Tuesday, 12 February 2013

Diabetes with pesticides,పురుగుమందులతో మధుమేహం?

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Diabetes with pesticides,పురుగుమందులతో మధుమేహం?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పురుగుమందుల ప్రభావంతో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది తెలిసిందే. అయితే వీటితో మధుమేహం కూడా వస్తుందా? ఆహారం, గాలి, నీరులోని నిరంతర సేంద్రీయ కాలుష్యకారకాలకూ (పర్‌సిస్టెంట్‌ ఆర్గానిక్‌ పొల్యూటెంట్స్‌-సీఓపీ) పెద్దవారిలో మధుమేహానికీ సంబంధం ఉంటున్నట్టు స్పెయిన్‌లో చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. డీడీటీ పురుగుమందులో ఉండే డీడీఈ అనే రసాయనం ఎక్కువ మోతాదులో గలవారికి మధుమేహం వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. వయసు, లింగభేదం, శరీర బరువు ఎత్తుల నిష్పత్తి వంటి వాటి ప్రమేయం లేకుండానే ఇది కనబడుతుండటం గమనార్హం. మన శరీరంలోని కొవ్వులో ఈ కాలుష్య కారకాలు పోగుపడతాయి. అందువల్ల మిగతావారితో పోలిస్తే ఊబకాయుల్లో సీవోపీ స్థాయులు కూడా చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. వీరికి మధుమేహం ముప్పు అధికంగా ఉండటానికి ఇదీ ఒక కారణం కావొచ్చని భావిస్తున్నారు. ''మన శరీరంలోని కొవ్వు శక్తిని నిల్వ చేస్తుంది. జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఈ కొవ్వు సీఓపీల వంటి హానికారకాలనూ నిల్వ చేసుకుంటుంది'' అని జువాన్‌ పెడ్రో అరెబోలా పేర్కొన్నారు. పురుగుమందులు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, గృహనిర్మాణానికి వినియోగించే పదార్థాల్లో సీవోపీలు ఉంటాయి. ఈ రసాయనాలు ఆహారం ద్వారానే కాదు.. చర్మం, పీల్చే గాలి ద్వారానూ శరీరంలోకి ప్రవేశిస్తాయి.

--Courtesy with Eenadu sukhibhava
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Radiation Therapy Technology TrueBeam ,క్యాన్సర్‌ చికిత్సలో ముందడుగు ట్రూబీమ్‌

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Radiation Therapy Technology TrueBeam ,క్యాన్సర్‌ చికిత్సలో ముందడుగు ట్రూబీమ్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


క్యాన్సర్‌ చికిత్సలో రేడియేషన్‌ అత్యంత కీలకమైంది. శక్తిమంతమైన రేడియేషన్‌ను పంపించి, పక్క కణజాలం దెబ్బతినకుండా క్యాన్సర్‌ కణితి మాత్రమే ప్రభావితమయ్యేలా చేయటం చాలా ప్రధానం. ఈ దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్తోంది 'ట్రూబీమ్‌' యంత్రం.

అసాధారణ కణాలు అపరిమితంగా వృద్ధి కావటం. స్థూలంగా చెప్పాలంటే క్యాన్సర్‌ అంటే ఇదే. సాధారణంగా మన శరీరంలోని కణాలు అవసరమైనంత మేరకు విభజన చెందుతుంటాయి. శరీరానికి వాటి అవసరం తీరిపోయాక చనిపోతాయి. అయితే కొన్నిసార్లు ఈ కణాలు అపరిమితంగా పెరుగుతూ, చాలా వేగంగా విభజన చెందుతూ కాన్యర్లుగా మారతాయి. వీటిని తొలిదశలో గుర్తిస్తే చికిత్స చేయొచ్చు గానీ ముదిరితే మాత్రం కష్టం. దీనిబారినపడి ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. అందుకే పరిశోధకులు దీన్ని జయించేందుకు కొత్త కొత్త పద్ధతులను రూపొందిస్తున్నారు. అలాంటి ఒక అధునాతన పరికరమే ట్రూబీమ్‌. దీంతో ఇమేజ్‌గైడెడ్‌ రేడియోథెరపీ, ఇంటెన్సిఫై మాడ్యులేటెడ్‌ రేడియోథెరపీ, ర్యాపిడ్‌ ఆర్క్‌ రేడియోథెరపీ, గేటెడ్‌ ర్యాపిడ్‌ ఆర్క్‌ రేడియోథెరపీ వంటి రకరకాల శక్తిమంతమైన రేడియేషన్‌ చికిత్సలు చేయొచ్చు. ఇందులో కోన్‌ బీమ్‌ సీటీ స్కాన్‌ కూడా ఉంటుంది. ఇది చికిత్స చేస్తున్నప్పుడు స్కాన్‌ చేస్తుంది. రోగి పడుకున్న తీరును, కదలికలను పసిగడుతూ చాలా కచ్చితంగా మిల్లీమీటరు తేడా లేకుండా క్యాన్సర్‌ కణితులపై రేడియోధార్మిక కిరణాలను ప్రసరింపజేస్తుంది. సెకండుకు వందసార్లు కచ్చితత్వాన్ని బేరీజు వేసుకుంటూ పనిచేస్తుంది కూడా. దీంతో సమయమూ ఎంతో ఆదా అవుతుంది. ప్రస్తుతమున్న పరికరాలతో రేడియేషన్‌ చికిత్సకు అరగంట వరకు పడితే దీంతో కొద్ది నిమిషాల్లోనే చికిత్స పూర్తవుతుంది. అధునాతమైన ఈ ట్రూబీమ్‌ పరికరాన్ని మన హైదరాబాద్‌లోని అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఇలాంటి పరికరాలు దేశంలో మరో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి.

