Tuesday, 20 December 2011

నపుంసకత్వం (సెక్స్ సమస్య), Male impotence



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నపుంసకత్వం (సెక్స్ సమస్య), Male impotence- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



నపుంసకత్వం పురుషులలో అంగస్తంభన లోపము వలన కలిగే వ్యాధి. యుక్తవయసులో ఎలాంటి అనారోగ్య లక్షణములు లేకుండా రతి కార్యములో విఫలమవడము లేదా అంగము పూర్తిగా స్థంభించకపోవడము లేదా పాక్షికముగా స్థంభించడము. . ఇది పలు కారణాల వలన కలుగవచ్చు. ఈ రుగ్మతను వ్యాధిగా గుర్తించి చికిత్స కోసము ప్రయత్నించడము ఇస్లామీయ వైద్యులు- కాలములో మొదటగా జరిగినది. వీరు ఈ వ్యాధినివారణ కొరకు మూలికా వైద్యము చేసేవారు. ఆధునిక యుగములో 1920 లో డాక్టర్ జాన్.ఆర్.బ్రింక్లే సరికొత్త పరీక్షా విధానమును మరియు చికిత్సా పద్దతిని కనుగొన్నారు.


నపుంసకుడు---స్త్రీ మరియు పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని నపుంసకులు అంటారు. వీరిని వ్యవహారంలో హిజ్రా, కొజ్జా , గాండు, పేడి అని కూడా పిలుస్తారు. పుట్టుకతోనే ఈ లక్షణాలున్న వారు కొందరైతే , తమ ఇష్టానుసారం ఇలా మారేవారు కూడా వున్నారు. వీరికి సామాజిక ఆదరణ లేకపోడంతో సమూహాలుగా జీవిస్తారు. భిక్షాటన మరియు వ్యభిచారం వీరి ప్రధాన వృత్తులు.

  • నిర్ధారణ పరీక్షలు
ఈ క్రింది పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

* డూప్లెక్స్ అల్ట్రాసౌండ్
* పెనైల్ నెర్వస్ ఫంక్షన్స్
* నొక్టర్నల్ పెనైల్ టుమెసిన్ (ఎన్.పి.టి)
* పెనైల్ బయోథీసియోమెట్రి
* పెనైల్ ఆంజియోగ్రామ్
* డైనమిక్ ఇన్ఫ్యుజన్ కావెర్నొసొమెట్రి
* కొర్పస్ కావెర్నొసొమెట్రి
* డిజిటల్ సబ్ట్రాక్టర్ ఆంజియోగ్రఫి
* మాగ్నటిక్ రెజొనెన్స్ ఆంజియోగ్రఫి (ఎం.ఆర్.ఎ)

  • కారణాలు
వయసు మీదపడిన వారిలోనే కాదు ఇటీవలి కాలంలో యువతను సైతం లైంగిక పరమైన సమస్యలు వేధిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా నపుంసకత్వం, అంగస్తంభన వంటివి అధికంగా బాధించే సమస్యలు. ఈ సమస్యలు ఉత్పన్నం కావడానికి శారీరక రుగ్మతలతోపాటు మానసిక సమస్యలు కూడా కారణమని అంటాము.

మగవారిలో నపుంసకత్వం సమస్య ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. సంభోగ సమయంలో మగవారిలో అంగస్తంభన జరగకపోవడం, కొన్నిసార్లు అంగస్తంభన జరిగినా వీర్యస్కలనం జరగకపోవడం వంటివి సాధారణంగా తలెత్తే సమస్యలు. ఈ సమస్య తలెత్తడానికి ఒక్క శారీరక అనారోగ్యాలే కాదు మానసిక పరిస్థితులు కూడా కారణమవుతాయి. అంగస్తంభన, వీర్యస్కలనం జరగకపోవడం వంటి సమస్యలు అప్పుడప్పుడు తలెత్తితే దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉండదు. అయితే తరచు ఈ పరిస్థితి ఏర్పడితే అది పూర్తిగా నపుంసకత్వానికి దారితీసే అవకాశం ఉంది.

* మత్తుమందులు
* హార్మోనుల అసతుల్యత
* వంశ పారంపర్యత
* జీవన విధానము
* వృద్దాప్యము
- నపుంసకత్వం రావడానికి భావోద్రేకాలు కూడా కారణాలని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా శారీరక సమస్యలే ఇది ఏర్పడేందుకు కారణమవుతాయి.

- మధుమేహం, హైపర్‌టెన్షన్ ఉన్నవారిలో ఈ సమస్య ప్రధానంగా కనపడుతుంది.

- హార్మోన్ లోపాలు(పిట్యుటరీ గ్రంధలో కణితి, హార్మోన్‌ల అసమతుల్యత).

- రక్తప్రసరణ లోపాలు(నరాల సమస్య, హైపర్‌టెన్షన్, మర్మాంగానికి రక్తప్రసరణ తక్కువగా జరగడం).

- మానసిక కారణాలు కూడా నపుంసకత్వం ఏర్పడడానికి దారితీస్తాయి. మానసిక ఒత్తిడి, మానసికంగా తలెత్తే సమస్యలు(క్లినికల్ డిప్రెషన్, సిజోఫ్రెనియా, మానసిక ఆందోళన, వ్యక్తిత్వంలో లోపాలు లేదా భయాలు. మానసిక సమస్యలు, నైరాశ్య భావనలు వంటివి.

- వయసు పెరిగే కొద్ది లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది.

- జీవనశైలి వల్ల కూడా నపుంసకత్వం తలెత్తే అవకాశం చాలా ఉంది. మద్యం, స్థూలకాయం, దూమపానం.

-శారీరక అలసట :కొన్ని వైద్యపరమైన కారణాలు కూడా నపుంసకత్వం ఏర్పడేందుకు దారితీస్తాయి. హైబ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించేందుకు వాడే కొన్ని మందుల వల్ల కూడా లైంగిక సామర్ధ్యం తగ్గిపోవచ్చు. కేంద్ర నాడీ వ్యవస్థను చక్కదిద్దడానికి వాడే కొన్ని మందుల వల్ల రక్తప్రసరణలో లోపాలకు దారితీయవచ్చు. కొన్ని సందర్భాలలో నిర్వహించే శస్త్ర చికిత్సల కారణంగా కూడా నపుంసకత్వ సమస్యలు తలెత్తవచ్చు.

కొన్ని సార్లు ఆపరేషన్లలో కొన్ని అవయవాలను తొలగించాల్సి రావచ్చు. అవి అంగస్తంభనకు దోహదపడే అవయవాలు కావచ్చు. ఒక్కోసారి ఈ శస్త్ర చికిత్సల కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతినడమే కాక రక్తప్రసరణలో ఆటంకాలు కూడా తలెత్తవచ్చు. ప్రొస్టేట్ గ్రంధిని పూర్తిగా తొలగించాల్సి వచ్చినపుడు కాని దానికి రేడియేషన్ థెరపి నిర్వహించినపుడు కాని నపుంసకత్వం రావడం సర్వ సహజం. ఇవి రెండు కూడా ప్రొస్టేట్ కేన్సర్‌కు సంబంధించిన చికిత్స సందర్భంగా జరిగేవి.

  • గుర్తించడం ఎలా?
లైంగిక సామర్ధ్యం తగ్గిపోయిందని ఎలా గుర్తించాలి? తరచు అంగస్తంభన సమస్యలు ఏర్పడితే ముందుగా ఒక మంచి వైద్యుడిని సంప్రదించి రోగి తన సమస్య ఏమిటో దాచుకోకుండా వివరించాలి. చాలామంది లైంగిక సమస్యలను చెప్పుకోవడానికి ఇష్టపడరు. దాంతోపాటు మానసిక ఆందోళన కూడా ఏర్పడుతుంది.

ముందుగా వైద్యుడిని సంప్రదిస్తే రోగికి చెందిన రక్తం, మూత్ర నమూనాలను పరీక్షలకు పంపుతారు. లైంగిక వ్యాధులు వంటివి ఏవైనా ఉన్నదీ లేనిదీ ఈ పరీక్షల ద్వారా నిర్ధారణ జరుగుతుంది. ఇవిగాక మరికొన్ని వైద్య పరీక్షలను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. రోగికి సంబంధించిన పూర్తి మెడికల్ హిస్టరీని అధ్యయనం చేయడంతోపాటు శారీరక పరీక్షలు చేసిన తర్వాత వాటి ఆధారంగా చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది.

  • చికిత్స

  • మందుల ద్వారా చికిత్స
  • మానసిక చికిత్స
  • శస్త్ర చికిత్స

పూర్తిగా నపుంషకుడు అయితే నయము చేయడము కష్టము . వీరిలో పుట్టుకతోనే హార్మోనుల లోపము వలన అవయవాలు ఏర్పడవు . ఆధునిక కాలములో సెక్ష్ మార్పిడి విధానములో కొన్ని ఫలితాలు పొందుతున్నారు .

అంగము పూర్తిగా స్థంభించకపోవడము లేదా పాక్షికముగా స్థంభించడము : దీనిని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌ అంటారు (E.D- erectile dysfunction) ... అంగస్తంభన సమస్యలు

శీఘ్రష్ఖలనము సమస్య అయితే --- ఇక్కడ చూడండి --శీష్రుస్ఖలనం
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

శీష్రుస్ఖలనం , Premature Ejaculation



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -శీష్రుస్ఖలనం , Pramature Ejaculation- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మారుతున్న జీవనవిధానం, ఒత్తిడి, ఆందోళన, దంపతుల మధ్య అవగాహనలేమి శృంగార సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇందులో శీఘ్రస్ఖలనం సమస్య ప్రధానమైనది. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. శృంగారంలో పాల్గొన్న కొద్దిసేపటికే లేదా స్త్రీకి భావప్రాప్తి కలగకముందే వీర్యస్ఖలనం జరగటాన్ని శీఘ్రస్ఖలనంగా పేర్కొంటారు. శృంగారంలో ప్రారంభం నుంచి వీర్యస్ఖలనం అయ్యే వరకు పట్టే సమయం మూడు నిమిషాలలోపు ఉంటే శీఘ్రస్ఖలనం సమస్య ఉన్నట్లుగా భావించాలి. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం, పని ఒత్తిడి శృంగార జీవితంపై తీవ్రప్రభావాన్ని చూపుతోంది.


