Monday, 18 March 2013

ముందే రుతుచక్రం,ప్రికాషియస్‌ ప్యూబర్టీ,Precocious puberty

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ముందే రుతుచక్రం,ప్రికాషియస్‌ ప్యూబర్టీ,Precocious puberty- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

    వయసుకు తగ్గట్టుగా శారీరక మార్పులు జరిగితేనే ఆనందం. రుతు చక్రానికీ ఇదే వర్తిస్తుంది. సాధారణంగా పన్నెండు నుంచి పదిహేనేళ్లలోపు మొదలవ్వాల్సిన రుతుక్రమం పదేళ్లలోపే వచ్చేస్తే... దానిని ఓ సమస్యగానే భావించాలి. అవగాహనతో ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

అమ్మాయి... బాల్యం నుంచి యౌవనంలోకి అడుగుపెట్టే క్రమంలో శారీరక మార్పులు సహజం. ముఖ్యంగా ఎముకలూ, కండరాల ఎదుగుదలా, శరీర ఆకృతిలో తేడా, సంతానోత్పత్తికి అనువుగా మరికొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వీటన్నిటితో పాటూ రుతుచక్రం కూడా సాధారణంగా వచ్చే మార్పే. ఇది పన్నెండు నుంచి పదిహేనేళ్ల లోపు మొదలవ్వాలి. కానీ ఈ మధ్య కాలంలో పదేళ్ల వయసుకి ముందే రుతుచక్రం మొదలవడం ఎక్కువవుతోంది. ఈ పరిస్థితిని 'ప్రికాషియస్‌ ప్యూబర్టీ' అంటున్నాం. మూడు నాలుగేళ్ల ముందుగానే ఇలా జరగడానికి ఇవీ కారణాలని స్పష్టంగా చెప్పలేం! కానీ కొన్ని రకాల సమస్యలు ఆ పరిస్థితికి దారితీస్తున్నాయని అధ్యయన కర్తలు చెబుతున్నారు.

యౌవన మార్పులంటే...
ఆడపిల్ల రజస్వల అవడానికి గల కారణాలు తెలుసుకునే ముందు అసలు బాల్యం నుంచి యౌవనంలోకి అడుగుపెట్టే సమయంలో శారీరకంగా ఎలాంటి మార్పులు జరుగుతాయనేది తెలుసుకోవాలి. మెదడులో ఈ ప్రక్రియ మొదలై గోనాడోట్రోఫిన్‌ హార్మోను విడుదలవుతుంది. అది పిట్యూటరీ గ్రంథికి చేరి ఎల్‌హెచ్‌, ఎఫ్‌ఎస్‌హెచ్‌ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ రెండూ అమ్మాయిల్లో శారీరక మార్పులు జరిగేందుకు తోడ్పడే ఈస్ట్రోజెన్‌ను అండాశయాల్లో
విడుదలయ్యేలా చేస్తాయి. అప్పట్నుంచి శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ తరవాతే నెలసరి వస్తుంది.

ఇన్‌ఫెక్షన్లు లేదా కణుతులు కావచ్చు..
కొన్నిసార్లు ఎలాంటి సమస్యలూ, లోపాలూ లేకుండానే రుతుచక్రం ముందుగా వచ్చేయవచ్చు. మరికొన్ని సార్లు మెదడు లేదా వెన్నెముకలో కణితి ఉండటం, అమ్మాయి పుట్టే సమయంలో మెదడులో నీరు చేరి కణితిగా మారడం, మెదడూ వెన్నెముకపై రేడియేషన్‌ ప్రభావం ఎక్కువగా ఉండటం, వాటికి గాయాలవడం కూడా అందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. తక్కువ మందిలో కావచ్చు కానీ జన్యు పరమైన సమస్యలూ అందుకు కారణం అవుతాయి.

వీటిల్లో ఎముకలూ, చర్మం రంగుని ప్రభావితం చేసే జన్యు సమస్య 'మెక్‌క్యూన్‌ ఆల్‌బ్రైట్‌ సిండ్రోమ్‌' ఒకటి. దీనివల్ల హార్మోన్ల మార్పులు జరుగుతాయి. అడ్రినల్‌, పిట్యూటరీ గ్రంథులూ, అండాశయాల్లో లోపాల వల్లా శరీరంలో ఈస్ట్రోజెన్‌ హార్మోను త్వరగా విడుదలవుతుంది. ఇన్‌ఫెక్షన్లూ, హార్మోన్ల పనితీరులో తేడా, హైపో థైరాయిడిజం వల్ల కూడా రుతుచక్రం ముందే వచ్చేయవచ్చు. వయసూ, శరీరాకృతికి తగినట్లు సరైన బరువు లేకపోయినా సమస్యే. పీలగా
కనిపించే వారిలో రుతుక్రమం త్వరగా వచ్చేస్తుంది. సెక్సు హార్మోనుగా పరిగణించే ఈస్ట్రోజెన్‌, టెస్టోస్టీరాన్‌లను కొన్ని సమస్యలకు మాత్రల రూపంలో తీసుకోవడం వల్ల కూడా ముందే రుతుక్రమం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అండాశయాల్లో ఉండే కణుతులు, సిస్ట్‌లు కూడా ఈ మార్పును  తీసుకురావచ్చు. పిల్లలు జంక్‌ఫుడ్‌ని ఎక్కువగా తినడం, అది పడకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమే అని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

లక్షణాలను గుర్తించవచ్చు...
అంతగా వూహ తెలియని వయసులో రుతుక్రమం మొదలు కావడంతో చాలామంది అమ్మాయిలు భయపడతారు. రొమ్ముల పెరుగుదల, మొటిమలు రావడం, చేతులు కింద వెంట్రుకలు రావడం వంటివి అర్థం కాక అయోమయానికి గురవుతారు. అదీకాక తమ వయసు వారి కన్నా ముందే గబగబా పొడవు పెరుగుతారు. ఎముకలు కూడా త్వరగా పరిణతి చెందుతాయి. అయితే రుతుక్రమం మొదలై కొన్నాళ్లు గడిచేప్పటికి ఆ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. దాంతో కొన్నేళ్ల తరవాత చూసుకొంటే వయసుకు తగిన పొడవు ఉండరు. ఈ మార్పుల్ని పట్టించుకుని తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే
వయసుకు తగిన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న వయసులో రుతుక్రమం  మొదలైన అమ్మాయిల్లో తోటి వారితో పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనవడం, అది ఒత్తిడికి దారితీయడం, చురుగ్గా లేకపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో తల్లి పాత్ర ఎంతో కీలకం. శరీర నిర్మాణం, రుతుక్రమం రావడం గురించి అమ్మాయికి వివరించాలి. కొన్నేళ్లు ముందు రావడం సమస్య కాదనీ, అలా జరుగుతుంటుందనీ చెప్పాలి. స్కూల్లో, చుట్టు పక్కల వాళ్లు ఆటపట్టించినా, ఏదయినా మాట అన్నా ఆత్మన్యూనతకు గురికాకుండా సర్ది చెప్పాలి. ఈ విధంగా ముందుగా మెచ్యూర్‌ అయిన వాళ్లపై టీవీ, నెట్‌ ఆకర్షణల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనిని తల్లిదండ్రులు గుర్తు పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్నాళ్లు రాకుండా..
చిన్నవయసులోనే రుతుక్రమం మొదలైనప్పుడు లేదా అంతకన్నా ముందే ఆ లక్షణాలను గుర్తించడానికి వైద్యులు కొన్ని పరీక్షలు చేస్తారు. అమ్మాయి చేయి, మణికట్టును ఎక్సరే తీసి ఎముక వయసును గుర్తిస్తారు. ఎముకల ఎదుగుదల ఎంత వేగంగా ఉంది అన్న దాన్నిబట్టి హార్మోన్ల పనితీరుని తెలుసుకుంటారు. అలాగే రక్తపరీక్ష, గోనాడోట్రోఫిన్‌ హార్మోను పరీక్ష చేస్తారు. వాటిని బట్టి ఇతర హార్మోన్ల గురించి తెలుసుకుంటారు. మెదడులో లోపాలేమైనా
ఉన్నాయా లేదా అన్నది తెలుసుకునేందుకు ఎంఆర్‌ఐని చేయించుకోమంటారు. కొన్నిసార్లు హైపోథైరాయిడిజం కూడా ఈ సమస్యకు కారణం కాబట్టి థైరాయిడ్‌ పరీక్ష  చేయించుకోమంటారు. వీటివల్ల కేవలం రుతుక్రమం గురించి తెలుసుకోవడమే కాదు, అందుకు కారణమయ్యే ఇతరత్రా సమస్యలనూ గుర్తించవచ్చు. .

