Monday, 21 October 2013

Hints to reduce body fat,శరీరంలో కొవ్వు తగ్గాలంటే...పాటించవలసిన సూచలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hints to reduce body fat,శరీరంలో కొవ్వు తగ్గాలంటే...పాటించవలసిన సూచలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




చాలా మంది పురుషులు , మహిళల్లో కొవ్వు శాతం పెరగడంతో చర్మం ముడతలు పడడం కనిపిస్తుంది. వయసు మీద పడే సరికి మహిళల్లో ఏర్పడే ప్రధాన సమస్య ఇదే. అందుచేత శరీరంలో అవసరానికి మించిన కొవ్వు ఎందుకు పేరుకుంటుందో తెలుసుకొంటే దానిని నివారించుకొని చక్కని ఆరోగ్యాన్ని, తీరైన ఆకౄఎతిని సొంతం చేసుకోవచ్చు.

కొవ్వు సమస్య ఎక్కువుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు చర్మం మధ్య పొరలో కొవ్వు కణాలు ఒక్కచోట చేరుతాయి. దాంతో చర్మంలో సొట్టలు పడినట్లు కనిపిస్తుంది. ఇలాంటి సమస్య సాధారణంగా పొట్ట, నడుం కింది భాగం, పిరుదులు వంటి భాగాల్లో ఎక్కువుగా బాధిస్తుంది. పురుషులలో పొట్టభాగములో బెల్లీ గా కొవ్వు పేరుకుపోతుంది. శారీకంగా చోటు చేసుకునే మార్పులే కాదు. ఇతర కారణాలు దీనికి దారితీస్తాయి.

ప్రాధమికంగా తినుబండారాలు మూడు రకాల (కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, కొవ్వు) పదార్ధాలతో ముడిపడివుంటాయి.  జంక్‌ఫుడ్ తినడం వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరిగి, హృద్రోగ సమస్యలకు దారితీయవచ్చు. జంక్‌ఫుడ్‌లోని షుగర్, కొవ్వు కారణంగా అధిక కేలరీలు శరీరంలోకి చేరతాయి. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు తక్కువ స్థాయిలో లభిస్తాయి. ఊబకాయంతో పాటు మధుమేహ సమస్యలకు జంక్‌ఫుడ్ కారణమవుతోంది. ముఖ్యంగా జంక్‌ఫుడ్ తినే చిన్నారులకు- రోగ నిరోధక శక్తి తగ్గడం, ఊబకాయం, నీరసం, వత్తిడులు వంటివి తప్పవు. ముఖ్యంగా పీచుశాతం తక్కువగా, కొవ్వు, పిండి పదార్థాలు ఎక్కువుగా ఉన్న ఆహారం అదే పనిగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు విపరీతంగా పేరుకుంటాయి. ముఖ్యంగా వేపుళ్ళు శుద్ధి చేసిన ఆహారం, హానికర కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారంవల్ల ఈ సమస్య తలెత్తుతుంది.

దీనికోసం ముందుగా జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలి. పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పీచు అధికంగా ఉండే పదార్థాలు అంటే తృణధాన్యాలు, తాజా పండ్లు ఎక్కువుగా తీసుకోవాలి. ఏదో ఒక వ్యాయామం రోజూ అరగంటైనా చేయడం మీ జీవనవిధానంలో భాగం కావాలి. వారంలో ఐదు రోజులు రోజూ అరగంటకి తగ్గకుండా నడవడం ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.

వీటిని పాటించండి
హెల్తీ డైట్: కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, పోషకాలు ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు, నట్స్ కొవ్వు తగ్గిస్తాయి.
నడకతో ఫిట్: వ్యాయామం లేకుండా ఒకే చోట కూర్చుని గంటల కొద్దీ పని చే సేవారిలో కొవ్వుపెరిగే అవకాశం ఎక్కువ. అందుకే రోజు అరగంటపాటు తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జాగింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.
స్మోకింగ్‌కు స్వస్తి: పొగతాగని వారితో పోల్చితే పొగతాగే వారిలో కొవ్వు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం రెట్టింపు ఉంటుంది. పాసివ్ స్మోకింగ్ కూడా మంచిది కాదు. స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. అలవాటు లేకపోతే అట్రాక్ట్ కాకండి.
కొలెస్ట్రాల్: టోటల్ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ పరిమితిని దాటకుండా చూసుకోండి. ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులు వాడండి.
హెల్తీ వెయిట్: అధిక బరువు మూలంగా కొ్వ్వు పెరిగి గుండెపై ఒత్తిడి పడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, ట్రైగ్లిజరైడ్స్, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలన్నీ అధిక బరువు మూలంగానే వస్తాయి. కాబట్టి లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా బరువును తగ్గించుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
కోపాన్ని తగ్గించుకోండి: ఒత్తిడి, కోపం హార్ట్ఎటాక్, స్ట్రోక్‌కు కారణమవుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతమైన జీవనం గడిపితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇందుకు ఉపయోగపడతాయి. జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, మందులు వాడటం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Perfumes-Awareness,పెర్‌ ఫ్యూమ్స్‌-అవగాహన,సెంట్స్-అవగాహన‌,సుగంధ ద్రవ్యాలు-అవగాహన

  •  




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సుగంధ ద్రవ్యాలు-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


Introduction :
మంచి వాసనను సువాసన, పరిమళము, సుగంధం అంటారు. పువ్వులు రకరకాలైన సువాసనలను వెదజల్లుతాయి. ఎనిమిది రకాల సువాసనలను అష్టగంధాలు అని పేర్కొంటారు.
అష్టగంధాలు:
  1.     కర్పూరం
  2.     కస్తూరి
  3.     పునుగు
  4.     జవ్వాజి
  5.     అగరు
  6.     పన్నీరు
  7.     అత్తరు
  8.     శ్రీగంధం
సుగంధ ద్రవ్యాల ఉపయోగం క్రమంగా పెరుగుతుంది. ధనిక, పేద అని తేడా లేకుండా పెర్‌ఫ్యూమ్స్‌ వాడుతున్నారు. ఏ పార్టీకి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా అక్కడి ఆవరణం అంతా పెర్‌ ఫ్యూమ్‌ వాసనతో నిండిపోతుంది. ఇకపోతే Lifts లో గాలికి బదులు సెంట్‌ వాసనలను ఆస్వాదిస్తుంది ముక్కు. ఒక పెర్‌ఫ్యూమ్‌  వలన అనేక వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Side  effects :
సెంట్స్‌ కారణంగా కొన్ని రకాల అలర్జీలు, కాంటాక్ట్‌ డర్మటైటిస్‌, ఎగ్జిమా అనే చర్మ వ్యాధులు, మైగ్రేన్‌ తలనొప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఇంగ్లాండ్‌లోని క్యాంటర్‌ బరీ కెంట్‌ ఛాసర్‌ హాస్పటల్‌కు చెందిన చర్మవైద్య నిపుణులు డాక్టర్‌ సుసానా బ్యారన్‌ సెంట్స్‌ ఉపయోగించే సమయంలో అవి చర్మానికి తగలడం, వాటి వాసనతో అలర్జీలు, మైగ్రేన్‌ తరహా తలనొప్పుల తో పాటు అనేక రకాల చర్మవ్యాధులు వస్తువులున్నాయని పేర్కొన్నారు.
కొందరు వ్యక్తులు తమ ప్రైవేట్‌ పార్ట్‌ వద్ద సుగంద ద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు. వాళ్ళు తమ అండర్‌ గార్మెంట్స్‌ వద్ద టాల్కం పౌడర్‌ వంటివి జల్లుకుంటారు. అయితే ఆ ప్రదేశంలో సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం కంటే ప్రతిరోజూ శుభ్రంగా స్నానం చేయడం, ఎప్పటి కప్పుడు ఫ్రేష్‌ అండర్‌ గార్మెంట్స్‌ తొడుక్కోవడమే ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు.

