. ఎంత పోతుంటే అంతకంటే ఎక్కువ నీరు, ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగిస్తుండాలి. అలాగే మిగతా ద్రవ పదార్థాలు, రోజూ తినే ఆహారం కూడా ఇవ్వాలి. విరేచనాలు అవుతున్న పిల్లలు- మగతగా ఉండటం, నోరు ఎండిపోవటం, నాడి సరిగా అందకపోవటం, శ్వాస వేగంగా తీసుకుంటుంటే డీహైడ్రేషన్‌ ఎక్కువైందని అర్థం. ఇలాంటి పిల్లలకు అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చి సెలైన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. రోటావైరస్‌ బారినపడకుండా ఇప్పుడు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ టీకాను పుట్టిన తర్వాత ఒకటిన్నర నెలలు, రెండున్నర నెలలు, మూడున్నర నెలల వయసులో వేయించాలి. పోలియో, డీపీటీలతో పాటే దీన్నీ వేస్తారు. ఈ టీకాను కూడా సార్వత్రిక టీకా కార్యక్రమంలో చేర్చాలని జాతీయ పిల్లల వైద్యుల సమాఖ్య ప్రభుత్వానికి సిఫారసు చేసి, అందుకు కృషి చేస్తోంది. ఈ టీకా మొదటి మోతాదును 3 నెలల వయసు లోపు, చివరి మోతాదును ఎనిమిది నెలల లోపే ఇవ్వాలి. విరేచనాలకు కారణమయ్యే రోటా వైరస్‌తో పాటు వాంతులకు కారణమయ్యే నోరో వైరస్‌ కూడా చలికాలంలోనే అధికంగా కనిపిస్తుంది. వీరికి వాంతుల తర్వాత విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఎక్కువ.

టాన్సిల్స్‌ వాపు :
నోటి తుంపరల ద్వారా, గాలి ద్వారా వ్యాపించే జబ్బుల్లో 'స్ట్రెప్టోకోకల్‌ టాన్సిలైటిస్‌' కూడా ఒకటి. ఇది చలికాలంలో ఎక్కువ. చలికాలంలో తలుపులు మూసిన గదుల్లో పిల్లలు దగ్గరగ్గరగా కూచుంటారు కాబట్టి ఇది ఒకరి నుంచి మరొకరికి తేలికగా వ్యాపిస్తుంటుంది. జ్వరం, గొంతునొప్పి, మింగలేకపోవటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ టాన్సిలైటిస్‌ను అనుమానించాలి. దీనికి వారం పాటు సమర్థమైన యాంటీబయోటిక్స్‌ ఇచ్చి పూర్తిగా నయం చెయ్యటం అవసరం. ఎందుకంటే ఈ స్ట్రెప్టోకాకల్‌ టాన్సిలైటిస్‌తో కేవలం జ్వరం, గొంతునొప్పే కాదు.. రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ (గుండె జబ్బు), గ్లోమరులో నెఫ్రైటిస్‌ (కిడ్నీ జబ్బు) కూడా వచ్చే అవకాశమూ ఉంటుంది. ఈ రెండూ తీవ్రమైనవి, జీవితాంతం దుష్ప్రభావాలను చూపించేవి. కాబట్టి గొంతునొప్పితో టాన్సిల్స్‌ వాస్తే తేలికగా తీసుకోవద్దు. సాధ్యమైనంత త్వరగా, పూర్తిగా తగ్గేవరకు చికిత్స తీసుకోవాలి. ఈ టాన్సిలైటిస్‌ను గుర్తుపట్టటం తేలిక. ఈ గొంతు ఇన్ఫెక్షన్‌కూ, సాధారణ జలుబుకూ తేడాలు స్పష్టంగానే ఉంటాయి. టాన్సిలైటిస్‌ వచ్చిన వారికి ముక్కు కారదు, దగ్గు ఎక్కువగా ఉండదు. కేవలం గొంతు నొప్పి, బాధ, మింగలేకపోవటం, తీవ్రమైన జ్వరం.. ఇవి ఉంటాయి. నోరు తెరిచి చూస్తే టాన్సిల్స్‌ ఎర్రగా అయ్యి, వాటి మీద తెలతెల్లగా చీము మచ్చల వంటివి కనబడతాయి. చెవుల వెనకగా మెడ దగ్గర లింఫ్‌ గ్రంథులు వాచి బిళ్ల కడతాయి. (ఇది సాధారణ జలుబు జ్వరంలో ఉండదు) టాన్సిలైటిస్‌లో జ్వరం కూడా మొదట్లో కొద్దిగా ఆరంభమై అంచెలంచెలగా పెరుగుతుంది. అదే వైరల్‌ జ్వరాల్లో- జ్వరం వస్తూనే తీవ్రంగా వస్తుంది, క్రమేపీ తగ్గుతుంటుంది. ఇక టాన్సిలైటిస్‌లో మనం మందులతో చికిత్స ఆరంభించిన 24-48 గంటల్లోనే జ్వరం, నొప్పి, వాపు అన్నీ తగ్గుముఖం పడతాయి. వారంపాటు చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా తగ్గిపోతుంది. దీన్ని ముందుగానే అడ్డుకోవటం చాలాచాలా అవసరం.

కీళ్లనొప్పులు :
మనలోని రోగ నిరోధక వ్యవస్థ.. మన శరీరావయవాల మీదే దాడులు చేయటం ఫలితంగా తలెత్తే కీళ్ల వాతం (రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌) వంటి దీర్ఘకాలిక సమస్యలు పెద్దలకే కాదు, పిల్లలకు కూడా వస్తాయి. పిల్లల్లో వచ్చే దాన్ని 'జువనైల్‌ రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌' అంటారు. దీనివల్ల చేతులు, కాళ్ల కీళ్లు, చిన్న కీళ్లు ప్రభావితం కావటం వల్ల నొప్పి, బాధ, జ్వరం.. ఇవన్నీ వేధిస్తుంటాయి. బయట వాతావరణంలో చలి ఎంత ఎక్కువగా ఉంటే ఈ బాధలు వీరిని అంత ఎక్కువగా వేధిస్తుంటాయి. ఎండ పెరుగుతున్న కొద్దీ బాధల తీవ్రత తగ్గుతుంటుంది. పెద్దల్లో అయితే ఏళ్ల తరబడి అనుభవం ఉంటుంది కాబట్టి చలి పెరుగుతున్నప్పుడే ముందు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ పిల్లలకు ఈ అనుభవం ఉండదు. కాబట్టి ఇటువంటి సమస్యలున్న పిల్లలకు తల్లిదండ్రులు ముందు నుంచే ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకోవటం అవసరం.

మెదడు వాపు :
దోమలు వానకాలంలో ఎక్కువే గానీ.. వాటి ప్రభావం వల్ల అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో మెదడు వాపు సమస్య ప్రబలుతుంటుంది. దీని బారినపడ్డ పిల్లల్లో 30-35% మంది మృత్యువాత పడుతున్నారు. మరో 30-35% మంది బతికి బట్టకట్టినా.. జీవితాంతం వినికిడి లోపమో, దృష్టి లోపమో, ఫిట్స్‌ రావటమో, బుద్ధిమాంద్యమో.. ఇలా ఏదో అవకరాలతో గడపాల్సి వస్తుంటుంది. ఈ మెదడువాపు బారినపడిన వారిలో కేవలం 30% మాత్రమే అదృష్టవశాత్తూ ఎటువంటి దుష్ప్రభావాలూ లేకుండా బయటపడతున్నారు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఇదెంత ప్రమాదకరమైన సమస్యో! కాబట్టి ఈ కాలంలో దోమలు కుట్టకుండా పిల్లలను సంరక్షించుకోవటం చాలా అవసరమని గుర్తించాలి. మెదడువాపు రాకుండా నివారించుకునేందుకు త్వరలో టీకా (జీవ్‌) అందుబాటులోకి రానుంది. దీన్ని ప్రపంచంలోనే తొలిగా మన హైదరాబాద్‌లో రూపొందిస్తుండటం విశేషం.

కుంగుబాటు :
చలికాలంలో కుంగుబాటు (డిప్రెషన్‌) వంటి మానసిక సమస్యలు ఎక్కువ. వీటిని 'సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్లు' అంటారు. చాలామంది పిల్లలకు డిప్రెషనెందుకు వస్తుందని భావిస్తుంటారుగానీ పిల్లల్లో కూడా ఇలాంటివి సహజమే. తోటిపిల్లలతో ఆడుకోకపోవటం, ఒక్కరే ఉండాలనుకోవటం, సరిగా తినకపోవటం, ఎప్పుడూ బద్ధకం, దేనిమీదా ఆసక్తి లేకపోవటం.. ఇటువంటి లక్షణాలు కనబడితే దీన్ని అనుమానించటం మంచిది. పగటి కాలం తక్కువుండి, రాత్రి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు భావోద్వేగపరమైన సమస్యలకు ఆస్కారం ఎక్కువ. అందుకే చలికాలం డిప్రెషన్లు, భావోద్వేగ సమస్యలు, ఆత్మహత్యా భావనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరిపై ఒక కన్నేసి ఉంచాల్సిన సమయం ఇది.

రక్షణ చర్యలు :
* పిల్లలకు అవసరమైన టీకాలన్నీ వేయించాలి. శుభ్రంగా, తరచుగా చేతులు కడుక్కోవటం నేర్పించటం.. వ్యాధులు దరిజేరకుండా కీలకమైన రక్షణ చర్య.
* ఈ కాలంలో జ్వరాలు, విరేచనాల బెడద ఎక్కువ కాబట్టి ప్యారాసెటమాల్‌, ఓఆర్‌ఎస్‌ బిళ్లలు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.
* మంచి పుష్టికరమైన పోషకాహారం అందించాలి. సూక్ష్మపోషకాలు కూడా ఎక్కువగా ఉండే, ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన, తాజా ఆహారం ఇవ్వటం ముఖ్యం.
* చలికాలం ఒంటికి సరైన వ్యాయామం ఉండటం అవసరం. వ్యాయామం చేసినప్పుడే మనలోని రోగనిరోధక వ్యవస్థ కూడా ఉత్తేజితంగా ఉంటుందని గుర్తించాలి.
* చలికాలంలో కూడా ద్రవాహారం, ద్రవపదార్ధాలు ఎక్కువగా తీసుకోవటం ముఖ్యమని గుర్తించాలి.
* చర్మం పెదవులు పగలకుండా ఉండేందుకు చలికాలంలో వాజ్‌లైన్‌ రాయటం ఉత్తమం. దీని కోసం ఖరీదైన మాయిశ్చరైజర్లు అవసరం ఉండదు. అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ డెర్మటాలజీ కూడా వాజ్‌లైన్‌ను ఉత్తమ 'ఎమోలియెంట్‌'గా నిర్ధారించింది.
* చలికాలం సబ్బులు తక్కువ వాడాలి, సున్నిపిండి వంటివి ఉత్తమం. సబ్బు ఎక్కువ వాడిన కొద్దీ శరీరం మీది చమురు పొరలు పోయి, పొడిబారి.. ఇన్ఫెక్షన్లు, అలర్జీలకు ఆస్కారమవుతుంది.
* పిల్లలకు మెత్తటి పూర్తి చేతుల చొక్కా, పైజమాలు, గ్లౌజులు, సాక్సులు, మంకీక్యాప్‌ వెయ్యటం తప్పనిసరి.
* ఎండలేమి కారణంగా చలికాలంలో విటమిన్‌-డి లోపించే అవకాశాలు ఎక్కువ, దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి, ఇతరత్రా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ముదురుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చలికాలంలో విటమిన్‌-డిని ప్రోది చేసుకునే ప్రయత్నం చెయ్యటం మంచిది. ఇది ఆహారం ద్వారా లభించే అవకాశాలు తక్కువ. అందుకని ఉన్న ఎండను సద్వినియోగం చేసుకోవాలి.  రోజూ ఒక గంట ముఖానికి, కాళ్లకు, చేతులకు ఎండ తగిలేలా చూసుకోవటం అవసరం.

