Thursday, 16 June 2011

ధ్యానం -ఆరోగ్య ఉపయోగాలు : Meditation and medical uses



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ధ్యానం -ఆరోగ్య ఉపయోగాలు : (Meditation and medical uses)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మానసిక ప్రశాంతత కావాలంటే ఒక చక్కని మార్గం ధ్యానం. ధ్యానం అనేది ఒక మానసిక సత్ప్రవర్తన. అంటే సాధకుడు ప్రతీకార, యోచన బుద్ధి నుంచి అమితమైన విశ్రాంతి లేదా స్పృహను పొందడం. ధ్యానం అనేది పలు మతాలకు సంబంధించిన అంశం. దీనిని పురాతన కాలం నుంచి సాధన చేస్తున్నారు.

ధ్యానంతో మానసిక ప్రశాంతత మాత్రమే కాదు. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందనీ, జ్ఞాపకశక్తి పెరుగుతుందనీ మీకు తెలుసా? ధ్యానం చేస్తున్నప్పుడు మెదడులో అల్ఫా రిథమ్‌ అనే తరంగం నియంత్రణలో ఉండటం వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. స్పర్శ, చూపు, చప్పుడు వంటి వాటికి జ్ఞానాలకు దోహదం చేసే మెదడులోని కణాల్లో ఈ అల్ఫా రిథమ్‌ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది చీకాకుపెట్టే అంశాల వైపు ధ్యాస మళ్లకుండా చేసి ఏకాగ్రతను పెంపొందిస్తుంది. అందువల్ల ధ్యానం చేయటం ద్వారా మెదడులోని ఈ తరంగాలు నియంత్రణలో ఉంటున్నట్టు.. తద్వారా నొప్పి భావన తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. తరచూ ఏకాగ్రత లోపంతో బాధపడేవారికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడగలదని పరిశోధకులు సూచిస్తున్నారు.


అశాంతితో ఉన్నప్పుడు ఎటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని నా ప్రార్థన, ఫలితం దాదాపుగా చెడుగా ఉంటుంది. ఎదుటి వారికి ఏ విధంగా నష్టం చెయ్యకుండా ఉండటం వలన, వీలైతే తగినంత సహాయం చెయ్యడం వల్ల మనకు మానసిక ప్రశాంతత, జీవిత పరమార్థకత వస్తుంది. మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా జీవితంలో యుద్ధం చేస్తూనే ఉన్నాం… దానిని గుర్తించి, ఎదుటి వారు ఎవరైనా, ఎటువంటి వారైనా ఇబ్బంది పెట్టకుండా ఉందాం.

మరికొంత సమాచారము కోసం -> ధ్యానము ఉపయోగాలు

  • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, 15 June 2011

వర్షాకాలం జబ్బుల బాధ లేకుండా.. అవగాహన...జాగ్రత్తలు, Rainy season diseases awareness


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



జలుబు జ్వరం
ఈ సీజన్లో జలుబు, దగ్గు వంటివి ప్రధానంగా వైరస్‌ల కారణంగా వచ్చే సమస్యలు. ఇవి చాలా వరకూ వాటంతట అవే తగ్గిపోతాయి. మందులు తీసుకున్నా, తీసుకోకపోయినా కూడా ఇవి ఐదారు రోజుల్లో తగ్గుతాయి. ఈ సమయంలో జలుబు, ముక్కు దిబ్బడ, ఒళ్లు నొప్పుల వంటివి ఎక్కువగా ఉంటే.. అవి తగ్గేందుకు ఉపశమన ఔషధాలు తీసుకోవచ్చు. జ్వరం ఎక్కువగా ఉంటే తడిబట్టతో ఒళ్లు తుడుచుకోవటంతో పాటు ప్యారాసెటమాల్‌ వంటి మాత్రలు వేసుకోవాలి. ముఖ్యంగా నీరు, ద్రవాహారం ఎక్కువగా తాగాలి. లంఖణం ఉండాల్సిన పని లేదు. తేలికగా జీర్ణమయ్యే ఇష్టమైన ఆహారం ఏదైనా తీసుకోవచ్చు. లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించటం అవసరం.

టైఫాయిడ్‌
టైఫాయిడ్‌ ప్రధానంగా కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపించే సమస్య. దీనికి 'సాల్మొనెల్లా టైఫీ' అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బ్యాక్టీరియా మనుషుల్లోనే నివసిస్తుంది. టైఫాయిడ్‌ బారినపడినవారు, దాన్నుంచి కోలుకుంటున్నవారి రక్తం, పేగుల్లో ఇది ఉంటుంది. వారు మల విసర్జన చేసినప్పుడు ఇది బయటకొస్తుంది. ఈ సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియాతో కలుషితమైన ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకుంటే ఇతరులకు టైఫాయిడ్‌ జ్వరం వస్తుంది. మురుగునీటితో తాగునీరు కలుషితమయ్యే ప్రాంతాల్లో టైఫాయిడ్‌ అధికంగా కనిపిస్తుంది. టైఫాయిడ్‌ నిర్ధారణ అయితే పూర్తి కోర్సు యాంటీబయోటిక్‌ మందులు తప్పకుండా వేసుకోవాలి. మధ్యలో మానేస్తే టైఫాయిడ్‌ తిరగ బెడుతుంది. ఇతరులకు వ్యాపించే ప్రమాదమూ ఉంది.

లక్షణాలు
* విడవకుండా జ్వరం రావటం. సాధారణంగా జ్వరం 103 నుంచి 104 డిగ్రీల వరకు ఉంటుంది.
* కొద్దిగా వాంతులు, విరేచనాలు, ఆకలి మందగించటం
* కడుపునొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం.

రాకుండా ఉండాలంటే?
* కలుషితమైన ఆహారం, నీటికి దూరంగా ఉండాలి.
* ఆహారం తీసుకునే ముందు, మలమూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.రోడ్ల పక్కన అమ్మే తిను బండారాలు, పానీయాల జోలికి వెళ్లకపోవటం మంచిది.
* అప్పుడే వండిన ఆహారాన్ని తినటం.. కాచి, చల్లార్చిన నీటిని తాగటం ఉత్తమం.
* టైఫాయిడ్‌ జ్వరం బారినపడకుండా టీకాలు కూడా వేయించుకోవచ్చు.

వర్షాకాలంలో ఏం జరుగుతుంది?
1. విజృంభించే వైరస్‌: వాతావరణ ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా వచ్చే మార్పుల కారణంగా కొన్ని రకాల వైరస్‌లు, సూక్ష్మక్రిములు విజృంభిస్తాయి. ఫలితంగా ఈ సమయంలో తుమ్ములు, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూజ్వరాల వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఎక్కువ.

2. నీరు కలుషితం: వర్షాల కారణంగా మనం తాగే నీరూ కలుషితమవుతుంది. ఫలితంగా కడుపునొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాలు,కామెర్లు, టైఫాయిడ్‌ జ్వరాల వంటివి పెరుగుతాయి.

3. దోమల సంత: వర్షపునీరు నిల్వ ఉండి.. పరిసరాల్లో దోమల సంతతి అనూహ్యంగా పెరిగిపోతుంది. ఫలితంగా దోమకాటు మూలంగా వ్యాపించే డెంగీ, మలేరియా వంటి సమస్యలూ పెరుగుతాయి.