తాత్కాలికంగా ఆగిపోయేలా..
పరీక్షలన్నీ చేశాక సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. ఎలాంటి కారణం లేకుండా రుతుక్రమం మొదలయ్యిందని తేలితే కొన్నిరకాల మాత్రలను సూచిస్తారు డాక్టర్లు. అయితే కొన్నిసార్లు ఆ ముందును ప్రతినెలా ఇంజెక్షన్‌ రూపంలో చేయించుకోమంటారు. దానివల్ల కొంతకాలం పాటు ప్రతినెలా వచ్చే నెలసరి ఆగిపోతుంది. రుతుక్రమానికి తగినట్లుగా వయసు వచ్చే వరకూ వాటిని వాడాల్సి ఉంటుంది. ఒక్కసారి సరైన వయసు వచ్చాక డాక్టర్‌ సలహాతో వాటిని మానేయవచ్చు. ఆ తరవాత మళ్లీ మార్పులు మొదలవుతాయి. మెదడులో కణుతుల్లాంటివి ఉంటే వాటికి చికిత్స చేయడం వల్ల కూడా ఈ మార్పు జరగకుండా కొంతకాలం అదుపులో ఉంచవచ్చు.

ముందు జాగ్రత్తగా..
సమస్య వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా ముందు జాగ్రత్త పడటం మంచిది. ఏ రూపంలో కూడా ఈస్ట్రోజెన్‌, టెస్టోస్టీరాన్‌ హార్మోన్లను వాడకుండా చూడాలి.  అలాగే వయసుకు తగినట్లుగా శారీరక వ్యాయామం ఉండాలి. కనీసం ఇరవై నిమిషాలు నడక లేదా యోగా లాంటివి చేయించడం అవసరం. ఒత్తిడి  సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. అలాగే జంక్‌ఫుడ్‌ని తగ్గించి బదులుగా పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి

-Dr.Pranathi Reddy (Urogynaecologist)@Eenadu vasundara
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, 15 March 2013

Attention Deficit Disorder(ADD), సావధానత లోపం డిజార్డర్

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Attention Deficit Disorder(ADD), సావధానత లోపం డిజార్డర్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


సావధానత లోపం డిజార్డర్ (కూడా ADD పిలుస్తారు) మరియు సావధానత లోటు అధికకార్యశీలత లోపం (ADHD) పాఠశాల వయస్సు పిల్లలకు చాలా తరచుగా

కనిపించే ప్రవర్తన శైలులు వివరించడానికి వాడే పదాలు. ఈ లోపాలు ఉన్న పిల్లలు hyperactive, ADHD విషయంలో, అతిగా హఠాత్తు, శ్రద్ధ లేని మరియు.

ఎక్కువ కాలము  కూర్చుని లేదా సుదీర్ఘ కాలం  ఒక వస్తువుపై  క్రియాశీల కలిగి ఉండటానికి  ఇబ్బంది పడతారు. ఇది ఒక రకమైన మానసిక రుగ్మత. సుమారు 8%-

10% చిన్నపిల్లలలోనూ , బడికి వెళ్ళే చిన్నరులలోనూ , కొంతమంది పెద్దవారినోనూ కనబడుతూ ఉంటుంది.

లక్షణాలు :
ఏ పనిమీదా ఏకాగ్రత చూపలేరు ,
ఎక్కువ సమయం పట్టే విషయం పై విసుగు చెంది అతి గా ప్రవర్తిస్తారు .
పెద్దవారైతే రెస్ట్ లెస్స్ గా (విశ్రాంతి లేనట్లు ) ప్రవర్తిస్తారు.
పనిచేయడము లో ఏకాగ్రత లేకపోవడము వలన  చిన్న చిన్న విషయాలకే తప్పులు చేస్తూ ఉంటారు.
తరచుగా ఒక పనినుండి వేరె పనికి మారుతూ ఉండే స్వభావము కలిగిఉంటారు.
ఒక పద్దతి లేని పని విధానాలు ప్లాన్‌ చేస్తూ ఉంటారు .. మధ్యలో విడిచిపెట్టే స్వభావము ఉంటుంది .
మతిమరుపు తో కొన్ని పనులు, వెళ్ళవలసిన ఫంక్షన్‌ లు మిస్సవుతుంటారు.
ఎక్కడా ఒక దగ్గర నిలకడగా కూర్చోలేరు అటూ ఇటూ పవార్లు కొడుతూ ఉంటారు.
చీటికీ మాటీకీ అసహనము ప్రవర్తిస్తూ ఉంటారు .
ప్రశ్న పూర్తికాకుండానే జావాబు చెప్పేందుకు ప్రయత్నిస్తారు .
తరచుగా ఇతరుల పనిలో లేదా ప్రవర్తనలో అంతరాయములు కలుగజేసే స్వభావము ఉంటుంది.
అవసరము లేనిచోట కల్పించుకొని మాట్లాడుతూ ఉంటారు.

ఎటెన్సన్‌ డెఫిసిట్ డిశార్డర్ తో ఇతర సమస్యలు :
గాబరా (anxiety) ,
సూక్ష్మ గ్రహణ శక్తి లోపించుడము (learning disorders),
మాట్లాడే లేదా వినికిడిలో సమస్యలు (speech and hearing problems),
చేస్తున్న పనినే మళ్ళి మళ్ళీ చేసే స్వభావము (obsessive compulsive disorder),
ప్రవర్తన లో వ్యతిరేక స్వభావము , విమర్శించే మనస్తత్వము కలిగిఉంటారు (conduct disorder)

చికిత్స :
రెండు విధానాలు . 1. మానసిక చికిత్స , 2. మందూలతో వైచ్యము .

సైకొలాజికల్ చికిత్స :  తల్లి దండ్రుల పాత్ర చాలా ముఖ్యము . విసుగు గమ్నించి ... వేరే పనిమీద ఏకాగ్ర పెట్టే విధము గా ట్రినింగ్ ఇస్తూఉండాలి. నెగటివ్ గా అస్సలు

మాట్లాడకూడదు. తరచు ఇతర పిల్లలతో కలిసి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి.