--Dr.P.sudharshan reddy -peadiatrician ,Hyd@Eenadu sukhibhava
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, 23 November 2012

Heart-గుండె



  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మన శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్, ఆహారం అవసరం. అలాగే అక్కడి కార్బన్‌డయాక్సైడ్, మరికొన్ని మలిన పదార్థాల్ని ఎప్పటికప్పుడుతొలగించాల్సిన అవసరం ఉంది. ఈ పని రక్తం ద్వారా జరుగుతుంది. గుండె కొట్టుకొంటూండడంతో రక్తం శరీర భాగాలన్నింటికీ వెళ్ళడం, అక్కడ నుంచి వెనక్కి తిరిగి రావడం జరుగుతుంటుంది. ఇలా గుండె ఒక పద్ధతి ప్రకారం కొట్టుకుంటుండాలంటే దాని నిర్మాణంలో లోపాలుండకూడదు. కండరాలు

ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. కవాటాలు సరిగా పనిచేస్తుండాలి. గుండె కండరాలకు రక్తసరఫరా సరిగ్గా జరుగుతుండాలి. గుండెలోని శక్తి ప్రవాహం కూడా పద్ధతిగా ఉండాలి. అప్పుడే గుండె ‘లబ్ డబ్’అంటూ సరి వేగంతో కొట్టుకుంటుంది. అలాగే గుండెనుంచి రక్తాన్ని శరీర భాగాలన్నింటికీ తీసుకువెళ్ళే రక్త నాళాలలో సమస్యలొచ్చినా అనారోగ్యాలు కలుగుతాయి.

గుండె చుట్టూ వుండే రక్షక పొరని ‘పెరికార్డియమ్’ అంటారు. పెరికార్డియమ్‌లో కూడా ఇన్‌ఫెక్షన్ రావచ్చు. అలా ఇన్‌ఫెక్షన్ వస్తే గుండె చుట్టూ నీరు చేరుతుంది. ఈ అనారోగ్యంలో కూడా ఛాతీ ప్రాంతంలో నొప్పి వస్తుంది.
గుండె కండరాలు బలహీనమైతే గుండె కొట్టుకోవడం కష్టమవుతుంది. ఇలా వదిలేస్తే ‘హార్ట్ ఫెయిల్యూర్’కి దారితీస్తుంది. గుండెలోని ఒక ప్రక్కవున్న గదుల ద్వారా ఆక్సిజన్‌తో కూడుకున్న రక్తం శరీర భాగాలకి వెళ్తే, రెండో ప్రక్కనున్న గదులలోకి కార్బన్‌డయాక్సైడ్‌తో కూడుకున్న రక్తం శరీర భాగాలనుంచి చేరుతుంది. కాబట్టి రెండు ప్రక్కల రక్తాలు కలవకుండా ఉండాలి. అలాగే రక్తం ఒకవైపే ప్రవహిస్తుండాలి. ఇందుకు కవాటాలు తోడ్పడుతుంటాయి. వీటిలో లోపమున్నా గుండె గోడలో రంధ్రాలున్నా ఈ సమతుల్యం దెబ్బతిని గుండె నీరసించే ప్రమాదముంది. సాధారణంగా ఇలాంటి ఇబ్బందులు పుట్టుకతోను,

  • చిన్నతనంలో రుమాటిక్ జ్వరం రావడంవల్ల కలగవచ్చు.

గుండెలో రంధ్రాలతోపాటు కవాటాలు మూసుకుపోయి పుట్టిన పిల్లల్లో చెడు, మంచి రక్తం కలవడంతో ‘సైనోటిక్ హార్ట్ డిసీజెస్’ రావచ్చు. వీళ్ళనే ‘బ్లూబేబీస్’ అంటారు. రక్తం నీలంగా మారడంవల్ల పిల్లలు నీలంగా కనిపిస్తారు. పుట్టుకతో వచ్చే ఈ లోపాలన్నింటినీ శస్త్ర చికిత్సలతో సరిదిద్దవచ్చు. పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు 6-12 సం. మధ్య గొంతు ఇన్‌ఫెక్షన్స్ (ఫెరింజైటిస్) వచ్చి, వాటిని అశ్రద్ధచేస్తే- కీళ్ళ నొప్పులు, జ్వరంతో కూడిన ‘రుమాటిక్ ఫీవర్’ అనే వ్యాధి వస్తుంది. దీనికి వైద్యులకు చూపించి, సరైన చికిత్స చేయించాలి. లేకపోతే క్రమంగా కవాటాలు దెబ్బతిని, రుమాటిక్ హార్ట్ వ్యాధులకు దారితీస్తుంది.
మిగతా అన్ని అవయవాలకు లాగానే గుండెకి రక్తం సరఫరాచేయడానికి వేరే రక్తనాళాలుంటాయి. ఆ రక్తనాళాలను కరొనరి ధమనులంటారు.  వాటిలో అడ్డంకులేర్పడడంవల్ల గుండె కండరాలకు రక్తసరఫరా తగ్గి ఎంజైనా మరియు హార్ట్ ఎటాక్‌లు రావచ్చు. వీటిని ‘కరొనరి హార్ట్ డిసీజెస్’ అంటారు. మన లివర్ కొలెస్ట్రాల్‌ని తయారుచేస్తుంది. మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. రక్తంలో ఒక భాగం ఇది. రక్తంలో ఇది ఎక్కువగా ఉంటే రక్తనాళాల గోడలలోపల గోడలమీద పేరుకుపోతుంటుంది. ఇలా కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటే రక్తనాళాల లోపల దారి మూసుకుపోతుంటుంది. రక్తప్రసరణ దెబ్బతింటుంది.  రక్తం లీటరులో 5.5 మి. ఎమ్‌ఒఎల్‌కన్నా ఎక్కువుంటే ‘కరొనరి ఆర్టెరి డిసీజెస్’ వచ్చే అవకాశముంది.  రక్తంలో ప్రవహించే కొలెస్ట్రాల్‌లో కొవ్వులు, ప్రొటీన్లు రకరకాల పద్ధతుల్లో కలిసి ఉంటాయి. వీటినే లైపోప్రొటీన్లంటే తక్కువ సాంద్రతగల లైపోప్రొటీన్స్‌లో లెటిలైపో... ప్రోటీన్స్ (ఎల్‌డిఎల్). ఇది చెడు కొలెస్ట్రాల్. ఇది రక్తంలో ఎక్కువ. ఎక్కువ సాంద్రతవున్న కొలెస్ట్రాల్... హైడెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) కూడా రక్తంలో ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్. ఎథిరో స్క్లేరోసిస్ రాకుండా ఇది కాపాడుతుంది. కాబట్టి హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువుండాలి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువుడాలి.
ఉదయం 5 గం. ప్రాంతంలో నడక వల్ల వ్యాయామమే కాదు ఈ సమయంలో శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటాయి. ఈ సమయంలో నడకవల్ల ఎల్‌డిఎల్ తగ్గి, హెచ్‌డిఎల్ పెరుగుతుంది.
నడకతోబాటు మన నడతని మార్చుకోవాలి. ధూమపానం, ఆల్కహాల్‌లాంటి అలవాట్లు మానుకోవాలి. ఆహారపుటలవాటు మార్చుకోవాలి. ఒత్తిడితగ్గించుకోవాలి. ఇవన్నీ చేయక తప్పదు మన గుండెకోసం. కరొనరి ధమనులు గుండెకి ఎడమవైపు రెండు, కుడివైపు ఒకటి ఉంటాయి. క్రొవ్వు పదార్థాలు, అడ్డంకులు తొలగించడానికి ఈ అడ్డంకులు 50% కన్నా
తక్కువ వుంటే మందులతో కరిగించవచ్చు. 75%కన్నా ఎక్కువ ఒకటి లేక రెండింట ఉంటే యాంజియో ప్లాస్టి ద్వారా తొలగించవచ్చు.
అసలు అడ్డంకుల్ని తెలుసుకోవడానికి ‘యాంజియోగ్రామ్’ తోడ్పడుతుంది. ఇప్పడు ‘ఐవస్’ గైడెన్స్ కేథలాబ్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా అమర్చిన స్టెంట్‌లు సరిగ్గా అమరాయా? లేదా తెలుసుకోవచ్చు. కష్టాన్ని కలిగించే అడ్డంకులకి బెలూన్స్ చికిత్సవల్ల లాభముందా? లేదా? తెలుసుకోవచ్చు. కాంప్లెక్స్ యాంజియో ప్లాస్టీలంటే ఎడమవైపు ఉండే ముఖ్య రక్తనాళంలో బ్లాక్‌లు, రక్తనాళాలు శాఖలుగా విభజన జరిగే ప్రాంతాలలో అడ్డంకులు, బైపాస్ అయిపోయిన తర్వాత గ్రాఫ్ట్‌లలో అడ్డంకులు, గట్టి కార్డియం అడ్డంకుల్ని  తొలగించడానికి నిర్వహించేవి. వీటికి ఐవస్ తోడ్పడుతుంది.
మూడు రక్తనాళాలలో అడ్డంకులుంటే శస్తచ్రికిత్సతో తొలగించాల్సి రావచ్చు. ఈ శస్త్ర చికిత్సలో ఇప్పుడు సన్నటి రంధ్రం ద్వారా చేస్తున్నారు. కవాట మార్పిడి శస్తచ్రికిత్సల్ని చిన్న రంధ్రం ద్వారా చేస్తున్నారు. చికిత్సలోకన్నా కూడా మనం ప్రధానం తెలుసుకోవాల్సింది వ్యాధులు రాకుండా నివారించడం. ఒకవేళ వ్యాధులు మొదలైనా ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే అపాయం కలగకుండా నివారించవచ్చు.
గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంటుంది. ఆ లయ రిథమ్ తప్పి కొట్టుకోవడాన్ని ‘ఎరిధ్మియా’ అంటారు. పైనుండే చిన్న రెండు గదులు- ఆరికల్స్‌లో కొట్టుకునే లయ తప్పడాన్ని ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’ అంటారు. అది డిజార్గనైజ్డ్‌గా తీవ్రంగా వచ్చే ఎలక్ట్రిక్ ఇంపల్సెస్‌వల్ల వస్తుంది. ఎరిధ్మియాలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సాధారణంగా వస్తుంటుంది. వయసుని బట్టి ఈ ఫిబ్రిలేషన్ వచ్చే రిస్క్ ఎక్కువవుతుంది. ఇది వచ్చిన  లక్షణాలుండకపోవచ్చు. చెమటలు పట్టడం, ఫెయింట్ అవడం జరగవచ్చు. ఛాతీ నొప్పి రావచ్చు. గుండె ఫెయిలవ్వవచ్చు. గుండె కొట్టుకునే రేటు పెరిగినా, తగ్గినా కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తుంది. పైగా ఆరికల్స్ కదలికలు సరిగ్గా ఉండకపోతే రక్తం పేరుకుపోవడానికి ‘స్టాసెస్’ కారణమవుతుంది. దీనివల్ల రక్తం గడ్డలు కట్టే రిస్క్ ఎక్కువ. ఈ బ్లడ్ క్లాట్స్, గుండెవైపు వెళ్ళి, అక్కడి రక్తనాళాలలో అడ్డంగా ఏర్పడవచ్చు.
కొన్ని మందులతో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ తగ్గవచ్చు. గుండె కొట్టుకునే రేటు ఈ మందులతో తగ్గుతుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌లో గుండె కొట్టుకునే రేటుని ఎలక్ట్రిక్ కార్డియో వెర్షన్‌తో మామూలు స్థితికి రావచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ తగ్గడానికి శస్తచ్రికిత్స, కేధటార్‌తో చేసే చికిత్సా విధానాలు తోడ్పడతాయి. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌తో బాధపడేవారు రక్తం పలుచనవడానికి మందులు తీసుకోవడం మంచిది. 

