Saturday, 30 April 2011

డయాబెటిక్‌ ఫుట్‌ , Diabetic Foot



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -డయాబెటిక్‌ ఫుట్(Diabetic Foot)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మధుమేహం ఉన్నప్పుడు పాదాలను గాజుకాయలా చూసుకోవాలి. కానీ చాలా మంది 'నాకెందుకు వస్తుందిలే'.. 'ఇన్నేళ్ల నుంచీ నాకు ఏ ఇబ్బందీలేదు.. ఇక ముందూ రాదు' అన్న ధీమాతో ఉంటారు. నిర్లక్ష్యం చేస్తారు. అంటే చేజేతులారా సమస్యను కొనితెచ్చుకోవటమే. ఒక సారి పుండుపడితే మానదు. కాబట్టి నాకే సమస్యా రాదన్న ధోరణి వదిలిపెట్టాలి. పాదాల సమస్య వచ్చే అవకాశముందని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. మధుమేహానికి సంబంధించిన పాదాల సమస్యల్లో 50 శాతం చేతులారా కొని తెచ్చుకుంటున్నవేననీ, జాగ్రత్తలు తీసుకుంటే కాళ్లు తీసేయడమనేది సగానికి సగం తగ్గిపోతుందని అధ్యయనాల్లో తేలింది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి తరచూ క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోవడం ఎంత అవసరమో నిత్యం కాళ్లను పరిశీలించుకోవటం, సంరక్షణ చర్యలు తీసుకోవటం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి.

పదేళ్లకంటే ఎక్కువ కాలం మధుమేహం ఉన్నవారిలో సహజంగానే కాళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా కాళ్లలోని నాడులు (నరాలు), తర్వాత కాళ్లలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. వీటికితోడు శరీరంలో రోగనిరోధకశక్తి క్షీణిస్తుంది. ఈ మూడింటి ఫలితమే.. పాదాల సమస్యలు. వీటిని ఇంగ్లీషులో డయాబెటిక్‌ ఫుట్‌ అంటారు.

ఏం జరుగుతుంది?

కాళ్లలో నరాలు దెబ్బతినడం వల్ల పాదాలకు స్పర్శజ్ఞానం తగ్గుతుంది. ఈ దశలో రోగులు తమ సమస్యను రకరకాలుగా చెబుతుంటారు. దూదిమీద స్తున్నట్టుందనీ,
ఇసుక మీద నడుస్తున్నట్టుందనీ, గాజు పెంకుల మీద నడుస్తున్నట్టుందని చెబుతుంటారు. రాత్రిపూట నిద్రలో కాళ్లు మంట మంటగా అనిపిస్తుండడం దీని ముఖ్య లక్షణం.

కాలి చెప్పు జారిపోతుండడం, గుండు సూదులు గుచ్చినట్లుండడం, తిమ్మిర్లు ఎక్కటం, చీమలు పాకుతున్నట్టు అనిపించడం. ఇవన్నీ పాదాల సమస్యలున్న వారు తరచూ
చెప్పేవే. మధుమేహ బాధితుల్లో నరాలు దెబ్బతినడానికి ప్రధాన కారణాలు... నరం మీదుండే 'మైలిన్‌' అనే పూత, నరం లోపల సంకేతాలను అటూ ఇటూ చేరవేసే 'యాక్సోప్లాజమ్‌' పదార్థం పోవడం. దీని వల్లే సంకేతాలకు అంతరాయం ఏర్పడుతుంది. నరాలు పనిచేయడానికి శక్తి అవసరం. అందుకు ప్రతీ నరానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలుంటాయి. ఈ రక్తనాళాలు దెబ్బతినడం వల్ల నాడులు సమర్థవంతంగా పనిచేయవు. ఫలితంగా కాళ్లకు స్పర్శ తగ్గుతుంది. ఇక దెబ్బ తగిలినా సరే దాని తీవ్రతా, బాధా రోగికి తెలియదు. దీంతో అశ్రద్ధ చేస్తారు. పదేళ్లకు పైబడి మధుమేహం ఉంటే (నియంత్రణలో ఉన్నా సరే) రక్తంలో కొవ్వు పదార్థం, చక్కెర నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలు సన్నబడతాయి. దీనికి తోడు రక్తనాళాల గోడలకు కొవ్వు పేరుకుని, కాళ్లకు రక్తప్రసారం తగ్గుతుంది.

దీర్ఘకాలంపాటు రక్తంలో ఉండిపోయే చక్కెర వివిధ నాళాలతో, కణజాలంతో చర్యజరిపి, వాటిని దెబ్బతీస్తుంది. దీన్ని అడ్వాన్స్‌డ్‌ గ్లైకేషన్‌ ఎండ్‌ప్రోడక్ట్స్‌ అంటారు. వీటికి తోడు
రక్తాన్ని పంపింగ్‌ చేసే గుండెకు కాళ్లు చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి కాళ్లకు అందే పరిమాణం తగ్గుతుంది. ఇవన్నీ కలిసి సమస్యను జటిలం చేస్తాయి.

ముందే ఎలా గుర్తిస్తాం ?

కాళ్లలో రక్తప్రసారం తగ్గుతోందా? అన్న విషయాన్ని ముందే గుర్తించొచ్చు. దీనికి చీలమండల దగ్గర రక్తపోటు ఎలా ఉన్నదీ, మోచేతి కీలు దగ్గర రక్తపోటు ఎలా ఉన్నదీ
కొలవాలి. చేతుల్లో ఉండే రక్తపోటు కంటే కాళ్లలో ఉండే రక్తపోటు తగ్గకూడదు. దీన్ని కోలవడానికి 'డాప్లర్‌' అనే ప్రత్యేక పరికరం ఉంటుంది. దీంతో రక్తనాళాల్లోని పీడనం, రక్తం వేగాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇది లేకపోతే డాక్టర్ల దగ్గరుండే సాధారణ రక్తపోటు మిషన్ల సహాయంతో కూడా కొలవచ్చు. ఏటా డాప్లర్‌ పరీక్ష చేయించుకుంటూ, రక్తప్రసారం

తగ్గుతున్న విషయాన్ని ముందే గుర్తిస్తే కాళ్లలో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదాన్ని 5 నుంచి 10 ఏళ్ల ముందే పసిగట్టి, నివారణ చర్యలు తీసుకోవచ్చు. డయాబెటిస్‌ రోగుల
శరీరంపై పుండు పడి, త్వరగా మానకుంటే అది నయమ్యే వరకూ ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ తీసుకోవడం మేలు. దీంతో గాయం త్వరగా మానుతుంది. గాయమైనప్పుడు విశ్రాంతి
కోసం కదలకుండా ఉండాలి. కాబట్టి శరీరంలో షుగర్‌ స్థాయి పెరుగుతుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తగిన మోతాదులో ఇన్సులిన్‌ తీసుకోవడం మేలు. పుండు మానిన తర్వాత పరిస్థితిని బట్టి డాక్టరు సలహా మేరకు కొందరు మళ్లీ బిళ్లలు వాడొచ్చు.

