Tuesday, 16 August 2011

Mouth wash , మౌత్ వాష్ ,నోటిని శుబ్రపరిచే ద్రావకము





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మౌత్ వాష్ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మౌత్ వాష్ లేదా మౌత్ రింజ్ ని నోటి శుభ్రత కోసం వాడే ఒక ద్రావకము . నోటి దుర్వాసన పోగొట్టి , దంత రక్షణకు ఉపయోగపడును . నోటి లో చేసే ఏవైనా ఆపరేషన్స్ ఇన్ఫెక్షన్‌ అవకుండా మౌత్ వాష్ వాడుతారు . మౌత్ వాష్ ఎన్నో ఏళ్ళ నుండి సుమారు క్రీ.పూ. 2700 కాలము నుండీ వాడుకలో ఉంది . గ్రీకులు , రోమన్లు ... ఉప్పు , ఆలం , వెనిగర్ మిశ్రమాన్ని వాడేవారు . తరువాత కాలములో లీవెన్‌ హాక్ .. సూక్ష్మజీవులు కనుగొన్న తర్వాత నోటిదుర్వాసనకు క్రిములే కారణమని తలుసుకొని ఎన్నోరకాల యాంటిసెప్టిక్ మౌత్ ద్రావకాలు కనుగొనబడ్డాయి. కొంతమంది ధనిక గ్రీకులు , రోమన్లు నోటి సువాసనకు మౌత్ వాష్ లను వాడేవారు . 1960 లో రోయల్ డెంటల్ కాలేజీ ప్రొఫెసర్ " హెరాల్డ్ లోయ్ " దంతాల పై " డెంటల ప్లేక్స్ " ను రాకుండా ఉండేందుకు " క్లోర్ హెక్షిడిన్‌ " రసాయనాన్ని వాడకాన్ని ఉపయోగపడుతుందని కనిపెట్టడం తో దంత వైద్యము లో చాలా ఉపయోగకరము గా తయారయినది . అప్పటినుండి వ్యాపారపరముగా మౌత్ వాష్ లు తయారీ మొదలైనది .

ఒకవేళ పుక్కిలించేటప్పుడు ఈ మౌత్వాష్ పొరపాటున కడుపులోకి వెళ్ళినా ఎలాంటి సమస్యా ఉండదు. బ్యాక్టీరియాలో అనేక రకాలు నోటి దుర్వాసనకు కారణమవుతుంటాయి. ... దీనికోసం నాలుకను నాలుకబద్దతో శుభ్రం చేసుకోవడం, మౌత్వాష్ ఉపయోగించడం వంటివి చేయాలి.



ముఖ్యము గా వాడే మూలపదార్ధాలు :(Active ingredients in commercial brands of mouthwash )



  • థైమాల్ --thymol,
  • యూకలిప్టాల్ --eucalyptol,
  • హెక్షిడిన్‌ --hexetidine,
  • మిథైల్ సాలిసిలేట్ --methyl salicylate,
  • మెంథాల్ ---menthol,
  • క్లోర్ హెక్షిడిన్‌ గ్లుకొనేట్ --chlorhexidine gluconate,
  • బెంజాల్ కోనియం క్లోరైడ్ --benzalkonium chloride,
  • సిటైల్ పిరిడియం క్లోరైడ్ --cetylpyridinium chloride,
  • మిథైల్ పేరాబెన్‌ --methylparaben,

  • హైడ్రోజన్‌ పెరాక్షైడ్ --hydrogen peroxide,
  • డోమిఫెన్‌ బ్రోమైడ్ --domiphen bromide

  • ఫ్లోరైడ్ ---fluoride,
  • ఎంజైంస్ --enzymes,

  • కాల్సియం --calcium. మున్నగునవి .

ఇంకా ఇవి కాకుండా నీరు , స్వీట్నర్స్ అయిన సార్బిటాల్ -సూక్రలోజ్ -సోడియం సాక్కరిన్‌ -జైలిటాల్ (as a bacterial inhibitor) కలిపి ఉంటాయి .



మౌత వాష్ ఉపయోగాలు :

నోటి దుర్వాసనకోసము పుక్కలించడానికి సుమారు 20 మి.లీ. బ్రుష్ చేసుకున్న తర్వాత రోజూ రెండు పూటలూ చేయాలి . సుమారు అర నిముషము నోటిలో ఉంచి ఉమ్మివేయాలి . ఉదా:

లిస్టిర్న్‌(Listerine),

టోటల్ కేర్ (Total care)

హెక్షిన్‌ మౌత్ వాస్ (hexin mouth wash)

బెటాడిన్‌ మౌత్ వాష్ (Betadine),

వకాడిన్‌ (wakadin)మౌత్ వాష్ , మున్నగునవి మార్కెట్ లో లభిస్తున్నాయి.



దంతాల సంరక్షణ కు మంచి ఫలితాలు అందిస్తాయి . బ్రుష్ చేరలేని దంత బాగాలలోని బాక్టీరియాను ఈ మౌత్ వాష్ లు శుబ్రము చేస్తాయి . జింజివైటిస్ నయమవుతుంది . దంతగార తొలగిపోతుంది . .. దంత క్షయము నివారణ జరుగుతుంది .



హెర్బల్ మౌత్ వాష్ లు :

  • పెర్సికా (persica)--ఇది చిన్న మొక్క . దీని బెరడు , ఆకులు దంతరక్షణకు వాడుతారు .
  • సీసం ఆయిల్ ,
  • సన్‌ఫ్లవర్ ఆయిల్ ,
  • పుదీన ఆకు , ల నుండి తయారైన దావకాలు నోటిశుబ్రతకు వాడుతారు .


సైడ్ ఎఫెక్ట్స్ & ప్రమాదాలు :

  • కొన్ని మౌత్ వాష్ లు ఆల్కహాల్ ను కలిగిఉంటాయి . వీటివలన నోటి క్యాన్సర్ వచ్చేఅవకాశముంది .
  • డెంటల ఎరోజన్‌ ,
  • పళ్ళు రంగు మారె ప్రమాదము ఉంది ,
  • కొన్ని మౌత్వాష్ ల వల్ల రుచి తెలుసుకునే శక్తి తగ్గే అవకాశము ఉందనని అంటారు .
  • చిన్నపిల్లలు ప్రమాదవసాత్తు తాగేస్తే విషం గా ప్రమాదం సంభవించవచ్చును .






source : written / Dr.Seshagirirao -MBBS



  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, 15 August 2011

ఆడువారి ఆరోగ్యానికి అవసరమైన 6+3 ఫార్ముల , woman needs 6+3 formula for good health





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -6+3 విటమిన్‌ ఫార్ములా- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



తాము మంచి పోషకాహారాన్నే తింటున్నామని అనుకునే చాలా మంది మహిళలు కుఖ్యమైన ఆరు విటమిన్లు , మూడు ఖనిజాలు విస్సవుతుంటారు . ఆ ముఖ్యమైన పోషకాలు ఏమిటి , అవెందుకు అవసరము . వేటిలో లభస్స్తాయన్న అవగాహనే ఈ వ్యాసము ప్రధాన ఉద్దేశము .



విటమిన్లు :

1.విటమిన్‌ బి 6 : మంచి నిద్ర , జీర్ణశక్తి , మంచి మూడ్ లను క్రమబద్దీకరిస్తుంది . నాడీవ్యవస్థ సక్రమముగా పనిచేయడానికి సహకరిస్తుంది .

వేటిలో అభిస్తుంది . : ఉడికించిన చిలకడదుంప , అరటి పండు , ఉడికించిన చికెన్‌ . మున్నగునవి .



2.విటమిన్‌ బి 12 : చురుకుదనాన్ని పెంచి అలసటతో పోరాడు తుంది . ఎర్ర రక్త కణాల్లోని హీమోగ్లోబిన్‌ తయారీకి ఇది తప్పనిసరి .

వేటిలో అభస్తంది : పెరుగు , గుడ్లు , మాంసము , దానిమ్మ పండ్లు . ఇవి తినని వారు బి 12 మాత్రలు రూపము లో తీసుకోవాలి .



3. ఫోలేట్ (విటమిన్‌ బి-9): ముక్కముగా మెదడు , వెన్నెముక లోపాల్ని అరికట్టేందుకు గర్భము దాల్చిన తొలివారాల్లో ఇది చాలా కీలకము. కోలన్‌ , బ్రెస్ట్ . క్యాన్సర్ వచ్చే అవకాశాఅల్ని తగ్గించడములో ఇది సహకరిస్తుంది .