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tongue tells real health and disease,నాలుక చెప్పే ఆరోగ్య అనారోగ్యవిషయాలు




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Tongue tells real health and disease,నాలుక చెప్పే ఆరోగ్య అనారోగ్యవిషయాలు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మన జీవితానికీ, జీవనానికీ నాలుక ఎంత కీలకమైనదో!అద్భుతమైన రుచులు చెప్పటం, మాటలకు బాసటవ్వటం, నమలటానికి ఆసరాగా నిలవటం.. నాలుక మోసేవన్నీ ఇలా కీలకమైన బాధ్యతలే! ఇవన్నీ కాకుండా.. నాలుక చెప్పే విషయాలు మరికొన్ని కూడా ఉన్నాయి. తరచుగా మన ఒంట్లో ఏం జరుగుతోందో.. మన ఆరోగ్యం ఎలా ఉందో కూడా చెబుతుంది మన నాలుక! నోటి నుంచి మలద్వారం వరకూ ఉండే సుదీర్ఘ జీర్ణ గొట్టంలో వచ్చే మార్పులే కాదు.. మొత్తం శరీరంలో వచ్చే చాలా రకాల మార్పులు మన నాలుక మీద ప్రతిఫలిస్తుంటాయి! అందుకే అనాదిగా వైద్యంలో నాలుక చూడటానికి అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. వైద్యరంగం 'గ్లాసాలజీ' పేరుతో దీన్నో చిన్న ప్రత్యేక విభాగంగా (నాలుక శాస్త్రంగా) పరిగణించే స్థితికి వెళ్లిందంటే దీనికి ఉండే ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే నాలుక పట్టిచెప్పే రకరకాల వ్యాధులు, బాధల వివరాలు :

రోగి లోపలికి వస్తూనే.. వైద్యులు వారిని దాదాపు 'నఖశిఖ పర్యంతం' ఒక్కసారి తేరిపార జూస్తారు! ఈ ఒక్క చూపు చాలు.. రోగికీ, రోగానికీ సంబంధించిన చాలా విషయాలను గ్రహించటానికి. పద్ధతి ప్రకారం ఈ పని చేస్తే నూటికి డెబ్భై శాతం వరకూ వ్యాధిని తేలికగా పట్టుకోవచ్చు. రోగిని పరీక్షగా చూడటం, రోగి చెప్పే వ్యాధి వివరాలను, రోగి వివరాలను అడిగి తెలుసుకోవటం... వీటికి తోడుగా రోగి జుట్టు, కళ్లు, నాలుక, గోళ్లు, కాళ్లు, చర్మం వంటివి పరీక్షగా చూడటం ద్వారా వైద్యులు రోగానికి సంబంధించిన చాలా వివరాలను అవగతం చేసుకోగలుగుతారు. అందుకే వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెంది అత్యాధునిక పరికరాలు, స్కానింగ్‌ యంత్రాల వంటివి ఎన్నో అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఇవాల్టికీ రోగిని పరీక్షించటానికీ, రోగి చెప్పే చరిత్రకూ ఉన్న ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా తేలికగా పూర్తయ్యే ఈ పరీక్షల ద్వారా సమస్యనూ, దాని ఆనుపానులను శరీరంలో ఎక్కడ, ఏ వ్యవస్థలో ఉన్నాయన్నది గ్రహించటం తేలిక అవుతుంది. వీటిలో అత్యంత కీలకమైనది నాలుక. దాదాపు ప్రతి రోగికీ నాలుక చూడటం అవసరం. చాలా రకాల వ్యాధుల సంకేతాలు, చిహ్నాలు మనకు నాలుక మీద ప్రస్ఫుటంగా కనబడుతుంటాయి. దీనివల్ల కొన్ని వ్యాధులను అనుమానించి, తేలికగా నిర్ధారించుకునే వీలుంటుంది.

లక్షణం పొడారి ఎండటం--సంకేతం డీహైడ్రేషన్‌?
విరేచనాలు, వాంతుల వంటివి అవుతున్నప్పుడు ఒంట్లో నీరు బాగా తగ్గిపోయి 'డీహైడ్రేషన్‌' తలెత్తుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్ఫుటంగా కనబడే లక్షణం నాలుక బాగా పొడారి, ఎండినట్లు కబనడటం. ముఖ్యంగా పిల్లల్లో, వృద్ధుల్లో ఇలా పొడిగా తయారైతే వెంటనే డీహైడ్రేషన్‌ తలెత్తుతోందేమోనని అనుమానించటం అవసరం. కొన్నిసార్లు విపరీతమైన భయం, ఆందోళన వంటివాటికి గురైన వారిలోనూ, అలాగే సైనుసైటిస్‌ వంటి సమస్యలతో బాధపడుతూ నోటితో గాలి పీల్చే వారిలో కూడా నాలుక పొడిగా కనబడొచ్చు. కొన్ని రకాల మానసిక సమస్యలకు వాడే మందుల వల్ల లాలాజలం తగ్గిపోయి, దానివల్ల కూడా నాలుక పొడిగా తయారవ్వచ్చు.

లక్షణం సైజు పెద్దా చిన్నా--సంకేతం కొన్ని వ్యాధులు :
నాలుక కొందరిలో చాలా పెద్దగా ఉంటుంది. ఇది నోట్లో పట్టటం కూడా ఇబ్బందిగా ఉండొచ్చు. దీన్నే 'మాక్రో గ్లాసియా' అంటారు. ఇది గ్రోత్‌ హార్మోను ఎక్కువగా ఉండే 'యాక్రో మెగాలే' బాధితుల్లో, థైరాయిడ్‌ వ్యాధి బాగా ముదిరిపోయిన (మిక్సెడీమా) వారిలో, ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువ. అరుదుగా క్యాన్సర్‌ కణుతులు పెరుగుతున్నప్పుడు కూడా పెద్దదిగా అనిపించొచ్చు. కొన్ని రకాల అలర్జీల్లో తాత్కాలికంగా నాలుక వాపు రావచ్చు. క్షామ పరిస్థితుల్లో జీవించేవారిలో, మెదడు సంబంధ వ్యాధులతో బాధపడే వారిలో నాలుక సైజు చిన్నగా అయిపోవచ్చు. ఒంట్లో నీరు తీవ్రంగా తగ్గిపోయినప్పుడు కూడా నాలుక ఎండిపోయి, చిన్నదిగా కనబడే అవకాశం ఉంటుంది.

లక్షణం పాలిపోవటం--సంకేతం రక్తహీనత :
మన దేశంలో అతి సాధారణమైనది రక్తహీనత. గ్రామాల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది స్త్రీలలో, ముఖ్యంగా గర్భిణులలో ఈ సమస్య చాలా ఎక్కువ. ముదురు గులాబి రంగులో ఉండాల్సిన నాలుక.. పాలిపోయి లేత రంగులో ఉండటం రక్తహీనతకు ముఖ్య సంకేతం. రక్తం మరీ తక్కువుంటే ఇంకా పాలిపోయి ఉంటుంది. దీన్ని చూస్తూనే హిమోగ్లోబిన్‌ శాతాన్ని పరీక్షించి, సమస్యను నిర్ధారించి, చికిత్స అందించే వీలుంటుంది.