ప్రత్యేక చెప్పుల అవసరం ఏమిటి?

మధుమేహం దీర్ఘకాలం ఉన్నప్పుడు పాదాలపైన చర్మం ఉల్లిపొరలా, పల్చగా తయారవుతుంది. పైగా కాళ్లకు స్పర్శ సరిగ్గా తెలియదు. కాబట్టి పాదానికి రక్షణ అవసరం. సాధారణ చెప్పులు ఈ పనిని సమర్థవంతంగా చేయలేవు. మధుమేహ బాధితుల కోసం ఎటువంటి పాదరక్షలు నిజమైన రక్షణను ఇస్తాయనే అంశంపై పరిశోధనలు జరిగాయి. ప్రత్యేక మెటిరీయల్‌తో తయారు చేసిన చెప్పులు మధుమేహ రోగులకు ఎంతో తోడ్పడతాయిని వెల్లడైంది.

చాలా మంది తమ సైజు చెప్పులు లేకున్నా కూడా వేసుకుంటారు. చెప్పుల్లో తేడా ఉంటే పెద్దగా పట్టించుకోరు. సర్దుకుపోతారు. దీని వల్ల మామూలు వారికి నష్టం లేదోమోగానీ, 'డయాబెటిక్‌ ఫుట్‌' ఉన్నవాళ్లకు సమస్యే. మధుమేహం ఉన్నవాళ్లు తమకోసం ప్రత్యేకంగా తయారు చేసిన సున్నితమైన చెప్పులు వాడడమే మంచిది. ఈ
చెప్పులు..పాదం మీద ఒకచోటే ఒత్తిడి పడకుండా అన్ని వైపులా సమానంగా పడేలా తయారు చేస్తే సమస్యలు తగ్గుతాయి. ఈ చెప్పుల్లో మూడు భాగాలుంటాయి. కింద- తేలికైన, దృఢమైన పియు (పాలియురెథేన్‌) సోల్‌ వాడుతున్నారు. దీని వల్ల మేకులు, ముళ్ల వంటివి దిగే అవకాశం లేదు. రెండోది- మన పాదం చెప్పుకు ఆనుకునే
కింది భాగంలో మైక్రోసెల్‌ పాలిమర్‌, మైక్రోసెల్‌ రబ్బర్‌ 'ఇన్‌సర్ట్‌' పెడుతున్నారు. దీని వల్ల పాదంపై ఒత్తిడి తగ్గుతుంది. కొందరు ఈ ఇన్‌స్టర్‌ను మామూలు చెప్పుల్లో పెట్టుకుంటారు. కానీ అది స్లిప్‌ అయిపోతుంది. మూడోది- లెదర్‌గానీ, కుట్లుగానీ పాదానికి తగలకుండా పైనంతా 'క్రాస్‌లింక్‌ పాలిమర్‌ షీట్‌'తో లైనింగ్‌ ఇస్తున్నారు. దీంతో పాదానికి పైనా, కిందా కూడా ఎక్కడా రాపిడి, గరుకుదనం తగలవు. మన అరికాళ్లల్లో ఒకపక్క గొయ్యిలా ఉండే ప్రాంతం ఉంటుంది కదా.. దానికి సపోర్టుగా కింది నుంచి ఉబ్బెత్తుగా 'ఆర్చ్‌' ఇస్తున్నాం. దీనివల్ల మడమ మీద ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహం ఉన్న చాలా మంది వృద్ధుల్లో తరచూ కాళ్లు కొద్దిగా వాస్తుంటాయి. అలాంటప్పుడు చెప్పులు నొక్కుకుపోయి, పుళ్లు పడుతుంటాయి. అందుకని చెప్పులు పైన వదులు చేసుకోవడానికి వీలుగా 'వెల్‌క్రో స్ట్రిప్స్‌' ఇస్తున్నారు. వీటి సైజు పెంచుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. ఈ చెప్పులతో వాకింగ్‌ చేయవచ్చు. ఒక వేళ పుండుపడితే ఆ పుండు చెప్పుకు తగలకుండా, ఆ ప్రాంతంలో మెత్తటి 'సిలిపోస్‌' మెటీరియల్‌ను ఉంచుతున్నారు. ఇది నునుపుగా ఉండి, పుండుపై నేరుగా ఒత్తిడి పడనివ్వదు. డయాబెటిక్‌ చెప్పులు చెమట పీల్చకపోవడమే ఉత్తమం. ఎందుకంటే చెమట పీల్చుకుంటే అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. తర్వాత ఏ చిన్న దెబ్బతగిలినా అది గాయంలో చేరి ఇన్‌ఫెక్షన్‌ కలగజేస్తుంది. అందుకని చెమట పీల్చుకోనివే మంచివి.

పుండుపడకుండా ఏం చేయాలి?

* రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

* కాళ్లను, పాదాలను రోజూ రెండు పూట్లా శుభ్రంగా కడుక్కోవాలి. కాలి వేళ్ల మధ్య, అరికాళ్లు కూడా జాగ్రత్తగా కడుక్కోవాలి.

* కడిగిన తర్వాత ఏమాత్రం తేమ లేకుండా తుడుచుకోవాలి. పొడిగా ఉండడానికి పౌడర్‌ రాసుకోవడం మంచిది.

* సాక్స్‌ వేసుకునే వాళ్లయితే నైలాన్‌వి వేసుకోవద్దు. కాటన్‌ మేజోళ్లే వాడాలి.

చెప్పులకూ, పాదానికి మధ్య రాళ్లు పడకుండా చూసుకోవాలి. చెప్పుల్లో మేకులు వంటివి బయటకు రాకుండా రోజూ పరిశీలించాలి.

* మడమపై ఒత్తిడి పెంచే చెప్పులు వేసుకోవద్దు. మధుమేహ బాధితుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చెప్పులను వాడడం మంచిది.

* పాదానికి ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయక, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

* చెప్పులు లేకుండా నడవొద్దు. మట్టి రోడ్లు, పొలాల గట్లు, పంటచేలలో కూడా చెప్పులు వేసుకోవాలి.

* కాలి గోళ్లను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కట్‌ చేసుకోవాలి.