వేటిలో లభస్తుంది . : ఆకుకూరల్లో- పాలకూర , పప్పు గింజలలో-చిక్కుడు , శనగలు , గుడ్డు సొన , సన్‌ఫ్లవర్ గింజలు , కాలేయము , ఆరెంజ్ జ్యూస్ , ద్రాక్ష మున్నగునవి .



4. విటమిన్‌ డి 3 : కాల్సియం absorption లో తోడ్పడుతుంది . ఎముకలు , కండరాలు బలోపేతము చేస్తుంది . ఆటోఇమ్యూన్‌ వ్యాధుల నుంచి , బ్రెస్ట్ , ఒవేరియన్‌ క్యాన్సర్ల నుండి పరిరక్షిస్తుంది .

వేటిలో లభిస్తుంది : గుడ్లు , పాలు , కాడ్ లివర్ ఆయిల్ , ‌ పుట్టగొడుగులు ,ఆకుకూరలు , పండ్లు . సూర్యరశ్మి తగిలితే మన చర్మమే దీనిని తయారు చేసుకుంటుంది .



5. విటమిన్‌ -సి : మృదులాష్తి , ఎముక , డెంటీన్‌ ల మాత్రికను , రక్తనాళాల ఎండోథీలియం ను ఆరోగ్యముగా ఉంచుతుంది . వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తుంది , రక్తములో కొలెస్టిరాల్ ను కరిగిస్తుంది , ఇనుము శోషణాన్ని అధికము చేస్తుంది , స్కర్వే వ్యాధి రాకుండా కాపాడు తుంది .

వేటిలో లభస్తుంది : నిమ్మజాతి పండలలోను , ఉసిరి , ఆకుకూరలలోను , తాజా బంగాళా దుంప , టమాటో మున్నగునవి .



6.విటమిన్‌ -ఇ & కె : స్త్రీలలో సంతాన సాఫల్యము కోసము ఇది సహకరిస్తుంది . చర్మము , కేశాలు మంచి లస్టర్ గా , అందము గా కనిపించేందుకు , గుండె జబ్బు నివారణలోనూ ఉపయోగపడును.

వేటిలో లభిస్తుంది : వీట్ జర్మ్‌ ఆయిల్ , సన్‌ఫ్లవర్ ఆయిల్ , బాదము , స్పినాచ్ , టొమాటొ , మామిడి , బొప్పాయి మున్నగునవి .

విటమిన్‌ -కె : ఎర్రరక్త కణాలు తయారీకి , రక్తము గడ్డకట్టుటలో సహకరిస్తుంది . రోజుకి 90 mcg ఆడవారికి అవసరము .

వేటిలో లభిస్తుంది : spinach , కాబేజీ , కోసుపువ్వు (క్యాలీఫ్లవర్ ) , కివి ఫ్రూట్స్ , ద్రాక్ష , లివర్ ఉత్పత్తు లలో లభంచును .

ఖనిజలవణాలు :

1.ఐరన్‌(ఇనుము) : ఎర్రరక్తకణాలు తయారీకి ఐరన్‌ తప్పనిసరి . రక్తహీనత రాకుండా కాపాడుతుంది . మెదడు పనితీరు సక్రమముగా , ఉసారుగా ఉండి సంతాప్రాప్తికి దోహదపడుతుంది .

వేటిలో లభస్తుంది : మాంసము , రొయ్యలు , అన్ని ఆకుకూరలు , చిక్కుడు జాతి కూరలు , కాయదాన్యాలు ,శెనగలు (పీస్ ), బెల్లము , మున్నగువాటిలో లభించును .



2.కాల్సియం : గర్భిణి స్త్రీలకు , పెరిగే పిల్లలకు ... మీనోపాజ్ , యాండ్రో పాజ్ వయసు వచ్చిన పెద్దవాళ్ళకు కాల్సియం అవసరము . ఎముకల విరిగిపోకుండ , రక్తపోటు క్రమబద్ధీకరించును . ఆస్టియోపొరోసిస్ అనే ఎముకల వ్యాధి బారిన పడకుండా కాల్సియం తప్పనిసరి .

వీటిలో లభించును : పాలు , పాల ఉత్పత్తులు , ఆకు కూరలు, జున్ను, గోధుమ పొట్టులో పుష్కలంగా లభ్యమవుతుంది.



3.జింక్ & క్రోమియం :

జింక్ ఒక ముఖ్యమైన సూక్ష్మమూలకము , సుమారు 300 వరకూ శరీరములోని ఎంజైముల తయారీకి ఇది అవసరము . కణవిభజనకు , డి.ఎం.ఎ. & ప్రోటీన్ల తయారీకి , కణజాలము పెరుగుదలకు , గాయాలు మానుటకు , వ్యాధినిరోద మండలము అభివృద్ధి కి , ప్రోస్టాగ్లండిన్‌ ఉత్పత్తికి , ఎముకల తయారీవధానములోను , థైరాయిడ్ పనిలోను , రక్తము గడ్డకట్టుటలోను , కడుపులో శి్శువు పెరుగుదలకు , పురుష బీజకణాల ఉత్పత్తికి . . . జింగ్ అవసరము .

క్రోమియం : యాంటీఆక్షిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికిల్స్ ను బయటికి నెట్టివేయును , గుండె , రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడును , ఇన్సులిన్‌ పనితనాని ఎక్కువచేయడం ద్వారా రక్త ము లోని చెక్కెర స్థాయిలను అదుపుచేయుటలోను , ఫాట్ మెటబాలిజం లో సహాయపడును . brewer's yeast, sweet potato , corn , whole grains , meat and seafood లలో లభించును .

  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/



Thursday, 11 August 2011

ప్రాథమిక వ్యాయామాలు , Primary Exercises













ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ప్రాథమిక వ్యాయామాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...







ఎక్సర్‌సైజ్‌ నెం.1: ఉన్నచోటే పరుగెట్టడం…



--నిటారుగా నిలుచోండి. చేతులు ఫొటోలో చూపిన విధంగా పెట్టండి. మొ దట్లో కాలుని చాలా తేలికగా పైకి ఎత్తుతూ ఉన్నచోటే పరు గుపెట్టండి. క్రమంగా.. వేగాన్ని పెంచండి. చేతులను, భుజాల దాకా చాపి, క్రిందికి దింపుతూ, ముందుకు వెనక్కి కదిలించాలి. మీ శ్వాసక్రియ ఊపందుకొని, రొప్పే దశకు చేరుకున్నప్పుడు తిరిగి వేగాన్ని తగ్గిస్తూ.. పరుగు ఆపండి.



ఎక్సర్‌సైజ్‌ నెం.2: గెంతడం…



--ముందు నిటారుగా నిలబడండి. కాళ్ళు బాగా విడదీయండి. చేతుల్ని చెరోవైపు సాగదీసీ చాపి గెంతండి. కాళ్ళను మళ్లీ దగ్గర చేర్చండి. చేతుల్ని మీ తొడలమీదకు చేర్చండి. మళ్లీ గెంతండి. కాళ్ళు ఎడంగా పెట్టి చేతులు చాపండి. క్రమంగా వేగం పెంచండి. కాళ్ళు, చేతులు గట్టిగా సాగదీయడం బట్టి మీ గెంతులో ఊపు ఉంటుంది. ఊపిరి తీసుకోవడం రొప్పేదాకా చేసి ఆపండి.



ఎక్సర్‌సైజ్‌ నెం.3: గొంతుక్కూ చోండి…



-- నిటారుగా నిలబడండి. పాదాలను విడిగా వుంచండి. చేతుల్ని ఫొటోల్లో చూపిన విధంగా పెట్టండి. (బి) క్రిందికి మోకాళ్ళు పైకూర్చోండి. పిరుదులు మడమలకు తగలాలి. (సి) తరువాత చేతుల్ని ముందుపెట్టి పాదాల్ని వెనక్కి తీసుకు వెళ్లి ముని వేళ్లపై ఆన్చండి. తిరిగి లేచి నిలుచోండి. ఇలా నెమ్మదిగా మొదలుపెట్టి వేగం పెంచండి. రొప్పే దాకా చేసి ఆపండి.



