Friday, 8 July 2011

PCOS(poly cystic overian syndrome), పాలి సిస్టిక్‌ ఓవరీ డిసీజ్‌ (పిసిఒయస్ )



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -PCOD(poly cystic overian syndrome), పాలి సిస్టిక్‌ ఓవరీ సిండ్రోం (పిసిఒయస్ )- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



బక్కపలచగా ఉన్నవారు ఒక్కసారిగా బరువు పెరిగినా... మొటిమలూ, అవాంఛిత రోమాల వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నా... నెలసరి సరిగ్గా రాకపోకపోయినా... ఇవన్నీ సహజమే అనుకోవడం... కొన్నిసార్లు సరి కాదు. అవి పీసీఓడీ (పాలీసిస్టిక్‌ ఒవరీ డిసీజ్‌ లేదా సిండ్రోమ్‌) లక్షణాలైతే కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

అధ్యయనాల ప్రకారం ప్రతి నలుగురు అమ్మాయిల్లో ఒకరికి పీసీఓడీ ఉంటుంది. అప్పుడే నెలసరి సమస్యలు మొదలవుతాయి. పాలీసిస్టిక్‌ అంటే.. ద్రవం తో నిండిన చిన్నచిన్న సంచులు. అంటే నీటి బుడగల్లాంటివి. అండం విడుదలకు ముందు అండాశయంలో అండం చిన్నదిగా ఏర్పడుతుంది. అది పెరగనప్పుడు ద్రవంతో నిండిన నీటి బుడగల్లాంటివి అండాశయంలో చేరతాయి. కొన్నిసార్లు అవి ఒకటి రెండు నుంచి పన్నెండు వరకూ ఉండొచ్చు. ఇవి క్యాన్సర్‌కు దారితీయకపోయినా వాటివల్ల ఇతరత్రా చాలా సమస్యలు ఎదురవుతాయి.

అధిక బరువూ... అవాంఛిత రోమాలు...
పీసీఓడీ ఉన్నా ఆ ప్రభావం హార్మోన్లపై ఉండనప్పుడు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. నెలసరి కూడా క్రమం తప్పకుండా వస్తుంది. అదే పద్ధతిలో అండం విడుదల అవుతుంది. ఎప్పుడైతే పీసీఓడీ వల్ల ఈస్ట్రోజెన్‌, ఆండ్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ లాంటి హార్మోన్ల అసమతూకం మొదలవుతుందో అప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి. అలాగే ఇన్సులిన్‌ పెరగడం వల్లా పీసీఓడీ వచ్చే అవకాశముంది. ఎలాగంటే.. రక్తంలో చక్కెర నిల్వల్ని నియంత్రించడంలో ఇన్సులిన్‌ పాత్ర కీలకం. అది పురుష హార్మోన్‌గా పరిగణించే టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అయితే చక్కెర స్థాయులు పెరిగినప్పుడు కండరాలూ, కొవ్వూ ఆ చక్కెర తీసుకునేలా చేయడం కోసం ఇన్సులిన్‌ ఎక్కువ కావాల్సి వస్తుంది. దాంతో టెస్టోస్టెరాన్‌ హార్మోను మోతాదూ పెరిగి అసమతూకం ఏర్పడుతుంది. ఈ మార్పులు అండాల విడుదలపై ప్రభావం చూపుతాయి. అప్పుడు నెలసరి ఇబ్బందులూ, సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోవడం, అవాంఛిత రోమాల వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఏయే సమస్యలంటే...
* మొదట ఏర్పడే ఇబ్బంది అండం విడుదల ఆగిపోవడం. ఈ సమస్యతో బాధపడే ప్రతి పదిమందిలో ఏడుగురికి నెలసరి సరిగ్గా రాదు. రెండు మూడు నెలలకోసారి రావడం, వచ్చినా తక్కువ రక్తస్రావం కావడం, కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. అండం విడుదల ఆగిపోవడంతో, గర్భం దాల్చే పరిస్థితి ఉండదు. అందుకే కొన్నాళ్ల పాటు గర్భం రావడం లేదంటే.. డాక్టర్లు పీసీఓడీ ఉండొచ్చని సందేహించి పరీక్ష చేయించుకోమంటారు.

* ఈ సమస్య ఉన్న వారిలో సగం మందికి ముఖం, పొట్ట, ఛాతీ దగ్గర అవాంఛిత రోమాలు పెరుగుతాయి. టీనేజర్లలో అయితే మొటిమలు విపరీతంగా వస్తాయి. జుట్టు ఊడిపోతుంది. ఇవన్నీ ఒకెత్తయితే, ప్రతి పదిమందిలో నలుగురు బరువు పెరుగుతారు. కొన్నిసార్లు అది స్థూలకాయానికీ దారితీస్తుంది. వీటివల్ల ఆత్మవిశ్వాసం తగ్గి, ఒత్తిడికి లోనవుతుంటారు కొందరు.

పీసీఓడీ లక్షణాలు టీనేజీ నుంచి కనిపించవచ్చు. అయితే అందరిలోనూ ఒకే తరహా సమస్యలు, అంతే తీవ్ర స్థాయిలోనూ ఉండకపోవచ్చు. కొందరికి కేవలం అవాంఛిత రోమాలే ఉండొచ్చు. మరికొందరిని మొటిమలే బాధిస్తాయి. అవాంఛిత రోమాలతో పోలిస్తే ఒక వయసు వచ్చాక మొటిమల సమస్య చాలా మటుకు తగ్గుతుంది.

అదుపు చేసే మార్గాలివి..
పీసీఓడీని నిర్థరించడానికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌తో పాటూ రక్తపరీక్ష చేస్తారు. అయితే ఈ సమస్యకు శాశ్వత చికిత్స లేదు. కానీ లక్షణాల తీవ్రతను తగ్గిస్తే, సమస్య అదుపులోకి వస్తుంది. అందుకు జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

* మొట్టమొదట బరువు తగ్గాలి. ఫలితంగా ఇన్సులిన్‌, టెస్టోస్టెరాన్‌ స్థాయులు అదుపులోకి వస్తాయి. అండం విడుదల జరిగి, నెలసరి ఇబ్బందులూ దూరం అవుతాయి. అవాంఛిత రోమాలూ, మొటిమల తీవ్రత కూడా తగ్గుతుంది. అయితే ఇది అనుకున్నంత సులువు కాదు. ఆకు కూరలూ, దంపుడుబియ్యం, ఓట్స్‌, పీచు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. కేక్‌లూ, బ్రెడ్‌, బర్గర్‌తో సహా ఇతరత్రా జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి. వంటి జంక్‌ఫుడ్‌ని క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువు తగ్గాలని కడుపు మాడ్చుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. సరైన ఆహార నియమాలు పాటించకపోతే చికిత్స తీసుకున్నా ఫలితం ఉండదు.

* అవాంఛిత రోమాలను నివారించేందుకు వ్యాక్సింగ్‌, హెయిర్‌ రిమూవింగ్‌ క్రీంలు వాడటం, ఎలక్ట్రాలిసిస్‌, లేజర్‌ చికిత్సలు ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. కొన్ని తాత్కాలిక ఫలితాన్నిస్తే... ఎలక్ట్రాలిసిస్‌, లేజర్‌ దీర్ఘకాలంగా దాన్ని అదుపులో ఉంచుతాయి. ఈ చికిత్సలతో పాటూ డాక్టర్‌ సలహాతో కొన్ని మందులు (Metformin) కూడా వాడితే టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ సమతూకంలో ఉంటుంది. ఈ మాత్రల్ని కనీసం మూడు నుంచి తొమ్మిది నెలల పాటు తీసుకోవాలి. మొటిమల సమస్యను నివారించేందుకు కొన్ని రకాల మాత్రలు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణుల సలహాతో వాడొచ్చు.

* నెలసరిలో ఆటంకం లేదా అసలు రానప్పుడు వైద్యులు కొన్ని మందుల్ని సూచిస్తారు. ఎందుకంటే నెలసరి అసలు రాకపోతే అది గర్భాశయ క్యాన్సర్‌కు దారితీయొచ్చు. అందుకే అది సక్రమంగా వచ్చేలా గర్భనిరోధక మాత్రల్ని(choice.Tablets) సూచిస్తారు. అవి కూడా పనిచేయకపోతే ప్రొజెస్టెరాన్‌ హార్మోన్‌ని కొన్నినెలల పాటు వాడమంటారు. దానివల్ల నెలసరి సక్రమంగా వస్తుంది. వయసూ, సమస్య తీవ్రతను బట్టి కొన్నిసార్లు గర్భాశయంలో ఇంట్రాయూటరైన్‌ పరికరాన్నీ అమరుస్తారు. దానివల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి రక్తస్రావం అవుతుంది.

గర్భం దాల్చడం..
టీనేజీలో ఈ సమస్య మొదలైనా.. భవిష్యత్‌లో గర్భం రావడం, రాకపోవడం అనేది ప్రతినెలా విడుదలయ్యే అండంపై ఆధారపడి ఉంటుంది. పీసీఓడీ ఉన్నా కొందరిలో ఈ సమస్య ఎదురవదు. అయితే ఈ సమయంలో గర్భం ధరిస్తే మాత్రం ఎప్పటికప్పుడు డాక్టర్‌ పర్యవేక్షణ అవసరం. ఎందుకంటే గర్భం నిలవకపోయే అవకాశాలే అధికంగా ఉంటాయి. ఒకవేళ నిలిచినా జస్టేషనల్‌ డయాబెటిస్‌, అధిక రక్తపోటు వంటి సమస్యలతో పాటూ నెలలు నిండకుండానే కాన్పు అయ్యే ప్రమాదమూ ఉంది. అందుకే ఈ సమయంలో ఏ ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

ఈ పరిస్థితికి భిన్నంగా మరికొందరిలో అసలు అండాలే విడుదల కావు. ఒకవేళ అదే జరిగితే గర్భం రాకపోవచ్చు. అలాంటప్పుడు గర్భధారణ కోసం ప్రత్యేక చికిత్సలు తీసుకోవాలి. అయితే మరీ లావుగా ఉన్న వారిలో ఈ చికిత్సలు తీసుకున్నా ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే ఈ చికిత్సలు తీసుకుంటున్నప్పుడు బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ఫలితం కనిపిస్తుంది.

ఒకవేళ ఈ సమస్య దీర్ఘకాలంగా వేధిస్తుంటే, టైప్‌-2 మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గర్భం ధరించినప్పుడు కూడా మధుమేహం రావడం, కొలెస్ట్రాల్‌ పెరగడం, అధికరక్తపోటు లాంటి సమస్యల ఎదురవ్వచ్చు. ఇవన్నీ భవిష్యత్తులో గుండె జబ్బులకు దారితీస్తాయి. కాబట్టి పీసీఓడీ లక్షణాలు ఉన్నాయనిపిస్తే, పరీక్ష చేయించుకుని, డాక్టర్లు చెప్పిన సూచనల్ని పాటించాలి.