*బస్సులు, కార్లలో ఎక్కువసేపు కూర్చుని ప్రయాణం చేయడం వల్ల కాళ్లలో నీరు చేరి ఉబ్బుతాయి. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఎక్కువసేపు కూర్చుని

ప్రయాణాలు చేయకూడదు.

* రోజూ టబ్బులో గోరువెచ్చని నీళ్లుపోసి, దానిలో 'బిటడిన్‌ సొల్యూషన్‌' కలపాలి. ఆ నీళ్లలో ఇరవై నిమిషాలు కాళ్లు పెట్టుకుని కూర్చుని, తర్వాత పొడిబారేలా

తుడుచుకోవాలి. వేళ్ల మధ్య పౌడర్‌ అద్దాలి. గాయం ఉంటే వదులుగా కట్టుకట్టాలి.

పుండుపడితే ఏం చేయాలి?

* డయాబెటిక్‌ ఫుట్‌ సమస్య ఉన్నవారికి కాలి మీద పుండు పడితే... పాదానికి విశ్రాంతి కల్పించాలి. చాలా మంది పుండు పడిన తర్వాత మధుమేహాన్ని

తగ్గించుకునేందుకు వ్యాయామం పేరిట సరైన చెప్పులు లేకుండా నడక ప్రారంభిస్తారు. అలా చేస్తే పుండు మరింత పెరిగి పెద్దది అవుతుంది.

* కాలి రక్తనాళాలు దెబ్బతిని, రక్తప్రసారం సరిగా ఉండదు. కాబట్టి నోటి ద్వారా, లేదా ఇంజక్షన్‌ ద్వారా తీసుకునే మందు గాయం వరకు చేరుతుందో లేదో అనుమానమే !

కాబట్టి కాలికి విశ్రాంతిచ్చి జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.

* గాయాన్ని రోజుకు రెండుసార్లు కడగాలి. 'సెలైన్‌'తో కడగడం ఉత్తమం. లేకపోతే మరగకాచి, చల్లార్చిన గోరువెచ్చటి నీటిలో చాలా కొద్దిగా (0.9 శాతం) ఉప్పు కలిపి దాంతో కడగవచ్చు. ఈ నీళ్లలో ద్రావకాలేవీ కలపకూడదు.

* కడిగిన తర్వాత తేమ లేకుండా దూదితో అద్దాలి. దానిపైన ఏదైనా పౌడర్‌ చల్లితే చెమట పీల్చుకుంటుంది. తేమ మిగిలిపోతే ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.

* కట్టు కొద్దిగా వదులుగా కట్టాలి. పుండుకు ఎండ తగలనిస్తే త్వరగా మానే అవకాశాలుంటాయి. దుమ్ము పడకుండా, ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

* రోజూ డాక్టరు దగ్గరకు వెళ్లడం కష్టం కాబట్టి. ఎవరికి వారే కట్టు కట్టుకోవటం నేర్చుకోవాలి. తరచూ డాక్టర్‌కు చూపించడం అవసరం.

* పుండ్ల విషయంలో సాధారణ ఆరోగ్యవంతులకు చేసే చికిత్స వేరు. మధుమేహం ఉన్న వారికి చేసే చికిత్స వేరు.

* గాయంపై స్పిరిట్‌ వేయకూడదు. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కూడా వేయకూడదు. అంతగా వేయాల్సి వస్తే బాగా పల్చన చేసి వేయాలి.

* కొంత మంది బోరిక్‌ యాసిడ్‌, టార్టారిక్‌ యాసిడ్‌ పౌడర్‌ను గ్లిజరిన్‌తో కలిపి పేస్టులా చేసి పుండుమీద కట్టుకడతారు. దీని వల్ల పుండు ఆరోగ్యవంతమైన కణజాలంతో, ఎర్రగా తయారవుతుంది గానీ, ఆ మర్నాటికే అది నల్లగా డెడ్‌ టిష్యుగా మారిపోతుంది. కాబట్టి వీటిని వాడకపోవడం మంచిది.

* చీము ఉన్నా నొక్కటానికీ, సూదితో గుచ్చటానికీ, 'కట్‌' చేయడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే ఇన్‌ఫెక్షన్‌ పైపైకి వ్యాపిస్తూ గాయం మోకాలికి పాకుతుంది. పాదాన్ని, కాలును పైపైకి తొలుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇక గ్యాంగ్రీన్‌ ఏర్పడిందంటే సమస్య మరీ తీవ్రం. కాబట్టి మరీ అవసరమైతే రక్తప్రసారానికీ మరో మార్గం ఏర్పాటు చేసి అప్పుడు కట్‌ చేయాలి.

* పుండు మానిన తర్వాత మళ్లీ కొత్త పుండు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పుండు ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి, మిగతా ప్రాంతాన్ని వదలిపెట్టి, మిగతా ప్రాంతాన్ని మూసివేయడం ద్వారా కూడా దాన్ని నియంత్రించొచ్చు. దీన్ని టోటల్‌ కాస్‌ థెరపీ అంటారు. దీని వల్ల నడవడానికి వీలుండదు. కాలిపై బరువు, ఒత్తిడి పడదు. పుండు త్వరగా మానుతుంది.
  • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, 21 April 2011

జుత్తు తెల్లబడ కుండా కొన్ని జాగ్రత్తలు , Hints to prevent Graying Hair



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -జుత్తు తెల్లబడ కుండా కొన్ని జాగ్రత్తలు(Hints to prevent Graying Hair)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వయసుతో పాటు జుత్తు తెల్లబడటం మామూలే కానీ చిన్న వయసులో వెంట్రుకలు నలుపుదనాన్ని కోల్పోతుంటే ఎవరికైనా దిగులు పట్టుకుంటుంది. ఒక్క తెల్ల వెంట్రుక కనబడ్డా ఆందోళన మొదలవుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ 'అకాల తెలుపు' బారినపడకుండా చూసుకునే వీలుంది.

పొగ మానెయ్యండి

పొగ తాగటం వల్ల త్వరగా వృద్ధాప్యం ముంచుకొస్తున్నట్టు చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది వెంట్రుకలకూ వర్తిస్తుంది. కాబట్టి జుత్తు తెల్లబడొద్దనుకుంటే వెంటనే సిగరెట్లు, బీడీల వంటివి మానెయ్యాల్సిందే.

ఒత్తిడికి దూరం

మానసిక బాధలు, ఒత్తిడి మూలంగా వెంట్రుకలు తెల్లబడే అవకాశం ఉంది. పొగ లాగానే ఒత్తిడి కూడా త్వరగా వృద్ధాప్యం వచ్చేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం చేయటం ద్వారా ఒత్తిడి బారి నుంచి బయటపడొచ్చు. ఇది జుత్తు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.