Uses :
నిత్య జీవితంలో సువాసనలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇవి మన నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. చిటికెలో మన మనస్సులోని ఆలోచనలు మార్చేస్థాయి. అప్పుడప్పుడు మనం ఒత్తిడికి గురౌతుంటాం. డిప్రెషన్ అవుతుంటాం అలాంటప్పుడు మంచి వాసనలు చూడడం వల్ల మన శరీరంలోని సువాసనలతో మనం చేసే పనుల్లో మనసును కేంద్రీకరించగలుగుతాం. మంచి సువాసనలు రెండు రకాలుగా ఉపయోగిస్తాం. మొదటి రకం శరీరంపై ఉపయోగిస్తే, రెండవది పరిసర ప్రాంతాలను వాతావరణాన్ని పరిమళ భరితం చేసేవి. శరీరం విషయంలో చాలా మంది ఒకే రకమైన సంట్ ను తరచూ వాడుతుంటారు. దీన్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాన్ని గుర్తించవచ్చు. వాళ్లు ఎలాంటి ఆశయాలు కలిగినవాళ్ళ?మొదలైన విషయాలను వాళ్లు ఉపయోగించి సుగంధాలతో తెలుసుకోవచ్చు. ఫ్లోరల్: ఇందులో మీకు రకరకాల సంప్రదాయ పుష్పాల సుగంధాలు వస్తాయి. ఇది మనషి మెదడులో స్త్రీ సంబంధ ఆలోచనలను కలిగిస్తాయి. వీటిలో గులాబీ, మల్లెపూల సువాసనలు ఎక్కువ జనాదరణ పొందాయి. గ్రీన్: రోజ్ మెరీ, చామోమిలీ, యూకలిప్టస్ ఎక్కువ ప్రజాదరణ పొందినవి, వీటిని ఉపయోగించి రిలాక్సింగ్, బాతింగ్ ఆనందాన్ని పొందవచ్చు. కాబట్టి గ్రీన్ సువాసనలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి....

ఉపయోగించడంలో అవగాహన(Hints in use  of Scents of perfumes) :
సాధారణంగా  పెర్‌ఫ్యూమ్స్‌ సువాసనను మెచ్చని వారుండరు. శుభ కార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కొందరు మహిళలు పెర్‌ఫ్యూమ్స్‌ ఉపయోగిస్తారు. అయితే పెర్‌ఫ్యూమ్స్‌ను ఉపయోగించడంలో కూడా సరైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా వేసవిలో పెర్ ఫ్యూమ్ స్పెల్ ఎక్కువ సేపు ఉండాలా జాగ్రత్తపడాలి. వేసవిలో మన శరీరం గురించి వ్యక్తిగతంగా జాగ్రత్త తీసుకోకపోతే చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. వేసవిలో రోజుకు కనీసం రెండు సార్లైనా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత పెర్ ఫ్యూమ్ లేదా డియోడరెంట్ వంటివి రాసుకోవాలి. చాలా మంది నేచురల్ డియోడరెంట్స్ ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. నేచురల్ గా దొరికే ఎసెన్సియల్ ఆయిల్స్ లేదా ఎక్సాస్ట్ మంచి సువాసనలు కలిగి ఎక్కువ సేపు నిలిచి ఉంటాయి. ఇవి చెడువాసనలు రానీయకుండా కాపాడుతాయి.

సువాసనలు ఎక్కువ సేపు నిలిచి ఉండాంటే పాటించాల్చిన పద్దతులు(Hints for long sustainance of smell) :  
1. పెర్ ఫ్యూమ్ కానీ, డియోడరెంట్స్ కానీ ఉపయోగించే ముందు బాటిల్ ను బాగా షేక్ చేయాల్సి ఉంటుంది.
2. పెర్ ఫ్యూమ్ ను డైరెక్ట్ గా చంకల క్రింద వాడకూడదు. మీరు డ్రెస్ ధరించిన తర్వాత స్పే చేసుకోవడం వల్ల ఎక్కువ సమయం తాజాగా సువాసనతో నిలిచి ఉంటుంది.
3. మీరు డియోడరెంట్ రోలర్ ను ఉపయోగించినట్లైతే, శరీరం మీద తేమ లేకుండా చేసుకోవాలి. తర్వాత దుస్తులను ధరించాలి.
4. డియోడరెంట్స్ ఇరవై నాలుగు గంటలు శరీరానికి రక్షణ కల్పిస్తుంది. .

పెర్‌ ఫ్యూమ్స్‌ ,సెంట్స్‌,సుగంధ ద్రవ్యాలు వాడేవారికి కొన్ని జాగ్రత్తలు(Precautios for users of Scents of Perfumes) :
 1. శరీరంలో బ్యాక్టీరియాను తొలగించడానికి రోజుకు కనీసం రెండు సార్లైనా స్నానం చేయాల్సి ఉంటుంది. శరీరంపై పడే దుమ్ము ధూలి నుండి ఏర్పడ బ్యాక్టీరియా, క్రిములు దుర్వాసన ఏర్పడటానికి కారణం. ఆ దుర్వాసనను తొలగించడానికి వేడినీళ్ళతో స్నానం చేయడం కంటే గోరు వెచ్చని లేదా చల్లని నీటితో స్నానం చేయాలి. వేడి నీళ్ళతో స్నానం చేయడంతో ఆ వేడికి శరీరంలో మళ్ళీ చెమట పడుతుంది.
2. చెమటలు పట్టించేలా ఉండే దుస్తులను ధరించకపోవడమే మంచిది. పాలిస్టర్, థిక్ ఫ్యాబ్రిక్ దుస్తులు వేసుకోకూడదు. వీటి ద్వారా చెమట తొందరగా పడుతుంది.
3. వేసవిలో కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం. చెమట పట్టినా కూడా కాటన్ దుస్తులు చెమటను పీల్చుకొంటాయి.
4. డియోడరెంట్ రోలర్ ను ఉపయోగించేట్లైతే టాల్కమ్ పౌడర్ ను కూడా అప్లై చేస్తే సుగంధపరిమళాల వాసనలు ఎక్కువ సేపు నిలిచి ఉంటాయి.
5. చంక క్రింది ఎప్పటికప్పడు హెయిర్ ను తొలగిస్తుండాలి. లేదంటే చెమటకు బ్యాక్టీరియా చేరి దుర్వాసను పెంచుతుంది.
6. డియోడరెంట్ వాసనలు ఎక్కువ సేపు నిలిచి ఉండాలంటే స్నానానికి ముందే చంకల కింద టూత్ పేస్ట్ అప్లై చేసి, పది నిమిషాల తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
7. ఫుల్ స్లీవ్స్ లేదా ఫుల్ షర్ట్స్ ధరిస్తున్నట్లైతే పెర్ ఫ్యూన్ దుస్తులపై పూర్తిగా అప్లై చేసుకోవాలి.
8. పన్నీటిలో సువాసన కలిగిన పెర్‌ఫ్యూమ్‌ను ఒకటి రెండు చుక్కలు కలిపి, శరీరం మీద చల్లుకోవచ్చు.
9. పెర్‌ఫ్యూమ్‌ కొనబోయేముందు ఆ పెర్‌ఫ్యూమ్‌ను చేతిమీద రాసుకుని, ఆ వాసన నచ్చిందా, అది తమ చర్మానికి పడిందా అని చెక్‌ చేసుకోవాలి. పెర్‌ఫ్యూమ్‌ వాసన మారకుండా అలాగే ఉంటే, ఆ పెర్‌ఫ్యూమ్‌ను ఉపయోగించవచ్చు.
10. పెర్‌ఫ్యూమ్‌ సువాసనలో తేడాలుంటాయి. రకరకాల మూలికలతోనూ, పరిమళాల పుష్పాలతోనూ, సుగంధాలు కలిగిన ఆకులతోనూ కూడా పెర్‌ఫ్యూమ్స్‌ను తయారుచేస్తారు. స్త్రీలకు, పురుషులకు ప్రత్యేకంగా తయారు చేయబడిన పెర్‌ఫ్యూమ్స్‌ను వాడటంవల్ల సువాసన కాకుండా దుర్వాసన కలుగుతుంది. అంతే కాకుండా చర్మానికి ఎలర్జీ కలుగుతుంది. ఎవరి శరీరతత్వాన్ని బట్టి వారు, చర్మానికి సరిపడే పెర్‌ఫ్యూమ్‌ను ఎన్నుకోవాలి. అంతే కానీ, తోటివారు ఉపయోగిస్తున్నారు కదాని, దాన్నే వాడకూడదు.