లక్షణం నున్నటి నాలుక--సంకేతం విటమిన్ల లోపం? :
నాలుక మీద చిన్నచిన్న మొగ్గల్లాంటివి (పాపిల్లే) ఉంటాయి. ఒంట్లో ఇనుము, నియాసిన్‌ వంటి బీ కాంప్లెక్స్‌ విటమిన్లు వంటివి తగ్గినప్పుడు ఇవన్నీ పోయి పోయి... నాలుక ఇస్త్రీ చేసినట్టుగా నున్నగా అయిపోతుంది. దీన్ని 'బాల్డ్‌ టంగ్‌' అంటారు. దీన్ని గుర్తించి చికిత్స అందించటం అవసరం.

లక్షణం నల్లటి నాలుక--సంకేతం మందులేనా? :
కొద్దిమందికి నాలుక నల్లగా అయిపోతుంది. ఇది ముఖ్యంగా రక్తం పట్టేందుకు ఇచ్చే 'ఐరన్‌ సిరప్‌'లు వాడేవారిలో ఎక్కువ. ఈ సిరప్‌లు వాడినంత కాలం ఉండి, తర్వాత అదే తగ్గిపోతుంది. దీనివల్ల ప్రమాదమేమీ ఉండదు. కొన్నిసార్లు పెన్సిలిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌, అసిడిటీకి వాడే బిస్మత్‌ వంటి వాటి వల్ల కూడా నాలుక నల్లబడే అవకాశం ఉంటుంది. అలాగే అరుదుగా 'లైనిజోలిడ్‌' వంటి కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా నాలుక రంగు మారిపోవచ్చు.

లక్షణం గాళ్లు పగుళ్లు--సంకేతం కంగారులేదు :
సాధారణంగా నాలుక మృదువుగా, సున్నితంగా ఉంటుంది. కానీ కొంతమందికి పగుళ్లిచ్చినట్టు గాళ్లుగాళ్లుగా, గరుకుగా, చూడటానికి కాస్త భయంకరంగా కూడా ఉండొచ్చు. కొందరిలో ఇది సహజం, దీనికి ప్రత్యేకమైన కారణమేదీ ఉండకపోవచ్చు. దీన్ని గురించి ఆందోళన అవసరం ఉండదు కూడా. కానీ కొద్దిమందిలో మాత్రం విటమిన్‌ బి లోపం వల్ల, పుట్టుకతోనే వచ్చే జన్యులోపం (డౌన్స్‌ సిండ్రోమ్‌) వల్ల, ఎదుగుదలకు దోహదం చేసే గ్రోత్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుండే 'యాక్రో మెగాలే' వ్యాధి వల్ల కూడా ఇలా నాలుక పగుళ్లిచ్చినట్లుగా తయారవ్వచ్చు. దీన్ని వైద్యులు గుర్తిస్తారు.

లక్షణం వణికే నాలుక--సంకేతం రకరకాల వ్యాధులు :

నాలుకలో బలమైన కండరాలు, వాటిని కదిలించే నాడులు ఉంటాయి. పక్షవాతం వంటివి వచ్చినప్పుడు నాలుక ఒక పక్కకు వంకర తరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే తీవ్రమైన ఆందోళన ఉన్నప్పుడు, థైరాయిడ్‌ హార్మోన్‌ చాలా ఎక్కువున్నప్పుడు, కొంతకాలం మద్యం తాగి మానేసినప్పుడు, పార్కిన్సన్స్‌ వ్యాధిలో నాలుక వణుకుతున్నట్టు కదిలిపోతుండొచ్చు. పురుగుల మందు తాగిన వారిలో కూడా నాడులు దెబ్బతిని, నాలుక విపరీతంగా అటూ ఇటూ కదిలిపోతుండొచ్చు.

లక్షణం తెల్లటి పూత--సంకేతం అజీర్ణం? :

కలవరపెట్టే సమస్య నాలుక మొత్తం తెల్లటి పూతలా (కోటింగ్‌) రావటం. ఇది అజీర్ణం, అసిడిటీ, మలబద్ధకం, విపరీతంగా మద్యం తాగటం, పొగ తాగటం, జ్వరాలు, లివర్‌ జబ్బుల వంటి వాటిలో ఎక్కువగా కనబడుతుంటుంది. సమస్యను గుర్తించి దానికి చికిత్స చేస్తే ఇది తగ్గిపోతుంది. అయితే నాలుకను విపరీతంగా గీరటం, గీకటం మాత్రం సరికాదు.

లక్షణం పెరుగు తరకల పూత--సంకేతం రోగనిరోధక శక్తి తగ్గటం :
నాలుక మీద తెల్లటి పెరుగు తరకల్లా పూత రావచ్చు. నోటిలో 'ఫంగస్‌' చేరి, ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పుడు (క్యాండిడియాసిస్‌) నాలుక మీద ఇలా తెల్లటి పెరుగులాంటి పూత కనబడుతుంది. నిజానికి నాలుకకు రక్తసరఫరా ఎక్కువ, లాలాజలం నిరంతరం కడిగేస్తుంటుంది కాబట్టి సాధారణంగా ఇటువంటి ఇన్ఫెక్షన్లు అరుదు. కానీ కొన్నిసార్లు ఒంట్లో రోగ నిరోధక శక్తి బాగా తగ్గినప్పుడు ఇటువంటి లక్షణాలు కనబడతాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా మధుమేహం నియంత్రణలో లేకుండా ఉండిపోయిన వారిలోనూ, హెచ్‌ఐవీ బాధితుల్లోనూ, ఇతరత్రా వ్యాధులతో మంచానపడి రోజుల తరబడి పండ్లు సరిగా తోముకోకుండా ఉండిపోతున్న వారిలోనూ ఎక్కువ. ఇవే కాకుండా క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న వారిలో, అలాగే దీర్ఘకాలం స్టిరాయిడ్‌ మందులు వాడుతున్న వారిలో కూడా రోగనిరోధక శక్తి సన్నగిల్లి.. ఇటువంటి సమస్య తలెత్తవచ్చు. ఈ లక్షణాన్ని వెంటనే గుర్తించి 'యాంటీ ఫంగల్‌' చికిత్సతో పాటు సమస్యకు మూలాన్ని కూడా గుర్తించి చికిత్స చెయ్యాల్సి ఉంటుంది.