మందులు : మెదడును ఉత్తేజ పరచే మందులు అంటే .... methylphenidate (Ritalin),
Amphetamines (Dexedrine),
మంచి డైట్ అన్ని విటమిన్ల తో కూడుకున్న పోషకాహారము ఇవ్వాలి .

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, 11 March 2013

Baldhead, బట్టతల

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Baldhead, బట్టతల -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


అందం. ఆకర్షణ. ఆత్మవిశ్వాసం... ఇలా మన జుట్టుకు, తలకట్టుకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తల మీది నుంచి కురులు కనుమరుగవుతున్న కొద్దీ మనసులో ఏదో వెలితి మొదలవుతుంది. ఏదో కొరతగా, న్యూనతగా, లోపంగా.. ఇలా రకరకాల భావాలు మనసులో ముసురుకుంటూ.. విపరీతమైన మథనం మొదలవుతుంది. ఇక దాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. టోపీలతో మొదలుపెట్టి విగ్గులు, గమ్మింగ్‌, వీవింగ్‌ వంటి ఎన్నో మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే అవన్నీ కూడా చాలా తాత్కాలికమైనవి. ఇప్పటి వరకూ ఈ 'కేశ రాహిత్యాన్ని' అధిగమించేందుకు ఒక్క శాశ్వత పరిష్కారం కనుగొనబడలేదు.

కారణాలు :

బట్టతల అనేది స్థూలంగా జన్యుపరంగా, వంశపారంపర్యంగా వచ్చే సమస్య! ఇది కొందరిలో 20, 30 ఏళ్లకే వస్తే మరికొందరిలో 50 ఏళ్ల తర్వాత రావచ్చు. వయసు పెరుగుతున్నకొద్దీ హార్మోన్ల ప్రభావంతో జుట్టు వూడిపోవటం కొంత సహజమే. కానీ వీరిలో వేగంగా రాలిపోతూ పరిస్థితి 'బట్టతల'కు దారి తీస్తుంది. బట్టతల విషయంలో ఎన్నో సిద్ధాంతాలున్నాయిగానీ ప్రధానంగా పురుష హార్మోన్‌ అయిన 'టెస్టోస్టిరాన్‌'.. జన్యుపరమైన కారణాల రీత్యా.. వీరిలో తల మీది చర్మంలో 'డీ హైడ్రో టెస్టోస్టిరాన్‌'గా మారిపోతూ.. వేగంగా వెంట్రుకలు వూడిపోయేందుకు కారణమవుతుందన్న భావన బలంగా ఉంది. అందుకే సాధారణంగా యుక్తవయసులో ఒంట్లో టెస్టోస్టిరాన్‌ స్థాయి పెరుగుతుండే దశ నుంచే ఈ బట్టతల రావటమన్నదీ మొదలవుతుంది. తల మీది వెంట్రుకలన్నీ ఒకే రకంగా కనిపించినా అవి హార్మోన్లకు స్పందించే తీరు వేరేగా ఉంటుంది. ఈ హార్మోన్‌ ప్రభావం మాడు మీద, నుదురు దగ్గరి చర్మం మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంత బట్టతల ఉన్నవారికైనా సరే.. వెనక భాగంలోనూ.. ఇరుపక్కలా కొన్ని వెంట్రుకలు దట్టంగా మిగిలే ఉంటాయి.
* బట్టతల పురుషులకే వస్తుందన్నది ఒక అపోహ. ఎందుకంటే ఇది స్త్రీలలోనూ కనిపిస్తుంది.
* చాలామంది తాము వాడుతున్న షాంపూలు, నీళ్లు పడక జుట్టు రాలిపోయిందని భావిస్తుంటారుగానీ వీటి ప్రభావం చాలా తక్కువ.
* బట్టతల రావటానికి 80-90 శాతం జన్యువులు, వంశపారంపర్య లక్షణాలే మూలం.
* తల్లిదండ్రుల్లో ఎవరికి బట్టతల ఉన్నా సంతానానికి రావొచ్చు. ఒకవేళ వారిద్దరికీ లేకపోయినా.. వంశంలో ముందు తరాల వారికి ఉన్నాతర్వాతి తరాలకు సంక్రమించొచ్చు. జన్యు ప్రభావం అందరిపైనా ఒకే తీరులో ఉండాలనేం లేదు. ఒకరికి వచ్చి మరొకరికి రాకపోవచ్చు

ట్రీట్మెంట్ :

బట్టతల వచ్చేసిందని బాధపడాల్సిన పనిలేదు. నలుగురిలో తిరగలేక ఇంట్లోనే కూర్చోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. బట్టతల వస్తున్న తొలినాళ్లలో వెంట్రుకలు వూడిపోకుండా ఉండేందుకు వైద్యులు 'మినాక్సిడిల్‌' 'ఫినాస్టిరైడ్‌' వంటి కొన్ని లోషన్లు సిఫార్సు చేస్తారు. అయితే వీటిని జీవితాంతం వాడుకుంటూనే ఉండాలి, వీటితో కొన్ని దుష్ప్రభావాలూ ఉంటాయి. ఇవి ....
  •  విగ్గులు ధరించటం,
  • సిలికాన్‌ గమ్మింగ్‌,
  • హెయిర్‌ వీవింగ్‌
--వంటి చాలా కృత్రిమ పద్ధతులున్నాయిగానీ ఏవీ సహజంగా, శాశ్వతంగా ఉండేవి కావు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బట్టతల సమస్యను శాశ్వతంగా అధిగమించేందుకు 'హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌' విధానాన్ని ఆశ్రయిస్తున్నారు.

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ :

తల వెనక భాగంలో రాలిపోకుండా దట్టంగా మిగిలి ఉన్న వెంట్రుకలను కుదుళ్లతో సహా తీసుకువచ్చి... మాడు మీద, ముందు భాగంలో నాటటం 'హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌' విధానం ప్రత్యేకత. ఈ వెంట్రుకల కుదుళ్లు హార్మోన్ల ప్రభావానికి లొంగే రకం కాదు కాబట్టి.. నాటిన తర్వాత ఇవి రాలకుండా అలాగే ఉండిపోతాయి. జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. అందుకే 'హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌' పూర్తిగా విజయవంతమైన ప్రక్రియగా నిలబడింది. దీనితో ఎలాంటిహానీ ఉండదు.

* హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో మెదడుకు ప్రమాదమని కొందరు భయపడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. ఇది కేవలం చర్మం పై భాగానికి సంబంధించిన ప్రక్రియ మాత్రమే. దీంతో ఎలాంటి హానీ ఉండదు. మరికొందరు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందేమోనని అపోహ పడుతుంటారు.
అన్ని ఆపరేషన్ల అనంతరం వాడినట్టుగానే ఐదారు రోజులు మందులు వేసుకుంటే సరిపోతుంది. 3-6 నెలల పాటు విటమిన్‌ మాత్రలు వేసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఈ మందులు పెద్దగా ఖరీదైనవేమీ కాదు.
* ఇతరుల వెంట్రుకలు, కృత్రిమ సింథటిక్‌ వెంట్రుకల వంటివాటిని మన శరీరం తిరస్కరిస్తుంది. కాబట్టి ఎవరి వెంట్రుకలు వారికే అమర్చే విధానంతో ఏ ఇబ్బందీ ఉండదు.
* గడ్డం, మీసం దగ్గర వెంట్రుకలు లేనివారికి కూడా హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయొచ్చు. ఇందులో ఒక వెంట్రుక, రెండు వెంట్రుకలను మాత్రమే తీసి నాటుతారు.
* కనుబొమల్లో తేడాలను కూడా సరిచేయొచ్చు. వీటిని నాటేటప్పుడు దిశ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. సాధారణంగా కనుబొమలు అంతగా పెరగవు. కానీ ఇతర ప్రాంతం నుంచి తెచ్చి నాటిన వెంట్రుకలు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు ట్రిమ్‌ చేసుకుంటూ ఉండాలి.
 హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌! ఇటీవలి కాలంలో ఈ విధానం మరింత మెరుగులు దిద్దుకుంది. తలకట్టును దాదాపు సహజసిద్ధంగా తీర్చిదిద్దే స్థాయికి చేరుకుని, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రాచుర్యం సాధించింది.
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, 9 March 2013