శీఘ్రస్ఖలనంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది . శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడే వారు మానసిక ఆందోళనకు గురికావడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, జీవిత భాగస్వామితో అనుబంధం దెబ్బతినడం జరుగుతోంది. ఇది క్రమేపీ భార్యాభర్తల మధ్య దూరాన్ని మరింత పెంచుతోంది. శీఘ్రస్ఖలనం సమస్యను నిర్లక్ష్యంచేస్తే అంగస్తంభన సమస్యకు దారితీసే అవకాశం కూడా ఉంది. కొంతమందిలో హస్తప్రయోగం చేసుకొన్నప్పుడు స్ఖలనం తొందరగా జరగదు. కానీ స్త్రీతో శృంగారంలో పాల్గొన్నప్పుడు స్ఖలనం త్వరగా అయిపోతూ ఉంటుంది. దీనికి కారణం మానసిక ఆందోళనే. మరికొంతమందిలో మద్యం సేవించినపుడు శీఘ్రస్ఖలనం సమస్య ఉండదు. కాని దీనికి అలవాటుపడితే సెక్స్ సామర్థ్యంపైన ప్రభావం పడుతుంది.

  • కారణాలు
శీఘ్రస్ఖలనం సమస్యకు శారీరక, మానసిక కారణాలు ఉంటాయి. ఇందులో మానసిక కారణాలే ఎక్కువగా ఉంటాయి. మానసిక ఆందోళన, భయం, ఒత్తిడి, డిప్రెషన్, హార్మోన్ల లోపం వల్ల శీఘ్రస్ఖలనం సమస్య ఉత్పన్నమవుతుంటుంది. నాడీ సంబంధ వ్యాధులు, మెదడు సంబంధ వ్యాధుల వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొస్టేట్ గ్రంథి, మూత్రనాళాలలో వాపు, ఇన్‌ఫెక్షన్ల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

శృంగారంలో ఎక్కువ రోజులు పాల్గొనకపోవడం, భాగస్వామి సహకారం సరిగ్గా లేకపోవడం కూడా సమస్య ఉత్పన్నం కావడానికి కారణమవుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు హస్తప్రయోగం చేసుకొనే సమయంలో ఎవరైనా వస్తారని, చూస్తారనే భయంతో తొందరగా చేయడం అలవాటుగా మారి అది స్ఖలన సమస్యకు దారితీస్తుంది. కొత్తగా పెళ్లయిన దంపతులు అప్పుడే పిల్లలు వద్దని అనుకుంటుంటారు. శృంగారంలో పాల్గొన్న సమయంలో గర్భం వస్తుందేమోనన్న భయంతో బయట స్కలనం చేయడానికి అలవాటుపడతారు. ఇది శీఘ్రస్ఖలనానికి దారితీసే అవకాశం ఉంది. మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు సాధారణంగానే తొందరగా స్ఖలనం అయిపోతుంది. రెండవసారైనా ఎక్కువసేపు పాల్గొనాలనే ఉద్దేశంతో, ఒకరకమైన ఆందోళనలో ఉంటారు. దీనివల్ల మరింత త్వరగా స్ఖలనం అయిపోతుంది. ఇది క్రమంగా సమస్యగా మారిపోతుంది. శీఘ్రస్ఖలన సమస్యలు ఉన్నవారికి హార్మోన్ల పరీక్షలు వ్యాధి నిర్ధారణ కోసం ఉపయోగపడతాయి.

  • చికిత్స :
Dapoxetine (ejalong tablets) : is a short-acting selective serotonin reuptake inhibitor (SSRI) marketed for the treatment of premature ejaculation.


Tramadol(tramalgin) : oral analgesic for mild pain. It is atypical because it is similar to an opioid, is an agonist at the mu receptor, but also is similar to an anti-depressant in that it increases levels of serotonin and norepinephrine.


Clomipramine (Anafranil) : is sometimes prescribed to treat PE. One side effect of the drug can help delay ejaculatory response. The side effect is described by the Mayo Clinic as "Increased sexual ability, desire, drive, or performance.


మందులు వాడటంతో పాటు స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, స్క్వీజ్ టెక్నిక్‌లను అనుసరించడం వల్ల ఉపయోగం ఉంటుంది.

స్టాప్ స్టార్ట్ టెక్నిక్‌లో భాగంగా వీర్యస్ఖలనం అయ్యే సమయంలో ఆగిపోవడం, కాసేపయ్యాక మరలా శృంగారంలో పాల్గొనడం చేయాలి. దీనివల్ల శీఘ్రస్ఖలనం సమస్యను అధిగమించవచ్చు.

స్క్వీజ్ టెక్నిక్ అంటే వీర్యస్ఖలనం అవుతుందని అనిపించగానే అంగం మొదటి భాగంలో లేదా చివరి భాగంలో కొన్ని సెకన్ల పాటు గట్టిగా నొక్కిపట్టి స్ఖలనాన్ని ఆపాలి. ఇలా రెండు, మూడు సార్లు చేసిన తరువాత వీర్యస్ఖలనం గావించాలి.

శృంగారంలో భార్య సహకారం తీసుకుంటే ఈ పద్ధతులను పాటించడం మరింత సులువవుతుంది. ఈ రెండు టెక్నిక్లను రెండు, మూడు నెలల పాటు ఆచరిస్తే శీఘ్రస్ఖలన సమస్యపై కొంత పట్టు సాధించవచ్చు. చాలా మంది హస్తప్రయోగం చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందని అనుకుంటుంటారు. కానీ హస్తప్రయోగం వల్ల ఎలాంటి హాని జరగదు. శృంగార సమస్యలు కూడా ఉత్పన్నంకావు.



  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, 19 December 2011

సెల్ స్ట్రెస్-ఇమోషనల్ హెల్త్,Cell phone Stress-emotional health



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --సెల్ స్ట్రెస్-ఇమోషనల్ హెల్త్(Cell phone Stress-emotional health)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మీకు సెల్‌ఫోన్ ఉందా? ఉంటే ఓకే... మీరు మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడకపోతే...కొనడం ఎందుకు? ఓకే... మీరు మరీ ఎక్కువ మాట్లాడతారా?
‘అవును’ అనే సమాధానం వస్తే మాత్రం నాట్ ఓకే. సెల్‌ఫోన్ మీ ఒత్తిడిని పెంచుతున్న విషయం తెలుసా?

మీ చేతిలో సెల్ ఉందా! అయితే మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లే! సెల్ ఉంటే ఎంజాయ్ చేస్తారు కానీ, ఒత్తిడేమిటా అనుకుంటున్నారా! ఇది నూటికి నూరుపాళ్లు ఒత్తిడే అని మనోవిశ్లేషకులు, మేధావులు పదేపదే చెబుతున్నారు. ఒక్కసారి మీ ఫోన్ గురించి ఆలోచించుకోండి! మీకు తెలియకుండా మీరు ఏ విధంగా ఒత్తిడి ఫీల్ అవుతున్నారో పరిశీలించుకోండి!

సెల్‌ఫోన్స్ వినియోగం వల్ల పనికి, ఇంటికి మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోతున్నాయి. అందువల్ల ఇంట్లోనూ, ఆఫీసులోనూ కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఆఫీసులో ఉన్న ఇబ్బందులను సెల్‌ఫోన్ కారణంగా ఇంటి వరకు తీసుకువస్తున్నారు. అందువల్ల వ్యక్తులలో వ్యతిరేక ఆలోచనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయంలో స్త్రీలు ఎక్కువ బాధపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. వీటి వాడకం వల్ల మానసికంగా ఒత్తిడికి లోనవ్వడమే కాకుండా కుటుంబసంతోషం కూడా తగ్గిపోతోంది.

పెరిగిన సాంకేతిక నైపుణ్యం మనిషిని మరింత అభివృద్ధి చెందేలా చేస్తున్నప్పటికీ, మానసిక అశాంతి మాత్రం విపరీతంగా పెరుగుతోంది. ‘జర్నల్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ’ మ్యాగజీన్... ‘‘సెల్‌ఫోన్ వాడకం ఎంత ఎక్కువైతే, కుటుంబ సంతోషం అంత తక్కువ అవుతుంది, అందువల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది’’ అని ఒక వ్యాసంలో తెలిపింది.

మీకు తెలుసా?...ఈఒత్తిడికి అనేక కారణాలు ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

సెల్ ఫోన్ వల్ల కాన్సన్‌ట్రేషన్ దెబ్బ తింటుంది. పని చేస్తున్నప్పుడు ఫోన్ రావడం వల్ల ఏకాగ్రత పోయి, ప్రొడక్టివిటీ రాదు. పని సకాలంలో పూర్తిచేయలేకపోయామన్న బాధతో ఒత్తిడికి లోనవుతారు.

ఏ పని చేస్తున్నా ఫోన్ మోగినట్లే ఫీలవుతుంటారు. ఫోన్ మోగగానే ఎవరైనా టీజ్ చేస్తున్నారేమోనని భయానికి లోనవుతారు.

అసభ్యకరమైన మెసేజ్‌లు వస్తాయేమోనని టెన్షన్ పడుతుంటారు. ఫోన్‌ను స్విచాఫ్ చేయలేక, ఆన్‌లో ఉంచలేక ఒత్తిడి ఫీల్ అవుతారు.