అయితే వీటిపై అవగాహన పెంచుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే వీటన్నింటినీ నివారించుకునే వీలుంది.

డెంగీ
దోమలు తెచ్చే పెద్ద ముప్పు ఈ డెంగీ జ్వరాలు. అన్నిచోట్లా విపరీతమైన జనసాంద్రత, పారిశుద్ధ్యలోపం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం, ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత లోపించటం.. ఇవన్నీ డెంగీ ముప్పు తెచ్చిపెట్టే 'ఈడిస్‌ ఈజిప్త్టె' దోమ సంతతి పెరిగేందుకు అనువైన పరిస్థితులే. ఈ దోమ కాటు ద్వారా డెంగీ జ్వర కారకమైన ఫ్లావి వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇవి ఎక్కువగా పగటిపూట కుడతాయి. ఎక్కువగా కాళ్లు, చేతుల వంటి భాగాల మీద కుడతాయి. ఇవి స్వచ్ఛమైన నీటిలో పెరుగుతాయి. ఈ దోమ కుట్టిన తర్వాత రెండు నుంచి ఏడు రోజుల మధ్యలో డెంగీ లక్షణాలు కనబడొచ్చు.

లక్షణాలు
అకస్మాత్తుగా వణుకుతో జ్వరం రావటం. 101 నుంచి 104 డిగ్రీల వరకు జ్వరం ఉండొచ్చు. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పాటు కండరాలు, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఒకోసారి వెలుతురు చూడటం కూడా కష్టం కావొచ్చు. బలహీనత, నోరు చేదు, ఆకలి మందగించటం, కొన్నిసార్లు వాంతులు కూడా అవుతాయి. కొంతమందిలో ఛాతీ మీద, వీపు మీద ఎర్రటి చిన్నచిన్న మచ్చలు రావచ్చు. సాధారణంగా జ్వరం వారం పాటు ఉంటుంది. కొన్ని కేసుల్లో ఎక్కువ కాలం కూడా ఉండొచ్చు. కొంతమందిలో మొదటి రెండు రోజులు జ్వరం వచ్చి పూర్తిగా తగ్గి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. రెండోసారి వచ్చినప్పుడు ఇది తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఎక్కువ.
* డెంగీ తీవ్ర రూపమైన డెంగీ హెమరేజిక్‌ ఫీవర్‌లో రక్తంలో ప్లేట్‌లెట్‌ కణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. శరీరం మీద రక్తపు మచ్చలు రావొచ్చు. కొంత మందిలో ముక్కు, పళ్లచిగుళ్ల నుంచి రక్తం కారొచ్చు. రక్తపు వాంతులు, నల్లని విరేచనాలు కూడా అవ్వొచ్చు.
* డెంగీ షాక్‌ సిండ్రోమ్‌లో.. హెమరేజిక్‌ ఫీవర్‌లో కనిపించే లక్షణాలన్నీ ఉంటాయి. రోగి నాడి కొట్టుకోవటం, రక్తపోటు తగ్గిపోతుంది. ఒళ్లు చల్లబడటం, బాగా చెమట పట్టటం, అస్థిమితం, ఒకోసారి అపస్మారక స్థితిలోకీ వెళ్లే ప్రమాదం ఉంది. ఇవి తీవ్రమైన రకాలు కాబట్టి అసలు డెంగీ జ్వరం రాకుండా చూసుకోవటం అత్యుత్తమం.

రాకుండా ఉండాలంటే?
* పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా.. శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పెరగకుండా చూసుకోవాలి.
* ముఖ్యంగా పగటి పూట దోమల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.
* పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పొడవు చేతుల చొక్కాలు, ప్యాంట్లు వేయటం మంచిది. క్లాసు రూముల్లో, ప్రయాణాల్లో దోమలు కుట్టకుండా చూసుకోవాలి.
మలేరియా
ఒకప్పుడు మలేరియా అంటే తీవ్రమైన చలితో, ఎక్కువగా సాయంత్రం పూట వచ్చే జ్వరమని భావించేవారు గానీ క్రమేపీ ఈ జ్వరం లక్షణాల్లో తేడాలు వస్తున్నాయి. ఈ మలేరియా.. ప్లాస్మోడియం జాతి సూక్ష్మక్రిముల మూలంగా వస్తుంది. ఈ సూక్ష్మక్రిమి ఎనాఫిలస్‌ దోమ కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ సూక్ష్మక్రిముల్లో నాలుగు రకాలున్నాయి. వీటిల్లో ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్‌ చాలా ప్రమాదకరమైంది. మలేరియా మరణాలకు చాలావరకు ఈ వైరస్‌ కారణమవుతోంది. దోమ కుట్టటం ద్వారా రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మక్రిములు కాలేయాన్ని చేరుకుంటాయి. అనంతరం కాలేయంలోని కణాల్లోకి చొచ్చుకెళ్లి సంతానాన్ని వృద్ధి చేస్తాయి. అక్కడ్నుంచి రక్తప్రసరణలో కలిసి మలేరియా దాడి చేయటానికి దోహదం చేస్తాయి.

లక్షణాలు
* తొలిదశలో తలనొప్పి, నీరసం, కండరాల నొప్పి, కడుపులో అసౌకర్యం వంటివి కనిపిస్తాయి.
* తర్వాత రోజు విడిచి రోజు జ్వరం వస్తూ పోతుంటుంది.
* చలితో వణకటం, దుప్పట్లు కప్పితే కొంతసేపటికే చెమటతో తడిసిపోయి ఒళ్లంతా చల్లబడుతుంది.
* అనీమియా, కొందరిలో ప్లీహం కాస్త పెద్దగా అవటం ఉంటుంది.
* సెరిబ్రల్‌ మలేరియా ప్రాణాంతకమైంది. ఇందులో నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది.
* కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యం కూడా కనబడుతుంది.

