Friday, 18 October 2013

Stomach-స్టమక్‌ ఫ్లూ








ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Stomach-స్టమక్‌ ఫ్లూ- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఫ్లూ అనగానే తుమ్ములు, ముక్కు కారటం, గొంతునొప్పి గుర్తుకొస్తాయి. కానీ  స్టమక్‌ ఫ్లూ అనే సమస్యలూ ఉన్నాయని మీకు తెలుసా?

నిజానికి స్టమక్‌ ఫ్లూ మామూలు ఫ్లూ ఒకటి కాదు. జలుబు లక్షణాలతో కూడిన మామూలు ఫ్లూ వైరస్‌ల వల్ల వస్తుంది. బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవుల వంటి పలు కారకాలతో వచ్చే స్టమక్‌ ఫ్లూ ఒక జీర్ణకోశ సమస్య. కలుషిత ఆహారం, అపరిశుభ్ర నీరు, లాక్టోజ్‌ పడకపోవటం మూలంగా ఇది రావొచ్చు. మల విసర్జన అనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోకపోవటం కూడా దీనికి దారితీయొచ్చు. గర్భిణులకు, చిన్నపిల్లలకు, పోషణ లోపంతో బాధపడేవారికి, రోగ నిరోధకశక్తి తక్కువగా గలవారికి, వృద్ధులకు దీని ముప్పు ఎక్కువ.

లక్షణాలు
* కడుపు కండరాలు పట్టేయటం
* కడుపు నొప్పి
* వికారం
* వాంతి
* నీళ్ల విరేచనాలు

స్టమక్‌ ఫ్లూ కారక సూక్ష్మక్రిములను బట్టి జ్వరం, తలనొప్పి, లింఫ్‌ గ్రంథుల వాపు వంటివీ ఉండొచ్చు. ఈ ఫ్లూ తీవ్రమైతే ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంది. కాబట్టి తరచుగా ద్రవాలు తీసుకుంటే డీహైడ్రేషన్‌ బారినపడకుండా చూసుకోవచ్చు.

  • ====================

 Visit my website - > Dr.Seshagirirao.com/ 

Stomach migrine-స్టమక్‌ మైగ్రేన్‌








ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Stomach migrine-స్టమక్‌ మైగ్రేన్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మైగ్రేన్‌ అనగానే మనకు తీవ్రమైన తలనొప్పి గుర్తొస్తుంది.  కానీ స్టమక్‌ మైగ్రేన్‌ అనే సమస్యలూ ఉన్నాయని మీకు తెలుసా?
ఇది పార్శ్వనొప్పుల్లోని ఒకరకం. పెద్దల్లో అరుదు గానీ పిల్లల్లో తరచుగా కనిపిస్తుంది. సాధారణంగా కుటుంబంలో పార్శ్వనొప్పి బాధితులు గలవారి పిల్లలకు వస్తుంది. దీని బారినపడ్డ పిల్లలకు పెద్దయ్యాక పార్శ్వనొప్పి వచ్చే అవకాశమూ ఉంది. స్టమక్‌ మైగ్రేన్‌లో కడుపు మధ్యలో, బొడ్డు సమీపంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఈ సమస్యకు కచ్చితమైన కారణమేంటో బయటపడలేదు. కానీ హిస్టమిన్‌, సెరటోనిన్‌ రసాయనాల్లో మార్పుల మూలంగా వస్తుందని భావిస్తున్నారు. మానసిక అంశాలూ దోహదం చేస్తాయి. అలాగే నైట్రేట్లతో కూడిన మాంసం, చాక్లెట్లు కూడా దీన్ని ప్రేరేపిస్తాయి.

లక్షణాలు
* కడుపు మధ్యభాగంలో తీవ్రమైన నొప్పి
* వికారం
* వాంతి
* చర్మం పాలిపోవటం
* ఆకలి లేకపోవటం, ఆహారం తీసుకోకపోవటం

స్టమక్‌ మైగ్రేన్‌లో కడుపు నొప్పి ఒక గంట నుంచి మూడు రోజుల వరకు ఉండొచ్చు. ఇది ఎలాంటి హెచ్చరికలు లేకుండానే హఠాత్తుగా రావొచ్చు. మామూలు కడుపునొప్పికీ దీనికీ తేడాలను గుర్తించటం అంత తేలిక కాదు. అందువల్ల దీన్ని నిర్ధరించటం కష్టం. దీన్ని గుర్తించటంలో కుటుంబ చరిత్రే కీలకం. ప్రస్తుతానికి దీనికి కచ్చితమైన చికిత్స ఏదీ లేదు. ఇతర పార్శ్వనొప్పులకు ఇచ్చే మందులే ఇందులోనూ ఇస్తారు. కొందరికి సెరటోనిన్‌ బ్లాకర్లు, ట్రైసీలిక్‌ యాంటీడిప్రెసెంట్స్‌ బాగా ఉపయోగపడతాయి. ఏయే పదార్థాలు కడుపునొప్పిని ప్రేరేపిస్తున్నాయో గుర్తించి వాటికి దూరంగా ఉంటే స్టమక్‌ మైగ్రేన్‌ను నివారించుకోవచ్చు. పెద్దవాళ్లు ఒత్తిడిని నియంత్రించుకోవటం, ఆరోగ్యకరమైన జీవనశైలితో దీన్ని దూరంగా ఉంచుకోవచ్చు.


  • =======================

 Visit my website - > Dr.Seshagirirao.com/

Intra uterine Foetal defects awareness , తల్లిగర్భంలో బిడ్డకు తలెత్తే లోపాలు-అవగాహన








ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -తల్లిగర్భంలో బిడ్డకు తలెత్తే లోపాలు-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పిండం ఎదిగే క్రమంలో తల్లిగర్భంలో తలెత్తే లోపాలు, పుట్టుకతో వచ్చే చాలా అవకరాలను నేడు సమర్థంగా చక్కదిద్దే అవకాశం ఉంది. కాబట్టి బిడ్డకు ఏదో సమస్య ఉందని తెలియగానే విపరీతంగా ఆందోళనలో కూరుకుపోవాల్సిన పనిలేదు. ఆ సమస్య ఏమిటి? దాన్ని అధిగమించేందుకు మన ముందున్న మార్గాలేమిటి? దీనికి వైద్యులు ఎటువంటి సహాయం అందిస్తారన్నది తెలుసుకుని.. అవగాహన పెంచుకుని.. దాన్నిబట్టి ఒక నిర్ణయానికి రావటం ప్రధానం.

