Thursday, 10 January 2013

Guillain Barre Syndrom-గులియన్‌ బారి సిండ్రోమ్

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Guillain Barre Syndrom-గులియన్‌ బారి సిండ్రోమ్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ శరీరం యొక్క రక్షణ (వ్యాధినిరోధక) సిస్టమ్ తప్పుగా నాడీ వ్యవస్థపై  దాడి జరుగుతుంది. ఒక తీవ్రమైన రుగ్మత. ఈ కండరాల బలహీనత మరియు ఇతర లక్షణాలు కలిగిస్తుంది నాడీ వాపుకు దారితీస్తుంది.

కారణాలు, సంఘటనలు మరియు ప్రమాద కారకాలు

గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ స్వీయరక్షిత లోపము (శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ దాడి) వలన కలుగుతుంది . కాని అసలు కారణము సరిగ్గా  తెలియదు. సిండ్రోమ్ ఏ వయస్సులో వారికైనా రావచ్చును , కానీ వయస్సు 30 మరియు 50 మధ్య రెండు లింగాల ప్రజలు అత్యంత సాధారణ ఉంటుంది. ఇది తరచూ ఒక చిన్న ఇన్ఫెక్షన్ అనగా  ఒక లంగ్ ఇన్ఫెక్షన్ లేదా జఠర వ్యాధి వంటి వాటిని  అనుసరిస్తుంది. చాలా కాలం, అసలు  సంక్రమణ చిహ్నాలు, గులియన్‌ బారి సిండ్రోమ్ ప్రారంభం లక్షణాలు ముందు కనుమరుగవుతాయి . ఒక్కొసారి  ఇది  ఒక శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులు లేదా వారాలు తరువాత కనిపిస్తుంది.

1976 లో స్వైన్ ఫ్లూ టీకా వల్ల వచ్చిన  గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్  అరుదైన సందర్భాలలో జరిగి ఉండవచ్చు. అయితే, స్వైన్ ఫ్లూ మరియు  సాధారణ ఫ్లూ టీకాలను ఉపయోగించడము , కొన్ని  అనారోగ్యం కేసులు ఫలితంగా రాలేదు.

 గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ నష్టానికి నరాల భాగాలు, నరాలు దెబ్బతిని  తిమ్మిరి, కండరాల బలహీనత, మరియు పక్షవాతం నకు కారణమవుతుంది. గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ ఎక్కువగా నరం యొక్క కవరింగ్ (మైలిన్ తొడుగు) pai ప్రభావితం చేస్తుంది. అటువంటి నష్టం demyelination అని, మరియు ఇది నరాల సంకేతాలు చాలా నెమ్మదిగా కదలకపోవడం వల్ల జరుగుతుంది. నరాల యొక్క ఇతర భాగాలకు నష్టం , నరాల పూర్తిగా పని ఆపడానికి కారణం కావచ్చు.

గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ కింది  వైరల్ సంక్రమణ tO పాటు సంభవించవచ్చు:

  •   AIDS
  •   సలిపి
  •  మోనోన్యూక్లియోసిస్
  •  దైహిక ల్యూపస్ ఎరిథెమాటసస్ లేదా
  • హాడ్జికిన్స్ వ్యాధి వంటి ఇతర వైద్య పరిస్థితులు కూడా సంభవించవచ్చు.
  • కొందరు బాక్టీరియల్ ఇంఫెక్షన్ తర్వాత గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ పొందుతుంది.


-మానవుని కదలికలకు మెదడు, వెన్నుపూస ఎంత ముఖ్యమైనవో, నరాలు కూడా అంతే ముఖ్యమైనవి. మెదడు నుంచి వచ్చే సంకేతాలు నరాల ద్వారానే కండరాలకి వెళ్ళి కదలికలు జరుగుతాయి. ఎప్పుడైతే నరాలు దెబ్బతింటాయో స్పర్శలో తేడా రావడం, కాళ్ళు, చేతులు చచ్చుబడిపోవడం జరుగుతాయి. కాళ్ళు, చేతులు తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, కాళ్ళు గుంజుతూ ఉండడం, స్పర్థ కోల్పోవడం, కింద నుంచి పైకి లేవలేకపోవడం, చెప్పులు జారిపోవడం, నడకలేకపోవడం నరాల జబ్బు లక్షణాలు. సాధారణంగా షుగరు జబ్బువారిలో, పూర్తి శాఖాహారుల్లో, మద్యం సేవించేవారిలో నరాలు దెబ్బతింటాయి. అయితే వీటన్నింటితో పాటు జ్వరాల వలన, ప్రత్యేకంచి వైరస్‌ జ్వరం తరువాత కొంతమందిలో నరాలు దెబ్బతింటాయి. ఒకటి నుంచి రెండు వారాల్లోనే పెరిగిపోయే నరాల జబ్బునే ‘గులియన్‌ బారి సిండ్రోమ్‌’ అంటారు.

సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు మనిషిలోని రోగనిరోధక వ్యవస్థ యాంటిబాడీస్‌ అనే పదార్థాలను తయారుచేస్తుంది. ఇవి వైరస్‌ని చంపడంతో పాటు, మనిషి నరాలని కూడా దెబ్బతీస్తాయి. ఇవి తయారైన పరిమాణాన్ని బట్టి జబ్బు తీవ్రత ఉంటుంది. 70 శాతం మందిలో ఈ జబ్బు రెండువారాల్లో ముదిరి మనిషిని నడవలేని దశకి తీసుకెవెళుతుంది. తర్వాత అలా నిలబడిపోయి ఒక నెల తరువాత క్రమంగా కండరాలు పనిచేయడం మొదలుపెడతాయి. మిగిలిన 30 శాతం మందిలో జబ్బు ముదిరి, శ్వాస తీసుకోవటానికి అవసరమైన కండరాలు కూడా చచ్చుబడిపోయి, ఊరిపి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇటువంటి వారు మింగే శక్తి కూడా కోల్పోతారు, మెడలు నిలుపలేరు. ఈ దశలో వెంటిలేటర్‌ అమర్చి చికిత్స అందిచవలసి ఉంటుంది.

నిర్ధారణ ఎలా? : పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు నిపుణుడైన న్యూరాలజీస్టును కలిసి, ఎన్‌.సి.ఎస్‌. పరీక్షను చేయింకోవాలి. ఈ పరీక్షతో జబ్బును నిర్ధారంచవచ్చు. ఇటువంటి లక్షణాలే కలగజేసే వేరే జబ్బుల గురించి తెలుసుకోవటానికి కొన్ని రక్తపరీక్షలు అవసరంపడతాయి.

వైద్యం ఎలా? : నరాలు కొంచెం మాత్రమే దెబ్బతిని, రోగి నడవగలుతున్నప్పుడు కొన్ని ఇంజక్షన్లు, ఫిజియోథెరపీతోనే నెమ్మదిగా రెండుమూడు నెలల్లో పూర్తిగా జబ్బు తగ్గిపోతుంది. అయితే జబ్బు తీవ్రంగా ఉన్నప్పుడు శ్వాసకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు లేక రోజురోజుకీ బలం బాగా తగ్గిపోతున్న రోగిని ఐసియులో చేర్చి జాగ్రత్తగా వైద్యం అందించాలి. ఐవిఐజి అనే మందును 5 రోజులు ఇవ్వవచ్చు. అయితే ఇది బాగా ఖరీదైన మందు రోగి బరువుని బట్టి, మందు ఖరీదే 2-3 లక్షల వరకు ఉంటుంది.

ప్రత్యామ్నాయం ఎలా : పైన మందు పెట్టుకోలేకపోతే, ప్లాస్మాథెరపీ అనే పద్ధతి ద్వారా ఈ జబ్బు ముదరకుండా చేయవచ్చు. ఈ పద్ధతి వలన తొందరగా రోగి కోలుకోగలుగుతాడు. అయితే మూడు నుంచి ఐదుసార్లు ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది. లక్ష రూపాయలలోపే ట్రీట్‌మెంట్‌ చేయవచ్చు. 70-80 శాతం మంది ఈ ప్రక్రియ తర్వాత కొన్ని వారాల్లోనే సొంతంగా నడవగలుగుతారు. 20 శాతం మందిలో అంతకన్నా ఎక్కువ సమయమే పట్టవచ్చు.

-అయితే పైన పేర్కొన్న రెండు పదార్థాలు కూడా ఎంత తొందరగా మొదలుపెడితే అంత తొందరగా ఫలితం ఉంటుంది. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. సాధారణంగా కొన్ని వారాలు ఫిజియోథెరపీ సక్రమంగా చేస్తూంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది.కాబట్టి ఎవరిలోనైనా కానీ, జర్వంతో పాటుకానీ, జర్వం తగ్గిపోయిన తర్వాత కాళ్ళు, చేతులు చచ్చుబడిపోతున్నా, తిమ్మిర్లు వచ్చి నడవలేకపోతున్నా వెంటనే దగ్గరలో డాక్టరుని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేసుకొని వెంటనే వైద్యం మొదలుపెడితే ప్రాణహాని నుంచి బయటపడవచ్చు.

Courtesy with : Ayush@Surya Telugu Daily
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, 9 January 2013

working women Stress and illness-వర్కింగ్‌ విమెన్‌ను వణికించే ఒత్తిడి

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -working women Stress and illness-వర్కింగ్‌ విమెన్‌ను వణికించే ఒత్తిడి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




అష్టావధానం అన్న మాట వర్కింగ్‌ విమెన్‌ కు అక్షరాలా సరిపోతుంది. ఒంటి చేత్తో ఎన్నో పనులు ఏక కాలంలో ఏ విధంగా చేయవచ్చో వర్కింగ్‌ విమెన్‌ కు తెలిసినట్లుగా ఎవరికీ సరిపోదంటే అతిశయోక్తి కాదు. సూపర్‌ ఫాస్టు ఎక్సుప్రెస్‌మాదిరిగా పరుగులు తీయాల్సిందే. ఇన్ని పనుల మధ్య ఎదురయ్యే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఈ ఒత్తిడిని జయించకపోతే అనారోగ్యం పాలు కాక తప్పని సరి.

సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే వర్కింగ విమెన్‌ కు ఇంటి పని స్వాగ తం పలుకుతుంది. పిల్లలు స్కూల్సు లేక కాలేజీలకు వెళ్లడానికి అవసర మైనవన్నీ సమకూర్చటం తల్లిబాధ్యతే అవుతుంది. ఈ లోగా భర్త ఆఫీసుకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకొంటూనే, తాను ఆఫీసుకు చేరుకోవటానికి సర్దుకో వాల్సి ఉంటుంది . ఇందుకో సం ఉరుకులు, పరుగులు తప్పనిసరి.ఆ తర్వాత అందుబాటులో ఉన్న వాహనాన్ని అంది పుచ్చుకొని కార్యాలయానికి పరుగులు తీస్తారు. అక్కడ పని మీద కాన్‌ సంట్రేషన్‌ చేయకపోతే సమస్యలు తప్పవు. సాయంత్రం ఇంటికి వస్తూనే మళ్లీ పని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ మొత్తం స్ట్రక్చర్‌ లో ఎక్కడ తేడా వచ్చినా ఒత్తిడిని ఫేస్‌చేయాల్సిందే.

శరీరంలో ఒత్తిడి ఏర్పడితే వెంటనే దానికి సంబంధించిన ర్యాడికల్సు శరీరంలో తయారు అయిపోతాయి. ఇవి ఎప్పటికప్పుడు శ రీరంలో నెగటివ్‌ పనుల్ని మొదలు పెడతాయి. ఇవి క్రమంగా నాడీ వ్యవస్థను ఇబ్బంది పెడతాయి. అందుచేత ఈ పరిస్థితి తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.
ఒత్తిడిని జయించేందుకు కొన్ని సూత్రాలు తెలుసుకొందాం...

బ్రేక్‌ఫాస్టును మానవద్దు...
చాలా మంది వర్కింగ్‌ విమెన్‌ బ్రేక్‌ ఫాస్టును పక్కన పెట్టేస్తారు. ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకొంటారు. శరీరానికి నిరంతరాయంగా శక్తి అందుతూ ఉండాలి. అప్పుడే సజావుగా అది తన పనులు తాను చేసుకో గలుగుతుంది. రాత్రి 8-9 గంటల సమయంలో భోజనం చేసి పడుకొంటే ఉదయం బ్రేక్‌ ఫాస్టు ను పక్కన పెట్టేస్తారు. లేదంటే ఆఫీసుకి వెళ్లాక 10-11 అయ్యాక అప్పుడు తింటారు. అంటే రోజులో 24 గంటలు ఉంటే అందులో సగం సేపు అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9గంటల దాకా ఏమీ తీసు కోరు అన్నమాట. తర్వాత సగం సేపులోనే మొత్తం ఆహారాన్ని తీసుకొంటారు.

దీని వలన జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. అంతే గాకుండా ఉదయం పూట శరీరానికి కావలసిన శక్తి ఏమాత్రం అందదు. పైగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చెపిన మాట వినక పోవచ్చు. దీంతో చిరాకు పెరిగి పోయి.. అరుపులు, ేకలతో ఇల్లు ప్రతిధ్వనిస్తుంది. దీన్ని అధిగమించాలంటే ఉదయాన్నే బలమైన బ్రేక్‌ ఫాస్టు తీసుకోవాల్సి ఉంటుంది.

రోజు వారీ పనుల్ని ప్రణాళికా బద్దం...
ప్రతీ రోజు చేసే పనులు అయినప్పటికీ వాటి కోసమే చాలా సేపు వెదకులాట సాగుతుంది. ఉదయం పూట టీ మగ్‌కనిపించ లేదనో, ఆఫీసుకి వెళ్లేప్పుడు ఫైల్స కనిపించ లేదనో వెదకులాట తప్పదు. అయితే పనుల్ని క్రమబద్దం చేసుకొంటే ఈ చికాకుల్ని తప్పించుకోవచ్చు. వాస్తవానికి ఒకే దాని కోసం అదే పనిగా వెదకుతుంటే నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక అంశంలో మిస్‌ అయ్యామన్న ఇండి కేషన్‌ అదే పనిగా వెళితే .. ఇది మరో నాడీ కేంద్రాన్ని డిస్టర్బ చేస్తుంది. దీని ఫలితంగా ఒత్తిడి పెరిగి మరో విషయంపై ఏకాగ్రత లోపిస్తుంది. చివరకు ఈ చికాకు మిగిలిన వాటి మీద పడుతుంది. దీన్ని అధిగమించాలంటే ప్రణాళికా బద్దంగా సాగుట మేలు. అంటే ఉదయం చేసుకోవాల్సిన పనుల్ని ఒక చోట నమోదు చేసుకొని సరి చూసుకోవాలి.

ఖాళీ సమయంలో ఆయా పనుల్ని ఎలా చేసుకోంటునామో బేరీజు వేసుకొంటే నియమబద్దంగా సాగిపోతాయి. పనులు చేసే సమయాన్ని తగ్గించుకోవటం... అవకాశం ఉన్నప్పుడు ఈ పనుల జాబితాను సరిచూసుకోవాలి. అటువంట ప్పుడు ఎక్కడ సమయం వేస్టు అవుతోందో అన్నది అర్థం అయిపోతుంది. అటువంటప్పుడు కొద్దిపాటి సమయాన్ని ఎక్కడ మిగుల్చుకోవచ్చో ఆలోచిం చాలి. ఈ సమయాన్ని మిగిలిన పనులు ప్రశాంతంగా చేసుకొనేందుకు కేటా యించాలి. లేని పక్షంలో హడావుడి పెరిగినప్పుడు దీని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. తొందర పాటుతో పని చేస్తే గుండెల్లో దడ రావటం, తల నొప్పి వస్తుండటం వంటివి జరుగుతుంటాయి. ఈ పరిస్తితిని అధిగమించటా నికి కొందరు టాబ్లెట్లు వాడేస్తుంటారు. దీని వలన మరిన్ని అనర్థాలు వచ్చిపడు తుంటాయి.

కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోవటం...
పనులు చేసుకొనే క్రమంలో పనుల్ని డిస్ట్రిబ్యూట చేసుకోవాలి. ద సిక్సు కీస్‌టూ పెర్‌ ఫామ్‌ లొ యువర్‌ ప్రోడక్టివ్‌ బెస్టు అనే గ్రంథంలో నియమబద్ద ప్రణాళిక గురించిన వివరాలు వర్ణించి ఉన్నాయి. ఈ ప్రణాళిక ను అమలు పరిస్తే ఒత్తిడి ని బాగా తగ్గించుకోవచ్చు. ఇందులో ప్రధానమైన అంశం పనుల్ని అప్పగించటం. ఇంటికి కావలసిన వస్తువుల్ని తెప్పించుకోవటం, ఇంట్లో సర్దుకొనే పని, హోమ్‌ వర్కు చేయించటం, బ్యాంకింగ్‌ లావాదేవీలు వంటి పనుల్ని భర్తతో కలిసి ప్లాన్‌ చేసుకోవటం మేలని గ్రంథకర్త సూచిస్తారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు పనులు ఆర్డరు చేసినట్లుగా కాకుండా సమన్వయం చేసుకొంటున్నట్లుగా పనుల్ని ఆర్డరు చేసుకోవాలి.

రోజు వారీ విశ్రాంతి...
-ఆహారం, పనులకు సమయం కేటాయిస్తుంటారు. కానీ, విశ్రాంతి గురించి పెద్దగా పట్టించుకోరు. దీని వలన శరీరం పగటి పూట పూర్తిగా పని చేయటం, రాత్రి పూర్తిగా నిద్రించటం అనే ట్రెండ్‌ సాగుతుంది. ఇది పూర్తిగా సరి కాదు. ఎందుచేతనంటే పని లో మెరుగైన ఫలితాలు రావాలన్నా, క్వాలిటీ పరంగా బెస్టుగా ఉండాలన్నా కొద్ది పాటి విరామం అవసరం. వీలుంటే మధ్యాహ్నం లంచ్‌ తర్వాత కొద్ది సేపు కనులు మూసుకొని విశ్రాంతి తీసుకోవటం ఒక పరి ష్కారం. లేదంటే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక కొద్ది సేపు విశ్రాంతి తీసు కోవాలి. దీని వలన ఆ తర్వాత నుంచి రాత్రి వరకు పనులన్నీ చక చకా సాగు తాయి. ఇలా కాకుండా కంటి న్యూగా పనిచేసుకొంటూ వెళితే మెదడు, ఇతర ముఖ్య అవయవాల మీద ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతి అంటే గాఢమైన నిద్ర అవసరం లేదు. కాస్తంత కనులు మూసుకొని రిలాక్సు అయినా సరిపోతుంది.

సొంతానికి కొంత సమయం...
ఇంటి కోసం, ఆపీసు కోసం చాకిరీ చేస్తుంటారు చాలామంది. కుటుంబ సభ్యుల కోసం, ఆఫీసు కోసం సమయాన్ని వెచ్చించక తప్పదు. ఇదంతా ఒక ఎత్తయితే, సొంతానికి కొంత సమయం ఉండాలంటారు పరిశోధకులు. ఎందుచేతనంటే జీవితం ఏ విధంగా సాగిపోతోంది, మెరుగ్గా నడుపుకోవాలంటే ఏమి చేయాలి అనే విషయాల్ని ఆలోచించుకోవాలని చెబుతారు. ఇందుకోసం అప్పుడప్పుడు కొంత సేపు ప్రశాంతంగా గడిపేందుకు ప్రయత్నించాలి. ఒంటరిగా ఉన్న సమయంలో మెదడు చురుగ్గా మారి, మరింత ఉత్తేజాన్ని పొందుతుంది. అంతిమంగా ఆనందం వైపు అడుగులు పడతాయి.


courtesy with - చిట్టా రమాదేవి, . M. Sc., M.Phil.., సీనియర్‌ ఫ్యాల్టీ, హైదరాబాద్‌@Surya Telugu daily news paper.