-courtesy with Dr.Praneeth Reddy@Eenadu vasundhara
ట్రీట్మింట్ :
వ్యాది నిర్ధారణకోసం మంచి స్త్రీ వైద్యనిపులను సంప్రదించాలి . ఈ వ్యాదికి సొంతం గా మందులు వాడకూడదు . ప్రధమ చికిత్స ఉండదు .
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Overian Cysts awareness, ఒవేరియన్ సిస్టులు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఒవేరియన్ సిస్టులు అంటే?(Overian Cysts)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



స్త్రీలలో పునరుత్పత్తికి ఉపయోగపడే అతి ముఖ్యమైన అంగం అండాశయం (ఓవరీ). స్త్రీ పొత్తి కడుపులో ఉండే గర్భాశయానికి రెండువైపులా ఒవేరియన్ లిగమెంట్ల ద్వారా రెండు అండాశయాలు అతుక్కుని ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 3 సెం.మీ. పొడవు, 1.5 సెం.మీ. వెడల్పు, 1.5 సెం.మీ మందం ఉంటాయి.

చిన్నపిల్లలకు, బహిష్టులు ఆగిపోయిన స్త్రీలకు అండాశయాలు చిన్నవిగా ఉంటాయి. అండాశయాల నుంచి గర్భధారణకు కావలసిన అండం విడుదల అవుతుంది. వీటి నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. స్త్రీ లక్షణాలు అభివృద్ధి చెందడానికి, రుతుచక్రం క్రమబద్ధం కావడానికి ఈ హార్మోన్లు ఉపయోగపడతాయి.

ఆడపిల్ల పుట్టినప్పుడు అండాశయాల్లో అండాలు పెరిగే తిత్తులు లేక ఫాలికల్స్ ఒక మిలియన్ సంఖ్యలో ఉంటాయి. వీటిమధ్యలో స్ట్రోమా, చుట్టూ ఎపిథీలియమ్ అనే పొరతో కప్పబడి ఉంటాయి. యవ్వనదశకు చేరేటప్పటికి అండాలు పెరిగే ఈ ఫాలికల్స్ కొన్ని నశించిపోయి, నాలుగు లక్షలు మాత్రమే మిగులుతాయి. వీటిలో స్త్రీ జీవితకాలంలో సుమారుగా 400-450 అండాలు మాత్రమే పరిణతి చెంది విడుదలవుతాయి. మిగతావన్నీ నశించిపోతాయి. బాలిక యవ్వనదశకు చేరేటప్పటికి మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుండి విడుదలయ్యే ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ అనే హార్మోన్ల ప్రభావం వల్ల, ప్రతినెలా నాలుగు లక్షల ఫాలికల్స్‌లో, ఆరు నుండి పది కణాలు పరిణతి చెందుతాయి. అందులో ఒక్క అండం మాత్రమే విడుదలవుతుంది. ఇలా సాధారణంగా నెలకొకటి చొప్పున ఒక నెల ఒక అండాశయం నుంచి, మరోనెల మరొక అండాశయం నుంచి విడుదలవుతాయి. అమ్మాయి రజస్వల అయినప్పటినుండి ఈ ప్రక్రియ మొదలయ్యి, క్రమంగా బహిష్టులు ఆగిపోయే సమయానికి ఆగిపోతుంది.

యవ్వనదశలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. మెదడులోని హైపోథాలమస్ అనే భాగం ఉత్తేజితమయ్యి, కొన్ని హార్మోన్ల (జీఎన్‌ఆర్‌హెచ్) ద్వారా, పిట్యూటరీ గ్రంథి ప్రేరేపించడం ద్వారా... పిట్యూటరీ గ్రంథి, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్‌ఎస్‌హెచ్), ల్యూటినైజింగ్ హార్మోన్ (ఎల్‌హెచ్)ను ఉత్పత్తి చేస్తుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండాశయాల్లోని ఫాలికల్స్‌ను ప్రేరేపిస్తుంది. దానివల్ల ఫాలికల్స్ పెరగడంతో పాటు, వాటి నుంచి ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది.తర్వాత ఎల్‌హెచ్ హార్మోన్ ప్రభావం వల్ల ఒక ఫాలికల్‌లోని అండం పరిణతి చెంది, ఫాలికల్ పగిలి, అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. దీనినే ఒవ్యులేషన్ అంటారు. అలా విడుదలైన అండం ఫాలోపియన్ ట్యూబ్‌లోకి ప్రవేశిస్తుంది. పగిలిన ఫాలికల్ మార్పుచెంది, కార్పస్ లూటియమ్‌గా మారుతుంది. ఇది ఈస్ట్రోజన్‌తో పాటు, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో గర్భధారణ జరగకపోతే, కార్పస్ లూటియమ్ కృశించిపోయి, హార్మోన్లు తగ్గిపోయి, బహిష్టు మొదలవుతుంది. బహిష్టు మొదలైన రోజునుంచి మరలా అండాశయంలో కొత్త ఫాలికల్ పెరుగుదల మొదలవుతుంది. అది పెరిగి 11 నుంచి 16వ రోజు లోపల పగిలి, అండం విడుదలవుతుంది.

క్రమంగా జరిగే ఈ ప్రక్రియలో కొన్ని సార్లు ఏవైనా తేడాలు, హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయాల్లో నీరులాంటి ద్రవం, రక్తం లేదా ఇతర ద్రవాలతో చేరిన సంచులు, గడ్డలు ఏర్పడతాయి. వీటినే ఒవేరియన్ సిస్టులు అంటారు. సిస్టుల్లో ఉన్న పదార్థాన్ని బట్టి, తయారయిన కారణాన్ని బట్టి, వీటిని అనేక రకాలుగా విభజించారు. అవి....

1. ఫంక్షనల్ సిస్ట్. మళ్లీ దీనిలో ఫాలికులార్ సిస్ట్, హేమోరేజిక్ సిస్ట్, కార్పస్ లూటియల్ సిస్ట్ అని మూడు రకాలుంటాయి.
2. డర్మాయిడ్ సిస్ట్
3. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ లేదా చాకొలెట్ సిస్ట్
4. పాలిసిస్టిక్ ఓవరీస్
5. సిస్టడినోమా సిస్ట్

Treatment :

సుమారు 90% ఒవేరియన్‌ సిస్ట్ లు క్యాన్సర్ గా మారవు .వీటి పరిమాణము , కలిగించే నొప్పిని బట్టి చికిత్స ఉంటుంది . 
  • నొప్పి తగ్గడానికి పారాసిటమాల్ , ఎసిక్లోఫెనాక్ , బ్రూఫెన్‌ వంటివి వాడాలి.
  • వేడీ నీళ్ళ సంచి పొత్తికడుపు పైన ఉంచడము వలన నిప్పి తగ్గుతుంది,
  • హార్మోనల్ కాంట్రాసెప్టివ్ కంబైండ్ పిల్ల్సు వాడడము వలన కొత్త సిస్ట్ లు తయారవడం తగ్గుతుంది. ఉన్న సిస్ట్ లు కృషించుకు పోతాయి.
  • పరిమాణము పెద్దవిగా ఉన్నవాటిని ఆపరేషన్‌ ద్వారా తొలగించడము జరుగుతుంది.
  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, 1 July 2011

ఆరోగ్యానికి ఐదు స్వయంకృత శత్రువులు , Self Generated five enimies to Health

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఆరోగ్యానికి ఐదు స్వయంకృత శత్రువులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

అనాదినుండి మానవజీవనం ఆరోగ్యముగా ఉండాలని , శరీరము , ఆత్మ అందం గా ఉండాలని మానవుని ఆకాంక్ష . అందరూ కోరుకునేది అందమైన ఆరోగ్యము . అసలు అందమంటే ఏమిటి ? . రంగును బట్టిగాని , ఆకారాన్ని బట్టిగాని , పొడవును బట్టిగాని అందాన్ని నిర్వహించలేము. పురాణాలలో నల్లదైన ద్రౌపతి , సినిమాల్లో నల్లదైన వాణిశ్రీ అందమైన స్త్రీలుగా గుర్తించబడ్డారు . వారి వారి ఆరోగ్యమే అందానికి కారణము . అందుకే ఆరోగ్యం మహాభాగ్యమన్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మహా గొప్పలు చెబుతాము.జీవ ప్రక్రియలో అసమతుల్యమే అనారోగ్యానికి హేతువు. చక్కని శరీర పౌష్టవం,మంచి ఆరోగ్యం మన సొంతం కావాలంటే కొన్ని ఆరో గ్య నియమాలు పాటించాలి.నియమం అంటేనే మనం హడలిపోతాం. ఎందు కంటే మనం బద్దకస్తులం కనుక.ఆరోగ్యానికి మొదటి శత్రువు బద్దకమేనని గుర్తిం చండి. ఒక్క ఆరోగ్యమే కాదు అన్ని రంగాలలో బద్దకం అందరికి శత్రువే. ఈ బద్ద కాన్ని బద్దలుకొట్టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఆరోగ్యానికి ఐదు సూ త్రాలు పాటించాల

1. బద్దకం , 2. బరువు పెరగడం ,3. కోపము , 4. అతిగా నిద్రపోవడం ,5. నిద్రలేకపోవడం ,

బద్దకము : బద్దకం చెడు దరిద్రం అంటారు పెద్దలు . ఎప్పుడు , దేనికీ బద్దకించకూడదు . సూర్యోదయానికి ముందుగా లేచి మీ అనుకూల సమయాన్ని ఎంచుకొని ప్రతి రోజు క్రమం తప్పకుండా అదే సమయానికి లేవడం. శారీరక వ్యాయామం, మీకు తెలిసిన ఆసనాలు,వాకింగ్‌ వంటి ప్రక్రియలు రోజుకు కనీసం గంట అయినా చేయాలి. వీటికోసం సమయం లేదనేవారు చాలామందే ఉన్నారు. వీరంతా బద్దకం చేతిలో బందీలైనవారే. శరీరం సమర్థవంతంగా పనిచేసేం దుకు తగుపాళ్ల లో పిండి పదార్థం, మాంస కృత్తులు, కొవ్వు, విటమిన్లు, మినరల్స్‌ తీసుకోవాలి. వీటిలో తృణ దాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పా లు, డ్రైప్రూట్స్‌, సీజనల్‌ పండ్లు విరివిగా తీసుకోవాలి. బద్దకించి ఈ బేలెన్స్ ను తప్పకూడదు . మంచినీరు భాగా తాగాలి. రోజుకు నాలుగు లీటర్ల పైగా తీసుకోవాలి. మద్య, ధూమపానం సరదాకు అలవాటైతే వాటిని దూరం చేసు కోవటం కష్టమైన పని. దీనివలన జీవన మాధుర్యాన్ని కోల్పోతామని గ్రహించాలి. దైనందిన జీవితంలో విశ్రాంతి ప్రధానమైంది. పని చేయకుండా ఉండటం సుఖ మని చాలామంది అనుకుంటారు. పని చేయకపోవటం అనారోగ్యానికి చిహ్నం. అతిగా పనిచేయటం ఆరోగ్యానికి హానికరమే.కనుక శరీరం అనుమతించిన మేరకు పనిచేసి విశ్రాంతి తీసుకోవాలి.

బరువు పెరగడం : అధిక బరువు పెరుగుట లేదా ఊబకాయము అనారోత్యాల జాబితాలలో అతిముఖ్యమైనది . బరువు అతిగా తినడం వలన , సరియైన శరీరక వ్యాయామము లేకపోవడం వలన , బద్దకము వలన , కొన్ని శారీక అనువంశిక వ్యాధులవలం సంభవిస్తుంది. మూలకారణము తెలుసుకొని తగినవిధము గా మన జీవనవిధానమును మార్చుకోవాలి. అవసరమైతే తగిన వైద్య నిపుణులను సంప్రదించి చితిత్స పొందాలి .