ఎక్సర్‌సైజ్‌ నెం.4: తొడలను పట్టండి…



--నిటారుగా నిలుచోండి. (ఎ) చేతుల్ని నడుము మీద ఉంచుకోండి. (బి) అడుగు ముందుకువేసి కుడికాలుని కర్ణదిశగా పెట్టి ఫొటోలో చూపిన విధంగా రెండు చేతులతో తొడను బంధించండి. ఇలాగే కుడి కాలితో కూడా చేయండి. ఈ వ్యాయామాన్ని పదిసార్లు రిపీట్‌ చేయండి. రొప్పేదాకా ఇలా చేసి ఆపండి.





ఎక్సర్‌సైజ్‌ నెం.5: పాక్షికంగా గుంజిళ్ళు…



--కుడికాలికి, ముందర ఎడం కాలు పెట్టి నిటారుగా నిలబడండి. చేతుల్ని ఇలా తల వెనుక మీ శరీరాన్ని మోకాళ్ళు వంచడం ద్వారా ఆరు అంగుళాలు క్రిందికి వంచండి. మీ మోకాళ్ళను తిన్నగా చేస్తూ… చేతుల్ని ఇలా తలవెనుక మీ శరీరాన్ని మొకాళ్ళు వంచడం ద్వారా ఆరు అంగుళాలు క్రిందికి వంచండి. మీ మోకాళ్ళను తిన్నగా చేస్తూ.. ఒక్కసారి స్ప్రింగులా గెంతి మీ పాదాలతో నేలను తన్నండి. కాళ్ళు పెట్టే దిశను మార్చి రిపీట్‌ చేయండి. ఇలా పదిసార్లు చేయండి. ఊపరి వేగం పుంజుకున్నాక ఆపండి.



ఎక్సర్‌సైజ్‌ నెం.6: ముందుకీ, వెనక్కి వంగోండి…



--నిటారుగా నిలబడండి. మీ మొండాన్ని ముందుకు వంచి చేతులిలా పెట్టండి (ఎ) మీ చేతుల వేళ్ళతో నేలను తాకే ప్రయత్నం చేయండి. మోకాళ్ళు వంగకూడదు. తరువాత నిటారుగా నిలబడి భుజాలను వాల్చండి. తరువాత వెనక్కి వంగం డి. ప్రతీసారీ వీలైనంత ఎక్కువగా వెనక్కి, క్రిందికి వంగటానికి ప్రయత్నించండి (బి). అయిదుసార్లు ఇలా చేయండి. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ అయిదుసార్లు చేయండి.







  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/



Sunday, 7 August 2011

మహిళలకి ఫిట్‌నెస్‌తో.. ఆత్మవిశ్వాసం ఆనందం , Fitnes giev selfconfidence and happynes in femles







ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మహిళలకి ఫిట్‌నెస్‌తో.. ఆత్మవిశ్వాసం ఆనందం - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...







కాలేజీలో చదువుకొంటున్నప్పుడు.. కుందనపు బొమ్మలా! , పెళ్త్లెన కొత్తల్లో.. జాజి తీగలా సన్నగా, చలాకీగా.. మరిప్పుడో?.. లావుగా, నిస్సత్తువగా, అది నేనేనా అనిపించేలా! కుటుంబం, పిల్లలు, శ్రీవారు, కెరీర్‌ అంటూ బాధ్యతల చుట్టూ పరుగులు పెట్టే మహిళలకి ఆకృతి గురించి పట్టించుకొనే తీరిక ఉండకపోవచ్చు. కానీ ఫిట్‌నెస్‌తో.. ఆత్మవిశ్వాసం, ఆనందం సొంతం అవుతాయి. పోషకాహారం, వ్యాయామం ఈ క్రమంలో ఎంతో కీలకం అంటున్నారు నిపుణులు.



సన్నగా, మారాలని.. త్వరత్వరగా బరువు తగ్గిపోవాలని రెండు మూడు నెలల పాటు జిమ్‌కెళ్లడం, యోగాసనాలు వేయడం, సలాడ్లు తినడం... ఆ వెంటే 'ఇక మనవల్ల కాదు బాబూ' అనుకొంటూ ఆ పనులకు చుక్క పెట్టేయడం చాలామంది చేసేపని. ఇలాంటి అరకొర ప్రయత్నాలు బరువు తగ్గించవు సరికదా.. సన్నబడ్డం సాధ్యం కాదేమో అన్న నిరాశ నిస్పృహలోకి నెట్టేస్తాయి. అలా కాకుండా ఆరోగ్యకరమైన అలవాట్లని జీవనశైలిలో భాగంగా చేసుకొంటే చక్కని ఫలితాలు కనిపిస్తాయి.



అన్నీ తింటేనే అందం..

పోషకాహారం అనగానే.. శక్తినిచ్చే ఏవో కొన్ని పదార్థాలే ఈ కోవకి చెందుతాయి అనుకొంటారు. అవి మాత్రమే అతిగా తింటూ ఉంటారు. గోధుమ పదార్థాలు మంచివంటే అవే తింటూ కూర్చోవడం సరికాదు. తాజా పండ్లు, కాయగూరలు, గింజలు, సలాడ్లు, దంపుడు బియ్యం, జొన్నరొట్టెలు, తృణధాన్యాలు, మొలకలు, పప్పుధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు.. ఇలా విభిన్న వర్గాలకి చెందిన పదార్థాలన్నింటిని తగుమోతాదులో రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీనికి వ్యాయామం కూడా తోడయితే జీవక్రియలు సాఫీగా సాగుతాయి. అలా జరిగితే నిస్సత్తువ ఉండదు. పని మీద సానుకూల ధోరణి ఏర్పడుతుంది. పనిలో చకచక ఉంటే పేరుకొన్న కెలొరీలు కరగడం పెద్ద పనేం కాదుగా!



అల్పాహారంతో.. ప్రారంభం

అల్పాహారం అనగానే చాలామందిలో చిన్నచూపు. ఏదో తిన్నామంటే తిన్నాం అనో, ఏకంగా భోజనం చేసేస్తేపోదా అనో సరిపెట్టుకొంటారు. కానీ రోజంతా జీవక్రియలు సరిగ్గా సాగి హుషారుగా పనిచేయడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి, మధ్యాహ్నం, సాయంత్రం అతిగా తిని బరువు పెరగకుండా ఉండటానికి ఈ అల్పాహారమే కీలకం. మాంసకృత్తులు, పీచు, ఖనిజలవణాలు, విటమిన్లు ఉన్న టిఫిన్‌ తినడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. దాంతో పొట్టలోకి అనవసరపు చిరుతిళ్ల చెత్తా చెదారం చేరకుండా ఉంటుంది. పప్పులన్నీ వేసి కమ్మగా వండిన ఉప్మా, పెసరట్టు, పాలు, పీచు అధికంగా ఉండే ఓట్లు తినండి! మార్పు మీకే తెలుస్తుంది.



లెక్కపెట్టుకొంటున్నారా?

అన్ని రకాలూ తినడం మంచిదే! కాకపోతే ఎంత మేరకు తింటున్నాం అన్నది కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే కొందరివి క్షణం తీరిక లేకుండా కూర్చున్న చోట కూర్చోకుండా పరుగు పెట్టే ఉద్యోగాలు. మరికొందరివి ఆఫీసుకొచ్చినప్పుడు, వెళ్లినప్పుడు తప్ప సీటులోంచి లేవకుండా చేసే విధులు. ఇలా పనులను బట్టి కెలొరీలు అవసరం మారుతూ ఉంటుంది. కెలొరీలంటే మరేం కాదు.. ఆయా పదార్థాలు విడుదల చేసే శక్తే! మీ అవసరాలకు సరిపడేన్ని కెలొరీలు మాత్రమే తీసుకోవాలి. సాధారణంగా 55 కేజీల బరువుండే మహిళ 1900 కెలొరీల శక్తిని అందిపుచ్చుకోవాలి. అందులోనూ విటమిన్లు, మాంసకృత్తులు వీటికి ప్రాధాన్యం ఇవ్వడం మర్చిపోకూడదు. ఇలా చేయడం వల్ల్ల అధిక బరువు సమస్యని నియంత్రణలో పెట్టుకోవచ్చు. అయితే తీసుకొనే ఆహారాన్ని ఒకేసారి కాకుండా ఆరుసార్లు చిన్నచిన్న మొత్తాల్లో తినాలి. సాయంత్రం వేళల్లో పియర్‌, యాపిల్‌ వంటివి తింటే మేలు. 'వేడివేడిగా ఏం తిందామా' అని మనసు నియంత్రించుకోలేని వాళ్లు సాదా పాప్‌కార్న్‌ని తినొచ్చు.