లోపం..
స్త్రీపురుష సమాగమంలో ఏకమయ్యేది సూక్ష్మాతిసూక్ష్మమైన అండం, శుక్రం! కంటికి కనిపించని ఆ రెండూ కలిసి ఏర్పడే ఓ అతి చిన్న ఏక కణం... ఎన్నో అవయవాలతో, వ్యవస్థలతో నడయాడుతుండే.. ఓ పండంటి బిడ్డగా పురుడుపోసుకోవటం.. ప్రకృతిలోకెల్లా ఓ అత్యద్భుత పరిణామం! పైకి చాలా సహజంగా జరిగిపోతున్నట్టే అనిపించినా నిజానికి ఇదో సంక్లిష్టమైన జీవ నిర్మాణ ప్రక్రియ. అందుకే ఈ క్రమంలో ఎక్కడైనా తేడాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా పిండం వేగంగా మార్పులు చెందే క్రమంలో 3 నుంచి 8 వారాల మధ్య ఇటువంటి తేడాలొచ్చి.. అవే లోపాలుగా తయారవుతుంటాయి. చాలా రకాల లోపాలకు బీజాలు 5వ వారంలో పడుతుంటాయి. కొన్నిసార్లు ఒక్కటే లోపం ఉండొచ్చు.. కొన్నిసార్లు చాలారకాల లోపాలు కలగలిసి ఉండొచ్చు. వీటిని గుర్తించేందుకే గర్భిణులకు వైద్యులు మధ్యమధ్యలో స్కానింగులు చేస్తుంటారు. సాధారణంగా పిండదశలో తలెత్తే పలురకాల లోపాలు 18-28 వారాల మధ్య చేసే స్కానింగులో బయటపడతాయి. అయితే ఈ లోపాలన్నీ కూడా ప్రమాదకరమైనవేం కాదు. వీటిలో చాలా లోపాలు తల్లి కడుపులోనే... కాన్పు అయ్యేలోపే సర్దుకుంటుంటాయి కూడా. కొన్ని లోపాలు అలా మిగిలిపోయినా వాటివల్ల తీవ్రమైన నష్టమేమీ ఉండదు. ఇక కొన్ని లోపాలను బిడ్డ పుట్టగానే ఆపరేషన్‌ చేసి చాలా వరకూ చక్కదిద్దచ్చు. ఇటువంటి ఆపరేషన్ల విషయంలో ఇప్పుడు 'పీడియాట్రిక్‌ సర్జరీ' విభాగం ఎంతో పురోగమించింది కూడా.

గుర్తించేదెలా?
కడుపులో పిండం ఎదుగుదలను అంచనా వేసి లోపాలేమైనా తలెత్తుతున్నాయా? అన్నది తేల్చిచెప్పేందుకు ఇప్పుడు చాలా రకాల పరీక్షా పద్ధతులున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది- ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌. దీనిలో- ఏ వారానికి పిండం ఎదుగుదల ఎంత ఉండాలో అలాగే ఉందా? ఆ క్రమంలో ఏవైనా లోపాలు తలెత్తుతున్నాయా? ఉమ్మనీరు తగినంతగా ఉందా? మాయ ఎలా ఉంది? తల్లి నుంచి బిడ్డకు బొడ్డు తాడు గుండా రక్తప్రసారం బాగుందా? తదితర అంశాలన్నీ తెలుస్తాయి. 11-14 వారాల మధ్య స్కానింగు (ఎన్‌టీ స్కాన్‌) చేసి పిండం మెడ దగ్గరి ముడతల మందం ఎంత ఉందన్నది చూస్తారు. ఈ మందాన్ని బట్టి బిడ్డకు తీవ్రస్థాయి క్రోమోజోముల లోపాలుగానీ, బుద్ధిమాంద్యం వంటి తీవ్ర సమస్యలుగానీ తలెత్తే అవకాశం ఉందేమో అంచనా వేస్తారు. ఇక 18-23 వారాల మధ్య ఇలాంటిదే మరో స్కానింగు (టిఫా స్కాన్‌) చేసి... బిడ్డలో నిర్మాణపరంగా ఎక్కడెక్కడ లోపాలు తలెత్తే అవకాశం ఉందో ఆయా ప్రాంతాలన్నీ ఒక పద్ధతి ప్రకారం క్షుణ్ణంగా పరీక్షిస్తారు. సాధారణంగా ఎటువంటి పెద్ద, చిన్న లోపాలున్నా దీనిలో గుర్తించే వీలుంటుంది. ఇక పిండం గుండె పనితీరు ఎలా ఉంది? దానిలో రక్తప్రసారం బాగుందా? తదితర వివరాలు తెలుసుకునేందుకు 'ఫీటల్‌ ఎకోకార్డియోగ్రఫీ' పరీక్ష చేస్తారు. ఇది కూడా తల్లి పొట్ట మీది నుంచి చేసే స్కానింగు వంటిదే. ఇవి కాకుండా సాధారణంగా 23-28 వారాల మధ్య చేసే 'త్రీడీ', 'ఫోర్‌డీ' స్కానింగులతో బిడ్డ స్వరూపం, కొంత వరకూ అంతర్గత అవయవాల నిర్మాణాన్ని కూడా తెలుసుకోవచ్చు. వీటికి తోడు గర్భిణులందరికీ కొన్ని రక్తపరీక్షలు చేసి 'ఆల్ఫా ఫీటో ప్రోటీన్‌' వంటివి చూస్తే మరికొంత సమాచారం తెలుస్తుంది. ఇవన్నీ బిడ్డలోని లోపాలను పట్టిచూపించే సాధారణ పరీక్షా విధానాలు. అయితే ఏదైనా బలమైన అనుమానం తలెత్తితే.. 10-12 వారాల మధ్య మాయ నుంచి చిన్న ముక్క తీసి పరీక్షించటం (కోరియానిక్‌ విల్లస్‌ శాంప్లింగ్‌), 15-20 వారాల మధ్య తల్లి పొట్ట మీది నుంచి సూదితో ఉమ్మనీరు తీసి పరీక్షించటం (ఆమ్నియోసెంటిసిస్‌) వంటివి కూడా చాలా సమాచారాన్ని అందిస్తాయి.

లోపాలుంటే...?
ఏదైనా లోపం తలెత్తుతోందని గుర్తించినప్పుడు రకరకాల విభాగాలకు చెందిన వైద్యనిపుణులతో చర్చించి.. లోపం స్వభావం ఏమిటి? దానివల్ల బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? చక్కదిద్దే మార్గాలేమిటి? అన్నది చర్చించి.. తల్లిదండ్రులకు సమగ్రంగా వివరిస్తారు. తల్లీబిడ్డలిద్దరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అవసరాన్ని బట్టి ఐసీయూ వంటి సదుపాయాలున్న పెద్ద ఆసుపత్రిలో కాన్పు చేసి.. వెంటనే బిడ్డ సంరక్షణ బాధ్యత చేపడతారు.

లోపాలుంటే.. మార్గాలు?
1. పిండ దశలోనే మరమ్మతులు చెయ్యటం.. ఇది ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న వినూత్న విధానం. ప్రస్తుతానికి ఇలా చాలా కొద్ది సమస్యలను మాత్రమే చక్కదిద్దచ్చు. ముఖ్యంగా పిండానికి మూత్రాశయం మూసుకుపోయి, మూత్రం లోపలే ఉండిపోతుండటం వంటి సమస్యలను షంట్‌ అమర్చటం ద్వారా కొంత వరకూ సరిచేస్తున్నారు. పిండంలో గుండె సమస్యల వంటివి చక్కదిద్దే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. మొత్తానికి పిండానికే మరమ్మతులు చేసే నైపుణ్యం ఇంకా అందుబాటులో లేదనే చెప్పాలి.

2. గర్భాన్ని అలాగే కొనసాగించి.. బిడ్డ పుట్టగానే లోపాన్ని చక్కదిద్దటం: ప్రస్తుతం చాలా సమస్యల విషయంలో ఇది సాధ్యమవుతోంది. గర్భంలోనే సమస్యను గుర్తించినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని.. మంచి సదుపాయాలున్న ఆసుపత్రిలో కాన్పు చేసి వెంటనే బిడ్డకు సంరక్షణ కల్పించి.. క్రమేపీ లోపాన్ని సరిదిద్దటం.. ఇప్పుడిలా చాలా సమస్యలను చక్కదిద్దచ్చనే చెప్పొచ్చు.

