Saturday, 8 October 2011

తుంటి కీలు మార్పిడి విధానము-అవగాహన ,Hip Joint replacement process-awareness



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -తుంటి కీలు మార్పిడి విధానము-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మోకాలి కీళ్ల గురించి మనందరికీ తెలుసు. మన శరీరం బరువు మొత్తం అవే మోస్తుంటాయని భావిస్తుంటాం. అది కొంత వరకూ నిజమేగానీ... వాటికంటే ముందు మన శరీరం బరువును మోస్తుండేవి...మన తుంటి కీళ్లు! శరీరం పైభాగం మొత్తాన్ని..కాళ్లకు అనుసంధానించే అత్యంత కీలకమైన, సున్నితమైన కీళ్లు ఇవి! కటి ఎముకల చట్రానికి ఇరువైపులా ఉండే ఈ కీళ్ల నిర్మాణమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 'బంతి-గిన్ని' ఆకృతిలో ఒకదానిలో ఒకటి స్వేచ్ఛగా కదులుతూ.. ఒకవైపు బరువు మోస్తూనే.. మనం కాళ్లను ముందుకు, వెనక్కు, పక్కలకు.. ఇలా ఎన్నో కోణాల్లో కదల్చటానికి ఇవి సహకరిస్తుంటాయి.

అందుకే తుంటి కీళ్లలో ఏదైనా సమస్య తలెత్తితే జీవితం నరకప్రాయం అవుతుంది. కాలు కదపాలంటే కష్టం. గజ్జల్లో ఒకటే నొప్పి. సున్నితమైన.. ఎన్నో కోణాల్లో తిరుగుతుండే కీలు కాబట్టి దీన్ని సరిచెయ్యటం కూడా అంత తేలికేం కాదు. క్లిష్టమైన ప్రక్రియ. వైద్య రంగానికి ఇది ఎంతోకాలం పెను సవాల్‌గా నిలిచింది. అయితే ఆధునికమైన 'తుంటి కీలు మార్పిడి' ఆపరేషన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఈ సమస్యను చాలా వరకూ విజయవంతంగా జయించామని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సాధారణంగా తుంటి కీలుకు తలెత్తే సమస్యలేమిటి? -మార్పిడి ఆపరేషన్‌ ప్రత్యేకత ఏమిటన్నది వివరంగా తెలుసుకుందాము .


మన శరీరంలో బరువు మోసే కీళ్లలో అత్యంత కీలకమైనది తుంటి కీలు! కాబట్టి దీనికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తోసేసుకుని తిరగటం చాలా కష్టం. ఈ తుంటి కీలు అన్నది 'గిన్నిలో బంతి'లా ఆడుతుంటుంది కాబట్టి దీన్ని 'బంతి-గిన్ని' (బాల్‌ సాకెట్‌ జాయింట్‌) కీలు అనే పిలుస్తుంటారు. కటి ఎముక చివర్లో 'గిన్ని' లాంటి నిర్మాణం ఉంటుంది. తొడ దగ్గరి నుంచి వచ్చే పొడవాటి ఎముక.. చివర్లో బంతి ఆకృతిలా ఉండి.. అది ఈ గిన్నిలో కూర్చుంటుంది. ఈ కదలికలు సున్నితంగా ఉండేందుకు బంతిపైన సున్నితమైన మృదులాస్థి పొరలు ఉంటాయి. బరువు మోస్తుండటంతో నిర్మాణపరంగా ఈ కీలు ఎంత సంక్లిష్టమైందో అంత సున్నితమైనదనీ చెప్పక తప్పదు. అందుకే ఒక్కో వయసులో ఈ కీలుకు ఒక్కో రకమైన ముప్పు పొంచి ఉంటుంది.

ముఖ్యంగా ప్రమాదాల్లో దెబ్బలు తగలటం, వృద్ధులు తూలిపడటం వంటి సందర్భాల్లో ముందుగా ఈ కీలు దెబ్బతినే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కారణమేదైనా ఈ కీలు తీవ్రంగా ప్రభావితమైనప్పుడు దీన్ని మార్చటం మినహా మరో మార్గం ఉండదు. 1920ల నుంచీ కూడా ఈ కీలు మార్పిడి కోసం పరిశోధకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు.

బరువు మోసే కీలకమైన జాయింట్‌ కాబట్టి త్వరగా అరిగిపోకుండా.. పక్కకు వైదొలగిపోకుండా 'బంతి-గిన్ని' స్థిరంగా ఉండేలా చూడటం కోసం ఎన్నో కృత్రిమ నమూనాలతో ప్రయోగాలు చేశారు. బ్రిటన్‌కు చెందిన ఆర్థోపెడిక్‌ సర్జన్‌ సర్‌ జాన్‌ ఛార్న్‌లీ ఆధునిక మైన తుంటి మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఎన్నో మెరుగులు దిద్దుకుని ఈ మార్పిడి సర్జరీ ఇప్పుడు.. తుంటికి సంబంధించి అత్యంత సమర్థమైన విధానంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

తుంటి సమస్యల్లో ఏవి ఎక్కువ?
* రక్తప్రసారం దెబ్బతినటం: మన దేశంలో బంతికి రక్తప్రసారం తగ్గటమన్నది (ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌) చాలా ఎక్కువగా కనబడుతోంది. పైగా మన దేశంలో చాలామందికి దీనికి ప్రత్యేకమైన కారణం కూడా ఏదీ ఉండటం లేదు. మద్యం మితిమీరి తాగేవారిలో, రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌, కొన్ని రకాల చర్మవ్యాధులకు, కిడ్నీ మార్పిడి తర్వాత తప్పనిసరిగా స్టిరాయిడ్స్‌ తీసుకునేవారికి ఈ రక్తప్రసారం తగ్గే సమస్య ఎక్కువ. వీరిలో రెండు తుంటి కీళ్లూ పాడవ్వచ్చు, వీరికి మార్పిడి అనివార్యమవుతోంది.

* తొలగిపోవటం: పుట్టుకతోనే బంతి-గిన్ని సరిగా ఒకదాన్లో ఒకటి కూర్చుని ఉండకపోవటం, ప్రమాదాల వంటి కారణాల రీత్యా తుంటి కీలు తొలగిపోవటం వంటి కారణాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి.

* ఒక ఆపరేషన్‌ తర్వాత: దెబ్బతగలటం తదితర కారణాల రీత్యా తుంటికి ఒకసారి ఆపరేషన్‌ చేసిన తర్వాత.. క్రమేపీ కీలు అరిగిపోవటం ఆరంభం కావచ్చు. దీనికీ మార్పిడి అనివార్యమవుతుంది.


* మన దేశంలో మోకాలి కీళ్లు అరగటమన్నది చాలా ఎక్కువ. దానితో పోలిస్తే వాటంతట అవేగా తుంటి కీళ్లు అరగటమన్నది తక్కువ. కానీ పాశ్చాత్య దేశాలు ఇందుకు విరుద్ధం. అక్కడ తుంటి కీళ్లు అరగటమన్నది చాలా ఎక్కువ.

* తుంటి మార్పిడి అన్నది 97% విజయవంతమైన సర్జరీ. ఈ కృత్రిమ కీళ్లు కూడా 20-25 ఏళ్లు మన్నికగా ఉంటున్నాయి.

* సరిగా చెయ్యకపోతే దీనివల్ల దుష్ప్రభావాలూ ఉంటాయి. ఉదాహరణకు కీలు తొలగిపోవచ్చు. అమరిక సరిగా లేకపోతే అవి త్వరగా అరిగిపోవచ్చు. ప్లాస్టిక్‌ కారణంగా కొన్నిసార్లు ఎముక మొత్తం దెబ్బతినిపోవచ్చు (ఆస్టియోలైసిస్‌). నైపుణ్యంతో చేసినప్పుడు ఈ ఇబ్బందులన్నీ తక్కువనే చెప్పుకోవాలి.

నొప్పి కీలకం
* తుంటి కీలు అరగటం (ఆర్త్థ్రెటిస్‌), దెబ్బతినటం ఇలా కారణమేదైనా అన్నింటిలోనూ కూడా ప్రధానంగా కనిపించే సమస్య... గజ్జల్లో లోపలగా నొప్పి. ఉదయం లేవగానే కీలు కొద్దిగా బిగుతుగా అనిపిస్తుండటం.. నడుస్తున్నప్పుడు కీలు మీద బరువు పడగానే కలుక్కుమన్నట్టుండటం. అడుగేసినప్పుడల్లా నొప్పితో బాధ. రాత్రి కూడా వేధించే నొప్పి. మెట్లు ఎక్కటం మహా కష్టం. కూర్చుని లేవాలంటే ఇబ్బంది. క్రమేపీ నడక కూడా కష్టం కావచ్చు. అయితే లోపల కీలు దెబ్బతింటున్నా పైకి వాపులాంటి లక్షణాలేవీ కనబడవు. కీలు ఎక్కడో లోపలగా ఉంటుంది కాబట్టి బాధ కూడా ఎక్కడో లోపలగానే అనిపిస్తుంటుంది.

* పరీక్షలు: గజ్జల్లో నొప్పి, నడవటం కష్టంగా ఉందని గుర్తించినప్పుడు ముందు రెండు వైపులా తుంటి కీళ్లు కనబడేలా ఎక్స్‌రే తీస్తారు. దీనిలో కీలుకు సంబంధించిన సమస్యలు చాలా వరకూ బయటపడతాయి. అయితే తుంటి కీలులోని బంతికి రక్తప్రసారం సరిగా ఉందా? లేదా? (ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌) వంటివి దీనిలో స్పష్టంగా తెలియవు కాబట్టి అవసరమైతే ఎమ్మారై స్కానింగ్‌ కూడా చేయిస్తారు. కీలులో ఏ కొంచెం తేడా ఉన్నా దీనిలో బయటపడుతుంది.

జాగ్రత్తలు
నొప్పికి కారణం ఏదైనా మొదట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* తుంటి కీలు మీద బరువు పడకుండా చూడటం ముఖ్యం. కింద కూర్చోకుండా ఉండాలి. వెస్ట్రన్‌ టాయ్‌లెట్స్‌ వాడుకోవాలి.
* బరువు తగ్గటం కూడా అవసరం.
* నొప్పి తగ్గేందుకు మందులు ఇస్తారు.
* తుంటి దగ్గరి 'అబ్డక్టార్‌' కండరాన్ని (మన ప్యాంటు జేబులో చేతులు పెట్టినప్పుడు సరిగ్గా కింద ఉండే కండరం) బలోపేతం చేసేందుకు 'అబ్డక్టార్‌ ఎక్సర్‌సైజులు' సూచిస్తారు. ఈ కండరాలు బలపడితే కీలు మీద భారం తగ్గుతుంది, కీలు స్థిరత్వం పెరుగుతుంది.