ఫోన్స్‌లోనే ఇంటర్నెట్ రావడం వల్ల చిన్న స్క్రీన్ మీదే ఫేస్ బుక్, చాటింగ్ చేస్తూ 24 గంటలూ అందరితో కనెక్టెడ్‌గా ఉండటానికి ప్రయత్నం చేయడం వల్ల ఒత్తిడి కలుగుతుంది.

అదేపనిగా మోనిటర్ చూస్తూండటం వల్ల కంటి మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది.

ఫోన్ కొన్న వారానికే ఔట్ డేట్ అయిపోతే, ‘‘అయ్యో అనవసరంగా ఇంత ఖర్చుపెట్టానే’’ అని నిందించుకుని, మళ్లీ కొత్తది కొనాలనుకుంటారు. అది కొనేటప్పుడు, ‘కనీసం ఇదైనా ఎక్కువ రోజులు లేటెస్ట్‌గా ఉంటుందా?’ అని ఒత్తిడికి లోనవుతారు.

పూర్వం రోజులలో ల్యాండ్‌లైన్ మాత్రమే ఉండటం వల్ల, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో కుటుంబ సభ్యులకు తెలిసేది. రహస్యాలు ఉండేవి కాదు. కాని సెల్‌ఫోన్ వల్ల రహస్య సంభాషణలు జరుగుతున్నాయి. మాట్లాడేవారికి ఎవరైనా వింటారేమోననే ఒత్తిడి, వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారోనని గమనిస్తున్న వారిలో ఒత్తిడి.

అదేపనిగా ఫోన్ మాట్లాడటం వల్ల రేడియేషన్ ప్రభావం శరీరం మీదే కాక మనసు మీద కూడా పడి ఒత్తిడికి దారితీస్తుంది.

సెల్‌ఫోన్ పుణ్యమా అని పక్కనే ఉన్నవారితో మాట్లాడకుండా, దూరాన ఉన్నవారితో మాట్లాడటం ఎక్కువయ్యింది. అందువల్ల బంధాలు చెడిపోతున్నాయి. కొందరు తమ కాలక్షేపం కోసం, అవతలివారు ఏ స్థితిలో ఉన్నారో కూడా గమనించకుండా ఫోన్ చేస్తారు. రిసీవ్ చేసుకున్నవాళ్లు ఆ సమయంలో పనుండి మాట్లాడలేకపోవటం వల్ల వారి మధ్య మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. అయితే... రానున్న తరాలవారు మాత్రం ఈ విషయంలో ఒత్తిడికి లోను కాకపోవచ్చు. వారి జీవితమే వీటితో ప్రారంభం అవుతోంది కాబట్టి, సెల్ లేని జీవితాన్ని, దాని వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను వారు ఊహించలేరు... అని మిల్వాకూలోని యూనివ ర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్ లో సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నోయెల్లీ చెస్లీ చెబుతున్నారు.

ఆధునిక టెక్నాలజీని సాదరంగా ఆహ్వానించాలి. సెల్‌ఫోన్ అనేది జీవితంలో భాగంగా మారిపోయింది. అందుకే దానిని అవసరానికి మాత్రమే వినియోగించుకుంటూ, ఒత్తిడిలేని, ఆనందమయమైన జీవితాన్ని గడపటం మంచిది.

కుటుంబ సభ్యులందరికీ ఎవరి ఫోన్ వారికి ఉండటంవల్ల కుటుంబంలో సంబంధాలు, అనుబంధాలు తగ్గిపోతున్నాయి. అందరూ ఒకేచోట కూర్చున్నప్పుడు, కొందరు తమ గొప్పదనం ప్రదర్శించటానికి, పాపులారిటీ నలుగురికీ తెలియచెప్పుకోవడానికి అవసరం ఉన్నా, లేకపోయినా సెల్‌ని ఎక్కువ వాడతారు. అది ఒక ఎడిక్షన్ కాబట్టి దాని నుంచి బయటపడలేకపోతారు. ఇది ఒత్తిడికి దారితీస్తుంది.

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

రొమ్ము కాన్సెర్ మామోగ్రఫీ , Breast Cancer and Mammography


  • image : courtesy with Eenadu news paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - రొమ్ము కాన్సెర్ మామోగ్రఫీ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రొమ్ముక్యాన్సర్‌ ఉండొచ్చనే భయం ఓ వైపు వేధిస్తోన్నా.. వైద్యుల్ని సంప్రదించడానికి సంకోచం. అంతకన్నా ముందు.. పరీక్షలకు సంబంధించి రకరకాల అపోహలు చాలామందిని వేధిస్తాయి. కానీ ఈ రోజుల్లో రొమ్ముక్యాన్సర్‌ ఉన్నా లేకపోయినా.. ఆ ప్రమాదాన్ని ముందే సూచించే స్క్రీనింగ్‌ విధానం ఉంది.

మూడు రకాల్లో అందుబాటులో ఉండే ఈ విధానం వల్ల ఎలా మేలు జరుగుతుందో చూద్దాం.
  • స్క్రీనింగ్‌ మామోగ్రామ్‌:
ఒక మహిళ గాని, వైద్యులు గాని... క్యాన్సర్‌ ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో ఈ పరీక్షను సిఫారసు చేస్తారు వైద్యులు. అయితే.. సమస్య ఉన్నా లేకపోయినా కూడా.. నలభైఏళ్లు దాటినప్పటి నుంచీ ఏడాదికోసారి మామోగ్రామ్‌ చేయించుకుంటే.. క్యాన్సర్‌ ప్రమాదాన్ని చాలా ముందుగానే గుర్తించవచ్చు. ఫలితంగా చికిత్స సాధ్యమవుతుంది. ఆ తరవాత త్వరగా కోలుకోగలుగుతారు కూడా.

  • సర్వైలన్స్‌ మామోగ్రామ్‌:
క్యాన్సర్‌ వచ్చి.. చికిత్స తీసుకుని రొమ్మును తొలగించని వారు ఏడాదికోసారి తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష. దానివల్ల ఆ రొమ్ములోనే కాదు.. రెండోదానికీ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తొలిదశలోనే అంచనా వేయవచ్చు.

  • డయాగ్నొస్టిక్‌ మామోగ్రామ్‌:
రొమ్ములో కణితి లేదా కొత్తగా చోటు చేసుకున్న మార్పును గుర్తించినప్పుడు అది క్యాన్సరా కాదా అని నిర్థారించేందుకు తోడ్పడుతుందీ పరీక్ష. వైద్యులు స్వయంగా పరీక్ష చేయడం.. మామోగ్రామ్‌, అల్ట్రాసౌండ్‌ నిర్వహించడం (ట్రిపుల్‌ ఎసెస్‌మెంట్‌ పరీక్ష) ఇందులో భాగం.

  • డిజిటల్‌ మామోగ్రామ్‌:
ఏ వయసువారిలోనైనా తొలిదశలోనే క్యాన్సర్‌ ప్రమాదాన్ని గుర్తించవచ్చు. సాధారణ మామోగ్రామ్‌తో పోలిస్తే.. ఇది అత్యాధునికమైన విధానం. ఇక, మన దేశంలో యువతుల్లోనూ క్యాన్సర్‌ ప్రమాదం కనిపిస్తోంది. అయితే యువతుల్లో రొమ్ము కణజాలం ఎక్కువగా ఉండటం వల్ల ప్రారంభ దశలో ఆ లక్షణాలను త్వరగా గుర్తించలేం. అలాంటప్పుడు ఈ మామోగ్రఫీ చేయడం సరైన ప్రత్యామ్నాయం. దీనివల్ల పరీక్ష సమయంలో నొప్పితో పాటు రేడియేషన్‌ ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. ఈ పరీక్షలో భాగంగా తీసిన చిత్రాలను రెండో అభిప్రాయం కోసం ప్రపంచంలో ఎక్కడికైనా పంపించుకోవచ్చు. అయితే ఈ విధానం మన దేశంలో చాలా తక్కువ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. ఖరీదూ కొద్దిగా ఎక్కువే.

  • source : from the article /Dr. P . Raghuram - Hyderabad(KIMS usha-laxmi center for breast cancer)

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, 18 December 2011

thiamine,aneurin,vitaminB1, విటమిన్ బి 1,థయామిన్


  • image : courtesy with Google search

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Vitamin B1- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  • విటమిన్ బి 1: దీని రసాయనిక నామము థయామిన్ ..ఈ విటమిన్ను 'యాంటీ బెరి బెరి విటమిన్' మరియు 'యాంటీ న్యూరైటెక్ విటమిన్' అని కూడా అంటారు . ఇది సల్ఫర్ -కలిగిఉన్న విటమిన్‌ .మొదట "aneurin" అనేవారు . దీని ఫాస్పేట్ ఉత్పన్నము అనేక సెల్యులార్ ప్రక్రియల్లో పాలు పంచుకుంటుంది .ఉత్తమ లక్షణాలు కలిగిఉన్న రూపము thiamine పైరోఫాస్ఫేట్ (TPP), చక్కెరలు మరియు అమైనో ఆమ్లాల జీవన చర్యకు ఉపయోగపడు శక్తిని విడుదల చేయుట, ఒక ఎంజైముల సహాయకారి గా ఉటుంది. Thiamine న్యూరోట్రాన్స్మిటర్ ఎసిటైల్ మరియు గామా-aminobutyric ఆమ్లం (GABA) జీవరసాయనచర్యలో ఉపయోగిస్తారు. ఈస్ట్ లో TPP ''మద్య(సారా) కిణ్వనం( alcoholic fermentation)'' కొరకు మొదటి దశలో అవసరం.

