Monday, 7 May 2012

Difference between Gastric Ulcer and Gastric Cancer,గ్యాస్ట్రిక్ అల్సర్స్ కి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తేడా.


  • image : Courtesy with http://gastriculcer.blogspot.in

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గ్యాస్ట్రిక్ అల్సర్స్ కి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తేడా- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-నీరు తక్కువ తాగటం వల్లనో, లేక పెరుగుతున్న మానసిక ఒత్తిడి వల్లనో ప్రతి ఒక్కరు జీవితకాలంలో ఏదో ఒక దశలో అల్సర్‌కు గురవటం సహజమే. అందుకనే విద్యార్థులలో పరీక్షలప్పుడు ఎక్కువగా నోటిపూతను గమనిస్తూ ఉంటాము. సాధారణంగా మూడు, నాలుగు రోజులలో తగ్గిపోయే అల్సర్స్ అంతకంటే ఎక్కువగా ఉండి తరచుగా బాధిస్తూ ఉంటే ఎవ్వరినైనా అనేక అనుమానాలు వేధిస్తూ ఉంటాయి. నోటి పూతతో పాటు, పెప్టిక్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఈసోఫీగల్ అల్సర్స్, కదలలేని పరిస్థితులలో మంచానికే పరిమితమైనప్పుడు ఏర్పడే పుండ్లు, సిఫిలిస్, హెర్పిస్ వంటి ఎస్‌టీడీ వల్ల, ఈస్పీ, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల జెనిటల్ అల్సర్లు, డయాబెటీస్ వల్ల కాళ్లలో వచ్చే న్యూరోపతిక్ అల్సర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అల్సర్లు, పెప్టిక్ అల్సర్లు ఎక్కువగా చూస్తూంటాము. చిన్న పేగు మెదట్లో ఉండే ఈ అల్సర్లను డుయోడినమ్ అల్సర్స్ అని కూడా అంటారు. జీర్ణవ్యవస్థలో ఎక్కువగా కనిపించే ఈ పూత చాలా తక్కువగా క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది.

జీర్ణాశయంలో వచ్చే అల్సర్లను గ్యాస్ట్రిక్ అల్సర్లు అంటారు. పెప్టిక్ అల్సర్ల కంటే ఇవి తక్కువగా కనిపించినప్పటికీ గ్యాస్ట్రిక్ అల్సర్లు క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఎక్కువ. అన్నవాహికలో అల్సర్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. నోటిపూతకు స్ట్రెస్, విటమిన్ల లోపం, బి విటమిన్ లోపిం ప్రధాన కారణమైతే జీర్ణవ్యవస్థకు సంబంధించిన మిగతా అల్సర్స్‌కు హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రధాన కారణం.

1980 వరకు అల్సర్‌కు మసాలా ఆహారం, కారం, ఒత్తిడి అనుకునే వారు, ఆల్కహాల్ వల్ల పోట్ట, పేగులకు సంబంధించిన పూతకు కారణాలు అనుకునే వారు. దాదాపు వంద సంవత్సరాల వరకు అల్సర్లకు కారణాలు అదే అనుకుని వీలైనంత వాటికి దూరంగా ఉండమని సలహాలు ఇచ్చే వారు. 1982లో టారీమార్షల్, రాబిన్ వారెన్ అనే ఇద్దరు డాక్టర్లు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అల్సర్లకు కారణం హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా అని కనుగొన్నారు. దీనికి వారికి నోబెల్ బహుమతి ప్రధానం కూడా జరిగింది. మన జనాభాలో 90 శాతం మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ బ్యాక్టీరియాకు గురవుతూ ఉంటారు. కానీ ఒత్తిడి, ఎసిడిటి, పొగతాగడం, ఆల్కహాల్ వంటి కారణాల వల్లనో లేకవారి శరీరతత్వాన్ని బట్టి జీర్ణవ్యవస్థ లైనింగ్ దెబ్బతిని ఉన్నపుడు వారికి ఈ బాక్టీరియా వల్ల అల్సర్లు ఏర్పడటం జరుగుతుంది. పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వాడే వారికి ఈ ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది. జీర్ణవ్యవస్థలో అల్సర్ ఉన్నవారికి కడుపులో నొప్పితో పాటు ఆకలి తగ్గడం, వికారం, వెక్కిళ్లు, తేన్పులు, మలంలో రక్తం పడటం, రక్తపు వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తాయి.

సాధారణంగా గ్యాస్ట్రిక్ అల్సర్లు క్యాన్సర్‌కు దారితీయవచ్చు. అయితే ఈ లక్షణాలు అల్సర్ ఏ స్థాయిలో ఉందన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. మెదటి దశలో కడుపులో మంటగా ఉండటం ఏమైనా తినగానే కొంచెం సేపు తగ్గి, తర్వాత కొద్దిసేపటికి మళ్లీ కడుపులో ఇబ్బందిగా ఉండటం జరుగవచ్చు. రెండు వారాలు యాంటి బయాటిక్ మందులు వాడటం వల్ల ఈ అల్సర్ పూర్తిగా నయమవుతుంది.

దాదాపు గ్యాస్ట్రిక్ అల్సర్స్‌లాగానే పొట్టకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. స్టమక్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం కూడా దీర్ఘకాలికంగా ఉన్న అల్సర్. అందుకే ఒకసారి అల్సర్ వచ్చి తగ్గినవారు రెండోసారి అలాంటి లక్షణాలు కనిపించినా అల్సర్‌కు వాడిన మందులు వాడి తర్వాత తగ్గటం లేరదని డాక్టర్‌ను సంప్రదించడం జరుగుతుంది. అందుకనే ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేసి అనుమానంగా ఉంటే సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ పరీక్షలు చేసి స్థాయిని నిర్థారిస్తారు. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ చికిత్స కూడా కణితి వచ్చిన ప్రదేశం, క్యాన్సర్ స్థాయి, వయసు, ఇతర ఆరోగ్యవిషయాలపై ఆధారపడి ఉంటాయి. పొట్టలో కణిత వచ్చిన ప్రదేశాన్ని బట్టి పొట్టలో కొంత భాగాన్ని తీసివేసి గ్యాస్ట్రెక్టమీ లేక పొట్టని మొత్తంగా తీసివేయటంతో పాటు చుట్టు ఉన్న లింఫ్‌నోడ్స్, చిన్న పేగులో కొంత భాగాన్ని అన్నవాహికలో కొంత భాగాన్ని తీసివేయటం జరుగుతుంది.