Source : wikipedia.org/

  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Crack lips,పెదవుల పగుళ్లు






ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Crack lips,పెదవుల పగుళ్లు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




బ్రతికినంతకాలము మనిషి బాధలులేకుండా బ్రతకాలనే అనుకుంటారు . . . అనుకోవడమేమిటి అలానే బ్రతకాలి. పగిలి పెదవులు  బాధతో పాటు ముఖ అందాన్ని కూడా ప్రబావితం చేస్తాయి.  పొడి వాతావరణం పెదవుల పగుళ్ళకు ముఖ్యమైన కారణం. వాతావరణంలోని గాలి పొడిగా ఉన్నప్పుడు చర్మంలోని పై పొరలు ఆరిపోతాయి. పెదవులమీద ఉండే చర్మం సున్నితంగా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ముందుగా వాతావరణ ప్రతికూలతలు పెదవుల మీద పడతాయి.
పెదవులు పగులుతాయి. పెదవులు చిట్లిపోయి నొప్పిగా తయారవుతాయి. కొంతమంది పెదవులు తడారిపోతున్నప్పుడు వాటిని నాలికతో తడుపుతూంటారు. తడి ఆరిపోతూ పెదవుల్ని మరింత చిట్లిపోయేలా చేస్తుంది కాబట్టి ఇలాగా తడారిన పెదవుల్ని నాలికతో తడపకండి. దీనికి బదులు ఆముదాన్ని గానీ, వెన్నపూసను గానీ పెదవులకు రాసుకోండి. వీటితో పెదవుల మీద ఉండే తేమ ఆరిపోకుండా ఉంటుంది. ఎండలోకి వెళ్ళినపుడు అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా ఉండేందుకుగాను సన్‌రిఫ్లెక్షన్‌ ఫ్యాక్టర్‌ కలిగిన క్రీముల్ని పైపూతగా రాసుకోండి.

శీతాకాలం వస్తే  చర్మాన్ని సంరక్షించుకోవడానికి అనేక పాట్లు పడుతుంతాం . అలాగే చలికాలంలో పెదవుల పగుళ్ల కోసం ఏవేవో చేస్తుంటాం. పెదవుల పైన చర్మం పొరలుగా వచ్చేయడం, పగుళ్లు బారడం ఎండాకాలంలో కూడా కనిపిస్తుంది. చర్మం పైన  పొరలు ఉంటాయి. కానీ పెదవులపై ఉండే  పొరలు సున్నితం గా ఉంటాయి. అందువల్ల పెదవుల పగుళ్లు సర్వసాధారణం. దీన్ని పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉంది. అందుకే పెదవుల ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి.

అల్లోపతి చికిత్స:
  • అల్లోపతిలో వేజలైన్‌ జెల్లీ పైపూతగా రాసుకోవడమే గాని స్పెషిఫిక్  గా ట్రీట్మెంట్ ఏమీలేదు. బి.కాంప్లెక్ష్ లోపము రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

ఆయుర్వేదం చికిత్స :
  •  చండ్రబెరడు చూర్ణం చిటికెడు తేనె అరటీస్పూన్‌. రెంటినీ కలపండి. పేస్టులాగా తయారు చేయండి. దీనిని రాత్రి పడుకునే ముందు పెదవుల మీద పూసుకోండి.ఉదయం కడిగేసుకోండి. దీంతో పెదవుల పగుళ్లు తగ్గుతాయి.
  • చలికాలంలో వీసే గాలుల వల్ల మీ పెదవులు తడిఆరి పగుళ్ళు ఏర్పడుతాయి. 8,9గంటలపాటు లిప్ స్టిక్ ఉంచుకుంటే పెదవులు పొడిబారతాయి. కాబట్టి లిప్ గార్డ్ గానీ, వాజలిన్ గానీ రాస్తే మంచిది.లిప్ స్టిక్ పెదవులపై ఎక్కువ సేపు ఉండాలంటే అదిపెట్టుకునే ముందు పెదాలపై పౌడర్ గానీ, లైట్ గా ఫౌండేషన్ గానీ వేసుకోవాలి. అప్పుడు లిప్ స్టిక్పెట్టుకుంటే చాలా సేపటివరకూ పోకుండా ఉంటుంది.మాయిశ్చరైజర్ లిప్ స్టిక్ పెదవులను మెరిసేలా చేస్తుంది.
  • పెదవులు నల్లగా అందవిహీనంగా ఉంటే బీట్ రూట్ ముక్కతో పెదవులను బాగా రుద్దితే మెరుపు సంతరించుకుంటాయి.
  • నెయ్యిని రోజూ నిద్రకు ఉపక్రమించేందుకు ముందు రాసుకోవాలి.
  •  కొబ్బరి నూనెను కూడా తెల్లవారుజామున స్నానానికి ముందు వాడితే మంచి ఫలితం ఉంటుంది.
  • 2 భాగాల తేనెకు 1 భాగం మీగడను, నాలుగైదు చుక్కలు రోజ్ వాటర్‌ని కలిపి పెదవుల మీద ప్రయోగిస్తే పెదవుల పగుళ్లు తగ్గి నున్నగా తయారవుతాయి
  • చలికాలంలో మీ పెదవులకు అలొవెరా ఆయిల్‌, ఆలివ్‌ ఆయిల్స్‌ను వాడినా మంచి ఫలితం ఉంటుంది.
  • ఇంకా మిల్క్‌ క్రీమ్స్‌ వాడితే పెదవుల పగుళ్లను నివారించవచ్చునని బ్యూటీషన్లు చెబుతున్నారు.
  • నిమ్మరసం, ధనియాల పొడి కలిపి పేస్ట్‌ చేయండి. పెదవులపై ఈ పేస్ట్‌తో ప్రతిరోజూ పదినిమిషాలు మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • నిమ్మరసం, గ్లిజరిన్‌, తేనె కలపి ఈ మిశ్రమంతో పెదవులపై పదినిమిషాలు మర్దన చేయాలి.
  • నిద్రించేముందు కొబ్బరి నూనెలో వైట్‌ పెట్రోలియం జెల్లీ కలపి, పెదవులకు రాయాలి.
  • కొత్తిమీర రసంతో పెదవులను మర్దనా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
  • నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే  మంచి ఫలితం ఉంటుంది.
చిట్కాలు-జాగ్రత్తలు :    
చలికాలంలో తరచుగా పెదాలు పగలుతుండటం సహజమే. దీంతో మంట, నొప్పి, చిరాకు వంటివి వేధిస్తాయి. అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే పెదాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

* చలి, పొడి వాతావరణంలో బయటకు వెళ్లేటప్పుడు పెదాలకు సన్‌స్క్రీన్‌తో కూడిన క్రీమ్‌ రాసుకోవాలి. తర్వాత పెదాలను చేతి రుమాలుతో గానీ స్కార్ఫ్‌తోగానీ కప్పి ఉంచాలి. అలాగే ఆరుబయట ఎక్కువసేపు గడిపే సమయాల్లో తరచుగా పెదాలకు క్రీమ్‌ రాస్తుండాలి.

* పెదాలను తడిగా ఉంచుకోవటానికి కొందరు నాలుకతో అద్దుతుంటారు. ఇది సరికాదు. లాలాజలం త్వరగా ఆవిరవుతుంది. దీంతో పెదాలు అంతకుముందుకన్నా మరింత పొడిగా తయారవుతాయి.

* తగినంత నీరు తాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. చర్మంతో పాటు పెదాలూ నిగనిగలాడతాయి. వీలైనవారు ఇంట్లో తేమ తగ్గకుండా చూసే పరికరాలు (హ్యూమిడిఫయర్‌) కూడా వాడుకోవచ్చు.

* కొన్నిసార్లు అలర్జీ కారకాలు కూడా పెదాలు పగలటానికి దారితీయొచ్చు. కాబట్టి సౌందర్య సాధనాలు, రంగుల్లో శరీరానికి సరిపడని అలర్జీ కారకాలు ఉంటే.. వాటికి దూరంగా ఉండాలి.

* కొందరు తరచుగా నోటితో గాలిని పీల్చుకుంటూ ఉంటారు. దీంతో పెదాలు పొడి బారతాయని గుర్తుంచుకోవాలి. అందువల్ల ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి.

* చిన్న చిన్న చిట్కాలతో పెదాలు పగలటం తగ్గకపోతే వెంటనే డాక్టరుని సంప్రదించాలి. ఎందుకంటే కొన్నిసార్లు తీవ్రంగా పెదాలు పగలటమనేది ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా రావొచ్చు. కాబట్టి ముందే జాగ్రత్త పడితే మంచిది.