రాకుండా ఉండాలంటే?
* చేతులు కాళ్లను పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి.
* దోమల బారినపడకుండా దోమతెరలు, రిపెలెంట్లు, కాయిల్స్‌, క్రీములు, లోషన్ల వంటి వాటితో దోమకాటు బారిన పడకుండా చూసుకోవాలి.
* కిటికీలకు తప్పకుండా మెష్‌లు అమర్చుకోవాలి.
* ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
* ఖాళీ పాత్రలు, వాడకుండా ఉన్న ఎయిర్‌కూలర్ల వంటి వాటిల్లో నీరు లేకుండా చూసుకోవాలి. పరిసరాల్లోని ఖాళీ డ్రమ్ముల వంటి వాటిని బోర్లించాలి. టెంకాయ చిప్పలు, పాత టైర్ల వంటి వాటిని దూరంగా పారేయాలి.
* మలేరియా ప్రబలిన ప్రాంతాలకు వెళ్లాల్సివస్తే వైద్యుడిని సంప్రదించి యాంటీ మలేరియా మందులు వేసుకోవాలి. ఇలాంటి చోట్లకు గర్భిణులు వెళ్లకపోవటమే మంచిది.
కామెర్లు
వాస్తవానికి కామెర్లు అనేది ఒక లక్షణం మాత్రమే. ఇది హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి వంటి ఎన్నో ఇన్ఫెక్షన్లలో రావచ్చుగానీ ఈ సీజన్లో విజృంభించే కామెర్లకు ఎక్కువగా హెపటైటిస్‌-ఎ, హెపటైటిస్‌-ఇ రకం వైరస్‌లు కారణమవుతాయి. ఇవి ప్రధానంగా కలుషితాహారం, కలుషితమైన తాగునీటి కారణంగా వ్యాపిస్తాయి. వర్షకాలంలో మురుగు నీరు తాగునీటితో కలుషితమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. దీంతో ఈ రకం కామెర్లు ప్రబలిపోయే ప్రమాదం పొంచి ఉంటోంది. కళ్లు, చర్మం పసుపు పచ్చగా మారటం, రక్తంలో బిలురుబిన్‌ స్థాయి పెరగటం, శరీరంలోని సున్నితమైన చర్మం కూడా పచ్చబడే అవకాశాలుంటాయి. ఇలా హెపటైటిస్‌-ఎ, ఇ రకం వైరస్‌ల కారణంగా వచ్చే కామెర్ల సమస్య రెండు మూడు వారాల్లో సహజంగానే దానంతట అదే తగ్గిపోతుంది. చిన్నపిల్లల్లో ఇది తేలికగానే తగ్గిపోతుంది గానీ పెద్దవయసు వారిలో నెలల తరబడి వేధించవచ్చు. దీన్ని అశ్రద్ధ చెయ్యటానికి లేదు.

లక్షణాలు
* హెపటైటిస్‌-ఏ, హెపటైటిస్‌-ఇ రకం వైరస్‌ల వల్ల కామెర్లలో ప్రధానంగా ఆకలి మందగిస్తుంది. మొదటి రెండు మూడు రోజుల్లో కేవలం వాంతులు, కొద్దిగా జ్వరం, గొంతునొప్పి, ఒళ్లంతా నొప్పి వంటి ఉంటాయి. నాలుగైదు రోజుల తర్వాత మూత్రం పచ్చగా అవుతుంది. క్రమంగా చర్మం, కంట్లో తెల్లభాగం, గోళ్లు, నాలుక పసుపు పచ్చగా అవటం. మూత్రం కూడా పసుపు రంగులో రావటం. కొన్ని సందర్భాల్లో మలం తెల్లగా, నల్లగా రంగూ మారొచ్చు.
* కడుపునొప్పి, చికాకు, బలహీనత వంటివీ కనిపిస్తాయి.
* కామెర్లు ముదిరితే వాంతిలో రక్తం పడటం, కడుపులో ద్రవాలు పేరుకుపోవటం వంటి ప్రమాదకర లక్షణాలు కూడా ఉంటాయి.

రాకుండా ఉండాలంటే?
* పరిశుభ్రమైన నీటినే తాగాలి. తాగునీటిని బాగా మరగకాచి, వడకట్టి, చల్లారిన తర్వాత తాగటం మంచిది.
* సాధ్యమైనంత వరకూ ఇంట్లో వండిన ఆహారాన్నే తినాలి. బయట రోడ్ల మీద అమ్మే పదార్థాలు, పండ్ల రసాల వంటివి కలుషితమయ్యే అవకాశం ఉందని గుర్తించాలి.
* కూరగాయలు, ఆకుకూరలను బాగా కడిగిన తర్వాతే వంటకు ఉపయోగించాలి. పండ్లను కూడా శుభ్రంగా కడిగాకే తినాలి.
* కామెర్ల లక్షణాలు కనబడితే ఆకుపసర్లు, చెట్టుమందులంటూ తాత్సారం చేయకుండా అసలు అవి ఏరకం కామెర్లన్నది నిర్ధారణ చేసేందుకు, తగు జాగ్రత్తలు తీసుకునేందుకు వైద్యులను సంప్ర దించాలి.

నీళ్ల విరేచనాలు
బ్యాక్టీరియా, వైరల్‌, పరాన్నజీవుల ఇన్‌ఫెక్షన్ల మూలంగా నీళ్లవిరేచనాలు (డయేరియా) వస్తాయి. రోజుకి మూడు అంతకన్నా ఎక్కువసార్లు నీళ్ల విరేచనాలు అవుతుంటే డయేరియాగా భావించొచ్చు. సాధారణంగా ఇది రెండు మూడు రోజుల వరకు ఉండి దానంతట అదే తగ్గిపోతుంది. అయితే దీంతో ఒంట్లో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాంతులు విరేచనాలతో బాధపడే వారికి ఒంట్లో నీరు తగ్గకుండా చూసుకోవటం చాలా ముఖ్యం.

వాంతులు విరేచనాలతో ఒంట్లో నీటితో పాటు ముఖ్యమైన లవణాలు కూడా బయటకు పోతాయి. వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోతే 'డీ హైడ్రేషన్‌'కు దారి తీస్తుంది. ఇలాంటి సమయాల్లో కొందరికి సెలైన్‌ పెట్టాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. అందువల్ల పరిస్థితి ముదరకుండా వాంతులు విరేచనాలు అవుతుంటే 'ఓఆర్‌ఎస్‌'ను అరగ్లాసు నీటిలో కలిపి తీసుకోవాలి.

ఎన్నిసార్లు విరేచనాలు అయితే అన్నిసార్లు ఓఆర్‌ఎస్‌ కలిపిన ద్రావణాన్ని తాగటం తప్పనిసరి. మజ్జిగ, కొబ్బరినీళ్లు, సగ్గుబియ్యం జావ, పప్పునీళ్ల వంటి వాటినీ తరచుగా తీసుకోవాలి.

  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, 12 June 2011

ఒంట్లో నీరు చేరుట లో అవగాహన , Edema in the body awareness




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వంట్లోనీరు చేరుట - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మానవ శరీరము బరువు లో సుమారు 70 శాతము బరువు నీరే . శరీర కణము లోన , కణము బయట , రక్తనాళాలలోన సీరం రూపమ్లో ఈనీరు ఉంటుంది . నీరు జీవి బ్రతికేందుకు అత్యవసరము . నీటి పరిమాణము , నిష్పత్తి సమపాల్ళలో ఉండేందుకు శరీర అవయవాలు నిరరంతము పనిచేస్తూ ఉంటాయి . ముఖ్యము గా మూత్రపిండాలు , చర్మము ఈ పనిలో ముఖ్యమైనవి .