3. గర్భస్రావం చెయ్యటం: బిడ్డలో లోపాలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు, ఏ రకమైన వైద్యసేవలు అందించినా బిడ్డ మనుగడ, సాధారణ జీవనం కష్టమని గుర్తించినప్పుడు గర్భస్రావం చేయించుకునే అవకాశం గురించి కూడా వైద్యులు చర్చిస్తారు.

ఆదుకునే వైద్యం
మన మెదడు, వెన్నుపాము చుట్టూ నీరులాంటి ద్రవం (సీఎస్‌ఎఫ్‌) ఉంటుంది. దీని ప్రవాహ మార్గంలో ఎక్కడన్నా అవరోధాలు తయారైతే ఈ ద్రవం ఎక్కువైపోయి.. తల పెద్దగా కనబడుతుంటుంది. మెదడులోని ఆ చుట్టుపక్కల భాగాలన్నీ నొక్కుకుపోయి.. మెదడు దెబ్బతినొచ్చు. దీన్నే 'హైడ్రోసెఫాలస్‌' అంటారు. దీనివల్ల తర్వాత్తర్వాత బిడ్డ కదలికలు దెబ్బతినటం, మేధస్సు పెరగకపోవటం వంటి రకరకాల దుష్ప్రభావాలు రావచ్చు. ఈ సమస్యను 18-23 వారాల మధ్య చేసే 'టిఫా స్కానింగు'లోనే గుర్తించొచ్చు. ప్రతి 2000 కాన్పుల్లో ఒకరు ఇటువంటి లోపంతో పుడుతుంటారు. ఈ సమస్య మగపిల్లల్లో ఎక్కువ. వీరిలో చాలామందికి ఇతరత్రా సమస్యలూ ఉండే అవకాశమూ ఉంది. కొన్నిసార్లు వీరిలో క్రోమోజోముల లోపాలూ ఉండొచ్చు కాబట్టి ఉమ్మనీరు తీసి పరీక్షిస్తారు. ఇక అప్పటి నుంచీ బిడ్డ మెదడు సైజు గమనిస్తూనే ఉంటారు.

* సాధారణంగా- బిడ్డ పుట్టిన తర్వాత.. మెదడు చుట్టూ చేరిపోయిన నీరు తగ్గేందుకు ఒక ఆపరేషన్‌ చేసి మెదడు నుంచి పొట్టలోకి ఒక గొట్టం (వి.పి.షంట్‌) అమరుస్తారు.

* ఆందోళనకరం- మెదడులో నీరు చేరే ప్రాంతమైన వెంట్రికల్స్‌ 15ఎంఎం కంటే పెద్దగా అయినా.. మెదడు కార్టెక్స్‌ పరిమాణం 1.5 సెం.మీ. కన్నా తక్కువగా ఉన్నా... తలసైజు వేగంగా పెరుగుతున్నా పరిస్థితి బాగలేదనే అర్థం. ఇటువంటి బిడ్డ పుట్టిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధారణ జీవనం కష్టం. అటువంటి పరిస్థితుల్లో వైద్యులు ఇతరత్రా మార్గాల గురించి చర్చిస్తారు.
తల్లి కడుపులో పెరుగుతున్న పిండానికి కిడ్నీల్లో నీరు చేరి, అది పెరగుతుండటం సమస్యే. దీన్ని 'హైడ్రోనెఫ్రోసిస్‌' అంటారు. కిడ్నీల్లో నుంచి బయటకొచ్చే మూత్రనాళాల దగ్గర ఏదైనా అవరోధం ఏర్పడితే కిడ్నీల్లో ఇలా మూత్రం పెరిగి నీరు చేరినట్లవుతుంది. దీనికి చాలా అంశాలు కారణం కావచ్చు. దీన్ని 20-24 వారాలప్పుడు చేసే స్కానింగులో గుర్తిస్తారు. వాపు స్వల్పంగా ఉంటే (మైల్డ్‌ హైడ్రోనెఫ్రోసిస్‌) దీనివల్ల బిడ్డ కిడ్నీలకు పెద్దగా ఇబ్బందేం ఉండదు.

* సాధారణంగా- సమస్య ఒక కిడ్నీకే ఉన్నప్పుడు క్రమేపీ మెరుగయ్యే అవకాశం ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత 4 వారాలకు పరిస్థితి ఒకసారి గమనించి.. అప్పుడు అవసరమైతే సర్జరీతో దాన్ని సరిచెయ్యచ్చు. ఇలా హైడ్రోనెఫ్రోసిస్‌ సమస్యతో పుట్టిన బిడ్డల్లో 33% మందికే ఇటువంటి సర్జరీ అవసరమవుతుంటుంది. మిగతా వారికి ఏ ఇబ్బందీ ఉండదు.

* ఆందోళనకరం- పిండం రెండు కీడ్నీల్లోనూ నీరుచేరినా, కిడ్నీలతో పాటు మూత్రనాళం-మూత్రాశయం కూడా ఉబ్బిపోయినా, ఉమ్మనీరు చాలా తక్కువగా ఉన్నా, కిడ్నీల నుంచి మూత్రాన్ని బయటకు తెచ్చే నాళం వ్యాసార్థం 20 ఎంఎం కంటే ఎక్కువగా ఉన్నా, కిడ్నీల కణజాలం బాగా క్షీణించినా తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఇతరత్రా మార్గాల గురించి చర్చిస్తారు.
పిండం దశలో మన మెదడు, వెన్నుపాము వంటివన్నీ కూడా ఒకే రకమైన గొట్టం కణజాలం (న్యూరల్‌ ట్యూబ్‌) నుంచి తయారవుతాయి. ఈ క్రమంలో ఈ గొట్టం ఎక్కడన్నా ఒకచోట పూడకుండా ఉండిపోతే.. అక్కడి నుంచి లోపలి నాడులు, పొరలన్నీ ఒక బుడిపెలా బయటకు తోసుకొస్తాయి. దీన్నే 'మైలో మినింగోసీల్‌' అంటారు. ఇది 4-6 వారాల మధ్యే తలెత్తే లోపం.

* దీన్ని సాధారణ స్కానింగుల్లో గుర్తించొచ్చు. అనుమానం వస్తే స్పష్టత కోసం ఎమ్మారై చేయిస్తారు. ఇతరత్రా మరేమన్నా సమస్యలున్నాయేమో కూడా చూస్తారు. వెన్ను లోపం అంత తీవ్రంగా లేనప్పుడు కొందరిలో పెద్ద ఇబ్బందేమీ ఉండదు. పుట్టగానే సాధ్యమైనంత త్వరగా వెన్ను పూడ్చేందుకు ఆపరేషన్‌ చేస్తారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిలో నడవలేకపోవటం, మలమూత్రాలపై పట్టులేకపోవటం వంటి తీవ్ర ఇబ్బందులూ ఉండొచ్చు.