    • =======================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    Sunday, 20 October 2013

    Chances of Common cold changes to Asthma,జలుబు ఉబ్బంసంగా మారే అవకాశం






    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Chances of Common cold changes to Asthma,--జలుబు ఉబ్బంసంగా మారే అవకాశం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    జలుబు చేయడం సర్వసాధారణమే అయినా పిల్లల్లో జలుబును నిర్లక్ష్యం చేస్తే ఉబ్బంసంగా మారే అవకాశం ఉంటుంది. సంకేతాలను గుర్తించకపోవడం, చికిత్స ఇప్పించడంలో ఆలస్యమయినప్పుడు ఉబ్బసం తీవ్రమవుతుంది. ఫలితంగా ఇన్‌హేలర్ వాడాల్సి రావడం, ఆసుపత్రిలో చేర్పించాల్సి రావడం జరుగుతుంది. దీని ప్రభావం పిల్లల ఎదుగుదలపై పడుతుంది. అందుకే పిల్లల్లో జలుబును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ టి.పి. కార్తీక్.

    చిన్న పిల్లల్లో జలుబు, దగ్గు సాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే దీర్ఘకాలం ఈ సమస్య కొనసాగితే ఉబ్బసం లేదా ఆస్తమాగా మారే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యకు ప్రధానంగా వాతావరణ మార్పులు, అలర్జీ లేక వైరల్ ఇన్‌ఫెక్షన్స్ కారణమవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరైన ఆస్తమాతో బాధపడుతున్నట్లయితే వారి పిల్లల్లో కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

    ఏం చేయాలి?
    చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లలు తరచుగా జలుబు బారినపడకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఇంట్లో చలువరాళ్లే ఉంటున్నాయి. రిస్క్ ఎక్కువగా ఉన్న పిల్లలు ఈ చలువరాళ్లపై నడిచినా త్వరగా జలుబు అంటుకుంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు కూడా చెప్పులు ధరించేలా చూడాలి. జలుబు ప్రారంభంలో ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. 'రెండు, మూడు రోజులు చూద్దాం. అదే తగ్గిపోతుందిలే' అని వదిలేస్తే అది క్రమంగా ఆయాసంగా మారుతుంది. జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది. కొందరు చిన్న పిల్లల్లో గురక సమస్య కనిపిస్తుంది. ముక్కు వెనక భాగంలో ఎడినాయిడ్స్ వాయడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఎడినాయిడ్స్ వాపు వల్ల టాన్సిల్స్ వాచే అవకాశం ఉంటుంది. ముక్కులో చుక్కల మందులు వేసుకోవడం లేదా ఆవిరిపట్టడం వల్ల రిలీఫ్ వస్తుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్ మందులు వాడాల్సి ఉంటుంది.

    ఉబ్బసం పట్ల జాగ్రత్త
    పిల్లల్లో జలుబును చాలా కాలం నిర్లక్ష్యం చేస్తే ఆస్తమాగా మారే అవకాశం ఉంటుంది. రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చలి తీవ్రత పెరగడం వల్ల శ్వాసకోశాల్లోని నాళాలు కుంచించుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. రాత్రివేళ పిల్లలు దగ్గుతుంటారు. ఈ లక్షణాన్ని ఆస్తమాకు ప్రాథమిక సంకేతంగా భావించాలి. చాలా మంది ఆస్తమా ఒకసారి వస్తే ఇక ఎప్పటికీ తగ్గదని అనుకుంటుంటారు. కానీ అందులో నిజం లేదు. ప్రాథమిక దశలో గుర్తిస్తే మందులు వాడటం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను శాశ్వతంగా నయం చేయవచ్చు.

    ఆస్తమాను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి మైల్డ్, మోడరేట్, సివియర్ ఆస్తమా.
    మైల్డ్ ఆస్తమా అయితే కొద్ది రోజులు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. మోడరేట్ ఆస్తమా అయినట్లయితే ఇన్‌హేలర్ వాడాల్సి ఉంటుంది. నాలుగైదు నెలలు చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది. ఆస్తమా తగ్గింది కదా అని ఒకేసారి ఇన్‌హేలర్ వాడకం ఆపేయకూడదు. క్రమపద్ధతిలో ఇన్‌హేలర్ వాడకాన్ని ఆపుతూ రావాలి. మద్యలో మందులు మానేయడంలాంటివి చేయకూడదు. సివియర్ ఆస్తమా అయితే ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉంటుంది. డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది. ఆస్తమా బారినపడిన పిల్లల్లో శ్వాసకోశాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. అటువంటి సమయంలో నెబ్యులైజర్ ఉపయోగించవచ్చు. సాధారణ జలుబు, దగ్గుకు నెబ్యులైజర్ వాడటం మంచిది కాదు. ఆస్తమా ఉన్న వారికి నెబ్యులైజర్‌ను ఉపయోగించవచ్చు. కొందరు పిల్లలు ముక్కు రంధ్రాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతుంటారు. నోటి ద్వారా శ్వాస తీసుకుంటుంటారు. ఇటువంటి వారికి నాసల్ డ్రాప్స్ వేస్తే ఫలితం ఉంటుంది.

    గుర్తుపట్టడం ఎలా?
    పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆయాసం ఉంటుంది. పడుకున్నప్పుడు పిల్లికూతలు వస్తుంటాయి. రాత్రివేళ దగ్గు ఉంటుంది. పరుగెత్తినప్పుడు ఎక్కువగా ఆయాసపడతారు. మాట్లాడుతున్నప్పుడు ఆయాసపడటం గమనించవచ్చు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఆస్తమాగా భావించి వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

    తగిన జాగ్రత్తలు
    ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు దుమ్ము దులపకూడదు. తడిగడ్డతో తుడవాలి. పర్‌ఫ్యూమ్స్, సెంట్స్ వాడకూడదు. అగరబత్తీలు వెలిగించకూడదు. పిల్లలను బయటకు తీసుకెళ్తున్నట్లయితే తప్పనిసరిగా మాస్క్ పెట్టాలి. ఇల్లు శుభ్రం చేయడానికి వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించాలి. పెట్స్ కూడా అలర్జీకి కారణమవుతాయి. కాబట్టి పిల్లులు, కుక్కలు వాటికి దూరంగా ఉంచాలి. జలుబు చేసినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆవిరిపట్టించడం, వైద్యుల దగ్గరకు తీసుకెళ్లి చికిత్స ఇప్పించడం చేయాలి. అప్పుడే పిల్లలు ఆస్తమా బారినపడకుండా కాపాడుకోగలుగుతాం.

    Courtesy with : డాక్టర్ టి.పి. కార్తీక్,పీడియాట్రిషియన్,యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్, హైదరాబాద్@sakala of http://www.andhrajyothy.com/

    • ================================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    If platelets count decrease?,ప్లేట్‌లెట్లు తగ్గిపోతే?

    •  



    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - If platelets count decrease?,ప్లేట్‌లెట్లు తగ్గిపోతే?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    డెంగ్యూ లాంటి కొన్ని వ్యాధుల్లో ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం సహజం. అలా ప్లేట్లు తగ్గడం మొదలెట్టగానే అయిన వాళ్లంతా బెంబేలెత్తిపోతారు. వెంటనే ప్లేట్‌లెట్‌లు ఎక్కించేందుకు పరుగు తీస్తారు. వాస్తవానికి,రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గిన ప్రతిసారీ వాటిని బయటినుంచి ఎక్కించవలసిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే ఆ అవసరం ఉంటుంది. శరీరం ప్లేట్‌లెట్లను తిరిగి ఉత్పత్తి చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు కూడా కొందరు ప్లేట్‌లెట్లు ఎక్కించడానికే సిద్ధమవుతారు. అలా అవసరం లేనివారికి కూడా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తూ పోతే, అత్యవసరమైన కొందరికి అవి అంద కుండా పోతాయని నిపుణులు అంటున్నారు. ప్లేట్‌లెట్ల లోపాల మూలాలు, వాటి నివారణోపాయాల గురించిన వివరాలకు వెళితే....