Lower Abdominal pain during Sex,సెక్స్ లో పాల్గొంటే పొత్తికడుపులో నొప్పి

  •  
  • image - Courtesy with "http://www.teluguone.com/"

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Lower Abdominal pain during Sex,సెక్స్ లో పాల్గొంటే పొత్తికడుపులో నొప్పి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




కొందరు స్త్రీలకి సెక్స్ లో పాల్గొంటే పొత్తికడుపులో నొప్పి వస్తుంది. దాంతో వాళ్ళకి సెక్స్ లో పాల్గొనాలని ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఒకవేళ కోరికతో సెక్స్ లో పాల్గోన్నప్పటికి ఆ తర్వాత బాధపడతారు. గర్భస్రావాలు అయినప్పుడు, కాన్పు అయినప్పుడు తగిన శుభ్రత పాటించకపోయినా, యాంటిబయోటిక్ మందులు వాడకపోయినా యోనిలోపల వ్యాధి క్రిములు చేరుతాయి. ఈ క్రిములు గర్భాశయంలోపలి చేరతాయి. ఆపైన ఫెలోపియన్ ట్యూబుల్లోకి చేరతాయి. వ్యాధిక్రిములు సోకడంతో గర్భాశయం దాని పక్కనే ఉండే ట్యూబులు, ఓవరీస్ పుండుగా మారతాయి.

గర్భాశాయంలోకి వ్యాధిక్రిములు ప్రవేశించిన తోలి దశలో కొంతమందికి జ్వరం వస్తుంది. చలిచలిగా అనిపిస్తుంది. మూత్రంలో మంట కలుగుతుంది. పొత్తికడుపు బిగదీస్తుంది. అందరిలోనూ ఈ బాధలు ఇంతగా లేకపోయినా కొంతైనా వాపు లోపల ఉంటుంది. ఆ వాపు వల్ల సెక్స్ లో పాల్గొన్నప్పుడు నొప్పి కలుగుతుంది. ఇన్ ఫెక్షన్ వల్ల గర్భాశయం,ఫెల్లోపియన్ ట్యూబులు, ఓవరీస్ వాచినప్పుడు పొత్తికడుపు దిగువన కొంత చీము కూడా చేరవచ్చు. గర్భాశయం ప్రేగుల వాపునే వైద్యభాషలో పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్ (పి.ఇ.డి.) అంటారు. పి.ఇ.డి. పరిస్థితి కొందరిలో క్రానిక్ గా ఉండిపోతుంది. దీర్ఘకాలంగా ఇటువంటి పరిస్థితి నెలకొన్నప్పుడు వేరే బాధలు లేకపోయినా సెక్స్ లో పాల్గొంటే బాధ అనిపించడం ఉంటుంది. పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్ ఎక్కువమంది స్త్రీలల్లో ఇంటిదగ్గర కాన్పులైన వాళ్ళలోనూ, నాటుమంత్రసానుల చేత కాన్పులు చేయించుకున్నవాళ్ళల్లోనూ కనబడుతుంది. దానికి కారణం కాన్పు సమయంలో తగిన శుభ్రత పాటించకపోవడం, ఇటువంటి స్త్రీలు కాన్పు అయ్యాక తిరిగి దాంపత్యంలో పాల్గొంటే సెక్స్ లో
పాల్గొన్న ప్రతిసారీ బాధ అనిపిస్తుంది.

సెక్స్ అయిపోయిన తరువాత వెంటనే కాని, ఆ మరుసటి రోజు కాని పొత్తికడుపు బిగదీసి బాగా బాధ అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ఆసుపత్రిలలోనే కాన్పు అవ్వాలి. చాలామంది స్త్రీలు కాన్పు అయిన తర్వాత డైపర్స్ గా పాతగుడ్డలు వాడతారు. పాతగుడ్డలు వాడటం వల్ల వాటిలో ఉన్నటువంటి క్రిములు యోనిలోకి చేరి గర్భాశయం ప్రేగులు వాచినట్లు చేస్తాయి. అందుకని కాన్పు సమయంలోనూ, మామూలు మెన్సస్ సమయంలో కూడా కేర్ ఫ్రీ వంటి పరిశుభ్రమైన డైపర్స్ నే  ఉపయోగించాలి. గర్భాశాయంలోకి బాక్టీరియా వంటి వ్యాధిక్రిములు చేరడం వల్ల ఎండోమెట్రైటిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి కలిగినవారిలో గర్భాశయంలోని పొరలు వాచుతాయి. ఇటువంటి పరిస్థితి అకస్మాత్తుగా జరగవచ్చు. లేదా నిదానంగా జరగవచ్చు ఈ పొరల వాపు కొద్దికాలమే ఉండవచ్చు లేదా దీర్ఘకాలం ఉండవచ్చు.

పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్ ఉన్నా, ఎండోమెట్రైటిస్ ఉన్నా తెల్లబట్ట అవుతుంది. సెక్స్ లో పాల్గొన్నప్పుడు నొప్పి అనిపిస్తుంది. గనేరియా వంటి సుఖవ్యాధులు వచ్చినవారిలోనూ, అబార్షన్లు అయినవారిలోనూ వెంటనే తగిన చికిత్స పొందకపోయినట్లయితే గర్భాశయం పేగు వాపు, ఎండోమెట్రైటిస్ డిసీజ్ వస్తుంది. సుఖవ్యాధులు వచ్చినవాళ్ళలో యోనిమార్గం పుండుగా మారడమే కాకుండా గర్భాశయం పేగు కూడా వాచుతుంది. కొందరిలో సుఖవ్యాధులు దీర్ఘకాలంగా మిగిలిఉంటాయి. ఇలాంటివారితో సెక్స్ లో పాల్గొంటే పొత్తికడుపులో నొప్పి వస్తుంది. చాలామంది స్త్రీలు సెక్స్ లో పాల్గొన్నప్పుడు నొప్పి అన్పించి ఆ తర్వాత నొప్పిలేకపోవడంతో నొప్పిని నిర్లక్ష్యం చేస్తారు. కాని వ్యాధిక్రిములు తన ప్రభావాన్ని చూపిస్తూ గర్భాశయం ట్యూబులు మూసుకుపోయేలా చేస్తాయి. దాంతో గర్భం రాదు.