నడకతో నాజూకు

తీసుకొనే ఆహారానికి తగ్గట్టుగా నిత్యం వ్యాయామం చేయడం వల్ల మాత్రమే తీరైన ఆకృతి సొంతమవుతుంది. రోజులో పదివేల అడుగులు వేస్తే ఎటువంటి జబ్బులు దరిచేరవన్నది ఒక అధ్యయనం. అమ్మో పదివేల అడుగులా? అదీ రోజూనా! అనేవారికి ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ చిన్న సడలింపు ఇచ్చింది. రోజులో మూడు వేల అడుగులు వేసినా చాలని. మెట్లెక్కడం, షాపింగ్‌ చెయ్యడం వంటి వాటన్నింటికీ నడిచి వెళ్లడం వల్ల మూడు వేల అడుగుల లక్ష్యం తేలిగ్గానే పూర్తవుతుంది. నడకతోపాటు యోగాసనాలు వేయడం, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ వంటి ఆటలు ఆడటం వల్ల కండరాలు దృఢమవుతాయి. స్ట్రెచింగ్‌.. కండరాలని తీర్చిదిద్దే వ్యాయామం ఇది. రోజులో పదిహేను నిమిషాల పాటు స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేయడం వల్ల తీరైన ఆకృతి సొంతమవుతుంది.



సానుకూలతతో సన్నగా

ఓ మంచి ఆలోచన వచ్చినప్పుడు దానిని పుస్తకంలో రాసిపెట్టుకోవడం, సానుకూల ఆలోచనలున్న వ్యక్తులతో మాట్లాడ్డం, ఉదయాన్నే చక్కని స్ఫూర్తినిచ్చే కొటేషన్లు రాసిన పోస్టర్లు చదవడం ఇవన్నీ మీ ఆలోచనని సాకారం అయ్యేట్టు చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆలోచనలు ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇస్తాయి. పని ఎప్పుడూ ఉండేదే! దానిని ప్రణాళికతోనే ఎదుర్కోవాలి. ఒత్తిడికి దూరంగా, హాయిగా నిద్ర పోవడం వల్ల కళ్లలో కాంతి, మేనిలో మెరుపు సొంతమవుతాయి.



--Dr.Janaki Srinath , Hyderabad

  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

రక్త దానం,Blood donation



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -రక్త దానం,Blood donation- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

1.రక్త దానం
రక్త దానం (Blood donation) అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరం లో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర (cornea), చర్మం (skin), గుండె (heart), మూత్రపిండం (kidney), రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్చందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు. కనుక ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు. చేసిన దానం సవ్యంగా వెచ్చించబడుతోందా, దుర్వినియోగం పాలవుతోందా అనే అనుమానం ఉండటం సహజం. దుర్వినియోగం అంటే మనం దానం చేసిన రక్తాన్ని కుళ్ళబెట్టి పారెయ్యడమయినా కావచ్చు లేదా నల్ల బజారులో అమ్మకానికి పెట్టినా పెట్టొచ్చు.

ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి (emergency) ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడయినా సరే ఒక లీటరు రక్తంలో 100 గ్రాముల కంటె ఎక్కువ రక్త చందురం(hemoglobin) ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పని లేదు. ఎవరి రక్తంలో అయినా సరే లీటరు ఒక్కంటికి 60 గ్రాముల కంటె తక్కువ రక్తచందురం ఉంటే అది రక్తం ఎక్కించవలసిన పరిస్థితి. అంతే కాని ఆపరేషను చేసినప్పుడల్లా రక్తం ఎక్కించవలసిన పని లేదు.

ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషను చేసి ప్రాణం కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషనులో కూడ కొంత రక్త స్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో మొత్తం నష్టం పది, పన్నెండు యూనిట్లు (ఒక యూనిట్ = ఆర్ధ లీటరు) దాకా ఉండొచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం రక్తమే ఉరమరగా 12 యూనిట్లు ఉంటుంది. ఈ సందర్భంలో రోగి (patient) శరీరంలో ఉన్న పాత రక్తం అంతా పోయి కొత్త రక్తం ఎక్కించిన పరిస్థితి రావచ్చు. ఇటువంటి సందర్భంలో ఎన్నో కారణాల వల్ల దానం స్వీకరించినవాడి రక్తం సులభంగా గడ్డకట్టదు. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులు ఎదురయినప్పుడు రోగి స్వంత రక్తాన్నే ఎంత వీలయితే అంత గొట్టాల ద్వారా పట్టి, కూడగట్టి, శుద్ధి చేసి, తిరిగి వాడతారు.
2. రక్తాన్ని నిల్వ చెయ్యటం
దానం చేసిన రక్తాన్ని అప్పటికప్పుడు, అక్కడికక్కడ వాడుకోవటం కష్టం. కనుక రక్తాన్ని ఏదో ఒక విధంగా నిల్వ చెయ్యాలి. రక్తాన్ని యధాతధంగా నిల్వ చెయ్యటం శ్రేయస్కరం కాదు; అందుకని రక్తంలో ఉన్న భాగాలని విడగొట్టి ఏ భాగానికా భాగాన్ని విడివిడిగా నిల్వ చేస్తారు. ఉదాహరణకి ఎర్ర కణాలని విడగొట్టి బీరువాలో నిల్వ చేస్తే 42 రోజులపాటు పాడు కాకుండా ఉంటాయి. అవే ఎర్ర కణాలని చల్లబరచి, గడ్డకట్టిస్తే 10 సంవత్సరాలు నిల్వ ఉంటాయి. రసిని చల్లబరచి, గడ్డకట్టిస్తే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కాని పళ్ళెరాలు (platelets) అయిదు రోజులు దాటి నిల్వ ఉండటం లేదు. నిల్వ చేసే విధానాల మీద ప్రయోగాలు జరుగుతూ ఉండగా రక్తం చేసే ఉపకారాన్ని రసి (plasma) ఒక్కటీ చెయ్యగలదని కనిపెట్టేరు. కనుక రసి ని నిల్వ చేసి రవాణా చేసే పద్ధతులు కనిబెట్టేరు. రసి మీద అంశిక శ్వేదనం (fractional distillation) వంటి అస్త్రాలని ప్రయోగించి కారణాంశం-1 (factor-1) అనే గుండని విడదీశారు. దీనినే ఫైబ్రినోజెన్‌ (fibrinigen) అని ఇంగ్లీషులోనూ 'తాంతవజని' అని తెలుగు లోనూ అంటారు. అటు తరువాత కారణాంశం-2, కారణాంశం-3 అనే మరొక రెండు పదార్ధాలని విడదీశారు. ఈ రెండు కారణాంశాలలో ముఖ్యంగా ఉండే పదార్ధాల పేరు గ్లాబ్యులిన్‌లు (globulins). శరీరం రోగ గ్రస్తం కాకుండా కాపాడటంలో ఈ గ్లాబ్యులిన్‌లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. పాల సముద్రాన్ని మధించినట్లు ఈ రసిని ఇంకా మధిస్తే కారణాంశం-4 వస్తుంది. దీనికే మరొక పేరు కోలెస్టరాల్‌ (cholesterol). ముడి చమురుని అంశిక శ్వేదనం చేసినప్పుడు ఆఖరున తారు లభించినట్లు, రసిని ఇంకా మధిస్తే వచ్చే అయిదవ కారణాంశం పేరు ఆల్బ్యుమిన్‌ (albumin). దీనిని గుండ రూపంలో వెలికి తీసి నిల్వ చెయ్య వచ్చు. ఇంకా కారణాంశాలు ఉన్నాయి. కాని వాటి ప్రస్తావన ప్రస్తుతం అప్రస్తుతం.