ఈ చర్యలతో నొప్పి తగ్గి మంచి ఫలితం ఉంటుంది. అయితే క్రమేపీ కీలు అరుగుతూ, ఆర్త్థ్రెటిస్‌ ముదిరిన కొద్దీ.. మళ్లీ నొప్పి పెరుగుతుంటుంది. ఆ స్థితిలో ఉన్న ఒకే ఒక సమర్థవంతమైన మార్గం 'తుంటి కీలు మార్పిడి' ఆపరేషన్‌.

మార్పిడి ఆపరేషన్‌

సర్‌ జాన్‌ ఛార్న్‌లీ తొలిగా తుంటి మార్పిడి చేసినప్పుడు పైన ప్లాస్టిక్‌ గిన్ని, దానిలో స్టీలు బంతి వాడారు. ఆ తర్వాత పరిశోధనా రంగం అభివృద్ధి చెందిన కొద్దీ.. దీనిలో ఎన్నో మార్పులు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒకటి లోహం/ మరోటి ప్లాస్టిక్‌, సెరామిక్‌/సెరామిక్‌, లోహం/లోహం, సెరామిక్‌/పాలీఎథిలీన్‌.. ఇలా ఎన్నో రకాలు వచ్చాయి. వీటన్నింటి ప్రధాన లక్ష్యం- త్వరగా అరిగిపోకుండా మన్నికగా ఉండేలా చూడటమే.

* గిన్నిని కటి ఎముకలో కూర్చోబెట్టేందుకు అప్పట్లో ఛార్న్‌లీ బోన్‌ సిమెంట్‌ (పాలీ మిథైల్‌ మిథాక్రిలేట్‌) వాడారు. తర్వాత్తర్వాత ఆ సిమెంట్‌కు ప్రాచుర్యం తగ్గి.. సిమెంట్‌ అవసరం లేకుండానే కటి ఎముకతో కలిసిపోయే రకం కృత్రిమ కీళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఎముక క్రమేపీ దానిలోకి పెరిగి అది అక్కడ స్థిరపడిపోతుంది.

* తొలిరోజుల్లో ఛార్న్‌లీ వాడినప్పుడు 22 మిల్లీమీటర్ల వ్యాసం ఉండే చిన్న బంతి ఉన్న కీలు వాడారు. కానీ క్రమేపీ దాని సైజు పెంచుకుంటూ వస్తూ.. ఇప్పుడు 40 మిల్లీమీటర్ల వరకూ కూడా వాడుతున్నారు. ఇలా బంతి సైజుపెద్దగా ఉన్నందువల్ల కీలుకు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముక ఆకృతిని బట్టి సాధ్యమైనంత పెద్దసైజు బంతి వెయ్యటం వల్ల ఉపయోగం ఉంటుంది.

* తొలినాళ్లలో తుంటి మార్పిడి తర్వాత కింద కూర్చో కూడదు, పరుగెత్తకూడదు వంటి రకరకాల నిబంధనలు విధించేవారు. అప్పట్లో అమర్చే బంతి సైజు చిన్నగా ఉండేది కాబట్టి ఎప్పుడు కీలు బెసిగిపోతుందో, ఎప్పుడు తొలిగిపోతుందోనని భయం. అయితే ఇప్పుడు బంతి సైజు పెద్దగా ఉంటోంది కాబట్టి కీలుకు స్థిరత్వం వస్తోంది. దీంతో ఎటువంటి ఆంక్షలూ ఉండవు. ఇప్పుడు తుంటి మార్పిడి చేయించుకున్నవారు జాగింగ్‌ వంటి వ్యాయామాలు, టెన్నిస్‌ వంటి క్రీడలు కూడా ఆడుతున్నారు. ఏదైనా కారణాన యుక్త వయస్కులకు మార్పిడి ఆపరేషన్‌ చేయాల్సి వచ్చినా.. వారి జీవనశైలిలో ఎటువంటి మార్పుల అవసరం ఉండదు.

సర్జరీ ఎలా చేస్తారు?


1. తుంటి ప్రాంతంలో కోత బెట్టి గిన్ని-బంతి కీలును చేరుకుంటారు.
2. కీలులో గిన్ని భాగాన్ని సరిచేసి.. అక్కడ లోహం/సిరామిక్‌/ప్లాస్టిక్‌ ఇలా ఎంపిక చేసిన కృత్రిమ గిన్నిని అమరుస్తారు. దీనికి సిమెంట్‌ వాడేవి కొన్ని రకాలు, సిమెంట్‌ లేని రకాలూ ఉన్నాయి.
3. తొడ ప్రాంతం నుంచి వచ్చే ఎముక చివరి భాగం బంతిలా ఉంటుంది.
4. పాడైపోయిన ఈ బంతి ఎముక భాగాన్ని తొలగిస్తారు.
5. ఆ తొలగించిన భాగంలో- పొడవాటి దృఢమైన స్టెమ్‌ సాయంతో కృత్రిమ బంతిని అమరుస్తారు. ఈ బంతుల్లో కూడా చాలా రకాలున్నాయి.బంతి సైజు ఎంత పెద్దగా ఉంటే కీలు అంత స్థిరంగా ఉంటుంది.
6. బంతిని గిన్నిలో కూర్చోబెట్టి.. కీలుకు స్థిరత్వాన్ని తెస్తారు. అది అలాగే లోపల ఉండిపోతుంది.

ఒకప్పుడు తుంటి కీలుకు క్షయ రావటమన్నది మన దేశంలో ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పటికీ పల్లెల్లో ఇది ఎక్కువగానే కనబడుతుంది. అలాగే తుంటి కీలులో చీము చేరటమన్నదీ (పయోజెనిక్‌ ఆర్త్థ్రెటిస్‌) ఎక్కువగా ఉండేది. కాన్పు పద్ధతుల వంటివి సరిగా లేని రోజుల్లో రకరకాల కారణాల రీత్యా పిల్లలకు ఇన్ఫెక్షన్‌ వచ్చి అది తుంటి కీలులో చేరేది. ఇటీవలి కాలంలో ఇవి గణనీయంగా తగ్గాయని చెప్పుకోవాలి.
రీ సర్ఫేస్‌మెంట్‌--బంతి, గిన్నితో సహా కీలు మొత్తాన్ని మారిస్తే దాన్ని 'టోటల్‌ హిప్‌ రిప్లేస్‌మెంట్‌' అంటారు. అయితే సహజమైన ఎముకను ఎక్కువ భాగం తొలగించాల్సిన అవసరం లేకుండా.. దెబ్బతిన్న బంతి భాగం మొత్తాన్ని తియ్యకుండా దాన్నే చెక్కి.. దాని ఆకృతి మార్చి.. దానిపై లోహపు బంతిని అమర్చే విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. దీన్నే 'రీ సర్ఫేస్‌మెంట్‌' అంటారు. అయితే దీనికి పరిమితులు ఎక్కువ. సమస్యను బట్టి దీన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

వయసు వయసుకో సమస్య!
తుంటి కీలుకు సంబంధించి... పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకూ కూడా ప్రతిదశలోనూ కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
పుట్టగానే: తుంటి కీలు అన్నది 'బంతి-గిన్ని' కీలు. గిన్నిలాంటి కటి ఎముకలో బంతి స్వేచ్ఛగా తిరుగుతుంటుంది. కొందరికి పుట్టేసరికే ఈ బంతి.. గిన్నిలో కుదురుగా కూర్చుని ఉండదు. పక్కకు వైదొలగి, ఉంటుంది. దీన్నే 'కంజెనిటల్‌ డిస్‌లొకేషన్‌ ఆఫ్‌ హిప్‌' అంటారు. గిన్నిలోంచి బంతి బయటకు వచ్చేసి ఉంటుంది. దీన్ని పసివయసులోనే పట్టుకోకపోతే- కీలు (ముఖ్యంగా గిన్ని) సరిగా ఎదగదు. అర్థ చంద్రాకారంగా ఉండాల్సిన గిన్ని భాగం.. పెద్దగా, ఖాళీగా ఉండిపోతుంది. దీన్నే 'డిస్‌ప్లాస్టిక్‌ హిప్‌' అంటారు. అందుకే బిడ్డ పుట్టగానే వైద్యులు తుంటి కీలు స్థిరంగా కూర్చుని ఉందా? లేదా? అన్నది తప్పనిసరిగా చూస్తారు. ఒకవేళ అది స్థిరంగా లేకపోతే వెంటనే ప్రత్యేకమైన పద్ధతిలో 'బిగుతుగా కట్టు కట్టటం(పావ్‌లిక్‌ హార్నెస్‌)' వంటి వాటితో దాన్ని సరిచెయ్యచ్చు. పెద్దవయసు వరకూ గుర్తించకపోతే మాత్రం ఆపరేషన్ల వంటివి తప్పవు. ఎందుకంటే బంతి-గిన్ని కీలులో- బంతిని బట్టి గిన్ని, గిన్నిని బట్టి బంతి పెరుగుతుంటాయి. చిన్నతనంలో ఒకటి బయటకు తొలగిపోతే రెండోదాని ఎదుగుదలా ప్రభావితమవుతుంది.

టీనేజీలో: తొడ నుంచి వచ్చే ఎముక చివర ఎదుగుదలకు వీలుగా 'గ్రోత్‌ప్లేట్స్‌' అనేవి ఉంటాయి. ఎముక పొడుగు సాగుతుండటానికి ఇవి కీలకం. వీటి దగ్గర కొద్దిగా మృదులాస్థి కణజాలం ఉంటుంది. టీనేజీలో కొందరికి, ముఖ్యంగా లావుగా ఉండే మగపిల్లలకు ఈ గ్రోత్‌ప్లేట్స్‌ దగ్గర ఉండే మృదులాస్థి కణజాలం పక్కకు జారిపోయి.. కీలు ఆకృతి మారిపోతుంది. దీన్నే 'స్లిప్‌డ్‌ అప్పర్‌ ఫిమరల్‌ ఎపిఫైసిస్‌ (సూఫీ)' అంటారు. దీంతో క్రమేపీ నొప్పి, నడక తీరు మారిపోవటం వంటివన్నీ మొదలవుతాయి. దీన్ని వెంటనే గుర్తించి సరిచెయ్యటం చాలా అవసరం.

మధ్యవయసులో: 30-40 ఏళ్ల వయసు వారిలో 'ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌' అనే సమస్య చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే మోకాలి ఎముకలో బంతికి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలు అత్యంత కీలకమైనవి. ఈ రక్తప్రసార వ్యవస్థ చాలా సున్నితమైనది. దీనిలో ఏ తేడా వచ్చి బంతికి రక్తప్రసారం నిలిచిపోయి.. ఎముక దెబ్బతింటుంది. బంతి పాడైపోతుంది. దీన్నే 'ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌' అంటారు. దీర్ఘకాలం పాటు మితిమీరి మద్యం తీసుకునేవారిలో, అలాగే స్టిరాయిడ్‌ మందులు నిత్యం వాడేవారికి కూడా ఇలా జరగొచ్చు. కానీ మన దేశంలో చాలామందికి ఇటువంటి స్పష్టమైన కారణమేదీ లేకుండా కూడా బంతికి రక్తప్రసారం దెబ్బతినటం చాలా తరచుగా చూస్తున్నాం. కాబట్టి 30-40 ఏళ్ల సమయంలో తుంటి కీలు నొప్పి వచ్చిందంటే కచ్చితంగా ఎంఆర్‌ఐ స్కానింగ్‌ తీసి చూడటం చాలా అవసరం. దీనికి 'తుంటి కీలు మార్పిడి' ఆపరేషన్‌ అవసరమవుతుంది.