ప్రపంచం మొత్తం 'బరువు' మాట వింటేనే భయపడుతోంది! ఎక్కడ చూసినా వూబకాయం వూబిలో కూరుకుపోయి.. బరువు తగ్గాలని తంటాలుపడే వారే. ఉండాల్సిన దానికంటే ఎక్కువున్నవారు కచ్చితంగా బరువు తగ్గటం, తగ్గేందుకు ప్రయత్నం చెయ్యటం అవసరమే. కానీ మనమే ప్రయత్నమూ చెయ్యకుండా.. మనవైపు నుంచి ఎటువంటి శ్రమా లేకుండానే బరువు తగ్గుతున్నామంటే మాత్రం అది మంచి లక్షణం కాదు!

బరువు తగ్గిపోవటమన్నది శరీరంలో తలెత్తిన తీవ్ర అనారోగ్యానికి సూచిక! క్షయ, క్యాన్సర్‌ వంటి తీవ్రస్థాయి సమస్యల్లో ప్రధానంగా కనబడే లక్షణం... ఈ బరువు తగ్గటమే! కాబట్టి బరువు తగ్గిపోతున్నట్టు అనుమానం వస్తే తక్షణం వైద్యులను సంప్రదించి.. అందుకు కారణాలను అన్వేషించటం అత్యవసరం!

బరువు తగ్గిపోతుండటమన్నది వైద్యపరంగా చాలా తీవ్రమైన అంశం! బరువు ఎక్కువ ఉన్నవారు, బరువు తగ్గాలని భావించేవారు కావాలని డైటింగ్‌, వ్యాయామాల వంటివి ఎక్కువ చేస్తుంటారు. వారు బరువు తగ్గటం సహజం. అయితే అలాంటి ప్రయత్నాలేవీ లేకుండానే చాలా వేగంగా.. అంటే నెలకు ఒక కిలోకన్నా, లేదా ఆర్నెల్లలో 5 కిలోలకన్నా ఎక్కువగా బరువు తగ్గిపోతుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏదో తలెత్తిందని అనుమానించాలి.

కోపము : కోపము మనిషి మానసిక స్థితిని తెలియజేస్తుంది . కోపము ఎన్నో మానసిక , శారీరక అనర్ధాలకు దారితీస్తుంది . మన కోపమే మనకు శత్రువు . . . అని అన్నారు ఒక కవి . కోపము వలన మనిషి ఒంటరి జీవనం చేయవలసి వస్తుంది . రక్తపోటు పెరిగి నరాల బ్లహీనత వచ్చును . గుండె జబ్బులకు దారితీయును. తను చేసే పనులలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఎప్పుడూ కోపం గా ఉన్న వారిలో " ఎండార్ఫిన్లు " అనే హార్మోనులు తయారు కావు . దీనివల ఆయుష్ క్షీనత కలుగును .

కోపము తగ్గడానికి మనము ఎప్పుడూ దైవస్మరణ చేస్తూఉండాలి . పాలు , పండ్లు , విటమిన్‌ ' సి ' ఉన్న ఆహారము తీఉకోవాలి. ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించకుండా నలుగురితో కలిసి మెలిసి తిరుగుతూ ఉండాలి , కోపము వచ్చినపుడు మనసుని మళ్ళించే పనిలో నిమగ్నమవ్వాలి... ఉదా: పది అంకెలు ముందునుంది వెనక్కి 10... 9... 8.. లెక్కిస్తే టెన్‌షన్‌ నుంది బయటపడతాము .

అతిగా నిద్యపోవడం : అతినిద్ర (హైపర్ సామ్నియా) -- నిద్య ఎక్కువైనా ,, తక్కువైనా అనారోగ్యమే. వయసును బట్టి మనిషికి కావలసిన గంటలు తృప్తిగా నిద్రపోవాలి. ప్రతీ రోజూ అవసరానికి మించి కనీసం నెలరోజులపాటు, పగలు - రాత్రి నిద్రపోవడాన్ని అతినిద్ర అంటారు. చాలా మంది ఎక్కువ రోజులు బలవంతంగా మేల్కొనే ఉంటారు. కొన్ని రకాల రుతుస్రావ సమస్యలున్న మహిళల్లో అతినిద్ర ఉంటుంది. గురక సమస్యతో బాధపడేవారు, దీర్ఘకాల సమస్యలున్నవారు, తలకు బలమైన గాయాలైనవారికి, చిన్న మెదడులో కణితులు ఏర్పడినప్పుడు, స్థూలకాయుల్లో అతినిద్ర సమస్య ఉంటుంది. హైపర్‌సామ్నియా అని పిలిచే అతినిద్ర సమస్య ఉన్నవారు రోజుకు 10 గంటలకంటే ఎక్కువ నిద్రపోతారు. ఇది హైపోథైరాయిడ్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు ఉండేవారి లో ఎక్కువ. నార్కోలెప్సీ సమస్య ఉన్నవారు పగలుకూడా నిద్రపోతుంటారు. దీనిని ఇర్రెస్టిబుల్ స్లీప్ డిసార్డర్ అని కూడా అంటారు. క్లీన్ లెవిన్ సిండ్రోమ్ ఉన్నవారు నెలల తరబడి నిద్రపోతుంటారు. రామాయణంలో కుంభకర్ణునికి ఈ జబ్బు ఉందనుకోవచ్చు.

స్లీప్ సైకిల్...
సాధారణంగా ప్రతి మనిషికి 6-8 గంటల నిద్ర ఉంటే సరిపోతుంది. చిన్నపిల్లలు 8-10 గంటలు, రోజుల పిల్లలు 14-20 గంటలు నిద్రపోతారు. 50 ఏళ్ల తర్వాత నిద్ర క్రమేపీ తగ్గుతూపోతుంది. 60 ఏళ్లకు 4-6 గంటలు, 70 ఏళ్లకు 4-5 గంటలు, 80 ఏళ్లకు 3-4 గంటలు మాత్రమే నిద్ర సరిపోతుంది. మెదడులో నిద్రకు సంబంధించిన భాగాన్ని ‘పీనియల్‌గ్లాండ్’అంటారు. దీని నుంచి మెలటోనిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది నిద్ర ఎంత స్థాయిలో అవసరం అవుతుందో తెలియజేస్తుంది.

7-8 గంటల నిద్రలో 4-5 స్లీప్ సైకిల్స్ ఉంటాయి. మళ్లీ ఇందులో ‘నాన్ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్, రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’ అని రెండు దశల నిద్రలు ఉంటాయి. ‘నాన్ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’లో మళ్లీ నాలుగు దశలుంటాయి. ‘రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’లో కనుపాపలు వేగంగా కదులుతుంటాయి. దీంతో పాటు కాళ్లు, చేతులు కదలడం, గుండె వేగంగా కొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. దీనినే కలతనిద్ర అంటారు. ఇక ‘నాన్ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’ను గాఢ నిద్ర అంటారు.

నిద్రలేమి: నిద్ర అందరికీ కావాలి. ఉదయం నుంచి విధులను నిర్వర్తించిన సూర్యుడు సాయంత్రానికి అలసి పశ్చిమాన విశ్రాంతి తీసుకుంటాడు. రోజంతా పనులతో అలసిపోయిన మనిషి రాత్రివేళ నిద్రలో విశ్రాంతి పొందుతాడు. అయితే కొందరు నిద్రపట్టక బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు అతినిద్ర కారణంగా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కోల్పోతుంటారు. జీవితంలో సగభాగం నిద్రలో గడిపినా మనిషి దాన్ని వృథా అనుకోడు. నిజానికి ఆరోగ్యం కోసం అది అవసరం కూడా. సాధారణంగా మనిషి రోజూ 6-8 గంటలు హాయిగా నిద్రపోతే 50 శాతం వరకు జబ్బులు దరిచేరవు అనేది వైద్యులు చెబుతున్నమాట.

నిద్ర సమస్యలు
1.నిద్రలేమి (ఇన్‌సామ్నియా)
2.అతినిద్ర (హైపర్ సామ్నియా)
3.నిద్రలో విచిత్రంగా ప్రవర్తించడం. (పారాసామ్నియా) వీటిలో నిద్రలేమి సమస్య ఎక్కువమందికి వస్తుంది


నిద్రలేమి : రాత్రిపూట కావలసినంత నిద్రలేకపోవడం. దీని వల్ల పగలు పనిలో మధ్య మధ్యలో నిద్రపోవడం. త్వరగా కొపం రావడం, ఏకాగ్రత లోపించడం. మతిమరపు, పనిలో సామర్థ్యం తగ్గిపోవడం... వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ ఎక్కువ రోజులు కొనసాగితే బి.పి., గుండెజబ్బులకు దారితీయవచ్చు. అలాగే మైగ్రెయిన్ తలనొప్పి, బ్రెయిన్‌స్ట్రోక్, కడుపులో హైపర్ అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్లు రావడం, యాంగ్జైటీ న్యూరోసిస్, డిప్రెషన్ లాంటి జబ్బులు వస్తాయి. వేళకు నిద్ర పోకపోవడం, వేళకు తినకపోవడం, నిద్రపోయేముందు పొగతాగడం, కాఫీ, టీలు ఎక్కువ తీసుకోవడం, శీతలపానీయాలు సేవించడం, తీవ్ర ఒత్తిడికి గురికావడం, కొన్నిరకాల మందులు (ఆస్థమా, గుండెజబ్బులు, మూత్రపిండాలు, లివర్ జబ్బుల, స్థూలకాయం, థైరాయిడ్ సమస్యలు... వంటి వాటికి వాడే మెడిసిన్స్), విపరీతమైన నొప్పి (తలనొప్పి, మెడనొప్పి, పంటినొప్పి, కాళ్లు-చేతులు మంటలు, కడుపులో మంటలు...) వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి.

విచిత్రంగా ప్రవర్తించడం
కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది ఇది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో జరుగుతుంది. వీరు కొన్నిసార్లు తలుపు తీసుకుని బయటకు వెళ్లడమే కాకుండా, అనుకోని ప్రమాదాల బారిన పడుతుంటారు. మెలకువ వచ్చాక తామిలా చేశామన్న విషయమే వీరికి గుర్తుండదు. ఇంకొంతమంది నిద్రలో లేచి భయంకరంగా ప్రవర్తిస్తారు. పెద్ద పెద్దగా అరవడం, వస్తువులను పగలగొట్టడం చేస్తుంటారు. కలలో మమేకం అయిపోయి ఇలా ప్రవర్తిస్తారు. ఇది కూడా నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో వస్తుంది.