శరీరములో అక్కడక్కడ నీరి చేరి(fluid accumulation in body tissues) , లోపల ఉన్న నీరు బయటికి వెళ్ళకుండా శరీరము లో ఉండిపోవడం ఎక్కువ బాధ పెట్టె పెద్ద సమస్య కాకపోయినా ఇది శరీరము కొన్ని ముఖ్యమైన అవయవాల క్రియాశక్తి లోపాలకు సూచన . ఒక్కోసారి మనిషి దీనివల్ల చనిపోయే అవకాశము ఉండవచ్చును . కొందరిలో ఇది కాళ్ళలోనూ , ముఖం లోనూ , పొట్టలోనూ లేదా ఏదో ఒక అవయానికే పరిమితం అవవచ్చును.
శరీరములో నీరు చేరడం 3 రకాలు ---
ఏదైనా ఒక బాగానికి నీరు చేరి వాపు రావడం --Lacal edema .. అంటారు .
శరీరమంతా ఏకరీతిగా నీరు చేరడం -- generalized edema ... ఆంటారు .
శరీరము లో ఉన్న క్యావిటీలలో (body cavities) నీరు చేరడం . ఉదా: జలోదరము , ఫ్లూరల్ ఎఫ్యూషన్‌ మున్నగునవి .
ఇందులో వేలి తో నొక్కితే చొట్ట పడేది , చొట్ట పడనిది అని రెండు విధాలు గా ఉంటుంది . చొట్టపడని ఎడీమా లింఫాటిక్ మండలము (Lymphatic system) వ్యాదిగ్రస్తమవడం వల్ల ఏర్పడుతుంది ... దీనిని Lymphedema అంటాము . చొట్టపడని ఎడీమా కి ఇంకో కారణము థైరాడ్ వ్యాదులలో ఒకటైన మిక్షెడిమా(due to Hypo-thyroidism)

చొట్టపడే ఎడీమ చాలా సాదారణము కనిపించే ఈరకం నీరుచేరడం . ఇది రక్త నాళాలలో ఉన్న ద్రవము లీకు అవడం వలన కణాల మధ్యలోనికి వచ్చి వాపుగా యేర్పడుతుంది . నాళాలళొ pressure ఎక్కువ అయినపుడు ఇది జరుగుతూ ఉంటుంది .

కారణాలు / వ్యాధులు :
గుండె జబ్బులు (heart failure, CCF),
మూత్రపిండాల వ్యాధులు (nephrotic syndrome),
కాలేయ సంబంధిత వ్యాధులు (liver failure-cirrhosis),
varicose veins ,
Thromboplebitis,
Dermatitis ,
Skin allerty ,
filaria edema ,
Lipo edema ,
myxedema .
ఎక్కువ సేపు నిలబడడం మూలం గా వచ్చే వాపులు .(hypostatic postural edema),
ఎక్కువ ఉప్పు పదార్ధములు తినడం మూలాన వచ్చే వాపులు ,
స్త్రీలలో భహిస్టలు ముందు జరిగే హార్మోనుల అసమతుల్యము వలన వచ్చే వాపులు ,
కొంతమంది గర్భిణీ లలో ఎక్కువ నీరు నిలవా అవడం మూలాన వచ్చే వాపులు ,

కొన్నిరకాల మందులు వాపులకు కారణము కావచ్చును : అవి ->
వ్యాసోడైలేటర్స్ (vasodilators)-- ఈ మందులు రక్తనాళము లోపల పరిమాణము పెరిగేందుకు , చిన్న చిన్న రక్తనాళాలు తెరుచుకునేందుకు వాడుతారు . ఇవి రక్తపోటును తగ్గిస్తాయి.
కాల్సియం చేనల్ బ్లోకర్స్ (calcium channel blockers) : వీటిని క్యాల్చియం యాంటాగొనిస్ట్స్ అంటాము . ఇవి కూడా రక్తపోటును నియంత్రిస్తాయి.
NSAIDs -- నాన్‌ స్టిరాయిడల్ యాంటి ఇంఫ్లమేటరీ డ్రగ్స్ అని వ్యవరిస్తారు . నొప్పులు తగ్గడానికి వాడుతారు . ఎక్కువకాలము వాడినవారిలో శరీరం వాపులు వస్తాయి.
స్త్రీల సంభందిత హార్మోన్‌ అయిన సంతాననిరోదక మాత్రలు (Estrogens)ఎక్కువకాలము వాడినా ,
మధుమేహ బాదితులు ఇన్సులిన్‌ సెన్‌సిటైజర్స్ ... ఉదా : thiazolidinidiones group drugs ఎక్కువకాలము వాడినా ఈ వాపులు కనిపిస్తాయి.

Mechanism --ఎలా ఏర్పడుతుంది .: శరీరములో చిన్న రక్తనాళాలైన క్యాపిల్లరీస్ (capillaries) నుండి ద్రవము (సీరం) లీకు అవడం వలన ఎడీమా ఏర్పడుతుంది . ఈ లీకేకీ ఆయా రక్తనాళాలకు దెబ్బతగలడమో(damage)లేదా వాటిలో పీడనము(increased pressure) ఎక్కువ అవడము మూలానో జరుగుతుంది . ఈ ద్రవము లీకేజీ సాంకేతికాలు మూత్రపిండలకు చేరి ఎక్కువ సోడియం నిలవాకి దోహదం పడి ఆ లీకైన ద్రవాన్ని బర్తీచేయడానికి ప్రయత్నం చేసే ప్రక్రియ వలనే మరింత ద్రవము కణాలచుట్టూ చేరి వాపులకు దారితీస్తుంది .
increased hydrostatic pressure --రక్తపోటు ఉన్నవారిలోను, మిగతా రక్తనాళాల వ్యాదులలో , సిరలు లో కవాటాలు నీరసత్వము ,
reduced Oncotic pressure with in blood vessels, -- రక్తములో ప్రోటీన్లు శాతము తగ్గినపుడు .
increased tissue oncotic pressure , -- సోడియం శాతము ఎక్కువైనపుడు ,
increased blood vessel wall permiability -- inflamation , -- కొన్ని రక్తనాళాల వ్యాధులలో,
obstruction of fluid clearance via lymphatic system ,-- ఫైలేరీయా వంటి వ్యాధులలో ,
Sodium retention conditions .,--- మూత్రపిండాల వ్యాదులలో ,

వాపులకు లోనయ్యే కొన్ని అవయవాలు ... ఉదాహరణ:
మెదడు పొరలు , కణాలు వాపు --Cerebral edema .
ఊపిరితిత్తుల లో వాపు --- pulmonary edema ,
కళ్లలో వాపు --- corneal edema , conjunctivitis , keratitis ,
కళ్ళ చుట్తూ , ముఖం లో వాపు ---- puppiness of face in Kidney diseases ,
జల ఉదరము -- cirrhosis liver ,
మిక్షెడిమా --- hypothyroid diseases ,
రక్తపోటు ఉన్నవారిలో -- legs in hypertension ,
కాళ్ళ వాపులు -- Heart diseases , ccf ,

ఎలా గుర్తించడం : Symptoms ->
ముఖం ఉబ్బరించినపుడు , కాళ్ళు , పాదాలు , మోచేతులు , కాళ్ళు గుత్తులు వాచినట్లుండడం ,
పొట్ట క్రమము గా ఉబ్బినట్లవడం నీటి కుండలా ఉండడం ,
శ్వాస చిన్నగా అవడం .. చాతిలో నొప్పి రావడం ఆయాశము గా ఉండడం ,
ముఖం ఉబ్బడం , కళ్ళచుట్టూ వాపులు గా ఉండడం ,
చర్మము సాగి పల్చబడి మెరిసే టట్లు కనిపించడం ,
వీటిలో ఏది ఉన్నా డా్క్టర్ ని సంప్రదించాలి . తగిన చికిత్స తీసుకోవాలి .