* ఆందోళనకరం- వెన్ను మీద సమస్య మరీ పెద్దదిగా ఉన్నప్పుడు, పిండం కదలికలు సరిగా లేనప్పుడు, పిండం మూత్రాశయం నిండటం-ఖాళీ అవ్వటం సరిగా లేనప్పుడు, దీనితో పాటు మెదడులో నీరు చేరే 'హైడ్రోసెఫాలస్‌' సమస్య కూడా ఉన్నప్పుడు ఫలితాలు తీవ్రంగా ఉండొచ్చు. ఇటువంటి సందర్భాల్లో వైద్యులు రకరకాల మార్గాల గురించి చర్చిస్తారు.
పొట్టలోని పేగులనూ, ఛాతీలోని వూపిరితిత్తులనూ వేరుచేస్తూ మధ్యలో డయాఫ్రమ్‌ పొర ఉంటుంది. అన్నవాహిక.. ఈ మందపాటి పొర మధ్య నుంచే కిందికి వెళుతుంటుంది. పిండం ఎదుగుదలో కొందరికి కింది నుంచి పేగులు ఈ పొర గుండా పైకి తోసుకొచ్చి.. వూపిరితిత్తులను నొక్కేస్తుంటాయి. (డయాఫ్రమాటిక్‌ హెర్నియా) ఇది స్కానింగులో బయటపడుతుంది. ఇలా నొక్కేస్తుండటం వల్ల వీరిలో వూపితిత్తులు సరిగా తయారవ్వకపోవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే గుండె, రెండు వూపిరితిత్తులూ కూడా నొక్కుకుపోతాయి.

* ఒకవైపు వూపిరితిత్తి మాత్రమే నొక్కుకుపోతూ సమస్య అంత తీవ్రంగా లేనప్పుడు పరిస్థితిని గమనిస్తూ కాన్పు అత్యాధునిక సదుపాయాలున్న ఆసుపత్రుల్లో చేయటం మంచిది. తర్వాత బిడ్డకు కృత్రిమ శ్వాస కల్పించి ఆపరేషన్‌ చేస్తారు.

* ఆందోళనకరం- దీన్ని తొలివారాల్లోనే గుర్తించినా, ఇది కుడివైపున్నా, ఉమ్మనీరు మరీ ఎక్కువగా ఉన్నా, కొంత లివర్‌ కూడా ఛాతీలోకి తోసుకుపోయినా, వూపిరితిత్తుల ఎదుగుదల తీవ్రంగా దెబ్బతిన్నా.. ఇతరత్రా మార్గాల గురించి చర్చిస్తారు.
వూపిరితిత్తుల్లో నీటితిత్తుల్లాంటి గడ్డ తయారవ్వటం (సీసీఏఎమ్‌) మరో సమస్య. సాధారణంగా ఇది పిండంలో ఒకవైపు వూపిరితిత్తిలో వస్తుంది. మగపిల్లల్లో ఎక్కువ. ఇది స్కానింగుల్లో బయటపడేదే.

* సాధారణంగా వీటిలో కొన్ని కాన్పు అయ్యేలోపే.. లోపలే తగ్గిపోతాయి. కాన్పు వరకూ ఉంటే.. ప్రసవం తర్వాత సర్జరీతో తొలగిస్తారు. శ్వాస బాగుంటే సర్జరీ కూడా 2-6 నెలల తర్వాత చెయ్యచ్చు.

* ఆందోళనకరం- గడ్డ పెద్దగా ఉండి, గుండె మరో వైపునకు తోసుకుపోయినప్పుడు, ఒళ్లంతా నీరు చేరినప్పుడు, బిడ్డలో లక్షణాలన్నీ తల్లిలో కూడా కనబడుతూ తల్లికి కూడా హాని జరిగే పరిస్థితి తలెత్తినప్పుడు... దీని గురించి తీవ్రంగా తీసుకోవాల్సి ఉంటుంది.
పిండం కిడ్నీలు 5వ వారం నుంచే పని చేస్తుంటాయి. ఇవి తయారు చేసిన మూత్రం మూత్రాశయంలో నిల్వ ఉండి.. అప్పుడప్పుడు ఉమ్మనీటిలో కలుస్తుంటుంది. కొన్నిసార్లు ఈ విసర్జన మార్గం మూసుకుపోయి విసర్జన ఆగిపోతుంది. ఇది మగపిల్లల్లో ఎక్కువ. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సమస్య ఓ మోస్తరుగా ఉంటే కాన్పు తర్వాత దశలవారీగా సర్జరీ చేసి సరిచెయ్యచ్చు.

* ఆందోళనకరం- ఉమ్మనీరు బాగా తక్కువున్నప్పుడు, పిండం మూత్రాశయం ఎప్పుడూ ఖాళీగానే కనబడుతున్నప్పుడు, పిండం కిడ్నీల్లో నీటితిత్తులు ఎక్కువగా ఉన్నప్పుడు, కిడ్నీలూ, మూత్రనాళాలన్నీ ఉబ్బిపోయి, మూత్రాశయం మాత్రం చిన్నగా ఉండిపోయినప్పుడు సమస్య తీవ్రంగా ఉందని అర్థం.
అరుదుగా మరికొన్ని...
* బయటే పేగులు: చాలా అరుదుగా.. అంటే 5-10 వేల కాన్పుల్లో ఒకరికి... పొట్టలోపలి పేగుల వంటివి బయటే ఉండిపోతాయి. ఇలాంటివి మగపిల్లల్లో ఎక్కువ. వీటిని స్కానింగులో గుర్తిస్తారు. పేగులు మరీ ఎక్కువగా బయట లేకపోతే.. పుట్టగానే వాటిని లోపలికి నెట్టేస్తూ సర్జరీ ద్వారా చక్కదిద్దచ్చు. పేగులు చాలా భాగం బయట ఉంటే.. ముందు పేగులను బయట ఒక సైలాస్టిక్‌ తిత్తిలో ఉంచి, 7-10 రోజుల్లో క్రమంగా వాటిని లోపలికి పంపిస్తూ లోపాన్ని సరిచేస్తారు.

* గొట్టాలు కలిసిపోవటం: అన్నవాహిక, గాలి గొట్టం పక్కపక్కనే ఉంటాయి. పిండం దశలో ఈ రెండూ ఒక గొట్టం నుంచే తయారవుతాయి. కానీ అరుదుగా.. ప్రతి 4000 కాన్పుల్లో ఒకరికి.. ఈ అన్నవాహిక సరిగా తయారవ్వక ఈ గొట్టాలు రెండూ కలిసిపోయే ఉండొచ్చు. (ట్రెకియో-ఈసోఫేగల్‌ ఫిస్టులా) ఇది కూడా మగపిల్లల్లోనే ఎక్కువ. అన్నవాహిక లేకపోవటం వల్ల లాలాజలం వంటివి నేరుగా వూపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి న్యుమోనియా వంటి సమస్యలు ముంచుకొస్తాయి. బిడ్డ పుట్టగానే సర్జరీలతో దీన్ని చక్కదిద్దుతారు.

* పొట్టలో కణుతులు.. పొట్టలో ఏ ప్రాంతంలోనైనా నీటి తిత్తుల వంటివి రావచ్చు. ఇవి ఎక్కడొచ్చినా పొట్టకు సాగే గుణం ఉంది కాబట్టి వీటి ఒత్తిడి వల్ల ఇతరత్రా సమస్యలు రావటం తక్కువే. వీటిని స్కానింగుల్లో గుర్తిస్తారు. వీటితో పాటుగా ఇతరత్రా సమస్యలు కూడా ఉంటే తప్పించి... సాధారణంగా వీటివల్ల పెద్ద సమస్యలేమీ ఉండవు. కాన్పు తర్వాత.. వీటిని సర్జరీ చేసి తొలగించొచ్చు. ఫలితాలు కూడా బాగుంటాయి.