ప్రోటీన్లు తినాలి

ఆహారంలో ప్రోటీన్లు లోపించినా తెల్ల జుత్తు రావొచ్చు. కాబట్టి ప్రోటీన్లు దండిగా ఉండే.. మొలకెత్తిన గింజలు, తృణ ధాన్యాలు, మాంసం, సోయా వంటివి తీసుకోవటం మంచిది.

శుభ్రం పరిశుభ్రం

జుత్తు ఆరోగ్యంగా ఉండాలంటే దానిని శుభ్రంగా ఉంచుకోవటమూ ముఖ్యమే. మనలో చాలామంది స్నానం చేసేటప్పుడు తల గురించి అంతగా పట్టించుకోరు. వారానికి మూడు సార్త్లెనా తలస్నానం చేయటం జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది.

కారణాన్ని గుర్తించాలి

విటమిన్‌ బి 12, థైరాయిడ్‌ సమతుల్యత లోపించినా జుత్తు రంగు కోల్పోవచ్చు. అందువల్ల జుత్తు నెరవటానికి గల కారణాలను గుర్తించి తగు చికిత్స తీసుకోవాలి.

కంటి నిండా నిద్ర

కంటి నిండా నిద్ర లేకపోయినా జుత్తుకు ముప్పు పొంచి ఉన్నట్టే. రోజుకి 6-7 గంటల పాటు తగినంత నిద్ర చాలా అవసరం. రాత్రుళ్లు ఎక్కువసేపు టీవీలు, ఇంటర్నెట్‌లకు అతుక్కుపోకుండా ఉంటే మేలు.

రంగులపై ఓ కన్ను

మార్కెట్లో ఏది దొరికితే ఆ జుత్తు రంగునో, ఉత్పత్తులనో వాడటం అంత మంచిది కాదు. వీటిల్లో హానికర రసాయనాలుండే అవకాశం ఉంది. వేటినైనా నిపుణులను సంప్రదించాకే వాడుకోవాలి.

సరదాలకీ ప్రాముఖ్యం

ఎప్పుడూ పనిలోనే మునిగిపోయి సరదాలు, షికార్లును పక్కన పెట్టేయకండి. రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ఆనందంగా గడిపే మార్గాలను అన్వేషించండి. ఇది జుత్తు తెల్లబడకుండానే కాదు.. త్వరగా ముసలితనం మీద పడకుండానూ కాపాడుతుంది.

మాత్రల తోడు

ఒమేగా 3 చేపనూనె మాత్రలను తీసుకోవటమూ జుత్తు నెరవకుండా చూస్తుంది. అవసరమైనప్పుడు వైద్యుల సూచన మేరకు వేసుకోవాలి.
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, 10 April 2011

సిద్ధ, (Siddha)



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సిద్ధ (Siddha) - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సిద్ధ వైద్యం

సిద్ధ (Siddha) అంటే సంస్కృతంలో పూర్తి సామర్ధ్యం కలవారు అని అర్థం మరియు కచ్చితమైన మాస్టర్స్‌ కు దీనిని అపాదించవచ్చు. హిందూ నమ్మకం ప్రకారం, అహంకార (ఇగో లేదా ఐ మేకర్‌)ను వదిలి, వారి మనసులను వారి ఆలోచనలకు తగ్గట్లుగా నిగ్రహం తో ఉంచుకునేవారు మరియు వారి శరీరాలను (ముఖ్యంగా రజో తమో గుణాలతో దూరంగా) సత్వ గుణం తో భిన్నమైన దేహంగా మలచుకునేవారు. సాధారణంగా ధ్యానం చేయడం ద్వారా నైపుణ్యం ను పొందగలుగుతారు.

ప్రత్యామ్నాయ వైద్యవిధానాలలో సిద్ధ దక్షిణ భారతదేశములోని ద్రవిడుల (Dravidians) కాలము నాడు ప్రసిద్ధమైనది. "సిద్ధార్దులు" లేక శైవ భక్తులైన ఋషులు దైవానుగ్రహము వలన పొందిన వైద్యజ్ఞానము ఇది. పురాణాల ప్రకారము సిద్ధార్దులు 18 మంది, వారిలో అగస్త్యుడు ముఖ్యమైన వాడు మరియు సిద్ధ వైద్య పితామహుడని పిలవబడుచున్నాడు. జీవి అన్న ప్రతి దానికి మనసు, శరీరము అనే రెండు భాగాలుంటాయని, ఆరోగ్యవంతమైన శరీరము లోనే శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని సిద్ధులు నమ్మేవారు. ఆ కాలములో వీరు కొన్ని మెదడ్స్ ని , మెడిటేషన్ విధానాలను రూపొందించారు. వీరు నమ్మే సిద్ధాంతాలను వమ్ము చేయకుండా నిర్మలమైన మనస్సుతో మెడిటేషన్ చేయడమువలన జబ్బులకు, అనారోగ్యానికి దూరంగా ఉండేవారు.

సిద్ధ వైద్యములో ఆయుర్వేదములాగే శారీరక రుగ్మతలను వాత, పిత్త, కఫ అనే రకాలుగా వ్యవహరిస్తారు .సిద్ధ వైద్యం అనేది, ప్రతి సందర్భంలోనూ శరీరానికి హాని కలిగించే రోగాల యొక్క మూలాలను తొలగించి వేయడం. ఈ వైద్య పద్దతిని అనేక మంది సిద్ధులు అవలంబిస్తున్నారు. భవిష్యత్‌ తరాలకు ఈ వైద్యం యొక్క వివరాలను అందించడానికి దీనికి సంబంధించిన అంశాలను సిద్దార్లు గ్రంథస్తం చేస్తున్నారు. సిద్ధ వైద్యం అనేది ద్రవిడియన్లు (పూర్వకాల తమిళులు) రూపొందించారు. స్థానికంగా వీరిని సిట్టార్‌ లు అని పిలుస్తారు. వీరు దీనికి వాడే మందులను ఆకులు, బెరడు‌, కాండం‌, దుంపల నుంచి తయారు చేస్తారు. కానీ ఇందులో కొన్ని జంతువులకు సంబంధించిన అంశాలు మరియు ఖనిజాల‌ను కూడా కలుపుతారు. ఈ పద్దతి వైద్యం ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో బాగా ప్రసిద్ధి చెంది ఉంది. బంగారం, వెండిమరియు ఇనుము యొక్క పొడి (సంస్కృత - భష్మం) తదితర లోహాలను కూడా కొన్ని మందులు తయారు చేయడానికి సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఈ లోహాలు శరీరంలోని కొన్ని రోగాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ పద్దతిలో తరచుగా ఉపయోగించే పాదరసం విషయంలో ఈ వాదన చాలా ఎక్కువగా ఉంది. వైద్యంలో పూర్తి స్వచ్ఛమైన పాదరసాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఏదేమైనా ఇది చాలా ఎక్కువ నైపుణ్యం కలిగిన కళగా చెప్పుకోవాలి.