గుండె కొట్టుకునే రేట్ సరిగ్గా ఉండేందుకు, చర్మం క్రింద (్ఛతీ భాగంలో) పెట్టే పరికరాన్ని కృత్రిమ ఫేస్‌మేకర్ అంటారు. మామూలుగా గుండెలో ఉండే ఫేస్ మేకర్ పనిచేయకపోయినా, నోడ్ దగ్గర పుట్టిన విద్యుత్‌ని గుండె అంతా వెంట్రికిల్స్ వరకు విస్తరించేట్టు చేసే మార్గాల్లో అడ్డంకులేర్పడ్డా కృత్రిమ ఫేస్‌మేకర్ని పెట్టాల్సి ఉంటుంది.  ఈ విషయాలన్నింటిమీదా అవగాహన ఉంటే గుండె అనారోగ్యాలు కలుగకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ ఏవైనా అనారోగ్యాలు కలుగుతున్నా ప్రారంభంలో గుర్తించగలగాలి. గుర్తించి ఊరుకోకూడదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా వైద్యుడికి చూపించాలి. వారు సూచించిన పరీక్షలు చేయించి,

చికిత్స చేయించుకోవాలి.ఇవాళ ఎటువంటి హృద్రోగానికైనా చికిత్స ఉంది. గుండె పూర్తిగా దెబ్బతింటే గుండె మార్పిడి చేస్తున్నారు. ఎటొచ్చీ..మన గుండె చప్పుడు మనం గమనిస్తుండాలి..అంతే.
  • గుండె నేర్పే పాఠాలు
నీ జీవన విధానాన్ని సరిగా ఉంచుకో.. ఏ ఆహారం పడితే ఆ ఆహారాన్ని సమయం సందర్భం లేకుండా తీసుకోకు.. కాయకష్టమే పాతకాలం వాళ్ళ గుండెకి శ్రీరామరక్ష. శారీరక శ్రమ, తీసుకున్న కేలరీలను ఖర్చుపెట్టడానికి సైక్లింగ్, ఈతో, నడకో ఏదో ఒక వ్యాయామం రోజుకో 45 నిముషాలన్నా అవసరం.

ధూమపానం ఆల్కహాల్ సేవనం లంటి అలవాట్లకి దూరంగా ఉండడం, వంశపారంపర్యంగా గుండె సమస్యలుంటే ఆ రిస్క్‌కి తగ్గ జాగ్రత్తలు, చిన్నవయసు నుంచే తీసుకోండి. మానసిక వత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానము, సంగీతం వినడం, పుస్తక పఠన లాంటి- అలవరచుకోండి. మీ జీవన విధానాన్ని మార్చుకోవాలని ఒక ప్రక్క చెబుతూ మరోప్రక్క-
నిర్విరామంగా కృషిచేయండి. నిస్వార్థంగా బ్రతకండంటూ కూడా చెబుతోంది. గుండె ఇరవై నాలుగ్గంటలూ కొట్టుకుండేలా కష్టపడమని మనకి చెబుతోంది.

అలాగే శరీరమంతటికీ వెళ్ళాల్సిన రక్తం తన గుండెకి వెళ్తున్నా గుండె ఒక్క చుక్క తీసుకోదు... అని అవయవాలకు కొన్ని రక్తనాళాల ద్వారా రక్త సరఫరా జరుగుతుంది. అలాగే గుండెకీ కరొనరి రక్తాల ద్వారా సరఫరా జరుగుతుంది.
  • గుండె జబ్బులు రాకుండా...
గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యవంతులు తీసుకోవలసిన ఆహారం గురించి ముందు మాట్లాడుకుందాం. ఫైబర్... అంటే పీచు పదార్థాలు తీసుకోవడంవల్ల కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకోవచ్చు. ఓట్స్, చిక్కుడు జాతి కూరగాయల్లో, అవిసె గింజల్లో, యాపిల్, సోయా గింజల్లో, కారట్, ఆకుకూరల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌లోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ని తగ్గిస్తాయి. మాంసం, పాల పదార్థాలలో శాచురేటెడ్ ఫాట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని బాగా తగ్గించాలి. మనం రోజువారీ తీసుకునే కేలరీస్‌లో ఇవి 10%కి మించరాదు. బిస్కట్లు, పేస్టీస్, చాక్‌లెట్, ఫ్రెంచి ఫ్రైస్‌లాంటి బేకరీ పదార్థాలలో ట్రాన్స్‌ఫాట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని తినకుండా ఉండడం మంచిది. నెయ్యి, వెన్న, డాల్డాలాంటి శాచురేటెడ్ ఫాట్స్‌ని బాగా తగ్గించి తీసుకోవాలి. ఉప్పుని కూడా బాగా తగ్గించి తీసుకోవాలి. చల్లని నీళ్ళలో ఉండే పాలోన్, పాల్‌డైన్ లాంటి చేపలు మంచివి.
  • గుండెకి మూలకణ చికిత్సలు
‘కార్డియా’ అనే గ్రీకు పదానికి ‘గుండె’ అని అర్థం. అందుకని కార్డియక్ అంటే గుండెకి సంబంధించిన అని అర్థం. ఇన్‌వాలంటరీగా పనిచేసే కండరాలతో పనిచేస్తుంటుంది కాబట్టి గుండె ఆగకుండా అలా కొట్టుకుంటుంది. మన శరీరంలో ఇలాంటి కండరాలు మరెక్కడా లేవు. గర్భంలోని శిశువుకు 21 రోజు వయసు వచ్చేసరికి గుండె ఏర్పడడమే కాదు, కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. గర్భంలో ఆడ, మగ గుండె కొట్టుకునే రేట్లలో తేడా ఉంటుంది.
మొదటి నెలలలో గర్భంలో శిశువు గుండె నిముషానికి 75నుంచి 80 సార్లు వరకు కొట్టుకుంటుంది. ఏడవ వారంలో నిముషానికి 165 నుంచి 185సార్లు కొట్టుకుంటుంది. అక్కడ నుంచి ప్రతి పది రోజులకు గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. 9.2 వారాలనుంచి గుండె కొట్టుకునే రేటు నిమిషానికి 150కి తగ్గుతుంది. క్రమంగా 15 వారాలకు గుండె కొట్టుకునే రేటు 145కు తగ్గుతుంది.  శిశువు గర్భంలో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలతో లోపాలుంటే తెలుసుకోవచ్చు. కొన్నింటిని గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకోవచ్చు. కవాటాల లోపాలు లాంటి వాటిని శిశువు చుట్టూవున్న మూల కణాల్ని తీసి, కావలసిన సంఖ్యకి లేబరేటరీలో పెంచి ఈ కవాటాన్ని కవాట లోపమున్న శిశువు జన్మించగానే అమర్చవచ్చు.
గుండె కండరాలు దెబ్బతింటే అదే వ్యక్తి బోన్‌మార్మోనుంచి మూలకణాలు తీసి లేబరేటరీలో కావలసిన సంఖ్యలోకి పెంచి, గుండె కండరాలలోకి ఎక్కించి,  కండరాల్ని బలమయ్యేట్టు చేయవచ్చు. ఈ చికిత్స ఫలితం కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు. కొంతే అభివృద్ధి చెందితే మళ్ళీ ఆ ప్రాంతంలో మూల కణాల్ని పంపి మరికొంత అభివృద్ధి కనిపించేట్టు చేయవచ్చు. ఎవరి మూలకణాల్ని వారికి ఎక్కిస్తారు కాబట్టి, రోగ నిరోధక మందుల్ని జీవితాంతం వాడాల్సిన పనిలేదు. మూల కణ చికిత్సని పునరుత్పత్తి వైద్యమంటారు. ఇది భవిష్యత్తులో బంగారంలాంటి చికిత్సగా భావిస్తారు.
  • గుండె భారం పెంచకండి
యాంజియో ఇంతకుముందు తొడలోని రక్తనాళాల ద్వారా చేసేవారు. తొడలోంచి చేయడంవల్ల రక్తస్రావం అధికంగా ఉండేది. ఒకరోజు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చేతి మణికట్టునుంచి రేడియల్ రక్తనాళం ద్వారా యాంజియో చేస్తున్నాం. రక్తస్రావం తక్కువ చేతినుంచి కాబట్టి త్వరగా పంపించి వేయడం జరుగుతోంది. ప్రతిరోజూ గుండె రక్తనాళాల ద్వారా రక్తాన్ని 90,000 కి.మీ దూరం నెడుతుంటుంది. ఒక ఎత్తునిబట్టి బరువుంటుంది. దీనిని బాడీమాస్ ఇండెక్స్ అంటారు.
బాడీమాస్ ఇండెక్స్= బరువు కిలోలలో/ ఎత్తు మీటర్లలో
బాడీ మాస్ ఇండెక్స్ 20నుంచి 25వరకు మామూలు బరువు. 25 నంచి 30 వరకు ఉంటే అధిక బరువు. 30నుంచి 35 వరకు స్థూలకాయం గ్రేడ్ 1, 35నుంచి 40 స్థూలకాయం గ్రేడ్ 2, 40కన్నా స్థూలకాయం గ్రేడ్ 3- మార్బడ్ ఒబేస్ అంటారు. ఉండాల్సిన దానికన్నా శరీర బరువు ఒక కిలో ఎక్కువ వుంటే గుండెకి రోజుకి 30 కి.మీ దూరం ఎక్కువ నెట్టాల్సిన భారం పడుతుంది. బరువు ఎక్కువైనకొద్దీ గుండె మీద పడే భారం ఎక్కువవుతుంది. అందుకని 
బరువుని అదుపులో ఉంచుకోవాలి. డయాబెటిస్‌లో నరాలు దెబ్బతింటాయి. అందుకని గుండె నొప్పి వచ్చినా తెలీదు. కాబట్టే డయాబెటిస్‌ని సైలెంట్ కిల్లర్ అంటారు. డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోవడం అవసరం.దవడ దగ్గర నుంచి బొడ్డువరకు ఎక్కడ నొప్పి వచ్చినా అనుమానం రావాలి. వెంటనే వైద్యుడికి  చూపించాలి. కార్డియక్ అరెస్ట్ అయితే, అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతే కార్డియో పల్మోనరి రిససిటేషన్ ప్రారంభించాలి. అంటే గుండె మీద ఒక చేత్తో మృదువుగా రాస్తూ, నోట్లో నోరుపెట్టి కృత్రిమ శ్వాసను కల్పిస్తూ, వెంటనే అవసరమైన చికిత్స అందేలా చూడాలి. ఆటోమేటెడ్ డిఫిబ్రిలేటర్ అందుబాటులో ఉంటే దాని సాయంతో డిఫిబ్రిలేషన్‌ని అందులో ఉంచవచ్చు.
  • గుండె జబ్బులున్నవాళ్ళ ఆహారం
తీసుకునే ఆహారంలో కొవ్వు 7%కి మించరాదు. రెడ్‌మీట్ పూర్తిగా మానేయాలి. మనం ఆహారంగా తీసుకునే జీవులలోని అవయవాలలో కొలెస్ట్రాల్ చాలా  ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినకూడదు. రొయ్యలు, పీతలు, గుడ్డులోని పచ్చ సొన, పాల పదార్థాలు లాంటి కొవ్వుని పెంచే పదార్థాల్ని పూర్తిగా మానేయాలి.
ఒమెగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా వున్న చేపలు, బాదం పప్పు, అక్రూట్, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు లాంటివి ఆహారంలో తగు మోతాదులో  ఉండేలా చూసుకోవాలి. కొలెస్ట్రాల్‌ని తగ్గించే ముడి ధాన్యాలు, దంపుడు బియ్యం, ఓట్స్, గోధుమలు, సోయా పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లి, మొక్కజొన్న,  చిక్కుడు, కేరట్ లాంటి కూరగాయలు; నారింజ, యాపిల్, బేరి, అరటి, అంజీర్, ఆప్రికాట్స్‌లాంటి పళ్ళు తీసుకోవడం మంచిది.
  • ========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Herpes Simples-హెర్పిస్‌ సింప్లెక్స్