వృద్ధాప్యంలో: ముసలి వయసులో రకరకాల కారణాల రీత్యా కింద పడిపోతుండటం, తుంటి ఎముకలు విరగటమన్నది చాలా ఎక్కువగా కనిపించే సమస్య. సహజంగా తుంటి కీలు కింది భాగం (ఫ్రాక్చర్‌ నెక్‌ ఆఫ్‌ ద ఫీమర్‌) విరుగుతుంటుంది. దీన్ని రకరకాల పద్ధతుల్లో సరిచేస్తారుగానీ ఆ తర్వాత క్రమేపీ తుంటి కీలు అరిగిపోవటమన్నది చాలా ఎక్కువమందిలో కనబడుతుంటుంది. ఒక్కోసారి పడిపోయినప్పుడు బంతి బయటకు తోసుకువచ్చేయవచ్చు. దాంతో పాటు బంతికి రక్తప్రసారం దెబ్బతిని కీలు పాడైపోవచ్చు. వీటన్నింటివల్లా తుంటి కీలు దెబ్బతింటుంది. చాలాసార్లు దాన్ని మార్చి, కృత్రిమ కీలు అమర్చాల్సిన అవసరం కూడా తలెత్తుతుంటుంది.

-- డా. ఎ.వి.గురవారెడ్డి-- జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జన్‌-- ఎండీ, సన్‌షైన్‌ హాస్పిటల్‌-- హైదరాబాద్‌.(Eenadu sukhibhava-సుఖీభవ)



  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కార్నియా దృష్టికి మూలకణ చికిత్సా విధానం,Stemcell treatmet for corneal blindness





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కార్నియా దృస్టికి మూలకణ చికిత్సా విధానం,Stemcell treatmet for corneal blindness
- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

'కంట్లో కారం' గురించి మనం భయంకరంగా చెప్పుకొంటాం. కానీ కంటికి సంబంధించినంత వరకూ 'సున్నం' అతి భయంకరమైనది! ఒక్క సున్నమే కాదు.. మనం నిత్యం వాడే బ్లీచింగ్‌ పౌడర్‌.. రకరకాల యాసిడ్లు.. ఇవన్నీ కంట్లో విపత్తు సృష్టించేవే! ప్రమాదవశాత్తూ ఇవి ఒక్కసారి కంట్లో పడ్డాయంటే చాలు.. అతి సున్నితమైన కంటి భాగాలను తినేస్తాయి. దృష్టిని దెబ్బతీస్తాయి. ఆ కన్ను తిరిగి కోలుకునేలా చెయ్యటం.. తిరిగి చూపు తెప్పించటం.. ఎంతో కష్టంతో కూడుకున్న పని!

ముఖ్యంగా మన కంటిలోని నల్లగుడ్డు పైన ఉండే పారదర్శకమైన 'కార్నియా' పొర అత్యంత సున్నితమైనది. ఇదొక్కటే దెబ్బతింటే.. నేత్రదానం ద్వారా స్వీకరించిన కార్నియాను తెచ్చి మార్పిడి చెయ్యటం ద్వారా పరిస్థితి చక్కదిద్దచ్చు. కానీ ఈ కార్నియా పొరకు నిత్యం జవజీవాలను అందిస్తూ.. ఈ చుట్టూ ఉండే 'లింబస్‌' ప్రాంతం దెబ్బతింటే మాత్రం దీన్ని సరిచెయ్యటం మహాకష్టం. పదేళ్ల క్రితం వరకూ కూడా దీనికి సరైన పరిష్కారమే లేదు. ఫలితంగా... సున్నం వంటి ప్రమాదాల బారినపడిన ఎంతోమంది బాధితులు దృష్టికి దూరంగా, అంధకారంలో ఉండిపోయారు. మోడువారిన వీరి జీవితాల్లో కొత్త వెలుగులు పూయించింది మూలకణ చికిత్సా విధానం!.

కంటిలో రసాయనాలు పడటం సర్వసాధారణమైనదే కాదు, అత్యంత ప్రమాదకరమైన సమస్య కూడా! కంటికి సంబంధించి ఇదో అతిపెద్ద విపత్తు. మామూలుగానే మన కంట్లో ఏం పడినా క్షణాల్లో మంట, ఎర్రబడటం, వాపు, నీరుకారటం వంటివన్నీ మొదలవుతాయి. కాకపోతే సరైన చికిత్సతో ఇవన్నీ కొద్దిగంటల్లోనో, రోజుల్లోనో తగ్గిపోయి.. కన్ను మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. అదే గాఢమైన ఆమ్లాలుగానీ, క్షారాలుగానీ పడినప్పుడు పరిస్థితి ఇంత తేలికగా ఉండదు. అవి కనుగుడ్డు మీద ఉండే సున్నితమైన, కంటి చూపునకు అత్యంత కీలకమైన పొరలను తినేస్తాయి. ముఖ్యంగా సున్నం, బ్లీచింగ్‌ పౌడర్‌ వంటి క్షార రసాయనాలు కనుగుడ్డు పైభాగాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇవి రెండు కళ్లలోనూ పడితే పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారవుతుంది. ఇటువంటి ప్రమాదాల్లో కార్నియా పొర దెబ్బతిన్నప్పుడు తక్షణ వైద్యంతో పాటు చూపు పునరుద్ధరణ కోసం ఎంతో సంక్లిష్టమైన చికిత్సలూ అవసరమవుతాయి.

మూలకణ మార్పిడి చికిత్సా విధానం వీటిలో అత్యంత కీలకమైనది.

ఏమిటీ మూలకణ చికిత్స?
మన కంట్లో నల్లగుడ్డు మీద పారదర్శకమైన పొర ఉంటుంది. దీన్నే 'కార్నియా' అంటారు. ఈ కార్నియా చుట్టూ తెల్లగుడ్డు ఉంటుంది, దీన్ని 'కంజెంక్త్టెవా(conjectiva)' అంటారు. ఈ రెంటికీ మధ్య ఉండే రింగులాంటి ప్రాంతం 'లింబస్‌'. కార్నియా పొర బాగుండాలంటే దాని చుట్టూ ఉండే ఈ లింబస్‌ పొర అత్యంత కీలకం. ఎందుకంటే కార్నియా పొరకు కావాల్సిన కణాలన్నింటినీ ఈ లింబస్‌ రింగే అందిస్తుంటుంది. కార్నియా స్వచ్ఛమైన అద్దంలా పారదర్శకంగా ఉంటుంది కాబట్టి దానిలో రక్తనాళాలు, రక్తసరఫరా ఉండవు. కానీ శరీరంలో అన్నిభాగాల్లాగే అక్కడి కణాలు కూడా నిరంతరం క్షీణిస్తుంటాయి. మరి దానికి నిరంతరం కొత్తకణాలు అందుతుంటేనే అది చక్కగా ఉంటుంది. అందుకే దానిచుట్టూ అద్భుతమైన 'లింబస్‌' ఏర్పాటు ఉంది. ఈ లింబస్‌ రింగులో మూల కణాలుంటాయి. ఇవి నిరంతరం కార్నియా కణాలుగా మార్పుచెందుతూ.. పైకి వ్యాపిస్తుంటాయి. దీంతో కార్నియా ఎప్పుడూ చక్కగా ఉంటుంది. ఇదీ ప్రాథమికంగా కార్నియా, లింబస్‌ల నిర్మాణం.

ప్రమాదం జరిగితే..?
కంట్లో ఏవైనా రసాయనాలు పడి.. కార్నియా పొర దెబ్బతింటే.. వేరొక నేత్రదాత నుంచి స్వీకరించిన కార్నియా మార్పిడి చేస్తారు. ఆ తర్వాత దానికి అవసరమైన కణాలన్నింటినీ యథాప్రకారం లింబస్‌ అందిస్తుంటుంది. కానీ ప్రమాదంలో లింబస్‌ భాగం కూడా దెబ్బతింటే..? అప్పుడే అసలు సమస్య తలెత్తుతుంది. కార్నియా మార్పిడి చేసినా.. దానికి నిరంతరం కణాలను సరఫరా చేసే లింబస్‌ ప్రాంతం లేక అది అట్టేకాలం నిలబడలేదు. రెండోది- లింబస్‌ భాగం దెబ్బతిన్నప్పుడు.. ఏకంగా తెల్లగుడ్డే నల్లగుడ్డు మీదికి వ్యాపించటం ఆరంభిస్తుంది. తనతో పాటు అది రక్తనాళాలనూ నల్లగుడ్డు మీదకు వ్యాప్తి చేస్తుంది. దీంతో చూపు పోతుంది. సున్నం వంటి వాటివల్ల జరిగే అతిపెద్ద నష్టం ఇదే. ఇలాంటి వారికి కార్నియా మార్చినా.. లింబస్‌ లేదు కాబట్టి అది ఎక్కువ కాలం నిలబడలేదు. కాబట్టి లింబస్‌ ప్రాంతం దెబ్బతిన్నప్పుడు.. దాన్ని తిరిగి ఏర్పాటు చేయటం అత్యవసరం. ఒక కన్ను బాగుంటే దాని నుంచి కొద్దిభాగం తీసుకువచ్చి మార్పిడి చెయ్యచ్చు. కానీ లింబస్‌లో మరీ ఎక్కువ భాగం దెబ్బతినిపోతే ఎలా? అలాగే ఒక కన్ను దెబ్బతింది కాబట్టి బాగున్న కంటి నుంచి లింబస్‌ తెచ్చి అమర్చటమంటే.. ఆ బాగున్న ఒక్క కంటినీ కూడా దెబ్బతీసిన వాళ్లమవుతామా? అన్నదీ ముఖ్యమే. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో ఏం చెయ్యాలన్నది అత్యంత క్లిష్టమైన సమస్య. దీనికి పరిష్కారంగానే 'లింబస్‌ మూలకణాల మార్పిడి' విధానాన్ని రూపొందించారు. మార్పిడి అద్భుతం!
బాధితుల రెండో కన్ను బాగుంటే.. దాని నుంచి చాలా తక్కువగా (2 మి.మీ.) లింబస్‌ రింగు పొరను తీసుకుంటారు. ఒకవేళ రెండోకన్నూ దెబ్బతింటే తలిదండ్రులు, లేదా సన్నిహిత

బంధువుల నుంచి కొద్దిగా లింబస్‌ పొరను సేకరిస్తారు. దాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా సాధ్యమైనంత పెద్దగా పెంచటమన్నది ఈ ప్రక్రియలోని మూలసూత్రం. ఇలా మూలకణాలను పెంచవచ్చని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయోగాల్లో నిరూపితమవ్వటంతో ఎల్వీప్రసాద్‌ పరిశోధకులు.. దాన్ని కంటి లింబస్‌ కణాలకు వర్తింపజేస్తూ సాధ్యమైనంత తక్కువ ఖర్చులో సాధించేందుకు కృషి చేసి విజయం సాధించారు.