సిద్ధ సంప్రదాయం

సిద్ధ అనేది ప్రస్తావనకు వచ్చినప్పుడు, 84 సిద్ధలు మరియు 9 నతాలు గుర్తుకువస్తాయి. ఇది సిద్ధలు యొక్క సంప్రదాయం. అందుకే దీనికి సిద్ధ సంప్రదాయం అని పేరు వచ్చింది. సిద్ధ అనే పదం మహాసిద్ధులకు మరియు నాతాలకు కూడా వాడతారు. కాబట్టి సిద్ధ అంటే అర్థం ఒక సిద్ధి కావచ్చు, మహా సిద్ధి కావచ్చు లేదా నాత కావచ్చు . ఈ మూడు పదాలు సిద్ధ, మహాసిద్ధ మరియు నాతా అనేవి ఒకదానికి ఒకటి మార్చుతూ కూడా వినియోగించవచ్చు.

సిద్ధ – శైలి

జైనతత్వం ప్రకారం సిద్ధ శైలి జైన్‌ల తత్వం ప్రకారం, సిద్ధ శైలి అనేది విశ్వం యొక్క అగ్రభాగాన కొలువై ఉంటుంది. సిద్ధులు (అంతరించిన ఆత్మలు, తిరిగి పుట్టుక లేనివి, జీవితం మరణం అనే సైకిల్‌ను దాటిపోయినవారు) సిద్ధశైలిని దాటి, అనంతంలో స్థిరపడిపోతారు. సిద్ధ అనేది ఆత్మ యొక్క మరొక స్థాయి. అరిహంత అంటే కేవల జ్ఞానను సూచిస్తుంది.
హిందూ తత్వంలో, సిద్ధలోకం అనేది సూక్ష్మమైన‌ ప్రపంచం (లోకం ), ఇక్కడ ఉన్నవారు (సిద్ధులు) తిరిగి పుడతారు. పుట్టుకలో ఎనిమిది ప్రాధమిక సిద్ధులు ఉంటాయి.

సిద్ధాశ్రమం

హిందూ పురాణాల ప్రకారం సిద్ధాశ్రమం అనేది హిమాలయాల అంతర్భాగంలో ఉంది. ఇక్కడ గొప్ప యోగులు, సాధువులు మరియు సాగులు సిద్ధ జీవితాన్ని గడుపుతుంటారు. టిబెటిన్ల పవిత్ర భూమి శాంభాలకు ఈ ఆలోచన సమాంతరంగా ఉంటుంది. సిద్ధాశ్రమాన్ని అనేక భారత ఇతిహాసాల్లో, పురాణాల్లో ప్రస్తావించారు. ఇందులో రామాయణ, హాభారతాలు కూడా ఉన్నాయి. వాల్మికి రామాయణంలో, విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలోనే జీవించారని చెప్పారు. ఇది విష్ణువు యొక్క ఆవాసం‌. విష్ణువు వామనావతారము దాల్చినప్పుడు ఇది
తెలుస్తుంది. రామ లక్ష్మణులను విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి తీసుకెళ్లి, తన మత త్యాగాలను నాశనం చేయాలని చూస్తున్న రాక్షసులను సంహరించమని కోరతారు.


సిద్ధ (Siddha)

సిద్ధ (Siddha) అంటే सिद्ध సంస్కృతంలో పూర్తి సామర్ధ్యం కలవారు అని అర్థం మరియు కచ్చితమైన మాస్టర్స్‌కు దీనిని అపాదించవచ్చు. హిందూ నమ్మకం ప్రకారం, అహంకార (ఇగో లేదా ఐ మేకర్‌)ను వదిలి, వారి మనసులను వారి ఆలోచనలకు తగ్గట్లుగా నిగ్రహంతో ఉంచుకునేవారు మరియు వారి శరీరాలను (ముఖ్యంగా రాజో తమా గుణాలతో) సత్వతో భిన్నమైన దేహంగా మలచుకునేవారు. సాధారణంగా ధ్యానం చేయడం ద్వారా నైపుణ్యంను పొందగలుగుతారు. జైనుల నమ్మకం ప్రకారం సిద్ధ అంటే, కర్మ బంధాలను తెంచుకుని తమ ఆత్మలను స్వేచ్ఛగా చేసుకునేవారు. సిద్ధకు ఎలాంటి శరీరం ఉండదు. ఆత్మ పూర్తి స్వచ్ఛతను కలిగి ఉండటమే సిద్ధ. ఒకరు ఎవరైతే సిద్ధిని పొందారో, వారి గురించి పేర్కొంటూ, ఇచ్చే నిర్వచనాన్ని కూడా సిద్ధ అంటారు. ఇక్కడ సిద్ధిలు ఒక వ్యక్తికి ఉన్న పారానార్మల్‌ సామర్ధ్యాలను, ఎమర్జెంట్‌ సామర్ధ్యాలుగా గుర్తించి, దీనిని సిద్ధత్వంలో భాగంగా తీసుకోవాలి. ఇక్కడ ప్రణవ్‌ లేదా అవుమ్‌లో స్థిరపడిన వారిని సిద్ధగా నిర్వచించలేదు. అనగా సృష్టికి సంబంధించి ఆధ్యాత్మిక భావన పొంది ఉండటం. సిద్ధి అనేది తన పూర్తి స్వచ్ఛమైన అర్థంలో వాస్తవంలో పూర్తి అస్థిత్వాన్ని సాధించడం (బ్రహ్మాన్‌): స్పిరిట్‌ యొక్క కచ్చితత్వం. కాశ్మీర్‌ శైవత్వం (హిందు తంత్ర) యొక్క హిందూ వేదాంతంలో, సిద్ధ అంటే సిద్ధ గురువు అని కూడా అర్థం. ఈయన యోగాలో శక్తిపత్‌ అంశాల ద్వారా ఇది సాధిస్తారు.