    శరీర వ్యవస్థలో ప్లేట్‌లెట్లకో ప్రత్యేక స్థానమే ఉంది. రక్తంలో తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్లు అనే మూడు రకాల మౌలిక కణాలు ఉంటాయి. ఈ మూడూ ఎముక మజ్జ (బోన్ మేరో) నుంచే ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్తకణాలు శరీరం రోగగ్రస్తం కాకుండా చూసే రక్షక దళంగా అంటే వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తాయి. ఎర్ర రక్తకణాల్లో హీమోగ్లోబిన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ ద్వారానే శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సీజన్ అందుతుంది. ఇక మిగిలినవి ప్లేట్‌లేట్లు. శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడతాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య శరీర ధర్మాన్ని అనుసరించి వ్యక్తి వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది. సాదారణంగా ఒక వ్యక్తిలో ఒకటిన్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షల దాకా ఉంటాయి. అంతే తప్ప అందరికీ ఒకే సంఖ్యలో ఉండాలని లేదు. పైగా అవి స్థిరంగా కూడా ఉండవు. ఒక వ్యక్తిలోనే ప్లేట్‌లెట్లల సంఖ్య రోజుకో పరిమాణంలో ఉంటుంది. వీటి సంఖ్య ఒకటిన్నర నుంచి నాలుగున్నర లక్షల మధ్య ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లే. ప్లేట్‌లెట్ కణం జీవిత కాలం 7 నుంచి 10 రోజుల దాకా ఉంటుంది. ఆ తర్వాత అవి చనిపోతాయి. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్టేట్‌లెట్స్ మళ్లీ రక్తంలో చేరతాయి.

    రక్తస్రావాన్ని నివారిండంలో...
    శరీరానికి గాయమైనప్పుడు కాసేపు ర క్తం స్రవిస్తుంది. ఆ తరువాత దానంతట అదే ఆగిపోతుంది. ఈ ప్రక్రియ వెనుక రక్తనాళం, ప్లేట్‌లెట్లు, రక్తం గడ్డకట్టే వ్యవస్థల (కోయాగులేషన్ సిస్టం) పాత్ర కీలకమైనది. రక్తనాళం లోపల సహజంగానే 'ఎండో థీలియం' అనే పొర ఉంది. ఇది రక్త ప్రసరణ సాఫీగా జరిగేందుకు తోడ్పడుతోంది. ఏదైనా కారణం వల్ల ఈ పొరకు దెబ్బ తగిలితే రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్లేట్‌లెట్‌లు సిద్ధమవుతాయి. కొన్ని ప్లేట్‌లెట్లు ఒకదానికి ఒకటి అతుక్కుపోయి గడ్డగా మారతాయి. ప్లేట్‌లెట్లకు తోడుగా రక్తం గడ్డకట్టే వ్యవస్థ నుంచి 'ఫిబ్రిన్' విడుదలవుతుంది. ప్లేట్‌లెట్లు, ఫిబ్రిన్ గాయమైన చోట గడ్డగా ఏర్పడతాయి. ఫలితంగా రక్తస్రావం ఆగిపోతుంది. అయితే ప్లేట్‌లెట్లు మరీ తక్కువగా ఉన్నప్పుడు ఏ గాయమూ లేకుండానే రక్తస్రావం అవుతుంది.

    ర క్తస్రావం ఎందుకు ?
    తమ విధులు నిర్వహించడంలో ప్లేట్‌లెట్లు విఫలమవుతూ ఉంటాయి. అప్పుడిక రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్‌లెట్‌ల సంఖ్య తగ్గిపోవడం గానీ, ప్లేట్‌లెట్ల నాణ్యత త గ్గిపోవడం గానీ, కారణం కావచ్చు. ప్లేట్‌లెట్ల సంఖ్య నార్మల్ గానే ఉన్నా, రక్తస్రావం ఆగకపోవడానికి ఉన్న ప్లేట్‌లు నాణ్యంగా లేకపోవడమే మూలం. ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉండడానికి మౌలికంగా మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది ప్లేట్‌లెట్ల ఉత్పత్తే తక్కువగా ఉండడం. దీనికి ఎముక మజ్జ సరిగా పనిచేయకపోవడమే కారణం. ఎముక మజ్జ సరిగా పనిచేయకపోవడానికి పలు కారణాలున్నాయి. వాటిలో ఎముక మజ్జ బలహీనపడటం ఓ కారణం. కొందరిలో మజ్జ బాగానే పనిచేస్తూ ఉంటుంది. ప్లేట్‌లెట్‌ల ఉత్పత్తి బాగానే ఉంటుంది. కానీ, అవి క్షీణించే వేగం ఎక్కువగా ఉంటుంది. కొందరిలో బ్లడ్ క్యాన్సర్ వల్ల ఇలా క్షీణిస్తాయి. మామూలుగా మన శరీరంలో ఉండే ప్లేట్‌లెట్లలో మూడోవంతు ప్లీహం(స్ప్లీన్)లో నిలువ ఉంటాయి. అయితే కొన్ని రకాల జబ్బుల మూలంగా ఒక్కోసారి ప్లీహం బాగా పెద్దదవుతుంది. అప్పుడు ప్లేట్‌లెట్లలో మూడోవంతు కన్నా ఎక్కువగా ప్లీహంలోకి వెళతాయి. ఇందువల్ల రక్తంలో ఉండే ప్లేట్‌లెట్లు సంఖ్య బాగా తగ్గుతుంది.

    మరికొన్ని మూలాలు
    ప్లేట్‌లెట్ ఉత్పత్తి లోపాలు కొన్ని పుట్టుకతో వచ్చేవి కావచ్చు. మరికొన్ని బాహ్యమైన ప్రభావాలతో వచ్చేవి కావచ్చు. ఈ రెండవ రకం సమస్యకు కారణం హృద్రోగులు రక్తం పలచబరచడానికి వాడే మాత్రలు. ఈ మాత్రల వల్ల కొందరిలో ప్లేట్‌లెట్‌లు సంఖ్యా పరంగానో లేదా నాణ్యతా పరంగానో తగ్గిపోతుంటాయి. కొన్ని యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ప్లేట్‌లెట్లు త గ్గే ప్రమాదముంది.ప్లేట్‌లెట్లు తగ్గడంలో ఇన్ఫెక్షన్ల పాత్ర కూడా ఉంటోంది. వాటిలో డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధుల్లో ఈ తరహా ఇన్‌ఫెక్షన్ల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఎముక మజ్జలో క్షయ మొదలైనప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది కూడా ప్లేట్‌లెట్లు పడిపోవడానికి దారి తీస్తోంది. కొందరిలో ఎముక మజ్జలో ఫైబ్రోస్ టిష్యూ చోటుచేసుకుంటుంది. మైలో డిస్‌ప్లేషియా అనే జబ్బులో కూడా ఎముక మజ్జ దెబ్బతిని ప్లేట్‌లెట్లు బాగా పడిపోతాయి.

    ఎలా తెలుస్తుంది ?
    ఎప్పుడైనా రక్తస్రావం అయితే తప్ప సాధారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య 10 వేలకు తగ్గేదాకా ఏ లక్షణాలూ కనిపించవు. ఒకవేళ అంతకన్నా పడిపోతే మాత్రం వివిధ అవయవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవుతుంది. నోటి లోపలి పొర, చిగుళ్లు, ముక్కు లోపలి పొరల్లోంచి రక్తస్రావం కావచ్చు. సూక్ష్మ రక్తనాళాల్లోంచి చిట్లినట్లు కొందరి చర్మం మీద చుక్కల్లా చిన్న చిన్న రక్తం మచ్చలు కనిపిస్తాయి. ఇక స్త్రీలలో అయితే బహిష్టు సమయంలో రక్తస్రావం మామూలుగా కన్నా చాలా ఎక్కువగా (మెనొరేజియా)అవుతుంది. స్త్రీలలో అతిగా రక్తస్రావం కావడానికి ఎంతసేపూ గర్భాశయ సమస్యలే కారణమని అనుకోకుండా, ప్లేట్‌లెట్లు తగ్గాయేమోనని అనుమానించాలి. శస్త్ర చికిత్స అయిపోయిన కొన్ని గంటల తరువాత కొందరిలో రక్తస్రావం మొదలవుతుంది. కాకపోతే ప్లేట్‌లెట్ల సంఖ్య సరిగానే ఉందని శస్త్ర చికిత్స చేసేస్తే వాటిని నాణ్యతలో లోపాల కారణంగా రక్తస్రావం కావచ్చు. ఇది అతి తక్కువ మందిలోనే కనిపిస్తుంది. అలాంటి స్థితిలో ప్లేట్‌లెట్ కణాల నాణ్యతను తెలుసుకునేందుకు ''రిస్టాసెటిన్'' అనే పరీక్ష చేయవలసి రావచ్చు.