కొంతమంది స్త్రీలకి కొన్ని రకాల భంగిమల్లో సెక్స్ లో బాధ అనిపిస్తుంది. దానికి ఇన్ ఫెక్షన్ ఒక ప్రాంతం వరకే పరిమితం అవడం కారణం. ఏది ఏమైనా రతిలో పాల్గొన్నప్పుడు నొప్పి అనిపిస్తే వైద్యపరీక్షలు అవసరం. అల్ట్రాసౌండ్ స్కానింగ్, రక్తపరీక్షలు వీరికి అవసరం  అవుతాయి. కాన్పులైనప్పుడు యోనిమార్గం చీరుకుపోవడంవల్ల, యోని దగ్గర కుట్లు పడటం వల్ల కొందరికి సెక్స్ లో పాల్గొంటే నొప్పి అన్పించవచ్చు. కొందరికి ఏ వాపు లేకుండానే కామోద్రేకం క్లైమాక్స్ చేరినప్పుడు పొత్తికడుపు దగ్గర నొప్పి అన్పిస్తుంది.ఈ నొప్పి కొద్ది నిముషాలుండి తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని "ఆర్గజమిక్ పెయిన్'' అంటారు. గర్భాశయం పక్కన ఉన్న ప్రేగు స్పాజం కి లోనుకావడం వల్ల ఈ బాధ కలుగుతుంది.
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, 3 March 2013

Drug Resistance and diseases, వ్యాధినిరోధకత-వ్యాధులు

  •  
  •  image : courtesy with : Eenadu news paper
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Drug Resistance and diseases, వ్యాధినిరోధకత-వ్యాధులు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్‌ ఆరోగ్యంపై పెనుప్రభావం ప్రాణాంతకమవుతున్న విచ్చలవిడి వాడకం నిరోధకతను పెంచుకుంటున్న బ్యాక్టీరియా
ఇన్‌ఫెక్షన్లతో పెరుగుతున్న మరణాలు వైద్యనీతిని పక్కనపెడుతున్న ఆస్పత్రులు ప్రభుత్వ నియంత్రణ లేదు బ్యాక్టీరియాను నిర్వీర్యం చేయడానికి వాడాల్సిన మందులవి. ఎంత వాడాలో, ఎలా వాడాలో, ఎవరికి వాడాలో చెప్పే వైద్యనీతిని అనుసరించే వాటిని వాడాలి.
లేదంటే శరీరం నిర్వీర్యమవుతుంది. లోపలికి ప్రవేశించిన సూక్ష్మక్రిమి ఏ మందుకూ లొంగని మొండిఘటమవుతుంది. ఇంత ప్రమాదమనీ తెలిసీ  యాంటీబయాటిక్స్‌ను ఇష్టానుసారం ఉపయోగించే అలవాటు ఇటీవల కాలంలో బాగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సత్వర ఉపశమనం  కలిగిస్తున్నామన్న పేరు కోసం పలు ఆస్పత్రులు, పలువురు వైద్యుల్లో ఈ ధోరణి వ్యాపిస్తుండడంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. రోగుల తెలియనితనమూ వారిని ప్రమాదపుటంచుల్లోకి నెడుతోంది. వాడమన్నన్ని రోజులూ వాడకుండా రోగం తగ్గిందని ఆపేస్తుండడం వల్ల కూడా మొండిరోగాలు తయారవుతున్నాయి.

ఔషధాల వాడకంపై ఆంక్షలున్న అమెరికాలోనే... మోతాదుకు మించి మందుల వాడకం, ఆస్పత్రుల్లో సోకుతున్న వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఏటా లక్షమందికి పైగా మరణిస్తున్నారు. ఔషధాల వాడకంపై కఠిన మార్గదర్శకాలులేని మన దేశంలో ఈ తరహా మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇన్‌ఫెక్షన్లకు గురైన వారికి మెరుగైన చికిత్సలు అందించే సాంక్రమిక వ్యాధి  నిపుణుల(Infectious disease specialists) కొరత మన దేశంలో తీవ్రంగా ఉంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆర్థం చేసుకోవచ్చు.

వైద్యుల అనాలోచిత ధోరణి
ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్న రోగులకు 10% యాంటీబయాటిక్స్‌ అవసరంకాగా, త్వరగా నయం కావాలనే భావనతో 30% అధిక మోతాదు మందులు ఇస్తున్నారు. దీనివల్ల త్వరగా ఉపశమనం కలిగినా, భవిష్యత్తులో మందులకు లొంగని రీతిలో బ్యాక్టీరియా, వైరస్‌లు రూపాంతరం చెందుతాయని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నివారణ కోసం సగటున రోజుకు 500 మంది రోగులకు
'కార్బాపీనమ్స్‌'(Carbapenems are a class of β-lactam antibiotics with a broad spectrum of antibacterial activity. They have a structure that renders them highly resistant to most β-lactamases.) వాడుతున్నారు. దీనికి రూ.5వేల నుంచి రూ.16 వేల వరకు ఖర్చవుతుంది. ఈ మందులు అందరికీ అవసరం లేదు. ఇన్ఫెక్షన్‌ బాగా ఎక్కువగా ఉన్నవారికే వాడాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో ఉన్న రోగులు త్వరగా కోలుకుంటే, కొత్త రోగులను చేర్చుకోవచ్చన్న అనైతిక ఆలోచనతో వీటిని ఇష్టానుసారం వాడుతున్నారని జాతీయ పౌష్ఠికాహార సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. కార్బాపీనమ్స్‌ మందులు ఒకసారి వాడితే ఆ తరవాత సాధారణ మందులు పూర్తిస్థాయిలో ప్రభావం చూపించవు. ఇది చాలా ఆందోళనకర పరిణామం. మలేరియా, గన్యా, టైఫాయిడ్‌, డెంగీ జ్వరాలు,  పిరితిత్తులు, మూత్రసంబంధిత సమస్యలకు ఇటీవల కాలంలో ఔషధాలు వాడుతున్నా... త్వరగా నయం కాకపోవడానికి యాంటీబయాటిక్స్‌ మందులు మోతాదుకు మించి వాడుతుండం ఒక కారణం.

ఇది మరో ప్రమాదం..
ఆస్పత్రుల్లోని ఇంటెన్సివ్‌కేర్‌లో బ్యాక్టీరియా పొంచి ఉంటుంది. అక్కడికి వచ్చే వారికి అప్పటికే రోగనిరోధకత తక్కువ ఉండడంతో వారికి ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలుంటాయి. దానికి తోడు నియంత్రణ లేకుండా ఔషధాలు వాడడం వల్ల వాటికి లొంగని విధంగా అవి తయారై పరిస్థితిని విషమం చేస్తాయి. ఆస్పత్రిలో ఇంటెన్సివ్‌కేర్‌లో 48 గంటల కంటే ఎక్కువ కాలం ఉంటే... రోగి శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశించినట్లేనని ఇన్‌ఫెక్షియస్‌ వ్యాధుల చికిత్స నిపుణులు డాక్టర్‌ ఎన్‌.సునీత 'ఈనాడు'తో చెప్పారు. ఏడు రోజుల కంటే ఎక్కువ ఉన్న రోగికి ఇన్‌ఫెక్షన్లు రావడానికి 70% అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మందుల వాడకంపై నియంత్రణ లేకపోవడం, ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్ల నివారణకు పటిష్ఠమైన విధానాలు లేకపోవడమే కారణమన్నారు. ఇష్టారాజ్యంగా మందులు వాడడం తదితర కారణాలతో మొండివ్యాధులుగా మారిన తరవాత, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వస్తున్న కేసుల్లో సగటున ప్రతి రోజు 10 వరకు ''గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియా కేసులు''   నమోదవుతున్నాయి. ఇది చాలా ఆందోళనకర పరిణామమని డాక్టర్‌  సునీత చెప్పారు. ఢిల్లీలోని అఖిలభారత వైద్యవిజ్ఞానసంస్థలో రోగులపై అధ్యయనం చేయగా... 11శాతం మంది ఆస్పత్రిలో పలురకాల ఇన్‌ఫెక్షన్లకు (ప్రత్యేకించి గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియా) గురైనట్లు తేలింది. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే, భవిష్యత్తులో చాలా రకాల వ్యాధులకు ఎక్కువ తీవ్రత(డోసేజీ) ఉన్న మందులు వాడాల్సి వస్తుందన్నారు. దీనివల్ల సహజంగా ఉండే రోగనిరోధకశక్తి దెబ్బతింటుందన్నారు.