  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Health awareness in Winter - శీతాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు అవగాహన

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Health awareness in Winter - శీతాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



డిసెంబర్‌నెల చివరిలోనే చలిగాలులు విజృంభిస్తున్నాయి. రాష్టమ్రంతా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అనేక చోట్ల సాయంత్రానికే చలిగాలులు కమ్మేస్తున్నాయి. ఉదయం బారెడు పొద్దెక్కితే తప్ప చలిపులి వదలట్లేదు. ఈ నేపథ్యంలో మహిళలు, ముఖ్యంగా వర్కింగ్‌ ఉమెన్‌ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ‚వర్కింగ్‌ ఉమెన్‌ అంటే తప్పనిసరిగా బయటకు వెళ్లి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అందరికీ ఆఫీసు టైమింగ్సు ఒకేలా ఉండవు. ఉదయం 10 గంటలకు వె ళ్లి సాయంత్రానికి తిరగి వచ్చే వెసులుబాటు ఉంటే పరవాలే దు. ఈ టైమింగ్సు లో కూడా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చలికి గురయ్యే అవకాశం ఉంది. అదే షిప్టు వేళల్లో అయితే తప్పనిసరిగా చలిగాలులు వీచేటప్పుడే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో చలి పంజా బారిన పడక తప్పని పరిస్థితి.

మానసిక ఉద్వేగాలతో జాగ్రత్త..!
-శీతాకాలంలో మానసిక ఉద్వేగాలు కొందరిలో ఎక్కువ ప్రభావం చూపు తాయి. వర్కింగ్‌ఉమెన్‌కు ఇంటా బయట ఒత్తిళ్లు వెంటాడుతాయి. వీటిని ఎదుర్కొంటూ పనులు చక్క బెట్టుకోవాలి. మెదడులో ఉండే మెలటోన్‌ రిసెప్ట ర్లు చురుకుదనానికి మూలంగా నిలుస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుచుకోవాలి. చలి కాలంలో ఇవి నిస్తేజంగా మారిపోతాయి. అటువం టప్పుడు మనుషులు మూడీగా మారిపోతారు. ఈలోగా చలి కారణంగా పనులు చేసుకొనేందుకు కుటుంబ సభ్యులు ఏమాత్రం సహకరించక పోయి నా వాళ్ల మీద విరుచుకు పడే చాన్సు ఉంటుంది. దీన్నే సీజనల్‌ మూడీ డిజార్డర్‌ అని చెబుతారు. సమస్య మూలాల్ని గుర్తించి, దీని నుంచి బయట పడేందుకు ప్రయత్నించాలి. లేదంటే ఈ సమస్య ఊబిలో మరింత కూరుకొని పోయే ప్రమాదం ఉంది. నలుగురిలో కలిసిపోతూ, ఉత్సాహాన్ని తెచ్చి పెట్టుకోవటం ద్వారా ఈ సమస్య ను అధిగమించవచ్చు.

జ్వరాలతో జర భద్రం..!
సీజన్‌మారే సమయంలో వాతావరణం ఒక్క సారిగా మారుతుంటుంది. ఈ మార్పుని శరీరం ఒక్కసారిగా గుర్తించి సర్దుబాటు చేసుకోవటం కాస్త కష్టం. వాతావరణంలో ఒక్కసారిగా చలిగాలులు విజ్రంభిస్తాయి. కేవలం ఈ సమయంలోనే కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌ లు చురుగ్గా మారతాయి. చలిగాలిలో తిరుగుతుంటే ఈ సూక్ష్మక్రిములు శరీరంలో ప్రవేశిస్తాయి. సాధారణంగా క్రిములు అందరి శరీరంలోకి చేరతాయి. తగినంత రోగ నిరో ధక శక్తి ఉన్నట్లయితే ఈ క్రిములు ఏమీ చేయలేవు. లేని పక్షంలో ఈ క్రిము లు వ్యాధుల్ని కలగచేస్తాయి. ఈ క్రమంలో సూక్ష్మ క్రిములకు వ్యాధి నిరోధక కారకాలకు శరీరం లోపల ఘర్షణ చెలరేగుతుంది. దీని ఫలితంగా జ్వరం, నొప్పులు బయట పడతాయి.

శ్వాసకోశ సమస్యలు..!
చలికాలం అంటేనే శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి కష్ట కాలం. చలిగాలులు తగిలాయంటే లోపల దాగి ఉన్న అనారోగ్య సమస్యలు బయట పడతాయి. చలిగాలిలో ఉండే తేమ.. ముక్కు ద్వారా శ్వాస కోశాల్లోకి ప్రవేశిస్తుంది. ఆయా నాళాల్లోని లోపలి పొరలు ఈ తేమకు ప్రభావితం అవుతాయి. ఫలి తంగా ఊపిరి తీసుకోవటం కష్టం అవుతుంది. కొన్ని సార్లు సమస్య వెంటనే, మరికొన్ని సార్లు అర్ధరాత్రి దాటాక సమస్య బయట పడవచ్చు.

ముఖ సౌందర్యానికి ముప్పు..!
చలికాలంలో చర్మానికి సమస్యలు తలెత్తుతాయి. ముఖం, మెడ, చెవులు, చేతులు వంటి భాగాల్లో చర్మం పొడిగా అవుతుంది. పెదవులు పగలటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలను నివారించటానికి కోల్డు లోషను వాడటం తప్పనిసరి. నాణ్యత లేని లోషనులను వాడితే బయట దుమ్ము... ఈ క్రీము వలన చర్మానికి అంటుకొని మరింత చేటు తెస్తాయి. శీతాకాలం లో ఏర్పడే సమస్యలు వచ్చాక బాధ పడేకంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. చాలా సమస్యలకు చలిగాలులే కారణం. సాధ్యమై నంత వరకు చలిగాలులు వీచేటప్పుడు బయటకు వెళ్ల కుండా ఉండటం మేలు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాత్రం స్కార్ఫు, స్వెటరులు ధరించాలి. అరచేతులు, అరికాళ్లకు తొడుగులు వేసుకోవాలి. నడక తేలిక పాటి వ్యాయామం తప్పనిసరి అని ఈ పరిశోధనలు నిర్ధారించాయి. తాజా గాలి, వ్యాయామంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నాయి.

ఒత్తిడి నిరోధించటం ముఖ్యం..!
అనారోగ్యానికి ఒతిడికి సంబంధం ఏమిటని చాలా మంది అనుకొంటారు. శరీరంపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు టెన్షన్లు చుట్టుముట్టినప్పుడు గ్లూకో కార్టికాయిడ్సు వంటి హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి వేస్తాయి. ఫలితంగా సూక్ష్మక్రిములు విజ్రంభించి రొంప, జ్వరం వంటి వ్యాధులు పేట్రేగుతాయి. ఒత్తిళ్లు లేకుండా ప్రశాం తతను పాటిస్తేనే వ్యాధుల్ని నిరోధించవచ్చు.

నిద్ర పరమౌషధం..!
వినటానికి వింతగా ఉన్నా ఇది చాలా వాస్తవం. తగినంత నిద్ర లేని వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రోజుకి 7-8 గంటల నిద్ర తప్ప నిసరి అని చెబుతారు. రాత్రిళ్లు తరచు మేలుకొనే వారికి నిద్ర లేమి సమస్య ఉంటుంది. చక్కటి నిద్ర తో జీవన క్రియలు సజావుగా జరిగి వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. రొంప, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు నిద్ర చాలా అవసరం. నిద్ర ద్వారా శరీరానికి తగినంత విశ్రాంతి దొరికి వ్యాధుల్నఇధిగమించటానికి వీలవుతుంది.

Courtesy with :
- చిట్టా రమాదేవి, M.S.,M.Phil.,-- హైదరాబాద్‌.@surya Telugu daily(Dec31, 2012)
  • =========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Liver Transplantation - కాలేయ మార్పిడి


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Liver Transplantation - కాలేయ మార్పిడి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



జీర్ణ వ్యవస్థ లో కాలేయం ఒక ముఖ్యమైన అవయవం. జీర్ణాశయానికి కుడి వైపున ఇది అమరి ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయటంలో కీలక పాత్ర పోషించటంతో పాటు.. ప్రోటీన్‌ సంశ్లేషణ, ఔషధ వినియోగం, మలినాల విసర్జన వంటి అనేక జీవన క్రియల్లో ఉపయోగ పడుతుంది . అందుచేత దీన్ని శరీరంలోని ఒక క్రియా అశ్వంగా చమత్కరిస్తారు. నిరంతరాయంగా పనిచేసే క్రమంలో ఇది వ్యాధి గ్రస్తమవుతుంది. ఇందుకు అనేక కార ణాల్ని గుర్తించారు. వైరల్‌ఇన్‌ఫెక్షన్‌, మద్యపానం, డ్రగ్సు తీసుకోవటం, క్యాన్సర్‌, పుట్టుకతో వచ్చే లోపాలు వంటివి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. సాధారణమైన వ్యాధుల్ని మందులతో నయం చేయవచ్చు. కొన్ని సార్లు మైనర్‌ ఆపరేషన్‌ అవసరం అవుతుంది.
కానీ రోగం ముదిరితే మాత్రం కాలేయం పూర్తిగా పనికి రాని స్థితికి చేరిపోవచ్చు. అటువంటప్పుడే అసలు సమస్య ఏర్పడుతుంది. కనీసం పది శాతం పని చేసినప్పటికీ ఫర్వాలేదు. 30 శాతం పనిచేయగలిగితే కాస్తంత కుదుట పడవచ్చు. పూర్తిగా కాలేయం చెడిపోతే మాత్రం శస్త్ర చికిత్స ద్వారా మార్చటం ఒక్కటే పరిష్కారం. దీన్నే కాలేయ మార్పిడిగా చెప్పవచ్చు. తుది దశకు చేరిన కాలేయ వ్యాధుల్లో (ఈఎస్‌ఎల్‌డి) ఇది ఒక్కటే అంతిమ పరిష్కారం గా చెప్పవచ్చు. కానీ, ఈ కొత్త కాలేయాన్ని క్రత్రిమంగా తయారుచేయటం సాధ్యం కాదు. రక్తం మాదిరిగానే కాలేయాన్ని కూడా వేరే ఒక వ్యక్తి నుంచి సేకరించాల్సి ఉంటుంది. అందుచేత కాలేయం ఇచ్చే వ్యక్తిని దాతగా, తీసుకొనే వ్యక్తిని గ్రహీత గా వ్యవహరిస్తారు.