క్యాన్సర్‌ను కొంచెం ఆలస్యంగా గుర్తించినపుడు పొట్ట మొత్తాన్ని తీసివేసి అన్నవాహికను చిన్న పేగులతో కలిపి వేస్తారు. సర్జరీ తర్వాత ఆహారం తీసుకోలేక పోవడం, వాంతులు, వికారం, మలబద్ధకం, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సర్జరీ ముందు చేసి తర్వాత కీమో, రేడియో థెరపీలు ఇచ్చినా లేక కీమోథెరపీ, రేడియోథెరపీ తర్వాత సర్జరీ చేసినా ఈ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ విషయంలో ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఈ సర్జరీ తర్వాత సప్లిమెంట్లు, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, విటమిన్ బి12 ఇంజక్షన్ల అవసరం చాలా ఎక్కువ. పొట్టని తీసివేసినపుడు ఆహారం నేరుగా చిన్నపేగులలోకి వెళ్లటం వల్ల డంపింగ్ సిండ్రోమ్ వస్తుంది. ఆహారం తక్కువగా, ఎక్కువ సార్లు తీసుకోవడం ఆహారం ముందు తర్వాత ద్రవపదార్థాలు తీసుకోవటం వంటి అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ను మరీ లేటుగా గుర్తించడం జరిగి కణితి ఆహారం తీసుకోవడానికి అడ్డంకుగా ఉన్నపుడు, లేజర్ థెరపి, రేడియేషన్ థెరపీలలో కణితిని చిన్నగా చేసి పేగులలో స్టంట్‌ను అమరుస్తారు. మెటల్ లేక ప్లాస్టిక్‌తో తయారయిన ఈ ట్యూబ్ ద్వారా ఆహారం జీర్ణవ్యవస్థలోకి వెళుతుంది. కాని ఇలాంటి పరిస్థితులు ఏర్పడినపుడు, క్యాన్సర్ మరీ ముదిరి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెంది ఉంటుంది. అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్టమక్ క్యాన్సర్ లక్షణాలు మొదటి దశలో అంత ప్రస్ఫుటంగా ఉండవు. అనుమానించేంత స్థాయిలో లక్షణాలు బయట పడ్డాయి అంటే క్యాన్సర్ స్థాయి పెరిగిందని అనుకోవాలి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాపితంగా దాదాపు 8 లక్షల మంది ఈ క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు.

-హెలికో బ్యాక్టర్ పైలోరి బ్యాక్టీరియా దాదాపు 60 -80 శాతం వరకు ఈ క్యాన్సర్‌కు కారణం. ఇంకా స్మోకింగ్, మద్యం, జన్యుపరమైన కారణాలు దోహదపడ్తాయి. కాబట్టి అల్సర్‌కు సరియైన చికిత్సలు తీసుకోవడం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తాజాగా ఉండే ఆహారం పరిశువూభమైన నీరు తీసుకోవడంతో పాటు దురలవాట్లకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. కడుపుబ్బరం, తేన్పులు, మంట వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే ఎవరికి వారు యాంటాసిడ్లు వాడటం కాకుండా ఒకసారి డాక్టర్ సలహా మేరకు ఎండోస్కోపి చేయించుకోవడం మంచిది.

కడుపులో మంట, ఉబ్బరం, పుల్లటి తేన్పులు, అజీర్తి ఇలాంటి లక్షణాలు ఎప్పుడో ఒకప్పుడ అందరూ ఎదుర్కొనేవే అయితే ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తున్నా సరియైన పరీక్షలు, అవసరమైన మందులు వాడటం తప్పనిసరి అని అర్థం చేసుకోవడం మంచిది.


Article : Courtesy with Dr.Ch.Mohana Vamsy @NamastheTelangana.com

  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఎముకల్లో కణితులు,bone-cancer



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎముకల్లో కణితులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కణవిభజనపై అదుపు తప్పి అసాధారణంగా కణాలు పెరగడం వల్ల వాపులా కనిపించే భాగాన్నే కణితి అంటారు. ఈ కణుతులు అన్నీ క్యాన్సర్‌వే కానక్కర లేదు. కొన్ని హానికరం కానివి కూడా ఉంటాయి. వీటిని బినైన్ ట్యూమర్లు అంటారు. ఇవి ఏర్పడిన చోట మాత్రమే ఉంటాయి. ఇతర భాగాలకు వ్యాపించవు. అందుకే బినైన్ కణుతుల వల్ల ప్రమాదం ఉండదు. మాలిగ్నెంట్ ట్యూమర్లు మాత్రం ప్రమాదకరమైనవి. వీటినే క్యాన్సర్ కణుతులు అంటాం. ఈ కణుతులు అవి పుట్టిన భాగాన్ని దెబ్బతీయడమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించి అక్కడి కణాలకు కూడా హాని చేస్తాయి. తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది.మాలిగ్నెంట్ కణుతులు ఎక్కడ పుట్టాయన్నదాన్ని బట్టి క్యాన్సర్లు చాలా రకాలున్నాయి. ఉదాహరణకు సార్కోమా, కార్సినోమా, లుకేమియా. ఎముక కణజాలంలో కూడా రొమ్ములు, ప్రొస్టేట్, థైరాయిడ్, కిడ్ని, ఊపిరితిత్తుల మాదిరిగానే కణాలలో లాగే విభజన చాలా త్వరగా జరిగి త్వరగా వ్యాపిస్తుంది. ఎముకలో ఏర్పడే ట్యూమర్లు చాలా సందర్భాల్లో క్యాన్సర్ ట్యూమర్లు కాకపోవచ్చు. ఎముకలో ఏర్పడిన క్యాన్సర్ కణాలతో ఏర్పడిన ట్యూమర్లు రెండు రకాలుగా ఉంటాయి. ప్రైమరీ ట్యూమర్లు, సెకండరీ ట్యూమర్లు. ప్రైమరీ ట్యూమర్లను సార్కోమా అంటారు. సెకండరీ ట్యూమర్లు ఏర్పడడానికి ప్రత్యేకమైన కారణాలేవీ ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు.త్వరగా వ్యాప్తి చెందే కణాలతో ఏర్పడిన ట్యూమర్లు ఎముకలోని ఇతర ఆరోగ్య కణాలను ఆక్రమిస్తాయి. అందువల్ల ఎముక బలహీన పడి విరిగి పోవడానికి కారణమవుతాయి. చాలా త్వరగా పెరిగే ఈ ట్యూమర్ల వల్ల ముఖ్యంగా లక్షణాలు కనిపించనపుడు లేదా కనిపించిన చిన్న లక్షణాలు కూడా అశ్రద్ధ చేసినపుడు అంగవైకల్యం ఏర్పడవచ్చు, అప్పుడప్పుడు మరణం కూడా సంభవించవచ్చు.

రకాలు :
ఎముకలో ఏర్పడే ట్యూమర్లు నాలుగు రకాలుగా ఉంటాయి. ఆస్టియోసార్కోమా, ఎవింగ్స్ సార్కోమా అనేవి సాధారణంగా చిన్నపిల్లల్లో కనిపించే ట్యూమర్లు, మల్టిపుల్ మైలోమా, కాండ్రోసార్కోమా సామాన్యంగా 40 నుంచి 70 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తాయి.

లక్షణాలు :
సాధారణంగా ఇతర శరీర భాగాలలో కాన్సర్లు ఏర్పడినపుడు ప్రాథమిక దశలో ఎటువంటి లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు. ఏర్పడినట్టు తెలిసేసరికే చాలా వరకు పరిమాణంలో పెద్దగా పెరిగిపోయి ఉంటాయి. కానీ ఎముకలో ట్యూమర్ ఉన్నపుడు సాధరణంగా కనిపించే లక్షణాలు వాపు, నొప్పి. కొన్ని సార్లు కాళ్లు చేతులు కదల్చలేని పరిస్థితి ఏర్పడవచ్చు. చాలా తక్కువ సందర్భాల్లో ఎముకలో క్యాన్సర్ ఎముక విరగటం ద్వారా బయటపడుతుంది. ఎటువంటి నొప్పి లేకుండా ఏర్పడిన చిన్న కణితి పెరిగే కొద్దీ దాని పరిసరాల్లో ఉన్న నాడులు, కండరాల మీద ఒత్తిడి పెంచడం వల్ల వాపు, నొప్పి రావడం ప్రారంభమౌతుంది.