    కొందరిలోనే...
    ప్లేట్‌లెట్లు తగ్గిన ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని కాదు. కొందరిలో ఏ లక్షణమూ కనిపించకపోవచ్చు. నిజానికి ప్లేట్‌లెట్ల సంఖ్య 10 వేలకు పడిపోయే దాకా రక్తస్రావాలేమీ ఉండవు. డెంగ్యూ సోకిన వారి విషయంలో వారికి 30 వేలకు పడిపోగానే విపరీతంగా ఆందోళనకు గురవుతుంటారు. ఒకవేళ 10 వేల కన్నా తక్కువయినా... అప్పుడే శస్త్ర చికిత్స చేయవలసి వచ్చినా... అప్పుడు ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. ఎముక మజ్జ లోపాలతో ప్లేట్‌లెట్లు తగ్గిపోయిన వారిలో తెల్ల రక్తకణాలు, ఎర్రరక్తకణాల్లో కూడా లోపాలు ఉంటాయి. వాటి ప్రభావంతో వేరే కొన్ని లక్షణాలు కనిపించవచ్చు.

    డెంగ్యూ ఉన్నప్పుడు ఆ వ్యాధి లక్షణాలన్నీ ఉంటాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ప్లేట్‌లెట్లు బాగా పడిపోయినప్పుడు రక్తస్రావంతోనూ రావచ్చు. నోరు, ముక్కు నుంచి రక్తస్రావం కావడం, పేగుల్లోంచి రక్తస్రావం అయితే నల్లటి విరేచనాలు కావడం వంటివి కనిపిస్తాయి. రక్తస్రావం మొదలయ్యిందీ అంటే ఇక ప్లేట్‌లెట్లు ఎక్కించవ లసిందే. రక్తస్రావమేదీ లేకపోతే 10 వేలకు వచ్చేదాకా ప్లేట్‌లెట్లు ఎక్కించవలసిన అవసరం లేదు. ఒక వేళ ఎక్కడైనా రక్తస్రావం అవుతూ ఉంటే అప్పుడింక 20 వేలు ఉన్నప్పుడు కూడా ఎక్కించవలసిన అవసరం ఏర్పడుతుంది. ప్లేట్‌లెట్‌లు ఏ సంఖ్యలో ఉండాలన్నది వ్యక్తి వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా ప్లేట్‌లెట్లు 10 వేల కన్నా త గ్గినప్పుడు రక్తస్రావం మొదలవుతుంది. అయితే ఈ రక్తస్రావం శరీరంలోని కీలక భాగాల్లో జరిగితే అది ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. ఉదాహరణకు మెదడులో రక్తస్రావం కావడం. ఇక మిగతా భాగాల్లో లివర్, కిడ్నీల్లో రక్తస్రావం సమస్య ఉండదు. కానీ, ముక్కులోంచి గానీ, నోటి నుంచి గానీ, పేగుల్లోంచి గానీ, గర్భాశయం లోంచి గానీ, రావచ్చు.

    చికిత్స
    కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. మలేరియా కారణంగా ప్లేట్‌లెట్లు పడిపోతే మలేరియాకే చికిత్స చేయాలి. ఏవైనా మందుల కారణంగా ప్లేట్‌లెట్లు పడిపోతూ ఉంటే వెంటనే ఆ మందులు మానేయాలి. మానేసిన వెంటనే ప్లేట్‌లెట్లు వాటికవే పెరుగుతాయి. ముందు కారణానికి చికిత్స చేస్తూ వెళ్లాలి. ఒకవేళ అప్పటికీ రక్తస్రావం ఉంటే ప్లేట్‌లెట్ల తోడ్పాటు కూడా తీసుకోవాలి. డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ వైరస్ వల్ల వచ్చే సమస్య. వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు వారం పదిరోజుల్లో నియంత్రణలోకి వస్తాయి. డెంగ్యూ జ్వరం తగ్గేలోపే కొందరిలో ప్లేట్‌లెట్‌ల సంఖ్య చాలా వేగంగా పడిపోతూ ఉంటుంది. ఈ స్థితిలో రక్తస్రావం కూడా కావచ్చు. అప్పుడు ప్లేట్‌లెట్లు ఎక్కించి పరిస్థితిని నిలకడగా ఉంచవలసి ఉంటుంది.

    చాలా మంది ప్లేట్‌లెట్లు ఏకాస్త తగ్గినా వెంటనే ప్లేట్‌లెట్లు ఎక్కించాలనే అభిప్రాయంతో ఉంటారు. అది సరికాదు. సాధారణంగా 10 వేల కన్నా తగ్గితే గానీ, ప్రమాదం రాదు. ఒకవేళ 10 వేల కన్నా ఎక్కువే ఉన్నా రక్తస్రావం ఉంటే మాత్రం ఎక్కించక తప్పదు. ఐటిపి (ఇడియోపతిక్ థ్రాంబోసైటోపేనిక్ పర్‌ప్యూరా) అనే సమస్యలోనూ ప్లేట్‌లెట్లు వేగంగా పడిపోతుంటాయి. ఏ కార ణంగా వస్తుందో మాత్రం తెలియదు. అన్ని రిపోర్టులూ నార్మల్ అనే వస్తాయి. కానీ, ప్లేట్‌లెట్లు మాత్రం పడిపోతుంటాయి.. కొందరిలో ఆటో ఇమ్యూన్ డిసీస్ కారణంగా కూడా ప్లేట్‌లెట్లు పడిపోవచ్చు.ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్లు మరీ తీవ్రమైన ప్పుడు డి ఐసి ( డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కొయాగులేషన్) అనే సమస్య తలెత్తుతుంది. ఇందులో కూడా ప్లేట్‌లెట్లు వేగంగా తగ్గిపోతుంటాయి. అలాగే టిటిపి ( థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపేనిక్ పర్‌ప్యూరా) సమస్యలోనూ, హెచ్‌యుఎస్ (హెమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్) ప్లేట్‌లెట్‌ల సంఖ్య తగ్గిపోతుంది.తగ్గిపోయిన ప్లేట్‌లెట్ కణాలను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తి సహజంగానే శరీరానికి ఉంటుంది. చాలాసార్లు మనం చేయవలసిందల్లా వ్యాధి దుష్ప్రభావాలను నియంత్రిస్తూ ఉండడమే. ఇక అనివార్యమమైనప్పుడు ప్లేట్‌లెట్లు ఎలాగూ ఎక్కిస్తాం. అంతే గానీ ప్లేట్‌లెట్లు తగ్గినప్పుడల్లా వాటిని ఎక్కించవలసిన అవసరం లేదు. ప్లేట్‌లెట్ అనేది నిజంగా ఎంతో అరుదుగా లభించే ఉత్పాదన. అందువల్ల అత్యవసరమైనప్పుడే వాటిని వినియోగించాలి. అంతేగానీ, అవసరం లేకపోయినా వాటిని వినియోగించుకుంటూ పోతే... అత్యవసరమైన వారికి అవి లభించవు. అమూల్యమైన ప్లేట్‌లెట్లను అత్యవసర పరిస్థితులల్లో వినియోగించడానికే పరిమితమైతే నిజంగా వాటి అవసరమున్న ఎంతో మందిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు.


    Courtesy with : సకల@http://www.andhrajyothy.com/
    • ======================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    Can not we prevent heart diseases?,గుండె జబ్బులను నివారించలేమా?

    •  

    •  
    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Can not we prevent heart diseases?,గుండె జబ్బులను నివారించలేమా?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    గుండె జబ్బులు వచ్చిన తరువాత పరుగులు తీయడమే తప్ప, ఆ జబ్బులు రాకుండా నివారించే విధానాల పట్ల చాలా మంది ఆసక్తి చూపడం లేదు. దాని పరిణామంగానే గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అదే క్రమంలో గుండె సర్జరీల సంఖ్య పెరుగుతోంది. ఆ పరిస్థితికి తావు లేకుండా జీవన శైలి మార్పులతో, ప్రకృతితో జీవనం సాగించడం ద్వారా గుండెను జీవితాంతం సురక్షితంగా ఉంచుకోవచ్చని అంటున్నారు వేమన యోగ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కె. సత్యలక్ష్మి. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే....