చేయవల్సిన పరీక్షలు :
యూనిన్‌ టెస్ట్ లు (urine analysis),
బ్లడ్ తనికీలు (Blood analysis) ),
బి.పి , సుగరు తనికీలు (B.P, diabetes tests),
చాతి ఎక్షురే (chest X-ray),

నివావరణ మార్గాలు :


శరీరము లో నీరు ఉండిపోవడానికి కారణం తెలుసుకొని మందు తీసుకోవాలి . తాత్కాలికం గా డయూరిటిక్స్ వాడవచ్చును . బార్లీ నీరు తాగితే ఫలితం ఉంటుంది .
Tab . Lasix 1-2 tab for day 3-4 days , దీనివల్ల వాపులు తగ్గినా సరియైన చికిత్సకోసం పరీక్షలు చేయించుకోవాలి అందుకొరకు మంచి వైద్యనిఫుణులను సంప్రదించాలి .





  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, 2 June 2011

బెణుకు, sprain


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -బెణుకు, sprain- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



తరచుగా చాలామంది మడమ(ankle)బెణకటంతో బాధ పడుతుంటారు. కాలు కూడా కదపలేక తెగ ఇబ్బంది పడుతుంటారు. ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో స్నాయువు లేదా సంధి కండరాలు (Ligaments) బాగా లాగబడడం లేదా మలపడడం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనినే బెణుకులు (Sprains) అంటారు. ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చును. అటువంటి పరిస్థితులలో శస్త్రచికిత్స అవసరమవుతుంది.

బెణుకులు ఎక్కువగా మడమ, మోకాలు, మోచేయి మరియు మణికట్టు కీళ్ళకు జరుగుతుంది. బెణికిన వారిలో 25 శాతం మందికి దీర్ఘకాలంపాటు జాయింట్లలో నొప్పి, కండరాలు బలహీనంగా మారటం ఉంటాయి.

చీలమండ బెణకడం అనేది రెండు రకాలుగా జరుగవచ్చు. చీలమండ జాయింటు బైటివైపునకు తిరగడం వలన పాదం లోపలికి ఒరగటం మొదటి విధానం. దీనినే వైద్య పరిభాషలో ఇన్వర్షన్‌ ఇంజ్యూరీ అంటారు. చీలమండ బైట వైపున ఉండే స్నాయువులు బాగా సాగిపోయి చీరుకుపోయినప్పుడు ఇది జరుగుతుంది. ఇక రెండవ విధానంలో చీలమండ జాయింటు లోపలివైపునకు తిరగడం వలన పాదం బైటి వైపునకు ఒరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో ఎవర్షన్‌ ఇంజ్యూరీ అంటారు. దీనిలో చీలమండ లోపలివైపు లిగమెంట్లు దెబ్బ తింటాయి.

లక్షణాలు
బెణికిన చోట వెంటనే నొప్పి మొదలవుతుంది. అలాగే వాపు, ఎరుపుదనాలు కనిపిస్తాయి. దెబ్బ తిన్న భాగాన్ని ముట్టుకుంటే నొప్పి వస్తుంది.ఒక మోస్తరు బెణుకుల్లో వాపు కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. చాలా సందర్భాలలో మొదటి పది నిముషాలలో విపరీతమైన నొప్పి ఉండి, గంట, రెండు గంటలలో సద్దుమణుగుతుంది. కొంతమంది బెణికినప్పుడు చీరుకుపోయిన శబ్దాన్ని గాని, విరిగిన శబ్దాన్ని గాని వింటారు. చీలమండ జాయింటులోని లిగమెంట్లు దెబ్బ తిన్న స్థాయిని ఆధారం చేసుకుని లక్షణాలు తీవ్రత మారుతుంటుంది

తీవ్రత బట్టి వర్గీకరణ

బెణుకు ని ఆంగ్లం లొ స్ప్రైయిన్ అని పిలుస్తారు. ఇది తీవ్రత బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు.

* మొదటి డిగ్రీ - సంధి కండరాలు లాగబడ్డాయి, కాని చాలా ఎక్కువగా లాగబడలేదు, తెగిపోలేదు.
* రెండవ డిగ్రీ - సంధి కండరాలు బాగా లాగబడ్డాయి. చాలా కొద్ది భాగం లొ కండరాలు తెగిపోవచ్చు కూడా. ఈ రకం బెణుకు అత్యంత నొప్పిని ఇస్తుంది.
* మూడవ డిగ్రీ - సంధి కండరాలు చాలా వఱకు తెగిపోయాయి. ఈ రకం బెణుకుకి శస్త్ర చికిత్స అవసరం. చాలా తీవ్రత కలిగిన ఈ బెణుకు వల్ల నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది.

ప్రధమ చికిత్స

చికిత్సని ప్రధానంగా RICE అనే ఆంగ్ల పదంలో గుర్తు పెట్టుకొని చేస్తారు.

* ఏ పని చేస్తున్నప్పుడు బెణికిందో ఆ పని మళ్ళీ చేయవద్దు.
* Rest- విశ్రాంతి-నొప్పిపెడుతున్న భాగానికి పూర్తి విశ్రాంతి అవసరం.
* Ice- ఐస్ మంచుముక్కలను ఆ భాగం చుట్టూ మధ్యలో విరామంతో పెడుతుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.
* Compression- కంప్రెషన్ బాండేజీ గుడ్డతో గట్టిగా చుట్టూ కట్టుకట్టి ఎత్తులో ఉంచండి.
* Elevation- ఆ భాగాన్ని ఎత్తులో ఉంచడం,

వైద్యుణ్ణి ఎప్పుడు కలవాలి? బెణికినప్పుడు చీలమండ వద్ద ఏదో విరిగినట్లు శబ్దం రావడం. భరించలేనంత స్థాయిలో నొప్పి, వాపు, ఎరుపుదనాలు కనిపించడం లేదా రెండు వారాలకు మించి కొనసాగడం, పాదం మీద బరువు మోపలేకపోవడం, చీలమండ స్థిరత్వాన్ని కోల్పోవడం,దెబ్బ తగిలిన తరువాత తిమ్మిర్లు, మొద్దుబారటాలు ఉండటం తదితర సమయాల్లో వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.

బెణికిన మడమకు ఏది మంచిది ?
ఎప్పుడైనా మడమ బెణికినపుడు వెంటనే వేడి కాపడం పెట్టటం మంచిదని చాలామంది చెబుతుండటం తెలిసిందే. ఇది నొప్పిని తగ్గిస్తుందని, రక్త ప్రసరణను ప్రేరేపించటం ద్వారా వాపు తగ్గేలా చేస్తుందని నమ్ముతుంటారు. కానీ మరికొందరు ఇందుకు పూర్తి విరుద్ధంగా బెణికిన చోట మంచుముక్కలు పెడితే మేలని భావిస్తుంటారు. దీంతో రక్త ప్రసరణ తగ్గుతుందని, వాపు పెరగకుండా తోడ్పడుతుందని చెబుతుంటారు. అయితే ఇందులో ఏది మంచిది? ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. పరిశోధనలు మాత్రం మంచుకే ఓటేస్తున్నాయి. ఆటల్లో మడమ బెణికిన క్రీడాకారులపై శాస్త్రవేత్తలు ఎన్నో అధ్యయనాలు చేశారు. ఒకసారి వేడి కాపడం, మరోసారి మంచు పెట్టటం.. ఇలా రకరకాలుగా పరీక్షించారు. వీటితో పాటు నొప్పి నివారణ మందులు కూడా ఇచ్చారు. బెణికిన వెంటనే అక్కడ మంచుముక్కలను ఉంచటం ద్వారా త్వరగా ఉపశమనం కలుగుతున్నట్టు తేలింది. కాబట్టి బెణికిన మడమకు రక్షణ, విశ్రాంతి, మంచు పెట్టటం (20 నిమిషాల సేపు), బ్యాండేజీ చుట్టటం, కాలు ఎత్తుగా ఉంచటం.. అనే పద్ధతిని పాటించటం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంటే.. మడమ బెణికితే వేడి కాపటం కన్నా మంచు ముక్కలను పెట్టటం మంచిదన్నమాట.

ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :
తరచుగా చాలామంది మడమ బెణకటంతో బాధ పడుతుంటారు. కాలు కూడా కదపలేక తెగ ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి .

* మడమ బెణికినప్పుడు విశ్రాంతి తీసుకోవటం అన్నింటికన్నా ప్రధానం. పాదం మీద భారం పడకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసం అవసరమైతే క్రచెస్‌, చేతికర్ర ఉపయోగించటానికి మొహమాట పడొద్దు.

* సాధ్యమైనంతవరకు పాదాన్ని తొడల కన్నా ఎత్తుగా ఉంచుకునేలా ఏర్పాటు చేసుకోవాలి.

* చిన్నపాటి బెణుకులైనా తగ్గటానికి రెండు వారాల సమయం పడుతుంది....ఇసుగుపోకూడదు .

* వీలైనంత త్వరగా మడమపై ఐస్‌ బ్యాగ్‌ని పెట్టాలి. రెండు మూడ్రోజుల వరకు తరచుగా ఇలా చేస్తుండాలి.

* వాపుని తగ్గించటానికి సాగే బ్యాండేజీని మడమకు చుట్టాలి.

లేదా............బామ్మ చెప్పిన చిట్కాలు మంచివే !

చింతపండు, పాత బెల్లం మిశ్రమాన్ని వేడి చేసి బెణుకు నొప్పులుండే చోట లేపనం చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది

యూకలిప్టస్‌ నూనె (ఆయిల్‌) చర్మానికి ఔషధంగా పనిచేస్తుంది. చర్మానికి సంబంధించిన అనారోగ్యాలను పోగొడుతుంది. తలనొప్పిని, బెణుకు నొప్పులను యూకలిప్టస్‌ ఆయిల్‌ను పూయడం వల్ల ఆ బాధను తగ్గిస్తుంది.

బెణుకు, వాపుల నొప్పి తగ్గటానికి మెంతులను ఉడికించి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు, నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టుకడితే నివారణ కలుగుతుంది. అయితే రెండు మూడుసార్లు ఈ విధంగా కట్టు కట్టాలి.

ఆముదం మునగాకు కలిపి ఉడికించి కాపడం పెడితే వాత నొప్పులు, కీళ్లనొప్పులు, బెణుకు నొప్పులు తగ్గుతాయి.

ఇంగ్లిష్ (allopathy) చికిత్స :
నొప్పికి -> Tab . Aceclonac 750 one tab two time a day, for 7-10 days. or
->Tab . Dolomed MR one tab 3 times a day for 7- 10 days
పై మాత్రలు వాడినప్పుడు కడుపులో మంట రాకుండా tab pantop 40 daily one పరగడుపున వాడాలి .
Frimov ointment పై పూత గా రాయాలి . 3-4 రోజులు .
  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, 1 June 2011

బైపాస్ సర్జరీ - గుండె చికిత్స అవగాహణ , Awareness in Bypass surgery for Heart problem.




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -బైపాస్ సర్జరీ - గుండె చికిత్స అవగాహణ ( Awareness in Bypass surgery for Heart problem)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కొంతకాలం క్రితం వరకు బైపాస్ సర్జరీ అంటే అందరికీ భయమే. బైపాస్ సర్జరీ చేయించుకున్నా ఎక్కువ కాలం బతకకపోవచ్చనీ ఒక అపోహ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. అదే సమయంలో సర్జరీలో కొత్తవిధానాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో గుండెను ఆపి, గుండె చేసే పనిని మరో యంత్రంతో చేయిస్తూ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గుండె యథావిధిగా రక్తాన్ని పంపింగ్ చేస్తుండగానే ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల రోగి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ వివరాలను ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వర్‌రావు వివరిస్తున్నారు.
గుండెకు నిరంతరం రక్తం సరఫరా జరుగుతూ ఉండాలి. ఒకవేళ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడినపుడు గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా అథెరోస్క్లిరోసిస్ (కొలెస్ట్రాల్ పేరుకుపోవడం)వల్ల గుండె రక్తనాళాల్లో(ధమనుల్లో) అడ్డంకులు ఏర్పడతాయి. ఇది ఒక్కరోజులోనో, ఒక్క నెలలోనే జరిగిపోయేది కాదు. దీర్ఘకాలం పాటు కొనసాగి క్రమంగా రక్తనాళం మూసుకుపోతుంది. 60 నుంచి 70 శాతం రక్తనాళం మూసుకుపోయినపుడు రక్తసరఫరా బాగా తగ్గిపోతుంది.


ఈ సమయంలో ఛాతీ నొప్పి ఉంటుంది. శ్వాసలో ఇబ్బంది, ఆయాసం, భుజంలో నొప్పి, దవడ వైపు నొప్పి పాకుతుండటం వంటి లక్షణాలుంటాయి. కొందరిలో ముఖ్యంగా డయాబెటిస్ రోగుల్లో ఛాతీ నొప్పి ఉండదు. ఎటువంటి లక్షణాలు లేకుండానే హార్ట్ఎటాక్ వస్తుంది. 70 శాతం కంటే తక్కువ బ్లాక్ ఉన్నప్పుడు యాంటీప్లేట్‌గగలెట్స్ వాడితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆపరేషన్ అవసరమవుతుంది. చాలా మందిలో ఇసిజి, ఎకో పరీక్షలు నార్మల్‌గానే ఉంటాయి. కానీ ట్రెడ్‌మిల్‌టెస్ట్(టీఎమ్‌టీ)లో రక్తనాళాల్లో సమస్య ఉన్నట్లు బయటపడుతుంది.

కారణాలు
రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటానికి చాలా కారణాలుంటాయి. పొగతాగడం, అధిక రక్తపోటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్, కుటుంబ సభ్యుల్లో గుండె జబ్బులు ఉన్న చరిత్ర, ఒబెసిటీ వంటివి ప్రధాన కారణాలుగా ఉంటాయి.

ఎవరికి అవసరం?
మందులతో నొప్పి తగ్గకపోయినా, యాంజియోగ్రామ్‌లో రక్తనాళం బాగా మూసుకుపోయినట్లు తెలిసినా యాంజియోప్లాస్టీ లేదా సర్జరీ(సిఎబిజి) చేయాల్సి ఉంటుంది. యాంజీయోప్లాస్టీ వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే రక్తనాళాలు మూసుకుపోయిన అందరికీ యాంజియోప్లాస్టీ ఉపయోగపడకపోవచ్చు. రక్తనాళాల్లో ఎక్కువ చోట్ల బ్లాక్స్ ఉన్నప్పుడు, డయాబెటిస్ రోగులకు, గుండె పనితీరు బలహీనంగా ఉన్నప్పుడు, లెఫ్ట్ మెయిన్ కరొనరీ ఆర్టరీలో బ్లాక్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది.