పరీక్షలు :

ఎముక క్యాన్సర్‌ను నిర్ధారించడానికి చాలా రకాల పరీక్షలు అంచెలంచెలుగా నిర్వహిస్తారు. వాటిలో ముఖ్యమైనవి
- పేషెంట్ పూర్తి ఆరోగ్య వివరాలు, ఏవైనా ఇతర సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన వివరాలు
- రక్తపరీక్షలు
- ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ వంటి పరీక్షలు
- బయాప్సీ : ఇది ఒక చిన్న సర్జరీ వంటి పరీక్ష. క్యాన్సర్‌గా భావిస్తున్న కణితి నుంచి ఒక చిన్న ముక్క తీసి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపుతారు.

క్యాన్సర్ స్థాయి :
ఏ క్యాన్సర్ చికిత్సలోనైనా క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వ్యాధి ప్రారంభమైన చోటనే ఉందా లేక ఇతర అవయవాలకు వ్యాపించిందా అనే దాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఎముక క్యాన్సర్‌లో క్యాన్సర్ స్థాయి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని పరీక్షలు చేస్తారు. అవి ఛాతి, ఎముకలకు సీటీ స్కాన్, కొన్ని సార్లు పెట్ స్కాన్ అవసరముంటుంది. 90 శాతం ఎముక క్యాన్సర్లు ఇతర ఎముకలకు, ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశం ఉంటుంది.

చికిత్స :
-ఎముక క్యాన్సర్ చికిత్సలో ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ముగ్గురు డాక్టర్లు కూడా టీమ్‌గా కలిసి పనిచెయ్యాల్సి ఉంటుంది. ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ సర్జరీ చేసి క్యాన్సర్ కణితికి చికిత్స చేస్తే, మెడికల్ ఆంకాలజిస్ట్ కీమోథెరపీ ద్వారా, రేడియాలజీ ఆంకాలజిస్ట్ రేడియేషన్ థెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. ఈ అన్ని చికిత్సల ద్వారా క్యాన్సర్‌కు చికిత్స అందించడమే కాదు ఎముక నష్టాన్ని కూడా నివారిస్తారు.

చికిత్సలో చేసే సర్జరీల్లో రెండు రకాలు ఉంటాయి. మొదటి పద్ధతిలో క్యాన్సర్ వచ్చిన ప్రదేశంలోని అవయవాన్ని కాపాడడానికి చేసే సర్జరి. ఇందులో కేవలం క్యాన్సర్ కణితిని మాత్రమే తొలగించి, ఎముక నష్టాన్ని నివారించడానికి కావల్సిన అన్ని ప్రయత్నాలు చేసి అవయవాన్ని కాపాడతారు. దీనిని లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటారు.కొన్నిసార్లు వ్యాధి ముదిరిపోవడం వల్ల అవయవాన్ని కాపాడలేకపోతారు. అటువంటి సందర్భాల్లో ప్రాణాలు కాపాడడానికి ఆ అవయవాన్ని తొలగిస్తారు. దీన్ని ఆంప్యు అంటారు.
సర్జరీ, కీమో, రేడియోథెరపీలతో చికిత్స పూర్తయిందనుకుంటే అది తప్పే అవుతుంది. చికిత్స అనంతరం క్రమం తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించడం, అవసరమైన పరీక్షలు చేయించడం చాలా అవసరం ఎందుకంటే పూర్తిగా నయమైందని అనుకున్న వారిలో క్యాన్సర్ తిరగబెట్టవచ్చు. కాబట్టి డాక్టర్ అవసరం లేదని చెప్పే వరకు తరచుగా డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

క్యాన్సర్ కానీ ట్యూమర్లు చాలా రకాలుగా ఉండవచ్చు. మృదువైన కణజాలాల్లో ఏర్పడే ట్యూమర్లు చాలా వరకు ఎముకలో వచ్చే ట్యూమర్లలాగానే కనిపిస్తాయి. ఇవి క్యాన్సర్ ట్యూమర్లు కావచ్చు, కాక పోవచ్చు.
క్యాన్సర్ కానీ కణితుల్లో సాధరణంగా కణితి ఏర్పడిన ప్రాంతంలో సర్జరి చేసి కణితి తొలగించడం ద్వారా ఎముక లేదా కీలు నష్టాన్ని నివారించవచ్చు. ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత తేలికవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ట్యూమర్లు మళ్లీమళ్లీ రావచ్చు. ఏది ఏమైనా సరియైన సమయంలో గుర్తించిన ట్యూమర్లకు చికిత్స సలభంగానే చేయవచ్చు.

-- Article : courtesy with Dr.Kishore @ Namasthe Telangana.com
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, 6 May 2012

Deafness in Children leads to Dumb,పసిపిల్లలో వినికిడిలోపము మూగకు దారితీయును


  • image : courtesy with Namaste Telangana.com/.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పసిపిల్లలో వినికిడిలోపము మూగకు దారితీయును - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పిలిచిన వెంటనే పలకకపోయినపుడు ముందు చిన్నారికి వినబడుతుందో లేదో అన్న ఆలోచన రావాలి. కొంచెం పెద్దపిల్లలైతే వినబడటం లేదని చెప్పగలుగుతారు. కానీ పసిపిల్లల్లో లోపాన్ని గ్రహించాల్సింది పెద్దవాళ్లే. ఇప్పుడు వినలేకపోతే భవిష్యత్తులో మాట్లాడలేరు కూడా. అందుకే ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు పిల్లల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల పెరుగుదల, మానసిక వికాసం, వినికిడి శక్తి, మాటలు నేర్చుకోవడం, మాట్లాడటం మొదలైనవన్నీ ముఖ్యంగా తల్లిదండ్రు లపై ఆధారపడి ఉంటాయన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏమాత్రం అనుమానం కలిగినా చెవిలో ఎటువంటి సమస్య లేదని నిర్ధారణ అయ్యేందుకు చెవి, వినికిడికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. శబ్దాన్ని గ్రహించే శక్తి కొరవడటాన్ని లేదా శబ్దాన్ని అసలు వినలేకపోవడాన్ని చెవుడు అంటారు. కచ్చితంగా ఈ కారణంగా చెవుడు వచ్చిందని అన్ని సందర్భాల్లోనూ చెప్పడం కష్టం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు వినగలిగిందే తిరిగి మాట్లాడగలుగుతారు. అమ్మమ్మ, తాతయ్య ల్లాంటి వారు చెప్పే చిన్న చిన్న మాటలు తిరిగి చెప్పలేకపోతున్నారని గమనించకపోతే వారు మాటలు కూడా నేర్చుకోలేరు. ఎంత త్వరగా, ఎంత చిన్న వయసులో పిల్లలు వినటం లేదో వారి వినికిడి శక్తి ఎంత కొరవడిందో తెలుసుకుని వెంటనే వారికి వినబడేట్టు చేయడం వల్ల వారు మాట్లాడగలిగేట్టు చేయవచ్చు. వినికిడి శక్తి మాట్లాడ్డంపై ప్రభావం చూపిస్తుంది. వినికిడికి మాట్లాడటానికి అవినాభావ సంబంధం ఉంది. చిన్న పిల్లల్లో మాట్లాడటం రాని వయసులో వినికిడి లేదంటే వారికి మాట్లాడటం కూడా రాదు.తల్లిదండ్రులు ఎంత త్వరగా పిల్లలకు వినబడటం లేదో గ్రహించి, అంత త్వరగా ఇఎన్‌టి స్పెషలిస్టును కలిసి వినికిడి పరీక్ష చేయించడం అవసరం.