కొంపముంచుతున్న ఉజ్జాయింపు చికిత్సలు:
వైద్యపరీక్షలు (కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ) చేసిన తరవాత రోగికి యాంటీబయాటిక్స్‌ ఇవ్వాలి. మన దేశంలో ఈ తరహా విధానాలు పరిమితంగా కొన్ని ఆస్పత్రుల్లో మాత్రమే అమలవుతున్నాయి. ప్రతి చిన్న సమస్యకు యాంటీబయాటిక్స్‌ వాడడం అలవాటుగా మారిపోయింది. రోగ నిర్ధారణ చేయకుండానే చాలా మంది వైద్యులు ఉజ్జాయింపుగా చికిత్సలు చేస్తున్నారు. చాలా చోట్ల రోగనిర్ధారణ పరీక్షల్లోనూ కచ్చితత్వం, నాణ్యత ఉండడం లేదు. దీనివల్ల మందులు వాడినా ఫలితం ఉండడం లేదు.
ఇవీ కారణాలు
* ఎలాంటి జబ్బునైనా త్వరగా నయం చేశామని పేరు సాధించాలనే తపన ప్రైవేటు ఆస్పత్రులతో పాటు వైద్యుల్లో పెరిగింది.
* కొత్త రోగిని చేర్చుకుంటే, వైద్యపరీక్షలు, శస్త్రచికిత్సల ద్వారా ఆదాయం వస్తుంది. అందుకే రోగులకు అధిక మోతాదు మందులు ఇచ్చి, కొంత ఉపశమనం రాగానే ఇంటికి పంపిస్తున్నారు.
* గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు ఇష్టారాజ్యంగా యంటీబయాటిక్స్‌ ఇస్తున్నారు.
* మందుల తయారీ కంపెనీలు యాంటీబయాటిక్స్‌ విక్రయాలు పెంచుకోవడానికి ఆదాయంలో దాదాపు 25శాతం దుకాణాలు, వైద్యులకు ప్రోత్సహకాలుగా ఇస్తున్నాయి. దీనివల్ల కూడా యాంటీబయాటిక్స్‌ వాడకం పెరుగుతోంది.  ప్రభుత్వ ఆస్పత్రులకు కొనుగోలు చేస్తున్న మందుల్లో సుమారు రూ.65 కోట్లు యాంటీబయాటిక్స్‌ ఉన్నాయి. వీటిని తగ్గించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.  ఇన్‌ఫెక్షియస్‌ వ్యాధుల నివారణ విభాగంలో వైద్యులకు శిక్షణ ఇచ్చే సంస్థలు మూడు మాత్రమే ఉన్నాయి.
 1. హిందూజా(ముంబాయి),
2. సీఎంసీ(వేలూరు),
3. అపోలో(చెన్నై)లో మాత్రమే ఈ శిక్షణ అందుబాటులో ఉంది. పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్ల తీవ్రత దృష్ట్యా కొన్ని మినహాయింపులతో ఈ కోర్సులను విస్తరించడానికి భారతీయ వైద్యమండలి తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

చెన్నై ప్రకటన---యాంటీబయాటిక్స్‌ విచ్చలవిడి వినియోగంపై గత ఏడాది ఆగస్టులో చెన్నైలో నిర్వహించిన సమావేశంలో కేంద్రఆరోగ్య మంత్రిత్వశాఖ, వైద్యపరిశోధన మండలి, మందుల కంపెనీలు, వైద్యరంగ నిపుణులు పలు అంశాలపై చర్చించారు. యాంటీబయాటిక్స్‌ నియంత్రణ విధానం తీసుకురావాలని నిర్ణయించినా ఇంతవరకు అమల్లోకి రాలేదు. ఔషధకంపెనీలు లాబీయింగ్‌ చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
* ఆస్పత్రుల్లో 72 గంటల కంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్‌ వాడాల్సి వస్తే, మరో వైద్యనిపుణుడి సిఫారసు తప్పనిసరి.
* కార్బాపీనమ్స్‌ వల్ల ఇంటెన్సివ్‌కేర్‌లో చికిత్స పొందుతున్న వారిలో 51% మందిలో మందుతీవ్రతను తట్టుకునే స్థాయి పెరిగింది. ఈ తరహా మందుల వాడకంపై వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఆస్పత్రుల్లో ఔషధాల వాడకంపై పర్యవేక్షణ కోసం అక్కడ పనిచేసే వైద్యులతో అంతర్గతంగా కమిటీ ఏర్పాటు చేయాలి.
* జిల్లా, రాష్ట్రస్థాయుల్లో పర్యవేక్షణ కోసం ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీలు, ప్రతి నెలా సమీక్షా సమావేశాలు.
* ఎంబీబీయస్‌, పీజీ వైద్యకోర్సుల్లో ఔషధాల వాడకంపై ప్రత్యేక శిక్షణ.
* తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని తగ్గించడానికి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మందుల దుకాణాల్లో వైద్యుల సిఫారసులు లేకుండా యాంటీబయాటిక్స్‌ విక్రయాలకు వీల్లేకుండా నిబంధనలు కఠినతరం చేశారు. ఈ తరహా విధానాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి.
* ఔషధనియంత్రణశాఖ ద్వారా పటిష్ఠమైన నిఘా.

-- ఇన్‌ఫెక్షియస్‌ వ్యాధుల చికిత్స నిపుణులు డాక్టర్‌ ఎన్‌.సునీత @ఈనాడు దినపత్రిక-హైదరాబాద్‌ 03-మార్చి-2013
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, 2 March 2013

Pancreatic Cancer, క్లోమగ్రంధి క్యాన్సర్‌

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Pancreatic Cancer, క్లోమగ్రంధి క్యాన్సర్‌
-
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

శరీరంలోని ముఖ్యమైన గ్రంధుల్లో క్లోమం (పాన్‌క్రియాస్‌) ఒకటి. జీర్ణ వ్యవస్థ కు ఇది ప్రధానంగా దోహదపడుతుంది. శరీరంలో జీర్ణాశయం దిగువ బాగంలో దీన్ని గమనించవచ్చు. నాళ గ్రంధి హోదాలో ఇది  క్లోమరసాన్ని స్రవిస్తుంది. ఈ  క్లోమ రసాన్ని స్రవించే కణాల్ని రెండు రకాలుగా చెబుతారు. డక్టల్‌ కణాలు, ఎసినార్‌ కణాలు అని చెప్పవచ్చు. ఇందులో డక్టల్‌ కణాల నుంచి విడుదల అయ్యే బైకార్బనేట్‌ పదార్థాలు.. పాక్షికంగా జీర్ణమైన ఆహారంలోని ఆమ్లత్వాన్ని అదుపు చేయగలుగుతుంది. ఎసినార్‌ కణాలు ముఖ్యంగా  క్లోమరసం లోని ఎంజైవ్గుల చైతన్యానికి దోహద పడుతాయి . ఇక క్లోమరసంలోని ఎంజైవ్గులు వాటి పని తీరు...