రాత్రి నిద్రలో ఇలా ప్రవర్తించినట్టు పొద్దునే వీరికి గుర్తుకు రాదు. ఈ సమస్యను స్లీప్‌టెరర్ ్రఅంటారు. ఇది 5-15 ఏళ్ల పిల్లల్లో కనిపిస్తుంటుంది. కొందరు నిద్రలో మాట్లాడుతుంటారు. దీనిని స్లీప్ టాకింగ్ అంటారు. దీంతో పాటు కొంతమంది పిల్లలకు రాత్రిపూట పక్కతడిపే అలవాటు కూడా ఉంటుంది. 5-7 సంవత్సరాల పిల్లల్లో ఇది సాధారణమే. పదేళ్లకు పైబడిన పిల్లల్లో ఈ సమస్య ఉంటే దీనిని నక్టర్నల్ ఎన్యురోసిస్ అంటారు. భయంకరమైన కలలు రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ మంచి చికిత్స ఉంది. కౌన్సెలింగ్, మందుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు.

నిద్ర పరీక్షలు
నిద్ర సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించడానికి ఆధునిక పద్ధతులెన్నో అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రో ఎన్‌సెఫలో గ్రామ్ (ఈఈజీ)అనే టెస్ట్ ద్వారా స్లీప్ డిజార్డర్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో కనిపెట్టి, దానికి తగిన చికిత్స చేయవచ్చు.

నిద్రలేమి-నివారణ
నిద్రకు ఉపక్రమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు...

ఊపిరితిత్తులకు, గుండెకు సంబంధించిన జబ్బులకు మందులు వాడుతుంటే డాక్టర్ సలహామేరకు పగటిపూట వాడేటట్లు చూసుకోవాలి.

పడకగదిని నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. గది వాతావరణం మరీ వేడిగా, మరీ చల్లగా ఉండకూడదు. గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలి. గది గోడలు, కర్టెన్లు, బెడ్‌షీట్లు... తేలికపాటి రంగుల్లో ఉండాలి.

ఆల్కహాల్ తీసుకోకూడదు.

రోజూ ఒకే సమయంలో నిద్రపోవాలి.

పగటిపూట నిద్రపోకూడదు.

సాయంకాలం 30 ని.లు వ్యాయామం చేయాలి.

నిద్రించే ముందు రోజూ గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.

నిద్రకుపక్రమించడానికి 2-3 గంటల లోపల టీ, కాఫీ, పొగ... తాగకూడదు.

నిద్రపోయేముందు నవలలు, పుస్తకాలు చదవకూడదు. (ఆసక్తికరమైన అంశాలు ఉంటే నిద్ర సరిగ్గా పట్టదు)

నిద్రకు ముందు భయానక దృశ్యాలను (టీవీ, సినిమా..) చూడకూడదు. (ముఖ్యంగా పిల్లలు వీటిని చూడటం ద్వారా రాత్రి కలల్లో వచ్చే దృశ్యాలకు విపరీతంగా ప్రవర్తిస్తుంటారు.)

నిద్రపోవడానికి ముందు గోరువెచ్చటి పాలు తాగాలి.

నిద్రపోయేటప్పుడు ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినాలి.
  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, 30 June 2011

Dreams,కలలు ,స్వప్నాలు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Dreams,కలలు ,స్వప్నాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మగ అయినా , ఆడ అయినా మనిషి జీవితం లో మనసు , శరీరము అనే రెండు భాగాలు ఉంటాయి. మనిషి సమాజము తో ముడిపడి ఉంటాడు . మనసుని శరీరాన్ని విడదీయలేము .భూమిపైన కోటానుకోట్ల జీవరాశుల్లో మనిషిగా పుట్టడం ఒక వరం . కర్మ చేయడమే కాదు ... అది ఆరంభించడానికి ముందు ఆలోచించి తెలివిగా చేసే అవకాశము మనిషికే ఉంది . మిగతా జీవరాశులు తమ తమ ప్రకృతి ధర్మాలను బట్టి పని చేసుకుపోతూ ఉంటాయి. పంచావసరాలైన 1.గాలి , 2.నీరు , 3.ఆహారము , 4. నిద్ర , 5.మైధునము -- ఈ ఐదూ అన్ని జీవరాశులకు సమానము . తన చుట్టూ ఉన్న సమాజములో పూర్వపరాలు బేరీజు వేసుకుని ముందుకు సాగుతారు మానవులే ... ఆ ప్రక్రియలో కొన్ని కోరికలు తీరుతాయి , కొన్ని కోరికలు తీరవు . కర్మ అంటే పని . అందుకోసము ఐదు కర్మంద్రియాలు , ఐదు జ్ఞానేంద్రియాలు నిరంతరమూ తపన పడుతూ ఉంటాయి .

కర్మేంద్రియాలు : పంచకం : 1.వాక్కు(నోరు), 2.పాణి(చేయి), 3.పాదం(కాలు), 4.పాయువు(గుదము), 5.పునరుపత్తి అవయవాలు.

జ్ఞానేంద్రియ పంచకం : త్వక్కు = చర్మం, చక్షువు = కన్ను, రసన = నాలుక, శ్రోతం = చెవి, ఘ్రాణం = ముక్కు,

వీటి సహాయ సహకారాలతో మనిషి ఆశయాలు, భావాలు, లక్ష్యాలు, నెరవేరని పక్షాన -- స్వప్నాలు గా ఏర్పడుతుంటాయి. మనస్సు ఆలోచనలను పూయిస్తుంది. కళ్ళను కలలతో నింపుతుంది. పగటి ఆలోచనలే రాత్రి వేళ కలలుగా మారుతుంటాయి.

నిద్రకి చెందిన కొన్ని స్థితులలో అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల, భావావేశాల, ఐంద్రియ సంవేదనల సందోహాలను స్వప్నాలు లేదా కలలు (Dream) అంటారు. కలల యొక్క అంతరార్థం ఏమిటో, వాటి ప్రయోజనం ఏమిటో ఇప్పటికీ మనకి పూర్తిగా అర్థం కాదు. కాని కలల గురించి ఎంతో ఊహాగానం, అనిర్ధారిత చింతన మనకి చరిత్రలో కనిపిస్తుంది. కలల యొక్క శాస్త్రీయ అధ్యయనాన్ని ఓనేరాలజీ (Oneirology) అంటారు. కలలు ఎంతో స్ఫూర్తి దాయకం కావడమే కాక, చాలా అనిర్ధారిత నమ్మకాలకి తావు ఇవ్వడం, కలల సుదీర్ఘమైన చరిత్ర లో మనకి కనిపిస్తుంది. కలలలో ఏదో అంతరార్థం ఉందన్న నమ్మకం, కలల సహాయంతో భవిష్యత్తుని తెలుసుకోవచ్చన్న నమ్మకం ఎన్నో సమాజాలలో అనాదిగా చలామణిలో ఉంది. కలలకు ఆధారం మనస్సులో ముద్రితమైన సునిశిత ఆలోచనలే! కొన్ని సందర్భాల్లో కొందరికి తీరని వాంఛలు కలల్లో తీరుతుంటాయన్నది నిజం.

కలలని కేవలం భౌతికంగా, జీవ శాస్త్ర దృక్పథంతో చూస్తే అవి నిద్రావస్థలో నాడీ సంకేతాల చలనాలకి ఫలితాలుగా చెప్పుకోవచ్చు.

మనస్తత్వ శాస్త్రం దృష్ట్యా చూస్తే అవి ఉపచేతనలో జరిగే చలనాలకి ప్రతిబింబాలుగా చెప్పుకోవచ్చు.
అధ్యాత్మికంగా చూస్తే దివ్య సందేశాలు గానో, భవిష్యత్తుని తెలిపే దూతలు గానో చెప్పుకోవచ్చు.

ఎన్నో సంస్కృతులలో స్వప్న సంపోషణ అనే ఆచారం ఉన్నట్టు తెలుస్తోంది. స్వప్న సంపోషణ అంటే భవిష్యత్తుని సూచించే, దైవం నుండి వచ్చే కలలని, జాగ్రత్తగా పోషించుకోవడం, కాపాడుకుని పెంచుకోవడం అన్నమాట.

పీడ కలలు :
భావోద్వేగాలు, సంఘర్షణ, ఆందోళనల కారణంగానే పీడకలలు సంభవిస్తాయి. మనిషి మేల్కొనే సమయంపై ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపవు. ప్రతి పదిమందిలో ఒకరిని భయోత్పాతంతో కూడిన కలలు వెంటాడుతున్నాయి. నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తున్నారు. మెట్లపై/మేడపై నుంచి పడిపోయినట్లు, ఎవరో వెంటాడుతున్నట్లు, పక్షవాతం సోకినట్లు, వాహనం/రైలు ఆలస్యమైనట్లు, ఆత్మీయుల్లో ఎవరో చనిపోయినట్లు, జుట్టు, పళ్లు రాలిపోవడం, బట్టతల, పరీక్షల భయం పీడిస్తూ అధికంగా పీడకలలు వస్తాయి.

దైన సంహితలో స్వప్నశాస్త్రం ఒకటి -ఈ శాస్త్రంలో స్వప్న దశలో కనిపించే విషయాలని ఆధారం చేసుకుని వివరాలు చెప్పడం జరుగుతుంది. స్వప్నాలు మానసిక భావాలని ఎలా ప్రతిబింబిస్తాయనేది ఈ శాస్త్రంలో తెలస్తుంది.

కలలకు ఆలోచనలు ఊతంగా, ఆలంబనగా వుంటాయి. కలలు కూడ మనసు చేసే గారడీయే! మంచి పనులు చేస్తూ, మంచి నడవడిక కలిగి వుండేవారికి మంచి కలలే వస్తాయి.

జనానికి ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి. గుళ్ళు గోపురాలు దర్శించడం, ఆలయాల్లో పూజలు చేయించడం, ఇంటివద్ద పూజగదిలో గంటల కొద్దీ దేవతార్చన చేయడం ఆమె నిత్యకృత్యాలు. ఆమెకు వచ్చే కలలు కూడ వైవిధ్యంగానే వుండేవి. నిజజీవితంలో సాధ్యంకాని తీర్థయాత్రల దర్శనం ఆమె స్వప్నావస్థలో చేసుకొనేది. అయితే తీర్థాలలోని పరిసరాలు, ప్రకృతి యధాతధంగా చూచిన అనుభూతి ఆమెకు కలుగుతుండేది.

స్పెషల్‌స్టోరీ గుండారావుది కాసుల కోసం కత్తుకలు కత్తిరించే మనస్తత్వం. చెయిన్‌ స్నాచింగ్‌, రైళ్లు బస్సులో సూటు కేసులు, బ్యాగుల అపహరణ, పిక్‌పాకెటింగ్‌ ఇత్యాదివి అతని వ్యాపకాలు. అతనికి వచ్చే కలలు తన వ్యాపకంలో లబ్ధికుదిరి లాభించిన సందర్భాలుగానే వుండేవి.

మనం ఆదిత్యుని ఆరాధిస్తాం! శశాంకుని పండువెన్నెలను ఆస్వాదించి ఆనందించని వారు బహుశ ఎవరూ వుండరు. అమావాస్య రాత్రుల్లో కూడ నక్షత్రాల ఉనికివల్ల ప్రకృతి కటిక చీకటిమయం కాకుండా వుంటుంది. ఇవన్నీ కలలో కనిపిస్తే శుభంగా పరిగణిస్తారు. దేవీ దేవతలు కలలో కనిపిస్తే కూడ చాల శుభం కలుగుతుంది. లక్ష్మీ అమ్మవారిదర్శనం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. అయితే అమ్మ వారివాహనమైన గుడ్లగూబ దర్శనం మంచిదిగా చెప్పబడలేదు. అగ్నిహోత్రుల దర్శనం స్వప్నంలో ప్రాప్తిస్తే శుభంగా చెప్ప బడింది.