బాగున్న కంటి నుంచి కేవలం 2 మి.మీ. లింబస్‌ మాత్రమే తీసుకుని.. దాన్ని ప్రయోగశాలలో పెద్దగా పెంచాలి. అందుకు బిడ్డ పుట్టినప్పుడు వచ్చే మాయ (ఆమ్నియాన్‌) పొర సహాయం తీసుకున్నారు. మాయపొరను ప్రయోగశాలలో చిన్నచిన్న ముక్కలుగా చేసి ప్రత్యేక రసాయనాల్లో సిద్ధంగా ఉంచుతారు. రోగి కంటి నుంచి తీసుకున్న 2 మి.మీ.ల లింబస్‌ పొరను దాని మీద ఉంచి.. క్రమేపీ దాన్ని 2 వారాల్లో పెద్దగా పెంచుతారు. రెండు కళ్లూ బాగా దెబ్బతిన్నా కూడా చిన్న లింబస్‌ ముక్క బాగుంటే చాలు.. అదే రోగి నుంచి దాన్ని తీసుకుని.. ప్రయోగశాలలో పెంచుతారు. ఇలా పెంచిన పొరను తీసుకువెళ్లి.. దెబ్బతిన్న కంటిలో అతికిస్తారు. అది క్రమేపీ కుదురుకుని.. తన మూలకణాల నుంచి కార్నియా కణాలను తయారు చెయ్యటం ఆరంభిస్తుంది. క్రమేపీ కార్నియా చక్కబడుతుంది. లేదంటే నేత్రదాతల నుంచి కార్నియా తెచ్చి మార్పిడి చెయ్యచ్చు. ఇప్పటికే లింబస్‌ను బాగు చేశారు కాబట్టి కార్నియా చక్కగా స్థిరపడుతుంది. ఇదీ ఈ ప్రక్రియ ప్రత్యేకత!

చూపు వచ్చేస్తుందా?
ప్రమాదం జరగగానే కన్ను పెద్దగా ఉబ్బిపోయి.. ఎర్రగా.. నీరుకారుతూ.. అసలు ఎంత దెబ్బతిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. ఆ స్థితిలో చెప్పటం కష్టం. అందుకే చాలా జాగ్రత్తగా శుభ్రం చేసి.. తక్షణం రకరకాల చుక్కల మందులతో వైద్యం అందిస్తారు. ఇలా కొన్ని రోజులు లేదా వారాలు చికిత్స చేస్తే అదంతా తగ్గి.. కనుగుడ్డు అసలు పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. అప్పుడు కేవలం కార్నియానే దెబ్బతిందా? లింబస్‌ కూడా దెబ్బతిందా? దాన్ని మార్చాలా? ఇవన్నీ అప్పుడు నిర్ధారించి.. చికిత్స చేస్తారు. లింబల్‌ మూలకణాల మార్పిడి విధానం చక్కటి సత్ఫలితాలను ఇస్తోంది. ప్రామాణిక అంతర్జాతీయ వైద్య, పరిశోధన పత్రికలన్నీ ఈ పరిశోధన వ్యాసాలను ప్రచురించి, కితాబులిచ్చాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్వచ్ఛమైన నీటితో కంటిని కొద్దినిమిషాల పాటు శుభ్రంగా కడగటం చాలా చాలా అవసరం. సాధ్యమైనంత త్వరగా కంటి వైద్యులను సంప్రదించాలి. కంట్లో పడినదేమిటో కచ్చితంగా వైద్యులకు చెప్పటం చికిత్సా విధానానికి ఉపయోగపడుతుంది. వైద్యులు కూడా కంటి నుంచి ఆ రసాయనం, దాని అవశేషాలు మొత్తం పోయే వరకూ శుభ్రం చేస్తారు. ఆ తర్వాత చికిత్స అందిస్తారు.

దేశంలో దాదాపు 89 లక్షల మంది కార్నియా సమస్యలతో అంధత్వాన్ని అనుభవిస్తుండగా వీరిలో కనీసం 15-20% మందికి ఈ మూలకణ మార్పిడి చికిత్సతో ప్రయోజనం ఉంటుంది. కొందరికి ఒంట్లోని రోగనిరోధక వ్యవస్థ తమమీదే దాడి చెయ్యటం (ఆటోఇమ్యూన్‌ వ్యాధుల) వల్ల కూడా కంటిలో ఇటువంటి సమస్య తలెత్తుతుంది. వారికీ దీనితో ప్రయోజనం ఉంటుంది.''

నల్లగుడ్డు మీదికి తెల్లగుడ్డు దురాక్రమణ
కంటిలో లింబస్‌ భాగం దెబ్బతిన్నప్పుడు.. ఏకంగా తెల్లగుడ్డే ఇలా నల్లగుడ్డు మీదికి వ్యాపించటం ఆరంభిస్తుంది. తనతో పాటు అది రక్తనాళాలనూ నల్లగుడ్డు మీదకు వ్యాప్తి చేస్తుంది. దీంతో కనుగుడ్డే మూసుకుపోయి చూపు పోతుంది. సున్నం వంటి వాటివల్ల జరిగే అతిపెద్ద నష్టం ఇదే.
ప్రమాదకారకాలు
కంట్లో రసాయనాలు పడటం పెద్ద ప్రమాదం! నిత్యం మనం ఇంట్లో ఉపయోగించే ఎన్నో ఆమ్లాలు, ముఖ్యంగా క్షారాలు కనుగుడ్డును తినేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి:
* సున్నం కంటికి అతిపెద్ద శత్రువు. కిళ్లీల్లో ఉపయోగించే సున్నం కూడా ప్రమాదకరమైనదే.
* బ్లీచింగ్‌ పౌడర్‌. శుభ్రం చేసేందుకు ఉపయోగించే చాలా రకాల పౌడర్లలో అమ్మోనియా ఉంటుంది. ఇది ప్రమాదకరమైనది.
* అమ్మోనియా, పొటాష్‌ ఎరువులు
* బ్యాటరీల్లో ఉండే యాసిడ్‌, లోహాలను శుభ్రం చేసేందుకు పరిశ్రమల్లో బ్లీచ్‌గా వాడే సల్ఫరస్‌ ఆమ్లం, గ్లాసులకు పాలిష్‌ వేసేందుకు వాడే హైడ్రోఫ్లూరిక్‌ ఆమ్లం, నిత్యం ఇంట్లో వాడే వెనిగర్‌ (ఎసిటిక్‌ ఆమ్లం), అత్యంత ప్రమాదకరమైన హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం.. ఇవన్నీ ప్రమాదకరమైనవే.
* ఇటువంటి ప్రమాదాల బారినపడుతున్న వారిలో దాదాపు 75% శాతం మంది 35 ఏళ్ల లోపువారే ఉంటున్నారు. పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. పరిశ్రమల్లోనే కాదు.. సున్నం పడటం వంటి ప్రమాదాలు ఇళ్లలోనూ ఎక్కువగానే జరుగుతున్నాయి.

source : L.v.prasad eye hospital/Eenadu news paper
  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, 7 October 2011

ఫుడ్‌ అలెర్జీ , Food Allergy



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఫుడ్‌ అలెర్జీ , Food Allergy- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
(Thu, 6 Oct 2011)


ఫుడ్‌ అలెర్జీకి కారణం కనుక్కోపోతే ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. ఫుడ్‌ అలెర్జీ వల్ల శరీరం మీద దద్దుర్లు లాంటి చిన్న ఇబ్బందులే కాక శ్వాససంబంధిత సమస్యల వంటి పెద్ద కష్టాలు కూడా వస్తాయి. పల్లీలు తినడం వల్ల కూడా కొందరికి అలర్జీ వస్తుంది. కొన్ని రకాల ఫుడ్‌ అలెర్జీలు కుటుంబ వారసత్వంగా వస్తాయి. అందుకే వీటి గురించి కొంచెమైనా తెలుసుకుని ఉండటం మంచిది. తొంభైశాతం ఫుడ్‌ అలర్జీలు ఎనిమిదిరకాల ఆహారపదార్ధాలు వల్ల వస్తాయి. అవేమిటంటే పాలు, గుడ్డు (గుడ్డులోని తెల్లసొన), పల్లీలు, వాల్‌నట్స్‌, జీడిపప్పు, ఆల్మండ్‌, చేపల్లో ... షెల్‌ ఫిష్‌ అంటే అంటే పీతలు, రొయ్యలు, ఆహారధాన్యాల్లో గోధుమలు రెగ్యులర్‌గా తీసుకునే ఆహారాలు వల్ల కూడా ఒక్కొసారి అలర్జీలు వస్తాయి. ఫుడ్‌ అలర్జీల్లో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య తేడా వుంటుంది.మనషి మనషి కీ తేడా ఉంటుంది .

ఫుడ్‌ అలర్జీ లక్షణాలు

1. దురద, ఎక్జిమా, చర్మం పగిలిపోవడం 2. కనుర్పెలు, పెదవులు, ముఖం, నాలుక, గొంతులో వాపు లేదా ఇతర శరీర భాగాల్లో వాపు.

3. శ్వాసలో ఇబ్బంది, పొట్టలో నెప్పి, డయేరియా, నీరసం, వాంతులు 4. తలబరువు, అపస్మారక స్థితి, మత్తుగా వుంటం మొదలైనవి ఆహారం వలన కలిగే అలర్జీలను

'ఎనాఫైలాక్సిస్‌' అంటారు. దీనిని సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణానికే హాని కలిగే ప్రమాదం వుంది. అంటే శ్వాస నాళాలు కుంచించుకుపోవడం, గొంతువాపు, రక్త

పీడనంలో తగ్గుదల, పల్స్‌ రేటు బాగా పెరగడం వంటవి జరుగుతాయి.

అలర్జీకి దూరంగా.... ఫుడ్‌ అలర్జీల విషయంలో జాగ్రత్త వహించాలంటే - మొదట మీకు అలెర్జీని కలిగించే ఆహారం ఏదో కనుక్కోవాలి. దానికి సంబంధించిన ఆహార పదార్ధాలన్నింటినీ తినడం మానేయాలి. అంటే ఉదాహరణకి రొయ్యలు వల్ల అలర్జీ వుంటే పీతలు తిన్నా అలర్జీ వస్తుంది. ఇదే నియమం వెజిటేరియన్‌ రకాలకు కూడా వర్తిస్తుంది. మార్కెట్‌లో లభించే రెడీమేడ్‌ ఆహరపదార్ధాలపై వున్న లేబిల్స్‌ను జాగ్రత్తగా చదవండి. వాటిమీద వున్న సాంకేతిక, శాస్త్రీయ పదాలను సరిగ్గా అర్థం చేసుకోండి.