లక్షణం ఎర్రగా పొక్కిపోవటం--సంకేతం యాంటీబయాటిక్స్‌ వాడకం :

దీర్ఘకాలం యాంటీబయాటిక్స్‌ వంటి మందులు వాడినప్పుడు మన పేగుల్లో బీ-కాంప్లెక్స్‌ విటమిన్‌ను తయారు చేసే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. దీనివల్ల విటమిన్‌-బి (నియాసిన్‌) లోపం తలెత్తి.. నాలుక ఎర్రగా పొక్కిపోతుంది. వైద్యుల దృష్టికి తీసుకువెళితే వైద్యులు మందులు సిఫార్సు చేస్తారు.
* కొందరికి నాలుక విపరీతంగా ఎర్రగా, స్ట్రాబెర్రీ పండులాగా అయిపోతుంది.కొన్నికొన్ని రకాల వ్యాధుల్లో రక్తంలో హిమోగ్లోబిన్‌ ఉండాల్సిన దాని కంటే చాలాచాలా ఎక్కువగా అయిపోతూ.. వీరిలో నాలుక కూడా బాగా ఎర్రగా అయిపోతుంది. కొద్దిమందిలో బీకాంప్లెక్స్‌ (రైబోఫ్లోవిన్‌) లోపం తలెత్తినప్పుడూ నాలుక ఎర్రబారుతుంది.

లక్షణం నీలం నాలుక--సంకేతం శ్వాస ప్రక్రియ లోపం? :
కొందరికి నాలుక నీలం రంగులోకి మారిపోవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు. సాధారణంగా శ్వాసకోశ సమస్యలు తలెత్తి, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గి, కార్బన్‌డైఆక్సైడ్‌ పరిమాణం పెరుగుతున్నప్పుడు (సైనోసిస్‌) నాలుక నీలంగా మారచ్చు. అయితే ఈ సమయంలో కేవలం నాలుకే కాదు, గోళ్లు, కొన్నిసార్లు చర్మం కూడా నీలంగా మారుతుంటాయి. కొన్నిసార్లు పుట్టుకతోనే గుండె జబ్బులున్న పిల్లల్లో లేదా పుట్టగానే ఏడ్వని పిల్లల్లో కూడా ఇటువంటి సమస్య తలెత్తచ్చు. మొత్తానికి నాలుక నీలంగా మారిందంటే కచ్చితంగా వైద్యులకు చూపించి సమస్యను నిర్ధారించుకోవటం అవసరం.

లక్షణం విచిత్ర ఆకారాలు--సంకేతం భయం లేదు :
కొందరికి నాలుక మీద పైపొరలో.. రకరకాల ఆకృతుల్లో గాళ్లు, అరలు, నెర్రల వంటివి వచ్చి... తరచూ వాటి ఆకృతులు మారిపోతుంటాయి. ఇవి చూడటానికి ఒక మ్యాపులాగా ఉండటంతో దీన్ని 'జియోగ్రఫిక్‌ టంగ్‌' అంటారు. దీనికి పెద్దగా కారణమేదీ ఉండదు. దీనివల్ల ప్రమాదమూ ఉండదు. అయితే చూడటానికి ఎబ్బెట్టుగా ఉండటంతో చాలామంది భయపడుతుంటారు. తినే ఆహారంలో మార్పులు చేసుకోవటం, సున్నితంగా బ్రషింగ్‌ చేసుకోవటం, నాలుక పైభాగాన్ని హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌తో కడగటం వంటిజాగ్రత్త చర్యలతో దీన్ని చాలా వరకూ తగ్గించుకోవచ్చు.

లక్షణం నల్ల మచ్చలు--సంకేతం విటమిన్‌ బి12 లోపం :
కొందరికి ఒంట్లో విటమిన్‌ బి12 లోపించటం వల్ల నాలుక పాలిపోయినట్లు ఉండటమే కాకుండా.. కొన్నిసార్లు దాని మీద నల్లమచ్చలు కూడా రావచ్చు. నిజానికి ఒంట్లో బి12 లోపం ఉన్నప్పుడు ఇటువంటి మచ్చలు (పిగ్మెంటేషన్‌) అర చేతుల్లోనూ రావచ్చు. ఇవే మచ్చలు నాలుక మీదా కనబడొచ్చు. కాబట్టి ఇటువంటి మచ్చలు కనబడితే వైద్యులు 'బి12' లోపంగా భావించి నిర్ధారించుకునే ప్రయత్నం చేస్తారు.
* కొందరికి కాఫీ పొడి రంగు, నలుపు రంగు కలిసినట్లుగా నాలుక మీద మచ్చలు వస్తుంటాయి. వీరిలో పెద్దపేగులో పిలకలు (పాలిప్స్‌) వచ్చే అవకాశాలు ఎక్కువ.

లక్షణం నంజు పొక్కులు--సంకేతం ఒత్తిడి? :
చాలామందిని తరచుగా వస్తూపోతూ వేధిస్తుండే సమస్య.. నాలుక మీద నంజు పొక్కులు (ఆప్థస్‌ అల్సర్స్‌). పొక్కులు బాగా ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి, బాధ వేధిస్తుంటాయి. చాలామంది ఇవి బీకాంప్లెక్స్‌ లోపం వల్ల వస్తాయని భావిస్తారుగానీ అది పూర్తి నిజం కాదు. ఇవెందుకు వస్తాయో ఇదమిత్థమైన కారణం తెలియదు. అయితే ఈ సమస్య తీవ్రమైన మానసిక ఒత్తిడి పరిస్థితులను అనుభవిస్తున్న వారిలో.. అంటే పరీక్షలకు వెళుతున్న పిల్లలు, నిద్ర సరిగా లేనివారు, వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకున్న వారిలో అధికంగా కనబడుతుంటుంది. వారం పది రోజుల్లో అవే తగ్గిపోతాయి. అవసరమైతే వైద్యులు నొప్పి తెలియకుండా వీటికి క్రీముల వంటివి సిఫార్సు చేస్తారు.

లక్షణం తెల్లటి మచ్చలు--సంకేతం క్యాన్సర్‌కు ముందు దశ? :
దీర్ఘకాలం పొగతాగటం, పొగాకు వాడటం వంటివాటి వల్ల నోటిలో క్యాన్సర్‌ వచ్చే ముప్పు పొంచి ఉంటుంది. వీరిలో తొలిదశలో నాలుక తెల్లగా మారిపోవటం, తెల్లటి మచ్చలు రావటం ఎక్కువ. దీన్నే 'ల్యూకో ప్లేకియా' అంటారు. ఈ తెలుపు గీకినా పోదు. నొప్పీ ఉండదు. ఇటువంటి మచ్చలు కనబడితే తక్షణం వైద్యులను సంప్రదించటం అవసరం.