--Courtesy with Dr.A.Narendrakumar , professor , Paediatric surgery , hyderabad@eenadu sukhibhava.

  • =========================

 Visit my website - > Dr.Seshagirirao.com/ 

Wednesday, 9 October 2013

Hints to reduce body,సన్నబడేందుకు సూచనలు


  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సన్నబడేందుకు సూచనలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 ఈ క్రింది సూచన్లు సన్నబడేందుకు సహకరిస్తాయి .
సన్నబడేందుకు ఆహారంలో చేసుకునే మార్పులతో పాటూ రకరకాల వ్యాయామ పద్ధతుల్నీ మనం ఎంచుకుంటాం. కానీ ఎప్పుడూ ఒకే తరహా వ్యాయామాలూ, యోగాసనాలూ అంటే విసుగు రావడం సహజం. అలాగని వాటిని చేయకుండా ఉండటమూ సబబు కాదు. అందుకే కొన్ని రోజులు డాన్స్‌ చేసి చూడండి. ఆనందంగానూ ఉంటుంది. వ్యాయామమూ అందుతుంది. చాలామంది మహిళలకు నడుమూ, పిరుదుల భాగాల్లో చేరిన కొవ్వు కరిగించడం ఓ సమస్యగా మారుతుంది. ఇలాంటి వారు నడుముని గుండ్రంగా తిప్పుతూ బెల్లీ డాన్స్‌ చేయడంతో సన్నబడొచ్చు. దీనివల్ల నడుము కింది భాగం తీరైన ఆకృతిలోకి వస్తుంది. రోజులో ఓ గంట బెల్లీ డాన్స్‌ చేయడం వల్ల 250 నుంచి 300 కెలొరీలు ఖర్చవుతాయి. ఒక్కరే డాన్స్‌ క్లాసుకి వెళ్లడం విసుగు అనుకునే వారు, జంటగా సల్సా చేయొచ్చు. దీనివల్ల సన్నబడటం ఒక్కటే కాదు... భార్యాభర్తల మధ్య అనుబంధమూ పెరుగుతుంది. గంటసేపు సల్సా చేస్తే చాలు.. దాదాపు ఐదొందల కెలొరీల ఖర్చవుతాయి. ఇక తక్కువ సమయంలోనే సన్నబడాలి అనుకునే వారు హిప్‌హాప్‌ని ఎన్నుకోవాలి. ఇది చేయడానికి కొద్దిగా శక్తి అవసరమే. కానీ ఏకాగ్రతగా గంటసేపు చేస్తే ఫలితం ఉంటుంది. అయితే ఏ డాన్స్‌ని ఎంచుకుని, ఎన్ని రోజులు శిక్షణ తరగతులకి వెళ్లాలి అనేది డాక్టర్‌ సలహా ప్రకారం చేయాలి.
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Hints for good sleep,హాయి నిద్రకు కొన్ని సూచనలు

  •  
 
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - హాయి నిద్రకు కొన్ని సూచనలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


నిత్యం వేధించే సమస్యల్లో నిద్రలేమి ఒకటి. దీనికి ఆహారపుటలవాట్లూ, అనారోగ్య సమస్యలతో పాటూ జీవనశైలీ కారణమే. అందుకే ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో సరి చూసుకుని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. తీసుకున్న ఆహారానికి తగిన శారీరక శ్రమలేకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం ఖాయం. అలాని ఎప్పుడు పడితే అప్పుడు వ్యాయామం చేయొచ్చు అనుకోవద్దు. ముఖ్యంగా నిద్రపోవడానికి కనీసం రెండుగంటల ముందు వ్యాయామం చేయకూడదు. వాటివల్ల కండరాలు ఉత్తేజితమై శరీరం చురుగ్గా మారుతుంది. దాంతో వెంటనే నిద్రపట్టదు. అలాగే నిద్రపోవడానికి కనీసం నాలుగైదు గంటల ముందు కాఫీ, టీ లాంటివి తీసుకోవద్దు. వీటిల్లో ఉండే కెఫీన్‌ నిద్రను దూరం చేస్తుంది.

తరచూ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లూ, అంతర్జాలంలో శోధన చేసే అలవాటు మీకుందా? ఇదీ నిద్రలేమికి దారితీస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. ఇలాకాకుండా పడుకోబోయే ముందు కాసేపు మంచి పుస్తకం చదివే అలవాటు చేసుకోండి. చాలామంది పడుకొనే ముందు స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది అనుకుంటారు. దానివల్ల శరీరానికి చురుకుదనం వస్తుందే తప్ప ఓ పట్టాన కునుకు రాదంటున్నారు అధ్యయన కర్తలు. అందుకే పడుకోవడానికి కనీసం గంట ముందు మాత్రమే స్నానం చేయాలి. నిద్రపోయే ముందు ఎక్కువగా హింస ఉండే టీవీ కార్యక్రమాలూ... రణగొణధ్వనులతో వస్తోన్న మ్యూజిక్‌ వినడం వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. ఇలాంటివి కలత నిద్రకు కారణమవుతాయి.

సుఖనిద్రకు కొన్ని సూచనలు...

    * నిద్రపోయే ముందు బ్రష్‌ చేసుకొని, ముఖం, కాళ్ళూ, చేతులూ కడుక్కోవాలి.
    * నిద్రపోయే రెండు గంటల ముందు ఏమీ తినడం కానీ తాగడం కానీ చేయకూడదు.
    * నిద్రకు ముందు మద్యం సేవించరాదు.
    * ప్రశాంతంగా, చల్లగా, గాలీ వెలుతురు వచ్చే ప్రదేశంలో నిద్రించాలి.
    * మంచి నిద్ర కోసం కుడివైపు తిరిగి పడుకోవడం మంచిది.
    * నిద్రించే సమయంలో వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి.
    * నిద్రకు గంట ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది.,
    * నిద్రపోయే ముందు మాడుకు, అరికాళ్ళను నువ్వుల నూనెతో మృదువుగా మసాజ్‌ చేసుకుంటే ఉపయుక్తం.,
    * నిద్రకు ముందు ఒక కప్పు వెచ్చటి పాలు తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది.
    * పడకపై చేరిన తరువాత  టివి చూడడం, రాయడం లేదా ఆలోచించడం వంటివి చూయవద్దు.
    * చక్కటి సంగీతాన్ని వినడం వల్ల త్వరగా నిద్రలోకి జారుకోగలం.
    * పడుకోవటానికి 2 గంటల ముందు నుంచి ఇంట్లో తక్కువ కాంతినిచ్చే దీపాలు వాడుకోవాలి.

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, 6 October 2013

Hormone replacement therapy(HRT)in woman,స్త్రీలలో హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ)


  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --స్త్రీలలో హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ)-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    కొన్నిరకాల అనారోగ్యాలు రావడానికి హార్మోన్లలో మార్పులు చోటుచేసుకోవడం ఎంత వాస్తవమో.. కొన్నిరకాల సమస్యల్ని నివారించడంలోనూ వాటి వాడకం అంతే కీలకం. హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ)గా పరిగణించే ఆ వైద్యం వల్ల లాభాలెంతో.. సమస్యలూ అంతే స్థాయిలో ఎదురవుతాయి. అందుకే వాటిని అవసరాన్ని బట్టే వాడాలి తప్ప అతిగా కాదు.