సిద్ధ, ఆయుర్వేద, హోమియోపతి, యునానీ ఇలా ప్రత్యామ్నాయ వైద్యంలో నిపుణులు ఎవరైనా సరే వారికి గల శిక్షణను బట్టి శస్త్ర చికిత్సతో సహా అధునాతన ఔషధాల చికిత్స ను కూడా చేయవచ్చునని పేర్కొంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ను ఈ సందర్భంగా చెప్పుకోదగ్గ విషయము .



  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, 9 April 2011

వ్యాయామం సౌకర్యం కొరకు జాగ్రత్తలు, Hints for protection in exercise


  • ఫొటో--source : Eenadu vasundara
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వ్యాయామం సౌకర్యం కొరకు జాగ్రత్తలు(Hints for protection in exercise)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



-తరచూ జిమ్‌, యోగా కేంద్రాలకు వెళ్లేవారు.. సౌకర్యంగా ఉండటానికి వెంట కొన్ని వస్తువులు తీసుకెళ్లాలి. తరచూ వాటిని ఉపయోగిస్తే ఆనందం, ఆరోగ్యం.

షూ జత : జిమ్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా షూలు ధరించాలి. అవి అరికాళ్ల నొప్పులు, మంటను దూరం చేస్తాయి కొందరు మామూలు చెప్పులు వేసుకోవడం వల్ల ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్క జిమ్‌కు మాత్రమే కాదు ఏ ఇతర వ్యాయామాలు చేసినా అవి తప్పనిసరి. ప్రత్యేకంగా వ్యాయామానికి అయితే నాణ్యమైనవి, సౌకర్యవంతంగా ఉండేలా ఎంచుకోవాలి. కొన్ని రకాల సాధనాలు చేస్తున్నప్పుడు పాదాల మీద ఒత్తిడి పడుతుంది. అలాంటప్పుడు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాల్సిందే!

సాక్సులు : పాదాలు కోమలత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే సాక్సులు తప్పనిసరిగా ధరించాలి. అయితే చెమటతో ఇబ్బంది రాకుండా వాటిని ధరించే ముందు పాదాలకు యాంటీబ్యాక్టీరియల్‌ పౌడర్‌ రాసుకొంటే సమస్య ఉండదు. అలానే చేతులకూ గ్లవుజులు తొడుక్కోవాలి.

చేతికి స్ట్రాప్స్‌ : వ్యాయామ సాధనలో ముఖ్యమైంది వెయిట్‌ లిఫ్టింగ్‌. బరువైన డంబెల్స్‌ పట్టుకొన్నప్పుడు చేతులు మృదుత్వాన్ని కోల్పోతాయి. ఒక్కోసారి బరువుకు కందిపోతాయి కూడా. అందుకే క్రీడాకారుల మాదిరి స్ట్రాప్స్‌ ధరించాలి. వాటిని జిమ్‌కు తీసుకెళ్లే బ్యాగులో పెట్టుకొంటే ఇక మర్చిపోవడం అనేదే ఉండదు.

చాప : యోగాసాధన చేయడానికి చిన్నచాపలు అందుబాటులో ఉంటున్నాయి. పనిలో పనిగా వాటిని తీసుకొని బ్యాగులో సర్దుకున్నామనుకోండి రోజూ జిమ్‌కు తీసుకెళ్లవచ్చు. జిమ్‌ కేంద్రంలో కింద కూర్చొని ఆసనాలు, వ్యాయామం చేయాల్సి వస్తుంది. కింద ఏమీ లేకుండా సాధన చేసినప్పుడు శరీరం ఒత్తిడి గురవుతుంది. అలాకాకుండా ఉండాలంటే తప్పనిసరిగా జిమ్‌ మ్యాట్‌ వెంట పెట్టుకోవాల్సిందే!

అనువైన దుస్తులు : వ్యాయామసాధన చేసినప్పుడు చెమట పడుతుంది. అందుకే చెమటను పీల్చే దుస్తులు ధరించినప్పుడు చిరాకు అనిపించదు. అలానే వదులుగా ఉండే వాటికి ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా స్పోర్ట్స్‌ బ్రాలు వేసుకోవాలి. జిమ్‌నుంచి వచ్చిన వెంటనే స్నానం చేసి దుస్తులు మార్చుకోవాలి. అవి చెమట పట్టి ఉంటాయి. కాబట్టి ఏ రోజుకారోజు ఉతకాలి.

తువాలు : మధ్యమధ్యలో చెమట తుడుచుకోవడానికి చిన్న తువాలును బ్యాగులో ఉంచుకోవాలి. అలానే టిష్యూకాగితాలూ కొన్ని పెట్టుకోవాలి. అలసట అనిపించినప్పుడు ముఖం కడుక్కొని తుడుచుకొంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు చర్మం తాజాగానూ కనిపిస్తుంది.


  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, 7 April 2011

ఎత్తు మడమల చెప్పులు సమస్యలు ,High heel footware and problems



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎత్తు మడమల చెప్పులు సమస్యలు (High heel footware and problems)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


అందాన్ని పెంచేవి దుస్తులేకాదు, మీరు తొడిగే దుస్తులకు మేచింగ్‌గా వేసుకునే పాదరక్షలు కూడా మీ అందాన్ని యినుమడింప చేస్తాయి. పూర్వం పాదరక్షలని యెందుకన్నారంటే పాదాన్ని రక్షించేది కనక పాదరక్షలు అన్నారు. ప్రస్తుతం పాదరక్షలు అన్న పదానికి పాదములకు అందమునిచ్చేవి అని అర్థం చెప్పుకోవాలి. ఆభరణాలు, దుస్తులు ఏ విధంగా వ్యక్తికి అందాన్నిస్తాయో చెప్పులు, బూట్లు కూడా వ్యక్తికి అదేవిధంగా ఒక స్టేచర్‌ని కల్పిస్తాయి.

పాదరక్షలలోకూడా అనేక రకాలున్నాయి. ఒక్కొక్క రకం పాదరక్షలను ఒక్కొక్క రకమైన ఫంక్షన్సుకు వుపయోగిస్తారు. ఫంక్షన్సుకు వేసుకునే దుస్తులకు సరి పోయే పాదరక్షలనే వాడాలి. పూర్తి సూటుగాని, సాఫారీ సూట్‌గాని వేసినప్పుడు బూట్లు తప్పనిసరిగా వేసుకోవాలి. చెప్పులు ఎబ్బెట్టుగా వుంటాయి. పైజమా వేసుకునేప్పుడు చెప్పులే ధరించాలి. బూట్లు వేసుకోవడం వింతగా వుంటుంది.