అన్ని జీవులు వాటి జీవరసాయన శాస్త్రం లో thiamine ఉపయోగించవచ్చు, కానీ ఇది కేవలం బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, మరియు మొక్కలలో తయారవుతుంది. జంతువులు , diinini వాటి ఆహారం నుండి పొందుతాయి .థయామిన్‌ లోపము ఏవిధముగా ఈ విచిత్రమైన లక్షణాలు కలుగుచున్నాయో ఇంకా సరియైన అవగాహన లేదు . ఇప్పుడిప్పుడే అనేక కొత్త రకాల థయామిన్‌ ఫార్ములు కనుగొనబడుచున్నాయి.ఇలా అనేక ఉప రకాలు బయటపడడము దానియొక్క సంక్లిష్టతను తెలియజేయుచున్నది . ఈ కొత్త డెరివేటివ్స్ మధుమేహ సంబంధిత బాధనివారణలో బహుప్రయోజనకరులుగా ఉన్నాయి. వీటిలోకొన్ని ... allithiamine, prosultiamine, fursultiamine, benfotiamine, and sulbutiamine,

  • చరిత్ర (History):
నీటిలో కరిగే విటమిన్లు లలో మొదట గా దీనిని కనిపెట్టేరు . 1884 లో Kanehiro Takaki (1849–1920), a surgeon general in the Japanese navy ... బెరిబెరి రావడానికి ముందుచెప్పుకున్న కారణాలు కంటే మన డైట్ లో ఏదో లోపమున్నదనే ఆలోచనతో తవుడుతో కూడుకున్న బియ్యము వాడడము , దానికి తోడుగా మాంసము , పాలు తీసుకోవడము తో బెరిబెరి లక్షణాలు పూర్తిగా తగ్గిపోవడము తో తవుడు నుండి యాంటీ బెరిబెరి ఫాక్టర్ కనిపెట్టడం జరిగినది . ఇదే విధముగా డచ్ దేశములో 1897 లో Christiaan Eijkman తన తోటి సహాయకులతో విటమిన్‌ బి1 తో పాటు అనేక ఇటువంటి మూలకాలను కనిపెట్టినందుకు ఆ విధము గా అనేక విటమిన్ల కనిపెట్టడానికి (నాంది పలకడానికి) మూలమైనందున 1929 లో Nobel Prize in Physiology and Medicine ఇచ్చారు . ఆ విధముగా థయామిన్‌ 1936 లో సింథసైజ్ చేయడము జరిగినది . మొదట దీని "aneurin" (for anti-neuritic vitamin) గా నామకరణము చేసారు .

  • లోపము (Deficiency) :
సరియైన సమతుల్య ఆహారము తినకపోవడము లేదా దొరక్క పోవడము వలనే ఈ థయమిన్‌ లోపము కలుగుతుంది . చాలా అరుదుగా Genetic diseases of thiamine transport మూలము గా Thiamine responsive megaloblastic anemia (TRMA) with diabetes mellitus and sensorineural deafness వచ్చే అవకాశాలు ఉన్నాయి .

ఈ విటమిన్ లోపము వల్ల 'బెరి బెరి 'అనే వ్యాధి కలుగుతుంది . కార్బోహైడ్రేట్స్ జీవ క్రియ లో ఉపయోగపడే ఎంజైం లకు ఈ విటమిన్‌ అవసరము .ముఖ్యము గా నాడీమండలము , గుండె ఈ విటవిన్‌ లోపము వలన ఎక్కువగా నష్టపోతాయి. నీరసము , నరాల మంట , కళ్ళలో నీరసము , శరీరము శుష్కించి పోవడము , ముఖ్యము గా beriberi and Wernicke-Korsakoff syndrome(diseases also common with chronic alcoholism),Wernicke’s encephalopathy,Korsakoff Psychosis వస్తాయి .

బెరిబెరి (Beriberi) విటమిన్ బి1 లేదా థయామిన్ లోపం వల్ల మానవులలో సంభవించే వ్యాధి. వాతులు, వణుకు , మూర్చ , శ్వాస తీసుకోవడం కష్టంగా వుండటం .. లాంటివి బెరి బెరి వ్యాధి లక్షణాలు . ఈ వ్యాధిలో తడి బెరిబెరి (Wet beriberi) మరియు పొడి బెరిబెరి (Dry beriberi) అని రెండు రకాలు. కండరాలు క్షీణించి, కాళ్ళు చేతులు పక్షవాతంతో పడిపోవడం పొడి బెరిబెరి లక్షణాలు. దేహకుహరంలో నీరుచేరి హృదయం ఉబ్బి కాలేయం నొక్కుకొని పోవడము తడి బెరిబెరి లక్షణాలు. కొందరిలో రెండింటి లక్షణాలు కనబడవచ్చును.

  • థయామిన్‌ లోపము ఎలా కనుగొంటాము (iagnostic testing):
మనుషులలో కనిపించే వ్యాధి లక్షణాలను బట్టి సుమారు 90% థయమిన్‌ లోపము కనిపెట్టవచ్చును .
A positive diagnosis test for thiamine deficiency can be ascertained by measuring the activity of the enzyme transketolase in erythrocytes (Erythrocyte Transketolase Activation Assay).
Capillary Electrophoresis (CE) techniques and in-capillary enzyme reaction methods have emerged as potential alternative techniques for the determination and monitoring of thiamine in samples.

  • వీటిలో లభించును :
వరి ,గోధుమ లాంటి ధాన్యాలు , వేరుశనగ ,పప్పులు ,మాంసము ,చేపలు , గుడ్లు లాంటి ఆహారములలో ఇది లబిస్తుంది .ఈస్ట్ లలో కూడా లభ్యమౌతుంది. ఈ విటమిన్ బియ్యం మీద ఉండే తవుడులో ఉంటుంది.

  • రోజూవారీ అవసరము (Daily requirement):
విటమిన్ బి1(థయామిన్ )= 1.2 mg .

More details --

Vitamun B1-thiamin , విటమిన్ B 1 - థయమిన్-----------

( విటమిన్ B 1 ) విటమిన్ ను ‘ థయమిన్ ‘ అని కూడా అంటారు. ఈ థయమిన్ B విటమిన్ లలో మొదటిది. ‘థయ’ అంటే గంధకం. ఈ గంధకపు అణువు కలిగి ఉన్న విటమిన్ కాబట్టి దీనికి థయమిన్ అని పేరు వచ్చింది. ఈ థయమిన్ లేదా B1 విటమిన్ కేవలం బాక్టీరియా లూ , ఫంగస్ లూ ( శిలీంధ్రాలు అని కూడా అంటారు అంటే పుట్టగొడుగుల జాతి కి చెందినవి ) ఇంకా మొక్కలు మాత్రమే ఈ థయమిన్ విటమిన్ ను తయారు చేయ గలవు. కానీ మానవులకు ( జంతువులకు కూడా ) ఈ B 1 విటమిన్ లేదా థయమిన్ చాలా ముఖ్యం.

థయమిన్‌ (విటమిన్‌ 'బి1')

బికాంప్లెక్స్‌ విటమిన్‌లలో చాలా ముఖ్య మైనది. నరాలు, కండరాల ఆరోగ్యానికీ కార్బోహైడ్రేట్ల నుంచి శక్తి విడుదల అవడానికి థయమిన్‌ చాలా అవసరం. మన దేహానికి శక్తినిచ్చే పోషకాలన్నిటిలోకి కార్బోహైడ్రేట్లు ముఖ్యమైనవి. అంతేకాక మెదడు కార్బోహై డ్రేట్‌లను తప్ప మరి దేనినీ శక్తికోసం ఉప యాగించుకోలేదు. గోధుమలు, ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం, జొన్నల లోనూ, పెసలు, సెనగలు, మినుములు, కందులు లాంటి పప్పు దినుసులలోనూ, నువ్వులు, వేరుసెనగ, జీడిపప్పు, పిస్తా, బాదం,బఠాణీలాంటి గింజధాన్యాలలోనూ, సోయా చిక్కుడు, చిక్కుడు, బీట్‌రూట్‌, బం గాళాదుంప, గుడ్డు మొదలైన వాటిలోనూ థయమిన్‌ పుష్కలంగా లభిస్తుంది.

చాలా రకాల ధాన్యాలలో థయమిన్‌ పై పొరల లోనే ఉంటుంది. మర పట్టినప్పుడు ఈ పొరలు పోతాయి. అందుకే తెల్లని పాలిష్‌ పట్టిన బియ్యంతో వండిన అన్నం తినే వాళ్ళలో థయమిన్‌ లోపం కార ణంగా జబ్బులు ఎక్కువ వస్తాయి. ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం తినేవాళ్ళకు ఈ జబ్బులు రావు.

థయమిన్‌ లోపిస్తే ప్రారంభదశలో

నీరసం,అలసట, చికాకు, ఏకాగ్రత కుదరక పోవటం, ఒత్తిడి, నిద్రపట్టకపోవటం, ఆకలి మంద గించటం, బరువు తగ్గిపోవటం వంటి లక్షణాలు కనిపి స్తాయి. ఎక్కువ కాలం పాటు శరీరంలో థయమిన్‌ లోపిస్తే బెరిబెరి వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి మూలం గా నరాలు, మెదడు, గుండెలో అసాధారణ లక్షణాలు చోటు చేసుకుంటాయి. ఈ వ్యాధి మూలంగా ఎర్ర రక్తకణాల జీవక్రియలో మార్పులు జరిగి మూత్రంలోనూ, రక్తంలోనూ థయమిన్‌ (బి1 విటమిన్‌) స్థాయి పడిపోతుంది.

గుండె, రక్త ప్రసరణలకు సంబంధిం చినది ఒక రకం బెరిబెరి దీనిని (Wet Beriberi) అంటారు.