ఇలా రక్తం లోని భాగాలని వీడదీసి నిల్వ చెయ్యటంలో కొన్ని లాభాలు ఉన్నాయి. సాధారణంగా రక్తాన్ని ఎక్కించవలసిన ఏ సందర్భం లోనూ కూడ పక్కా రక్తం (whole blood) అవసరం ఎప్పూడో కాని రాదు. ఒకొక్క పరిస్థితిలో ఒకొక్క కారణాంశం అవసరం ఉంటుంది. అప్పుడు అదొక్కటే వాడి విలువైన రక్తాన్ని పొదుపుగా వాడుకోవచ్చు. అంతే కాకుండా పైన చెప్పిన కారణాంశాలన్నీ కూడ గుండ రూపంలో ఉంటాయి కనుక వాటిని నిల్వ చెయ్యటమూ, రవాణా చెయ్యటమూ తేలిక.
3. రక్తపు వ్యాపారం

మనం రక్తం ఇచ్చినప్పుడు 'దానం' చేస్తాం. ఆసుపత్రి వారు మనకి రక్తం ఎక్కించినప్పుడు డబ్బు వసూలు చేస్తారు. కనుక ఇది ఒక రకమైన 'ధర్మ వ్యాపారం.' సా. శ. 2008 లో ముడి చమురు వెల పీపా ఒక్కంటికి 120 అమెరికా డాలర్లు. అదే పీపాడు రక్తం బజారులో కొంటే సునాయాసంగా $20,000 పైనే పలుకుతుంది. ముడి చమురుని అంశిక స్వేదనం చేసి పెట్రోలు, కిరసనాయిలు, వగైరాలుగా చేసి చిల్లరగా అమ్మితే పీపాకి ఓ $500 రావచ్చు. అదే విధంగా రసిని విడి విడి కారణాంశాలుగా విడగొట్టి అమ్మితే పీపాకి $70,000 పైనే వస్తుంది. సాలుకి సగటున 20 మిలియను గేలన్ల రక్తాన్ని పోగు చేసి వ్యాపారంలో తిప్పుతున్నారు. ఈ రక్తం బజారు వెల $20,000,000,000. ఇంత డబ్బుతో వ్యవహారం అయినప్పుడు అత్యాస కి అవకాశాలు పుడతాయి. ఇలాంటి సందర్భాలలోనే రక్తపు సరఫరా రోగగ్రస్తమయిన రక్తంతో కల్తీ అయే ప్రమాదం ఉంది. కనుక ఒకరి రక్తం మరొకరికి ఎక్కించేటప్పుడు అప్రమత్తతతో ఉండకపోతే కామెర్లు, ఎయిడ్స్ వంటి రోగాలు సంక్రమించే సావకాశం ఉంది.

ఈ ప్రమాదాల నుండి తప్పించుకుందుకి ఎవరి రక్తం వారే, ఎవరికి వారే' దానం చేసుకుని 'బేంకు' లో దాచుకుంటారు. ఉత్తరోత్తర్యా వచ్చే అవసరం వెంబడి వాడుకుంటారు. ఇది ఒక కొత్త ధోరణి!
4. కృత్రిమ రక్తం

ఈ రోజుల్లో రక్త దానం చేస్తామని ముందుకొచ్చేవారి సంఖ్య తగ్గుతోంది. జనాభాలో నూరింట అయిదుగురు మాత్రమే రక్త దానం చేస్తామని ముందుకి వస్తున్నారు. ఇలా సరఫరా ఒక పక్క తగ్గిపోతూ ఉంటే మరొక పక్క నుండి వృద్ధుల జనాభా పెరుగుతోంది. రక్త దానం పుచ్చుకునే వారిలో ఎక్కవ భాగం వయ్సు మళ్ళిన వారే.కనుక రక్తానికి ఎద్దడి రోజులు వస్తున్నాయి. దీనికి తోడు రవాణా ఇబ్బందులు, నిల్వ చెయ్యటంలో ఇబ్బందులు వల్ల కృత్రిమంగా రక్తం తయారు చెయ్యాలనే కోరిక పెరిగింది. కృత్రిమంగా తయారు చేసిన రక్తం (artificial blood)ఈ దిగువ చూపిన లక్షణాలు కలిగి ఉండాలి.

* అది అవిషి (non-toxic) అయి ఉండాలి.
* అందులో రోగకారక పదార్ధాలు ఉండకూడదు.
* రవాణా చెయ్యటానికి అనుకూలంగా ఉండాలి.
* గ్రహీత శరీరంలోకి ఎక్కించినప్పుడు రక్షక ప్రతిస్పందన (immune reaction) రాకూడదు.
* ఏ జాతి రక్తంతో అయినా కలసిపోగలగాలి.
* అవసరం తీరేవరకూ (శరీరం తన సొంత రక్తాన్ని తయారు చేసుకునే వరకు) పాడవకుండా పని చెయ్యాలి.
* అవసరం తీరిన తరువాత శరీరం నుండి విసర్జించబడాలి.
* అలమారు లో చాల కాలం నిల్వ ఉంచినా పాడవకూడదు. (దీనినే అలమారు ఆయుర్దాయం లేదా shelf life అంటారు.)

ఈ కోరికలన్నింటినీ తీర్చటానికీ ఇంతవరకు అనుకూలమైన పదార్ధం దొరకలేదు.

Source : Wikipedia.org

గ్రూపులతో పనిలేదు, ఇక రక్తమంతా ఒకటే---Andhraprabha news paper
apr - Fri, 11 Mar 2011, IST

టొరంటో : పలానా రక్త గ్రూపు నాది, ఆ గ్రూపు రక్తం కావాలి లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎవరికైనా, ఏ గ్రూపు రక్తం వ్యక్తికైనా ఒకే రక్తం అందుబాటులోకి రాబోతున్నది. అదే యూనివర్శల్‌ బ్లడ్‌. కెనడాలోని మెక్‌గిల్‌ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ మర్యం టబ్రిజియాన్‌, అతని సహచరులు పలు పరిశోధనల చేసి యూనివర్శల్‌ బ్లడ్‌ను రూపొందించారు. దాదాపు 29 రకాల ఎర్రరక్త కణాలను, ఇందులో ఎబిఒ, ఆర్‌హెచ్‌ రకాలను ఒక ఉపాయం ద్వారా అనుసంధానం చేసి యూనివర్శల్‌ బ్లడ్‌ను రూపొందించినట్లు బయోమాక్రోవోలెకులెస్‌ జర్నల్‌లో ఒక కథనం వెలువడింది. విపత్కర పరిస్థితులలో ఒక గ్రూపు రక్తం ఎక్కాల్సింది పోయి మరో రక్తం ఎక్కించినప్పుడే పలు ప్రమాదాలు సంభవిస్తాయి. సంభవిస్తుంటాయి. ఒకానొక సమయంలో మానవుని ప్రాణాలకే ప్రమాదం చోటుచేసుకుంటుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు సుదీర్ఘకాలం జరిపిన పరిశోధనలలో అన్ని రకాల గ్రూపుల వారికి సరిపోయేలా యూనివర్శల్‌ బ్లడ్‌ను రూపొందించామని మెక్‌గిల్‌ యూనివర్శిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. బహు అణురక్తకణాలలో స్వతంత్ర ఎర్రరక్త కణాలు జీవించేలా అభివృద్ధి చేశామని, దీంతోనే అన్ని రకాల గ్రూపు రక్తం వారికి ఈ యూనివర్శల్‌ బ్లడ్‌ ఒక వరంలాగా ఉపయోగపడనుందని పేర్కొంది. మామూలు గ్రూపు రక్తం మాదిరిగానే యూనివర్శల్‌ బ్లడ్‌ పనిచేస్తుందని, ఒకసారి మానవుని శరీరంలోకి ఎక్కించిన తర్వాత సాధారణ రక్తకణాల మాదిరిగానే కలిసిపోతుందని పేర్కొంది. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయి పరిశోధనలు చేయాల్సి వుందని మెక్‌గిల్‌ యూనివర్శిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, 6 August 2011

నిద్ర అవస్థ , Sleep disorder





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నిద్ర అవస్థ , Sleep disorder- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



సాధారణంగా ప్రతి మనిషికి 6-8 గంటల నిద్ర ఉంటే సరిపోతుంది. చిన్నపిల్లలు 8-10 గంటలు, రోజుల పిల్లలు 14-20 గంటలు నిద్రపోతారు. 50 ఏళ్ల తర్వాత నిద్ర క్రమేపీ తగ్గుతూపోతుంది. 60 ఏళ్లకు 4-6 గంటలు, 70 ఏళ్లకు 4-5 గంటలు, 80 ఏళ్లకు 3-4 గంటలు మాత్రమే నిద్ర సరిపోతుంది. మెదడులో నిద్రకు సంబంధించిన భాగాన్ని ‘పీనియల్‌గ్లాండ్’అంటారు. దీని నుంచి మెలటోనిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది నిద్ర ఎంత స్థాయిలో అవసరం అవుతుందో తెలియజేస్తుంది.