చీర కట్టే వారికి పాదాలు కనిపించవు, కనుక ఏ చెప్పులు వేసుకున్నా ఫరవాలేదు. ఈ రోజుల్లో పాదాలు కనబడే విధంగా సుర్వాలు, కుర్తాలు, కమీజులు, పాంట్లు వేస్తున్నారు

ఎత్తు మడమల చెప్పులు వేసుకుంటే చూడ్డానికి స్త్టెలిష్‌గా కనిపించొచ్చు. కానీ వాటి ఎత్తు పెరిగేకొద్దీ మడమలపై భారం పెరిగిపోతుంది . సాధారణంగా మనం నిలబడినప్పుడు మన శరీరభారాన్ని మోసేది పాదాలే. చెప్పుకుండే హీల్‌ ఒక అంగుళం ఎత్తు ఉంటే మడమలపై భారం మామూలుకన్నా 22 శాతం అధికమవుతుందట. రెండు అంగుళాల ఎత్తుంటే ఆ భారం 57 శాతం పెరుగుతుంది. మూడంగుళాల ఎత్తు చెప్పులు వేసుకుంటే 76శాతం అధికభారం మడమలపై మోపినట్టే. దీర్ఘకాలం పాటు ఇలాంటి చెప్పులే వాడితే పాదాల కండరాలు బలహీనపడి మామూలు చెప్పులు వేసుకున్నా నడవటమే కష్టమవుతుంది . ఒకవేళ ఎత్తుమడమల చెప్పులు వేసుకుని పార్టీలకు వెళ్లినా నాలుగు గంటలకు మించి వాటిని పాదాలకు ఉంచుకోవద్దు. విధిలేని పరిస్థితుల్లో ఎక్కువసేపు అలా ఉండాల్సివస్తే ఇంటికి వెళ్లగానే ఐస్‌ తో కాపడం పెట్టుకోవాలి .

ఎత్తు పాదరక్షలు (పాదాభరణాలు ) ధరించడం వల్ల కలిగే కష్టాలు :
  • శరీర బరువంతా పాదాలపై పడటం వల్ల పాదాల నొప్పి తప్పదు.
  • వీటిని ఎక్కువ సమయం ధరిస్తుంటే.. కొన్నాళ్లలో నడుం, వెన్నునొప్పులు బాధిస్తాయి.
  • ఎత్తు మడమల చెప్పులు శరీరం బరువుని అటూఇటూ మారుస్తుంటాయి. దీంతో శరీరాన్ని నియంత్రించుకునే సమయంలో వెన్నెముక మీద చాలా అదనపు భారం పడుతుంది. కాబట్టి, వీటి వాడకాన్ని తగ్గించుకోవాలి.
  • మునివేళ్ల మీద నడవడం వల్ల ఒత్తిడి పెరిగి బొటన వేళ్ళు వంకర పోవడం, మోకాళ్ల నొప్పులు, కీళ్లు మరియు కాలి మడమలు అరిగిపోవడం, నరాలు తొలగిపోవడం, పాదాలు దెబ్బతినడం, గోళ్ల ఇన్‌ఫెక్షన్ రావడం వంటి ప్రమాదాలున్నాయని ఆర్థోపిడిషియన్(ఎముకుల డాక్టర్)లు అంటున్నారు.

సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే

  • ఒకవేళ ప్రతిరోజు అయితే.. 1 - 1.5 అంగుళాల పొడుగున్నవి ఎంచుకోండి. ఇంకా ఎత్తు చెప్పుల్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితం చేసుకోండి.
  • ఇలాంటివి ధరిస్తున్నప్పుడు పాదాలు పక్కకు వంగినట్లు అవుతాయి. ఎత్తు ఎక్కువగా ఉన్నకొద్దీ ఈ సమస్య తప్పదు. అందుకే.. ఒకటికి రెండుసార్లు వేసుకుని చూసి.. సౌకర్యంగా అనిపించినప్పుడే కొనుక్కోండి.
  • ఎంతో ఇష్టపడి ఎంచుకున్నా కూడా కొన్నిసార్లు ఎలాంటి మడమల్లేని పాదరక్షల్నీ ధరిస్తుండాలి. ఇంట్లో ఉన్నప్పుడు సాధారణ చెప్పుల్ని వేసుకోవాలి. అప్పుడప్పుడు వట్టికాళ్లతో నడవాలి. ఇది పాదాలకు సౌకర్యాన్నిస్తుంది. ఈ తరహా పాదరక్షల్ని ఎనిమిది నుంచి పదిగంటలకు మించి ధరించకపోవడమే మంచిది.
  • కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అరిపాదాలకు రాసుకుని నెమ్మదిగా మర్దన చేయాలి. దీనివల్ల పాదాల నొప్పుల్ని నివారించవచ్చు.
  • ఎత్తు మడమల చెప్పులతో ఎదురయ్యే వెన్నునొప్పుల్ని నివారించేందుకు.. నడక, యోగా.. ఇతర వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి.

  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

రాస్ట్రం లో మానసిక సమస్యలు , Mental problems in A.P state



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఆంధ్రప్రదేశ్ లో మానసిక సమస్యలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రెండు శాతం మందిలో అత్యంత తీవ్రం,రుగ్మతకు ప్రాధాన్యమివ్వాలని కేంద్రం నిర్ణయం.3 వైద్యశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యోచన

దశాబ్ద కాలంలో జీవనశైలిలో వచ్చిన వివిధ మార్పులు వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నేడు ఎంతో మంది ఏదో ఒకరకమైన ఒత్తిడికి లోనవుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 12 శాతం మందికి మానసిక సమస్యలు ఉన్నాయి. వీరిలో రెండు శాతం మందికి అతి తీవ్రంగా, మరో అయిదు శాతం మందికి తీవ్రంగా, ఇంకో అయిదు శాతం మందికి ఒక మోస్తరుగా ఉన్నాయి. వీరంతా సకాలంలో చికిత్స తీసుకుంటే సమస్యను పరిష్కరించడం సులభమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. సాధారణ వ్యాధులతో పోలిస్తే మానసిక సమస్యల పెరుగుదల ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు. మానసిక రుగ్మతలు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ సమస్యకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. దీనిపై అన్ని రాష్ట్రాల వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఇటీవల జాతీయస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. భవిష్యత్తులో మిగిలిన జబ్బులతో పోలిస్తే మానసిక రుగ్మతలు ప్రథమ స్థానం ఆక్రమిస్తాయని భేటీలో నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను అధిగమించడానికి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో, మానసిక సమస్యల చికిత్సకు ఇప్పుడు ఉన్న నిబంధనలను పూర్తిగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ముసాయిదా బిల్లును రూపొందించినట్లు హైదరాబాద్‌లోని మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.ప్రమోద్‌ కుమార్‌ 'న్యూస్‌టుడే'తో చెప్పారు.