కాలేయ మార్పిడిలో సాధారణంగా మూడు రకాలు ఉంటాయి.
మ్రత దాత కాలేయ మార్పిడి (డీసీజెడ్‌ డోనార్‌ లివర్‌ ట్రాన్సు ప్లాంటేషను)
-ఈ విధానాన్ని కాడెవెరిక్‌ కాలేయ మార్పిడి అని కూడా అంటారు . మెదడు పనిచేయటం ఆగిపోయిన వ్యక్తుల్లో కొన్ని సార్లు ఊపిరితిత్తులు, గుండె వంటి అవ యవాలు పనిచేయవచ్చు. సాధారణంగా ఊపిరి ఆగిపోయి, గుండె కొట్టుకోవటం నిలిచిపోతేనే ఒక వ్యక్తి చనిపోయి నట్లుగా చెబుతారు. కొన్ని సందర్భాల్లో అంటే స్ట్రోకు, కపాలంలో తీవ్ర స్రావం, ట్రామా వంటి కారణాల చేత మెదడు నిర్జీవం అయిపోతుంది. దీన్నే బ్రెయిన్‌ డెడ్‌ అని అంటారు. తర్వాత 48 లేక 72 గంటల్లో మిగిలిన అవయవాలు కూడా స్తంభించి పోతాయన్న మాట. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కోమా లోకి వెళ్లిపోవటం అంటే అది వేరే సంగతి. స్ప్రహ కోల్పోయినప్పటికీ, వారి మెదడు చక్కగా పనిచేస్తుందన్న మాట.

ఈ రెండు విషయాల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించేందుకు క్లినికల్‌, డయాగ్నస్టిక్‌ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో ఎటువంటి దుర్వినియోగం జరగకుండా చట్టాల్లో కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు ఉంది. బ్రెయిన్‌ డెడు జరిగినట్లుగా కనీసం ఇద్దరు స్వతంత్ర న్యూరాలజిస్టులు సర్టిఫికేట్లు ఇవ్వాల్సి ఉంటుంది . ఆ తర్వాత సదరు వ్యక్తి కుటుంబానికి చెందిన బాధ్యతాయుతమైన వ్యక్తి.. కాలేయ దానానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ దేహానికి నిర్ధారిత పరీక్షల్ని అత్యవసర సేవల వార్డులో జరిపించాల్సి ఉంటుంది. ఇతర దే శాల్లో అవయవాల మార్పిడికి సంబంధించిన ఏర్పాట్లు అందుబాటులో ఉంటాయి. భారత దేశంలో మాత్రం ఈ విషయంలో లోటు ఉందనే చెప్పుకోవాలి.

హైదరాబాద్‌ లోని మోహను ఫౌండేషను వంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చొరవ తీసుకొంటు న్నాయి. తప్పితే పూర్తి స్థాయిలో నిర్దిష్ట విధానం కనిపించటం లేదు. రక్తం, కాలేయ ఉప అంగాలు సక్రమంగా లేని పరిస్థితుల్లో అంటే కాన్సరు వంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్న పరిస్థితులు కాలేయ మార్పిడికి అనుకూలం కాదనే గుర్తుంచుకోవాలి.

సన్నిహితుల నుంచి సేకరించటం (లివింగ్‌ రిలేటడ్‌ లివర్‌ ట్రాన్సుప్లాంటేషన్‌)
ఇటువంటి కేసుల్లో కుటుంబ సభ్యులు లేదా దగ్గర సన్నిహితుల నుంచి కాలేయాన్ని సేకరిస్తారు. తూర్పు దేశాల్లో ఈ విధానాన్ని ఎక్కువగా గమనించవచ్చు. ఈ ప్రాంతాల్లో సన్నిహితులు చనిపోతే వారి అవయవాల దానానికి కుటుంబసభ్యులు సాధారణంగా అంగీకరించరు. అదే సమయంలో కుటుంబ సభ్యుల కోసం ప్రధాన మైన అవయవాన్ని దానం చేయటాన్ని గొప్ప గా భావిస్తారు. దీన్ని అంతా ఆదర్శనీయమైన విషయంగా చెబుతారు. కాల క్రమేణా.. ఇటువంటి శస్త్ర చికిత్సలు బాగా మెరుగ్గా జరుగుతున్నాయి.దాతలకు ఎటువంటి అపాయం లేకుండా శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయి. చాలా తక్కువ సంక్లిష్టత తోనే ఈ శస్త్ర చికిత్సలు ప్రస్తుతం చేయగలుగుతున్నారు. కాలేయాన్ని దానం చేసిన దాతలో కొన్ని నెలల వ్యవధిలోనే.. కాలేయం సాధారణస్థితికి చేరుకోగలుగుతుంది.

కొన్ని వారాల వ్యవధిలోనే తమ పనులు తాము చేసుకోగలుగుతారు. చట్ట ప్రకారం కుటుంబంలోని సన్ని హితుల దగ్గర నుంచి మాత్రమే అంటే రక్త సంబంధీకుల నుంచి మాత్రమే సేకరించాల్సి ఉంటుంది.కాలేయాన్ని గ్రహీత శరీరంలో అమర్చాక..అది అక్కడ నెమ్మదిగా ఇమిడిపోతుంది. ఇతర అవయవాల నుంచి సహాయం తీసుకొని కుదురుకొంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా తన విధులు నిర్వర్తించటం ప్రారంభిస్తుంది. ఇందుకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుంది. సాధారణంగా శరీరంలోకి ఇతర జీవ అంగాలు ప్రవేశిస్తే .. దేహం దాన్ని తిరస్కరిస్తుంది. ఇటువంటి పరిస్థితి చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇమ్యునో సప్రెస్సివ్‌ మందులు వాడాల్సి ఉంటుంది. తక్కువ ఇమ్యూనోజెనిక్‌ సామర్థ్యం గల అవయవంగా కాలేయాన్ని చెబుతారు. అందుచేత ఎక్కువకాలం ఈ మందుల్ని వాడుతున్నా...

-చౌకగానే సాధ్యం అని గుర్తు ఎరగాలి. ఇటువంటి శస్త్ర చికిత్సల్లో తరచుగా వచ్చే సైడ్‌ ఎఫెక్ట గా ఇన్‌ ఫెక్షన్‌ ను చెబుతారు. అందుచేత కాలేయ మార్పిడి కి ముందే వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ ఫెక్షన్‌ సోకకుండా టీకాల్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కాలేయ మార్పిడి ఆపరేషన్‌ ల విజయవంతం అవుతున్నట్లుగా అర్థం అవుతోంది. అయితే ఇటువంటి రోగులు మాత్రం జీవితాంతం అవసరం అయినప్పుడల్లా వైద్య సాయం తీసుకొంటుండాలి. మొత్తం మీద కాలేయ మార్పిడికి సంబంధించిన అవగాహన సమాజం లో బాగా పెరగాల్సి ఉంది. కాలేయ వ్యాధుల చికిత్సలో అనేక మెడికల్‌, సర్జికల్‌ విధానాలు ఉన్నాయని గుర్తించాలి. వీటిలో కాలేయ మార్పిడి కీలకమైందని తెలుసు కోవాలి.

దీనిపట్ల ఉన్న అపోహలు తొలగించాల్సి ఉంది. మరణం తర్వాత అవయవాలు దానం చేసే కల్చర్‌పెరగాలి. ఇందుకు స్వచ్చం దంగా ముందుకు రావాలి. అదే సమ యంలో సరైన చట్టాలు చేయటం ద్వారా ప్రభుత్వాలు కూడా ఇందుకు అనుమతించాలి. సుదీర్ఘ రోగాల్ని నయం చేసే క్రమంలో అవయవ మార్పిడి అనేది ఒక సమర్థమైన విధానంగా ప్రభుత్వాలు ప్రాచుర్యం లోకి తీసుకొని రావాలి.

హృదయ స్పందన లేని దాతలు
( నాన్‌ హార్టు బీటింగ్‌ డోనార్సు)
పూర్తిగా చనిపోయిన వ్యక్తుల నుంచి (అంటే గుండె, మెదడు, ఊపిరితిత్తులు వంటి ప్రధానాంగాలన్నీ నిర్జీవం అయిపోయిన స్థితి) కాలేయాన్ని సేకరించ టం అన్నమాట. ఇటువంటప్పుడు చనిపోయన వెంట నే అంటే దాదాపు 20 నిముషాల్లోపే అవయవాన్ని సేకరించాలి. వెంటనే ఆ అవయవాన్ని భద్రపరచగలగాలి. స్పెయిన్‌వంటి దేశాల్లో మనిషి చనిపోతే, సదరు వ్యక్తి అవయవాలన్నీ జాతీయ సంపద గా మారిపోతాయి. మరణాన్ని వైద్యులు ధ్రవీకరించని వెంటనే ఆపరేషన్‌ థియోటర్‌ కు తరలించి సదరు అవయవాలన్నీ సేకరించటం చక చకా జరిగిపోతాయి. ఇతర దేశాల్లో మాత్రం చట్ట బద్దమైన విధానాల ద్వారా అంటే సాధికారిక వ్యక్తుల సమ్మతి తో మాత్రమే అవయవాల్ని సేకరించే వీలుంటుంది.