పీడకల వచ్చిందంటే నిద్రపట్టింది అనడానికి సంకేతం. ఆ పీడకల వల్ల నిద్ర ఇచ్చే సాంత్వన దూరమవుతుంది. అది ఒక అవస్థ. ఒకవేళ నిద్ర పట్టకపోయినా అదీ అవస్థే. నిద్ర అందరికీ కావాలి. రోజంతా పనులతో అలసిపోయిన మనిషి రాత్రివేళ నిద్రలో విశ్రాంతి పొందుతాడు. అయితే కొందరు నిద్రపట్టక బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు అతినిద్ర కారణంగా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కోల్పోతుంటారు. జీవితంలో సగభాగం నిద్రలో గడిపినా మనిషి దాన్ని వృథా అనుకోడు. నిజానికి ఆరోగ్యం కోసం అది అవసరం కూడా. మనిషికి నిద్ర ఎన్ని గంటలు కావాలి? ఏయే వయసులో ఎంత నిద్ర అవసరం? నిద్ర పట్టకపోవడానికి కారణాలేంటి? హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలి?

ప్రతియేటా ప్రపంచంలో 50 శాతానికి పైగా జనాభా రకరకాల నిద్రకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా మనిషి రోజూ 6-8 గంటలు హాయిగా నిద్రపోతే 50 శాతం వరకు జబ్బులు దరిచేరవు అనేది వైద్యులు చెబుతున్నమాట.


నిద్ర సమస్యలు
1.నిద్రలేమి (ఇన్‌సామ్నియా)
2.అతినిద్ర (హైపర్ సామ్నియా)
3.నిద్రలో విచిత్రంగా ప్రవర్తించడం. (పారాసామ్నియా) వీటిలో నిద్రలేమి సమస్య ఎక్కువమందికి వస్తుంది.

నిద్రలేమి
రాత్రిపూట కావలసినంత నిద్రలేకపోవడం. దీని వల్ల పగలు పనిలో మధ్య మధ్యలో నిద్రపోవడం. త్వరగా కొపం రావడం, ఏకాగ్రత లోపించడం. మతిమరపు, పనిలో సామర్థ్యం తగ్గిపోవడం... వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ ఎక్కువ రోజులు కొనసాగితే బి.పి., గుండెజబ్బులకు దారితీయవచ్చు. అలాగే మైగ్రెయిన్ తలనొప్పి, బ్రెయిన్‌స్ట్రోక్, కడుపులో హైపర్ అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్లు రావడం, యాంగ్జైటీ న్యూరోసిస్, డిప్రెషన్ లాంటి జబ్బులు వస్తాయి. వేళకు నిద్ర పోకపోవడం, వేళకు తినకపోవడం, నిద్రపోయేముందు పొగతాగడం, కాఫీ, టీలు ఎక్కువ తీసుకోవడం, శీతలపానీయాలు సేవించడం, తీవ్ర ఒత్తిడికి గురికావడం, కొన్నిరకాల మందులు
(ఆస్థమా, గుండెజబ్బులు, మూత్రపిండాలు, లివర్ జబ్బుల, స్థూలకాయం, థైరాయిడ్ సమస్యలు... వంటి వాటికి వాడే మెడిసిన్స్), విపరీతమైన నొప్పి (తలనొప్పి, మెడనొప్పి, పంటినొప్పి, కాళ్లు-చేతులు మంటలు, కడుపులో మంటలు...) వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి.

విచిత్రంగా ప్రవర్తించడం
కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది ఇది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో జరుగుతుంది. వీరు కొన్నిసార్లు తలుపు తీసుకుని బయటకు వెళ్లడమే కాకుండా, అనుకోని ప్రమాదాల బారిన పడుతుంటారు. మెలకువ వచ్చాక తామిలా చేశామన్న విషయమే వీరికి గుర్తుండదు. ఇంకొంతమంది నిద్రలో లేచి భయంకరంగా ప్రవర్తిస్తారు. పెద్ద పెద్దగా అరవడం, వస్తువులను పగలగొట్టడం చేస్తుంటారు. కలలో మమేకం అయిపోయి ఇలా ప్రవర్తిస్తారు. ఇది కూడా నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో వస్తుంది. రాత్రి నిద్రలో ఇలా ప్రవర్తించినట్టు పొద్దునే వీరికి గుర్తుకు రాదు. ఈ సమస్యను స్లీప్‌టెరర్ ్రఅంటారు. ఇది 5-15 ఏళ్ల పిల్లల్లో కనిపిస్తుంటుంది. కొందరు నిద్రలో మాట్లాడుతుంటారు. దీనిని స్లీప్ టాకింగ్ అంటారు. దీంతో పాటు కొంతమంది పిల్లలకు రాత్రిపూట పక్కతడిపే అలవాటు కూడా ఉంటుంది. 5-7 సంవత్సరాల పిల్లల్లో ఇది సాధారణమే. పదేళ్లకు పైబడిన పిల్లల్లో ఈ సమస్య ఉంటే దీనిని నాక్టర్నల్ ఎన్యురోసిస్ అంటారు. భయంకరమైన కలలు రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ మంచి చికిత్స ఉంది. కౌన్సెలింగ్, మందుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు.

నిద్ర పరీక్షలు
నిద్ర సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించడానికి ఆధునిక పద్ధతులెన్నో అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రో ఎన్‌సెఫలో గ్రామ్ (ఈఈజీ)అనే టెస్ట్ ద్వారా స్లీప్ డిజార్డర్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో కనిపెట్టి, దానికి తగిన చికిత్స చేయవచ్చు. నిద్రకు సంబంధించిన ఏ సమస్య అయినా అది మన జీవనశైలి సక్రమంగా లేకపోవడం, అనారోగ్య పరిస్థితులే కారణం అవుతుంటాయి. వీటిని సరిచూసుకుంటే రోజులో శరీరానికి ఎంత నిద్ర అవసరమో, అంతవరకు నిద్ర ద్వారా విశ్రాంతి తీసుకుంటుంది .

అతినిద్ర
హైపర్‌సామ్నియా అని పిలిచే అతినిద్ర సమస్య ఉన్నవారు రోజుకు 10 గంటలకంటే ఎక్కువ నిద్రపోతారు. ఇది హైపోథైరాయిడ్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు ఉండేవారి లో ఎక్కువ. నార్కోలెప్సీ సమస్య ఉన్నవారు పగలుకూడా నిద్రపోతుంటారు. దీనిని ఇర్రెస్టిబుల్ స్లీప్ డిసార్డర్ అని కూడా అంటారు. క్లీన్ లెవిన్ సిండ్రోమ్ ఉన్నవారు నెలల తరబడి నిద్రపోతుంటారు. రామాయణంలో కుంభకర్ణునికి ఈ జబ్బు ఉందనుకోవచ్చు.

గురక
పక్కవారికి నిద్రపట్టకుండా చేసే గురక స్లీప్ ఆప్నియా లో ఉంటుంది. సెంట్రల్ స్లీప్ ఆప్రియా, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అని ఇది రెండు రకాలు. నిద్రలో గురక పెట్టేవారు సాధారణంగా స్థూలకాయులై ఉంటారు. ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తుంటుంది. గాలి పీల్చుకునే శ్వాసకోశంలో బ్లాక్స్ ఉంటే గురక వస్తుంది. అప్నియా అంటే గాలి పీల్చుకోవడం కొద్దిగా కొద్దిగా ఆగిపోతూ ఉండటం. గురకతో పాటు అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉంటే తప్పనిసరిగా వె ద్యులను సంప్రదించాలి. పగటిపూట నిద్రపోతూనే చాలామంది గురకతీస్తుంటారు. వీరికి రాత్రిపూట నిద్ర కరువే. కష్టపడి పనిచేయటం ద్వారా వీరికి గురక వస్తుందని కాదు. దీనికి స్లీప్ అప్నియా అంటారు. స్లీప్ అప్నియా వ్యాధికి ముఖ్య లక్షణం ఈ గురక తీయడమే . ఈ గురక మూడు సమయాలలో రావచ్చును . పడుకోగానే గురక మొదలయ్యే గురక, మధ్యరాత్రి మొదలయ్యేగురక. తెల్లవారు జామున మూడు గంటలప్రాంతంలో మొదలయ్యే గురక.