నిద్రావస్థలో స్వప్నం వచ్చేస్థితిని ఆంగ్లంలో - రాపిడ్‌ ఐ మూవ్‌ మెంట్‌ గా వ్యవహరిస్తారు. కనుగ్రుడ్లు ఈ అవస్థలో వేగంగా కదులుతూ వుండం వలన దానికాపేరు వచ్చింది. ఈ దశలోనే మనిషి కలలు కనడం జరుగుతుంది. సాధారణంగా తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయంటారు. అసలు మనకు కలలు ఎక్కువగా వచ్చేది తెల్లవారు జామునే! నిద్రావస్థ చరమ దశ తెల్లవారుజాము కాబట్టి ప్రయత్నిస్తే ఆ సమయంలోని కలలను గుర్తు పెట్టుకొన గలిగే అవకాశం వుంది. కొందరికి అర్థరాత్రి 2-3 గంటల సమయంలో మెలకువ వస్తే ఇంక నిద్ర పట్టదు. అయినా కళ్లు మూసుకొని పడుకొనటం వల్ల మెదడు, కళ్లు సేద దీరుతాయి. మెలకువ వున్నప్పటికీ కళ్లు మూసుకొని పడుకొంటే మెదడు చేతనావస్థలో వుండి కూడ నిద్రా ఫలితం కొంతమేర దక్కుతుంది. నిద్రపట్టలేదు, మెలకువ గానే ఉన్నామను కొన్నప్పటికీ ఆ సమయంలో కూడ చిట్టి పొట్టి కలలు వచ్చినట్లు గమనించ వీలవు తుంది.

సాధారణంగా కలల్లో ఆవేశం, భయం, సంతోషం లాంటి అనుకూల, అననుకూల భావాలు ప్రస్ఫుట మౌతాయి. యువకులు, యువతుల్లో వచ్చే కలలు సాధారణంగా ప్రేమ పరమయినవిగా వుంటాయనీ, ఆ సమయంలో వారు ఉద్వేగాన్ని అనుభవిస్తారనీ తేలింది. ఆడవారిలో డెబ్భయి శాతం, మగవారిలో 65 శాతం ఒకే రీతికి చెందిన స్వప్నాలు పదేపదే అనుభూతించడం జరుగుతుందని తెలుస్తుంది. చాలా భాగం కలలు నలుపు-తెలుపు రంగుల్లోనే అనుభూతికి వస్తాయి. మనస్తత్వ శాస్రవేత్తలైన సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌, కార్ల్‌జంగ్‌ కలలు చేతన అంతశ్చేతనా వస్థల్లోని మధ్య సమయంలో కనటం జరుగుతుందని చెప్పడం జరిగింది. తన జీవితంలో నిరాదరింపబడిన తిరస్కరింపబడిన, అణచివేతకు గురయిన అనుభవాలను మనిషి కలల్లో సానుకూలం గా మలచుకుంటాడని ఫిట్స్‌ పెరల్‌ అనే శాస్త్రజ్ఞుడు చెప్పటం జరి గింది. వైద్య పరంగా చూస్తే నరాలు, నాడీమండల వ్యవస్థకు అనుగుణంగా కలలు వుంటాయని తేలింది. వ్యతిరేక ఆలోచనా దృక్పథం కలిగి ఉన్న వారికి, నిరాశావాదులకు భయానక స్వప్నాలు వస్తా యట!

తమకు వచ్చిన స్వప్నాలను గుర్తుంచుకొని తిరిగి బయటికి చెప్పగల శక్తి మగవారి కంటే ఆడవారిలోనే అధికమని గుర్తింపబడింది. సానుకూల దృక్పథం కల వారికి మంచికలలే వస్తాయి.

సిగ్మండ్ ఫ్రాయిడ్ (Sigmund Freud) జననం మే- 06 -1856, మరణం సెప్టెంబరు 23 1939. ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. ఇతను మానసిక శాస్త్ర పాఠశాలను స్థాపించాడు. ఫ్రాయిడ్ తన ప్రఖ్యాత పుస్తకం అన్‌కాన్షియస్ మైండ్ మరియు డిఫెన్స్ మెకానిజం ఆఫ్ రెప్రెషన్. మానసిక శరీరవైద్యశాస్త్రము మానసిక శాస్త్రవేత్త-రోగి మధ్య వార్తాలాపం ద్వారా మానసిక విశ్లేషణ (Psychoanalysis) చేసి రుగ్మతలను దూరం చేయుట కొరకు ప్రసిద్ధి గాంచాడు. ఫ్రాయిడ్ తన సిద్ధాంతం సెక్షువల్ డిజైర్ ద్వారా మానవ జీవిత ఉత్ప్రేరక శక్తిని వెలికి తీసే వివరణలు, చికిత్సలో మెళకువలు, ఫ్రే అసోషియేషన్ వాడుక, చికిత్స సంబంధిత ట్రాన్స్ఫరెన్స్ సిద్ధాంతము మరియు స్వప్నాలు నిగూఢ వాంఛలను అర్థం చేసుకోవటానికి సోపానాలు అని ప్రతిపాదించి ప్రసిద్ధి గాంచాడు.

Read more about Dreams at - > Dream.

కల-నిజం
నిద్రలో కలలు రావడం సాధారణమైన విషయం, అంత మాత్రాన నిద్ర సరిగ్గా పట్టడంలేదని ఆందోళన చెందనవసరం లేదు. సృజనాత్మకత ఎక్కువగా ఉన్నవారికి సహజంగా కలలు ఎక్కువగా వస్తాయి.
భయం పుట్టే కలలు వచ్చినపుడు మాత్రం గుండె కొట్టుకునే, వూపిరి పీల్చే వేగం పెరుగుతాయి. అలాంటప్పుడు మెలకువ రావొచ్చు.
సాధారణంగా తెల్లవారు జామున మనం ముందు రోజు చేసిన పనులూ ఆలోచనల చుట్టూ కలలు వస్తాయి. కల ఎప్పుడో యాదృచ్ఛికంగా నిజం కావొచ్చు తప్ప వేకువన వచ్చే కలలు నిజమవుతాయనేది అపోహ మాత్రమే. కలలు ఎక్కువగా వేధిస్తున్నపుడు పగటిపూట సంతోషకరమైన అంశాలపైన దృష్టి పెట్టాలి. కలలకు అంత ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర విషయాలపైకి దృష్టి మరల్చాలి.
  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, 25 June 2011

జీవనశైలి జబ్బులు ,సాంక్రామికేతర జబ్బులు,Non Communicable Diseases.



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -జీవనశైలి జబ్బులు ,సాంక్రామికేతర జబ్బులు,Non Communicable Diseases.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రక్తపోటు, మధుమేహం లాంటి జబ్బులు 30, 40ఏళ్ల వయసు వారిలోనూ సర్వసాధారణంగా మారిపోయాయి. ఇలాంటి జబ్బుల్ని 'సాంక్రామికేతర జబ్బులు' (నాన్‌-కమ్యూనికబుల్‌ డిసీజెస్‌) అని అంటున్నారు. ఈ జబ్బులు సూక్ష్మజీవులవల్ల వచ్చేవి కావు. వీటినే జీవనశైలి జబ్బులనీ అంటున్నారు. జీవన విధానాల్లోని తేడాలవల్ల, భోజన పద్ధతులవల్ల, ప్రవర్తనవల్ల సంక్రమించే జబ్బులివి. మరో విధంగా చెప్పాలంటే- ఆధునిక ప్రపంచం మోసుకొచ్చిన మార్పులు తెచ్చిపెడుతున్న కొత్త సమస్యలివి. సగటు ఆయుఃప్రమాణం పెరగడం, జనాభాలో వృద్ధుల సంఖ్య అధికం కావడం, అంటువ్యాధులను నయం చేయడానికి తగిన వైద్యసౌకర్యాలు ఇనుమడించడం, పట్టణీకరణ వంటి అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకు సిగరెట్లు, మద్యం వాడకం పెరిగితే గుండె జబ్బులు, వివిధ రకాల క్యాన్సర్లు పెరుగుతాయి. వాతావరణ కాలుష్యంవల్ల మితిమీరితే శ్వాసకోశ వ్యాధులూ ముట్టడిస్తాయి. శారీరక శ్రమతో సంబంధంలేని జీవన విధానాలవల్లా స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు ముసురుకుంటాయి. గుండె-రక్తనాళ జబ్బులు (కార్డియోవాస్కులార్‌ డిసీజెస్‌), మెదడు-రక్తనాళ జబ్బులు (సెరిబ్రో వాస్కులార్‌ డిసీజెస్‌), గుండెపోటు, పక్షవాతం, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, ఆస్తమా, కీళ్లు అరుగుదల, ఎముకల బలహీనత, పంటి సమస్యలు, మానసిక జబ్బులు లాంటివన్నీ సాంక్రామికేతర జబ్బుల జాబితాలోకి వస్తాయి. దేశంలో 36శాతం మధ్యవయసు మరణాలకు కారణం ఈ జబ్బులే. కనీస జాగ్రత్తలతో మెలిగితే ఈ మరణాల్లో కనీసం నాలుగోవంతునైనా నివారించవచ్చన్నది ఓ అంచనా.

నిర్లక్ష్యమే మరణశాసనం
ప్రపంచవ్యాప్తంగా కూడా సాంక్రామికేతర వ్యాధుల విజృంభణ పెరుగుతోంది. 2015నాటికి ఆసియాలో ప్రతి నాలుగు మరణాల్లో మూడు ఈ కారణంగానే సంభవిస్తాయన్నది ఓ అంచనా. 2008లో అయిదు కోట్ల 70లక్షల మంది మరణించగా- అందులో 63శాతం (మూడుకోట్ల 60లక్షలు) మరణాలకు సాంక్రామికేతర జబ్బులే కారణం. ధనిక దేశాల్లో ఇలాంటి జబ్బులవల్ల చనిపోయేవారు 13శాతం; 80శాతం మరణాలు పేద, మధ్యస్థాయి దేశాల్లోనే (ఆఫ్రికా మినహా) సంభవిస్తున్నాయి. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సరు, దీర్ఘకాల శ్వాసకోశ జబ్బులే ఈ మరణాలకు చాలావరకు కారణం. దక్షిణ తూర్పు ఆసియా దేశాల్లో (ఇండియా, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, కొరియా, ఇండొనేసియా, మియన్మార్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌) 29శాతానికిపైగా మరణాలు వీటివల్లే సంభవిస్తున్నట్లు జకార్తాలో జరిగిన ఓ సమావేశంలో అంచనా వేశారు. రాష్ట్రంలోనూ ఎన్నో ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య ఒక సర్వే జరిగింది. శారీరక శ్రమ చాలా తక్కువ చేసేవారి సంఖ్య 68శాతంగా అందులో తేలింది. రక్తపోటు వచ్చే అవకాశం ఉన్నవారు 43శాతం, అధిక బరువు ఉన్నవారు 23శాతం ఉన్నారు. ఇక 35ఏళ్ల వయసున్న పట్టణవాసుల్లో 16-20శాతం దాకా మధుమేహ వ్యాధి ఉండవచ్చని ఒక అంచనా. రాష్ట్రంలో గోదావరి జిల్లాల్లో 45గ్రామాల్లో జరిగిన ఒక అధ్యయనంలో 55శాతం మరణాలకు కారణం అంటురోగాలేనని స్పష్టమైంది.