మీకు పాల వల్ల అలర్జీ వుంటే, సోడియం కాసినేట్‌ అని రాసి వున్న వేవీ తీసుకోకండి. గోధుమలు వల్ల అలర్జీ వుంటే .... గోధుమలతో తయారుచేసిన వస్తువులు ప్యాక్‌ పైన గ్లుటేన్‌ అని రాసి వున్న వాటికి దూరంగా వుండాలి. గుడ్డు వల్ల అలర్జీ వేంటే బేకరీ బిస్కట్లు, బ్రెడ్‌లను , మయొనైజ్‌తో డ్రసింగ్‌ చేసిన సలాడ్‌లను, బేకింగ్‌ మిక్స్‌లను వాడొద్దు.బయట హోటళ్ళలో తినేటప్పుడు మెను ఎంపికలో చాలా జాగ్రత్తగా వుండాలి.వీలుంటే ముందుగానే వెయిటర్లకు, చెఫ్‌ లేదా మేనేజర్లకు మీ ఫుడ్‌ అలర్జీ గురించి చెప్పండి బయట ఆర్డర్‌ చేసేటప్పుడు సింపుల్‌గా వుండే మెనునే ఎంపిక చేసుకోండి.ఫుడ్‌ అలర్జీ, ఇంకా ఇతర రకాలైన అలర్జీలున్నవారు ముందుగానే తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎనాఫైలాక్టిక్‌ రియాక్షన్‌ ఉంటే, 'ఎపినెఫ్రైన్‌' ఇంజెక్షన్‌ మీ దగ్గర వుంచుకోవాలి. ఒకవేళ ఆహారపదార్ధాలు వికటించి రియాక్షన్‌ వస్తే ఈ ఇంజెక్షన్‌ వెంటే
వేసుకోవచ్చు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దాన్ని ఎలా వాడాలో చెప్పాలి. మీకు అలర్జీ కలిగించే పదార్ధాలు వేటి వేటిలో వున్నాయో ముందుగానే తెలుసుకోండి.

గోధుమల వల్ల అలర్జీ వుంటే మాల్టెడ్‌ బెవరేజ్‌లను తీసుకోవద్దు. కోకో డ్రింక్‌, బీర్‌, విస్కీల వంటి వాటికి దూరంగా వుండాలి. హోటళ్ళలో సాస్‌లు, కూరలు చిక్కగా వుండటానికి గోధుమ పిండి కలుపుతారు. అందువల్ల బయట తినేటప్పుడు ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలి. పాల వల్ల అలర్జీ వుంటే బ్రెడ్‌, కేకులు, వెన్న, మీగడ వున్న ఉత్పత్తులన్నింటినీ వాడకపోవడం మంచిది. అలాగే ఐస్‌క్రీం, మిల్క్‌ చాకొలెట్‌, క్రీమ్‌ సాస్‌లను పూర్తిగా మానివేస్త్తే మంచిది.

చికిత్స :
వెంటనే ఉపశయనము కోసము :
ఎవిల్ ఇంజక్షన్‌ , బెట్నెసాల్ ఇంజక్షన్‌ , అడ్రినాలిన్‌ ఇంజక్షన్‌ వాడుతారు . తదుపరి అవే మాత్రల రూపములో 2-3 రోజులు వాడాలి.
దీర్ఘకాలిక ఎలర్గీ ఉన్నవారు :
ప్రతిరోజూ ఒక లీవో సిట్రజైన్‌ మాత్ర వేసుకుంటే ... ముందుజాగ్రత్తగా ఎలర్జీ తీవ్రత నుండి బయట పడవచ్చును.

  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

తల తిరుగుడు, కళ్లు తిరుగుడు,Reeling sensation



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --కళ్లు తిరుగుడు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కళ్లు తిరగడం, ఒళ్లు తూలడం సాధారణంగా ప్రతీ మనిషికీ ఎప్పుడో ఒకసారి ఎదురవుతాయ. ఇవి సాధారణమే అయనా ఏ వ్యాధి లేకుండానే ఇలాంటివి ఎదురైతే ఒక్కోసారి వ్యాధులు రావడానికి ముందు సూచనగా కూడా ఇవి బయటపడుతుంటాయ. కనుక ఎప్పుడైన కళ్లు తిరిగినా, ఒళ్లు తూలిన దానికి కారణాలను తెలుసుకోవాలి. అవసరమైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత డాక్టర్ల సలహాను పాటించవలసి ఉంటుంది.

వ్యాధుల వలన కలిగే తలతిరుగుడుకు కారణం 
  • తలకు పెద్ద గాయం అవడం, 
  • లోపలి చెవిలో సమతుల్య నియంత్రణ కలిగించే అవయవం లోపల చేరిన వైరస్, 
  • లోపలి చెవిలో అవయవం లోపం, 
  • లోపలి చెవి శస్తచ్రికిత్స అనంతరం ఇలాంటి జబ్బు కనపడుతుంది. 
  • యూస్టాషియన్ గొట్టం మూసుకొనుట వలన కలిగిన చెవి దిబ్బడ, 
  • రాయలా గట్టిగా చెవిలో గులివి ఏర్పడినపుడూ, 
  • మెడ ఎముకలు అరుగుదల లాంటివి ఏర్పడినపుడు తల తిరుగుడు ... కళ్లు తిరుగుడు కనిపిస్తుంది. 
  • అదిక రక్తపోటు ఉన్నవారిలో కూడా ఒక్కక్క సారి తలతిరిగినట్లు ఉంటుంది . 



  • కళ్ళు తిరగడానికి కారణాలు:
ఇవి మూదు రకాలైనవి --->
1. వ్యాధి వలన (పేథోలాజికల్‌)--2.వ్యాధి లేకుండానే (నాన్‌ పేథోలాజికల్‌)---3. తీవ్ర మానసిక ఆందోళనలు (సైకొలాజికల్)కలిగినపుడు...



1.తలకి తగిలిన దెబ్బలు (రోడ్‌ ప్రమాదాలు)

2. వాహన ప్రయాణంలో కదలికలు పడక వచ్చే లక్షణం (ట్రావెల్‌ సికనెేస్‌)

3. చెవిలో సమతూల్య నియంత్రణ కలిగించే అవయవం (మినియర్స్‌ వ్యాధి)

4. వైరస్‌ వ్యాధులు, గవద బిళ్ళలు, తట్టు వంటి వ్యాధులు సోకిన తరువాత

5. లోపలి చెవి శస్త్ర చికిత్స అనంతరం

6. తీవ్రమైన పెద్ద శబ్దాలు దగ్గరగా విన్నపðడు

7. చెవిలో చీము (ప్రమాదకరమైన రకం అన్‌ సేఫ్‌ సి.ఎస్‌.ఓ.ఎం)

8. యూస్టాషియన్‌ గొట్టం మూసుకొనుట వలన కలిగిన చెవి దిబ్బడ

9. రాయిలా గట్టిగా గులివి ఏర్పడినపðడు

10. మెడ ఎముకల ఆరుగుదల (సర్వైకల్‌ స్పాండిలోసిస్‌)

11. కంటి చూపులో పవర్‌లో మార్పులు

12. రక్తపోటు అస్తవ్యస్తం (అధిక పోటు/బి.పి. తగ్గుట)

13. తీవ్రమైన రక్తహీనత

14. మెదడులో కంతులు

15. అతి తీవ్రంగా మానసిక వత్తిడులు

16. పక్క నుండి హఠాత్తుగా లేచినా, తలను ఒక వైపు నుండి పక్కకు తిప్పినా తల తిరుగుడు వస్తుంది. (పొజిషనల్‌ వర్టిగో)

  • వ్యాధి నిర్ధారణ పరీక్షలు:

ఈ వ్యాధి చికిత్సలో చెవి, ముక్కు, గొంతు వ్యాధి నిపుణులతో బాటు ఫిజీషియన్‌ నరాల సంబంధిత వైద్యుల పాత్ర కూడా ఉంటుంది.

- చెవి పరీక్ష

- ఆడియోలజీ పరీక్షలు

- సమతూల్య (వెస్టిబ్యులర్స్‌) పరీక్షలు, ఇఎన్‌జి, కేలోరిక పరీక్షలు

- రక్త పరీక్షలు

- మధుమేహం, కొవ్వు (కొలస్ట్రాల్‌) పరీక్షలు

- హెచ్‌.ఐ.వి. పరీక్షలు

- మెడ ఎక్సరే

- ఈసిజి ఇతర సంబంధిత రోగ లక్షణాలను నిశితంగా పరీక్షించాలి.

రోగానికి గల కారణం నిర్ధారణ చేసి దానికి తగిన చికిత్స చేయాలి. మొట్టమొదట కళ్ళు తిరగటం, తలతిరగటం తీవ్రంగా ఉన్నప్పుడు రోగికి ధైర్యం చెప్పాలి. కారణం తెలుసుకున్నాకా కొన్ని యాంటీ వర్టిగో మందులతో, వ్యాయామాలతో వ్యాధిని తగ్గించవచ్చును. మెద డులో కంతుల వంటి వ్యాధులకు శస్త్ర చికిత్స అవసరమౌతుంది. మినియర్స్‌ వ్యాధి ఇది తరచుగా వచ్చే వ్యాధి. ఇందులో తలతిరగ టం, చెవిలో హౌరు, వినికిడిలోపం మధ్యమధ్యలో ఉధృతం అవుతూ (అటాక్  లా) వస్తుంది. ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవాలి. లేనిచో శాశ్వతంగా వినికిడి లోపించి మనిషికి అసహాయత రావచ్చు.

  • గుండె సంబంధమైనవి

అధిక రక్తపోటు వల్ల మెదడులోని రక్తనాళాలపై పీడం ఏర్పడినప్పుడు, రక్తనాళాల్లో కొవ్వు పదార్థాం చేరడం వల్ల మెదడుకు అందాల్సిన ఆక్సిజన్‌ పరిమాణం తగ్గి తలతిరగడం జరుగుతుంది.

వైద్యం :

 మూలకారణమైన అధిక రక్తపోటు తగ్గించే మందులు వాడాలి. కొవ్వు పదార్థాలు తగ్గించే స్టాటిన్స్‌ వాడాలి. అంతేకాక తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

  •     చెవి, ముక్కు, గొంతు

చెవి అంతర్భాగంలోని శబ్ద ప్రసరణ వ్యవస్థలోనూ, రక్త సరఫరాలోనూ, చెవిలోని చిన్న ఎముకల్లో ఏర్పడే తేడాల వల్ల చెవిలో మీనిమర్స్‌ వ్యాధి,Vertigo ఏర్పడి దాని ద్వారా మనిషి ఒక పక్కకు తిరిగినప్పుడు ఉన్నట్టుండి తలతిరగడం జరుగుతుంది.

వైద్యం :

 ఇఎన్‌టి వైద్యనిపుణులను సంప్రదించి ‘స్టిరాయిడ్‌’ వైద్యం, సినర్జిన్‌ వంటి మందులు వాడాలి.