సర్జరీ
బైపాస్ సర్జరీ చేసే సమయంలో గుండె చేసే పనిని నిర్వర్తించడానికి హార్ట్ లంగ్ మెషిన్ అమరుస్తారు. ఆపరేషన్ సమయంలో ఇది గుండె, ఊపిరితిత్తుల పనిని నిర్వర్తిస్తుంది. ఇటీవల ఒపిసిఎబి(ఆఫ్ పంప్ కరొనరీ ఆర్టరీ బైపాస్) అనే నూతన పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో బైపాస్ సర్జరీ నిర్వహించినపుడు గుండెను ఆపాల్సిన పనిలేదు. ఆపరేషన్ సమయంలో కూడా గుండె రక్తం సరఫరా చేస్తూనే ఉంటుంది. ఈ పద్ధతిలో గ్రాఫ్టింగ్ కోసం ప్రత్యేకమైన పరికరాలు ఉపయోగించడం జరుగుతుంది.

కన్వెన్షనల్ బైపాస్ సర్జరీ కన్నా ఇందులో ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. రోగి చాలా తక్కువ సమయంలో కోలుకుంటారు. మందులు, రక్తం తక్కువగా అవసరమవుతుంది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి, గతంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. గ్రాఫ్టింగ్ కోసం ఎడమ ఛాతీ గోడల్లోని ఇంటర్నల్ మమ్మరీ ఆర్టరీని, ముంజేతి భాగం నుంచి రేడియల్ ఆర్టరీని తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ మందికి ఇంటర్నల్ మమ్మరీ అర్టరీని ఉపయోగించడం జరుగుతుంది. ఇందుకంటే ఇది ఎక్కువ కాలం మన్నుతుంది. సిఎబిజి సర్జరీ చేసిన పదేళ్ల తరువాత అర్టీరియల్ గ్రాఫ్ట్‌తో పోల్చితే వెయిన్ గ్రాప్ట్స్ 66 శాతం మాత్రమే తెరుచుకుని ఉంటోంది.


సర్జరీ తరువాత
సర్జరీ తరువాత ఐదారు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చు. అయితే ఆరు వారాల పాటు అధిక బరువులు లేవనెత్తకూడదు. ఛాతీకి దెబ్బతగలకుండా చూసుకోవాలి. వెహికిల్ డ్రైవింగ్ చేయకుండా ఉంటే మంచిది. ఆరు వారాల తరువాత సాధారణ పనులు చేసుకోవచ్చు. మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయడం మరవద్దు. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తేనే కొత్తగా బ్లాక్‌లు ఏర్పడకుండా ఉంటాయి.

బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్లు ప్రతిరోజూ వాకింగ్‌కు వెళ్లాలి. పొగతాగడం మానేయాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. అల్కహాల్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ సాధారణ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. సర్జీరీ చేసి బ్లాక్స్‌ను మాత్రమే తొలగిస్తున్నామే తప్ప బ్లాకులు ఏర్పడే శరీర లక్షణాలను తగ్గించలేం. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే కొత్తగా బ్లాక్స్ ఏర్పడకుండా ఉంటాయి.


డా. నాగేశ్వర్‌రావు-కార్డియోథొరాసిక్ సర్జన్,-యశోద హాస్పిటల్స్, నల్లగొండ క్రాస్ రోడ్,-మలక్‌పేట్, హైదరాబాద్,-ఫోన్ : 9246271144.
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

పగటిపూటనిద్ర లాభాలు,Day time Sleep benefits.


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పగటిపూటనిద్ర లాభాలు,Day time Sleep and benefits.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మధ్యాహ్నం అలా కునుకు తీయడం మీకో అలవాటా? హాయిగా ఓ గంటపాటు మిట్టమధ్యాహ్నం నిద్దరోతున్నారా? అయితే మీ ఆరోగ్యానికేం ఢోకా లేదంటున్నారు హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు. ఇకపై మీ వారు మధ్యాహ్నం ఆ మొద్దునిద్దరేమిటని అడిగితే అదో హెల్త్‌ సీక్రెట్‌ అని చెప్పండిక.

ఆరోగ్యంగా ఉండాలంటే కాసేపు కునుకు తీయడమే...! పగలు కొంతసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు నిపుణులు...! కొందరు కాసేపు కునుకు తీసుకుంటాను. అని అంటూనే నిద్రలోకి జారుకుంటుంటారు. ఇలా ఎక్కడపడితే అక్కడ కునుకు తీయడం కొందరికి అలవాటే. ఈ అలవాటే వారిని ఆరోగ్యవంతులుగా మారుస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మనలో చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గానీ తీరిక దొరికినప్పుడు గానీ కొద్దిసేపు కునుకు తీయటం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కాసేపు నిద్రపోవటం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్ల మోతాదులు తగ్గుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

అప్పుడప్పుడు నిద్రపోవడం వల్ల మెదడుకు విశ్రాంతి చేకూరుతుంది. దీంతో శరీరం పునరుత్తేజితమవుతుంది. పైగా ఇలా కునుకు తీసుకునే వారికి మానసికపరమైన ఒత్తిడి, శారీరకపరమైన ఒత్తిడి దరిచేరవంటున్నారు పరిశోధకులు.

ఇలా కునుకు తీసేవారి జాబితాలో ప్రముఖులెందరో వున్నారు. వారిలో కొందరి పేర్లు మీకోసం... ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, థామస్ ఎడిసన్, రోనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్, హెచ్‌డి. దేవెగౌడ తదితర ప్రముఖులున్నారు. కాబట్టి సమయం, సందర్భం అనుకోకుండా మీరు అప్పుడప్పుడు చిన్న కునుకు తీస్తుంటే ఆరోగ్యంగా ఉంటారని పరిశోధకులు చెపుతున్నారు.

మొదడు చురుగ్గా పనిచేసేందుకు..!
కాసేపు పడుకుని లేవడం వల్ల శరీరానికి అలసట తీరి మరింత సమర్థవంతంగా, సృజనాత్మకతతో పని చేయవచ్చట. పగలు కాసేపు పడుకోవడం టైమ్‌ వేస్ట్‌ చేయడమనుకుంటే పొరపాటే. కళ్లకు కాసింత విశ్రాంతి ఇచ్చేందుకు మంచి మార్గం ఇది. మొదడు చురుగ్గా పనిచేసేందుకు పగలు కాస్త కునుకు తీస్తే మంచిది.

రిలాక్స్‌ అయ్యేందుకు
గుండె పనితీరు మెరుగయ్యేందుకు, హార్మోన్‌ల హెచ్చుతగ్గులను సమం చేసేందుకు, రక్తనాళాలు శుభ్రపరిచేందుకు పగటి నిద్ర ఉపకరిస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే ఒత్తిడిని దీని ద్వారా తగ్గించుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో 20-30 నిమిషాలు నిద్రపోవడం వల్ల ఆ తరువాత చేసే పనిలో ఉత్సాహం నిండు తుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మగవారితో పోలిస్తే ఆడవారిలో మధ్యాహ్నం నిద్రవల్ల కలిగే లాభాలు కాస్త తక్కువే.