జిల్లా ఆస్పత్రుల్లో నియామకాలు
సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టాలని భావిస్తోంది. హైదరాబాద్‌, విశాఖపట్నంలో ఉన్న మానసిక వైద్యశాలలకు అదనంగా మరో మూడు ప్రత్యేక ఆస్పత్రులు స్థాపించే అంశాన్ని పరిశీలిస్తోంది. జిల్లా ఆస్పత్రికి ఒకరు చొప్పున మానసిక వైద్యనిపుణులను నియమించాలని యోచిస్తోంది. ప్రతి 100 పడకల వైద్యశాలలో ఒక మానసిక వైద్యుడిని నియమించాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కొద్ది రోజుల క్రితం ఒక ఉన్నతస్థాయి భేటీలో నిర్ణయించారు.

ఉన్నతస్థాయి భేటీ సిఫార్సులు
* సాధారణ వైద్యసేవల స్థాయిలో మానసిక సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* మానసిక రుగ్మతలు ఉన్నవారి పట్ల వివక్ష చూపకూడదు.
* తీవ్రమైన మానసిక రుగ్మతలున్న వారికి ఉచితంగా మందులు ఇవ్వాలి.
* మానసిక సమస్యలపై ప్రత్యేక నర్సింగ్‌ డిప్లొమా కోర్సు ప్రారంభించాలి.
* నేరచరిత్ర ఉన్నవారు శిక్ష నుంచి తప్పించుకోవడానికి 'మానసిక రుగ్మత'ను ఒక అవకాశంగా వాడుకోకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలి.
* మానసిక స్థితి బాగాలేదని ఆస్పత్రుల్లో చేరే ముందు తమపై ఎలాంటి కేసులు లేవని రోగులు రాతపూర్వకంగా ధ్రువీకరించాలి. లేదా వారి సంబంధీకులు ధ్రువీకరణ ఇవ్వాలి.
* ప్రైవేటు ఆస్పత్రుల్లో మానసిక సమస్యలకు చికిత్స నిర్వహించడానికి వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక గుర్తింపు తీసుకోవాలి.
* మానసిక వైద్యుల ప్రతిభను నిర్ణయించడానికి నిపుణుల కమిటీ సాయంతో ప్రత్యేక గ్రేడింగ్‌తో కూడిన గుర్తింపును ఇచ్చే విధానాన్ని అమలు చేయాలి.

మూలము : హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
  • ================================================
Visit my website - -> Dr.Seshagirirao.com/

Wednesday, 6 April 2011

వెన్నునొప్పి ఉంటే బల్లపైనే పడుకోవాలా?,Do we sleep on a bench in backbone pain?


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వెన్నునొప్పి ఉంటే బల్లపైనే పడుకోవాలా?(Do we sleep on a bench in backbone pain?)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



చాలామంది వెన్ను నొప్పి ఉన్నప్పుడు కేవలం చెక్కబల్ల పైనే పడుకోవాలేమోనని అనుకుంటారు. అయితే అలా చేయడంవలన కండరాలు, ఎముకలు ఒరుసుకు పోయి అసౌకర్యం మరింత పెరుగుతుంది. మరికొంతమంది పరుపు లేకుండా పడుకోవాలనే ఉద్దేశ్యంతో నేలమీద పడుకుంటారు.

అయితే పడుకున్న తరువాత నేలమీద నుంచి లేవా ల్సివస్తే వంగాల్సి వస్తుంది. దీనివల్ల నడుము నొప్పి మరింత పెరిగే అవకాశాలున్నాయి. పైగా నేలనుంచి చల్లదనం, తేమవంటివి శరీరానికి చేరి నడుము కండరా లను మరింత బిగుసుకునేలా చేస్తాయి. వాస్తవానికి మంచం బేస్‌ అనేది కుంగిపోకుండా, స్థిరంగా ఉంటే చాలు.

మంచి మందపాటి ప్లైవుడ్‌ షీట్‌ను మంచం బేస్‌గా ఉపయోగిస్తూ పరుపును రెండు అంగుళాల మందం ఉండేలా అమర్చుకుంటే సరిపోతుంది.
వాటర్‌ బెడ్స్‌, ఆర్థోపెడిక్‌ బెడ్స్‌ వంటి వాటి వలన ఉపయోగం ఉంటుంది కానీ అవిచాలా ఖరీదుతో కూడి నవి.

జీవితంలో చేసుకోవాల్సిన మార్పులు
వెన్ను నొప్పి దీర్ఘకాలంనుంచి బాధిస్తున్నప్పుడు రోజు వారీ కార్యక్రమాలన్నింటినీ గమనించండి. ఎక్కడ, ఏ భంగిమలో, ఏ సందర్భంలో నొప్పి వస్తున్నదో కని పెట్టండి. వృత్తిపరంగా లేదా రోజువారీగా వాడే వస్తు వుల వలన నొప్పి వస్తుంటే ప్రత్యా మ్నాయ పద్ధతుల గురించి ఆలోచించండి.

నిలబడి పని చేయాల్సి వచ్చినప్పుడు కూర్చుని పని చేయడం, బరువులను మోయాల్సి వస్తే హ్యాండ్సిల్స్‌ అమర్చుకోవడం వంటి చిన్నపాటి మార్పులు చేర్పులతో రోజువారీ కార్యకలాపాలను సౌకర్యవంతంగా నిర్వర్తించ వచ్చు.

పథ్యాపథ్యాలు
మీరు అధిక బరువును కలిగి ఉంటే తేలికపాటి ఆహారం తీసుకుంటూ బరువు తగ్గే ప్రయత్నం చేయండి.
స్థూలకాయం వలన వెన్నుపూసల మీద అదనంగా బరువు పడి నొప్పి తీవ్రతరమవుతుంది.
అధిక బరువును తగ్గించుకోవాలంటే తీపి వస్తువులు, వేపుడు పదార్థాలు, నూనెల వంటివి బాగా తగ్గించాలి.
తగిన వ్యాయామాన్ని చేయాలి. సూచనల మేరకు మందులు వాడాలి.
ఉదరంలో గ్యాస్‌ అధికంగా తయారైతే వెన్ను మీద వత్తిడి ఎక్కువ అవుతుంది.
అందుకే గుడ్డు, శనగపిండి వంటకాలు, ఉల్లి, చిక్కుళ్లు, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, దోస కాయ, మసాలాలు, పచ్చి సలాడ్స్‌ వంటి గ్యాస్‌ను తయారు చేసే వాతకర ఆహారాలను తగ్గించాలి.


  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/