దీని లక్షణాలు:
నడిస్తే కాళ్ళనొప్పులు రావటం, విశ్రాంతి తరువాత తగ్గిపోవటం, దీని మొదటి లక్షణం. కాళ్ళు చేతులు వెచ్చగా వుంటాయి. రక్త ప్రసరణ వేగం పెరుగు తుంది. గుండె పరిమాణంలో వ్యాకో చం, సిరలలో పీడనం పెరగటం, గుండె పనిచేయకపోవటం జరుగుతాయి. థయ మిన్‌ లోపించి కార్బోహైడ్రేట్‌ల జీవక్రియ సరిగా జరగక పోవటం వలన ఇలా జరుగుతాయి. ఈ రకమైన బెరిబెరి లో మాంసకృత్తులు, ఐరన్‌, విట మిన్‌ 'ఎ', నికోటినిక్‌ ఆవ్లుం, మొద లైన వాటి లోపాలు కూడా కనిపి స్తాయి. స్థూలకాయులలో ఈ జబ్బు ఎక్కువ వచ్చే అవకాశం వుంది.

నరాలకు సంబంధించిన అసా ధారణ లక్షణాలను కలిగించేది రెండవ రకం బెరిబెరి. దీనిని ఉసా Dry Beriberi అంటారు.

దీని లక్షణాలు:
పాదాల మడమలలో సూదులు, పిన్నులతో గుచ్చుతున్నట్లుగా పోట్లు, పాదాలలో మంటలు పుడుతున్నట్లు అనిపించడం, కాలి పిక్కలలో నొప్పి, నేల మీద కూర్చు న్న స్థితి నుంచి పైకి లేవాలంటే ఇబ్బంది కనిపిస్తాయి. కొందరిలో మామూలు ప్రతి చర్యలన్నీ మందగించి పోతాయి. కాళ్ళు, చేతులలో స్పర్శలోపం కూడా ఏర్పడే అవకాశం వుంది.

మెదడుకు సంబంధించిన అసాధారణ లక్షణా లను కలిగించే ఇంకో రకం బెరి బెరి వ్యాధి ఉంది. 'సెరెబ్రల్‌ బెరిబెరి', మనిషికి అకస్మాత్తుగా తీవ్రమైన విటమిన్‌ బి1 లోపం ఏర్పడినపుడు ఇది వస్తుంది. విపరీతంగా వాంతులవుతున్న గర్భిణీ స్త్రీలకు, తీవ్రమైన తాగుడు లక్షణం కలవాళ్ళకూ ఈ వ్యాధి వస్తుంది. Mental Confusion, జ్ఞాపకశక్తి కోల్పో వటం వంటి అవలక్షణాలను కలిగి ఉండే వారు సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఆ మనిషి కోమా లోకి వెళ్ళిపోయే అవకాశం వుంది. మెదడుకు ఎంతో కొంత శాశ్వత నష్టం జరిగి ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధినుంచి పూర్తిగా కోలు కోవటం కొందరిలో సాధ్యం కాదు. థయ మిన్‌ లోపంతో బాధపడుతున్న స్త్రీ పాలు తాగే పసిపిల్లలకు కూడా Infentile Beriberi వచ్చే అవకాశం ఉంది. 2-4 నెలల వయస్సు మధ్య ఉండే ఈ పిల్ల లకు హార్డ్‌ ఫెయిల్యూర్‌, స్వరలోపం, Peripheral nerves దెబ్బతినటం లాంటి నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది.

మనిషి వయస్సును బట్టి, శరీర స్థితి గతులను బట్టి, జీవనశైలిని బట్టి మనిషికి రోజుకి 0.5 నుంచి 2.0 మిల్లి గ్రాముల దాకా థయమిన్‌ అవసరం అవుతుంది.

ఈ థయమిన్ లోపం మనలో ఎట్లా కనిపించ వచ్చు ?:
మనం తీసుకునే ఆహారం లో థయమిన్ లోపం ఏదో రూపం లో ఉంటే ఆ లోప లక్షణాలు మనలో కనిపిస్తాయి.
మన దేహం లో అనేక అవయవాలు సరిగా పనిచేయడానికి ఈ థయమిన్ చాలా కీలకమైనది. కానీ మన నాడీ వ్యవస్థ లో ఈ విటమిన్ లోపం చాలా త్వరగానూ , ప్రస్ఫుటం గానూ కనిపిస్తుంది. ఎందుచేతనంటే , మన నాడీ మండలం లో అంటే ప్రతి నాడీ కణం లోనూ అనునిత్యం అంటే మన జీవితాంతం నిరంతరం గా జరిగే జీవ రసాయన చర్యలకు , ఈ థయమిన్ అవసరం తప్పని సరిగా ఉంటుంది. మిగతా అన్ని విటమిన్ల లానే కేవలం కొన్ని మిల్లీ గ్రాములలోనే ఈ విటమిన్ కూడా మనకు అవసరం అవుతుంది రోజూ ! కానీ ఆ కొన్ని మిల్లీ గ్రాములు కూడా లోపిస్తే , అదే మన ప్రాణాల మీదకు తెస్తుంది.

మన నాడీ మండలం లో థయమిన్ లోపం ఏ లక్షణాలు చూపిస్తుంది ?:

కళ్ళు: ముఖ్యం గా కళ్ళు బైర్లు కమ్మడం , రంగులు సరిగా గుర్తించ లేక పోవడం , మొదటి దశలలో జరుగుతాయి. తరువాత , తరువాత , థయమిన్ లోపం సరిచేయక పొతే , రెండు కళ్ళ చూపూ మందగించి , విటమిన్ లోపం తీవ్రం గా ఉంటే అంధత్వం కూడా రావచ్చు. ఇట్లా అంధత్వం రావడం ‘ ఆప్టిక్ అట్రోఫీ ‘ అనబడుతుంది. అంటే కంటి లోపలి సున్నితమైన పొరలు పాడవుతాయి.

పెరిఫెరల్ న్యూ రోపతీ అంటే ఏమిటి ?: మన దేహం లో మెదడులో కాక , అవయవాల చివరల గా ఉన్న నాడులలో తిమ్మిరులూ , మంటలూ పుట్టిస్తుంది ఈ విటమిన్ లోపం. ఎందుకంటే ఈ విటమిన్ లోపం వల్ల ఆయా నాడులు సరిగా పని చేయక మంటలు పుట్టడం , తిమ్మిరులు కలగటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యం గా శాక హారులలో , వయో వృద్ధులలో , ఈ లక్షణాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. మీరు గమనించారో లేదో , మన పెద్ద వాళ్ళు , కాళ్ళు మంటలు పుడుతున్నాయని వారికి నచ్చిన నువ్వులనూనో , కొబ్బరి నూనో బాగా కాళ్ళకు పట్టించి మర్దనా అంటే మాసాజ్ చేసుకుంటూ ఉంటారు. అది కేవలం వృధా ప్రయాసే ! ఎందుకంటే వారి లక్షణాలకు కారణం విటమిన్ లోపం కదా !

మన గుండె లో థయమిన్ లోపం ఏ లక్షణాలు చూపుతుంది?:
ఈ విటమిన్ లోపం అధికం గా ఉంటె, వారి గుండె కూడా ” వాచి ” పోతుంది. అంటే గుండె సామాన్యం గా ఉండే సైజు కన్నా పెద్దగా అవుతుంది. కానీ ఇట్లా పెద్దగా అవడం, ఆరోగ్య కరం గా కాక విటమిన్ B 1 లేక థయమిన్ లోపం వల్ల కలిగే ” అనారోగ్య వాపు ‘ దీనినే ” కార్డియో మెగాలీ ”  అంటారు. అంతే కాక గుండె నీరసం గా కొట్టుకుని , కాళ్ళ వాపు రావడం జరుగుతుంది. అంటే కాళ్ళలో నీరు చేరుతుంది
మనం మన ఆహారం సంపూర్ణం గా అంటే అన్ని పప్పులూ , ఆకు కూరలూ , కూరగాయలూ తింటున్నా కూడా , మనం ఆ ఆహారాలనూ , వంటలనూ , తయారు చేసుకోవడం లోనూ , లేదా ఇతర పదార్ధాలతో తినడడం వల్ల నో , మన శరీరం లో థయమిన్ ప్రవేశించినా , మన శరీర కణాలకు చేరుకోక , వ్యర్ధం అవుతుంది. ఆ కారణం గా మనలో థయమిన్ లోపం , ఆ లోప లక్షణాలు కూడా కనిపించ వచ్చు.

వంటలో లోపాలు : ధాన్యాలు అంటే , గోధుమ , వరి , జొన్నలు , మినుములు , కంది పప్పు , పెసర పప్పు, ఇట్లాంటి పప్పు దినుసులు , వాటి పోట్టులోనే ఈ B విటమిన్ అత్యధికం గా ఉంటుంది. కానీ సామాన్యం గా ఆకర్షణీయం గా ఉండడం కోసం చాలా దుకాణాలలో ఈ ధాన్యాలను పాలిష్ చేసి అమ్ముతూ ఉంటారు. అంతే కాక వాటిని కొన్న తరువాత వంట గదిలో అనేక సార్లు కడిగి ఉడికిన తరువాత తెల్లగా కనపడ డానికీ , పొట్టు వాసన రాకుండా ఉండడానికీ అనేక ప్రయత్నాలు చేసి , ఆ ధాన్యాలలో ఉన్న పోషక విలువలు, విటమిన్లు , వృధా చేస్తుంటాము. అంతే కాక , అత్యధిక వేడి లో , ఎక్కువ సమయం ఉడికిస్తే కూడా పోషక విలువలు తగ్గి పోతాయి. ముఖ్యం గా ఆకు కూరలూ , కూర గాయలూ ఇట్లా ఎక్కువ సమయం , అధిక వేడి లో వండడం వల్ల వాటిలో ఉన్న విటమిన్లు కోల్పోతాయి.