--Courtesy with - డా ఆర్‌ వి రాఘవేంద్ర రావు,--M.S., M.Ch., (sgpgi)F.H.P.B., F.L.T.,(snuh)
సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ మరియు లివర్‌ట్రాన్సుప్లాంటు సర్జన్‌--హైదరాబాద్‌ @Surya Telugu daily news paper.

  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, 8 January 2013

piles problem in pregnant - గర్భిణుల్ని బాధించే పైల్స్‌

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -piles problem in pregnant - గర్భిణుల్ని బాధించే పైల్స్‌-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పైల్స్‌ సమస్య స్త్రీలల్లో గర్భం దాల్చిన తరువాత ఎక్కువగా కనిపిస్తుంది. గర్భం దాల్చాక ముందు లేని సమస్యలు గర్భం దాల్చిన తరువాత రావటానికి గల కారణం హార్మోనుల ప్రభావం పెరుగుట, గర్భాశయం పరిమాణం పెరగడమే. గర్భిణీల్లో సాధారణంగా ప్రొజెస్టోజెన్‌ హార్మోన్‌ ఎక్కు వగా ఉండి శరీరంలోని రక్తనాళాలు కొద్దిగా వ్యాకో చం చెంది ఉంటాయి. ఇలాగే మల ద్వారం వద్ద ఉన్న రక్త నాళాల పరిమాణం పెరిగి అవి ఉబ్బినట్లు అయి పైల్‌ (మొలలు)కు దారి తీస్తుంది. గర్భిణిల్లో గర్భాశయం పరి మాణం పెరుగుటవలన అంతర్గత వత్తిడి మూలాన మలబద్ధకం ఏర్పడుతుంది. దీంతో మల విసర్జనకు బలవంతగా ప్రయత్నం చేయట వలన కూడ పైల్స్‌ సమస్య ఉత్పన్నమౌతుంది. ఇంతగా బాధించే పైల్స్‌ సమస్యను బయటకు చెప్పకోలేక చాలా మంది లోలోన మదన పడుతుంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఫైల్స్ (హీమరామడ్స్‌)లను సాధారణంగా అర్షమొలలు అంటారు. పైల్‌ అంటె గడ్డ అని హీమరాయిడ్‌ అంటే రక్త స్రావం కావడం అని అర్ధం. మొలలు చూడటానికి పిలకలుగా కనపడినా రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలం ద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చి నట్లుగా కనిపిస్తాయి.

లక్షణాలు : మల విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి, మంట ఉంటాయి. అప్పుడప్పుడు రకతం పడుతూ ఉంటుంది. మలవిసర్జన అనంతరంకూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జ సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.

జాగ్రత్తలు:
 పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4 నుంచి 5 లీటర్లు)
రోజు మల విసర్జన సాఫీగా జరుగునట్లు చూసుకోవాలి.
ఫాస్ట్‌ ఫైడ్స్‌ వేపుల్లు, మాంసాహరం, చిరుతిళ్ళు  తినటం మానుకోవాలి.
సాత్విక ఆహారం తీసుకోవాలి.

ట్రీట్మెంట్ :

    pilex మాత్రలు రోజుకు ౩ చొప్పున్న ౩ మాసాలు వాడాలి ,
    Dobesil మాత్రలు (Diasmin) రోజుకి 2 చొప్పున్న 15 రోజులు వాడాలి ,
    Duolaxin or  Smulax or  gutfree  ద్రావకం (టానిక్) విరోచనం సాఫీగా అవడానికి నోటి ద్వారా తీసుకోవాలి ,
    Hedensa or pilex  ఆయింట్మెంట్ మలద్వారం లో రాయాలి

ఈ సమస్య రాకుండా .. వచ్చాకా తీసుకోవలసిన జాగ్రత్తలు >

ఆహారపరం గా :

    నూనెలో వేయించిన మాంసము , పిండివంటలు , బిర్యాని , ఆలుగడ్డ , చామగడ్డ ,వంటివి తరచూ తింటున్నపుడు సమస్య తీవ్రమవుతుంది . ఉప్పు , పులుపు , నిల్వ పచ్చళ్లు , కారము ,ఆవాలు అధికం గా తీసునే వారికి ఈసమస్య ఎక్కువవుతుంది .

    పొడిగా ఉండే ఆహారమే తీసుకుని  పీచు పదార్దాలు తినని వారికి ఫైల్స్ వచ్చే అవకాసము ఉంది. నీరు తక్కువ , ఎండు ఆకుకూరలు లను ఎక్కువగా తీసుకోవడం , పదే పదే కాఫీ , టీ అధికం గా సేవించడం కుడా ఈ సమస్యకుదారితీస్తుంది.

    గర్భస్రావము జరిగునపుడు , విషమ ప్రసవము వల్ల మహిళలకు ఫైల్స్ రావడానికి అవకాశముంది . అధిక వేడి ప్రదేశం లో పనిచేసేవారు , దృఢమైన ఆసనం పై కూర్చునే వారు , ఎక్కువ ప్రయాణాలు చేస్తూ సరైన ఆహారం తీసుకొని వారు వాటి బారిన పడతారు . అలాగే మానసిక ఒత్తిడి అధికం గా ఉన్న వారికి ఇవి వచ్చే సూచనలు ఎక్కువ .

ఆహార నియమాలు :

    మొలలతో బాధపడే వారు మలబద్దకం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడం అన్నిటికంటే ప్రధానం . రోజు ఆహారంలో పీచుపదార్దము ఎక్కువగా ఉండే బీరకాయ , ఆనప , పొట్ల , కంద , బచ్చలివంటివి ఉండేలా చూసుకోవాలి .
 
 కొబ్బరి నీళ్లు , సుగందిపాలు , వట్టివేళ్ళు తీసుకోవడం వల్ల వంటికి చలవ . మెత్తటి పరుపుమీద కూర్చోవడం , వేడినీళ్ళతో తొట్టి స్నానం చేయడం వల్ల కొంతవరకు బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది .
    వ్యాయామం ఎక్కువగా చేయడం , రాత్రిపూట ఆలస్యం గా నిద్రించటం వంటి అలవాట్లు మానుకోవాలి .
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Gastritis - గ్యాస్ట్రిటిస్‌

  •  


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Gastritis - గ్యాస్ట్రిటిస్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

జీర్ణాశయంలో నిశ్శబ్దంగా ఉండి పొంచి ఉండే ముప్పు గ్యాస్ట్రిటిస్‌. జీర్ణాశయా నికి లోపల వైపున అనేక మ్యూకస్‌ పొరలు ఉంటారుు. వీటిలో వాపు, మంట, తాపం ఏర్పడితే దీన్ని గ్యాస్ట్రిటిస్‌ గా పరిగణిస్తారు. ఇది ముదిరితే అల్సర్‌లు, కణితిలు వంటివి ఏర్పడటంతో పాటు కొన్ని సార్లు క్యాన్సర్‌కు కారణం కావచ్చు. జీర్ణాశయ కుఢ్యం నుంచి ఎంజైము లు, ఆమ్లాలు స్రావితం అవుతాయి . ఈ కుఢ్యం లేక గోడ కు గ్యాస్ట్రిటిస్‌ కారణంగా ఇబ్బంది ఏర్పడుతుంది. దీని ఫలితంగా ఎంజైము లు, ఆమ్లాల విడుదలలో ఆలస్యం జరిగి జీర్ణప్రక్రియ కుంటు పడుతుంది. అదే సమయంలో ఇక్కడ మెుదలైన ఇన్‌ ఫెక్షన్‌ ఇతర ప్రాంతాలకు పాకుతుంది. చిన్నదిగా మెుదలై పెద్దదిగా మారటం గమనించదగిన లక్షణం. అందుచేత గ్యాస్ట్రిటిస్‌ను  ప్రాథమిక సమయంలోనే గుర్తించి చికిత్స తీసుకోవటం మేలు. లేని పక్షంలో ఈ సమస్య కారణంగా జీర్ణ కోశం లోనే కాక ఇతర ప్రాంతాల్లోని ఆరోగ్య సమస్యలకు కారణ భూతం కావచ్చు. వయస్సు మళ్లిన వారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది.

-సమస్య కొంత కాలం పాటు ఉండి తగ్గిపోతే ఎక్యుట్‌ గ్యాస్ట్రిటిస్‌అనీ, ఎక్కువ కాలం బాధిస్తుంటే క్రానిక్‌ గ్యాస్ట్రిటిస్‌ అనీ వ్యవహరిస్తారు. గ్యాస్ట్రిటిస్‌కు స్పష్టమైన లక్షణాలు లేనందున దీన్ని ప్రత్యేకంగా గుర్తించటం కష్టం. పొత్తి కడుపులో నొప్పి ద్వారా దీన్ని చెబుతారు. ఈ నొప్పి కూడా పొడుస్తున్నట్లుగా, నిలిపివేసి నట్లుగా, ఒక్క చోటే మెలిపెట్టినట్లుగా ఉంటుంది. కడుపులో కాస్త పై భాగంలో మధ్యగా ఈ నొప్పి కేంద్రీ క్రతమై ఉంటుంది. కొన్ని సార్లు ఎడమ వైపుకి విస్తరించినట్లుగా కూడా అనిపించవచ్చు. దీంతో పాటు వాంతులు, ఆకలి లేక పోవటం, బరువు  తగ్గటం వంటి లక్షణాలు తోడుగా ఉంటాయి. కొంతమందిలో నలుపు రంగులో విరోచనం కావటం, రక్తపు వాంతులు వంటి లక్షణాల్ని గమనించవచ్చు. కొంత మందిలో ఇన్‌ ఫ్లమేషన్‌ కనిపించకుండానే గ్యాస్ట్రిటిస్‌ బయట పడుతుంది. జీర్ణాశయ కుఢ్యపు అంచుల్లో ఇన్‌ ఫెక్షన్‌ సోకుతుంది. దీన్ని ఎరోసివ్‌గ్యాస్ట్రిటిస్‌ గా వ్యవహరిస్తారు. ఇది
బ్లీడింగ్‌, అల్సర్‌ లకు కారణ భూతం అవుతుంది. మొత్తం మీద కడుపు నొప్పి, వాంతులు, నొప్పితో కూడిన జ్వరం, మూత్రం, మలంలో రంగు మారటం, కడుపు నిండుగా ఉండటం వంటి  లక్షణాల్ని ప్రాథమికంగా చెబుతారు. వాంతి అయినప్పుడు రక్తం జీర కనిపించినా, మలంలో రక్తం పడుతున్నా గ్యాస్ట్రిటిస్‌ గా అనుమానించవచ్చు. ఈ లక్షణాల్ని ఒకేసారి  గమనించవచ్చు. లేదా క్రమంగా పెరుగుతూ వెళ్లవచ్చు.