  • చెవుడు.. రకాలు
శబ్దం లోపలికి చేరకపోవడం వల్ల వచ్చే చెవుడును కండక్టివ్ చెవుడు (కండక్టివ్ హియరింగ్ లాస్) అంటారు. కొన్నిసార్లు బయటిచెవి, చెవినాళం, మధ్యచెవి బాగానే ఉంటుంది. శబ్దం కూడా ప్రసారం అవుతుంటుంది. కానీ ఆ శబ్దాన్ని లోపలి చెవి వినికిడి నరం, మెదడు గ్రహించలేకపోవడం వల్ల చెవుడు వస్తుంది. దీన్ని నరం చెవుడు (సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్) అంటారు.

  • చిన్నారుల్లో చెవుడుకు కారణాలు..
- కొందరిలో పుట్టుకతోనే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడిన మందులు, ఇన్‌ఫెక్షన్లు, పిండం అభివృద్ధి చెందడంలో మార్పులు రావడం లాంటి కారణాల వల్ల లోపాలతో పుట్టవచ్చు.
- రుబెల్లా, టాక్సోప్లాస్మోసిస్, సైటోమెగాలో వైరస్, సిఫిలిస్ (తల్లిదంవూడుల ద్వారా సంక్రమించే వ్యాధి), హెర్పిస్ సింప్లెక్స్, గవదబిళ్లలు, తట్టు, మెదడువాపు లాంటి ఇన్‌ఫెక్షన్లు,
- స్ట్రెప్టోమైసిన్, ఫ్రూసిమైడ్, జెంటామైసిన్ లాంటి మందులు,
- రేడియేషన్, అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలు, ప్రసవ సమయంలో హైపోక్సియా, హైపర్‌బిలిరూబినిమియా (తల్లిదండ్రుల రక్తం సరిపడని కారణంగా వచ్చే వ్యాధి), -అతితక్కువ బరువుతో (15 వందల గ్రాముల కన్నా తక్కువ) పుట్టడం,
- తల, మెడ, చెవి సరిగ్గా ఉండాల్సిన రీతిలో లేనప్పుడు ,
- కుటుంబంలో ఎవరికైనా చెవుడు ఉండటం ,
- డౌన్స్ సిండ్రోమ్, మార్‌ఫాన్స్ సిండ్రోమ్, గోల్డెన్ హార్స్ సిండ్రోమ్, పియరీ రాబిన్స్ సిండ్రోమ్ లాంటి జన్యుసంబంధ వ్యాధులు చెవుడుకు కారణమవుతాయి.
- ఆస్టియోజెనిసిస్ ఇంపర్‌ఫెక్టా, ఆస్టియోస్క్లీరోసిస్ లాంటి ఎముకల వ్యాధి వల్ల చెవిలోని ఎముకల గొలుసులో కంపనాలు ఏర్పడవు. దానివల్ల శబ్దం లోపలి చెవికి చేరదు.
- సెక్రిటరీ డైటిస్ మీడియా వల్ల మధ్యచెవిలో నీరు లేదా జిగురు లాంటి పదార్థం చేరుతుంది. శబ్ద ప్రకంపనాలు లోపలి చెవికి అందక సరిగ్గా వినపడదు.
- వెలుపలి చెవి లేదా మధ్యచెవిలో గానీ ఇన్‌ఫెక్షన్ వల్ల చీము చేరి రంధ్రం ఏర్పడుతుంది. తద్వారా వినికిడి శక్తి దెబ్బతింటుంది.
- చెవికి దెబ్బలు తగిలినప్పుడు సాధారణంగా కర్ణభేరి పగిలిపోవడమో, ఎముకల గొలుసు అస్తవ్యస్తం కావడమో జరుగుతుంది. తల ఎముకలు చిట్లిపోవచ్చు. ఇలాంటప్పుడు వినికిడి పోతుంది.
- గింజలు, పూసలు, పుల్లల లాంటివి పిల్లలు తెలియక చెవిలో పెట్టుకుంటుంటారు. దీనివల్ల కూడా వినికిడి పోయే ప్రమాదం ఉంది.

  • పరిష్కారాలు...
వెలుపలి చెవి పూర్తిగా లేని పిల్లల్లో మధ్యచెవి, లోపలి చెవి సరిగ్గా పనిచేస్తుందో లేదో ముందు పరిశీలిస్తారు. అవి బాగానే ఉంటే ప్లాస్టిక్ సర్జన్, ఇఎన్‌టి సర్జన్ కలిసి బయటిచెవిని, చెవినాళాన్ని కృత్రిమ పదార్థాలతో గానీ, శరీరంలోని ఇతర పదార్థాలతో గానీ రూపొందించి శబ్దం మధ్యచెవికి అందేవిధంగా చేస్తారు. తద్వారా వినగలుగుతారు. చెవిలో పెట్టుకునే గింజలు, పూసలు, పిన్నులు, దూది, స్పాంజి, పెన్సిల్ ముక్కలు, లేదా కీటకాలు చేరడం వల్ల వినికిడి తగ్గిపోతు ముందుగా కర్ణభేరికి అపాయం కలుగకుండా వాటిని బయటకు తీస్తారు. ఇలాంటప్పుడు ఏమాత్రం అజాక్షిగత్తగా ఉన్నా వినికిడి శక్తి మొత్తం పోవచ్చు.
చెవిలో ఇన్‌ఫెక్షన్లు చేరినప్పుడు సకాలంలో మందులు వేయడం, డ్రెస్సింగ్ చేయడం జరగాలి.
కొన్నిసార్లు చెవిలో అదనంగా కండరాలు పెరుగుతాయి. వీటిని మైక్రోసర్జరీ ద్వారా తొలగిస్తే వినకిడి శక్తి వస్తుంది. ఆటోస్క్లీరోసిస్ లాంటి వ్యాధి వల్ల చెవిలోని ఎముకలు బిగుసుకుపోయినప్పుడు, చెవిలో రంధ్రం పడినప్పుడు కూడా మైక్రోసర్జరీ అవసరం అవుతుంది. మధ్యచెవిలో నీరు చేరితే (సెక్షికిటరీ ఓటైటిస్ మీడియా) ఆ ద్రవాన్ని కర్ణభేరి ఆపరేషన్ ద్వారా బయటకు తీసేస్తారు. ఆపరేషన్ తరువాత మళ్లీ నీరు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతకాలం వరకు కర్ణభేరిలో ఒకరకమైన బటన్‌ను ఉంచుతారు. దీనివల్ల మధ్యచెవిలో తయారయ్యే ద్రవం బయటకు వెళ్లిపోతుంది. దీన్ని మెరింగాటమీ, గ్రొమెట్ ఆపరేషన్ అంటారు. కొన్నిసార్లు ఈ సర్జరీ చేసినా చెవిలో ద్రవం తగ్గకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆ కారణాన్ని పరీక్షించి తదనుగుణమైన చికిత్స అందించాలి. మధ్యచెవిలో ద్రవం ఏర్పడటానికి యూస్టేషియన్ నాళానికి సంబంధించిన వ్యాధులు, ఎడినాయిడ్స్, ముక్కు వెనకాల ఉండే టాన్సిల్స్ లాంటి కండరాలు, సైనసైటిస్, టాన్సిల్స్,క్లఫ్ పాలెట్ మొదలైనవి ముఖ్యమైన కారణాలు. వీటన్నింటినీ సర్జరీ ద్వారా సరిచేయవచ్చు.