కాఫీలూ , టీలూ , వక్క పొడి : టీలూ కాఫీలూ ఎక్కువ గా తాగితే , జర్దా, వక్కపొడి ఎల్లకాలం నములుతూ ఉంటే కూడా మనం తీసుకునే ఆహారం లో ఉన్న థయమిన్ విటమిన్ మనకు అంటే మన శరీరం లోని కణాలకు అందదు. దీనికి ఒక ముఖ్య కారణం ఉంది. టీ లోనూ , కాఫీ లోనూ , ఇంకా వక్క పొడి , జర్దా లలో ఉండే కొన్ని రసాయన పదార్ధాలు , థయమిన్ విటమిన్ ను విరిచేస్తాయి అంటే దానిని పనికి రాకుండా చేస్తాయి ( అప్పుడు పాలు విరిగితే మనకు ఆ విరిగిన పాలు ఎట్లా ఉపయోగ పడవో , అట్లా అవుతుంది థయమిన్ విటమిన్ ! )

సరిగా వండని చేపలు : కొన్ని రకాల చేపలలో ( ప్రత్యేకించి చెరువు చేపలలో ) థయమిన్ విటమిన్ ను విరిచేసే తయమినేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనివల్ల థయమిన్ విటమిన్ అంతా విరిచి వేయబడి మనకు ఏ విధం గానూ పనికి రాకుండా పోతుంది.

మరి ఆల్కహాలికులలో ( అంటే అతిగా మద్యం సేవించే వారిలో ) థయమిన్ లోపం ఎందుకు ఉంటుంది? : దీనికి చాలా కారణాలు ఉన్నాయి :

1. సాధారణం గా అతిగా మద్యం సేవించే వారు , వారి కడుపులో పోషక విలువలున్న ఆహారాన్ని కాక , ప్రధానం గా మద్యం తో నింపు తారు.
2. దానితో మన జీర్ణ కోశం లో ఉండే కణాలు మద్యం లో మునిగి పోయి , ఆహారం లో ఉండే థయమిన్ ను ” పీల్చుకో ” లేవు.
3. అతిగా సేవించే మద్యం కాలేయం అంటే లివర్ లోని కణాలను కూడా పనిచేయకుండా చేస్తాయి. దీనివల్ల శరీరం లో ప్రవేశించే థయమిన్ నిలువ అవ్వడానికి వీలు పడదు ( సామాన్యం గా మనం మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ థయమిన్ ఆహారం లో తీసుకుంటే , అది మన కాలేయం అంటే లివర్ లో నిలువ చేయబడుతుంది )
4.అంతే కాక మద్యం థయమిన్ ను మన శరీర కణాలకు చేర నీయదు.

గమనించ వలసిన విషయం ఏమిటంటే , ఈ మార్పులు , చాలాకాలం , ఎక్కువ గా మద్య పానం చేసే వారిలో వస్తాయి. ఒక సారి ఈ మార్పులు వచ్చాక వారు మతి మరుపు తెచ్చుకుంటారు , కంఫ్యుస్ అవుతూ ఉంటారు. తికమక పడుతూ ఉంటారు. ఏకాగ్రత కోల్పోతారు. చీటికీ మాటికీ విసుక్కుంటూ ఉంటారు , చుట్టూ ఉన్న వారి బుర్ర తినేస్తూ ఉంటారు , ఎందుకంటే , వారి బుర్ర , నిరంతరం మద్యం లో ” మునిగి ” విటమిన్లు లోపించి సరిగా పని చేయదు కనుక ! కానీ వారు ఈ విషయాన్ని ఒప్పుకునే పరిస్థితి లో ఉండరు. మీరు గమనించారో లేదో , అతి గా తాగే వారు , వారి పరిస్థితిని అంత తేలిక గా ఒప్పుకోరు. వారి నిస్సహాయ స్థితిని వారి కోప తాపాలనూ , వారి కుటుంబ సభ్యుల మీదా , ( తల్లి తండ్రులూ , భార్య ల మీదా ) అమాయకులైన తమ సంతానం మీదా అంటే చిన్నారుల మీదా చూపిస్తూ ఉంటారు. ఇది చాలా విచార కర పరిస్థితి.

-Dr.Seshagiriao-MBBS-8 Apr 2014

  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, 16 December 2011

Vitamin K




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Vitamin K- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • విటమిన్‌ కె ..
  • కొవ్వులో కరిగే విటమిను . రక్తము గడ్డకట్టుటలో ఉపయోగపడే ఒక ఫేక్టర్ . ఎముక మరియు ఇతర కణజాలము లో కొన్ని జీవక్రియలకు సహకరించును. దీనిలో విటమిన్‌ కె1 , విటమిన్‌ కె2 అని రెండు రకాలు. విటమిన్‌ కె1 ని విటమిన్‌ కెజె (ఫిల్లొక్వినోన్‌) అని కూడా పులుస్తారు .
విటమిన్‌ కె1 - మొక్కలలో తయారవును . అన్ని ఆకుపచ్చని ఆకుకూరలలోను , సోయాబీన్‌ లలోను లభించును . మానవ చిన్నపేగులలో బాక్టీరియా విటమిన్‌ కె1 ను విటమిన్‌ కె2 గా మార్చుతు ఉండును. విటమిన్‌ కె2 ఎముకల జీవపక్రియలో సహాయపడును.

  • విటమిన్‌-కె కుత్రిమ తయారీ రకాలు లో కె3 , కె4 ,కె5 లు ఉన్నాయి. కె1, కె2 విటమిన్లు హానికరము కావు . కుత్రిమ తయారీ విటమిన్లు కె3 (menadione) కొంతవరకు హానికరమని చెప్పబడుతున్నది .

  • చరిత్ర :
విటమిన్‌ కె 1929 లో డానిష్ దేశ శాస్త్రవేత్త " హెన్రిక్ డామ్‌ " చే గుర్తించబదినది . కొలెస్టిరాల్ ప్రాముఖ్యత తెలుసుకునే నిమిత్తము కోడిపిల్లలమీద ప్రయోగాల లో ... కొలెస్టిరాల లేని ఆహారము కొన్ని వారాలపాటు ఇవ్వగా వాటిలో రక్తస్రావము లక్షణాలు కనిపంచాయి . కొలెస్టిరాల్ ఉన్న మేత తిన్నివాటిలో రక్తస్రావ లక్షణాలు కనిపించలేదు . ఈ తేడాను అధికమించేందుకు కొలెస్టిరాల్ లేని మేత తిన్న వాటికి వుత్త కొలెస్టిరాల్ ఉన్న డైట్ ఇచ్చి చూడగా రక్తస్రావ లక్షణాలు తగ్గగపోవడము గమనించి ... ఎన్నోప్రయోగాల ఫలితము గా మొదటి గ్రూపు కోడిపిల్లకు ఇచ్చిన డైట్ నుండి ఒక కొత్త ఫేక్టర్ కనిపెట్టడం జరిగినది . దానికి లెటరు (అక్షరము ) కె అని నామకరణము చేయడము జరిగినది . దానినే " కాగులేషన్‌ విటమిన్‌ " అని అన్నారు హెన్రిక్ డామ్‌ .
  • విటమిన్‌ కె లో రకాలు :
విటమిన్‌ కె2 స్వయము గా విటమిన్‌ కె లో ఒకరకము . కె2 లో చాలారకాలు ఉన్నాయి. ముఖ్యము గా menaquinone-4 (MK4) , మరియు menoqinone-7 (MK-7) ల గురించి తెలుసుకోవడం జరిగింది . విటమిన్‌ కె1 నుండి .. ఎం.కె-4 మన శరీరములో వృషణాలు , పాంక్రియాస్ , ధమనుల గోడలు లలో ఇంకా మనం తెలుసుకోవలసిన రసాయన పక్రియ విధానములో మార్పుచెందుతూ ఉన్నది . ఎం.కె-7 మన శరీరము లో తయారవదు . ఆహారపదార్ధము లనుండి " phylloquinone " నుండి పేగులలోని బాక్టీరియా వలన తయారవుతుంది . ఈ రెండే ముఖ్యము గా విటమిన్‌ కె గా పరిగణించబడుతున్నాయి.

  • విటమిన్‌ కె absorption మరియు ఆహార అవసరాలు :
విటమిన్‌ -కె చిన్నపేగులు , పెద్దపేగులలో ఆహారము నుండి గ్రహించబడునని ఆధారాలు ఉన్నాయి. వివిదరకాల పేగుల వ్యాదులలోను , మాల్ అబ్సార్ప్ షన్‌ సిండ్రోమ్‌ లోనూ విటమిన్‌-కె లోపము గుర్తించడము జరిగినది . యాంటీబయోటిక్స్ వాడడము వలన ఫేగులలో మంచిబాక్టీరియా చనిపోవడము వలన ఈ విటమిను చాలావరకు గ్రహించబడడము లేదు . ఈ మధ్యన ప్రేవులనుండఎ డైట్ ద్వారా తగినంత రక్తములోనిని గ్రహించబడినా ... రక్తములో దాని మోతాదు అనుకున్నంత పెరగడము లేదు . దానికి కారణము incomplete" gamma-carboxylated protein " ‌ఉండడము వలన జరుగుతుంది.

  • కెమికల్ నిర్మాణము (chemical structure) :
అన్ని రకాల విటమిన్‌ కె సమూహాలు ఉమ్మడిగా " methylated naphthoquinone ring structure (menadione) కలిగిఉంటాయి. . . కాని అలిఫాటిక్ సైడ్ చైన్‌ లో మార్పు ఉంటుంది . ఈ సైడ్ చైన్‌ లో నాలుగు ఐసోప్రెనోయిడ్ రెసిడ్యూస్ ఉంటాయి. వీటి అన్నిటిలోనూ నాఫ్థోక్వినోన్‌ నే పనిచేసే రసాయనము . సింతటిక్ విటమిన్‌-కె లు అయిన కె-3, కె4, కె5 లు కూడా వాడుకలో ఉన్నాయి . పెంపుడు జంతువుల మేత-పరిశ్రమలలో (విటమి్‌-కె 3 ) వాడుతూఉన్నారు . విటమిన్‌-కె5 ఫంగల్ గ్రోత్ (బూజు పెరుగుదలను ) అరికట్టడానికి వాడుతున్నారు .