  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Herpes Simples-హెర్పిస్‌ సింప్లెక్స్-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 



 హెర్పిస్‌ సింప్లెక్స్‌.. ఇది వైరస్‌ క్రిముల ద్వారా సంక్రమించే వ్యాధి. అంటువ్యాధి. పూర్తిగా నయం చెయ్యటం కష్టమే. వస్తూ పోతూ వుంటుంది. దీనికి హెర్పిస్‌ సింప్లెక్స్‌ వైరస్‌-1 మరియు హెర్పిస్‌ వైరస్‌-2 కారణాలుగా గుర్తించారు. అత్యధిక కేసులు హెర్పిస్‌ వైరస్‌-2 కారణంగా సంక్రమిస్తున్నట్లు నిర్ధారించడం జరిగింది. అయినా ఈ రెండు రకాల వైరస్‌ల మూలంగా నోరు, జననేంద్రియాలకు హెర్పిస్‌ సింప్లెక్స్‌ వ్యాధి సంక్రమిస్తున్నట్లు నిర్ధారించారు.

చర్మానికి చర్మం తాకినందువల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. చర్మం మీద ఎక్కడా గుల్లలు కనిపించని కేసుల ద్వారా కూడా ఇన్ఫెక్షన్‌ సంక్రమిస్తున్నట్లు గుర్తించారు. స్త్రీలలో యోని నుండి వెలువడే స్రావాలలో (పైన గుల్లలు(blisters) లేనప్పటికీ) వైరస్‌ క్రిములున్నట్లు కనుగొనడం జరిగింది.

ఈ హెర్పిస్‌ సింప్లెక్స్‌ తీవ్రమైన అంటువ్యాధి. ఈ వ్యాధి సోకిన స్త్రీలు గర్భవతులైతే వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. కాన్పు సమయంలో ఈ వ్యాధి- పుట్టే బిడ్డకు సంక్రమించే అవకాశముంది. ఈ వైరస్‌ సోకి పుట్టే బిడ్డలకు కంటిచూపు పోయే ప్రమాదముంది. మెదడు వాపు లాంటి వ్యాధులు సంక్రమించి శిశువు ప్రాణాలకూ ప్రమాదం రావచ్చు. కనుక వైద్యులు సిజేరియన్‌ ఆపరేషన్‌ ద్వారా కాన్పు చేసే విషయం ఆలోచించవలసి వుంటుంది. యోని చుట్టూ గుల్లలు లేని సందర్భంలో మాత్రం యోని ద్వారా కాన్పు చేయడం ఆలోచించవచ్చు.

హెర్పిస్‌ వైరస్‌ మెదడులోని నాడీ కణాలలో దాగి వుండి దేహరక్షణ వ్యవస్థకు తెలియకుండా నిద్రాణంగా ఉండిపోవచ్చు. మధ్యమధ్యలో ఈ క్రిములు విజృంభించి జననేంద్రియాల వద్ద గుల్లల(blisters)కు కారణమవుతుండొచ్చు. రోగనిరోధక వ్యవస్థ ఒత్తిళ్ళకు గురైన సందర్భంలో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ. అలాగే వ్యాధి మూలకంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడిన సందర్భంలోనూ వైరస్‌ క్రిములు విజృంభించొచ్చు.

మూతిమీద 'కోల్డ్‌ సోర్స్‌' ఉన్న వ్యక్తులను ముద్దాడడం ప్రమాదకరం. వారు వాడిన తువ్వాలు మొదలైన వాడిని వాడరాదు. వారితో సెక్స్‌లో పాల్గొనటం కూడా ప్రమాదకరమే. కండోమ్‌లు వాడినా ముప్పు పొంచే ఉంటుంది. ఎందుకంటే కండోమ్‌ వెలుపల ప్రదేశంలో ఇన్ఫెక్షన్‌తో కూడిన గుల్లలుండొచ్చు.

హెర్పిస్‌ వైరస్‌ వలన రెండు ఇతరత్రా ప్రమాదకర వ్యాధులు సంప్రాప్తించే అవకాశం ఉంది. ఇది ఉంటే ఎయిడ్స్‌కారక హెచ్‌ఐవీ తేలికగా సోకే అవకాశం ఉంది. మరొకటి హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌. దీనివల్ల  క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.


ఏటువంటి పరిస్థితులలో ఇది మళ్ళి మళ్ళీ కనిపించును :
  • సాధారణ అనారోగ్య సుస్థి చేసినప్పుడు ,
  • బాగా అలసటకు గురిచేసే వృత్తిపనులవారిలో(Fatigue),
  • అధిక శారీరక లేదా మానసిక శ్రమ ఉన్నపుడు ,
  • వ్యాధినిరోధక శక్తి తగ్గించే రోగాలు తో బాధపడుతున్నపుడు,
  • పొక్కులు లేదా గుళ్ళలు ప్రదేశములో రాపిడి కలిగినపుడు ,
  • బహిస్ట సమయాలలోనూ ఇది వ్యాపించే అవకాశమున్నది ,

  • లక్షణాలు లేదా సింప్టమ్‌స్ :
గుల్లలు లేదా పుల్లు - ఇవి మూతి చుట్టూ , జననేంద్రియాల చుట్టూ కనిపిస్తాయి .చాలా నొప్పితో ఉంటాయి. చిన్నగా జ్వరము , శరీరం నొప్పులు ఉంటాయి.
  • పరీక్షలు :
ఈ వ్యాధిని గుర్తించడానికి ఏ ల్యాబ్ పరీక్షలు అవసరము లేదు . పొక్కులు లేదా గుల్లలు (blisters) చూసి పోల్చ వచ్చును . సాధారణము గా Lab Tests ...DNA, - or PCR , virus culture మున్నగునవి చేస్తారు.
  •  చికిత్స :
చాలా మంది చికిత్స లేకుండానే మామూలు గానే తిరిగేస్తారు. పూర్తిగా ఈ వైరస్ ని శరీరమునుండి సమూలముగా లేకుండా చేయలేము .
యాంటి వైరల్ మందులు(antiviral drugs ) : ఉదా:  acyclovir and valacyclovir can reduce reactivation rates. Aloe Vera జెనిటల్ హెర్పీస్ లో కొంతవరకు పనిచేస్తున్నట్లు అదారాలు ఉన్నాయి.
నొప్పిగా ఉంటే ... tab. ultranac-p రోజుకి 2-3 మాత్రలు 5-7 రోజులు వాడాలి.
దురద , నుసి ఉంటే : tab . cetrazine 1-2 మాత్రలు 3-4 రోజులు వాడాలి.
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, 22 November 2012

Cardiomegaly-గుండె పెరిగితే ?