  • ఎలా తెలుసుకోవాలి...?
పుట్టగానే..
మోరోరిఫ్లెక్స్ లేదా స్టార్టల్ రిఫ్లెక్స్ - పెద్దశబ్దం విన్నప్పుడు ఏడుస్తారు.
3 నెలలు...
శబ్దం విన్నప్పుడు కాళ్లూచేతులు ఆడిస్తూ ఆడుకునే పిల్లలు కదలిక లేకుండా ఆగిపోవడం లేదా కళ్లు మూసుకోవడం, భృకుటి ముడుచుకోవడం
5వ నెలలో..
శబ్దం వచ్చిన వైపునకు కళ్లు తిప్పడం
6వ నెలలో..
శబ్దం వచ్చిన వైపునకు తల తిప్పడం
7 నుంచి 9 నెలలు...
శబ్దం చేస్తే అది ఎటువైపు నుంచి వస్తోందో సరిగ్గా గుర్తించడం
18వ నెలలో..
మనం అడిగే ప్రశ్నలు విని అన్నింటికి సమాధానాలు ఇవ్వడం. ఉదా.. ముక్కు, పిల్లి ఎక్కడ.. అంటే చేతితో చూపించడం ఇలా శబ్దం వచ్చినప్పుడు ఒక్కో వయసు పిల్లలు ఒక్కోలా స్పందిస్తారు. ఆ స్పందన సరిగ్గా ఉందా లేదా అన్న విషయాన్ని బట్టి వినికిడి శక్తిని అంచనా వేయవచ్చు. ఇవే కాకుండా విజువల్ రీఇన్‌ఫోర్స్‌మెంట్ టెస్టు, కండిషనింగ్ ఆడియోమెట్రీ, స్పీచ్ పరీక్షలు, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ, ఇవోక్ట్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వినికిడి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు.


Courtesy with : Dr.Anil Vasireddy , MS-ENT(Sai ENT hos.Hyd.)

  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, 5 May 2012

పిల్లల్లో క్యాన్సర్లు-అవగాహన ,Cancers in Children-Awareness



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పిల్లల్లో క్యాన్సర్లు-అవగాహన ,Cancers in Children-Awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ఆడుకునే పసివూపాయం, అభం శుభం తెలియని అమాయకత్వం క్యాన్సర్ అనే పదానికి అర్థమే తెలియని బాల్యం కానీ ఇవేమీ క్యాన్సర్‌కు అడ్డుకాదు. పెద్దవారిలో వచ్చే అన్ని క్యాన్సర్లు పిల్లల్లో వచ్చే ప్రమాదం ఉన్నా కొన్ని క్యాన్సర్లు పిల్లల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి రక్త సంబంధిత క్యాన్సర్లు(లుకేమియా) మెదడులో వచ్చే కణితులు బెయిన్ ట్యూమర్లు) లింఫోమా, సాఫ్ట్‌టిష్యు సార్‌కోమా, పిల్లల్లో క్యాన్సర్ ఎటువంటి లక్షణాలు కలిగించకుండానే అకస్మాత్తుగా జ్వరం వంటి లక్షణాలతో బయటపడవచ్చు. ఎన్నివిధాలుగా ఆలోచించి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ఒకరిని లేదా ఇద్దరిని అపురూపంగా పెంచుకునే తల్లిదండ్రులకు పాపకో బాబుకో క్యాన్సర్ అని తెలియగానే ఎంతో తల్లడిల్లి పోతారు. తీవ్రమైన మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. కాని కొంత ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే పిల్లల్లో క్యాన్సర్స్ చాలా వరకు పూర్తిగా నయం చేయదగినవే.

చిన్నపుడు 20 గ్రేల కంటే అధిక రేడియేషన్‌కు గురయినా క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గ్రే అంటే శరీరం గ్రహించిన రేడియేషన్ అని అర్ధం. మామెక్షిగామ్ వంటి పరీక్షలు మరీ చిన్న వయసులో చేయించుకోవడం కూడా అంత మంచిది కాదు. 30 ఏళ్లు పైబడ్డాక డాక్టర్ సలహా మేరకు చేయించుకుంటే మంచిది.

పీడియాట్రిక్ క్యాన్సర్ చాలా వరకు కీమో, రేడియేషన్‌కు స్పందిస్తాయి. పిల్లలు రేడియేషన్ భయపడి థెరపీకీ సహకరించకపోతే ఒక్కోసారి వారికి మత్తు ఇవ్వడం జరుగుతుంది. 12 సంవత్సరాలు పైబడ్డాక అమ్మాయికి గాని అబ్బాయికి కాని క్యాన్సర్ ట్రీట్‌మెంట్స్ వల్ల పునరుత్పతత్తి వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. అనుకుంటే ముందుగానే వారి అండాలను వీర్యకణాలను తీసి భద్రపరుస్తుంటారు.

పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్ లుకేమియా. ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడే తెల్లరక్త కణాలను అడ్డుకొని రక్తాన్ని సరిగా సరఫరా కానివ్వవు. ఇలాగ ఒక్కసారిగా జరగటం కాని లేదా దీర్ఘకాలికంగా కానీ జరగవచ్చు. చాలా వరకు నయం చేయగలిగే ఈ క్యాన్సర్‌కు చికిత్సలు కీమోథెరపీ, రేడియోథెరపీలతో ఉంటాయి. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాం స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఈ క్యాన్సర్‌కు బాగా పనిచేస్తాయి. మొదట బిడ్డకు రక్త సంబంధిత క్యాన్సర్ ఉంటే రెండో బిడ్డ విషయంలో కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. పిల్లలు పాలిపోయినట్లు ఉండడం, ఆకలి, బరువు తగ్గడం నీరసం, అలసట ఎక్కువగా ఉండటం, త్వరగా చర్మం కమిలిపోవడం, మచ్చలు మచ్చలుగా ఉండటం, తీవ్రమైన రక్తవూస్రావం, ఒంటినొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సి ఉంటుంది. రక్తపరీక్షలు, తుంటి లేదా ఇతర పెద్ద ఎముకల నుంచి తీసిన మూలగను(bone marrow) పరీక్షించటం ద్వారా ఈ క్యాన్సర్‌ను కనుక్కోవచ్చు.