-క్లోమరసం లో ఉండే ట్రిప్సినోజిన్‌ అనే ఎంజైమ్‌చైతన్య రూపం పొంది ట్రిప్సిన్‌ గా మారుతుంది. అప్పుడు అది మాంసక్రత్తులపై పనిచేసి  అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. కైమో ట్రిప్సినోజిన్‌ కూడా చైతన్యవంతం అయినప్పుడు మాంసక్రత్తుల్ని జీర్ణం చేసేందుకు ఉపకరిస్తుంది.  ఆహారంలోని ఎలాస్టిన్‌ లను జీర్ణం చేసే ఎలాస్టియేజ్‌, కేంద్ర కామ్లాలను జీర్ణం చేసే న్యూక్లియేజ్‌ లను క్లోమం స్రవిస్తుంది. ఇక్కడ స్రావితం అయ్యే అమైలేజ్‌.. పిండి పదార్థాల్ని జీర్ణం చేయటంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇక కొవ్వుల్ని సరళ రూపంలోకి మార్చే లైపేజ్‌ అనేది ప్రధానమైన ఎంజైమ్‌ గా చెప్పవచ్చు. అంతే కాకుండా కొవ్వుల్ని ప్రధానంగా జీర్ణం చేసేది క్లోమరసం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహారంలోని అన్ని రకాల ప్రధాన పదార్థాల్ని క్లోమరసం సంశ్లేషణ చేస్తుంది.

-వినాళ గ్రంధి హోదాలో క్లోమం అనేక హార్మోన్‌లను స్రవించును. ఇవి నేరుగా రక్తంలోకి చే రిపోయి, ఆయా భాగాల మీద ప్రభావం చూపు తుంది. క్లోమంలోని ద్వీప కణాలు హార్మోన్‌ల స్రావకానికి మూలంగా నిలుస్తాయి. ఇందులో నాలుగు రకాల హార్మోన్‌లను గుర్తిస్తారు. ఆల్పా కణాలు గ్లూకగాన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిని పెంచుతుంది. బీటా కణాలు ఇన్సులిన్‌ ను స్రవించును. ఇది రక్తంలోని గ్లూకోజ్‌స్థాయిని నియంత్రించును. ఇక డెల్టా కణాలు స్రవించే సొమాటో స్టాటిన్‌ అనే హార్మోను .. పైన చెప్పిన ఆల్ఫా, బీటా కణాల పనితీరును ప్రభావితం చేయును. గామా కణాలు క్లోమ పెప్టైడ్‌ అనే హార్మోన్‌ ను స్రవించును. ఈ హార్మోన్‌లు శరీరంలో విభిన్న జీవ రసాయన చర్యల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ హార్మోన్‌ ల స్రావకంలో హెచ్చు తగ్గులు ఏర్పడితే ఇతర జీవన క్రియలకు ఇబ్బంది ఏర్పడుతుంది.

-క్లోమ క్యాన్సర్‌ ను అనేక లక్షణాల్చతో పోల్చుకోవలసి ఉంటుంది. నొప్పిని ప్రధానంగా గుర్తించవచ్చు. మలం బూడిద రంగుకి, మూత్రం ముదురు రంగుకి మారవచ్చు. ఆకలి తగ్గిపోయి, నీరసం పెరిగిపోతుంది. బరువు తగ్గవచ్చు. వాంతులు అవుతుంటాయి. కడుపులో అస్థిమితంగా ఉంటుంది. అజీర్ణం అయి విరోచనాలు అవుతుండవచ్చు. గడ్డ కణితి, సిస్టుల విషయంలో ఏ ప్రాంతంలో సమస్య ఉంది అన్నది చాలా ప్రధానం. క్లోమంలోని తల భాగంలో కణితి ఏర్పడితే కామెర్లు బహిర్గతం అవుతాయి. అదే దేహం బాగంలో కానీ, తోక భాగంలో కానీ ఏర్పడితే నొప్పి వెనక్కి వ్యాపిస్తుంటుంది. ఈ రెండు ప్రాతిపదికలు గడ్డ కణితి, సిస్టుల విషయంలో పోల్చదగినవి. కానీ, ఐలెట్‌ సెల్సు విషయంలో మాత్రం శారీరక సమస్యలు తక్కువ. క్రియా పరమైని ఇబ్బందులు ఉంటాయి.

హైపో గ్లైసీమియా, డయేరియా, వంటి లక్షణాలు గుర్తించదగును. క్లోమ క్యాన్సర్‌ ఏర్పడి నప్పుడు తలెత్తే అన ర్థాల్ని రెండు రకాలుగా గుర్తించవచ్చు. క్లోమరసం సరిగ్గా   స్రవించకపోవటంతో ఎంజైమ్‌ల విని యోగం తగ్గిపోతుంది.-అమైలేజ్‌, ట్రిప్సిన్‌, లైపేజ్‌ వంటి ఎంజైమ్‌లు తగినంతగా అందు బాటులో లేకపోవటంతో జీర్ణ క్రియ మందగిం చిపోతుంది. సరైన జీర్ణం జరగక పోవటంతో ప్రధా న పదార్థాల సంశ్లేషణ నిలిచిపోతుంది. అటు, హార్మోన్‌ ల స్రావం కూడా తగ్గిపోతుంది. ఇన్సులిన్‌, గ్లూకాగాన్‌ వంటి హార్మోన్‌ల స్రావం తగ్గకపోవటంతో రక్తంలో గ్లూకోజ్‌ మట్టం సక్రమంగా ఉండదు. రోగం ముదిరిపోయినప్పుడు ఇతర అనర్థాలు పెరిగిపోతాయి. చివరకు క్యాన్సర్‌ చేసే చెడు అంచనాల్ని మించిపోతుంది.క్లోమ క్యాన్సర్‌ తలెత్త టానికి నిర్దిష్టమైన కారణం ఏమీ లేదు. జన్యుపర మైన అంశాలు గుర్తించుకోదగినది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే రక్త సంబంధీకులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆధునిక జీవనశైలి, కాలుష్యం వంటి కారణాలు కూడా క్లోమ క్యాన్సర్‌ కు దోహదపడు తాయి. ఒత్తిళ్లతో కూడిన జీవన శైలి, వ్యాయామం లేకపోవటం, మానసిక ఆందోళనలు క్రియా పరమైన కారకాలుగా చెప్పవచ్చు. వీటిని సూటిగా కారణాలు గా అంచనా వేయటానికి ఉండదు.