లక్షణం నొప్పిలేని పుండ్లు--సంకేతం క్యాన్సర్‌? :

  •  
నాలుక మీద పుండు లేదా పుండ్లు ఉండి, వాటి వల్ల నొప్పేమీ లేకపోతే మాత్రం దాన్ని క్యాన్సర్‌ పుండ్లేమోనని అనుమానించి, తక్షణం వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం అవసరం. హెర్పిస్‌, సిఫిలిస్‌ వంటి వ్యాధుల్లో కూడా నోట్లో, నాలుక మీద నొప్పి లేని పుండ్లు రావచ్చు. విటమిన్‌-బి లోపం వల్ల కూడా పుండ్లు రావచ్చుగానీ ఇటీవలి కాలంలో ఇది చాలాచాలా అరుదనే చెప్పాలి. పేగుల్లో చోటుచేసుకునే కొన్ని రకాల జబ్బుల వల్ల (క్రాన్స్‌, అల్సరేటివ్‌ కొలైటిస్‌ మొదలగునవి) కూడా నాలుక మీద పుండ్లు రావచ్చు. మొత్తమ్మీద నాలుక పుండు ఏదైనా 3 వారాల కంటే ఎక్కువకాలం మానకుండా ఉండిపోతే తక్షణం వైద్యులకు చూపించి, అవసరమైతే ముక్క పరీక్షించటం కూడా ముఖ్యమే.

లక్షణం మంట--సంకేతం వ్యాధేం కాదు :

నాలుక మీద మంట సాధారణమైన సమస్యే కానీ చాలాసార్లు దీనికి తీవ్రమైన వ్యాధులేమీ కారణం కాదు. కొందరిలో నాలుక కాలినట్లనిపించటం, రుచులు కూడా కొద్దిగా తేడాగా అనిపిస్తాయి. నాడులు సున్నితంగా తయారవటం వంటివే దీనికి కారణమవుతుంటాయి. వైద్యులను సంప్రదిస్తే మంట తగ్గేందుకు క్రీముల వంటివి సిఫార్సు చేస్తారు.

--courtesy with : Dr.Mallela Venkateswararao @Eenadu sukhibhava
  • =======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, 11 February 2013

Health with Red color,ఎరుపు ఎంతో ఆరోగ్యం

  •  
  •  image : courtesy with google search.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Health with Red color,ఎరుపు ఎంతో ఆరోగ్యం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    కార్బొహైడ్రేట్లూ, ప్రొటీన్లూ, కొవ్వులూ... ఇలా రోజువారీ తీసుకునే ఆహారంలో భాగంగా కెరొటినాయిడ్స్‌ని కూడా తప్పనిసరిగా చేర్చమంటున్నారు పోషకాహార నిపుణులు. 'అవేమిటి? ఎందుకు తినాలి? తినాలంటే వేటిల్లో ఉంటాయి?' వంటి వివరాలు తెలుసుకోవాలంటే...

ముందుగా కెరొటినాయిడ్లు అంటే ఏమిటో చూద్దాం... మొక్కల్లో పూలూ, పండ్లూ, ఆకుల రంగులకు కారణమయ్యే వర్ణద్రవ్యాలనే కెరొటినాయిడ్లు అంటారు. వీటిల్లో కొన్నింటిని మన శరీరం విటమిన్‌-ఎగా మార్చుకుంటుంది. మరికొన్ని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. క్యాన్సర్లూ హృద్రోగాల వంటి రోగాల బారి నుంచి రక్షిస్తాయి. కణాల పనితీరుని మెరుగుపరుస్తూ వృద్ధాప్యాన్నీ అరికడతాయి. అందుకే ఈమధ్య నిపుణులంతా 'ఆహారంలో కెరొటినాయిడ్లు ఉండేలా చూసుకోండి' అంటున్నారు.

ఎక్కడ ఉంటాయి?

కెరొటిన్‌ అనగానే కేవలం క్యారెట్లలో మాత్రమే ఉంటుందనుకుంటారు. కానీ పసుపు, నారింజ, ఎరుపు, ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే పండ్లూ, కూరగాయలన్నింటిలోనూ కెరొటినాయిడ్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటితోపాటు సహజంగా పండే ఎర్ర బియ్యం, ఎరుపు, నారింజరంగు మొక్కజొన్నల్లోనూ ఇవి సమృద్ధిగా ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా కెరొటిన్‌, ల్యూటెన్‌, లైకోపిన్‌, జియాక్సాంథిన్‌... ఇలా దాదాపు 600 రకాల కెరొటినాయిడ్లు మనం తినే పండ్లూ కూరగాయల్లో లభిస్తాయి. ఆల్ఫా, గామాలతో పోల్చితే ప్రకాశవంతమైన నారింజరంగులో ఉండే బీటా కెరొటిన్‌ మాత్రమే విటమిన్‌- ఎగా మారుతుంది. దాదాపు 50 శాతం కెరొటినాయిడ్లు మాత్రమే శరీరంలో విటమిన్‌-ఎ తయారీకి దోహదపడతాయి. కానీ ఆల్ఫా, గామా కెరొటిన్‌లతోపాటు బీటా-జియాకెరొటిన్‌, లైకోపిన్‌, జియాక్సాంథిన్‌, ల్యూటెన్‌, క్యాప్సాంథిన్‌... వంటివన్నీ విటమిన్‌-ఎగా మారవు కానీ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లుగానూ క్యాన్సర్‌ నిరోధకాలుగానూ పనిచేస్తాయి. బీటా-కెరొటిన్‌కన్నా శక్తిమంతమైనవి. శరీరానికి విటమిన్‌-ఎ, కెరొటినాయిడ్లూ రెండూ అవసరమే.
* కొన్ని కెరొటినాయిడ్లు జన్యువుల్ని పరిరక్షిస్తూ వాటిమీద ప్రభావాన్ని కనబరుస్తాయి.
* యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే కెరొటినాయిడ్లు అన్నీ శరీరంలో సహజంగా ఉత్పత్తయ్యే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ నుంచి కణాలను రక్షిస్తాయి. ఏదైనా కణం అసాధారణంగా పెరిగినా లేదా పెరగకుండా ఉండిపోయినా అది భవిష్యత్తులో క్యాన్సర్‌ కణంగా మారడానికి అవకాశం ఎక్కువ. అలాంటి కణాల సక్రమ పెరుగుదలకి కెరొటినాయిడ్లు తోడ్పడతాయి. తద్వారా క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
* విటమిన్‌-ఎ, కెరొటినాయిడ్లూ రెండూ కూడా యాంటీ వైరల్‌గా పనిచేస్తాయి, అంటే తరచూ జలుబూ జ్వరాల వంటివాటి బారినపడకుండా కాపాడతాయి.
* తెల్ల రక్తకణాల పనితీరుని మెరుగుపరుస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు త్వరగా రాకుండా ఉంటాయి.
* జీర్ణ, శ్వాస కోశాల్లోకి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ చేరకుండా కాపాడతాయి. రక్తనాళాల గోడలు దెబ్బతినకుండా కాపాడటం ద్వారా హృద్రోగాలను నివారిస్తాయి.
* కెరొటినాయిడ్లు మహిళల్లో సంతాన సాఫల్యతకీ అండకోశ పనితీరుకీ దోహదపడతాయి. ఎముక నిర్మాణంలో విటమిన్‌-ఎ కీలకపాత్ర వహిస్తుంది.
* అన్నింటికన్నా ముఖ్యంగా రెటీనా పని తీరుకీ వయసుతోపాటు వచ్చే కంటి కండరాల బలహీనతకీ ఈ రెండూ అత్యవసరం. ముఖ్యంగా రేచీకటి బాధితులు బీటాకెరొటిన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడంవల్ల మంచి ఫలితం ఉంటుంది.
* సూర్యరశ్మి కారణంగా తలెత్తే చర్మ సమస్యల నివారణలోనూ బీటా కెరొటిన్‌దే కీలకపాత్ర. దురద, వాపు, ఎర్రని పొక్కులు... వంటివన్నీ కూడా చర్మకణాల్లోని సమస్యలవల్లే వస్తాయి. ఈ సమస్యలున్నవాళ్లు బీటాకెరొటిన్‌ ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది.