గ్యాస్ట్రిటిస్‌ కు కారణాల్లో మందుల వాడకం, రసాయనాల వినియోగం, సర్జికల్‌ ఇన్‌ ఫెక్షన్‌ తో పాటు ఆల్కహాల్‌ వినియోగాన్ని చెప్పవచ్చు. మద్యం ఎక్కువగా తాగే వారిలో దీన్ని గమనించవచ్చు. మద్యం లో ఉండే ఆల్కహాల్‌.. శరీరంలోకి ప్రవేశించాక విష ఉత్పన్నకాలుగా విడిపోతుంది. ఈ విష పదార్థాలు జీర్ణాశయ పొరలపైప్రభావం చూపుతాయి. తక్కువ మోతాదులో ఆల్కహాలు చేరినప్పుడు అది హైడ్రో క్లోరిక్‌ ఆమ్ల స్రావితానికి ప్రేరేపించును అధిక మోతాదులో అయితే మాత్రం దీనికి భిన్నంగా విష పదార్థాలే నేరుగా ప్రభావితం చూపుతాయి. దీంతో పాటు ఎక్కువ కాలం ఆస్పిరిన్‌, ఐ బూప్రొఫిన్‌ వంటి మందుల్ని వాడినా కానీ సమస్య ఏర్పడవచ్చు.

హెలికోబాక్టర్‌ పైలోరి వంటి బ్యాక్టీరియాల వలన ఇన్‌ ఫెక్షన్‌ తలెత్తినప్పుడు కూడా గ్యాస్ట్రిటిస్‌కు దారి తీయవచ్చు. వాస్తవానికి ఈ బ్యాక్టీరియా చాలామంది లో దాగి ఉంటుంది. ఇన్‌ ఫెక్షన్‌ కు గురైనప్పుడు మాత్రం అనేక జీర్ణాశయ సమస్యలకు కారణం అవుతుంది. జీర్ణాశయ పొరల్లో ఉండే కణాలతో కలిసి ఈ బ్యాక్టీరియా కాలనీలుగా ఏర్పడినపుడు మాత్రం గ్యాస్ట్రిటిస్‌ ఏర్పడుతుంది. అపరిశుభ్ర ప్రాంతాల్లో శానిటేషన్‌ జాగ్రత్తలు సరిగ్గా లేని కారణంగా ఒకరి నుంచి ఒకరికి ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. విష పదార్థాలు తాగినప్పుడు, పైత్య రసం వెనక్కి స్రావితం అయినపుడు, స్వయం భక్షణ (ఆటో ఇమ్యూన్‌ డిసార్డర్‌) పరిస్థితులు తలెత్తినపుడు కూడా గ్యాస్ట్రిటిస్‌ ఏర్పడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో పాటు జీర్ణాశయ గ్రంథి కణాలు ప్రత్యేక పరిస్థితుల్లో మెటా ప్లాసియా స్థితికి లోనవుతాయి. అంటే తిరిగి మార్పు చెందలేని రీతిలో ఆ కణాలు రూపాంతరం చెందుతాయి. అప్పుడు జీర్ణాశయ గోడలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎండో స్కోపీ ద్వారా జీర్ణాశయాన్ని మొత్తంగా పరిశీలించి చూసినప్పుడు మాత్రమే గ్యాస్ట్రిటిస్‌ను గుర్తించేందుకు వీలవుతుంది. లేదా బయోప్సీ ద్వారా పరిశీలించవచ్చు. ఎక్సురే పరీక్ష ద్వారా కడుపులోని ఇన్‌ ఫెక్షన్‌ ను శోధిస్తారు. రక్త పరీక్ష చేసి రక్త కణాల సంఖ్యను చూడటంతో పాటు రక్తం లో పైలోరీ బ్యాక్టీరియా ఉన్నదీ లేనిదీ గమనించవచ్చు. ఎనీమియా, బ్లీడింగ్‌ కండీషన్‌ ను నిర్ధారించుకొనేందుకు సైతం రక్త పరీక్ష అవసరం. మూత్ర పరీక్ష, మల పరీ ల ద్వారా కూడా ఇన్‌ ఫెక్షన్‌ను నిర్ధారించుకోవచ్చు. వీటి ఆధారంగా గ్యాస్ట్రిటిస్‌ ను గమనించవచ్చు.

చికిత్స

సాధారణంగా గ్యాస్ట్రిటిస్‌ చికిత్సలో సమస్య ఏ కారణంగా ఉద్భవించిందో గమనించి దీనికి తగినట్లుగా చికిత్స చేయిస్తారు. ఐ బూ ప్రొఫిన్‌, ఆస్ప్రిన్‌ వంటి మాత్రల వినియోగాన్ని నిలిపివేయమని సూచిస్తారు. రాంటి డిన్‌, ఫెమటిడిన్‌ వంటి మందులు జీర్ణాశయంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి వేస్తాయి. ఒమెప్రజోల్‌, లాన్సో ప్రజోల్‌, పెంటాప్రజోల్‌, రాబెప్రజోల్‌ వంటి ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటర్సు లను అవసరానికి అనుగుణంగా వైద్యులు సూచిస్తారు. పైలోరి బ్యాక్టీరియా ను గుర్తించినట్లయితే ఈ మందులతో పాటు ఆమాక్సిలిన్‌, క్లారిత్రో మైసిన్‌వంటి
యాంటి బ్యాక్టిరియాలను లుపుతుంటారు. గ్యాస్ట్రిటిస్‌ సమస్య చిన్నదిగా కనిపించినా, దీని నుంచి ఉద్భవించేఇతర సమస్యలు బలమైనవి కావటంతో ప్రాథమికస్థాయిలోనే చికిత్స తీసుకొంటే మేలు.

Courtesy with : డా ఆర్‌ వి రాఘవేంద్ర రావు,--సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ మరియు లివర్‌ట్రాన్సుప్లాంటు సర్జన్‌-హైదరాబాద్‌@Surya Telugu daily-Jan-7-2013

  •  ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, 7 January 2013

Rhematoid Arthritis-రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్(కీళ్లవాతం)

  •  
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEif7TFzWXt1dCOn1Z-qfxtXlRlQo0prdw-FslOGHIMg4c4Xxx98kfDcMnwNHOteRHbXV2qTWcmDBnyYnDXEjRo2rUdhto28nEza9aI-omILgYazXFQAvt1IO-OseF8xYJUE84LKsPT5TR4/s1600/Arthritis.jpg

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Rhematoid Arthritis-రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్(కీళ్లవాతం) - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మన ప్రతి కదలికకూ కీలే.. కీలకం! జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే... మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. అది వేళ్ల జాయింట్లు కావచ్చు, మణికట్టు జాయింట్లు కావచ్చు.. భుజం జాయింట్లు కావచ్చు.. మోకాలి కీళ్లు కావచ్చు.. చివరికి పాదాల, వేళ్ల జాయింట్లు కావచ్చు.. దేనికైనా.. ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించటం మొదలుపెడితే..? కాలు కదపాలంటే కష్టం. చేయి మెదపాలంటే కష్టం. సంకెళ్లు వేసినట్టు.. జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం!  ఈ కీళ్లకు వచ్చే అతి పెద్ద సమస్య ఆర్త్థ్రెటిస్‌! అంటే కీలు లోపలంతా వాచిపోయి.. కదపాలంటేనే తీవ్రమైన నొప్పి, బాధతో.. జాయింటులో ఓ విపత్తు తలెత్తటమన్న మాట.
కీళ్ల వాపుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి .

  • ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌--కీలు అరిగిపోవటం వల్ల రావచ్చు.ఇప్పుడు ఎక్కువ మంది అనుభవిస్తున్న మోకాళ్ల నొప్పుల బాధ ,
  • ఇన్ఫెక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌--ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్‌ తలెత్తి అది కీలుకు చేరటం వల్ల కీళ్లనొప్పి రావచ్చు. దీన్ని ఇన్ఫెక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు.
  • సొరియాటిక్‌ ఆర్త్థ్రెటిస్‌--సొరియాసిస్‌ వంటి చర్మ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపు, నొప్పి పలకరించవచ్చు. దాన్ని సొరియాటిక్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు.
  • రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌---మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నీళ్ల విరేచనాల వంటి ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా కీళ్ల వాపు రావచ్చు.దాన్ని రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు.
  • వైరల్‌ రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌---చికున్‌గన్యా వంటి వైరల్‌ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపులు రావచ్చు, వీటిని వైరల్‌ రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు.
  • రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌! కీళ్లవాతం--స్పష్టమైన కారణమేదీ తెలియకుండానే ఆరంభమయ్యే అతి పెద్ద  కీళ్ల నొప్పులు సమస్య.

రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్(కీళ్లవాతం) :

ఇది ఎవరికి, ఎందుకు వస్తుందో స్పష్టమైన కారణం ఇప్పటి వరకూ తెలియదు. కానీ ప్రతి వంద మందిలో ఒకరిని వేధిస్తోంది. ఒకసారి దీని బారిన పడ్డారంటే.. కీళ్లు ఎర్రగా వాచిపోతాయి. ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు. తీవ్రమైన నొప్పితో జీవితం నరక ప్రాయమవుతుంది. పైగా వేళ్లు, మణికట్టు వంటి చిన్న జాయింట్లను ఎక్కువగా పట్టి పీడించే ఈ కీళ్లవాతం.. దీర్ఘకాలం ఉండిపోయే సమస్య! దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్రా అవయవాలూ ప్రభావితమై పరిస్థితి మరింత విషమిస్తుంది. అదృష్టవశాత్తూ- దీన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకువచ్చి.. తిరిగి హాయిగా జీవితం గడిపేలా తోడ్పాటునిచ్చే అత్యాధునిక చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

   

మన శరీరంలో ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంది. దీని పేరు 'రోగ నిరోధక వ్యవస్థ'. మనం వ్యాధుల బారినపడకుండా.. ఎటువంటి సూక్ష్మక్రిములూ మనపై దాడి చెయ్యకుండా నిరంతరం పహారా కాస్తుందీ వ్యవస్థ. రేయింబవళ్లు ఈ బాధ్యతలను ఇది అద్భుతంగా నిర్వర్తిస్తుంటుంది. కానీ.. ఒక్కోసారి ఇది పొరబడుతుంది! ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో తెలుసుకోలేని సందిగ్ధంలో పడిపోతూ.. ఏకంగా మన శరీర భాగాల మీదే దాడి చేసేస్తుంది. ఫలితమే రకరకాల 'ఆటో ఇమ్యూన్‌' సమస్యలు. కీళ్లవాతం.. రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ కూడా ఇలా తలెత్తే సమస్యే!

ఇది మన కీళ్లలో ఎముకల మధ్య ఉండే మృదువైన 'సైనోవియం' పొరను చూసి.. దాన్ని హానికారక శత్రువుగా పొరబడి... దానిపై దాడి చేసి దెబ్బతీయటం ఆరంభిస్తుంది. దీంతో కీళ్లు ఎర్రగా వాచిపోవటం, నొప్పుల వంటి బాధలన్నీ ఆరంభమవుతాయి. అయితే ఇది ఎందుకిలా ప్రవర్తిస్తుందో.. ఎవరిలో ఇటువంటి సమస్యలు తెచ్చిపెడుతుందో చెప్పటం కష్టం. ఇప్పుడిప్పుడే దీని వెనక ఉన్న జన్యుపరమైన, జీవనశైలీ పరమైన కారణాలను అర్థం చేసుకుంటున్నారు. మొత్తానికి దీన్ని ఎంత త్వరగా.. వీలైతే ముందుగానే గుర్తించి వెంటనే చికిత్స ఆరంభిస్తే కీళ్లు దెబ్బతినకుండా రక్షించుకోవటం, సాధారణ జీవితం గడపటం సాధ్యమవుతుంది.

నిర్ధారణ ఎలా?
రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ విషయంలో రక్త పరీక్షల వంటివాటి కంటే కూడా వైద్యుల విచక్షణకే ప్రాధాన్యత ఎక్కువ. లక్షణాల తీరు, కొన్ని పరీక్షల సహాయంతో వైద్యులే కచ్చితంగా నిర్ధారిస్తారు.

* రక్తపరీక్ష: రక్తంలో రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ (ఆర్‌ఏ ఫ్యాక్టర్‌) ఎలా ఉందో చూస్తారు. ఆరంభ దశలో ఇది 75% మందిలో పాజిటివ్‌గా ఉంటుంది. నెగిటివ్‌గా వచ్చినవారికి కొన్నాళ్ల తర్వాత మళ్లీ రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది.
* సీసీపీ యాంటీబాడీస్‌: వ్యాధి లక్షణాలు స్పష్టంగానే కనబడుతున్నా రక్తంలో 'ఆర్‌ఏ ఫ్యాక్టర్‌' నెగిటివ్‌ ఉన్న వారికి ఈ పరీక్ష అవసరం. ఇది పాజిటివ్‌ వస్తే కీళ్లవాతం ఉన్నట్టు బలంగా భావించాల్సి ఉంటుంది.
* ఈఎస్‌ఆర్‌, సీఆర్‌పీ: ఇవి కీళ్లవాతం బాధితుల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. హెమోగ్లోబిన్‌ తక్కువ ఉండొచ్చు.
* వీటికి తోడు వాచిన కీళ్లకు ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ వంటివీ వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడతాయి.

నాలుగంచెల మందులు
కీళ్లవాతానికి చికిత్స లేదని, ఒకసారి వచ్చిందంటే జీవితాంతం బాధలు పడాల్సిందేనని చాలామంది అపోహపడుతున్నారు. కానీ దీనికి సమర్థమైన చికిత్స ఉంది. దీనికి ఇచ్చే మందులను నాలుగు రకాలుగా విభజించొచ్చు.

1. నొప్పి నివారిణి మందులు: 'నాన్‌ స్టిరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ' రకం నొప్పి నివారణ మందుల్లో బ్రూఫెన్‌, నేప్రోసిన్‌, నిముసులైడ్‌, ఓవరాన్‌ వంటివి కొంచెం ఎక్కువ ప్రభావంతో పనిచేస్తాయి. ప్యారాసిటమాల్‌, ట్రెమడాల్‌ వంటివి తక్కువ ప్రభావం గలవి. వీటిని ముందుగా సిఫార్సు చేస్తారు. వీటితో పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు.

2. కార్టికో స్టిరాయిడ్స్‌: ఇవి నొప్పి తీవ్రతను తగ్గించటంలో బాగా తోడ్పడతాయి. వీటిని చాలా పరిమిత కాలానికే (అంటే కీళ్లవాతం తగ్గేందుకు ఇచ్చే దీర్ఘకాలిక మందుల ప్రభావం మొదలయ్యే వరకూ) ఇస్తారు. ఎక్కువ రోజులు వాడితే వీటితో దుష్ప్రభావాలుంటాయి గనక వీటిని తక్కువ మోతాదులో రెండు మూణ్నెల్లు మాత్రమే సిఫార్సు చేస్తారు.

3. వ్యాధి నియంత్రణ మందులు: 'డిసీజ్‌ మోడిఫైయింగ్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌'గా పిలిచే ఈ మందుల్లో ముఖ్యమైనది- 'మిథోట్రెక్సేట్‌'. ఇది వాస్తవానికి క్యాన్సర్‌కు వాడే మందు కావటంతో దీనిపై ఎన్నో అపోహలున్నాయి. కానీ.. ఇది కీళ్లవాతం చికిత్సల్లో బాగా పనికొస్తుంది. క్యాన్సర్‌ బాధితులకు దీన్ని పెద్దమోతాదులో ఇస్తే వీరికి చాలా స్పల్ప మోతాదుల్లో, అదీ వారానికి ఒకసారి మాత్రమే ఇస్తారు. వైద్యుల పర్యవేక్షణలో మెథోట్రెక్సేట్‌ను జాగ్రత్తగా వాడితే ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు.

* సల్ఫాసలజైన్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, లిఫ్లునోమైడ్‌, ఎజెతోయాప్రిన్‌ వంటివి కూడా కీళ్లవాతం చికిత్సలో ఉపయోగపడతాయి.

* ఈ మందులు వాడేటప్పుడు పరిస్థితి మెరుగవుతోందా? లేదా? దుష్పరిణామాలేమైనా ఉన్నాయా? అన్నది వైద్యులు పరీక్షిస్తుంటారు. సాధారణంగా 4-6 నెలల్లో వ్యాధి చాలావరకూ నిదానిస్తుంది.

* కీళ్లవాతం ఎలా తగ్గుముఖం పడుతోందన్నది ఎప్పటికప్పుడు 'డాస్‌ 28 స్కోర్‌' ఆధారంగానూ, ఈఎస్‌ఆర్‌, 'పేషెంట్‌ జనరల్‌ గ్లోబల్‌ స్కోర్‌' ఆధారంగా తరచూ అంచనా వేస్తుంటారు.

4. బయోలాజికల్స్‌ చికిత్స: కొత్తతరం ఖరీదైన మందులివి. ఎంబ్రెల్‌, రెమికేడ్‌, ఒరన్షియా, రిటుక్సిమబ్‌ వంటి ఈ బయోలాజికల్‌ మందులను ఇంజక్షన్‌ రూపంలో చర్మం కిందకు గానీ, రక్తనాళంలోకి గానీ ఇస్తారు. దీంతో సమస్య నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. ఫలితాలు చాలా బాగుంటాయి. గానీ వీటికి అయ్యే ఖరీదు చాలా ఎక్కువ. ఒకవేళ వీటిని వాడాక కొన్నాళ్ల తర్వాత వ్యాధి తిరిగి విజృంభిస్తే మళ్లీ 'డిసీజ్‌ మోడిఫికేషన్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌'తో చికిత్స చేస్తారు.
కీళ్లవాతం అంతా ప్రత్యేకమే

* సాధారణంగా ఇతరత్రా కీళ్ల నొప్పులైతే శరీరంలోని ఏదో ఒకవైపు కీలుకు మాత్రమే వస్తాయి. కానీ రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌లో- ఒకేసారి రెండు వైపులా వాపు కనిపిస్తుంది. అంటే ఉదాహరణకు కుడి చేతి వేలి కీళ్లు వాస్తే, ఎడమచేతి వేలి కీళ్లు కూడా వాస్తుంటాయి. కుడి మణికట్టు కీలు వాస్తే, ఎడమ మణికట్టు కీలూ వాస్తుంది. అలాగే ఈ వాపు ఏకకాలంలో శరీరంలోని చాలా కీళ్లకూ రావచ్చు.