-క్యాన్సర్‌కు ఆపరేషన్‌చేస్తే ప్రమాదం అన్న అపోహ కూడా ఉంది. ఆపరేషన్‌ చేయటం వలన క్యాన్సర్‌కణితి పగిలిపోయి, ఆ కణజాలం ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది అని చెబుతారు. ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు. జీర్ణాశయ భాగాల్లో వచ్చే క్యాన్సర్‌లకు ఆపరేషన్‌ అనేది ఉత్తమ చికిత్స. క్యాన్సర్‌ను ఎంత ప్రాథమిక దశలో గుర్తించాం అన్నది ముఖ్యం. దీన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. కీమో థెరపీ, రేడియో థెరపీ లతో ఆధునిక చికిత్స సాధ్యం అవుతుంది. ఆపరేషన్‌ ద్వారా ఆ ప్రాంతంలో కణితిని కరిగించటానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ క్యాన్సర్‌ముదిరిపోయినా మిగిలిన శేష జీవితం సాఫీగా  జరిగిపోయేలా చికిత్స అందించటానికి వీలవుతుంది. ఎక్కువగా మద్యం తాగే అలవాటు ఉన్నప్పుడు.. ఆల్కహాల్‌ నుంచి తయారయ్యే విష పదార్థాలు క్లోమ కణజాలంపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల సజీవకణజాలం శిథిలం అవుతుంది. కొంత కాలం తర్వాత ఈ శిథిల పదార్థాలు కణితిలుగా ఏర్పడుతాయి. ఈ కణితులు క్లోమంలో కానీ, క్లోమ నాళంలో కానీ ఏర్పడవచ్చు.

-క్లోమమునకు ఏర్పడే ముఖ్య సమస్యల్లో ఒకటిగా క్యాన్సర్‌ను చెప్పుకోవచ్చు. ఇది ఏ భాగంలో ఏర్పడుతుంది అనేది ప్రధానమైన అంశం. క్లోమ ము లో తల, దేహం, తోక అనే ప్రాంతాల్ని గుర్తించదగును. ఏ ప్రాంతంలో అవాంఛిత కణజాలం పేరుకు పోయి కణితి గా ఏర్పడుతుందో దాన్ని బట్టి వ్యాధి నిర్ధారణ, చికిత్స ఆధారపడి ఉంటాయి. ఈ కణితుల్ని ప్రాథమికంగా మూడు రకాలుగా గుర్తిస్తారు. కణజాలం పేరుకొని పోయి గట్టిగా ద్రఢ పడితే దాన్ని గడ్డ కణితి అంటారు. ఈ కణితులు నీటి బుడగల మాదిరి ఉంటే సిస్టులుగా వ్యవహరిస్తారు. వినాళ గ్రంధులకు సంబంధించిన ఐలెట్‌ కణజాలాల్లో కణితి ఏర్పడితే దాన్ని మూడో రకం గా అంటే ఐలెట్‌ సెల్సు క్యాన్సర్‌ గా గుర్తిస్తారు.

క్యాన్సర్‌ను గుర్తించటానికి కడుపు భాగంలో పరీక్షలు చేయించాలి. సీటీ స్కాను, ఎమ్‌ ఆర్‌ ఐ స్కాను వంటివి చేయించాలి. ఎండోస్కోపిక్‌ రెట్రాగ్రెడ్‌ కొలాంజియో పాన్‌క్రియాటోగ్రఫీ పరీక్ష శాస్ర్తీయంగా చేయించుకొంటే క్యాన్సర్‌సోకిన ప్రాంతాన్ని నిరి్‌‌దష్టంగా గుర్తించవచ్చు. అవసరమైతే ఆ ప్రాంతంలో క్లోమపు కణజాలాన్ని బయోప్పీ చేయించి క్యాన్సర్‌ను  నిర్దారించుకోవచ్చు. దీంతో పాటు కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట లివర్‌ ఫంక్షన్‌ టెస్టు, సీరమ్‌ బైలిరుబిన్‌ వంట పరీక్షలు కూడా అవసరం అవుతాయి.

Courtesy with Ayush@Surya Telugu Daily(February 25, 2013)
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, 1 March 2013

Scents and Deodorants not good for health,పరిమళద్రవ్యాల వాడకం ఆరోగ్యానికి మంచిదికాదు

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Cents and Deodorants not good for health,పరిమళద్రవ్యాల వాడకం ఆరోగ్యానికి మంచిదికాదు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



-ఈ మధ్యకాలంలో చాలామందిలో పరిమళద్రవ్యాల వాడకం ఎక్కువైంది. ముఖ్యంగా స్ర్తీలను ఆకర్షించడానికి అనేకరకాల సెంట్లు, డియోడరెంట్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. సెక్స్‌ సెంట్లుగా ముద్దుగా పిలుచుకునే వీటిల్లో ఎక్కువగా చెమటవాసన రంగరించిన సెంట్లకు లేదా డియోడరెంట్లకు గిరాకీ ఎక్కువ. ఇటువంటి కాస్మొటిక్స్‌లలో ఏ రకమైన వాసనలు కలపాలనే విషయం మీద అనేక రకాల పరిశోధనలు చేస్తూనేవున్నారు. పురుషుల లైంగికతను గురించి పరిశీలన చేసిన శాస్తజ్ఞ్రులు, స్ర్తీల జననేంద్రియాల వద్ద ఏర్పడే ఒక రకమైన వాసనకు ఎక్కువగా లైంగికోద్రిక్తత పొందుతున్నట్టుగా గుర్తించారు. ఈ విషయంలో స్ర్తీలు కూడా పురుషుల చెమట వాసనకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అయితే సంభోగ సమయంలో చెమట వాసన వల్ల మూడ్‌ అవుట్‌ అయిపోవడం కూడా జరుగుతుంటుంది. అటువంటివారు స్నానం చేసి, తిరిగి అటువంటి వాసనల మేళవింపుతో వున్న డియోడరెంట్లను
ఉపయోగిస్తారు.

జంతుజాతుల్లో, అండోత్పత్తి సమయంలో ఊరే స్వేదంలో కొన్ని రకాల రసాయనిక పదార్థాలు కలిసి ఒక ఘాటైన వాసనను వెదజల్లుతాయి.-ఆ వాసనకు ప్రేరేపితమైన పురుష జంతువులు, అప్రయత్నంగా సంభోగ చర్యకు ఉత్సాహాన్ని చూపెడతాయి. పునరుత్పత్తి ప్రక్రియ సజావుగా సాగడానికి  ఇది ప్రకృతిసిద్ధంగా వుండే ఒక ఏర్పాటు.

 కాగా చెమట వాసన వల్ల లైంగికోద్రేకం కలుగుతుందని, జననేంద్రియాలను శుభ్రం చేసుకోకుండా రతిలో పాల్గొనడం ఆరోగ్య కారణాల రీత్యా మంచది కాదంటున్నారు సెక్సాలజిస్టులు. అలాగే చర్మానికి పడుతుందో లేదో తెలుసుకోకుండానే మార్కెట్‌లో లభించే, రకరకాల సెంట్లను, డియోడరెంట్లను వాడడం కూడా మంచిది కాదు. వాటిల్లో వాసన కోసం చేర్చే కృత్రిమ పదార్థాల వల్ల, జననాంగాల వద్ద వున్న సున్నితమయిన చర్మపు కణాలు అలర్జీకి  గురయ్యే ప్రమాదం వుంది. అందుచేత, శుభ్రత పాటించడం ఎంత ముఖ్యమో, ప్రకృతి సిద్ధమయిన మలినాలను పోగొట్టే వస్తువులను వాడడం కూడా అంతే ముఖ్యం. ఆయుర్వేద సబ్బులను వినియో గించడం, ఇంట్లోనే తయారు చేసుకున్న పొడులను ఉపయోగించడం వంటివి చేసి, తాజాగా వుండడానికి ప్రయత్నించాలి. సంభోగంలో పాల్గొనే ముందు, తర్వాత కూడా స్నానం చేయడం మంచిది.

-Courtesy with Surya Telugu daily Sunday magazine
  • ========================
 Visit my website - > Dr.Seshagirirao.com/