వేటిల్లో ఎక్కువగా ఉంటాయి?

క్యారెట్లు బీటాకెరొటిన్‌కు మంచి నిల్వలు. నారింజరంగు గుజ్జు ఉన్న చిలగడదుంపల్లోనూ బీటాకెరొటిన్‌ ఎక్కువే. టొమాటోలు, పుచ్చకాయల్లో లైకోపిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఆకుపచ్చని ఆకుకూరలైన పాలకూర, ఆస్పరాగస్‌తోపాటు, బ్రాకోలిలోనూ కెరొటినాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లో క్లోరోఫిల్‌ వర్ణద్రవ్యం ఎక్కువగా ఉండటంతో అది మిగిలిన నారింజ- పసుపు వర్ణాల్ని పైకి కనిపించనీయదు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు క్యాప్సికమ్‌లు; పచ్చిమిర్చి; గుమ్మడి రకాలు... వంటి కూరగాయలతోపాటు తులసి, ఒరెగానొ, రోజ్‌మేరీ, సోంపు, పుదీనా, కొత్తిమీర... వంటి ఔషధమొక్కల్లోనూ కుంకుమపువ్వు, దాల్చినచెక్క, పసుపు... వంటి సుగంధద్రవ్యాల్లోనూ ఇవి దొరుకుతాయి. పసుపు-నారింజ, ఎరుపు వర్ణాల్లో ఉండే అన్ని రకాల పండ్లూ ముఖ్యంగా పుచ్చ, మామిడి, అప్రికాట్లు, పీచ్‌లు, స్ట్రాబెర్రీ, నారింజ, బొప్పాయి, జామ, దానిమ్మ, తర్బూజ... వంటి పండ్లలోనూ ఇవి సమృద్ధిగా ఉంటాయి. చైనాసంప్రదాయ వైద్యంకోసం వాడే గొజి పండ్లలోనూ కెరొటినాయిడ్లు అధికంగా లభిస్తాయి. కాబట్టి ముదురువర్ణంలో ఉండే పండ్లూ కూరలూ ఆకులూ అన్నీ కూడా కెరొటినాయిడ్లకూ తద్వారా యాంటీఆక్సిడెంట్లకీ అద్భుత నిల్వలే... ఆరోగ్యప్రదాయినులే.


క్యారట్‌ - అరటి రకాల్ని సంకరీకరించిన హైబ్రిడ్‌ కాదు. సహజమైనదే. సాధారణంగా మనం తినే అరటిపండ్లలో కెరొటిన్‌ ఉండదు. కానీ కెరొటిన్‌ అత్యధికంగా ఉండే అరటి రకాల్ని మైక్రొనేషియన్లు వందల సంవత్సరాలనుంచీ సహజంగానే పండిస్తున్నారు... తింటున్నారు. వీటిల్లో ఎర్రని తొక్కతోనూ పసుపురంగు గుజ్జుతోనూ ఉండే క్యారట్‌ అరటిలో బీటా కెరొటిన్‌ చాలా ఎక్కువగా ఉంటుందట. దాంతో మైక్రొనేషియాలోని పాన్‌పె రాష్ట్రంలో పండించే క్యారట్‌ బనానాకి ఇటీవల విస్తృత ప్రచారం లభించింది.

కారణం వీళ్లంతా 1960, 70లవరకూ కూడా స్థానికంగా పండించే పండ్లూ కూరల్నే ఎక్కువగా తినేవారు. తరవాత ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌, సాఫ్ట్‌డ్రింకులు, బియ్యం, పంచదార, ఇతరత్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కి అలవాటు పడటంతో బీటా కెరొటిన్‌ లోపం కారణంగా ఒక్కసారిగా వాళ్లను అనేక రకాల రోగాలు చుట్టుముట్టాయట. దాంతో తప్పు తెలుసుకుని మళ్లీ తినడం ప్రారంభించారట. వీటిలో విటమిన్‌-ఎతోపాటు ఇతర కెరొటినాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి.
  • --------------------------------------
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, 9 February 2013

Gene Treatment for Diabetes,మధుమేహానికి జన్యుచికిత్స

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Gene Treatment for Diabetes,మధుమేహానికి జన్యుచికిత్స- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 మధుమేహానికి జన్యుచికిత్స-కుక్కల్లో జబ్బు పూర్తిగా నయం-స్పెయిన్‌ పరిశోధకుల ఘనత