సాంక్రామిక వ్యాధులు ముమ్మరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ అంశంపై దృష్టిసారించింది. ఏప్రిల్‌ 28, 29న మాస్కోలో జరిగిన వివిధ దేశాల ఆరోగ్యశాఖామాత్యుల సమావేశంలో ఈ విషయంమీదే లోతైన చర్చ జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం అందులో పాలుపంచుకొంది. మనదేశంలో ఇప్పటికీ ప్రధాన ప్రజారోగ్య సమస్య అంటువ్యాధులే. స్వాతంత్య్రం తరవాత అంటువ్యాధులపై పైచేయి సాధించే అవకాశం మనకు ఉండేది. కానీ, గడచిన అరశతాబ్దంగా ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. దానివల్ల అంటువ్యాధులు తగ్గకపోగా ఇతర వ్యాధులూ విజృంభించాయి. ఐరోపా దేశాల ఆరోగ్య చరిత్ర తరచిచూస్తే- ప్రభుత్వ విధానాల్లో క్రమబద్ధమైన రీతులు అక్కడ గోచరిస్తాయి. వారు తొలుత అంటువ్యాధుల్ని నియంత్రించిన తరవాతే సాంక్రామికేతర వ్యాధుల సమస్యమీద దృష్టి సారించారు. మనదేశం ప్రస్తుతం ఈ రెండు రకాల వ్యాధుల భారాలను ఒకేసారి మోయాల్సి వస్తోంది. అంతేకాక ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే పరిమితమైన జబ్బులు నేడు పేదలకూ సంక్రమిస్తున్నాయి. పేదరికంవల్ల జబ్బులు పెరుగుతుంటే... వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిన నేపథ్యంలో మరింత పేదరికంలోకి దిగజారుతున్న వైనం కళ్లముందే కనిపిస్తోంది. సాంక్రామికేతర జబ్బులు జీవితాంతం వెంటాడతాయి. వీటికి ఏళ్ళతరబడి వైద్యం అవసరమవుతుంది. చికిత్సా పద్ధతులూ ఖరీదైనవే. మనదేశంలో గుండె జబ్బు బారినపడ్డ కుటుంబాల్లో 20శాతం మేర పేదరికంలోకి కుంగిపోతున్నాయి. అదేవిధంగా క్యాన్సరు వస్తే 25శాతం కుటుంబాలు దారిద్య్రంలో కూరుకుపోతున్నాయి. అల్పాదాయ కుటుంబంలో ఒకరు మధుమేహం బారినపడితే, వారి ఆదాయంలో 34శాతం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యంపట్ల ప్రభుత్వాల నేరపూరిత నిర్లక్ష్యంవల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఆరోగ్యకరమైన అలవాట్లను పౌరుల్లో పెంపొందించేందుకు ప్రభుత్వాలు ఏ రోజూ చిత్తశుద్ధితో కృషి చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వాలెప్పుడూ మద్యాన్ని, పొగాకును ఆర్థిక వనరులను సమకూర్చుకునే మార్గాలుగానే చూశాయి. 92శాతం వూపిరితిత్తుల క్యాన్సర్‌కు, 42శాతం దీర్ఘకాల శ్వాసకోశ జబ్బులకు, 20శాతం గుండె, రక్తనాళ జబ్బులకు పొగతాగడమే కారణం! ఆల్కహాలు అధికంగా సేవించడంవల్ల ప్రపంచంలో రెండుకోట్ల 30లక్షల మంది మరణిస్తున్నారు. ఈ జబ్బుల్ని అరికట్టడంలో పొగాకు, ఆల్కహాలుపై నియంత్రణ చాలా కీలకమైనది. పొగాకుపై 20శాతం పన్ను పెంచితే పొగతాగేవారి సంఖ్య ఎనిమిది శాతం తగ్గవచ్చన్నది ఒక అధ్యయనం. పొగాకు, ఆల్కహాలు దుష్పరిణామాలమీద ప్రజల్లో అవగాహన తీసుకురావడం, వాటి వాణిజ్య ప్రకటనల్ని నిషేధించడం, అవి విచ్చలవిడిగా లభ్యం కాకుండా నియంత్రణ చర్యలు చేపట్టడం సర్కారు తక్షణం తీసుకోవాల్సిన చర్యలు. ప్రపంచీకరణ ముందుకు తెస్తున్న ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ తరహా జీవన విధానాలు సాంక్రామికేతర జబ్బులు పెరగడానికి సారవంతమైన భూమికను అందిస్తున్నాయి. అందుకే వీటిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వాల స్థాయిలోనే నివారణ, నియంత్రణలకు పథకాలు రచించాల్సి ఉంది. 2007-2008లో కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఒక సర్వేలో మనదేశంలో అంటువ్యాధులవల్ల సంభవించే మరణాలకంటే సాంక్రామికేతర వ్యాధులవల్ల జరిగే మరణాలు రెండింతలని తేలింది. ఇప్పటికైనా ఈ ముప్పును ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రజలందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందాలంటే అందుకు ప్రజాపంపిణీ వ్యవస్థలో వైవిధ్యభరితమైన ఆహారపదార్థాలు దొరికేటట్లు, అవి మధ్య తరగతికీ అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. తగినంత శారీరక శ్రమవల్ల చాలా జబ్బులను తగ్గించవచ్చు. ఇందుకు సైకిళ్ల వాడకం పెరగాలి. సామాజిక ఆటస్థలాలను, పార్కులను పెంచడంపై సర్కారు దృష్టి పెట్టాలి. సింగపూర్‌లో ఉన్నట్టుగా పాఠశాలలో 'స్లిం అండ్‌ ట్రిమ్‌ పాలసీ'ని అమలుచేయాలి. ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో రోజుకు గంటన్నర సమయాన్ని క్రీడలకోసం తప్పనిసరిగా కేటాయించాలి.

క్యాన్సరుకు సంబంధించిన హైటెక్‌ వైద్యసదుపాయాలపై శ్రద్ధపెడుతున్నారుగానీ- నివారణపై ఎలాంటి దృష్టీ పెట్టడం లేదు. మధుమేహం నియంత్రణకై పైలెట్‌ ప్రాజెక్టులు ప్రారంభించినా అవేవి సక్రమంగా జరగడంలేదు. జబ్బు తొలిదశలోనే గుర్తించగలిగితే వైద్యఖర్చులు పెరగకుండా చూసుకోవచ్చు. మందులు చౌకధరలకు అందుబాటులో ఉండేలా చూడటం, 'పారామెడికల్‌ వర్కర్‌'లు, నర్సులు, ఇంటిదగ్గరే వైద్య చికిత్స అందించగలిగేవారి సంఖ్య పెరిగేలా చూడాలి. దీర్ఘకాలిక వైద్యసేవలను అందించగల వైద్య వ్యవస్థలను రూపొందించుకోవాలి. అందుకోసం కొంతమేర ఎక్కువ డబ్బే వ్యయం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాల నిరాసక్తతకు అసలు కారణమిదే. సాంక్రామికేతర జబ్బులకు నిధులు ఏ స్థాయిలోనూ తగినంతగా లేవు. పౌరుడు తన ఆరోగ్య పరిరక్షణకోసం వెచ్చిస్తున్న దాంట్లో కేవలం 20శాతం మాత్రమే ప్రభుత్వం వైపునుంచి అందుతోంది. మిగిలినదంతా వ్యక్తిగతంగా ఎవరి ఖర్చులు వారు పెట్టుకుంటున్నారన్నమాట. రోజుకు ఇరవై రూపాయలైనా ఆదాయంలేనివారే అత్యధికులున్న మనదేశంలో ఈ పరిస్థితి సహించరానిది.

ముందుచూపు ముఖ్యం
ఈ ఏడాది సెప్టెంబరులో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ- సాంక్రామికేతర జబ్బుల నివారణ నియంత్రణలమీదే ప్రధానంగా జరగబోతోంది. ఇటీవల మాస్కోలో జరిగిన ఆరోగ్యశాఖా మంత్రుల సదస్సు ఇందుకు సన్నాహకంగా జరిగిందే! కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థమీద అనేక అవాంఛనీయ ఒత్తిళ్ళు వస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సాంక్రామికేతర జబ్బుల ప్రణాళికలో వ్యాధినిరోధంతోపాటు వైద్యానికీ ప్రాధాన్యం ఉంది. మాస్కో ప్రకటనలో ఈ తరహా జబ్బులకు కావలసిన ఉపశమన వైద్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ జబ్బుల వైద్యానికి, నాణ్యమైన మందులకు సంబంధించిన ప్రస్తావనే ఆ ప్రకటనలో లేదు. అదేవిధంగా ముసాయిదాలో ఉన్న సామాజిక, ఆర్థిక, పర్యావరణ కారణాలు తుది ప్రకటనలో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సామాజిక ఆరోగ్య ఉద్యమకార్యకర్తలు, మూడో ప్రపంచదేశాల ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించాల్సిన సమయమిది. సమగ్ర ప్రాథమిక ఆరోగ్యసేవలను పటిష్ఠంచేసి వాటికి సాంక్రామికేతర వ్యాధుల ప్రణాళికను అనుసంధానించాలి. రాష్ట్రంలోనూ ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ మీద దాదాపు 3000కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది. కానీ, ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేసే ఒక సమగ్ర పథకం ప్రభుత్వం వద్ద లేదనేది వాస్తవం. అటువంటి దార్శనికతే సర్కారు ప్రదర్శించి, ఈ రూ.3000కోట్లు ప్రభుత్వాసుపత్రులమీద వ్యయంచేసి ఉంటే- ఇప్పటికే సకల సౌకర్యాలతో చక్కని ప్రభుత్వాసుపత్రులు తయారై ఉండేవి. సాంక్రామికేతర జబ్బులను ఎదుర్కోవడం సాధ్యమయ్యేది. ప్రపంచమంతా ఈ జబ్బులమీద యుద్ధం ప్రకటిస్తున్న ఈ సమయంలోనైనా రాష్ట్రప్రభుత్వం సమగ్ర ప్రజారోగ్య విధానంవైపు దృష్టిసారించాలి.

(రచయిత శాసనమండలి సభ్యులు,జనవిజ్ఞానవేదిక ఆరోగ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ / డాక్టర్‌ గేయానంద్‌.)
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, 21 June 2011

లైకెన్‌ ప్లానస్‌ , Lichen Planus



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -లైకెన్‌ ప్లానస్‌(Lichen Planus)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



లైకెన్‌ ప్లానస్‌ అనేది దురద, బుడిపెలు, పొక్కులు, పొలుసులతో కూడిన చర్మవ్యాధి. లేత వంగపండు రంగులో అనేక కోణాలు కలిగిన ఆకృతిలో కొద్దిపాటి పొలుసులతో కనిపిస్తుంది. చేతులను మోచేతుల వద్ద ముడిచే చోట, పాదాలన మడమల వద్ద వంచే చోట, జననేంద్రియాలపైన, నోటిలోపల ఎక్కువగా ఈ రకం బుడిపెలు, మచ్చలు తయారవుతుం టాయి. వ్యాధి నిరోధక శక్తి అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి ప్రాప్తిస్తుంది. ఈ వ్యాధుల్లో వ్యాధి నిరోధక శక్తిని సక్రమ మార్గంలో నడిపించే రసాయన చికిత్సలు అవసరమవుతాయి.