  • ఫిజియోలజీ (physiology) :
ఇతర కొవ్వులో కరిగే విటమిన్లు మాదిరిగానే విటమిన్‌ కె కూడా కొవ్వుకణజాలము (ఫాట్ టిస్స్యూ) లోనే నిలువా ఉంటుంది . విటమిన్‌-కె ప్రోటీన్లు లోని గ్లుటమేట్ రెసిడ్యుస్ లను కార్బాక్షిలేషన్‌(carboxylation) లో పాల్గొని " గమ్మ -కార్బాక్షీ గ్లుటమేట్ (gamma - carboxyglutamate) రెసిడ్యూస్ లను తయారు చేస్తుంది . ఈ మార్చబడిన రెసిడ్యూస్ నిర్ణీత ప్రోటీన్‌ డొమైన్స్ అయిన GLA డొమైన్స్ తో ఉండి అనేక పనులు చేయునని కనుగొనబదింది . సుమారు 15 మానవ జి.ఎల్.ఎ. డొమైన్లు గుర్తించబడినవి .... ఈ కింది పనులు చేయును .
  • రక్తము గడ్డ కట్తుట కు (blood coagulation- prothombin factor 11, factor v11 , 1x , x , protein C, protein S and protein Z)
  • ఎముకల జీవక్రియ (Bone metabolism): ఆస్టియోకాల్సిన్‌ తయారీ,
  • రక్తనాళాల పక్రియ : ప్రోటీన్‌ 6 పెరుగుగల ఆపడము , మున్నగునవి .
రోజువారి అవసరమైన విటమిన్‌-కె (daily requirement) :
  • చంటి బిడ్డలకు --- రోజుకి 10-20 మైక్రో గ్రా.
  • 25 సం . వయసు వారికి --- 120 మైక్రో.గ్రా.,
  • పెద్దవారికి ---- సుమారు 90 మై.గ్రా. ,

విటమిన్‌ కె లభించు ఆహారపదార్ధములు :
  • విటమిన్ K1 ఆకు పచ్చని బచ్చలికూర వంటి కూరగాయలు, స్విస్ chard, మరియు బ్రాసికా (ఉదా క్యాబేజీ, కాలే, కాలీఫ్లవర్, బ్రోకలీ, మరియు బ్రస్సెల్స్ మొలకలు) లో ప్రధానంగా లబించును .
  • అవకాడో వంటి ఫలాలు వంటి కొన్ని పండ్లు, kiwifruit మరియు ద్రాక్ష లలో లభించును .
  • కొన్ని కూరగాయల నూనెలు, ముఖ్యంగా సోయాబీన్ నూనె లలో లభించును.
  • మానవులు కోలోనిక్ బాక్టీరియా ఈ విటమిన్‌ ను పేగులలో తయారుచేసి 'విటమిన్ కె అవసరాలను తీర్చును . ఈ కారనము గా అప్పుడే జన్మించిన శిసువులు లో కోలాన్‌ బాక్టీరియా 5-6 రోజుల వరకూ ఉండవు కావున ఈ కె విటమిన్‌ లోపము కనబడును అందుకే పుట్టిన వెంటనే విటమిన్‌ కె ఇంజక్షన్‌ ఇస్తారు .
chloroplasts లో thylakoid పొర వరకు గట్టి బైండింగ్ వలన phylloquinone యొక్క ఆకుపచ్చని మొక్కలు లో విటమిన్ కె ఉన్నంత సమానమైన పరిమాణములో లభ్యత కాదు . ఉదాహరణకు, వండిన బచ్చలికూర phylloquinone ఒక 5% సమానమైన జీవ లభ్యతను ఉంది. ఒక బచ్చలికూర వరకు కొవ్వు జతచేస్తుంది ఉన్నప్పటికీ సమానమైన జీవ లభ్యతను కొవ్వు లో విటమిన్ కె పెరిగిన ద్రావణీయత కారణంగా 13% వరకు పెరుగుతుంది.

  • విటమిన్ K2 (Menaquinone-4) జంతు కణజాలం ద్వారా తయారగుటచే మరియు మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు లలో తగినంత లబించును . Menaquinone-7 -- బ్యాక్టీరియా ద్వారా కృత్రిమంగా మరియు పులియబెట్టిడము వలన తయారగును కాబట్టి పులియ బెట్టిన సోయాబీన్స్ లోను త్యయారగును.
  • విటమిన్ కె యొక్క MK-4 చీజ్ లో 2-7% లభించును .


  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

How many calories a person needs per day, ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని కేలరీల శక్తి అవసరం?


  • image : courtesy with Prajasakti news paper

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని కేలరీల శక్తి అవసరం?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



అవసరానికి మించి ఎక్కువ కెలోరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుని స్థూలకాయం వస్తుంది. భారతీయుల్లో ఉన్న 'త్రిప్టీ జీన్‌' వల్ల కూడా ఒబేసిటి వచ్చే అవకాశాలు ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. స్థూలకాయానికి, కెలోరీలకు అవినాభావ సంబంధం ఉంది. అయితే కెలోరీలు ఎలా ఖర్చవుతాయి? ఇవి కొవ్వుగా ఎలా మారతాయి? ఒక వ్యక్తికి ఎన్ని కెలొరీలు అవసరం? పళ్లు, కూరగయాలు, పాలు వంటి వాటిలో ఎన్ని కేలరీలో ఉంటాయి? కేలరీలను ఎలా ఖర్చు చేయాలనే అంశం గురించి తెలుసుకుందాం.

కేలరీలంటే మనిషి శరీరంలోని జీవక్రియలకు ఉపయోగించే శక్తికి కొలమానం. ఒక కేలరీ అంటే ఒక గ్రాము నీటిని ఒక సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు పెంచగలిగే శక్తి అని అర్థం. మనం తిన్న ఆహారం గ్లూకోజ్‌, ఫాటీ యాసిడ్స్‌ వంటి శక్తినిచ్చే ఇంధనాల రూపంలో నుండి అవసరమైనప్పుడు తగినన్ని కేలరీల శక్తిగా మారుతుంది. అందుకే మనం తినే ఆహారంలో ఉండే శక్తిని కేలరీలుగా కొలుస్తాం. ఒక వ్యక్తి రోజుకు ఎన్ని కేలరీల శక్తి అవసరం అనేది ఆ వ్యక్తి చేసే పనిపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి రోజు వారి అవసరాలకంటే ఎక్కువ శక్తినిచ్చే ఆహారం తిన్నప్పుడు ఆ అదనపు శక్తి కొవ్వు రూపంలో అదనపు బరువుగా మారుతుంది. సుమారు ప్రతి 7200 కేలరీ శక్తి మన శరీరంలో ఒక కిలోగ్రాము బరువుగా మారుతుంది. ఉదాహరణకు మనోహర్‌కు రోజుకు 2000 కేలరీల శక్తి అవసరం అనుకుందాం. తన అవసరాలకు మించి అలవాటుగా రోజుకు 12 బంగాళదుంప చిప్స్‌ తింటున్నాడనుకుందాం. అంటే రోజుకు సుమారు 180 కేలరీలు అదనంగా తింటున్నాడన్నమాట. 40 రోజుల్లో 7200 కేలరీలు అంటే ఒక కిలో బరువు, సంవత్సరంలో 9 కేజీల బరువు అదనంగా పెరుగుతాడన్నమాట. మనోహర్‌ అదనపు బరువు తగ్గాలంటే ఒక మోస్తరుగా వేగంగా 30 నిమిషాలు నడిస్తే అదే 180 కేలరీల శక్తి ఖర్చుపెట్టగలుగుతాడు. అంటే అదనంగా తినేది ఆపేసిన తర్వాత, రోజుకు 30 నిమిషాలు నడిస్తే అదనపు 9 కేజీలు తగ్గడానికి ఒక సంవత్సరం పడుతుందన్నమాట. ఇది కేలరీలకి--అదనపు బరువుకీ మధ్య ఉండే సంబంధం. అందుకే స్థూలకాయాన్ని, దాంతో సంబంధించే పలురకాల వ్యాధుల్నీ రాకుండా చూసుకోవాలంటే కేలరీల గురించి అవగాహన అవసరం. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కేలరీల శక్తినిచ్చే ఆహారంమాత్రమే తీసుకోవాలి.

  • ఎన్ని కేలరీల శక్తి అవసరం?
బిఎంఐ 18.5 నుంచి 23 ఉన్న వ్యక్తులు సరైన బరువు కలిగున్నట్లుగా భావిస్తాము .

* అధిక బరువు ఉన్నవారు తాము సరైన బరువు ఎంత ఉండాలో లెక్కించి ఉండాల్సిన బరువు (కిలోలు)ను 20 కేలరీల ఆహారంతో గుణించి తీసుకోవాలి.

* బరువు ఉండాల్సిన స్థాయిలోనే ఉన్నవారు తమ బరువు (కిలోలు)ను 30 కేలరీల ఆహారంతో గుణించి తీసుకోవాలి.

* బరువు తక్కువున్న వారు తాము సరైన బరువు ఎంత ఉండాలో లెక్కించి తాము ఉండాల్సిన బరువు (కిలోలు)ను 40 కేలరీల ఆహారంతో గుణించి తీసుకోవాలి.