వాషింగ్టన్‌: మధుమేహంపై స్పెయిన్‌లోని బార్సిలోనా విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇక్కడి పరిశోధకులు జన్యుచికిత్స ద్వారా కుక్కల్లో పుట్టుకతోవచ్చే (టైప్‌1) మధుమేహాన్ని విజయవంతంగా నయం చేయగలగటం విశేషం. ఇది మనుషుల్లోనూ మధుమేహాన్ని నయం చేసే చికిత్సకు మార్గం వేయగలదని భావిస్తున్నారు. పెద్ద జంతువుల్లో మధుమేహాన్ని నయం చేయటం సాధ్యమేనని తేలటం ఇదే తొలిసారి. బార్సిలోనా విశ్వవిద్యాలయానికి చెందిన ఫాతిమా బోష్‌ నేతృత్వంలో సాగిన ఈ అధ్యయనంలో కుక్కల కండరంలోకి 'గ్లూకోజు గ్రాహకం'ను ప్రవేశపెట్టటం కీలకమైన విషయం. ఈ జన్యుచికిత్సతో కుక్కలు మధుమేహం నుంచి పూర్తిగా కోలుకోవటమే కాదు.. నాలుగేళ్ల తర్వాత కూడా జబ్బు లక్షణాలు తిరిగి కనిపించకపోవటం గమనార్హం. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్కసారితో ముగిసిపోయే ఈ చికిత్సలో సాధారణ సూదులతో కుక్కల వెనక కాళ్లకు వివిధ రకాల ఇంజెక్షన్లను ఇచ్చారు. ఇన్సులిన్‌ జన్యువుతో పాటు రక్తంలోంచి గ్లూకోజును గ్రహించే ప్రక్రియను నియత్రించే గ్లూకోకైనేజ్‌ ఎంజైమ్‌ వ్యక్తం కావటానికి ఈ ఇంజెక్షన్ల ద్వారా కుక్కల్లోకి జన్యు వాహకాలను ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండూ కలసి 'గ్లూకోజు గ్రాహకం'గా పనిచేసి, రక్తంలో గ్లూకోజు మోతాదూ తగ్గటానికి తోడ్పడ్డాయి.

Courtesy with Eenadu Daily News-09/Feb/2013
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

Diabetes with Stress and Strain,ఒత్తిడితో మధుమేహం

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Diabetes with Stress and Strain,ఒత్తిడితో మధుమేహం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


updated :
ఒత్తిడితో మధుమేహం!45% ముప్పు అధికం స్వీడన్‌ అధ్యయనంలో వెల్లడి( 09-Feb-13)


లండన్‌: నిరంతరం ఒత్తిడితో బాధపడుతున్నారా? అయితే కాస్త జాగ్రత్త. ఇలా ఎల్లప్పుడూ ఒత్తిడితో బాధపడే పురుషులకు మధుమేహం ముప్పు 45% ఎక్కువగా ఉంటోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌లో 7,500 మంది పురుషులను 35 ఏళ్ల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. గోథెన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని 1970లో ఆరంభించారు. ఇందులో 1915-1925 మధ్యకాలంలో జన్మించిన వారిని ఎంచుకున్నారు. తాము ఎంచుకున్న 7,500 మందిలో 6,828 మందికి అంతకుముందు మధుమేహం, గుండెజబ్బు, పక్షవాతం వంటి సమస్యలేవీ లేవు. అధ్యయన కాలం ముగిసేటప్పటికి వీరిలో మొత్తం 899 మంది మధుమేహం బారినపడ్డట్టు గుర్తించారు. నిరంతరం ఒత్తిడితో బాధపడేవారికి మధుమేహం ముప్పు గణనీయంగా ఎక్కువగా ఉన్నట్టు తేలటం గమనార్హం. చిరాకు, ఆందోళన, ఇంట్లో లేదా ఆఫీసులో ఎదురయ్యే సమస్యల మూలంగా నిద్ర సరిగా పట్టకపోవటం వంటి అంశాల ఆధారంగా ఒత్తిడి తీవ్రతను గణించి ఈ విషయాన్ని నిర్ధరించారు. వయసు, సామాజికార్థిక స్థాయి, శారీరక శ్రమ, శరీర బరువు ఎత్తుల నిష్పత్తి, రక్తపోటు, రక్తపోటు తగ్గేందుకు వేసుకునే మందుల వంటి వాటిని పక్కనపెట్టినప్పటికీ.. మధుమేహానికీ ఒత్తిడికీ గణనీయమైన సంబంధం ఉంటున్నట్టు తేలిందని పరిశోధకులు తెలిపారు. ''ప్రస్తుతం మధుమేహాన్ని నివారించగల అంశాల్లో ఒత్తిడిని గుర్తించటం లేదు'' అని అధ్యయన నేత మసుమా నోవాక్‌ పేర్కొన్నారు. ఈ రెండింటికీ మధ్య నేరుగా సంబంధం ఉంటున్నట్టు తమ అధ్యయనంలో తేలినందువల్ల మధుమేహం నివారణ పద్ధతుల్లో ఒత్తిడిని కూడా చేర్చాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు

  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, 4 February 2013

How to clear head lice?,పేలును వదిలించుకోవడము ఎలా?

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - How to clear head lice?-పేలును వదిలించుకోవడము ఎలా?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



సాధారణంగా చిన్న పిల్లల తలలో అంటే పాఠశాలకు వెళ్ళే బాలికల తలలో పేలు పడతాయి. ఒత్తుగా జుట్టు వున్న పిల్లల తలలో పేలు త్వరగా వృద్ధి చెందుతాయి. తలలో ఉండే పేలు, తల మీద చర్మం నుంచి రక్తం పీల్చుకుని బ్రతుకుతాయి. జుట్టుకు పట్టుకుని తలంతా కదులుతూ, తలకు దురదను కలిగిస్తాయి. గోళ్ళతో గోకడం, దువ్వెనతో గీరడం వల్ల తలమీద చర్మం చిట్లుతుంది. గోళ్ళలోని, దువ్వెన పళ్ళ మధ్య వున్న మురికి తలలో చేరుకుని చిట్లిన చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. అక్కడ పుండుపడి బాధకలుగుతుంది. పేలు అతి చిన్నగా ఉన్నప్పటికీ ఇవి వెంట్రు కలకు, తలమీద చర్మానికి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. పేలు తలలో ఉన్న ప్పుడు దురద సమస్య అధికంగా వుంటుంది.