పెద్దవారిలో కంటే పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువని చెప్పుకోవచ్చు. పొద్దునే లేవగానే తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, ప్రవర్తించే తీరుమారటం, ఆందోళన, ఫిట్స్, చూపు, మాట మందగించటం వంటి లక్షణాలను మెదడు కణితిగా అనుమానించాల్సి ఉంటుంది. క్యాన్సర్ కణితి అయినా కాకపోయినా రెండూ ప్రమాదకరమే. మెదడులో కణితి వచ్చిన ప్రదేశాన్ని బట్టి సర్జరీ చేయవచ్చు లేదా ఇతర ట్రీట్‌మెంట్స్ చేస్తే మంచిదా అని నిర్ణయిస్తారు. ఒక్కొక్కసారి మెదడు కణితిని రేడియోసర్జరీతో తొలగిస్తారు. నిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్రపోషించే లింఫ్ నాళాలకు సంబంధించిన క్యాన్సర్‌లో హార్జ్‌కిన్స్, నాన్‌హాడ్జ్‌కిన్స్ అనే రకాలుంటాయి. మెడ, చంకల్లో, గజ్జ్జల్లో, లింఫ్‌నాళాలు వాయటం, జ్వరం, చలి, ఆకలి తగ్గడం, రాత్రుళ్లు చెమట, దగ్గు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం మొదలగు లక్షణాలతో లింఫోమాలు బయట పడుతుంటాయి. ఇతర టిష్యూలకు కలిపే సాఫ్ట్ టిష్యూలలో వచ్చే క్యాన్సర్‌ను సాఫ్ట్‌టిష్యు సార్‌కోమా అంటారు. ఎముకలను, కండరాలను కలిపే ఈ సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ లక్షణాలు వచ్చిన ప్రదేశం మీద ఆధారపడి ఉంటాయి. ఈ టిష్యూలకు సాగే గుణం ఉండడం వల్ల తొలి దశలో లక్షణాలు బయటపడవు. సాఫ్ట్‌టిష్యూలలో వచ్చే క్యాన్సర్‌కు ప్రధానంగా సర్జరీ, తర్వాత లేదా ముందు అవసరాన్ని బట్టి రేడియో, కీమో థెరపిలుంటాయి. అండాలలో, టెస్టిస్‌లో వచ్చే జెర్మ్‌సెల్ ట్యూమర్స్ కూడా పిల్లల్లో ఎక్కువ.

రెండు ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్న పిల్లల్లో అడ్రినల్ గ్రంథిలో, మెడ, ఛాతి, పొట్ట, పెల్విస్‌లలో వచ్చే కణితలు బ్లాస్టోమాలు, ఎముకలు టిష్యూలలో వచ్చే ఈవింగ్ సార్కోమా, మూత్రపిండాలలో వచ్చే నెఫ్రోబ్లాస్టోమా, పిల్లల్లో ఎక్కువగా కన్పించే క్యాన్సర్స్. పిల్లల్లో పూర్తిగా నయం చేయగలిగే ఈ క్యాన్సర్లు పెద్దవాళ్లలో కనిపిస్తే మాత్రం నయం చేయడం కష్టతరం అవచ్చు. పిల్లల్లో అరుదుగా కన్పించే మిగతా క్యాన్సర్స్ అదుపులో రావటం కష్టం కావటం, ఎంత ప్రయత్నించిన చికిత్సకు లొంగకపోవటం జరగవచ్చు. పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యు సంబంధమైన కారణాలు పిల్లల్లో క్యాన్సర్స్‌కు దారితీయవచ్చు. కాబట్టి ముందు పుట్టిన బిడ్డకు క్యాన్సర్ ఉంటే రెండో వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం, లక్షణాలను గుర్తించి సరియైన ట్రీట్‌మెంట్స్ అందించడం, పోషకాహార లోపాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం, ట్రీట్‌మెంట్స్ అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు డాక్టర్ సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి.


Courtesy with : Dr.Ch.Mohana Vamsy- chief surgical Oncologist , Omega hospitals , Hyderabad.A.P_India.

  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Medicinr updates in telugu-మధుమేహులు బరువు తగ్గితే గుండెపోటు దూరం.



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మధుమేహులు బరువు తగ్గితే గుండెపోటు దూరం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

-

మధుమేహంతో బాధపడుతున్న వూబకాయులు ఆరు కిలోల బరువు తగ్గినా మెరుగైన ఫలితాలు కనబడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో రక్తనాళాలు గట్టిపడటం 20% తగ్గుతున్నట్టు.. ఈ మేరకు గుండె పోటు ముప్పూ దూరమవుతున్నట్టు బయటపడింది. మిగతావారికన్నా మధుమేహలకు గుండెజబ్బు ముప్పు ఆరు రెట్లు ఎక్కువ. మధుమేహుల్లో 68% మరణాలకు ఇదే కారణమవుతోంది కూడా. ఇందుకు ప్రధానంగా రక్తనాళాలు గట్టిపడే (అథెరోస్క్లెరోసిస్‌) సమస్య దోహదం చేస్తుండటం గమనార్హం. వాపు, రోగనిరోధక ప్రతిస్పందనతో ఈ సమస్య నేరుగా ముడిపడి ఉన్నట్టు గార్‌వన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి, సెయింట్‌ విన్సెంట్‌ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు తాజాగా నిరూపించారు. ఇలాంటి అధ్యయనం ఇదే తొలిసారని చెప్పారు.
  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, 1 May 2012

Facing of Medical emergency, వైద్యం లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడం , మెడికల్ ఎమర్జెన్సీ ని ఎదుర్కోవడము



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Facing of Medical emergency, వైద్యం లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడం , మెడికల్ ఎమర్జెన్సీ ని ఎదుర్కోవడము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వైద్యము లో ప్రతి రోగము వెంటనే నయము చేసుకోవడము అవసరమే అయినా... కొన్ని వ్యాదులు వెంటనే తగిన చికిత్స చేయకపోతే ప్రాణాలు పోతాయి లేదా జీవితాంతము బాధతోను , ఆ జబ్బుతోను , ఆ జబ్బు మిగిల్చే శేషాలతోను బ్రతకవలసి ఉంటుంది . ఆ కోవలో ముఖ్యమైనవి ....
  • గుండె పోటు(Heart attack) ,
  • పక్షవాతము (Paralysis),
  • కాలిన గాయాలు(Burns) ,
  • శ్వాసించడము లో ఇబ్బంది (ఉబ్బసము - Asthma),
  • పాముకాటు (snake bite)

గుండెపోటు--
అంటురోగాలు , ఇతర రొగాలకన్నా గుండె జబ్బులు ప్రమాదకరమైనవి . తక్షణము వైద్య సహకారము అవసరమైనవి . నేడు సాధారణ గుండెజబ్బులను గుండెపోటు , గుండె ఆగిపోవడము , ఎక్యూట్ మయోకార్డియల్ ఇంఫ్రాక్షన్‌ అంటాము . శరీరము లో అంగాలన్నింటిలో కీలకమైనది గుండె . శరీర భాగాలన్నింటికి అవసరమైన రక్తాన్ని సమర్ధవంతము గా పంప్ చేసే అంగం గుండె .అటువంటి గుండెకండరాలకు తగినంత ఆక్షిజన్‌ సరఫరా అవనపుడు క్రమముగా గుండె కండరాలు దెబ్బతిని తెలియకుండానే గుండెపోటు తెస్తుంది .
  • గుండె పోటుకు కారణాలు :
ముఖ్యమైనవి -- ఎథెరొస్క్లిరోసిస్ , ఆర్టీరియో స్క్లిరోసిస్ , రక్తనాళాలలోపల ఏర్పడిన గార (ఎథిరోమ ). నస్టపరిచే ఇతర కారణాలు -- పొగతాగడము , హైపర్ లిపిడీమియా , ఒత్తిడి , అధిక స్థాయి కొలెస్టిరాల్ , అధిక రక్తపోటు , మధుమేహము , భారీకాయము .