    గుండె జబ్బు అనగానే గుండెపోటు రావడం, విలవిల్లాడుతూ ప్రాణాలు గాలిలో కలిసిపోవడం. దాదాపు ప్రతి ఒక్కరి మనసులో ఇదే దృశ్యం కదలాడుతూ ఉంటుంది. సమస్య ఏ స్థాయిలో ఉన్నా గుండె జబ్బు నుంచి బయటపడటానికి సర్జరీ ఒక్కటే పరిష్కారం అన్న భావన కూడా దాదాపు ప్రతి ఒక్కరిలోనూ స్థిరపడిపోయింది. దీనికంతా సినిమాలా? నవలలా? విస్తృతమైన వ్యాపార ప్రకటనలా? ఏవైతేనేమిటి? ఆ భావనైతే అందరిలో మకాం వేసింది. దీనికి గుండె శస్త్ర చికిత్సలు బాగా అందుబాటులోకి రావడం కూడా ఒక కారణమే. గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులకు సంబంధించి రొటీన్ టెస్ట్‌లలో వచ్చే రిపోర్టుల ఆధారంగా డాక్టర్ ప్రమేయం లేకుండానే ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు . కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారూ నాకు సర్జరీ చేయండి అంటూ తమకు తామే సిద్ధమయ్యే పరిణామాలు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

    ఒక అనివార్య పరిస్థితిలోనే యాంజియోగ్రామ్ చేయించుకోవాలనే విషయం మరిచిపోయి అదొక రొటీన్ విధానంగా తీసుకోవడం మొదలలయ్యింది. పేషంట్లు తమకు తామే నిర్ణయించుకుని ఉదయం హాస్పిటల్‌కు వెళ్లి యాంజియోగ్రామ్ చేయించుకుని సాయింత్రానికి డిస్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోవడం ఒక సాధారణ విషయంగా మారిపోయింది. కానీ, యాంజియోగ్రామ్ వల్ల కూడా ఒక్కోసారి దుష్ప్రభావాలు తలెత్తుతాయన్న విషయం వారు తె లుసుకోవడం లేదు. అయితే, సమస్య ఉందో లేదో తెలుసుకోవడం పట్ల ఉన్న శ్రద్ధ వారికి సమస్య రాకుండా నివారించుకునే విధానాల పట్ల ఉండడం లేదు. సైన్స్ బాగా అందుబాటులోకి వ చ్చే క్రమంలో దాని సద్వినియోగం కన్నా దుర్వినియోగమే ఎక్కువగా జరుగుతోంది. ఈ విషయమైన అవగాహనలో మనకన్నా పాశ్యాత్యులే ముందు ఉన్నారు. అందులో భాగంగా 1970లోనే డీన్ అర్నిష్ అనే వ్యక్తి 'లైఫ్ స్ట్రైల్ హార్ట్ ట్రయల్స్' అన్న పేరిట సరియైన జీవన శైలి ద్వారా గుండె జబ్బులనుంచి ఎలా బయటపడవచ్చో తెలియచేశారు. ఎంతో లోతైన అధ్యయనం చేసి, క్లినికల్ ట్రయల్స్ చేసి గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకుల్ని ఏ సర్జరీ లేకుండానే అవి కరిగిపోయేలా చేసి తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావచ్చో కనుగొన్నారు. కాకపోతే జీవన శైలి విషయంలో బాగా నిక్కచ్చిగా ఉండాలి.

    ఏది విశిష్ట జీవన శైలి?
    గుండె జబ్బులకైనా, మరే ఇతర జబ్బుల కైనా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ, విష పదార్థాలే కారణం. అయితే, శరీరంలో పేరుకుపోయిన కలుషితాలు, మలినాలే కాదు, శరీర అవసరం లేని లేదా శరీర అవసరానికి మించి శరీరంలో ఏది ఉన్నా, అది విషపదార్థంగానే పరిగణించబడుతుంది. ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉన్నా అవి విషపదార్థమే అవుతాయి. అవి శరీరానికి హాని చేస్తాయి. వ్యాధికి మూలం విషపదార్థాలు కారణం కాబట్టి, వాటిని తొలగించడమే ఆ వ్యాధికి చికిత్స. ప్రకృతి వైద్య చికిత్సలోని మూల సూత్రమే ఇది.

    గుండె రక్తనాళాల్లో అడ్డుంకులు రావడానికి కూడా శరీరంలోని విషపదార్థాలే కారణం. కాకపోతే ఒకప్పుడు గుండె నాళాల్లో అడ్డంకులు రావడానికి ఒకప్పుడు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే కారణం అనుకునే వారు. అయితే ఆ అడ్డంకులు రావడానికి రక్తనాళాల్లో చేరిన కొవ్వు కణాల్లో వాపు ఏర్పడటం రక్తస్రావం కావడమే కారణమని కొత్తగా కనుగొన్నారు. ఈ రక్తస్రావం వల్ల రక్తప్రసారంలో అంతరాయం ఏర్పడి గుండె పోటు రావడానికి దారి తీస్తోందని స్పష్టం చేశారు. దీనికి శరీరంలో జరిగే ప్రతికూల చర్యలే కారణంగా కనపడుతున్నాయి. దీనికి తీసుకునే ఆహార పానీయాలు, మలబద్దకంతో పాటు మానసిక ఒత్తిళ్లు కూడా కారణంగా ఉంటున్నాయి. మన శరీరంలో కొన్ని వేల మైళ్ల నిడివిగల రక్తనాళాలు ఉన్నాయి. నాడీ వ్యవస్థ అనేది అంతటి సంకీర్ణమైన వ్యవస్థ. ఈ స్థితిలో ఎవరైనా ఎన్ని చోట్ల అని బైపాస్ సర్జరీ చేయించుకుంటారు? ఎన్నిసార్లని చేయించుకుంటారు? ఇది అవసరమా?

    అసలైన ప్రత్యామ్నాయం
    సర్జరీ కాకుండా ఆ స్థితినుంచి కాపాడే శాస్త్రీయమైన మరే మార్గమూ లేదా? రక్తనాళాలన్నీ రక్తప్రసరణకు సంబంధించి ఏ అంతరాయమూ లేకుండా ఉండగలిగే స్థితిని కలిగించలేమా? అంటే చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా....క్రమం తప్పకుండా రోజూ శరీరానికి అవసరమైన శ్రమను అందించడం. శ్రమ లేదా వాయామాల ద్వారా రక్తనాళాలు వ్యాకోచించి, అడ్డంకులు ఏర్పడిన సమయాల్లో కూడా ప్రాణాపాయం ఏర్పడకుండా తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. అలా కాకుండా మందుల మీదే పూర్తిగా ఆ«ధారపడితే, ఆ మందుల తాలూకు దుష్ప్రభావాలతో సమస్య మరింత తీవ్రం కావచ్చు. అందుకే శరీర వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి.
    8 ఆహార విషయాలు కూడా అంతే ముఖ్యం.

    అందుకు వీలైనంత మేరకు ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంటే ఉడికించిన వాటి కంటే ప్రకృతి నుంచి నేరుగా తీసుకునే ఆహార పదార్థాలు ఎంతో శ్రేష్టమని అధ్యయనాలు చెబుతున్నాయి. డీన్ ఆర్నిశ్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెబుతాడు. అందులో 90 శాతం మొక్కలకు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోవాలంటాడు. అలాగే ఉప్పు, మసాలాలు అతిగా వాడటం, రసాయనాలు, వస్తువుల్ని నిలువ ఉంచే ప్రిజర్వేటర్లు లేని పదార్థాలు తీసుకోవడం ఎంతో మేలు. అలాగే పిండిపదార్థాలు, కొవ్వు పదార్థాల మోతాదును గణనీయంగా తగ్గించడం అవసరం. హెచ్‌డిఎల్ లేదా కొలెస్ట్రాల్ మన శరీరంలో కొవ్వుగా మన శరీరంలో నిలువె ఉంటుంది. అది మన అవసరానికి ఉపయోగపడుతుంది. అదే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అయితే రక్తంలో కలిసిపోయి రక్తనాళాల్లో అడ్డుపడి గుండె జబ్బులకు దారి తీస్తుంది.