  •     ఆర్థోపెడిక్‌

మెడలోని ఎముకలు, మెడ నుండి వచ్చే వివిధ నరాలు చేతుల్లోకి వస్తాయి. అలాగే మెదడుకు గుండె నుండి ప్రసరించే రక్తం మెడ ముందు భాగంలోని రెండు కెరోటాడ్‌ రక్తనాళాలు, మెడలోని ఎముకల మధ్య గల రంధ్రాల ద్వారా రెండు సర్వైకల్‌ వెర్టబ్రల్‌ రక్త నాళాల ద్వారా ముఖ్యంగా మెదడు వెనక భాగానికి రక్తాన్నందిస్తాయి. మెడలోని ఎముకల అరుగుదలలో ఈ రక్త నాళాలు ఒక్కోసారి ఒత్తిడికి లోనై మెదడుకు సరఫరా అయ్యేరక్తం తగ్గినప్పుడు తలతిరగడం, నిద్ర నుండి లేచినప్పుడు తలతిరిగి పడిపోతారు.---

వైద్యం :

 దీనికి కాలర్‌, ట్రాక్షన్‌ వైద్యం అవసరం. ద్విచక్ర వాహన ప్రయాణాలు తగ్గించాలి.
తాత్కాలికముగా వాడే మందులు :


  • సిన్నర్జిన్‌ – 25 మిల్లీ గ్రాముల నుండి 75 మిల్లీగ్రాముల వరకు రోజూ రెండు సార్లు వాడాలి.
  • డోమ్‌పెరిడోన్‌ – 10 నుండి 20 మిల్లీగ్రాములు రోజూ రెండు సార్లు వాడాలి.
  • బీటా హిస్టిన్‌ హైడ్రోక్లోరైడ్‌ – 8,16,24 మిల్లీగ్రాముల డోసులు రోజుకు 2 లేక 3 సార్లు వాడాలి.
  • స్టెమ్‌టిల్ 5 మి.గా రోకుకు 2-3 సార్లు . 4-5 రోజులు .


  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

భయం కూడా ఓ జబ్బే , Phobia is also a Disease



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -భయం కూడా ఓ జబ్బే , Phobia is also a Disease- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



క్షణ క్షణం భయం.. భయంగా  చాలా మంది గడుపుతుంటారు. ప్రతిదానికి ఏదో భయం వారిని పీడిస్తుంటుంది. మాకు తెలిసిన ఒక కుర్రాడు నవీన్. బి.టెక్ పాసయ్యాడు. మంచిర్యాంకు సాధించాడు. ఢిల్లీలోని మల్టీ నేషనల్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కోసం పిలుపు వచ్చింది. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. స్టేషన్ వరకు వెళ్ళి రైలు ఎక్కడానికి భయపడి ప్రయాణం రద్దు చేసుకున్నాడు. దూరప్రాంతాలలో ఉద్యోగం చేస్తే రైలు ఎక్కాల్సి వస్తుందన్న భయంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఉన్న ఊరిలోనే చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకున్నాడు.
వైదేహి అమెరికాలో ఎం.ఎస్. చేసింది. అక్కడే మంచి ఉద్యోగం సంపాదించింది. పెద్దల బలవంతంమీద అక్కడే ఉద్యోగం చేస్తున్న తెలుగువారి అబ్బాయిని పెళ్ళి చేసుకుంది. మొదటి రాత్రి విపరీతంగా భయపడి విచిత్రంగా ప్రవర్తించింది. మానసిక వైద్యునికి చూపిస్తే ఆమె పానిక్ డిజార్డర్ (కారణం లేని భయం)తో బాధ పడుతున్నట్టు చెప్పాడు. దీంతో భర్త ఆమెను ఒదిలిపెట్టేశాడు.
  • భయాలు పలురకాలు : ఉదాహరణ ->
ఏ విషయం గురించయినా అతిగా భయపడడాన్ని ఫోబియా (Phobia) అంటారు.
  •     ఏక్రోఫోబియా (Acrophobia)     : ఎత్తైన ప్రదేశాలంటే భయం
  •     క్లాస్ట్రోఫోబియా (Claustrophobia): ఒంటరితనం అంటే భయం.
  •     నెక్రోఫోబియా (Necrophobia)     : చావు అంటే భయం
  •     పైరోఫోబియా (Pyrophobia)     : అగ్గి అంటే భయం
  •     హీమోఫోబియా (Hemophobia)     : రక్తం అంటే భయం
  •     హైడ్రోఫోబియా (Hydrophobia)     : నీరు అంటే విపరీతమైన భయం



భయం మనిషి సహజ లక్షణం. ప్రమాదకర వ్యక్తులు, జంతువులు, సంఘటనలు ఎదురైనప్పుడు ప్రతివారు భయపడతారు. అయితే కొంతమంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా భయపడుతూ ఉంటారు. ‘‘క్షణక్షణం భయం భయం… బ్రతుకంతా చీకటిమయం’’ అన్నట్టు వ్యవహరిస్తుంటారు. పులికంటె గిలి (భయం) ప్రమాదమన్నట్టు చిన్న విషయాలకే వణికి పోతుంటారు.

మరణం మనిషికి ఒకసారి వస్తే అనవసర భయస్తులు ప్రతి నిత్యం చచ్చి బ్రతుకుతుంటారు. ప్రాణాంతక వ్యాధుల కంటే భయం ఎక్కువగా బాధిస్తుంటుంది. మనిషిలో స్వతహాగా ఉండే శక్తియుక్తుల్ని, మేధా సంపత్తిని భయం విచ్ఛిన్నం చేస్తుంది. అన్నిటికీ అవరోధంగా మారుతుంది.
కాదేదీ కవిత్వకనర్హం అన్నమాట భయానికి వర్తిస్తుంది. బల్లి, నల్లి, గాలి, నీరు లాంటి చిన్నచిన్న విషయాలకు భయపడేవారున్నారు. భయం వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. వైఫల్యం చెందుతామన్న భయం విజయానికి అవరోధంగా మారుతుంది. లక్ష్య సాధనకు అడ్డంకిగా పరిణమిస్తుంది. ఆరోగ్యంపట్ల పెంచుకునే భయం లేని జబ్బులను గూర్చి ఆలోచింపచేస్తుంది. మరణభయం ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. నష్టాలను గూర్చిన భయం ఆందోళనకు దారి తీస్తుంది.
భయాలన్నింటికంటే అపజయం పాలవుతామన్న భయం ప్రగతికి అవరోధంగా నిలుస్తుంది. ప్రతికూల భావాలను పెంచి పోషిస్తుంది. అధిక శాతం విద్యార్థులు పరీక్షలంటే భయపడుతుంటారు. ఈ భయం ముదిరి డిప్రెషన్, ఆత్మహత్యలకు దారి తీస్తుంటుంది. అలాగే ఒక్కో విద్యార్థి ఓక్కో సబ్జెక్టును చూసి భయపడుతుంటారు. ఇలాంటి భయం వారి ఉన్నత చదువులకు అడ్డంకిగా మారుతుంది. లెక్కల భయం ఇంజనీరుని కానివ్వదు. కప్పలు, పాములను కోయాల్సి వస్తుందన్న భయం మెడిసన్ చదవనివ్వదు. ఈ భయం ముదిరితే ఫోబియగా మారుతుంది.
నిజానికి భయం, ధైర్యం లాంటివి అలవాటుగా వస్తాయి. చిన్నప్పటి నుంచి పెంచుకున్న నమ్మకాలు, విశ్వాసాలు, అనుభవాలే ఇందుకు మూలలుగా ఉంటాయి. పెంపకలోపం, పరిసరాల ప్రభావం భయాన్ని పెంచి పోషిస్తాయి. కొంతమంది బాల్యపు అనుభవాలవల్ల భయానికి గురవుతారు. అధిక శాతం మందిలో తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలే భయాన్ని రేకెత్తిస్తుంటారు. బాల్యంలో అన్నం తినని పిల్లల్ని బూచోడు వస్తాడు అంటూ భయపెడతారు. అల్లరి చేస్తే స్కూలుకు పంపేస్తా. హాస్టల్లో పడేస్తా… డాక్టర్‌చేత సూది వేయిస్తా అంటూ భయపెడుతుంటారు. సైకిల్ తొక్కాలంటే పడిపోతావని, ఈత నేర్చుకోవాలంటే మునిగిపోతావని భయాన్ని రుద్దుతారు. అలాగే ప్రతికూలంగా మాట్లాడి పిల్లల్లో పిరికిమందు పోస్తుంటారు. మా బాబుకి ఎక్కాలే రావు. వాడు ఇంజనీరింగ్ ఏమి చేస్తాడు అంటూ ఇతరుల ముందు హేళన చేస్తారు. అలాగే మా అమ్మాయి బొద్దింక అంటే ఆమడ దూరంలో ఉంటుంది. ఇక డాక్టర్ కోర్సు ఎలా చేస్తుందంటూ ఆట పట్టిస్తుంటారు. ఇలాంటి మాటలు పిల్లలను భయస్తులుగా మారుస్తాయి. చాలామంది తల్లిదండ్రులు భయపెడితే బాగుపడతారని ఆలా చేస్తుంటారు. భయపెట్టడానికి జాగ్రత్త పర్చడానికి తేడా తెలియక అలా చేస్తుంటారు.
అయితే భయాన్ని జయించడం పెద్ద కష్టమేమీ కాదు. భయం, ఫోబియాలకు గురయ్యేవారు వాస్తవాలను ఆలోచించాలి. మిగిలిన వారికి లేని భయం తమకే ఎందుకుందో విశే్లషించుకోవాలి. సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. నెమ్మది, నెమ్మదిగా భయాన్ని ఎదుర్కోవడంలో సాధన చేయాలి. అవసరమైతే సైకాలజిస్టుల సహాయం పొందాలి.

--డాక్టర్ ఎన్.బి.సుధాకర్ రెడ్డి
  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, 2 October 2011

మెల్లకన్ను,Squint




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మెల్లకన్ను,Squint- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రెండు కళ్లూ కలిసికట్టుగా పనిచేస్తేనే.. మన చూపు బాగుంటుంది. సంపూర్ణ దృష్టికి మనకు రెండు కళ్లు ఎంత అవసరమో.. ఆ రెండూ సమన్వయంతో పని చేయటం కూడా అంతే అవసరం. కానీ 'మెల్ల' బాధితుల్లో.. ఆ సమన్వయం కొరవడి.. ఒక కన్ను ఒక దిక్కు చూస్తుంటే.. రెండోది మరో దిక్కు చూస్తుండటం.. పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే చూపుకు చేటు .

కానీ మెల్లపై మన సమాజంలో ఇప్పటికీ బోలెడు అపోహలు పాతుకుపోయాయి. ఎన్నో తప్పుడు నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ చూపుకి చేటు తెచ్చేవే. బిడ్డకు మెల్ల ఉందని గుర్తిస్తే.. వెంటనే పిల్లల నేత్రవైద్యుల సలహా తీసుకోవటం.. అవసరమైతే సర్జరీతో దాన్ని సరిచేయించటం బిడ్డ భవిష్యత్తుకు చాలా కీలకం.