లక్షణాలు : గుండెపోటు లేదా మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌ కు హెచ్చరిక చాతి నొప్పి . ఆ నొప్పి సాధారణము గా పిండినట్లు గా ఉంటుంది . చాతీ బిగుసుకున్నటువంటి భావన లేదా బాగా ఒత్తిడి పడుతున్న భావన . సధారణము గా ఆ నొప్పి చాతీనుండి విస్తరిస్తుంది. ఎడమ చేతివైపుకు నొప్పి విస్తరణ సాధారణమైనప్పటికీ కింది దవడ , మెడ , కుడిచెయ్యి , వీపుకు విస్తరిస్తుంది . కడుపులో మంటను పోలిన బాధ కలుగుతుంది.

ఇతర లక్షణాలు : ఊపిరి అందకపోవడము , తీవ్రము గా చెమట పట్టడము , తల తేలిపోవడము , గుండెదడ , నీరసము , కడుపులో తిప్పడము , తలతిరగడము లేదా స్పృహ కోల్పోవడము .

గుండెపోటుకు ప్రాధమిక చికిత్స : గుండె పోటు వచ్చినవారిలో పైన చెప్పిన లక్షణాలు , సంకేతాలు కనిపిస్తాయి. వాటిలో తీవ్ర చాతీనొప్పి తట్టుకోలేనిది . అటువంటివారిని హాస్పిటల్ కి తరలించేలోగా సమయము వృధాచేయక ప్రాధమిక చికిత్స అందించాలి . గుండెపోటు కేసుల్లో సమయము చాలా కీలకము .ఆలస్యమైతే గుండె కండరము దెబ్బతింటుంది . చేయవలసినవి ...*అత్యవసర సర్వీస్ నంబర్ కి ఫోను చేయడం , *రోగి దుస్తులను వదులు చేయడము , *రోగిని కంగారు పెట్టకుండ ధైర్యము చెప్పడము , *కొంచము వంగి కూర్చున్న భంగిమ ను ఏర్పాటు చేయడము ,* అనవవసర కదలికలు చేయకూడదు , *శ్రమపడితే ఆక్షిజన్‌ పెట్టే సదుపాయము చేయడము , *వెంటనే హృద్రోగ నిపుణులున్న హాస్పిటల్ కి తరలించడము ... ముఖ్యమైనవి . దొరికితే .. సార్బిట్రేట్ మాత్ర నాలుక కింద పెట్టడము చేయాలి .


పక్ష వాతము

మనిషి బ్రతికే ఉంచి అచేతనం గా ఉండే విచిత్ర స్థితి . శరీరము లో ఒక భాగము కాని , సగము కాని , పూర్తిగా కాని తమ కదేలే శక్తిని సంపూర్ణము గా కోల్పోతే దాన్ని పక్షవాతము (paralysis) అంటారు . ఇది వస్తే ఆ భాగము స్పర్శ , కదలిక ఏమీ ఉండవు . శరీరం అంతా బిగుసుకుపోవడం, మూతి అష్టవంకరలు తిరిగిపోవడం, కాళ్ళు చేతులు వెనుతిరగి పోవడం, ఒక్కోసారి గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవం పై పక్షవాతం ప్రభావం ఏదో విధంగా తెలియ కుండా కనిపిస్తుంది.

ఏ కారణాల వల్ల వస్తుంది :
స్ట్రోక్ : ఈ స్ట్రోక్ లో మెదడుకి రక్త ప్రసారము ఆగిపోతుంది .. . దానివల్ల మెదడు లో జీవకణాలు చచ్చిపోతాయి . ఈ స్థితి రెండు రకాలుగా ఉంటుంది .
ఒక దానిలో మెదడకు వెళ్ళే రక్తనాళాలలో రక్తము గడ్డకట్టడం .... దీన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాము .
రెండవది .. మెదడు లోని రక్తనలలో వత్తిడి పెరిగి పగిలి రక్తస్రావము జరగడం ... దీన్ని " హెమరేజిక్ స్ట్రోక్ అంటాము .
ఏది ఏమైనా మెదడులోని కొన్ని కణాలూ చనిపోవడం వలనే ... ఆ సంభదిత అవయవాలు చచ్చుబడి పక్షవాతము వస్తుంది



కాలిన గాయాలు--
కాలిన గాయాల వలన ఏర్పడే బాధ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనిషిని కుంగదీస్తుంది. కాలిన గాయాలకు వాటి స్వభావాన్ని బట్టి, గాయం తీవ్రతను బట్టి చికిత్స పొందాల్సి ఉంటుంది.
చెయ్యవలసినవి
*మంట ప్రభావాన్ని ముందుగా ఆపండి .*మంటనుండి మనిషిని బయటకు లాగడము లేదా మందమైన దుప్పటి తో కప్పి మంటలను ఆపాలి .*ప్రమాదము నుండి రోగిని దూరము గా తీసుకు వెళ్ళాలి .* కాలిన ప్రదేశము లో దుస్తులు లేదా నగలను తొలగించాలి . *కాలిన 20 నిముషాలలోపే ప్రభావితమైన శరీర భాగాలను చల్లని తేదా గొరువెచ్చని నీటితో10-30 నిముషాలు చల్లబరచాలి . * చర్మానికి తగలకుండా తెల్లటి పలుచని గుడ్డతో కపాలి. * హాస్పిటల్ కి వీలైనంత త్వరలో తీసుకు వెళ్ళాలి .
చెయ్యకూడనివి --
* ఐస్ లేదా ఐస్ నీళ్ళు లో కడగడం గాని తుడవడం గాని చేయవద్దు . * క్రీమ్స్ లేదా వెన్న వంటివి రాయడను , సిరా (పెన్ను ఇంక్ )లాంటివి పోయడము చేయవద్దు .



శ్వాసించడములో ఇబ్బంది --

ఊపిరి పీల్చ్లేకపోవడము లేదా ఊపిరి అందకపొవడానికి ఏ రోగి లోనైనా రెండు కారణాలుంటాయి. 1.శ్వాసనాళాలఓ అడ్డంకి . 2. శ్వాసనాళాలు మూసుకుపోవడము . కొద్ది సేపూ ఆక్షిజన్‌ మెదడకు అందకపోతే ప్రాణాపాయము కలుగుతుంది . కావున అన్ని సమయములో శ్వాస -నిశ్వాసలు సరిగా జరిగేటట్లు చుడాలి . వెంటనే దగ్గరగా ఉన్న వైద్యశాలకు తరలించాలి .


పాముకాటు :
సాదారణం గా పాములు సంతానోత్పత్తి కోసం వేసవి కాలం లో జత కడతాయి . తరువాత వర్షాకాలం లో గుడ్లలను పొదుగుతాయి . ఆయాసమయాల్లో అవి చాలా చిరాకుగా ఉండి తీవ్రం గా స్పందిస్తాయి . ఈ కారణం గానే వేసవి , వర్షాకాలం లో పశువులతో పాటు మనుషులు అధికంగా పాముకాటుకు గురిఅవుతారు .

పాము అనగానే అందరికీ భయం. పాము కాటు వేసిందంటే ప్రాణం పోయినట్టే అన్నది అపోహ. అసలు పాముల గురించి సరైన సమాచారం లేకపోవడమే ఈ అపోహలకు, అపనమ్మకాలకు కారణం.