    ఆహార నియమాలు
    8 రక్తప్రసరణలో ఈ అంతరాయాలేవీ రాకుండా ఉండాలంటే, రక్తం పలుచగా ఉండేలా జాగ్రత్త పడాలి. అందుకు రోజుకు ఐదారు లీటర్ల దాకా నీళ్లు తాగాలి. ఆహార పానీయాల్లో సిట్రస్ అంటే సి. విటమిన్ సమృద్ధిగా ఉండే పండ్లు, విరివిగా తీసుకోవాలి. శరీరం బరువును బాగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారంలో బియ్యం, గోదుమలకే పరిమితం కాకుండా, కొర్రలు, సజ్జలు, జొన్నల వంటి తృణధాన్యాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తీసుకోకపోవడం అన్ని విధాలా మేలు.

    రోజూ ఒకే రకమైన ధాన్యాన్ని ఆహారంగా తీసుకుంటే శరీరం అందులోని పోషకాలను సంగ్రహించే విషయంలో అనాసక్తి చూపుతుంది. అందువల్ల వాటిని తినడం వల్ల కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. పైగా గోదుమల్లో గ్లూటన్ అనే జిగట పదార్థం పలురకాల అలర్జీలకు కారణమవుతుంది. అంతకు మించి ఇది మలబద్దకానికి కూడా కారణమవుతుంది. మలబద్దకం వల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఇవి పరోక్షంగా గుండెజబ్బులకు రక్తనాళాల అంతరాయానికి కారణమవుతాయి. అలాగే పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పీచుపదార్థాల్లో జీర్ణమయ్యేవి, జీర్ణం కానివి అంటూ రెండు రకాలుగా ఉంటాయి. వీటిలో జీర్ణమయ్యే పీచుపదార్థం ఎక్కువ మేలు చేస్తుంది. ఇది పేగుల్లో ఉంటూ మనకు ఉపయోగకరంగా ఉండే బ్యాక్టీరియాను పోషించడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. ఈ జాగ్రత్తలన్నీ జీవక్రియలు సవ్యంగా జరిగి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

    Courtesy with : డాక్టర్ కె. సత్యలక్ష్మి,డైరెక్టర్, వేమన యోగ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్,బేగంపేట్, హైదరాబాద్@salaka of Andhrajyoti newspaper.

    • ===========================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    No fear of heart attack if change in lifestyle,లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకుంటే హార్ట్ ఎటాక్ భయం ఉండదు








    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --No fear of heart attack if change in lifestyle,లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకుంటే హార్ట్ ఎటాక్ భయం ఉండదు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    45 ఏళ్లు పైబడిన వారికే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా అనుకుని మీరు గుండెపై చేయి వేసుకుని నిశ్చింతగా ఉండిపోతే... ఏ క్షణమైనా గుండెపోటు రావచ్చు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానాల వల్ల ఇప్పుడు యుక్త వయస్సులోనే గుండె జబ్బులు వచ్చిపడుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ గుండె జబ్బులపై అవగాహన పెంచుకోవడంతో పాటు లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకోవాలి. అప్పుడే హార్ట్ ఎటాక్ భయం ఉండదని అంటున్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొండల్‌రావు.

    అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో 60 ఏళ్లు పైబడిన వారిలో గుండె జబ్బులు కనిపిస్తే మనదేశంలో 40 ఏళ్లకే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎక్కువ మరణాలు గుండె జబ్బుల మూలంగానే సంభవిస్తున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, జీవనవిధానమే అయినా ఇతర కారణాలు కూడా గుండె జబ్బులను తెచ్చిపెడుతున్నాయి.
    ఫ్యామిలీ హిస్టరీ : కుటుంబంలో తల్లి లేక తండ్రికి గుండె జబ్బు ఉన్నట్లయితే వారి పిల్లలకు హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

    స్మోకింగ్ : టీనేజ్‌లోనే గుండె జబ్బులు రావడానికి మరో కారణం స్మోకింగ్. ఫ్యాషన్‌గా మొదలైన ఈ అలవాటు తరువాత వ్యసనంగా మారుతుంది.
    లైఫ్‌స్టయిల్ : సెడెంటరీ లైఫ్‌స్టయిల్ గడిపే వారిలోనూ గుండెపోటు అవకాశాలు ఎక్కువ. అంటే శారీరక శ్రమ లేకపోవడం, పిల్లలు టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, శారీరక శ్రమ ఉండే ఆటలకు దూరం కావడం వంటివి కారణమవుతున్నాయి.

    స్థూలకాయం : అధిక బరువు మరో కారణం. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌కు అలవాటు పడటం, పిజ్జాలు, బర్గర్లు తినడం, వేపుళ్లు ఎక్కువగా ఇష్టపడటం, స్వీట్స్ తినడం వంటి ఆహారపు అలవాట్లు అధిక బరువుకు కారణమవుతాయి. అధిక బరువు గుండె జబ్బులు రావడానికి దోహదం చేస్తుంది.
    డయాబెటిస్ : కొందరు యుక్త వయసులోనే షుగర్ వ్యాధి బారినపడతారు. అటువంటి వారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువే ఉంటుంది.
    ఒత్తిడి : వృత్తి పరమైన ఒత్తిడి, కుటంబపరమైన ఒత్తిడి కూడా గుండె జబ్బులకు కారణమవుతోంది.

    డిప్రెషన్ : డిప్రెషన్ కూడా గుండె జబ్బులకు కారణమవుతుంది. డిప్రెషన్ వల్ల ఎక్కువ ఆహారం తీసుకోవడం జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా హార్ట్ఎటాక్ రిస్క్ పెరుగుతుంది.
    హై బీపీ : అధిక రక్తపోటు కూడా ఒక కారణం. యుక్తవయస్కుల్లో ప్రిహైపర్‌టెన్షన్ కనిపిస్తుంది. అంటే రక్తపోటు 130/90 లేక 140/100 ఉంటుంది. ఈ దశలో బీపీని గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే రక్తపోటును సాధారణ స్థితికి తీసుకురావచ్చు. లేదంటే రిస్క్ పెరుగుతుంది.

    ఏం జరుగుతుంది?
    రక్తంలో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయినపుడు రక్తనాళాల్లోని గోడల్లో పేరుకుపోతుంది. ఫలితంగా గుండె రక్తసరఫరా జరగక హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోకుండా చూస్తుంది. ఒకవేళ మంచి కొలెస్ట్రాల్ తగ్గి చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయినప్పుడు బ్లాక్స్ ఏర్పడి హార్ట్ ఎటాక్‌కు కారణమవుతుంది.

    తల్లిదండ్రుల పాత్ర కీలకం
    పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కంప్యూటర్ గేమ్స్ ఆడకుండా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మూలంగా స్థూలకాయం సమస్య పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ కొరవడితే వాళ్లు యుక్తవయస్సు వచ్చే సరికే గుండె జబ్బులు వస్తాయి. దీంతోపాటు స్మోకింగ్ వల్ల కలిగే నష్టాన్ని పిల్లలకు వివరించాలి. బాల్యంలో నేర్పించిన అలవాట్లు జీవితాంతం ఉంటాయని గుర్తుంచుకోవాలి.

    ఏం చేయాలి?
    తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. నూనె ఎక్కువగా వాడకూడదు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినేకన్నా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. పిల్లలకు బాల్యం నుంచే మంచి ఆహారపు అలవాట్లను నేర్పించాలి. కుటుంబసభ్యుల్లో ఎవరైనా గుండె జబ్బులతో బాధపడుతుంటే వారి పిల్లలు మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు అధికంగా తాగాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన లక్షణాలపై అవగాహన పెంచుకోవాలి. చెమట అధికంగా వస్తున్నా, ఆయాసంగా అనిపిస్తున్నా, ఏమాత్రం సందేహంగా అనిపించినా వైద్యులను సంప్రదించాలి. అధిక రక్తపోటు ఉన్నట్లయితే ఆహార నియమాలు పాటించాలి. ఉప్పు వాడకం బాగా తగ్గించాలి. జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే డైట్ కంట్రోల్ చేయడం ద్వారా తగ్గేలా చూసుకోవాలి. మందుల వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చిన్న వయసులో గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.

    Courtesy with : డాక్టర్ కొండల్‌రావు,సీనియర్ కార్డియాలజిస్ట్,యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్, హైదరాబాద్@sakala of andhrajyothy news paper
    • ===========================
    Visit my website - > Dr.Seshagirirao.com/