  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Cardiomegaly-గుండె పెరిగితే ?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 



మన గుండె ఒక పంప్‌ వంటిది. ఈ పంపు బలహీన మైనప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని పంప్‌ చేయలేదు. అంతేకాక వివిధ అవయవాలకు అవసరమైన పోషకాలు అందవు. ఈ పరిస్థితినే హార్ట్‌ఫెయిల్యూర్‌ అంటారు. ఒత్తిడి పెరిగినప్పుడు తాత్కాలికంగా గుండె విస్తరిస్తుంది. ముఖ్యంగా గర్భిణిగా ఉన్నప్పుడు, గుండె కండరాలు బలహీనమైనప్పుడు, కరొనరి ఆర్టిరి వ్యాధి వచ్చినప్పుడు, గుండె కవాటాల సమస్యలున్నప్పుడు, గుండె అసాధారణంగా కోట్టుకుంటున్నప్పుడు గుండె పెరుగుతుంది. కేవలం కొన్ని సందర్భాల్లో గుండె విస్తరించడాన్ని నివారించలేం కానీ, చాలా కేసుల్లో చికిత్స చేసే వీలుంది. గుండె విస్తరించడానికి కారణమయ్యే వాటిని దృష్టిలో పెట్టుకుని చికిత్స చేస్తారు. మందులు, అవసరమైతే శస్త్రచికిత్సతో కూడా వైద్యం చేస్తారు.


గుండె విస్తరించడాన్ని (హార్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌) వైద్యపరిభాషలో కార్డియోమెగలె అంటారు. ఇది వ్యాధి కాదు. ఇతర పరిస్థితికి చెందిన ఒక లక్షణం. ఛాతి ఎక్స్‌రే తీసినప్పుడు అందులో గుండె విస్తరించిందని వైద్యులు చెబుతుంటారు. ఆ తర్వాత ఇతర పరీక్షలు చేస్తారు. కొంత మందిలో గుండె విస్తరించినా ఎలాంటి లక్షణాలు, చిహ్నాలు కనిపించవు. కానీ కొంత మందిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి...శ్వాసక్రియలో సమస్యలు, కళ్లు తిరగడం, గుండె అసాధారణంగా కొట్టుకోవడం, వాపు (ఎడిమ), దగ్గు, ఛాతిలో నొప్పి. గుండె విస్తరించడాన్ని ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయడం సులభమవుతుంది. మీ గుండె ఆరోగ్యం గురించి మీకున్న ఆందోళనలను డాక్టర్‌తో పంచుకోండి. దీని వల్ల కలిగే పరిణామాలను ఎలా నివారించాలో చర్చించండి. పైన పేర్కొన్న లక్షణాలు, చిహ్నలు మీలో కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్యం చేయించడం తప్పనిసరి.

  • కారణాలు

గుండె విస్తరించడం వల్ల గుండె రక్తాన్ని పంప్‌ చేయడం కష్టమవుతుంది. లేదా గుండె కండరాలు దెబ్బతింటాయి. కొన్ని సార్లు గుండె విస్తరించడానికి ఎలాంటి కారణాలు ఉండకపోవచ్చు కూడా. గుండె విస్తరణతో సంబంధం ఉండే పరిస్థితులు...

అధిక రక్తపోటు : అధిక రక్తపోటు వల్ల గుండె రక్తాన్ని పంప్‌ చేయడం కష్టమవుతుంది. అంతేకాక గుండె విస్తరించడం, కండరాలు పలుచబడతాయి.

గుండె కవాటాల వ్యాధి : గుండెలోని నాలుగు కవాటాలు సరైన దిశలో రక్తం ప్రవహించడానికి తోడ్పడతాయి. రుమాటిక్‌ ఫీవర్‌, గుండెలో లోపం, ఇన్‌ఫెక్షన్లు (ఇన్‌ఫెక్టివ్‌ ఎండొకార్డైటిస్‌), కనెక్టివ్‌ టిష్యూ డిసార్డర్స్‌, ప్రత్యేక మందులు లేదా క్యాన్సర్‌ కోసం తీసుకున్న రేడియేషన్‌ చికిత్స వల్ల గుండె కవాటాలు దెబ్బతిని గుండె విస్తరించే అవకాశముంది.

కార్డియోమయోపతి : దీన్నే గుండె కండరాల జబ్బు అంటారు. అంటే గుండె కండరాలు పలుచబడటం, గట్టిపడటం. కార్డియోమయోపతి తొలి దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. పరిస్థితి తీవ్రమయ్యే కొద్దీ శరీరానికి రక్తాన్ని మరింత పంప్‌ చేయడానికి గుండె విస్తరిం చడానికి ప్రయత్నిస్తుంది.

గుండెపోటు : గుండె పోటు సమయంలో గుండె దెబ్బతిని గుండె విస్తరిస్తుంది. కొంత మందిలో పుట్టుకతోనే గుండెలో లోపాలు ఉండటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకా శాలున్నాయి. చాలా రకాల పుట్టుకతో కలిగే గుండెలో లోపాలు గుండె విస్తరణకు దారితీస్తాయి.

అసాధారణ హృదయ స్పందన : దీన్నే వైద్య పరిభాషలో అరిత్మియా అంటారు. అంటే ఈ పరిస్థితిలో గుండె రక్తాన్ని అంత సమర్థవంతంగా పంప్‌ చేయలేదు. రక్తాన్ని పంప్‌ చేయాలంటే గుండె అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇది గుండె విస్తరణకు దారితీస్తుంది.

పల్మనరీ హైపర్‌టెన్షన్‌ : గుండెకు, ఊపిరితిత్తులతో సంబంధం ఉండే ధమనుల్లోని అధిక రక్తపోటు కూడా గుండె విస్తరణకు కారణం అవుతుంది. దీన్నే పల్మనరీ హైపర్‌టెన్షన్‌ అంటారు. పల్మనరీ హైపర్‌టెన్షన్‌ ఉన్నప్పుడు ఊపిరితిత్తులు, గుండెలో ఉండే రక్తాన్ని తరలించడానికి గుండె కష్టంగా పంప్‌ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల గుండె కుడివైపు విస్తరిస్తుంది.

రక్తహీనత : తక్కువ ఎర్ర రక్తకణాల కౌంట్‌ను రక్తహీనత అంటారు. శరీరంలోని కణజాలాలకు అవసరమైన ఆక్సీజన్‌ను తీసుకెళ్లే ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు లేని పరిస్థితిని రక్తహీనత అంటారు. దీన్ని చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది దీర్ఘకాల రక్తహీనతగా మారి, గుండె కొట్టుకోవడంలో క్రమం తప్పడానికి దారితీస్తుంది. రక్తహీనత పరిస్థితి ఏర్పడినప్పుడు, రక్తంలో అవసరమైన ఆక్సీజన్‌ లేకపోవడం వల్ల గుండె మరింత రక్తాన్ని పంప్‌ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలంగా రక్తహీనత ఉండి, చికిత్స చేయించు కోకుంటే అరుదుగా గుండె విస్తరిస్తుంది.

థైరాయిడ్‌ : హైపర్‌ థైరాయి డిజం, హైపోథైరాయిడిజం గుండె విస్తరణతో సహా గుండె జబ్బులకు దారితీస్తాయి.

అధిక ఐరన్‌ : శరీరంలో ఎక్కువ ఐరన్‌ ఉండటాన్ని హిమోక్రొమటొసిస్‌ అంటారు. శరీరం సరిగ్గా ఐరన్‌ను జీవక్రియకు ఉపయోగించుకోకపోవడం. దీని వల్ల ఇది శరీరంలోని ఇతర అవయవాల్లో, గుండె కండరాల్లో నిర్మితమై ఉంటుంది. ఫలితంగా గుండె కండరం బలహీనమై ఎడమ జఠరిక విస్తరిస్తుంది.

అమిలొఇడొసిస్‌ : అరుదైన వ్యాధులు కూడా గుండె విస్తరణకు కారణం అవుతాయి. అందులో ఒకటి అమిలొఇడొసిస్‌. అంటే రక్తంలో అసాధారణంగా ప్రోటీన్లు ప్రవహించి, గుండెలో నిక్షిప్తమవుతాయి. దీంతో ఇవి గుండె పనితీరుకు అడ్డుపడతాయి. గుండెలో అమిలొఇడొసిస్‌ ఏర్పడితే గుండె విస్తరణకు దారితీస్తుంది.

ప్రమాద కారకాలు-ఉపద్రవాలు

అధిక రక్తపోటు, కార్డియోమయోపతి వంశపారంపర్యంగా ఉన్నా, గుండె ధమనుల్లో అడ్డంకులు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బు, గుండె కవాటాల వ్యాధి, గుండెపోటు వంటి వాటి వల్ల గుండె విస్తరించే ప్రమాదం వృద్ధి చెందే అవకాశముంది. గుండె విస్తరణ గుండెలో ఏ భాగంలో జరిగిందనే దాన్ని బట్టి, అంతర్గతంగా ఉన్న కారణాలను బట్టి ఈ ఉపద్రవాలుంటాయి.

హార్ట్‌ ఫెయిల్యూర్‌ : గుండె విస్తరణ, ఎడమ జఠరిక విస్తరణ వల్ల తీవ్ర పరిణామాలు కలుగుతాయి. అందులో హార్ట్‌ ఫెయిల్యూర్‌ ప్రమాదం అధికమవడం ఒకటి. శరీరానికి అవసరమైన రక్తాన్ని గుండె పంప్‌ చేయకపోవడం వల్ల కలిగే పరిస్థితి హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటారు. క్రమేణా గుండె కండరాలు బలహీనమవుతాయి.

రక్తంలో గడ్డలు : గుండె విస్తరించడం వల్ల గుండె పొరలో చిన్న రక్తం గడ్డలు ఏర్పడే అవకాశం ఎక్కువుంటుంది. ఒక వేళ రక్తం గడ్డలు గుండె నుండి బయటికి పంపింగ్‌ అయ్యి, రక్తప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశిస్తే, ఇవి శరరీంలోని కీలక అవయవాలకు రక్తం వెళ్లకుండా అడ్డుకుంటాయి. రక్తపు గడ్డలు గుండె ఎడమవైపు ఏర్పడితే, ముఖ్యంగా గుండె మెదడు ప్రభావితమై గుండెపోటు, పక్షవాతం వస్తాయి. రక్తం గడ్డలు గుండె కుడివైపున ఏర్పడితే, ఇవి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. దీని వల్ల ప్రమాదకరమైన పల్మనరీ ఎంబొలిజం అనే పరిస్థితి ఏర్పడుతుంది.