కారణాలు
లైకెన్‌ ప్లానస్‌ వ్యాధికి ఇతమిద్ధమైన కారణాలు తెలియనప్పటికీ, కణ మధ్యవర్తిత్వ చర్య (సెల్‌ మీడియేటెడ్‌ రెస్పాన్స్‌) కారణంగా ప్రాప్తిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే వాటిలో ప్రతిజనక, ప్రతి రక్షక పదార్థాల తయారీ కీలకమన్నది తెలిసిందే. వ్యాధి నిరోధక శక్తి నియంత్రణ తప్పి స్వయం ప్రేరితంగా మారే ఇతర వ్యాధుల్లో కూడా లైకెన్‌ ప్లానస్‌ అనుబంధ లక్షణంగానో, లేదా పరతంత్ర లక్షణం గానో కనిపిస్తుంది.

పెద్దపేగులో వ్రణాలు తయార వడం, తల మీద జుట్టు వలయాకారపు మచ్చలుగా రాలిపోవడం, బొల్లి మచ్చలు, చర్మం కింద ఉండే రక్తనాళాలు వాపునకు గురై చర్మాన్ని, కండరాలను ఇన్‌ఫ్లమేషన్‌కు గురి చేయడం, అదుపాజ్ఞల్లో ఉండే కండరాలు అదుపు తప్పి వాలిపోవడం వంటి ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల్లో లైకెన్‌ ప్లానస్‌ కనిపించే అవకాశం ఉంది. కాగా, హెపటైటిస్‌ సి వైరస్‌ ఇన్‌ఫెక్షన్లలోనూ, దీర్ఘ కాలపు కాలేయపు వ్యాధుల్లో నూ, కాలేయపు కణజాలం గట్టిపడటం వల్ల ప్రాప్తించే లివర్‌ సిరోసిస్‌ వ్యాధిలోనూ సమాంత రంగా లైకెన్‌ ప్లానస్‌ ఉండటాన్ని పరిశీలకులు గమనించారు.

కొంతమందిలో వ్యాధి ఆనువంశికంగా ప్రాప్తిస్తుం టుంది. హెచ్‌.ఎల్‌.ఎ-బి 27 లేదా హ్యూమన్‌ ల్యూకో సైట్‌ యాంటిజెన్‌ ఉండే కుటుంబాల్లో ఈ వ్యాధి ఉనికి కనిపించడాన్నిబట్టి ఈ వ్యాధికి జన్యు పరమైన అంశ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. మానసిక ఒత్తిడి వల్ల వ్యాధి నిరోధక శక్తి వికటించి లైకెన్‌ప్లానస్‌ మచ్చలు ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. జనాభాలో దాదాపు 1 నుంచి 2 శాతం మంది లైకెన్‌ ప్లానస్‌తో బాధపడుతున్నారని అంచనా. పురుషుల్లో కంటే స్త్రీలలో దీని ఉనికి ఎక్కువ. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. ఏ వయస్సులోనైనా రావచ్చు. కాని 30 - 60 సంవత్సరాల మధ్య వయస్సులో ఎక్కు వగా కనిపిస్తుంది.

ఈ వ్యాధి అనేక సందర్భాల్లో అప్రధా నంగా, అస్పష్టంగా మొదలవుతుంది. ముందుగా మణికట్టు, మోచేతుల మడతల్లో మచ్చలు మొదల వుతాయి. వారం, పదిరోజుల్లో శరీరమంతా మచ్చలు వస్తాయి. 2 నుంచి 16 వారాల్లో గరిష్ట స్థాయికి చేరుతాయి. ఈ వ్యాధిలో దురద ఉంటుంది. అయితే మచ్చల తత్వాన్నిబట్టి దురద ఉంటుంది. గట్టిపడి గాట్లుగా తయారైన మచ్చల మీద ఎక్కువవ స్థాయిలో దురద ఉంటుంది. నోటిలో కనిపించే పొడలు లక్షణరహితంగా ఉండ వచ్చు. లేదా మంటను కలిగించవచ్చు.

వ్యాధిని సకాలంలో గుర్తించి వ్యాధి నిరోధక శక్తిని సక్రమమార్గంలో నడిపించే ఆయుర్వేద రసాయన చికిత్సలను, స్వస్థస్యోర్జస్కర చికిత్సలను చేస్తే చర్మంపైన మచ్చలు 50 శాతం కేసుల్లో ఆరు నెలల్లో తగ్గిపోతాయి. 18 నెలల్లో 85 శాతం కేసుల్లో మచ్చలు పూర్తిగాపోతాయి. అయితే నోటి లోను, శ్లేష్మపు పొరల మీద ఏర్పడే మచ్చలు తగ్గడానికి రెండునుంచి మూడేళ్లు పడుతుంది. శ్లేష్మపు పొరలు వ్యాధి ప్రభావానికి లోనవడం సర్వ సాధారణం. చర్మం మీద వ్యాధి లక్షణాలు కనిపిం చక పోయినప్పటికీ, శ్లేష్మపు పొరలు మాత్రమే వ్యాధి చిహ్నాలను ప్రదర్శించవచ్చు. నోటిలో నాలుక అంచుమీద, బుగ్గల లోపలా మచ్చలు కనిపిస్తాయి. లేత వగపండు రంగు మీద బూడిద రంగులో కాని, తెల్లని రంగులో కాని చారికలు కనిపిస్తాయి. మచ్చలు చిన్నవిగా ఆరంభమై విస్తరిస్తాయి. చిగుళ్ల మీద మాత్రం అరుదుగా కనిపిస్తాయి.

-నోరు తడారిపోవడం, నోటిలో ఒక రకమైన లోహపు రుచి అనిపిస్తుండటం కొంతమందిలో కని పించే లక్షణాలు. తంబాకు, పొగాకు వంటివి వినియోగించే వారిలో ఈ మచ్చలు కేన్సర్‌గా పరిణ మించే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ తరహా మచ్చలు గొంతు లోపల, టాన్సిల్స్‌ గ్రంథుల మీద, యోని పెదవుల మీద, మలద్వారం చుట్టుప్రక్కల ప్రదేశంలోనూ కనిపించవచ్చు. పురుషాంగపు మణి మీద వవ్తే సంభోగ సమయం లో నొప్పి వస్తుంది. దురద కూడా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో మూత్రమార్గం ఇరుకుగా తయారయ్యే అవకాశం ఉంది.వ్యాధి ప్రభావానికి లోనైన వారిలో 10 శాతం మందికి గోళ్లు దెబ్బ తినే అవకాశం ఉంది. గోళ్ల రంగు ముదురు రంగులో కనిపించడం, గోళ్ల మీద నిట్ట నిలువుగా ఉబ్బెత్తుగా గాట్లు, గాడి వంటివి ఏర్పడటం జరుగవచ్చు. చర్మంపైన లైకెన్‌ ప్లానస్‌ మచ్చలు ఏర్పడిన వారిలో కొంతమందికి తలలోని చర్మం మీద దురద, పొలుసులతో కూడిన బొడిపెలు తయారై జుట్టు ఊడిపోతుంది.

మడమల మడతల్లో మచ్చలు తయారైన సంద ర్భాల్లో దీర్ఘకాలంపాటు కొనసాగుతాయి. ఇలాంటి సందర్భాల్లో చర్మం రంగు మారడమే కాకుండా విపరీ తమైన దురద ఉంటుంది. లైకెన్‌ ప్లానస్‌ వ్యాధిలో కనిపించే మచ్చలను వాటి రూపాన్ని బట్టి, ప్రదర్శితమయ్యే తీరునుబట్టి వివిధ వర్గాలు గా విభజించారు.ఎక్కువ మందంగా తయార వడం, ఎండిపోయి అట్టకట్టడం, పై పొర తినే యడం వల్ల వ్రణం మాదిరిగా తయారవడం, వెంట్రుక కుదురు వద్ద బొడిపెలు తయారవడం, వలయాలుగా తయారవడం, నిలువు గీతలుగా మచ్చలు కనిపించడం, నీటి పొక్కుల రూపంలో ఉండటం, బిందువులుగా కనిపించడం వంటివి కొన్ని రూపాలు.

లక్షణాలు
లైకెన్‌ ప్లానస్‌ వ్యాధి లక్షణాలు కొన్ని ఇతర వ్యాధుల్లో కూడా కనిపిస్తాయి కనుక వ్యాధి నిర్ధారణ నిదానం అవసరమవుతుంది. ముఖ్యంగా పిటీరియా సిస్‌ రోజియా, గట్టేట్‌ సొరియాసిస్‌, ప్లేక్‌ సొరియా సిస్‌, సిఫిలిస్‌, టీనియా కార్పోరిస్‌ వంటి వ్యాధుల ను పరిగణించడం అవసరం.ఈ వ్యాధి వల్ల సాధారణంగా ప్రాణహాని ఉండదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే 18 నెలల్లో తగ్గిపోతుంది. అయితే అసాత్మ్యకర ఆహార విహారాల వల్ల వ్యాధి తిరగబెట్టి దీర్ఘకాలం బాధించే అవకాశాలున్నాయి. చర్మం మీద తయారైన మచ్చల వల్ల కేన్సర్‌ భయం లేకపోయినప్పటికీ, నోటిలో తయారైన మచ్చలు కేన్సర్‌గా మారే అవకాశం ఉంది. అయితే ఇది కూడా చాలా తక్కువ శాతం కేసుల్లోనే జరుగు తుంది. మహిళల్లో జననేంద్రం వద్ద తయారైన లైకెన్‌ ప్లానస్‌ మచ్చలు స్క్వామస్‌ సెల్‌ కార్సినోమాగా పరిణమించే అవకాశం కొంత ఉంది.

చికిత్స

సరియైన చికిత్స లేదు . . కాని దాని ప్రభావాన్ని కొన్ని మందులవలన తగ్గించవచ్చును .
స్టిరాయిడ్స్ -- నోటిద్వారాను , పైపూతగాను వాడాలి ,
విటిన్‌ ఎ , రెటినోయిడ్స్ వాడితే పొలుసులు గా ఉన్న చర్మము నున్నగా అవుతుంది .
ఇమ్మ్యునో సప్రెసెంట్శ్ (immuno suppressants) వాడాలి ,
Hydroxy choroquine కొంతవరకు పనిచేస్తుంది .
Tacrolimus
Dapsone ,
UVB phototherapy ,
Aloe vera ,
purslane
వంటి మందులు వాడుతున్నారు . మీకు దగ్గరి లో ఉన్న ఫామిలీ డాక్టర్ ని గాని , చర్మవ్యాదుల నిపుణులను గాని సంప్రదిస్తే మంచి సలహా ఇస్తారు .
  • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, 18 June 2011

గర్భిణి స్త్రీలు ఆహారం విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు , Awareness in food habits of pregnancy


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjvyWSnEqAL-vAXY-LhIOCMvIQroTDdaLrOZd1h96dsbbpiXAQKNps2xHdcMQlrTgbH7yUvvcsjrnl9AwuE4O5958JZalyY54TeVzBGkptibkp0QpWLb921eAqq9aNSMs6Nhyi5z32D-fk/s1600/Pregnancy.jpg

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గర్భిణి స్త్రీలు ఆహారం విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



  • గర్భిణీ స్త్రీలు అన్ని రకాల ఆహార పదార్ధాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్ధాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి. తల్లికి ఎక్కువగా శక్తి లభించే ఆహార పదార్ధాలు ఇవ్వడం వలన తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలాగే కాన్పు సమయంలో, ప్రసవానంతర అత్యవసర పరిస్ధితులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారం కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినాలి.