పాముల్లో చాలా రకాలున్నాయి. పాము లెన్ని రకాలుగా ఉన్నా ప్రధానంగా రెండే జాతులుగా వాటిని విభజించాలి. విషం ఉన్న పాములు, విషం లేని పాములు. నిజానికి విష సర్పాలకన్నా విషం లేని, ప్రమాదం కలిగించని పాములే ఎక్కువ. అయితే పాముకాటు గురించి అశ్రద్ధ చేయకుండా తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం మంచిది. విష సర్పం కరిచినా రకరకాల కారణాలతో ఆలస్యం చేసి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే- విషం లేని పాము కరిచినా కంగారుతో, భయంతో మరికొందరు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు.


  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఫ్లూ జ్వరం,ఫ్లూ వైరస్‌,Flue fever



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఫ్లూ జ్వరం,ఫ్లూ వైరస్‌,Flue fever- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


జలుబు తెచ్చిపెట్టే వైరస్‌లు వందల సంఖ్యలో వుంటాయి. అందుకే జలుబు నిరోధక వ్యాక్సీన్‌లు మనకు అందుబాటులో లేవు. ఫ్లూకు సంబంధించి ప్రధానంగా రెండు తరగతుల వైరసులను గుర్తించడం జరిగింది. వీటికి వైరస్‌-ఎ, వైరస్‌-బి అని పేర్లు పెట్టి వ్యవహరిస్తున్నారు. మూడవ తరగతి వైరస్‌ 'సి' ఉనికి తక్కువే. అది అంతగా బాధ పెట్టదు కూడా. ఫ్లూ జ్వరం అకస్మాత్తుగా వస్తుంది. చలిచలిగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి ఉంటాయి.తలనొప్పి, ఒళ్ళునొప్పులు బాధ అనిపిస్తాయి. బాగా నీరసం అనిపిస్తుంది. కడుపులో వికారమూ ఉంటుంది.ఫ్లూ జ్వరాన్నే ఇన్ ఫ్లూయింజా జ్వరం అంటారు. ఈ జ్వరం జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలోఎక్కువమందికి సోకుతుంది. ఇంట్లో ఒకరికి వస్తే తక్కినవాళ్ళకి కూడా రావచ్చు, ఈ జ్వరం రావడానికి ఇన్ ఫ్లూయింజా వైరస్ ఏ,బి,సి రకాలు కారణం. ఇన్ ఫ్లూయింజా వైరస్ శరీరంలో చేరిన 1-3 రోజులలో ఫ్లూ జ్వరం వస్తుంది.

ఫ్లూ వైరస్‌ సోకిన ఒకటి రెండు రోజుల తరవాత ఫ్లూ లక్షణాలు ప్రారంభమవుతాయి. చలి మొదటి లక్షణం. తరవాత జ్వరం 102-103 ఫారన్‌హీట్‌ డిగ్రీల దాకా పెరుగుతుంది. తీవ్రంగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు. వీపు నొప్పి అధికంగా వుంటుంది. మూడు నాలుగు రోజుల్లో బాధలన్నీ తగ్గిపోతాయిగానీ దగ్గు మాత్రం వారం, పది రోజుల వరకూ బాధించవచ్చు.


  • వ్యాపించే విధానము :
ఫ్లూ కారక వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి పీల్చే గాలి ద్వారా సంక్రమిస్తుంది. అలాగే ముక్కు నుండి వెలువడే స్రావాలతో కలుషితమైన గ్లాసులు, పాత్రలు, వస్తువుల ద్వారా కూడా సంక్రమించవచ్చు.

  • ఫ్లూ జ్వరంలో రకాలు :
ఫ్లూ జ్వరంలో రకాలున్నాయి. ఒక రకంలో ఫ్లూ కేవలం జ్వరంవరకే పరిమితం అవుతుంది. ఇందులో జ్వరం, ఒళ్ళునొప్పులు, జలుబు, గొంతునొప్పి, కళ్ళు ఎర్రబడటం, నీరసం ప్రధానంగా వుంటాయి. పొడిదగ్గు ఉంటుంది. నాలుగు నుండి ఆరు రోజులలో జ్వరం తగ్గిపోతుంది ఇలాంటి జ్వరం ఎక్కువమందిలో కనిపిస్తుంది.

శ్వాసకోశాలకి సంబంధించిన ఫ్లూ జ్వరంలో జ్వరంతో పాటు బ్రోంకైటీస్, బ్రోంఖోన్యుమోనియా, ఫ్లూరసి వుంటాయి. కళ్ళే జిగురుగా, ఎరుపుగా వుంటుంది. ఇటువంటి ఫ్లూజ్వరం గురించి అప్రమత్తత అవసరం.

జీర్ణకోశ పెగులకి సంబంధించినటువంటి ఫ్లూ జ్వరం మరొకటి ఇందులో ఫ్లూజ్వరంతోపాటు ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, కడుపునొప్పి, మలబద్ధకం వంటివి ప్రధానంగా వుంటాయి. కొంతమందిలో మలబద్ధకం బదులు విరేచనాలు వుంటాయి.

నరాలకి చెందిన ఫ్లూజ్వరం కూడా ఉంది. ఇందులో విపరీతంగా తలనొప్పి ఉంటుంది. అపస్మారకస్థితి కూడా ఏర్పడుతుంది. మెనింజైటీస్ ఫ్లూ జ్వరం అనేది మరొకటివుంది. దీన్నే విషజ్వరం అని అంటారు. ఈ జ్వరం వచ్చినవాళ్ళలో ఒళ్ళు నీలంగా మారుతుంది.

  • ఫ్లూ జ్వరానికి చికిత్స ఏమిటి?
ఫ్లూ జ్వరం వచ్చిన వ్యక్తికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. జ్వర తీవ్రత, ఒళ్ళునొప్పులు తగ్గడానికి ''పెరాసిటమాల బిళ్ళలు'' వాడాలి. గొంతునొప్పి, దగ్గు తగ్గడానికి '' కాఫ్ సిరప్ '' వాడాలి. సాధారణంగా ఎలాంటి యాంటిబయోటిక్ మందులవసరం లేకుండానే ఉపశాంతికి వాడే మందులతో ఫ్లూజ్వరం తేలికగా తగ్గుతుంది.

కాంప్లికేషన్లు ఎదురైతే వాటికి చికిత్స చేయాలి. వైరల్ ఇన్ ఫెక్షన్ తోపాటు బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ కూడా తోడైతే యాంపిసిలిన్, ఎమాక్సిసిలిన్, ఎజిద్రోమైసిన్ ఇతర యాంటిబయాటిక్ మందులు వాడాలి. ఇన్ ఫ్లూయింజా జ్వరం రాకుండా వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. అవి చిన్నవయసులోనే వాడాల్సి వుంటుంది. జ్వరం వచ్చాక ప్రయోజనం ఉండదు. వైరస్‌ వ్యాధికి బాక్టీరియా ఇన్ఫెక్షన్‌ తోడయినా యాంటిబయాటిక్స్‌ వంటి ఔషధాలతో అంత ప్రయోజనం ఉండదు. సిగరెట్లు, మద్యపానం లాంటి అలవాట్లున్న వారు ఈ సమయంలో వాటికి దూరంగా వుండాలి. ప్లూ వ్యాధిగ్రస్తులలో బ్రాంకైటిస్‌, న్యుమోనియా లాంటి వ్యాధులు చోటు చేసుకోవచ్చు.


soruce : Price Text book of Medicine

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/