గుండె గొణుగుడు : దీన్నే హార్ట్‌ మర్మర్‌ అంటారు. గుండె విస్తరణ ఉన్న వారిలో, నాలుగు కవాటాల్లో రెండు కవాటాలు (మైట్రల్‌, ట్రైకప్సిడ్‌ కవాటాలు) సరిగ్గా మూసుకోవు. ఇవి ఉబ్బడమే కారణం. ఇలా రక్తం వెనక్కి రావడంతో కొన్ని శబ్దాలు వస్తాయి. వీటినే హార్ట్‌ మర్మర్‌ అంటారు. అయితే, గుండె గొణుగుడు ప్రమాదకరమైనవి కాకపోయినా, వైద్యున్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

కార్డియాక్‌ అరెస్ట్‌ : కొన్ని రూపాల్లో ఉండే గుండె విస్తరణ గుండె కొట్టుకునే లయ వ్యవస్థపై ప్రభావం చూపి అంతరాయం కలిగిస్తుంది. అసాధారణ గుండె లయల వల్ల శోష వచ్చి పడిపోవడం, కొన్నిసార్లు కార్డియాక్‌ అరెస్ట్‌ లేదా సడన్‌ డెత్‌ సంభవించొచ్చు.

  • నిర్ధారణ పరీక్షలు

గుండె, ఊపిరితిత్తుల పరిస్థితిని తెలుసుకోవడానికి ఛాతి-ఎక్స్‌రే చిత్రాలు ఉపయోగపడతాయి. ఒక వేళ గుండె విస్తరించి ఉంటే, ఛాతి ఎక్స్‌రే ద్వారా దాన్ని తెలుసుకునే వీలుంది. దీనికి గల ప్రత్యేక కారణాలు తెలుసుకోవడానికి ఇతర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎకోకార్డియోగ్రాం పరీక్ష చేస్తారు. ఇందులో ధ్వని తరంగాలను ఉపయోగించి గుండె వీడియో చిత్రాలను రూపొందిస్తారు. ఈ పరీక్షలో గుండెలోని అన్ని గదులను విశ్లేషిస్తారు. గుండె ఏమైన భిన్నంగా పంపింగ్‌ చేస్తుందా ? అని గుండె కవాటాలను అంచనా వేయవచ్చు. అంతేకాక ఇంతకు ముందు వచ్చిన గుండెపోటుకు సంబంధించిన ఆధారాలను, పుట్టుకతో గుండె జబ్బును కూడా గుర్తించే వీలుంది. శారీరక శ్రమ చేస్తున్నప్పుడు, వ్యాయామం గుండె ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్ట్రెస్‌ టెస్ట్‌ చేస్తారు. మిగతా సమయాల్లో కన్నా గుండె వ్యాయామం చేస్తున్నప్పుడు వేగంగా రక్తాన్ని పంప్‌ చేస్తుంది. ఈ పరీక్షనే ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ అని అంటారు. ఈ పరీక్షల తర్వాత అవసరాన్ని బట్టి సిటి స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌ చేస్తారు.


  • జీవనశైలిలో మార్పులు

ఇంట్లో తీసుకునే జాగ్రత్తల వల్ల గుండె విస్తరణను నయం చేయడం వీలుకాదు. కానీ మీ పరిస్థితిని మెరుగు పరుచుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోవాలి. అవి...ధూమపానం మానాలి. అధిక బరువు ఉంటే తగ్గాలి. తక్కువ ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులైతే నియంత్రించుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. వైద్యునితో సంప్రదించిన తర్వాత నిరాడంబరమైన వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్‌ శాతం తగ్గించుకోవాలి. కనీసం రాత్రిపూట 8 గంటలు నిద్రపోవాలి.

మందులు- అత్యాధునిక వైద్యం

చాలా కేసుల్లో ఇప్పుడు అత్యాధునిక మందులు, వైద్య చికిత్సల వల్ల గుండె విస్తరణను నయం చేసే అవకాశముంది. కేవలం కొన్ని కేసుల్లో మాత్రమే గుండె విస్తరణను నివారించలేం. కొన్ని రకాల మందులతో గుండె పెరగడాన్ని తగ్గించొచ్చు కూడా. గుండె పెరిగితే కొత్త వైద్య చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. జబ్బును గుర్తించి నివారిస్తే, గుండె పెరగడాన్ని నివారించే వీలుంది. కార్డియోమయోపతి, ఇతర గుండె జబ్బులను ముందుగానే గుర్తిస్తే, జబ్బు ముదరకుండా చికిత్స చేయవచ్చు. గుండె విస్తరణకు కారణమయ్యే ధమనుల వ్యాధి, ధూమపానం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం వంటివి నియంత్రించడం వల్ల గుండె విస్తరణను, హార్ట్‌ఫెయిల్యూర్‌ను తగ్గించే వీలుంది. ఫలితంగా గుండెపోటు కూడా తగ్గే అవకాశముంది. గుండె పంపింగ్‌ వ్యవస్థను మెరుగు పరిచే మందులు అందుబాటులో ఉన్నాయి. హార్ట్‌ రిలాక్స్‌ కోసం కూడా మందులున్నాయి. ఒంట్లో చేరిన నీటి శాతాన్ని తగ్గించడానికి మందులున్నాయి. ఒంట్లో నీరు చేరిన వారు లీటరు నుంచి లీటరున్నర నీళ్లు తగ్గించి తాగాలి. చికిత్సలో భాగంగా పేస్‌ మేకర్‌ను అమరుస్తారు. కవాటంలో సమస్య వల్ల గుండె పెరిగితే, సర్జరీ చేసి కృత్రిమ కవాటాన్ని అమరుస్తారు. కరొనరి బైపాస్‌ సర్జరీ, లెఫ్ట్‌ వెంట్రికల్‌ అసిస్ట్‌ డివైజ్‌తో చికిత్స చేస్తారు.


Courtesy with : డాక్టర్‌ ఎన్‌ వి రాయుడు-సీనియర్‌ కార్డియాలజిస్ట్‌,కేర్‌ హాస్పిటల్‌, నాంపల్లి @Prajasakti Telugu news paper_రక్ష డెస్క్ 10 Sep 2012.

  • ===========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Toxic fevers - విషజ్వరాలు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Toxic fevers - విషజ్వరాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


జ్వరము ఒక వ్యాది కాదు . ఏదైనా జబ్బు యొక్క లక్షణాలలో ఒకటిగా... శరీర ఉష్ణోగ్రత పెరగడము . పారిశుద్ధ్య లోపమే ఈ విష జ్వరాల దురవస్థకు ప్రధాన కారణం. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా చెత్తపేరుకుపోతోంది. మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఫలితంగా వాతావరణం కలుషితమై, దోమలు ప్రబలి, వ్యాధి బాధలతో ప్రజలు పడకేస్తున్నారు. పల్లె ప్రాంతాలలో ఆరుబయట బహిర్భూమికి వెళ్ళడము అనేక నీటి కాలుష్య జ్వరాలకు కారణము అవుతుంది.

కొన్ని విషజ్వరాలు
-- కొన్ని బాక్టీరియా విష జ్వరాలు
మలేరియా ,
టైఫాయిడ్‌,
ఫైలేరియా ,

-- అన్ని వైరల్ జ్వారాలు విషజ్వరాలే .. ఉదాహరణకు కొన్ని ->
డెంగీ,
స్వైన్‌ఫ్లూ,
చికన్‌గన్యా,
ఫ్లూ ఫీవర్ ,
ఎల్లో ఫీవర్ ,
మెదడు వాపు,
బర్డ్ ఫ్లూ,


  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Nine new principles for good health-మంచి ఆరోగ్యానికి నవ నవీన సూత్రాలు


  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మంచి ఆరోగ్యానికి నవ నవీన సూత్రాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 
  :

One principles for good health-మంచి ఆరోగ్యానికి ఒకే ఒక సూత్రము .
1 . ఈర్ష్య- ద్వేషాలు లేకుండుట ( జీవితము ప్రశాంతముగా  మనసులో కుళ్ళు కపటము లేకుండుట) ,

Two principles for life long fitness- జీవితాంతము ఫిట్ గా ఉండడానికి రెంటు సూత్రాలు :
1 . రోజూ క్రమము తప్పకుండా పగలు వ్యాయామము (exercise) చేయుట .
2 . రోజూ క్రమము తప్పకుండా రాత్రి  సురక్షిత సంభోగము (sexercise) చేయుట .

Three principles for Feel-good-రోజంతా హుసారుగా , ఆనందముగా ఉండేందుకు మూడు సూత్రాలు :
1 . నిద్ర : ఎంత నిద్ర అవసరమో ముందుగా గుర్తుంచుకోవాలి . అందరికీ ఒకే గంటల నిద్ర సూత్రము వర్తించదు . ఒక్కోసారి ఒకే వ్యక్తికి నిద్రకు సంబందించిన తేడాలూ ఉందొచ్చు . నిద్రపోయే సమయము , సహజము గా లేచే సమయము నోట్ చేసుకోవాలి . ఇలా కనీసము ఓ వారం చేయాలి. అప్పుడు రాత్రి వేళ సగటునిద్ర సమయము తెలుస్తుంది. ఆ సగటు సమయమే శరీరానికి కావాలి . సారీరక సహజనిద్ర ప్రకక్రియ పట్ల అవగాహన ఉండాలిం.
2 . పానీయాలు : శరీరం లో నీటి కొరత ఏర్పడితే మాడ్ మారిపోతుంది. ఓ రెండు రోజులపాటు తాగే నీటిపై కన్నేయాలి . పానీయాలు ఆరొగ్యవంతమైనవి కావాలి. అలా అని అవసరం మించిన  దానికంటే ఎక్కువ నీరు తాగితే శారీరకవ్యవస్థ నుండి  ప్రధాన లవణాలు వెలికి వెళ్ళిపోయే  అవకాశం ఉంటుంది. రోజుకు 1.5 నుండు 2.0 లీటర్ల పానీయాలు సగటు మోతాదు.
3 . కదలిక & విశ్త్ర్రాంతి  : ఎప్పుడు అదేపనిగా కదలకుండా ఏపనీ చేయకూడదు . పనినో ప్రతి గంటకు ఓ 5 నిముషాలు రిలాక్షేషన్‌ అవసరము . ఉదయమా ? సాయంత్రమా? అన్న సంగతి ప్రక్కన పెడితే రెగ్యులర్ శారీరక వ్యాయామము మెదడుకు(మనసుకూ), శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. వ్యాయామము ఏదైనా .. వారి వారి వృత్తులకు సరిపడే సరియైన విధముగా ఉండాలి. నడక , సైక్లింగ్ , స్విమ్మింగ్ , ఆటలు మున్నగునవి . నలుగురితో పిచ్చాపాటి కాలక్షేప కబుర్లు కోసము కొంతసమయము కేటాయించాలి.

4-principles to getrid off cold and sinus-జలుబు, సైనస్‌లను వదిలించుకునేందుకు 4-చిన్న సూత్రాలు.