చాలామంది మెనోపాజ్‌ తరవాత మాత్రమే హార్మోన్లతో అవసరం ఉంటుందనుకుంటారు కానీ.. మహిళలకు ఎదురయ్యే కొన్నిరకాల అనారోగ్యాలకు హార్మోన్లనే మందులుగా ఇస్తారు. రుతుక్రమం మొదలైంది మొదలు మెనోపాజ్‌ వరకూ ఈ హార్మోన్లను వివిధ దశల్లో ఎప్పుడో ఒకప్పుడు వాడాల్సి రావచ్చు. హార్మోన్‌ థెరపీ అంటే స్త్రీ హార్మోన్లుగా పరిగణించే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ల మేళవింపుతో చేసే చికిత్స. ముందు వీటిని ఎందుకు వాడతారో తెలుసుకుందాం.

  • అధిక రక్తస్రావం అదుపులో..
కొందరికి నెలసరి సమయంలో అధికరక్తస్రావం బాధిస్తుంది. అప్పుడు సమస్య తీవ్రతను బట్టి హార్మోన్లను గర్భనిరోధక మాత్రల రూపంలో ఇస్తారు. దాంతో అధికరక్తస్రావం తగ్గి, నెలసరి ఓ క్రమపద్ధతిలో వస్తుంది. అవి గర్భనిరోధక సాధనంగానూ పనిచేస్తాయి. ప్రొజెస్టరాన్‌ అనే హార్మోన్‌ని మాత్ర రూపంలో ఇవ్వడం వల్ల హార్మోన్ల అసమతుల్యతతోపాటూ, అధికరక్తస్రావం కూడా తగ్గుతుంది. కొన్నిసార్లు ఐయూడీ (మిరేనా) రూపంలోనూ చిన్న పరికరాన్ని అమరుస్తారు. ఇది తక్కువ స్థాయిలో లెవనోజెస్ట్రిల్‌ అనే ప్రొజెస్టరాన్‌ని విడుదల చేస్తుంది. దాంతో అధికరక్తస్రావం, నెలసరిలో వచ్చే నొప్పీ తగ్గుతాయి. గర్భం కూడా రాదు.

  • ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎంఎస్‌):
నెలసరికి రెండువారాల ముందునుంచీ కొందరిలో శారీరక, మానసిక మార్పులు మొదలవుతాయి. అదే పీఎంఎస్‌. ముఖ్యంగా మూడ్‌స్వింగ్స్‌, చిరాకు, ఒత్తిడి, ఆందోళన, అతికోపం, నిద్రలేమి, తలనొప్పి, ఆకలి తగ్గడం, కొన్నిరకాల పదార్థాలు మాత్రమే తినాలనిపించడం, వక్షోజాల్లో నొప్పి, చర్మం, జుట్టులో తేడా.. లాంటివి ఆ రోజుల్లో తొంభైశాతం మందిలో కనిపిస్తాయి. అవి చాలా తీవ్రస్థాయిలో బాధించి, భరించలేని పరిస్థితి ఉన్నప్పుడు హార్మోన్లను మాత్రలుగా ఇస్తారు. కేవలం ఈస్ట్రోజెన్‌ని ప్యాచ్‌ రూపంలో సూచిస్తారు. ఈ ప్యాచ్‌ ప్రొజెస్టరాన్‌ హార్మోను విడుదలయ్యేలా చేస్తుంది. అయితే ఇది గర్భనిరోధక సాధనంగా పనిచేయదు. దీన్ని వాడుతున్నప్పుడు గర్భం కూడా దాల్చకూడదు.

  • ఎండోమెట్రియోసిస్‌:
కొన్నిసార్లు ఎండోమెట్రియం పొర కటివలయం, గర్భసంచి చుట్టూ, అండాశయాలు, ఫెల్లోపియన్‌ ట్యూబుల్లో ఏర్పడుతుంది. దాంతో నెలసరి నొప్పి, అధికరక్తస్రావం, కలయిక సమయంలో బాధ, పొత్తికడుపు నొప్పి, గర్భం రాకపోవడం, అలసట లాంటివి ఎదురవుతాయి. ఇలాంటప్పుడు హార్మోన్ల చికిత్స వల్ల అండం విడుదల అవదు. అదే సమయంలో ఎండోమెట్రియం పొర కూడా పల్చబడుతుంది. ఈ సమస్యకు సాధారణంగా కంబైన్డ్‌ కాంట్రాసెప్టివ్‌ పిల్‌ లేదా ప్యాచ్‌ని సూచిస్తారు. ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ కలిపి వాడటం వల్ల కూడా అండం విడుదల అవదు. అవసరాన్ని బట్టి ఆంగ్ల టి ఆకారంలో ఉండే చిన్న పరికరాన్నీ గర్భసంచిలో ప్రవేశపెడతారు. ఇది తక్కువ స్థాయిలో ప్రొజెస్టరాన్‌ని విడుదల చేస్తుంది. దానివల్ల కొందరికి నెలసరి కూడా రాకపోవచ్చు. గర్భం దాల్చాలనుకునేవారు మాత్రం డాక్టర్‌ సలహాతో ఇతర మాత్రల్ని వాడాల్సి రావచ్చు.

  • గర్భధారణ వాయిదాకీ..
గర్భం రాకూడదనుకున్నప్పుడు కూడా హార్మోన్లనే రకరకాల పద్ధతుల్లో సూచిస్తారు వైద్యులు. అలాంటప్పుడు ఉపయోగించే పద్ధతుల్లో కాంట్రాసెప్టివ్‌ ఇంప్లాంట్‌ ఒకటి. సన్నగా ప్లాస్టిక్‌ ట్యూబ్‌లా ఉండే దీనిలో ప్రొజెస్టరాన్‌ హార్మోను ఉంటుంది. దీన్ని శరీరంలో అమరుస్తారు. ఫలితంగా అండం విడుదల కాదు. వీర్యకణాలూ స్త్రీ శరీరంలోకి చేరకుండా గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉండే మ్యూకస్‌ చిక్కబడుతుంది. ఇది వద్దనుకుంటే ప్రొజెస్టరాన్‌ని ఇంజెక్షన్‌గా తీసుకోవచ్చు. ఇది కూడా ఇంప్లాంట్‌లానే పనిచేస్తుంది. బదులుగా ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ కలిపి ఉండే గర్భనిరోధక మాత్రలూ ఉంటాయి. ప్రొజెస్టరాన్‌ మాత్రమే ఉండే మినీపిల్‌, ప్రొజెస్టరాన్‌ ప్యాచ్‌ ఇలా చాలా రకాలుంటాయి. ఇవన్నీ కాదనుకుంటే హార్మోన్లను విడుదలచేసే వెజైనల్‌ రింగ్‌ని జననేంద్రియభాగంలో అమరుస్తారు. అనుకోకుండా గర్భం వస్తుందని భయపడేవారికి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్‌ సరైన ప్రత్యామ్నాయం. గర్భం రాకుండా చేసే ఈ మాత్రల్లో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్ల మోతాదు ఎక్కువగా ఉంటుంది. మరికొన్నింట్లో కేవలం ప్రొజెస్టరాన్‌ ఒక్కటే డబుల్‌డోస్‌ రూపంలో ఉండొచ్చు.