పసిపిల్లలకు అభంశుభం తెలియదు. కొన్ని ఆరోగ్య సమస్యలు తమను ఇబ్బంది పెడుతున్నా.. వాటి గురించి తల్లిదండ్రులకు చెప్పలేరు. కానీ... వాటి విషయంలో తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకుని వెంటనే చికిత్స చేయించకపోతే పిల్లలు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది... మెల్ల! ఎందుకంటే తమ కంటిలో మెల్ల ఉన్నా పిల్లలకు నొప్పీ, బాధా ఏదీ ఉండదు కాబట్టి.. తమకు కనిపిస్తున్నదే ఈ లోకమని భావిస్తూ.. అలాగే పెరిగి పెద్దవాళ్లవుతారు. కానీ దాని ప్రభావం వాళ్లను జీవితాంతం బాధిస్తుంది. ఎలాగో అర్థం చేసుకోవాలంటే.. మెల్ల గురించి కాస్త వివరంగా తెలుసుకోవటం అవసరం.

మెల్ల అంటే..?
మన కళ్లు అద్భుతమైన కెమేరాల్లాంటివి! మన కనుగుడ్లు రెండూ సమన్వయంతో పని చేస్తూ... రెండూ ఒకే దిశలో కదులుతూ.. ఒకే దృశ్యాన్ని రెండూ గ్రహించి.. మెదడుకు పంపిస్తాయి. అలా అందిన ఆ దృశ్యాలు రెంటినీ సమన్వయించుకుని మెదడు మనకు.. పొడవు-వెడల్పు-లోతులన్నీ తెలిసేలా సంపూర్ణమైన దృశ్యాన్ని (త్రీడీ చిత్రాన్ని) చూపిస్తుంది. ఇదీ సాధారణంగా జరిగేది. ఇలా మన రెండు కనుగుడ్లూ సమన్వయంతో ఒకే దిశలో కదిలేలా చూసేందుకు.. వాటిని ఒకే దిశలో కదిపేందుకు ఒక్కో కనుగుడ్డు వెనకా ఆరు కండరాలు సమన్వయంతో పని చేస్తుంటాయి. కనుగుడ్డు కదలికలకు ఈ కండరాలే కీలకం. కానీ కొందరిలో ఈ కనుగుడ్ల కదలికల్లో సమన్వయం కొరవడుతుంది. ఫలితంగా ఒక కనుగుడ్డు ఒక దిక్కు చూస్తుంటే... రెండో కనుగుడ్డు మరో దిక్కు చూస్తుంటుంది. దీన్నే మనం మెల్ల (స్క్వింట్‌/స్ట్రెబిస్మస్‌) అని పిలుస్తాం.

మెల్లతో నష్టం ఏమిటి?
మెల్ల ఉన్న కన్ను పంపించే చిత్రం అస్పష్టంగా ఉంటుంది. రెండు కళ్లూ పంపించే చిత్రాలూ ఒకే తీరుగా లేకపోవటం.. అవి సరిపోలకపోవటంతో క్రమేపీ మెల్ల కన్ను పంపించే చిత్రాన్ని మెదడు గ్రహించటం మానేస్తుంది. ఉదాహరణకు కుడి కన్నులో మెల్ల ఉంటే.. ఆ కంటి నుంచి వచ్చే మసక, మసక దృశ్యాన్ని మెదడు సరిగా గ్రహించలేక.. మంచిగా ఉన్న ఎడమ కంటి నుంచి వచ్చే సంకేతాల మీదే ఎక్కువగా ఆధారపడుతుంది. క్రమేపీ కుడి కంటి నుంచి మెదడుకు అందాల్సిన సంకేతాలు క్షీణించిపోతాయి. దీనివల్ల మెదడులో దృశ్యాలను క్రోడీకరించుకునే ప్రక్రియ దెబ్బతిని.. మెదడులోని ఆయా భాగాలూ బలహీనపడతాయి. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఆ కంటి పనితీరు మరింత మందగిస్తుంది. దీన్నే 'లేజీ ఐ (ఆంబ్లయోపియా)' అంటారు. ఫలితంగా మెదడు ఒక కంటి మీదే ఆధారపడటానికి అలవాటు పడిపోతుంది. దీనివల్ల సమగ్రమైన, సంపూర్ణమైన (బైనాక్యులర్‌, త్రీడీ విజన్‌) దృష్టి లోపిస్తుంది. రోడ్డు మీద ఏదైనా వాహనం వస్తున్నప్పుడు అదెంత దూరంలో ఉంది, ఏ దిశలో వస్తోంది వంటి అంశాలను సరిగా అంచనా వేయలేరు. చూడటంలో అస్పష్టత నుంచి ప్రమాదాల బారినపడటం వరకూ.. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఎందుకొస్తుందీ మెల్ల?
మెల్ల ఎందుకొస్తుందో స్పష్టమైన కారణాలు తెలియదు. ఓ 10-20% మందిలో ఇది జన్యుపరంగా రావొచ్చు. 50-60% మందిలో మాత్రం కచ్చితంగా కారణం చెప్పటం కష్టం. చాలా అరుదుగా మెదడులో కణుతులు, ఇన్ఫెక్షన్ల వంటి జబ్బులు, మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవటం, చిన్నతనంలోనే కంట్లో శుక్లాలు ఉండటం, కంటికి దెబ్బ తగలటం, కంట్లో కణుతుల వంటివాటివల్ల రావచ్చు. కానీ ఇలాంటివి చాలా చాలా అరుదు. ఎక్కువ శాతం మందిలో ఇలాంటి కారణాలేమీ లేకుండానే మెల్ల మొదలవుతుంది.

గుర్తించేదెలా?
మెల్లను గుర్తించటం కష్టమేం కాదు. చాలావరకూ తల్లిదండ్రులే తేలికగా పసిగడతారు. పసిబిడ్డ తల్లి ముఖాన్ని చూసి నవ్వకపోవటం, కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడలేకపోవటం.. మెల్లను గుర్తించటానికి తొలి లక్షణాలుగా భావించొచ్చు. కనుగుడ్లు వేర్వేరు దిక్కుల్లో తిరుగుతుండటం, ఒక కన్ను పూర్తిగా కదులుతుంటే రెండో కన్ను దాన్ని అనుసరించకపోవటం.. ఇలాంటి లక్షణాలను బట్టి మెల్లను గుర్తించొచ్చు. చాలాసార్లు ఫొటోల్లో మెల్ల స్పష్టంగా కనబడుతుంది. అరుదుగా మెల్ల కారణంగా కొందరిలో కనుగుడ్లు పైకీకిందికీ కదిలిపోతుంటాయి కూడా(షేకింగ్‌/నిష్టాగ్మస్‌). అయితే 80% మందిలో ఒక కనుగుడ్డు రెండోదాని కన్నా భిన్నంగా బయటివైపో, లోపలివైపో, పైకో, కిందికో తిరిగి ఉండటం కనిపిస్తుంది.
*మెల్లలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఒకటి రోజంతా.. నిరంతరం కనబడే రకం. రెండోది- రోజులో ఎప్పుడన్నా కొన్నికొన్ని సమయాల్లో, ముఖ్యంగా బాగా అలసినప్పుడు, తీవ్రమైన జ్వరం వచ్చినపుడు, పగటి కలలు కంటున్నప్పుడు కనబడుతూ.. ఆ తర్వాత పోతుంటుంది. వీటిలో ఏది కనబడినా, ఏ కొంచెం అనుమానం ఉన్నా పిల్లల కంటి వైద్యులతో పరీక్ష చేయించటం ఉత్తమం. ఈ పరీక్ష ఎంత చిన్న వయసులో చేయిస్తే అంత మంచిది. ఏడాదిలోపు మరీ ఉత్తమం.

చిన్నతనంలో లేకుండా.. పెద్ద వయసులో ఉన్నట్టుండి మెల్ల వస్తే- రెండు కళ్లూ మెదడుకు రెండు రకాల చిత్రాలను పంపిస్తాయి. దీంతో దృశ్యాలన్నీ రెండుగా కనబడతాయి. చూపు దెబ్బతింటుంది. ఇటువంటి సందర్భాల్లో కూడా కనుగుడ్లను సరైన సమన్వయంతో పనిచేసేలా సర్జరీతో చక్కదిద్దాల్సి ఉంటుంది.

సర్జరీ ఎప్పుడు మేలు?
పసితనంలోనే మెల్ల కనబడితే 8-9 నెలల వయసులో సర్జరీ చేయటం ఉత్తమం. దీనివల్ల చూపు దెబ్బతినకుండా ఉంటుంది. కనుగుడ్లు రెండూ చక్కటి సమన్వయంతో పనిచేస్తాయి కాబట్టి మెదడులోనూ పెద్దగా మార్పులు రావు. చూపు క్షీణించటమన్న సమస్య ఉండదు. స్కూలుకు వెళ్లే పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు. కొన్ని రకాలైతే 4-5 ఏళ్లు ఆగొచ్చు. కానీ దేనికి ఆగొచ్చు, దేనికి ఆగకూడదన్నది నిపుణులైన వైద్యులే నిర్ధారించాల్సి ఉంటుంది.
రెండు కనుగుడ్లూ సమన్వయంతో ఒకే దిశలో కదిలేలా చూసేందుకు.. వాటిని ఒకే దిశలో కదిపేందుకు ఒక్కో కనుగుడ్డు వెనకా ఆరు కండరాలు సమన్వయంతో పని చేస్తుంటాయి.
ఏళ్లు గడుస్తున్నకొద్దీ మెల్ల సమస్య వల్ల ఆ కంటి పనితీరు మరింత మందగిస్తుంది. దీన్నే 'లేజీ ఐ' అంటారు. ఫలితంగా మెదడు చూపు కోసం- బాగున్న ఒక కంటి మీదే ఆధారపడటానికి అలవాటు పడిపోతుంది. దీనివల్ల సమగ్రమైన, సంపూర్ణమైన దృష్టి (బైనాక్యులర్‌, త్రీడీ విజన్‌) లోపిస్తుంది.