* కీళ్లవాతం ఏ వయసు వారికైనా రావచ్చుగానీ సాధారణంగా పెద్దవారిలోనే.. అదీ 30-60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా- ఇది మహిళల్లో ఎక్కువ. ప్రతి నలుగురు కీళ్లవాతం బాధితుల్లో ముగ్గురు మహిళలే ఉంటున్నారు.

* కీళ్లవాతం.. సాధారణంగా శరీరంలోని చిన్న కీళ్లతో మొదలవుతుంది.అంటే చేతివేళ్లు, మణికట్టు, కాలివేళ్ల వంటి వాటితో ఆరంభమై క్రమేపీమోకాలు, తుంటి వంటి పెద్ద జాయింట్లకూ రావచ్చు. వాపు, నొప్పి వంటివన్నీ చిన్న జాయింట్లతో ఆరంభం కావటం దీని ప్రత్యేక లక్షణం. (అదే కీళ్లు అరిగిపోవటం వల్ల వచ్చే ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌ సాధారణంగా మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లతో మొదలవుతుంది)

* కీళ్లవాతం కొంతకాలం ఉద్ధృతంగా ఊపేస్తుంది. బాధలు తీవ్రతరమవుతాయి. మరికొంత కాలం నెమ్మదిస్తుంది. ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉండటం దీని మరో ప్రత్యేకత. మధుమేహం, హైబీపీల్లాగా ఇదీ దీర్ఘకాలిక సమస్య, దీనికి చికిత్స కూడా దీర్ఘకాలం తీసుకోవాల్సి ఉంటుంది.

* కీళ్లవాతంలో ఉదయం పూట కీళ్లు బిగుసుకుపోతుంటాయి. ఇలా కనీసం గంటకు పైగా బాధపడాల్సి ఉంటుంది. మిగతా కీళ్ల నొప్పులకూ, రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌కూ ఇదే ప్రధానమైన తేడా. అలాగే వీరిలో రాత్రి నొప్పులూ ఎక్కువ. కదులుతూ కాస్త అటూఇటూ తిరుగుతుంటే నొప్పి తగ్గినట్టుంటుంది. విశ్రాంతి తీసుకుంటే నొప్పి, బాధ ఎక్కువ అవుతాయి.
రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ దీర్ఘకాలిక సమస్య. కాబట్టి చికిత్స కూడా దీర్ఘకాలం, జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత కూడా మందులను కనీస మోతాదుల్లో దీర్ఘకాలం వాడుతుండాలి. తీవ్రత తగ్గిందని మందులు, చికిత్స పూర్తిగా మానేస్తే సమస్య మరింత ఉద్ధృతంగా ముంచుకొస్తుంది. మందులు తీసుకుంటుంటే హాయిగా సాధారణ జీవితం గడపగలుగుతారు.
రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ విషయంలో ఎటువంటి పథ్యాలూ లేవు. విటమిన్‌-సి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపల వంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది.

* వ్యాయామం కీలకం కీళ్లవాతం బాధితుల్లో చాలామంది పూర్తి విశ్రాంతిగా పడుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామం చేయకపోతే కీళ్లు గట్టిగా బిగుసుకుపోతాయి. కొన్నిసార్లు ఆపరేషన్‌ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. బాధలు ఉద్ధృతంగా ఉన్న సమయంలో మాత్రమే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మందులతో నొప్పి తగ్గాక వ్యాయామం మొదలెట్టాలి. నొప్పి తగ్గుతున్న కొద్దీ వ్యాయామం చేసే సమయాన్ని కూడా పెంచుకోవాలి. ఏరోబిక్‌, యోగా, నడక వంటి వ్యాయామాలు ఏవైనా చేయొచ్చు. బరువులు ఎత్తటం మాత్రం చేయకూడదు.

* రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ బాధితుల్లో చాలా కొద్దిమందికి మాత్రమే కీళ్ల మార్పిడి అవసరమవుతుంది. వ్యాధిని సత్వరమే గుర్తించి చికిత్స ఆరంభిస్తే ఈ కీళ్ల మార్పిడి అవసరం అంతగా రాదు. చిన్న కీళ్లకు ఈ మార్పిడి అవకాశమూ ఉండదు. అందుకే మందులతో చికిత్సకే ప్రాధాన్యం ఇస్తారు.

* లైంగిక జీవితంపై ఎటువంటి ప్రభావం ఉండదు. మందులు వాడుకుంటూ పూర్తి సాధారణ జీవితం గడపొచ్చు. కాకపోతే 'మిథోట్రెక్సేట్‌' తరహా మందులు వాడుతున్నప్పుడు గర్భం మాత్రం ధరించకూడదు. ఆ మందు ఆపేసిన తర్వాత.. 3 నెలలు ఆగి అప్పుడు మాత్రమే గర్భధారణకు ప్రయత్నించాలి. అవసరమైతే గర్భిణీ సమయంలో తక్కువ డోసులో స్టిరాయిడ్లు వాడొచ్చు.
కీళ్లవాతం లక్షణాలేమిటి?
* జాయింట్లు ఎర్రగా వాచిపోయి నొప్పి
* ముట్టుకుని చూస్తే వేడిగా ఉండటం
* కీలు కదలికలు కష్టంగా తయారవటం
* ఉదయం లేస్తూనే కీళ్ల కదలికలు బాధాకరంగా ఉండటం
* ఈ లక్షణాల తీవ్రత ఎప్పుడూ ఒకే తీరులో కాకుండా పెరుగుతూ తగ్గుతూ ఉండొచ్చు.

వీటికి తోడు...
* చాలామందిలో రక్తహీనత
* ఆకలి సరిగా లేకపోవటం
* నిస్సత్తువ, బరువు తగ్గిపోతుండటం
* బాధలు ఉద్ధృతంగా ఉన్నప్పుడు కొద్దిపాటి జ్వరం
* మోచేయి, మణికట్టు ప్రాంతంలో చిన్న బుడిపెలు (రుమటాయిడ్‌ నాడ్యూల్స్‌) ఉండొచ్చు. ఇవి ఉన్న వారిలో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
* ఎక్కువ కీళ్లు వాచటం, రెండు వైపులా ఒకే రకం కీళ్లు ప్రభావితం కావటం, నొప్పి.. ఈ లక్షణాలు 6 వారాల కన్నా ఎక్కువకాలం ఉంటే దాన్ని కీళ్లవాతం అని అనుమానించాలి.

వదిలేస్తే... విష వలయం!
కీళ్లవాతాన్ని అరుదైన సమస్యగా భావిస్తుంటారు గానీ ఇది చాలామందిలో కనిపిస్తుంది. మన జనాభాలో సుమారు ఒక శాతం మంది దీంతో బాధపడుతున్నారు. కానీ చాలామంది దాన్ని కీళ్లవాతంగా గుర్తించలేక.. ఏదో మామూలు కీళ్లనొప్పులేనని భావిస్తూ.. సమస్య ముదిరిపోయే వరకూ తాత్సారం చేస్తున్నారు. దీన్ని సత్వరం గుర్తించి చికిత్స చేయటం ఎంతో అవసరం. లేకపోతే పరిస్థితి ప్రాణాంతక సమస్యలకూ దారి తీస్తుంది.

* కీళ్లవాతం వచ్చిన తొలిదశలో కీళ్ల మీది పైపొర మాత్రమే దెబ్బతింటుంది. వ్యాధి ముదురుతున్నకొద్దీ క్రమేపీ అది కీళ్లను, లోపలి ఎముకలను కొరికేస్తుంది. ఇంకా తీవ్రమైతే కీళ్ల మధ్య ఖాళీ తగ్గిపోతుంది. దీంతో ఎముకల రాపిడి కారణంగా నొప్పి వస్తుంది. కొన్నాళ్లకు కీళ్లు మొత్తం దెబ్బతింటాయి.

* రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులు ముంచుకొచ్చే అవకాశమూ ఎక్కువే. కీళ్లవాతాన్ని సరిగా నియంత్రించుకోకపోతే- వీరిలో గుండె జబ్బులు, పక్షవాతం వంటివి పదేళ్ల ముందుగానే వచ్చే ప్రమాదం ఉంది. కళ్లు పొడిబారటం, లాలాజలం తగ్గిపోవటంతో పాటు గుండె చుట్టూ, వూపిరితిత్తుల చుట్టూ నీరు చేరటం వంటి ఇబ్బందులూ ఎదురవ్వచ్చు. కీళ్లవాతాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకుంటే ఈ దుష్ప్రభావాల బెడద ఉండదు. లాలాజల గ్రంథులు దెబ్బతింటే నోరు ఎండిపోతుంది. దీంతో పిప్పిపళ్లు వచ్చి, త్వరగా దంతాలు వూడిపోతాయి. నాడుల చుట్టూ ఉండే రక్తనాళాలు దెబ్బతినటం వల్ల కాళ్లల్లో తిమ్మిరి, స్పర్శ తగ్గిపోవటం వంటివీ మొదలవుతాయి. చర్మం మీద పుండ్లు పడటం, నాడులు దెబ్బతిని న్యూరోపతీ రావొచ్చు.

* వ్యాధి ఉద్ధృతంగా ఉన్నప్పుడే ఇతరత్రా దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వ్యాధి ఉద్ధృతి తగ్గితే ఇతరత్రా దుష్ప్రభావాలు వచ్చే అవకాశం పెద్దగా ఉండదు. అందుకే వీడకుండా చికిత్స, క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం.. ఉత్తమం!

Courtesy with -డా.శరత్‌చంద్రమౌళి రుమటాలజిస్ట్‌ కిమ్స్‌ హాస్పిటల్‌ సికింద్రాబాద్‌ @ఈనాడు సుఖీభవ

  • ==========================
 Visit my website - > Dr.Seshagirirao.com/