  • ముందే కాన్పు కాకుండా:
రకరకాల కారణాల వల్ల నెలలు నిండకుండానే కాన్పు అవుతుందని భయపడేవారికీ డాక్టర్లు ప్రొజెస్టరాన్‌ సప్లిమెంట్లను ఇస్తారు. ఇందువల్ల ముందే ప్రసవం రాదు. వీటిని ఎలా వాడాలనేది డాక్టర్లే సూచిస్తారు.

  • మెనోపాజ్‌ దశలో..
ఏళ్లు గడిచి మెనోపాజ్‌ దశ వస్తోందంటేనే భయపడతారు చాలామంది మహిళలు. దానికి కారణం ఆ సమయంలో బాధించే హాట్‌ఫ్లషెస్‌, ఒత్తిడి, జ్ఞాపకశక్తి తగ్గడం, నెలసరిలో తేడా, రాత్రిళ్లు చెమటలుపట్టడం, అలసట, జుట్టురాలడం, నిద్రలేమి, జననేంద్రియభాగం పొడిబారడం, కలయిక సమయంలో బాధ.. ఇలా ఎన్నో సమస్యలు ఇబ్బందిపెడతాయి. వీటి ప్రభావాన్ని తగ్గించడానికి డాక్టర్లు హార్మోన్లను సూచిస్తారు.

  • సమస్యలు :
ఇన్నిదశల్లో హార్మోన్లు వాడటం అనేది ఓ కోణం అయితే వాటివల్ల కొన్ని సమస్యలూ ఉంటాయనేదీ రెండో కోణం. అవి తాత్కాలికంగానే కాదు, దీర్ఘకాలికంగానూ బాధించవచ్చు.తాత్కాలికంగా ఎదురయ్యే ఇబ్బందుల్లో.. వికారం, రొమ్ముల్లో వాపు, మొటిమలు (కేవలం ప్రొజెస్టరాన్‌ మాత్రమే వాడేవారిలో) వెజైనల్‌ డిశ్ఛార్జి, రక్తస్రావం, తలనొప్పి లాంటివి బాధిస్తాయి. వీటిని గుర్తించడం సులువే కానీ దీర్ఘకాలంలో బాధించేవీ కొన్ని ఉంటాయి. ఈ సమస్యల్ని గుర్తించడం కొద్దిగా కష్టం. ముఖ్యంగా..

క్యాన్సర్‌:
హార్మోన్ల వల్ల ఎండోమెట్రియల్‌, రొమ్ము, అండాశయ, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. కేవలం ఈస్ట్రోజెన్‌ని వాడితే ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కాస్త పెరుగుతుంది. ప్రొజెస్టరాన్‌ కూడా తీసుకుంటేఇంకా పెరుగుతుంది. అలాగే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ని నాలుగేళ్ల కన్నా ఎక్కువగా వాడేవారిలో రొమ్ముక్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువని తేలింది. దాంతోపాటూ కుటుంబంలో రొమ్ముక్యాన్సర్‌ ఉండటం, నెలసరి త్వరగా మొదలుకావడం, ఆలస్యంగా గర్భం దాల్చడం, అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, మెనోపాజ్‌ ఆలస్యంగా మొదలుకావడం, స్థూలకాయం, రొమ్ముపై రేడియేషన్‌ ప్రభావం లాంటివన్నీ ఈ సమస్యని ఇంకా పెంచుతాయి.

గుండెజబ్బులు:
ఒకప్పుడు ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ని తీసుకోవడం వల్ల గుండెజబ్బులు రావు అనుకునేవారు.అధ్యయనాల ప్రకారం ఈ రెండూ వాడటం వల్ల గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుందని తేలింది. మెనోపాజ్‌ దశ మొదలై, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు డాక్టర్ల సలహాతో హార్లోన్ల వాడకాన్ని ఎంచుకోవాలి.

ఎవరు వాడకూడదు..
గుండెజబ్బులూ, రొమ్ముక్యాన్సర్‌తోపాటూ కొన్నిరకాల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉన్నవాళ్లూ, అకారణంగా రక్తస్రావం అయ్యేవారూ, కాలేయ సమస్యలు ఉన్నవారూ హార్మోన్లు వాడకూడదు. అలాగే అధికరక్తపోటు, ఆస్టియోపోరోసిస్‌, గర్భం దాల్చాలనుకునేవారూ వీటికి దూరంగా ఉండాలి. డాక్టర్‌తో ప్రతి విషయాన్నీ చర్చించుకున్నాకే వాడాలి తప్ప సొంతంగా వేసుకోకూడదు.

Courtesy with Dr.Praneetha reddy , Uro-Gynaecologist - Hyd
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, 4 October 2013

Shourder joint pain awareness, భుజంకీలు నొప్పి సమస్యలు అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- భుజంకీలు నొప్పి సమస్యలు అవగాహన-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



శరీరంలోని కీళ్లన్నింటిలోకి ఎక్కువగా కదిలేది భుజం కీలు. దాదాపుగా మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటి భుజంలో సమస్య ఎదురైతే రోజువారీ పనులన్నీ కష్టమవుతాయి. భుజం పట్టేయడం నుంచి కీలు పక్కకు జరిగిపోవడం వరకు భుజంకీలుకు కూడా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. అలా మొదలైన భుజంనొప్పి కొన్ని నెలల నుంచి సంవత్సరాల తరబడి బాధించవచ్చు. అవగాహన పెంచుకుని సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ సమస్యను అధిగమించడం సులభమే.

నొప్పి ఎందుకు?
భుజం కీలు కూడా మోకాలి, తుంటికీలు లాంటిదే. ఇలాంటి కీలును బంతి గిన్నె కీలు అంటారు. గిన్నె ఆకారంలో ఉండే గ్లినాయిడ్ ఎముకలో బంతి లాగా ఉన్న ఎముక ముందు భాగం అమరివుంటుంది. ఈ కీలును గుళిక అనే సన్నని పొర కప్పి ఉంచుతుంది. కీలు అటూ ఇటూ కదిలించడానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి. వీటినే రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. భుజం కదలికలకే కాకుండా అది పక్కకి కదిలిపోకుండా స్థిరంగా ఉంచడానికి కూడా ఈ కండరాలు ఉపయోగపడతాయి. భుజం కండరాలను ఆనుకుని అక్రొమియాన్ అనే ఎముక ఉంటుంది. ఈ నిర్మాణాల్లో వేటికి సమస్య కలిగినా భుజంనొప్పి మొదలవుతుంది.

భుజం నిర్మాణం చూసినట్లయితే చేతి పైఎముక (హ్యూమరస్‌) చివరి భాగం బాల్‌లా గుండ్రంగా (కార్టిలేజ్‌) ఉంటుంది. ఇది భుజపుటెముక (స్కాప్యూలా) చివరగా ఉండే ఒక సాకెట్‌లా ఉండే గ్లినాయిడ్‌లో అమరి ఉంటుంది. ఈ కప్‌ లాంటి అమరికతో చేయి కీలు అన్ని పక్కలకు సులువుగా కదులుతూ ఉంటుంది.ఈ నిర్మాణంలో భుజ పుటెముక (స్కాప్యూలా) స్థిరంగా ఉండి కండరాలు, టెండెన్స్‌ సహాయంతో చేయి కీలును గట్టిగా పట్టి ఉంచుతూ భుజం కదలికకు సహకరిస్తుంది.