పైన చెప్పిన కేలరీల లెక్క సుమారుగా, సరళంగా అర్థం కావడం కోసమే. అయితే రోజువారి కేలరీల అవసరాన్ని లెక్కించడానికి అనేక పద్ధతులున్నాయి. ఈ పద్ధతుల్లో రోజువారి చేసే శ్రమని బట్టి స్త్రీ, పురుష బేధాల్ని బట్టి, వయసును బట్టి, శరీరాకృతిని బట్టి నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్టంగా మారుతుంది. డాక్టర్‌ లేదా డైటీషియన్‌ మీ అవసరాలకు తగిన సరైన కేలరీల సంఖ్య సూచిస్తారు.

  • సమతుల ఆహారం
సాధారణంగా మనం తినే అన్ని ఆహారపదార్థాల్లో కేలరీలుంటాయి. కానీ కేవలం కేలరీలుండే పదార్థాలు సమతుల ఆహారం కాజాలవు. సమతుల ఆహారం అంటే ఐదు అంశాలుండాలి. అవి కార్బొహైడ్రేట్స్‌, ప్రోటీన్స్‌, ఫాట్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌. వీటిలో ఏవి లోపించినా అది సమతుల ఆహారం కాజాలదు. అందుకే మనం తీసుకోవాల్సిన ఆహారపు మెనూ డిజైన్‌ చేసుకునేటప్పుడు కేవలం కేలరీ సంఖ్య మాత్రమే కాకుండా ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. నేడు నగరాల్లో విస్తరిస్తున్న బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో లభ్యమయ్యేవి ఎక్కువ శాతం జంక్‌ఫుడ్స్‌. వీటిలో అధిక సాంధ్రతలో ఉండే కేలరీలు మాత్రమే లభ్యమవుతాయి. వీటిని ఒక రకంగా 'శుష్క కేలరీ బ్యాంకులు'గా పిలవొచ్చు.

  • మూడు గంటలకు మించితే...?
అవసరమైన కేలరీలు లభించే ఆహారాన్ని భుక్తాయాసం వచ్చేలా రెండుసార్లు తీసుకోవడం అనారోగ్య కరమైన ధోరణి. దీనికి బదులుగా కేలరీలను విభజించి 5 లేదా 6 సార్లు తినడం మంచిది. జార్జ్‌ క్రూయిజ్‌ అనే ఫిట్‌నెస్‌ నిపుణుడు ప్రతిపాదించిన ' ప్రతి మూడు గంటలకూ ఆహారం' అన్న సిద్ధాంతం ఏం చెబుతుందంటే... మనం ఆహారం తీసుకునే వ్యవధి మూడు గంటలకు మించితే శరీరం మనం ఉపవాసంలో ఉన్నట్లు భావిస్తుంది. జీవక్రియ రేటును తగ్గించి తక్కువ కేలరీలను ఖర్చుపెట్టి ఎక్కువ శక్తిని కొవ్వు రూపంలో దాచిపెడుతుంది. దీన్నే 'స్టార్వేషన్‌ ప్రొటెక్షన్‌ మెకానిజం' అని వర్ణించారు. ఈ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఇంకో రకంగా చేసినా రోజులో 5 నుంచి 6 సార్లుగా విభజించి, కొంచెం కొంచెం కేలరీలను తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మన శరీరంలో అదనపు శక్తి కొవ్వుకంటే ముందుగా గ్లైకోజెన్‌ రూపంలో లివర్‌, కండరాల్లో నిల్వ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి శరీరంలో లివర్‌ కేవలం 60 నుంచి 90 గ్రాములు, కండరాలు 300 నుంచి 400 గ్రాముల వరకు మాత్రమే గ్లైకోజెన్‌ రూపంలో శక్తిని నిల్వ ఉంచగలవు. లివర్‌, కండరాల్లో గ్లైకోజెన్‌ నిల్వల కెపాసిటీకి మించిన శక్తి ఆహారం నుండి వచ్చినప్పుడు అది అదనపు కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది. అందుకే పెద్ద మొత్తంలో ఆహారం తీసుకున్నప్పుడు అదనపు శక్తి అనివార్యంగా కొవ్వుగా మారి, అధిక బరువుకు దారితీస్తుంది.

ఆహార ప్రణాళిక ఇలా ఉండాలి

సాధారణంగా అందరూ అనుసరించదగ్గ ఆహార ప్రణాళిక అంటే ఏమిటో తెలుసుకుందా. ఒక వ్యక్తికి రోజుకు 1200 కేలరీ శక్తి అవసరం అనుకుందాం. మొత్తం కేలరీలను ఆరు భాగాలుగా విభజించుకుందాం. 25 శాతం, 25 శాతం, 25 శాతం, 10 శాతం, 10 శాతం, 5 శాతం. ఆరు భాగాలుగా విభజించి ఈ విధంగా ఆహారాన్ని తీసుకోవచ్చు. కేలరీల ఖర్చు ఏ వ్యకిలోనైనా సగటున వర్తిస్తుంది. కానీ వివిధ వ్యక్తుల్లో వారి వారి శరీరాకృతిని, బరువును బట్టి నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్టంగా మారుతుందని గమనించాలి. నిర్దిష్ట అవసరాలను బట్ట ఏ వ్యాయామం ద్వారా ఎంత కేలరీలు ఖర్చు పెట్టడం అవసరమో డాక్టర్‌ లేదా ఫిట్‌నెస్‌ నిపుణులు సూచిస్తారు. వాటి ప్రకారం వ్యాయామం చేయాలి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రోజుకు 40 నిమిషాలు వేగంగా, వారంలో కనీసం 5 రోజులు నడక తప్పనిసరి అని సూచిస్తోంది. మన దేశంలో ప్రమాదకరంగా విస్తరిస్తున్న ఒబేసిటిని దృష్టిలో ఉంచుకుని తాజా భారత ప్రమాణాలు రోజుకు 60 నిమిషాలు, వారంలో అన్ని రోజులు నడవాలని సూచిస్తున్నాయి. మీరు చేసే పనిని, సౌలభ్యాన్నిబట్టి ఎలాంటి వ్యాయామం మీకు సరిపోతుందో నిపుణుల సలహా మేరకు ఎంపిక చేసుకుని, క్రమం తప్పకుండా చేస్తూ వ్యాధులను దూరంగా ఉండండి.

6 గంటలకు 10 శాతం ఉదయం 120 కేలరీలు వెన్న తీసిన, చక్కెర లేని కప్పు పాలు (120 మిల్లీ లీటర్లు),

7 నుంచి 8 ..25 శాతం బ్రేక్‌ఫాస్ట్‌ 300 కేలరీలు 2 మీడియం సైజు ఇడ్లీలు (120 గ్రాములు. సుమారు160 కేలరీలు),

20 గ్రాముల పల్లీ చెట్నీ (70 కేలరీలు). చక్కెర లేని కప్పు టీ లేదా కాఫీ (100 మిల్లీ గ్రాములు. 60 కేలరీలు),

11గంటలకు 5 శాతం భోజనానికి ముందు 60 కేలరీలు కప్పు కాఫీ లేదా టీ లేదా గ్లాసు నిమ్మరసం.

2 గంటలకు 25 శాతం భోజనం 300 కేలరీలు వేడి అన్నం 2 కప్పులు (200 కేలరీలు). కప్పు కూరలు ( 60 కేలరీలు). కప్పు పలుచని మజ్జిగ (20 కేలరీలు),

4 నుంచి 5 ...10 శాతం డిన్నర్‌కు ముందు 20 కేలరీలు ఆపిల్‌ పండు (60 కేలరీలు) లేదా ఒక కమలా పండు ( 50 కేలరీలు) లేదా ఒక జామ (50 కేలరీలు) లేదా 3 సాల్టు బిస్కట్లు (60 కేలరీలు). దీంతోపాటు ఒకప్పు చక్కెర లేని టీ లేదా కాఫీ ( 60 కేలరీలు),

8 నుంచి 9 ...25 శాతం డిన్నర్‌లో 300 కేలరీలు మధ్యాహ్నాం భోజనంలాగే తీసుకోవాలి,

  • కూరగాయలు-(100 గ్రాముల్లో లభించే కేలరీలు)

  • కాకరకాయ 25,
  • బీరకాయ 15,
  • సోరకాయ 12,
  • దోసకాయ 15,
  • గోరచిక్కుడు 15,
  • మంచి చిక్కుడు 50,
  • టొమాటో 20,
  • వంకాయ 25,
  • బెండకాయ 35,
  • క్యాబేజి 45,
  • కాలిఫ్లవర్‌ 30,
  • క్యారట్‌ 48,
  • బంగాళదుంప 97,
  • ఉల్లిపాయ 50,
  • ములగ కాయ 25,

కూరలు లేదా వివిధ వంటల్లోకి నూనెని పరిమితంగా వాడాలి. వంట నూనె ఏదైనా రోజుకి 15 గ్రాములు లేదా 3 టీ స్పూన్స్‌మించకుండా వాడాలి. నూనె విరివిగా వాడితే పదార్థాల్లో కేలరీల సంఖ్యమారుతుందని గమనించాలి. రోజూ ఒకే రకమైన ఆహారం తినాల్సిన అవసరం లేదు. ఆహారపదార్థాల్లో ఉండే కేలరీల లెక్క ఆధారంగా వివిధ ఆహారాలను వ్యక్తిగత ఇష్టా ఇష్టాలకు అనుగుణంగా మార్పులు చేసుకుని తీసుకోవచ్చు.

-డాక్టర్‌ కె.శివబాబు,రాష్ట్ర హెల్త్‌ కమిటీ సభ్యులు,జనవిజ్ఞానవేదిక జహీరాబాద్‌.ఫోన్‌ : 9246277022
  • -----------------------------------
Visit my website - > Dr.Seshagirirao.com/