నేటి గజిబిజి పరుగుల జీవితంలో మానవుడు సవాలక్ష రోగాలతో సతమతమవుతుండగా ఎక్కువగా శ్వాస సంబంధిత వ్యాధులతో భాదపడుతున్నాడు. కారణం వాతావరణ కాలుష్యం ఒకటయితే మిగిలినవి అనేకం. ప్రతిగా తరచుగా జలుబు, సైనస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. వీటిని చిన్న చిన్న సూత్రాలతో క్రమంగా తగ్గించుకోవచ్చును .
1. తడిగా ఉన్న తలతో ఫ్యాన్ కింద కూర్చోవడం, వాహనాలలో ప్రయాణించేటపుడు ముక్కుకు కాటన్ వస్త్రాన్ని కట్టుకోవడము చేయండి.
2. ప్రతిరోజు పది నిమిషాల పాటు సూర్య కిరణాలు మీపై పడేలా కూర్చోండి.
3. బయట ఆహార పదార్ధాలు తింటే ఓ గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగండి.
4. నిద్ర పోయేప్పుడు మీ తలను పూర్తిగా కప్పుకోండి.

Five Principles for Perfect beauty-మంచి ముఖారవిందానికి  పంచ సూత్రాలు .
    1.నారింజ తొక్కలను నీడలో ఆరబెట్టి, పొడి చేసి నీటితో కలిపి ముఖానికి రాస్తే, మొటిమలు, జిడ్డుకారడం తగ్గుతాయి.
 2.పళ్ళు శుభ్రంగా తెల్లగా ఉండాలంటే వాటిని టేబుల్‌సాల్ట్‌తో కానీ, బేకింగ్‌ సొడాతో కానీ తోముకోవాలి.
  3.  గాలి తగిలేలా మూడు రోజులు (పులిసిన) నిల్వ ఉంచిన పెరుగును తలకి బాగా మర్దన చేసి కొన్ని నిమిషాల తరువాత స్నానం చేస్తే చుండ్రు పోతుంది.
 4.జిడ్డుగా ఉన్న ముఖానికి ఆపిల్‌ గుజ్జును పట్టించి పావుగంట తరువాత కడుక్కుంటే జిడ్డు ఒదిలి బుగ్గలు ఆపిల్‌ పళ్ళలా తయారవుతాయి.
   5. వేయించిన పదార్థాల కంటే ఉడికించిన పదార్థాలు తేలికగా జీర్ణమవుతాయి. శరీరం లావెక్కదు కూడా , మంచి శరీరక అందము పొందుతారు .

Six Diet Tips for Fitness Secret-ఆరు-ఆహార  ఫిట్ నెస్ సీక్రెట్స్ :
 ఎవరైనా స్లిమ్ గా, ఫిట్ గా ఉండేందుకు 6 సూత్రాలు పాటించాలంటుంది. నిజానికి ది చాలా సింపుల్. ముందుగా చేయాల్సిందల్లా
1 . రాత్రి భోజనం ఏడు నుండి ఎనిమిది గంటలోపే ముగించేసేయాలి. రాత్రి వేళ శారీరక జీవక్రియ నెమ్మదిస్తుంది. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు. యుఎస్ లో ప్రజలు చాలా త్వరగా డిన్నర్ చేసేస్తారు. ఇండియాలో ప్రజలు రాత్రి తొమ్మిది గంటలయితే కానీ భోజనం చేయరు.
2 . రెండో సీక్రెట్- ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏడు నుండి ఎనిమిదిలోపే తినేయాలి. అప్పుడు శారీరక మెటబాలిజం ఊపు అందుకుంటుంది. దాంతో రోజంతా హుషారుగా ఉండేందుకు జీవక్రియ బాగా పనిచేస్తుంది. ఉదయం ఎంత త్వరగా ఎంత ఎక్కువ మోతాదులో బ్రేక్ ఫాస్ట్ ముగిస్తే అంత మంచిది.
3 . మూడో సీక్రెట్ -మంచినీళ్ళు వీలయినంత ఎక్కువగా తాగడం. నీళ్ళు తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావించడం సరికాదు. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలన్నీ వెలికి వెళ్ళిపోతాయి. రోజుకు కనీసం మూడు లీటర్ల నీటినైనా తాగుతుండాలి.
4 . అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని, ఆత్మ విశ్వాసము మానసిక అనారోగ్యాన్ని రానీయదు . అందము కోసము తాజా పండ్లు తినాలి . ఫ్యాషన్‌లో అందం కూడా భాగమేనన్నారు. అందం రెట్టింపుకోసం బ్యూటీ సెలూన్స్‌ ఎంతో ఉపయోగమన్నారు.
5.  పాలు , విటమిన్‌ డి3 ఉన్న ఆహారపదార్ధాలు ఎక్కువగా తినాలి. విటమిన్‌ డి3 గుండె జబ్బులు, మదుమేహము , రక్తపోTu  నివారించడము లేదా రాకుండా కాపాడుతుంది.
6. ఒమేగా3 ఫాటీయాసిడ్స్ కోసము  సముద్ర చేపలు , లైకొఫిన్‌ కోసము టమాటోలు రెగ్యులర్ గా తీసుకోవాలి. విటిమిన్లు, ఖనిజలవనాలకోసం  ఆకుకూరలు తినాలి.


Seven Principles Happy Living -ఆహ్లాదకర జీవితానికి ఏడు సూత్రాలు.
మనకు ఎంత ఐశ్వర్యం వుంది? నెల తిరిగేటప్పటికి ఎంత ఆదాయం వస్తుంది ? అనేవి కాదు ముఖ్యం. మనం ఎంత ఆరోగ్యంగా, ఎంత నాజూకుగా ఉన్నామనేది ఆరోగ్యాన్ని పొందటంలో కల రహస్యం. మన ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది ఆహారం. ఆహారం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి దినం వ్యాయమం చేస్తూ వుంటే బంగారం లాంటి జీవనం మన సొంతం అవుతుంది. అందుకోసం నిపుణులు సూచిస్తున్న మార్గాలు చూడండి.
1. ప్రతి రోజు మూడు పూటలా కొద్ది మోతాదులో అవసరం మేరకే ఆహారం తీసుకోవాలంటున్నారు.రోజుకు రెండు సార్లు లేదా మూడు సార్లు భోజనం చేయడంతో పాటు డ్రై ఫ్రూట్స్ లేక తాజా పండ్లు లేక ఉడక పెట్టని కూరగాయలు స్నాక్స్ గా తీసుకోవాలని తెలుపుతున్నారు.
2. ఆహారంలో రోజుకు కనీసం 500 గ్రాముల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. ఇందులో రెండు నుంచి నాలుగు తాజా పండ్లు ఉండాలి. పెసలు, శనగలు, మొదలగు తృణ ధాన్యాలతోపాటు పెరుగు, ఫ్రూట్ సలాడ్లను కూడా తీసుకోవచ్చు.
3. ఆహారంలో పీచు పదార్ధాలు అధికంగా వుండేలా చూసుకోండి. దీని వలన రోజంతా మీరు శక్తివంతంగా ఉండగలుగుతారు. పీచు పదార్ధాలు తీసుకోకుండా వుంటే మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. నూనెలో వేయించిన ఆహార పదార్ధాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
4. కొవ్వు చేరని ఆహార పదార్ధాలు తీసుకోండి. 100 గ్రాముల పాల ఉత్పత్తులలో మూడు గ్రాముల కొవ్వు ఉంటుంది. అందువల్ల కొవ్వు తక్కువ ఉన్న పాల పదార్ధాలతో పాటు స్కిన్ లేని చికెన్ లాంటివి తీసుకుంటే మంచిది.
5. మాంసాహారులయితే, వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు చేపలు తీసుకోండి. శాకాహారులు చిరుధాన్యాలు అధికంగా తీసుకోవచ్చు. దీనికి మించిన పోషకాహారం మరోటి లేదని కూడా చెప్పవచ్చు.
6. మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు, చక్కెర అతి తక్కువగా ఉండేలా చూడండి. సోడియం రోజుకు 2,300 మిల్లీగ్రాములు అంటే ఒక టీ స్పూన్ కు మించకుండా వుండేలా జాగ్రత్త పడండి. ఉప్పు అధికంగా వుండే పదార్ధాలు తినకపోవడం మంచిది.
7. అన్నిటిని మించి ప్రతి దినం ఒక గంట పాటు శారీరక వ్యాయామం చేయాలి.
పైన తెలిపిన పనులన్నీ చేయడం ద్వారా ఏ వయసు వారైనా సరే, రోజంతా చురుగ్గా ఉండటమే కాక నాజూకుగా, ఆరోగ్యంగా తిరుగుతూ అందరిని ఆశ్చర్య పరచవచ్చు.

8(Eight) Ayurvedhic principles for health-ఆరోగ్యానికి ఎనిమిది ఆయుర్వేధ  సూత్రాలు:
  మన ఆయుర్వేధ మహర్షులు ఎన్నో సంవత్సరాలు ఎన్నో పరిశోధనలు జరిపి క్రింద తెలుపబడిన ఆరోగ్య సూత్రాలను మానవులకు ఉపయోగకరం అని మన ఆయుర్వేధ గ్రంధాలలో పేర్కొన్నారు.  ఎవరైతే ఈ ఆయుర్వేధం తెలుపబడిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తారో వారు ఎల్లపుడూ అనారోగ్యం బారిన పడకుండా నిత్య ఆరోగ్య వంతులుగా ఉంటారు.
1 . తెల్లవారు జామున లేవడం ,
2 . వ్యాయామాలు చేయడం ,
3 . అబ్యంగా స్నానం ,
4 . మితాహారం సేవన ,
5 . పగలు నిధ్రపోకుండుట ,
6 . రాత్రి జాగరణ చేయకుండుట ,
7. చల్నీటి స్నానము ,
8 . తీపి , ఉప్పు ,కారము మితముగా తినడము .
 మొదలగు వాటివని పాటించుటవలన వ్యాధులు రాకుండా నివారించవచ్చు.