ఈ స్లీప్ అప్నియాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఆక్సిజన్ అవసరం కోసం కాస్త వ్యాయామ రీతిలో పనిచేయడం,
ఆల్కహాల్‌ను సేవించడం నిలిపివేయడం,
అతిగా భోజనం చేయకూడదు ,
క్రొవ్వు పదార్థాలను తక్కువుగా తీసుకోవడం,

స్లీప్ అప్నియా అంటే...

స్లీప్ అప్నియా అనేది ఒక నిద్రా అవ్యవస్థ లేదా క్రమరాహిత్యం. ఇది నిద్రిస్తున్నప్పుడు శ్వాసలో అంతరాయాల ద్వారా ఏర్పడుతుంది. లేమి నుండి, శ్వాస పీల్చడం వరకూ అప్నియా అని పిలువబడే ప్రతి ఘటన కూడా, చాలా కాలం కొనసాగుతుంది కాబట్టి ఒకటి లేదా రెండు శ్వాసలు తప్పిపోతాయి, అలాంటి ఘటనలు నిద్రాసమయం పొడవునా పదే పదే సంభవిస్తుంటాయి. ఏదైనా స్లీప్ అప్నియా ఘటనకు సంబంధించిన ప్రామాణిక నిర్వచనం శ్వాసల మధ్య కనీసం 10-సెకనుల విరామంతో కూడుకుని ఉంటుంది. నాడీశాస్త్రపరమైన మేల్కొలుపు , లేదా O2గా కొలవబడే EEG ఫ్రీక్వెన్సీలో 3 సెకనులు లేదా అంతకు మించిన మార్పు లేదా రక్తం ఆక్సిజన్ లో 3-4% లేదా అంతకు మించిన శాతం కోల్పోవడం లేదా పెంపు మరియు కోల్పోవడం అనే రెండు రూపాలలో ఇది ఉంటుంది. స్లీప్ అప్నియా అనేది పోలిసోమ్నోగ్రామ్, లేదా "నిద్రా అధ్యయనం అని పిలువబడే ఒక రాత్రిపూట నిద్రా పరీక్షతో వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది.

శరీరంలోని టాన్సిల్ సైనసైటిస్, రైనైటిస్ వంటి సమస్యలు గురకకు ప్రధాన కారణమవుతుంది. నిద్రలో దేహక్రియలన్నీ తమ సహజవేగాన్ని కోల్పోయి శ్వాస ఆడటంలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ ఎప్పటికీ ప్రమాదం. జీవ ప్రక్రియల వేగం పడిపోవడంతో శ్వాస మందగించి కొన్ని క్షణాల పాటు నిలిచిపోవడం ఈ అప్నియా లక్షణం.

అయితే ఇది పెద్ద సమస్య కాదు. ఈ సమస్యతో రాత్రి నిద్ర కరువై పగటిపూట కునికి పాట్లు తీస్తుంటారు. ఈ అప్నియాతో కోపం, గుండెజబ్బులు, అసహనం, శరీరంలో కొలస్ట్రాల్ వల్ల ప్రాణాపాయం ఉండును . అయితే రక్తనాళాల బలహీనత గుండెకు సంబంధించిన జబ్బులు మాత్రం ఉంటే ప్రాణాంతకంగా మారవచ్చు.

స్లీప్ సైకిల్...
సాధారణంగా ప్రతి మనిషికి 6-8 గంటల నిద్ర ఉంటే సరిపోతుంది. చిన్నపిల్లలు 8-10 గంటలు, రోజుల పిల్లలు 14-20 గంటలు నిద్రపోతారు. 50 ఏళ్ల తర్వాత నిద్ర క్రమేపీ తగ్గుతూపోతుంది. 60 ఏళ్లకు 4-6 గంటలు, 70 ఏళ్లకు 4-5 గంటలు, 80 ఏళ్లకు 3-4 గంటలు మాత్రమే నిద్ర సరిపోతుంది. మెదడులో నిద్రకు సంబంధించిన భాగాన్ని ‘పీనియల్‌గ్లాండ్’అంటారు. దీని నుంచి మెలటోనిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది నిద్ర ఎంత స్థాయిలో అవసరం అవుతుందో తెలియజేస్తుంది.

7-8 గంటల నిద్రలో 4-5 స్లీప్ సైకిల్స్ ఉంటాయి. మళ్లీ ఇందులో ‘నాన్ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్, రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’ అని రెండు దశల నిద్రలు ఉంటాయి. ‘నాన్ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’లో మళ్లీ నాలుగు దశలుంటాయి. ‘రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’లో కనుపాపలు వేగంగా కదులుతుంటాయి. దీంతో పాటు కాళ్లు, చేతులు కదలడం, గుండె వేగంగా కొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. దీనినే కలతనిద్ర అంటారు. ఇక ‘నాన్ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’ను గాఢ నిద్ర అంటారు.

నిద్రలేమి-నివారణ
నిద్రకు ఉపక్రమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు...
  • ఊపిరితిత్తులకు, గుండెకు సంబంధించిన జబ్బులకు మందులు వాడుతుంటే డాక్టర్ సలహామేరకు పగటిపూట వాడేటట్లు చూసుకోవాలి.
  • పడకగదిని నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. గది వాతావరణం మరీ వేడిగా, మరీ చల్లగా ఉండకూడదు. గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలి. గది గోడలు, కర్టెన్లు, బెడ్‌షీట్లు... తేలికపాటి రంగుల్లో ఉండాలి.
  • ఆల్కహాల్ తీసుకోకూడదు.
  • రోజూ ఒకే సమయంలో నిద్రపోవాలి.
  • పగటిపూట నిద్రపోకూడదు.
  • సాయంకాలం 30 ని.లు వ్యాయామం చేయాలి.
  • నిద్రించే ముందు రోజూ గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
  • నిద్రకుపక్రమించడానికి 2-3 గంటల లోపల టీ, కాఫీ, పొగ... తాగకూడదు.
  • నిద్రపోయేముందు నవలలు, పుస్తకాలు చదవకూడదు. (ఆసక్తికరమైన అంశాలు ఉంటే నిద్ర సరిగ్గా పట్టదు)
  • నిద్రకు ముందు భయానక దృశ్యాలను (టీవీ, సినిమా..) చూడకూడదు. (ముఖ్యంగా పిల్లలు వీటిని చూడటం ద్వారా రాత్రి కలల్లో వచ్చే దృశ్యాలకు విపరీతంగాప్రవర్తిస్తుంటారు.)
  • నిద్రపోవడానికి ముందు గోరువెచ్చటి పాలు తాగాలి.
  • నిద్రపోయేటప్పుడు ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినాలి.
  • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, 3 August 2011

క్రమశిక్షణ - పిల్లల మనష్థత్వము , Discipline and children Psychology



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -క్రమశిక్షణ - పిల్లల మనష్థత్వము- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఎంత చెప్పినా అల్లరి మానరు. క్రమశిక్షణ పాటించరు. ట్యూషన్లు పెట్టించినా, ఇంట్లో కూర్చోబెట్టి చెప్పినా చదువులో వెనుకబాటే. ఇలాంటప్పుడు తల్లిదండ్రులకు ఆపుకోలేనంత కోపం రావడం సహజమే! దాన్ని
అదుపు చేయలేని పరిస్థితిలో పిల్లలను దుర్భాషలాడటం, ఒక్కోసారి చేయి చేసుకోవడం చాలాచోట్ల జరిగే విషయమే. దీన్ని పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారనే విషయం అప్పటికి తట్టదు. కానీ ఆ తరవాత
తల్లిదండ్రుల్ని ఆలోచనలో పడేస్తుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పసి హృదయాలు గాయపడనే పడతాయి. ఒక్కోసారి దెబ్బలకంటే కూడా మాటలే పిల్లలను ఎక్కువగా గాయపరుస్తాయి.
కనిపించని గాయాన్ని చేస్తాయి.