రోజూ తినే ఆహారం కంటే ఎక్కువ తినాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు,చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్ధాలు, పీచుపదార్ధాలు తీసుకోవాలి.

సరైన పోషకాహారంతో పాటు సరైన విశ్రాంతి తీసుకోవాలి. (పగలు కనీసం 2 గంటలు, రాత్రి 8 గంటలు)
  • • గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటుంది. దీని వలన బరువు తక్కువ ఉన్న బిడ్డలు పుట్టడం, తల్లికి అధిక రక్తస్రావం కావడం జరుగుతుంది. కాబట్టి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారం అంటే ఆకుకూరలు, బెల్లం, రాగులు, ఎండిన పండ్లు (కర్జూరం, ద్రాక్ష ) , నువ్వులు, చెఱకురసం, ఉలవలు, మాంసం (కాలేయం) తీసుకోవాలి. రోజుకు ఒకటి చొప్పున ఐరన్ మాత్రలు తీసుకోవాలి. పోషకాహారం తీసుకుని ఆరోగ్యం గా ఉన్న స్త్రీకి సుఖప్రసవం జరుగుతుంది.

తీసుకోకూడని పదార్ధము :
  • బాగా ఉడకని మాంసము ముఖ్యము గా పందిమాంసము తినకూడదు .. దీనివల "toxoplasmosis"అనే ఇంఫెక్షన్‌ వచ్చి బిడ్డ మెదడు పెరుగుదలను దెబ్బతీయును లేదా పుట్టే బిడ్డ గుడ్దిదిగా పుట్తును .

  • కాల్చిన సముద్రపు చేపల రొట్టెలు (smoked seafoods)తినకూడదు . దీనివల " Listeriosis " అనే ఇంఫెక్షన్‌ వచ్చే అవకాశము ఉన్నది . దీనివల అబోర్షన్లు జరిగే అవకాశము ఉన్నది .

  • అతి వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి తొలి నెలల్లొఅంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు.

  • పచ్చి గుడ్డు , సరిగా ఉడకని గుడ్లతో చేసిన పదార్ధములు తినకూడదు . పచ్చి గుడ్డు లో " Solmonella " అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ.

  • పాచ్యురైజేషన్‌ చేయని పాలతో తయారుఛేసిన జున్ను వంటి పదార్ధము లు తినకూడదు . పాచ్యురైజేషన్‌ చేయని పాలలో " Listeria " , Bovine T.B అనే బాక్టీరియా ఉంటుంది . దానివలన miscarriage అయ్యే ప్రమాధము ఉండును.

  • కాఫీ లోని కెఫిన్‌ మరియు కెఫినేటెడ్ డ్రింక్స్ మొదటి మూడు మాసాలలో ఎక్కువగా తీసుకోకూడదు . రోజుకి 200 మి.గ్రా. కంటే ఎక్కువ కెఫిన్‌ తీసుకుంటే గర్భస్రావము జరిగే ప్రమాధము ఉంది . కెఫిన్‌ డైయూరిటిక్ గా పనిచేయును . వంటిలోని నీరును బయటికి పంపివేయడం వలన డీహైడ్రేషన్‌ వచ్చే అవకాశము వలన గర్భస్రావము జరిగే చాన్స్ ఎక్కువ.

  • సారా (Alcohol) మరియు సారా సంబంధిత పదార్ధములు తీసుకోకూడదు . బేబీ పెరుగుదలను , ఆరోగ్యాన్ని దెబ్బతీయును. "foetal alcohol syndrome "కి దారితీయును . కాలేయసంబంధిత రుగ్మతలు బేబీకి కలుగును,

  • కాయకూరలు బాగా కడిగి తినాలి . కడగని ఆకుకూరలు , కాయలు , పండ్లు పైన " Toxoplasmosis" కలుగజేసే బాక్టీరియా ఉండును . ఇది చాలా ప్రమాదకరము .

  • విటమిన్‌ ' ఎ ' ఎక్కువగా ఉన్న మాంసాహారము అనగా లివర్ తో వండిన కూర తినకూడదు - దీనివలన బేబీ పుట్టికతో కూడుకున్న డిఫెక్ట్స్ తో పుట్టే అవకాశమున్నది. బీటా కెరటీన్‌ తో కూడుకొని ఉన్న విటమిన్‌ ' ఎ ' (కేరెట్స్ ) తినవచ్చును .

food to avoid during pregnancy in brief:

  • Alcohol--మత్తుపానీయాలు ,
  • Caffeine--కాఫీ , కెఫినేటెడ్ డ్రింక్స్ ,
  • Raw eggs -- పచ్చి , సరిగా ఉడకని గుడ్లు ,
  • fish with mercury-- మెర్కురీ మూలకము ఉన్న చేపలు ,,
  • Smoked sea food-- కాల్చిన సముద్రపు ఉత్పత్తులు ,
  • fish exposed to Industrial pollution-- కర్మాగారాల కెమికల్ తో కూడుకొని ఉన్న చేపలు ,
  • Raw shelfish -- పచ్చి , సరిగా ఉడక్ని ఆల్చిప్పలు , ఎండ్రకాలయలు ,
  • soft cheese -- పాచ్యురైజ్డ్ చేయని పాలతో చేసిన జున్ను ,
  • unwashed vegetables-- శుబ్రముగా కడగని కాయలు ,కూరలు ,
  • unpasteurized milk -- వేడిచేయని పాలు , పాలు పదార్ధాలు ,
  • Pickle and chilly chetnys-- కారము , మసాలా ,ఇంగువతో కూడుకున్న పచ్చళ్ళు , ఊరగాగలు ,

అపోహలు
  • కొన్ని రకాల పండ్లు తినడం మూలంగా మనకు సమస్యలు వస్తాయని, ముఖ్యంగా మహిళల విషయంలో ఎక్కువగా ఉంటాయనే అపొహ వుంది. వాస్తవాలను వాస్తవాలుగా తెలుసుకుంటే ఈ ప్రశ్నలు తిరిగి ఉత్పన్నం కావనే విషయాన్ని గుర్తించాలి.

కొన్ని రకాల అపోహలు
  • - బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుంది.
  • - కొబ్బరి నీళ్లు తాగితే చలువ చేసి జలుబు చేస్తుంది.
  • - మాంసాహారం కన్నా శాకాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి.
  • - గుడ్లు తింటే వేడిచేసి, విరేచనాలు అవుతాయి. గర్భవతులు గుడ్లు తినకూడదు.
  • -నారింజ, అనాస తింటే జలుబు చేస్తుంది.
  • -నెలసరి సమయంలో నువ్వు లు తింటే అధిక రక్తస్రావం అవుతుంది.
  • -క్యారెట్‌, బీట్‌రూట్‌ కన్నా బలమైనది.
  • -కాకరకాయ రసం తాగితే డయాబెటిస్‌ ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది.
  • - అరటి పండు తింటే పుట్టే పిల్లలు నల్లగా పుడతారు.
  • - జున్ను తింటే వాతం చేస్తుంది.
  • నిజానికి ఇవన్నీ మనం తరచుగా వినే విషయాలు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇవేవీ మనకు హాని చేసేవి కావన్న విషయం అర్థమవుతుంది. అందుకే వీటిని గురించి వాస్తవాలు తెలసుకోవలసిన అవసరం ఉంది.

-బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందనడం ఎంత మాత్రం నిజం కాదు. ఇందు లో అధిక కేలరీలు ఉంటాయి. అందుకే తొందరగా జీర్ణం కాదు. అందువల్ల విరేచనాలు, బహిష్టు స్రావం కల్గవచ్చు. ఇది చాలా బలహీనంగా ఉన్న వారి లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది.


-కొబ్బరి నీళ్లు తాగడం అందరికీ మంచిది. ఇందు లో ఎక్కువ మోతాదులో పొటాషియం+ లవణాలు ఉంటా యి. అందుకే ఎక్కువ తాగితే జలుబు చేసి కఫం రావచ్చు.అంతే కానీ కొబ్బరి నీళ్లు తాగితే జలుబురాదు.

-మాంసాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి. మాంసం తినడం వల్ల శరీరం దృడంగానూ, బలంగానూ తయారవుతుంది. శాకాహారం కన్నా మాంసాహారం కొంతవరకూ మేలే.

- గుడ్లు తినడం వల్ల ఎటువంటి నష్టమూ ఉండదు.కానీ ఇందులో ఎక్కువ కేలరీలు ఉంటాయి గను త్వరగా జీర్ణం కాదు. అందు వల్ల అధికంగా తినకపోవడమే మంచిది. గర్భిణీలు మొత్తం ఉడక బెట్టినవితినాలి.

- నారింజ, అనాస తినడం వల్ల వెంటనే జలుబు వచ్చేయదు. అవి శీతాకాలంలోనో, చల్లగా ఉన్నప్పుడో తింటే జలుబు చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇందులో ఉండే సోడియం, పొటాషియం లవణాలు సాధారణ స్థాయి నుండి అధికమయినట్లయితే ఊపిరితిత్తుల్లో కఫం చేరి జలుబు రావచ్చు. రోగ నిరోదక శక్తి తక్కువ ఉన్న వారికి వచ్చే ఆస్కారం ఉంది.

-నెలసరి సమయంలో నువ్వులు తినడం వల్ల బలంగా ఉంటారు. అలాగే నువ్వుల కేలరీల రేటు ఎక్కువగా ఉంటుంది గనక హార్మోన్లు సులువుగా విడుదల అవుతాయి. అందువల్ల రుతుస్రావం ఫ్రీగా అవుతుంది. దీన్నే ఎక్కువగా రక్తస్రావం అవుతుందను కొని భయపడి నువ్వులు తినొద్దు అంటారు.

-బీట్‌రూట్‌లో ఇనుము, బీటా కెరోటిన్లు... క్యారెట్‌ కన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల బీట్‌రూట్‌ కన్నా క్యారెట్‌ కొంత వరకూ మంచిదే.

- కాకరకాయ రసం నేరుగా తాగకూడదు. దీనివల్ల మధుమేహం తగ్గదు. కానీ కాకరకాయ కన్నా కాకరకాయ గింజలు మధుమేహం తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. వాటిని పొడిచేసి తింటే మంచిది.

-అరటిపండు తినడం వల్ల పిల్లలు నల్లగా పుట్టరు. కానీ కొంత మందికి కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎర్రగా పుడతారు.

- జున్ను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో ఎక్కువగా కొవ్వు పదార్ధాలు ఉంటాయి. అందువల్ల ఎక్కువ తింటే అజీర్ణం చేయవచ్చు . అందుకే మిరియాలను కలుపుకొని తినాలి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.





  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/