9 Best Easy Ways Lose Weight-సన్నగా... నాజూకుగా తయారవ్వడానికి 9 సూత్రాలు:
సన్నగా నాజూకుగా ఉండాలని ప్రతి ఆడపిల్ల కలలు కంటూ వుంటుంది. దాని కోసం పడరాని పాట్లన్నీ పడుతుంటుంది. అయితే మనం తినే ఆహార పదార్థాలలో చిన్న చిన్న మార్పుల ద్వారా సన్నగా ట్రిమ్గా తయారవ్వచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి తీసుకునే డిన్నరు వరకూ ఆహారంలో కొవ్వు తగ్గించుకుంటే సన్నబడడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది... అవేమిటంటే...
1 . జీవన విధానంలో మార్పు: ఫాస్ట్ ఫుడ్ అభివృద్ది చెందిన తర్వాత పిజ్జాలు, బర్గర్లపై మోజు ఎక్కువైపోయింది. దీనికి తోడు ప్రతి సెంటర్లోనూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు దర్శనమిస్తున్నాయి. అందమైన ప్యాకింగులలో నోరూరిస్తుంటే వాటిని తినకుండా వుండలేకపోతున్నారు యువతరం. ఫాస్ట్ ఫుడ్ అప్పటికప్పుడు కడపునింపినా వాటిల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది.
2 . ఆహారంలో మార్పులు : రోజు మొత్తంలో తీసుకునే ఆహారంలో నూనె, నెయ్యి వాడకం తగ్గించాలి. ఇవి రెండూ లేకుండా చేసిన ఆహారం అయితే మరీ మంచిది. అంటే ఉడికించిన కూరగాయలు, నూనె తక్కువగా వేసి చేసిన ఆకు కూరలు అయితే తేలికగా జీర్ణం కావడంతో పాటు పోషకవిలువలు పుష్కలంగా లభిస్తాయి. ప్రకటనలు చూసి మోసపోవద్దు -టీవిలలో, పేపర్లలో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దు. కంటికి పైన రంగుల్లో ఆకర్షనీయమైన ప్యాక్ లలో కనువిందు చేసే ఆహారపదార్థాలు  నోరూరించినా వాటిల్లో పోషక విలువలు ఏమాత్రం లేకపోగా ఆరోగ్యానికి హానిచేసే కొవ్వు అధికంగా వుంటుంది. చూసిన ప్రతిదానిని తినాలనుకోవడం మానుకోవాలి.
3 . వ్యాయామం : వాకింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, తోటపని ఇవన్నీ ఆడవారు చేయగలిగే వ్యాయామాలు. వీటిల్లో వాకింగ్ కోసమే బయటకు వెళ్లాలి. మిగతా మూడు ఇంట్లో వుండి చేసుకునే ఎక్సర్ సైజులు. మూడింటిని చేయలేకపోయినా ఏదో ఒకటి చేసినా మంచి ఫలితం ఉంటుంది.
4 . టీవిలకు దూరంగా వుండండి : అన్నం తినేటప్పుడు టీవి చూడడం చాలా మందికి అలవాటు. అసలు అన్న తినేటప్పుడు పుస్తకాలు చదవడం, పేపరు చదవడం లాంటివి మానుకోవాలి. తినే సమయంలో ఇలాంటి పనులు చేస్తుంటే ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తారు.
5 . తాజా కూరగాయలు, పళ్లు : ఫ్రిజ్ లో నిల్వ వుంచిన కూరగాయలకన్నా తాజా కూడరగాయలు మంచివి. రోజు మొత్తం మీద ఐదు రకాల కూరగాయలు, పళ్లు తీసుకుంటే కొవ్వు అనేది మీ దరిచేరదు. వైద్యుడి అవసరం రాదు.
6 . డ్రస్సులు : మనం వేసుకునే డ్రస్సులు కూడా ఊబకాయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. లావుగా వున్న వారు మరీ బిగుతుగా ఉండే దుస్తులకన్నా కొద్దిగా వదులుగా వుండేవాటిని  ధరిస్తే లావుగా కనపడరు. వీరికి చిన్న చిన్న డిజైన్లు బాగా నప్పుతాయి.
7 . ఆహారాన్ని విభజించండి : రోజు మొత్తం మీద తీసుకునే ఆహారాన్ని ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ గా విభజించుకోవాలి. ఆహారాన్ని కొద్ది కొద్దిగా నాలుగైదుసార్లు  తీసుకోవడం వల్ల ఊబకాయం రాకుండా జాగ్రత్త పడచ్చు.
8 . అధిక క్యాలరీలు అనర్ధం : ప్యాకెట్లులో లభించే ఆహారపదార్థాలలో క్యాలరీలు అధికంగా వుంటాయి. పోషకవిలువలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ వున్న వాటినే ఎంచుకోవాలి. కొనుగోలు  చేసే పదార్థాలలో ఎన్ని క్యాలరీలు వున్నాయో చూసుకొని మరీ కొనడం మంచిది.. రంగుని చూసి మోసపోవద్దు : వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆహార పదార్థాలను ఆకర్షనీయమైన రంగులు, ప్యాకెట్లలో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు  ఉత్పత్తిదారులు. వీటి హంగు రంగు చూసి మోసపోవద్దని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు.
9 . నవ్వు మంచిదే : నవ్వు నాలుగు విధాల చేటు అంటారు. కానీ నవ్వు చాలా రకాలుగా మంచిదని నిపుణుల అభిప్రాయం. రోజు మొత్తం మీద కొన్ని నిమిషాల పాటు నవ్వగలిగితే దానికి మించిన వ్యాయామం మరొకటి వుండదు. రోజుకి 15నిమిషాల పాటు హాయిగా నవ్వుతుంటే సంవత్సరంలోపు రెండు కిలోల బరువు తగ్గవచ్చు.


  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, 21 November 2012

Rhematic Fever - రుమాటిక్‌ ఫీవర్‌


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Rhematic Fever - రుమాటిక్‌ ఫీవర్‌ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కీళ్ళ వాత రోగి జ్వరాన్నే రుమాటిక్‌ ఫీవర్‌గా పిలుస్తాం. చిన్న పిల్లలనూ, ముఖ్యంగా యవ్వనంలో అడుగుపెడుతున్న వారికీ సాధారణంగా ఈ వ్యాధి వస్తుంటుంది. విపరీతమైన జ్వరం వస్తుంది. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. గొంతులో నొప్పి కలుగుతుంది. ఊపిరి తీసుకుంటే నొప్పిగా ఉంటుంది. కాళ్ళూ చేతుల కదలికలు పట్టు తప్పినట్లుగా అనిపిస్తుంది. స్వాధీనంలో ఉండవు. ఎక్కువ రోజులపాటు ఉండే ఈ జ్వరాన్ని అశ్రద్ధ చేయడం మంచిదికాదు.


చాలామంది పిల్లలు రుమాటిక్‌ జ్వరం బారినపడి, సరియైన చికిత్స లేక గుండె వాల్వ్‌ దెబ్బతినటంతో ఎంతో బాధ పడుతున్నారు. మనదేశంలో ప్రతి ఏడాదీ లక్షలాది మంది పిల్లలు ఈ రోగం బారిన పడుతున్నారు. వారి గుండె వాల్వ్‌పాడై పోతోంది. దీని చికిత్స్‌ ఆపరేషన్‌ కూడా ఖర్చుతో కూడుకున్నదే. అసలీ రోగానికి కారణం తెలీదు. హిమో లైటిక్‌ స్రెఎ్టో కోకై (Haemolytic Strepto Coci) అనే జీవాణువుల ద్వారా వ్యాపిస్తుంది. గొంతు భాగం, టానిల్స్‌ నెప్పి మంట, మూడు వారాల తర్వాత జ్వరం, కీళ్లనొప్పి మొదలుతుంది. దగ్గుతుమ్ము వల్ల ఈ రోగం ఒక పిల్లాడినించి ఇంకో పిల్లకి పాకుతుంది. తేమ, మురికి ప్రాంతాల్లో త్వరగా వ్యాప్తిస్తుంది. వెంటనే చికిత్స చేయాలి. కీళ్లు త్వరగా శరీర భాగాలను కదలనీయవు. ఇలా ముట్టుకుంటే చాలు తెగనెప్పి బాధ. రోగికి బాగా చెమటలు పట్టడం గుండె వేగంగా కొట్టుకోటం జరుగుతుంది. రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌తో ప్రాణం పోవచ్చు. ఎలక్ట్రో కార్డియో గ్రామ్‌ ద్వారా జబ్బు తీవ్రతను కనుక్కోవచ్చు. గుండెవాల్వ్‌ కనక దెబ్బతింటే ఆపరేషన్‌ చేయక తప్పదు. వాల్వ్‌ది మార్చాల్సిన పరిస్థితి రావచ్చు. మనకు పుట్టపర్తిలో ఈ ఆపరేషన్‌ సౌకర్యం ఉంది. ఈ రోగంరాగానే బెడ్‌ పై పూర్తి విశ్రాంతి తీసుకుని తీరాలి. డాక్టర్లు యాంటీ బయోటిక్‌ వాడతారు. పిల్లలకి ఈ వ్యాధి వస్తే వారికి 20వ ఏడువచ్చే దాకా జాగ్రత్తలు, వైద్యం తప్పని సరి సుమా.

వ్యాధి నిర్ధారణ :
  • elevated or rising antistreptolysin O titre or DNAase . మూలంగా మరియుఈ క్రింది గురుతులు ఉన్నదానిని  బట్టి నిర్ణయిస్తారు .
  • పోలి ఆర్థ్రైటిస్ (polyarthritis): కీళ్ళ కీళ్ళ కి మారే గుణమున్న కీళ్ళ నొప్పుల వ్యాధి .
  • కార్డైటిస్ (carditis) :  గుండె శోదము (ఇంఫ్లమేషన్‌) ఉండడము వలన - congestive heart failure with shortness of breath, pericarditis with a rub, or a new heart murmur. ఉండటాన్ని బట్టి .
  • సబ్ కుటేనియస్ నాడ్యూల్స్ (subcutaneous nodules): ఎముకలమీద , టెండాన్ల మీద నొప్పిలేని కణుపులు.
  • Erythema marginatum-- చర్మము పై ఎర్రని రాష్ (reddish rash)
  • Sydenham's chorea -- ముఖము ,చేతులు ఓ విధమైన వణుకు .
  • fever -- జ్వరము రావడము ,
  • Arthralgia-- కీళ్ళ నొఫ్ఫులు .
  • Raised ESR,-- రక్త పరీక్షలో ఇ.యస్.ఆర్ .. ఎక్కువగా ఉండడము ,
  • ECG -prolonged PR interval, ఇ.సి.జి. తీసినచో కనిపించును .
  • Leukocytosis: :-- తెల్ల రక్తకణాలు ఎక్కువగా ఉండును .
  • Abdominal pain : అప్పుడప్పుడు కడుపు నొప్పి ,
  • Nose bleeds : ముక్కు నుండి రక్తం కారడము ,
  • positive Throat culture:-- గొంగు రసాలు నుండి తీసిన స్వాబ్ పరీక్ష.
చికిత్స : 
వై్ద్యుల సహాయ , సలహా తోనే మందులు వాడాలి . ముఖ్యము గా 
  • Aspirin ,
  • corticosteroids , 
  • Antibiotics- pencillins , sulfadiazine , erythromycin  ,  మున్నగునవి .వాడుతారు.
  • Vaccine : దీనికి టీకా మందు కూడా వాడుకలోనున్నది .

  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/