భుజం నొప్పికి కారణాలు:

    భుజంపై చేయి కీలు (హ్యూమరస్‌)లోని ‘కార్టిలేజ్‌’లో మార్పు రావడం.
    భుజం కప్‌ ప్రాంతంలో చీలిక రావడం.
    భుజపుటెముక ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం.
    అనుకోకుండా భుజానికి దెబ్బ తగలడం వంటి కారణాల వల్ల భుజం నొప్పి వస్తుంది.

    లక్షణాలు:
    భుజం కదలిక కష్టంగా మారుతుంది, చేయిని పైకి ఎత్తలేకపోవడం.
    చేయితో వస్తువులను పట్టుకోవాలన్నా, రాత రాయాలన్నా భుజం నొప్పి వస్తుంది.
    కంప్యూటర్ల కీ బోర్డ్‌ వాడాలన్నా నొప్పి వస్తుంది.
    నొప్పి భుజం నుండి మొదలై చేతిలోకి వ్యాపిస్తుంది.
    రాత్రిపూట నిద్రలో కూడా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

    జాగ్రత్తలు:
    భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలు ఆడటం, బరువులు ఎత్తుడం చేయకూడదు.
    నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు సుమారు ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవడం వలన నొప్పి తీవ్రత తగ్గుతుంది.
    భుజం నొప్పి తగ్గడానికి పెయిన్‌ కిల్లర్లు అతిగా వాడకూడదు.
    చేయి కదలికలకు సంబంధించిన వ్యాయామాలు చేసేటప్పుడు ‘ఫిజియోథెరపీ’ వైద్యుల సలహా తీసుకోవాలి.

   పరీక్షలు:
    ఎక్స్‌రే, ఎమ్‌.ఆర్‌.ఐ లాంటి పరీక్షలు భుజం నొప్పి తీవ్రతను తెలుపుతాయి.

Frozen shoulder-కీలు పొరలో వాపు.. ఫ్రోజెన్ షోల్డర్

40 ఏళ్లు దాటినవాళ్లలో భుజంనొప్పికి సాధారణంగా కారణమయ్యేది ఫ్రోజెన్ షోల్డర్. భుజంకీలు చుట్టూ ఉండే గుళిక ప్రాంతంలో వాపునే ఫ్రోజెన్ షోల్డర్ అంటారు. దీనివల్ల గుళిక గట్టిపడుతుంది. దీనికి కారణాలు తెలియదు గానీ సాధారణంగా మధుమేహ వ్యాధిక్షిగస్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్రపోనివ్వనంత ఎక్కువ నొప్పి కలుగుతుంది. భుజం పట్టేసినట్టుగా ఉంటుంది. కీలు దగ్గరి గుళిక భాగం సాగడానికి కావలసిన ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజుల వల్ల మంచి ఫలితం ఉంటుంది. నొప్పి తగ్గడానికి మందులు వాడితే సరిపోతుంది. కొన్నిసార్లు నొప్పి తగ్గించడానికి భుజం కీలులోకి ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. గట్టిపడిన గుళిక భాగాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇలాంటి పేషెంట్లకు ఎండోస్కోప్ ద్వారా చేసే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ కూడా అవసరం అవుతుంది. ఈ ఆపరేషన్ తరువాత అదేరోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. నొప్పి నుంచి కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది. త్వరగా కోలుకోవడానికి భుజం ఎక్సర్‌సైజులు చేయాల్సి వుంటుంది.

Rotatory cup weakness-కండరం బలహీనమైతే...

ఎటువంటి గాయం కాకపోయినా వయసు పెరిగిన కొద్దీ భుజం కండరాలు దెబ్బతినవచ్చు. కాబట్టి వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కండరాలు బలహీనం కావడం వల్ల భుజం కదిలించినప్పుడల్లా నొప్పితో బాధపడతారు. ఈ నొప్పి క్రమంగా పెరుగుతూ కండరాలు కోసినట్టుగా కావడానికి దారితీస్తుంది. దీన్నే రొటేటర్ కఫ్ అంటారు. దీనివల్ల భుజాన్ని కదిలించలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక వయసులో ఉన్నవాళ్లలో రొటేటర్ కఫ్ రావడానికి దెబ్బలు తగలడం, యాక్సిడెంట్లు కారణమవుతాయి. క్రీడాకారుల్లో ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను ఆర్థ్రోస్కోపిక్ కీ హోల్ సర్జరీ ద్వారా పరిష్కరించవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆర్థరైటిస్, తద్వారా కీలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

Shoulder dislocation-జారే కీలు..

యువతలో ఎక్కువగా కనిపించే సమస్య షోల్డర్ డిస్‌లొకేషన్. గిన్నె ఆకారంలో ఉండే గ్లెనాయిడ్ భాగం నుంచి బంతిలా ఉండే హ్యుమరల్ భాగం బయటకు వచ్చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. కొంద పడిపోవడం, రోడ్డు ప్రమాదాలు, క్రీడల్లో కలిగే దెబ్బల వల్ల ఇలా బంతి కీలు జారిపోయే అవకాశం ఉంటుంది. డిస్‌లొకేషన్ వల్ల తీవ్రమైన భుజంనొప్పి ఉంటుంది. ఇందుకు చికిత్సగా జారిపోయిన కీలు భాగాన్ని తిరిగి అమరుస్తారు. కొందరిలో ఎన్నిసార్లు సరిచేసినా తిరిగి పదే పదే బంతికీలు జారిపోతూ ఉంటుంది. ఆటలాడేటప్పుడే కాదు రోజువారీ పనులు చేసుకునేటప్పుడు, కొన్నిసార్లు నిద్రలో కూడా ఇలా జారిపోవచ్చు. దీనివల్ల బంతి గిన్నె కీలు పూర్తిగా దెబ్బతిే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటివాళ్లకు లాబ్రమ్ అనే ప్రత్యేక నిర్మాణం సహాయంతో దెబ్బతిన్న కీలును మరమ్మతు చేస్తారు. ఇందుకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది.

Arthritis-ఆర్థరైటిస్

మోకాలి కీలు మాదిరిగానే భుజంకీలుకు కూడా ఆర్థరైటిస్ రావచ్చు. వయసు మీరిన వాళ్లలో ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల భుజంకీలు కూడా దెబ్బతినవచ్చు. ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్లలో అన్ని కీళ్లతో పాటు భుజంకీలు కూడా దెబ్బతింటుంది. ప్రమాదాల్లో గాయపడటం, భుజం కండరాలు బలహీనపడటం కూడా ఆర్థరైటిస్‌కి దారితీస్తుంది. ఆర్థరైటిస్ వల్ల విపరీతమైన నొప్పి, కీలు వాపు, కదిలినప్పుడల్లా గీసుకున్నట్టు అవుతుంది. తొలిదశలో ఉన్నప్పుడయితే ఫిజియోథెరపీ, మందులు సరిపోతాయి. కానీ వ్యాధి తీవ్రమైతే మాత్రం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. మరీ ఎక్కువైతే కీలుమార్పిడి కూడా అవసరం అవుతుంది. కీలు ఏ రకంగా దెబ్బతిన్నదన్న దాన్ని బట్టి కృత్రిమ కీలు రకాన్ని ఎంచుకుంటారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన కీ హోల్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఎటువంటి నొప్పి లేకుండా, ఆసుపవూతిలో ఉండే అవసరం లేకుండా సులువుగా చికిత్స అందించవచ్చు. కాబట్టి భుజంనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

-Courtesy with Dr.M.V.Ramana Rao MS(ortho) Kakinada.
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/