మెల్ల అపోహల పుట్ట
'మెల్ల'పై మన సమాజంలో బోలెడు అపోహలు పాతుకుపోయాయి.
1 మెల్లకన్ను అందానికి చిహ్నమని నమ్మేవాళ్లున్నారు.. కానీ మెల్ల వల్ల అందం ఇనుమడించకపోగా... తోటివారు గేలి చేయటం, చిన్నచూపు చూడటం, వీరితో స్నేహం చేయటానికి అంతగా ముందుకురాకపోవటం.. ఇలాంటి సమస్యలతో సతమతమవుతూ క్రమేపీ ఈ పిల్లలు న్యూనతా భావానికి గురవుతుంటారు. ఈ విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు గమనించటం లేదు.
2 మెల్లకన్ను దేవుడిచ్చిన వరంగా నమ్మేవాళ్లూ ఉన్నారు.. కానీ వాస్తవానికి ఇది వరం కాదు.. మెల్లను నిర్లక్ష్యం చేస్తే ఆ కంటి చూపు పూర్తిగా పోయే ప్రమాదం పొంచి ఉంటుంది.
3 పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ మెల్ల దానంతట అదే పోతుందని భావిస్తూ.. తాత్సారం చేసేవాళ్లున్నారు. కొందరు వైద్యులు కూడా 5-6 ఏళ్ల వరకూ చూడొచ్చని సూచిస్తుంటారుగానీ.. మెల్ల తీవ్రంగా ఉన్నప్పుడు చిన్నవయసులోనే దాన్ని సరిదిద్దకపోతే ఆ కంటి చూపు క్షీణించిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక పెద్ద వయసులో దాన్ని సరిచేసినా అప్పటికే చాలా నష్టం జరిగిపోతుంది.. ఫలితాలు సంపూర్ణంగాఉండవు.
4 మెల్లకు సర్జరీ చేస్తే మొత్తం చూపు దెబ్బతింటుందన్న భయాలూ కొందరిలో ఉన్నాయిగానీ.. వాస్తవానికి అవసరమైనప్పుడు సర్జరీ చేయించకపోతేనే చూపు దెబ్బతింటుందిగానీ చేయిస్తే కాదు. మెల్ల సరిదిద్దేందుకు చేసే సర్జరీ చాలా సురక్షితమైనది, దాంతో దుష్ప్రభావాలు చాలా తక్కువ.
చిన్నతనంలో తల్లిదండ్రులు అవగాహనారాహిత్యంతో మెల్లను సరిచేయించకుండా వదిలేయటం వల్ల.. పిల్లలు మెల్ల సమస్యతోనే పెరిగి పెద్దవాళ్త్లె.. అప్పుడు పెళ్లి సంబంధాలు కుదరవనో... ఉద్యోగం దొరకటం కష్టంగా ఉందనో హడావుడిగా కంటి వైద్యులను సంప్రదిస్తున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఆ వయసులోనూ సర్జరీతో 'మెల్ల' కనబడకుండా చక్కదిద్దచ్చుగానీ చూపు విషయంలో ఫలితాలు సంపూర్ణంగా ఉండకపోవచ్చు. అదే చిన్న వయసులోనే సరిచేస్తే చూపు ఎక్కువగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

అందరికీ ఆపరేషన్‌ అక్కర్లేదు!
మెల్ల కన్ను సమస్య ఉన్నవారందరికీ ఆపరేషన్‌ అవసరం రాదు. కొన్నింటిని కేవలం అద్దాలతోనే సరిచేయొచ్చు. మెల్లలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఒకటి- కంజెనైటల్‌ లేదా ఇన్‌ఫంటైల్‌ ఈసోట్రోపియా. మెల్ల బాధితుల్లో 70% వరకూ ఇలాంటి వారే. వీరికి ఆపరేషన్‌ తప్పనిసరి. రెండోది- దృష్టిదోషం వల్ల వచ్చే 'అకామడేటివ్‌ ఈసోట్రోపియా' రకం. దీన్ని చాలావరకూ కళ్లద్దాలతోనే సరిచేయొచ్చు. కంటి చూపును పరీక్షించి వారికి అవసరమైన మేరకు అద్దాలు ఇస్తే సరిపోతుంది. కంట్లో దృష్టిదోషం ఉన్నప్పుడు స్పష్టంగా చూసేందుకు మరింత శ్రమతో చూడాల్సి వస్తుంది. దీనివల్ల మెల్లగా కనుగుడ్డు పక్కకు జరగటం ఆరంభిస్తుంది. ఇది క్రమంగా 'మెల్ల'కు దారి తీస్తుంది. ఈ దృష్టిదోషాన్ని సరిచేస్తూ కళ్లద్దాలు ఇస్తే ఈ రకం క్రమేపీ చక్కబడుతుంది. అందుకే వైద్యులు మెల్ల సమస్యతో వచ్చినప్పుడు ముందు సమస్య ఏ స్థాయిలో ఉంది? రెండు కళ్లలోనూ చూపు ఎలా ఉంది? పవర్‌ ఏదైనా ఉందా? కనుగుడ్డు పక్కలకు మాత్రమే మళ్లిందా? పైకీ కిందికీ జరిగిందా? వంటి వాటిని కొలతలతో సహా నిర్ధారిస్తారు. ఎక్కువమందిలో కన్ను లోపలికి మళ్లటం (ఈసోట్రోపియా), బయటకు మళ్లటం (ఎక్సోట్రోపియా) కనిపిస్తాయి. కంట్లో శుక్లాలు, కణుతుల వంటి ఇతరత్రా సమస్యలేమైనా ఉన్నాయేమో చూసేందుకు సంపూర్ణంగా నేత్ర పరీక్ష చేస్తారు. ఇతరత్రా సమస్యలేమీ లేకుండా కేవలం మెల్ల మాత్రమే ఉందని నిర్ధారిస్తే... 20-30 శాతం మందికి కేవలం గ్లాసులు ఇస్తేనే సరిపోతుంది. వీటితో మెల్ల పూర్తిగా సరి అయిపోతుంది.

* ప్యాచింగ్‌: కొన్నిసార్లు బలహీనపడిన కంటిని మళ్లీ పనిచేయించేందుకు అద్దాలతో పాటు 'ప్యాచ్‌ థెరపీ' కూడా చేస్తారు. బాగున్న కంటిని మూసివేస్తే.. మెల్లతో బలహీనపడిన కన్ను క్రమేపీ అధికంగా పని చేయటానికి అలవాటుపడి, దారిలోకి వస్తుంది. ఉదాహరణకు పిల్లవాడు 4 ఏళ్ల వయసులో వస్తే.. అప్పటికే మెల్ల ఉన్న కన్ను బలహీనపడి ఉంటుంది కాబట్టి దాన్ని మెరుగుపరిచేందుకు- 'లేజీ'గా మారిన ఆ కంటిని మరింతగా పని చేయిచేందుకు.. బాగున్న కంటిని 'ప్యాచ్‌'తో మూసివేస్తారు. కొందరికి కేవలం ఈ ప్యాచ్‌లతోనే మెల్ల సరి అయిపోతుంది.
* సర్జరీ: మెల్ల నిరంతరం లేకుండా వచ్చిపోతుంటే.. సాధారణంగా కొంతకాలం వేచి చూడొచ్చు. నిరంతరం ఉండే వారికి మాత్రం సత్వరమే సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది. కనుగుడ్లు రెండూ సమన్వయంతో కదిలేందుకు వెనకున్న కండరాలు కీలకం కాబట్టి.. సర్జరీలో ప్రధానంగా ఈ కండరాలను సరిచేస్తారు. ఉదాహరణకు గుడ్డు లోపలి వైపు తిరిగితే ఒకవైపు కండరాలను, బయటివైపు తిరిగితే మరో వైపు కండరాలను బిగువు చేయటం, వదులు చేయటం వంటి సర్దుబాట్లు చేస్తారు. దీంతో కనుగుడ్లు రెండూ ఒకే దిశలో కదలటం వీలవుతుంది. వీటిమధ్య సమన్వయం కోసం కొన్నిసార్లు మెల్ల ఉన్న కంటితో పాటు మెల్లలేని రెండో కంటికీ సర్జరీ చెయ్యాల్సి వస్తుంది. ఈ దిద్దుబాటు అంతా కూడా సూక్ష్మమైన లెక్కలతో ముడిపడినది కాబట్టి దీనిలో మంచి అనుభవం ఉన్న సర్జన్లు మాత్రమే దీన్ని చెయ్యగలరు. సర్జరీలోకనుగుడ్డు మీద చాలా చిన్న కోత మాత్రమే పెడతారు, కంటి చుట్టూ ఎటువంటి కోతలూ, మచ్చలూ ఉండవు. ఆపరేషన్‌ తర్వాత కూడా చూపు మెరుగయ్యే వరకూ కొంతకాలం ప్యాచ్‌లు వాడాల్సి రావచ్చు. 90 శాతం మందిలో ఈ సర్జరీతోనే సమస్య తొలగిపోతుంది. 10% మందిలో మాత్రం సర్జరీ తర్వాత కొంతకాలానికి మళ్లీ మెల్ల రావచ్చు. అప్పుడు మరోసారి దిద్దుబాటు చెయ్యాల్సి వస్తుంది. కొందరిలో బొటాక్స్‌ ఇంజక్షన్ల వంటివాటితోనూ దీన్ని సరిదిద్దే వీలుంటుంది.

-డా. రమేశ్‌ -పీడియాట్రిక్‌ ఆప్థల్మాలజిస్ట్‌-ఎల్వీప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌-హైదరాబాద్‌.
  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

రోగ నివారణి గా ఆహారు ,Food as disease preventive.



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --రోగ నివారణి గా ఆహారు ,Food as disease preventive- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వ్యాధుల బారిన పడకుండా మనలోని రోగనిరోధకశక్తి నిరంతరం కాపాడుతుంటుందని తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఇది పొరపాటున మన శరీరం మీదే దాడి చేస్తుంది. దీంతో కణజాలం దెబ్బతినటంతో పాటు క్షీణత వ్యాధులుగా పిలిచే ఆటో ఇమ్యూన్‌ జబ్బులకూ రావటానికి దోహదం చేస్తుంది. మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌, కీళ్లవాతం, క్రాన్స్‌ వంటివి అలాంటి జబ్బులే. ఇవి చాలావరకు జన్యు కారణంగా వచ్చేవే కానీ ఇన్‌ఫెక్షన్లు, మందుల వంటి పలు అంశాలు వీటిని ప్రేరేపిస్తుంటాయి. ఈ ఆటో ఇమ్యూనిటీని ఆహారం ఏమైనా ప్రభావితం చేస్తుందా? అన్న దానిపైనా చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు దీనిపై ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఆటో ఇమ్యూన్‌ వ్యాధులను ఆలస్యం చేయటం లేదా వెనక్కి మళ్లించటం, నివారించటంలో ఆహారం పాత్ర కూడా ఉంటున్నట్టు బయటపడుతోంది. ముఖ్యంగా ఇందుకు విటమిన్‌ డి, విటమిన్‌ ఏ, సెలీనియం, జింక్‌, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రొ బయోటిక్స్‌, గ్లుటమైన్‌, ఫ్లావనోల్స్‌ వంటివి బాగా ఉపయోగపడుతున్నాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి, క్యాల్షియం సమతుల్యతకు విటమిన్‌ డి దోహదం చేస్తుంది. మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌, కీళ్లవాతం జబ్బులకూ విటమిన్‌ డి లోపానికి సంబంధం ఉంటున్నట్టు తేలింది. పేగుల్లో వాపు, ఆటో ఇమ్యూనిటీని విటమిన్‌ ఏ, సెలీనియం నిరోధిస్తాయి. చేపలు, అవిసెగింజల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల నివారణకు మాత్రమే కాదు.. ఆటో ఇమ్యూనిటీ ముప్పును కూడా తగ్గిస్తాయి. అందువల్ల ముందునుంచే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జబ్బులు మొదలుకాగానే ఆహారంపై శ్రద్ధ పెట్టినా మంచిదే. సమతులాహారం తీసుకోవటం ద్వారా వ్యాధుల నుంచి కాపాడుకుంటూ మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/