పేలు అతిత్వరగా వృద్ధి చెందుతాయి. ఇది ఒకరి తలలోంచి మరొకరి తలలోకి ఎగురగలవు. పేలు తలలో పాకుతూంటే ఏర్పడే దురద బాధాకరంగా వుంటుంది. జుట్టు అశుభ్రతగా, జిడ్డుగా వున్నప్పుడు పేలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. నలుగురిలో వున్నప్పుడు తల గోకుతూంటే ఎబ్బెట్టుగా వుంటుంది. దురద భరించలేక తలగోక్కోకుండా ఉండలేరు. అంతే కాకుండా, ఒక్కోసారి గోళ్ళల్లో పేలు చిక్కుకుంటాయి. వాటిని తీసి అందరూ ఎదుటా చంపడం నామోషీగా భావిస్తారు. అలాగే నేలమీద వదిలేస్తారు. బాలికల తలలోనే కాకుండా, ఒత్తుగా జుట్టున్న బాలుర తలలో కూడా పేలుపడతాయి. పాఠశాలలో బాల బాలికలు కలసి కూర్చోవడం, కలసి ఆడుకోవడం ద్వారా, తలలు దగ్గరగా ఉన్నప్పుడు పేలు ఎగిరి ఒకరి తలలోంచి మరొకరి తలలోకి చేరుకుం టాయి. అంతే కాకుండా, తలలో పేలున్నవారు వాడే దువ్వెనలను, తలగడలను, దుప్పట్లను తోటి వారు వాడటం వల్ల కూడా పేలు ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తాయి.

పేలు తలలో కదులుతూ, రక్తాన్ని పీలుస్తూంటే ఏర్పడే దురద వల్ల గోళ్ళలో తలమీద చర్మాన్ని గట్టిగా గీరడం వల్ల వెంట్రుకల కుదుళ్ళు బలహీన పడతాయి. ఆ కారణంగా జుట్టు ఊడిపోతుంది. పేలు దువ్వెనలోకి రావాలని ఎక్కువ సమయం తలను దువ్వడం వల్ల కూడా చర్మం చిట్లడం, పుండు ఏర్పడటమే కాక జుట్టు చిక్కుపడి, గట్టిగా దువ్వడం వల్ల వెంట్రుకలు రాలిపోతాయి. పేలు దువ్వెన పళ్ళ మధ్య చిక్కుకుని వచ్చినప్పటికీ, అవి తలలో పెట్టిన గుడ్లు తిరిగి పేలుగా మారి, తిరిగి వారికి పేల సమస్య ఏర్పడుతుంది. తలలోనే కాకుండా అవి ఒక్కోసారి తలలోంచి బయటకు వచ్చి మెడమీద, నుదుటిమీద కూడా పాకుతుం టాయి. వారి పేల సమస్య ఎదుటివారికి చీదర కలిగిస్తుంది. తలలో పేలున్నవారికి ఇతరులు దూ రంగానే ఉంటారు. అందువల్ల పేల సమస్యను తొలగించుకోటానికి కొన్ని పద్ధతులను పాటించాలి.

తలల్లో స్థిర నివాసం చేసుకుని ఉండే పేలు పీడను వదిలించుకోవాలంటే...

1. మెంతులను నానపెట్టి మెత్తగా రుబ్బి, ఆ ముద్దలో హారతి కర్పూరాన్ని కలిపి తలకు పట్టించి ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి.
2. వేపాకును, మెంతి ఆకును మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి గంటా, గంటన్నర అయిన తర్వాత తలస్నానం చేయాలి.
3. కొబ్బరి నూనెలో వేపగింజలను వేపాకును వేసి కాచి, దాన్ని వడకట్టి ప్రతిరోజూ ఆ నూనెను జుట్టు కుదుళ్ళల్లోకి ఇంకేలా మసాజ్‌ చేసినట్లయితే పేలు చచ్చిపోతాయి.
4. తలస్నానానికి సీకాయపొడి, కుంకుడురసాన్ని వాడాలి.
5. మెంతి ఆకులను లేదా వేపాకులను మెత్తగా నూరి, అందులో నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే పేలు చనిపోతాయి.
6. పేలను సంహరించే మందులు ద్రవరూపంలోనూ, క్రీమ్‌ రూపంలోనూ మెడికల్‌ షాపుల్లో దొరుకుతాయి. వాటిని రాత్రి పడుకోబోయే ముందు తలకు పట్టించి, జుట్టంతా కవరయ్యేలా తలకు చిన్న తువ్వాలను చుట్టుకుని ఉదయం నిద్రలేవగానే తలస్నానం చేస్తే, పేలతో పాటు వాటి గుడ్లు నశించిపోతాయి.
7. దువ్వెనలలో మురికి చేరకుండా దువ్వెన పళ్ళను శుభ్రపరుస్తూండాలి. అంతేకా కుండా వారానికి ఒకసారి మరుగుతున్న నీటిలో దువ్వెనను నానపెట్టి శుభ్రపరచాలి.
8. తలగడను ఎండలోవేస్తూ, గలీబులను వేడి నీటిలో నానపెట్టి ఉతకాలి. డెట్టాల్‌ కలిపిన నీటిలో జాడించి, ఎండలో ఆరెయ్యాలి.
9. తలలో పేలున్నవారు వారానికి రెండుమూడుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తలస్నానానికి ముందు కాకర రసంకానీ, నిమ్మరసంకానీ తలకు పట్టించాలి.
10. జుట్టు జిడ్డుగానూ అపరిశుభ్రంగానూ లేకుండా వెంట్రుకల పరిశుభ్రతను పాటించాలి
11 .నాలుగు పెద్ద వెల్లుల్లి రేకలను మెత్తగా పేస్టులాగా చేసి, ఒక టీస్పూన్ నిమ్మరసంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయ్యాక తలకు కాటన్ టవల్ చుట్టి రాత్రంతా అలాగే ఉంచేయాలి. ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా రోజు మార్చి రోజు... ఐదు రోజులపాటు చేసినట్లయితే పేలు, వాటి తాలూకు గుడ్లు పూర్తిగా నశించిపోతాయి.
12., అరకప్పు నీటిలో రెండు టీస్పూన్ల వైట్ వెనిగర్ కలిపి అందులో దూదిని ముంచి తలకు పట్టించి జట్టు కుదుళ్లకు, మాడుకు బాగా పట్టేటట్లుగా మసాజ్ చేయాలి. తరువాత కాటన్ టవల్ చుట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయం మామూలుగా తలస్నానం చేయాలి.
13. ఉల్లిపాయలను మెత్తగా చేసి, రసాన్ని తలకు పట్టించి, తలను క్యాప్‌తోగానీ, క్లాత్‌తోగానీ కవర్ చేసేయాలి. అలాగే నాలుగు గంటలపాటు ఉంచి తలస్నానం చేయాలి. ఇలా మూడు రోజులపాటు చేసినట్లయితే పేల బెడద పూర్తిగా వదలిపోతుంది.

allopathic drugs for external use.
    1. Malathion,
    2. Carbaryl ,
    3. Lindane,
    4. Gamabenzene hexa chloride(Ascabiol lotion),
    5. Benzyl Benzoate(Dermin,Scabindon),
    6. Medikar shamphoo (good to kill lice),
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/