స్వతహాగా మార్పు...
కొన్నిసార్లు తల్లిదండ్రులు వేరే వారితో పోల్చి అవమానించేలా మాట్లాడతారు. 'మీ అబ్బాయికేమండీ బంగారం, మా వాడూ ఉన్నాడు ఎందుకూ! శుద్ధ మొద్దావతారం' అంటూ పక్కింటి వారితో అనేస్తారు. తమ
పిల్లలూ పోటీపడి ఎదగాలనే కోరిక దానికి మూల కారణం కావొచ్చు. అందుకు ఎన్నుకున్న మార్గం మాత్రం సమర్థనీయం కాదు. పిల్లలంటేనే అల్లరి చేస్తారు. పొరపాట్లు చేస్తుంటారు. వాటిని పరిణతితో అర్థం
చేసుకోవాలి. కానీ కొంతమంది పిల్లలను అవమానించేలా మాట్లాడ్డం చూస్తుంటాం. 'నీ మొహానికి ఇంతకంటే మంచి మార్కులు వస్తాయని నేననుకోలేదులే', 'నిన్ను అని ఏం లాభం! మీలాంటి వాళ్లని కన్నందుకు నా చెప్పుతో నన్ను సత్కరించుకోవాలి' 'పనికిమాలిన గాడిదా', 'స్టుపిడ్‌'... వంటి మాటలతో తీవ్రంగా మందలిస్తారు. ఈ మాటలు పిల్లల హృదయాల్లో ఎంతటి బలమైన ముద్ర వేస్తాయో ఊహించడం నిజంగా కష్టం!

మాట అనేశాక తల్లిదండ్రులు వాటిని సహజంగానే మర్చిపోతారు. కానీ అవి పిల్లల మనసులోంచి అంత తేలిగ్గా త్వరగా బయటికి పోవు. ఏ పని చేస్తున్నా వెంటాడే అవకాశం ఉంది. వ్యంగ్యంగా మాట్లాడటం,

సూటిపోటి మాటలు విసరడం, చులకనగా మాట్లాడ్డం ఇవన్నీ ఈ కోవలోకి వస్తాయి. వీటి ప్రభావంతో పిల్లల్లో మార్పు కనపడినా అది స్వతహాగానో, ఆలోచనతోనో వచ్చింది కాదు. భయంతో వచ్చిన మార్పయి

ఉంటుంది.

ఉద్వేగాలతో ఆటలా!
చదువు, ఆటల్లో పోటీ.. హోంవర్కు చేయాలి, టీచరు కొడుతుందన్న భయాలు.. మనసులో భావాలు వెల్లడించాలన్న ఉత్సుకత.. ఇదీ పిల్లల తీరు. ఇది తెలిసినా, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు మాట

విననప్పుడో, వెంటనే ఫలితం కనపడాలనుకున్నప్పుడో, ఒక పదునైన ఆయుధాన్ని ఉపయోగిస్తుంటారు. అది పిల్లల భావోద్వేగాలను, భయాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం! తిట్లు చీవాట్ల

కంటే ఇది మరింత దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. 'పది నిమిషాల్లో హోమ్‌వర్క్‌ పూర్తిచేయకపోతే చూడు, రాత్రికి అమ్మను భూతం ఎత్తుకుపోతుంది', 'నీ గది శుభ్రంగా సర్దుకోకపోతే ఇకపై తాతయ్య ఇంటికి

తీసుకెళ్లను. వాళ్లనూ రావొద్దని చెప్తాను', 'నా మాట వినకపోతే నాతో ఇకపై మాట్లాడనక్కర్లేదు' వంటి బెదిరింపులు బాగా పనిచేస్తాయి. ఆశించిన ఫలితం వెంటనే కనబడుతుంది. కానీ దాని తాలూకు

దుష్ప్రభావాలు మాత్రం అంత సులభంగా వదిలించుకోగలిగేవి కాదు.

రాత్రివేళ మెలకువ వచ్చిన ఎనిమిదేళ్ల పాపకో బాబుకో పక్కన తల్లి కనిపించకపోతే మనసులో కలిగే భయం తీవ్రతను అంచనా వేయడానికి ప్రయత్నించి చూడండి. ఇకపై తాతయ్యతో ఆడుకోలేననే విషయం

పసి మనసులో భయాన్ని సృష్టిస్తుంది. పెరిగి పెద్దయ్యాక కూడా బాంధవ్యాలు కోల్పోతాననే భయం, ప్రియమైన వారు కనిపించకుండా పోతారేమోననే ఆందోళన వంటివి ఈ బాల్యపు అనుభవాల నుంచే

ఉద్భవిస్తాయని మానసిక నిపుణులంటున్నారు.

పదేపదే ఎందుకలా!
నిజానికి తల్లిదండ్రుల్లో చాలామంది బాల్యంలో తమ పెద్దవారితో ఇలా చీవాట్లూ శిక్షలూ అనుభవించిన వారే. నాటి అవమానపు చాయలు వారిలో అంతర్లీనంగా ఉండి వాటిని పిల్లలపై చూపిస్తుంటారని

కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క 'నేనెందుకిలా ప్రవర్తిస్తున్నాను' అని బాధతో ప్రశ్నించుకుంటూనే భావోద్వేగాలను ఉపయోగించుకునే తీరుని తల్లిదండ్రులు మళ్లీమళ్లీ చేస్తుంటారని

వారంటున్నారు. మాటలతో పసి మనసులు గాయపడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
- వి.ఎల్‌.సుజాత
సహనంతో సరిదిద్దాలి...
* పిల్లలకు తక్కువ మార్కులు రావడానికి కేవలం వారి ప్రతిభ మాత్రమే కాక ఇతర కారణాలు కూడా ఉంటాయి. క్లాసు టీచర్‌ పాఠాలు చెప్పే విధానం, సిలబస్‌లో లేని అంశాలు ప్రశ్నాపత్రంలో ఉండటం, పరీక్షల

సమయంలో పిల్లల శారీరక ఆరోగ్యం, మానసిక ఆందోళన ఇలాంటి వాటి గురించి కూడా ఆలోచించాలి. అంకెల్లో చూడకుండా పిల్లల అంతరంగం అడిగి తెలుసుకొని పరిష్కారాలు వెతకాలి.

* మారుతున్న పిల్లల మనస్తత్వాలను, భావోద్వేగాలను కూడా తల్లిదండ్రులు గుర్తించగలగాలి. పిల్లలతో వ్యవహరించేప్పుడు పిల్లల స్థాయిలో సహానుభూతితో ఆలోచించగలగాలి. అప్పుడే వారి మనోభావాలను

చదవడం సాధ్యమవుతుంది.

* ఎవరిపట్లయినా సరే, సహానుభూతితో వ్యవహరించే తల్లి తన పిల్లలను కూడా ఎదుటి వారి దృక్కోణాన్ని అర్థం చేసుకునేలా తీర్చిదిద్దగలదు. ఇదే విషయాన్ని తాజాగా ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం తన

సర్వేలో వెల్లడించింది. ఇటువంటి సహానుభూతి పిల్లల్లో పెంచినప్పుడు తల్లిదండ్రుల భావాల్ని కూడా వారి కోణంలోంచే అర్థం చేసుకోగలుగుతారు. సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది.

* కొంతమంది పిల్లలకు క్రమశిక్షణ అంత త్వరగా అలవడదు. తిట్టడం, కొట్టడం, అవమానించేలా మాట్లాడ్డం వల్ల లాభం ఉండదు. క్రమక్రమంగా పిల్లలను దారిలో పెట్టడానికి కొంత సమయమూ, చాలా

సహనమూ అవసరం.

* అస్తమానం పిల్లలను ఇతరులతో పోల్చడం సరికాదు! ఒకరికి చదువులో ప్రతిభ ఉంటే మరొకరికి మరొక కళలో ప్రావీణ్యం ఉండవచ్చు. అందరి తెలివితేటలూ ఒకే రకంగా ఉండవు.

* పిల్లల భావోద్వేగాల మీద పనిచేసే బెదిరింపులు వెంటనే మానివేయాలి. దీర్ఘకాలంలో చాలా చెడు ప్రభావాలను కల్గిస్తాయి.

* త్వరగా కోపం వచ్చే వారు పిల్లల విషయంలో దాన్ని వీలైనంతగా నియంత్రించుకోవడం అభ్యసించాలి. ఎంతయినా వాళ్లు మీ పిల్లలు. శిక్షకీ క్రమశిక్షణకీ తేడాని గుర్తించడం అన్నిటికంటే ముఖ్యం.

--- Dr.Suman Roy (psychologist)--Eenadu Vasundara.
  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/