మంచి డైట్‌ పాటించేవారిలో దీని ప్రభావం ఎక్కువగా వుంటుంది. పండ్లు, కూరగాయలు, బీన్స్‌, ఆలివ్‌ ఆయిల్‌, కొద్దిపాటి రెడ్‌వైన్‌ తీసు కునే వారిని, సాధారణ డైట్‌తో మధ్యాహ్నం నిదురపోయే వారిని పరీక్షించగా వచ్చిన ఫలితాలు ఆశ్చర్యకరంగా వున్నాయి. పగటి నిద్ర పోయేవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం డైట్‌ పాటించేవారికన్నా తక్కువగా వుంది. వారానికి కనీసం మూడురోజులు అరగంట సేపు పగలు నిదురపోయేవారిలో గుండెజబ్బులతో మరణించే అవకాశం మామూలుకంటే 37% తక్కువ.

తిండివల్ల కాదు
మధ్యాహ్నం భోజనం మితిమీరి తినడం వల్ల నిద్రముంచుకొస్తుందని అనుకుంటారు చాలా మంది. కానీ ఇది నిజం కాదని తేల్చారు శాస్త్రవేత్తలు. భోజనం చేయకున్నా మధ్యాహ్నం నిద్రవల్ల కలిగే లాభాల్లో ఎలాంటి మార్పూ ఉండదని తేల్చి చెప్పారు. పైగా దీనివల్ల అలర్ట్‌గా వుండే శక్తి, ప్రొడక్టివిటీ పెరుగుతుందట కూడా.

నిర్ణయాత్మక శక్తి
క్లిష్ట విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసు కునే శక్తి పెరిగేందుకు పగలు నిద్ర ఉపకరిస్తుంది. మెదడుకు రిఫ్రెష్‌నెస్‌ను కలిగించేది ఇదే. పగలు కాస్త కునుకు తీసి తరువాత ఏదైనా పనిని మొదలు పెడితే అది మరింత సమర్థవంతంగా వుంటుంది.

ఒత్తిడి మాయం
మనిషి పుట్టడం, చావడం మధ్యలో బ్రతకడం అంతా ఒత్తిడితోనే. ఈ ఒత్తిడి అనేది కొందరిలో ఎక్కువ పరిమాణంలో కొందరిలో తక్కువగానూ ఉండవచ్చు. ఒత్తిడిని తగ్గించుకుంటేనే ఆయు ర్దాయం పెరుగుతుందనేది వాస్తవం. ఈ ఒత్తిడిని మాయం చేసే మార్గం కాసేపు కన్నులు మూసు కుని ప్రశాంతంగా నిద్రపోవడమే.

అందానికీ మందు
అలసటను తీర్చే నిద్రవల్ల ముఖంలో కాంతి పెరుగుతుందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖంలోని రక్త కణాలు నిద్రించే సమయంలో యాక్టివ్‌గా పనిచేయడమే ఇందుకు కారణం. సహజమైన వర్ఛస్సుకు తేలికైన మార్గం కదూ! తెలిసిందిగా పగలు పదినిమిషాలు ప్రశాంతంగా నిద్రపోగలిగితే ఎన్ని ఉపయోగాలో. ఆరోగ్యం, అందం, విశ్రాంతి అన్నీ ఒక్కసారిగా దొరుకు తాయన్నమాట. మనమూ ఓ కునుకులాగిద్దామా!

అతినిద్ర

నాక్రొలెప్సీ సమస్య ఉన్నవారు అతినిద్ర జబ్బుతో ఉంటారు. చదువు తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు కునుకు తీస్తుంటారు. పదివేల మందిలో నలుగురికి ఈ సమస్య ఉంటుంది. 15 నుంచి 20 ఏళ్ల వయసు వారిలో ఈ సమస్య అధికం. నడుస్తున్నప్పుడు ఉన్నట్టుండి పడిపోతారు. నడుస్తూ కలలుకంటారు. పరిసరాలను పట్టించుకోరు. ఏంచేస్తున్నారో మరచిపోతారు.

Source : from Medical journals
  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, 30 May 2011

ఎనీమియా , రక్తహీనత,Anaemia




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎనీమియా , రక్తహీనత,Anaemia- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రక్త హీనత అంటే ఏమిటి?

మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఇది తయారవడానికి మాంసకృత్తులతో పాటు ఇనుము అనే పోషక పదార్థం ముఖ్యంగా అవసరం. మన శరీరంలో హీమోగ్లోబిన్ పరిమాణం ఒక మోతాదులో (16 mg%) ఉంటుంది. ఉదాహరణకు మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరంలోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు, 6 నుండి 12 సం.ల లోపు పిల్లలో్ల 12 గ్రాములు ఉండాలి. ఒక వేళ హీమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్త హీనతతో వారు బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. రక్తహీనతకు (అనీమియా) గురైన వ్యక్తి శరీ రంలో ఎర్ర రక్త కణాలు (రెడ్‌బ్లడ్‌సెల్స్‌- ఆర్‌ బిసి- లేదా ఎరిత్రోసైట్స్‌) సంఖ్య తగ్గిపోతుంది. రక్త పరీక్షలో ఆర్‌బిసి కౌంట్‌ ద్వారా రోగి రక్తంలో ఎన్ని ఎర్రరక్తకణాలున్నాయనే విష యాన్ని తెలుసుకోవచ్చు. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య 38 శాతం నుంచి 48 శాతం వరకూ ఉంటుంది. ఆర్‌బిసి లో ఆక్సిజన్‌ను తీసుకునివెళ్లే కణాలను హీమో గ్లోబిన్‌ అంటారు.

ఆరోగ్యవంతుల్లో హీమోగ్లోబిన్‌ ఒక డెసి లీటర్‌కు 12 గ్రాములుంచి 16 గ్రాముల మధ్య ఉంటుంది. ఆర్‌బిసి కౌంట్‌ ఒక మైక్రోలీటర్‌కు 4.4నుంచి 5.8 మిలియన్ల వరకూ ఉంటుంది. ఆర్‌బిసిలోని హీమోగ్లోబిన్‌ ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళుతుంది. ఆక్సిజన్‌ రవాణా వ్యవస్థగా ఎర్ర కణాలు ఉపకరిస్తాయి. ఆక్సిజన్‌ శరీరానికి ఇంధనంగా ఉపయోగపడుతుంది.

రక్తహీనతకు గురైన వ్యక్తిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్త కణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ అందదు. రోగి ఎంతో అలసట పొందడం, చివరకు శ్వాస తీసు కోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు తమలో శక్తి పూర్తిగా నశించిపోయినట్లు భావిస్తారు . ఆర్‌బిసి లలో ఉన్న హీమోగ్లోబిన్‌ కణాల నుంచి కార్బన్‌ డై ఆక్సైడ్‌ అనే వ్యర్థ పదార్థాన్ని సేకరించి, ఊపిరితిత్తులకు అందజేస్తుంది. ఊపిరితిత్తులు ఈ వ్యర్థపదార్థాన్ని విసర్జిస్తాయి.

శరీరంలో ఉండే ఎరిత్రోప్రోటీన్‌ అనే హార్మోన్‌ బోన్‌ మారోను ఉత్తేజపరిచి, ఎర్ర రక్తకణాల సంఖ్యను నియంత్రించేలా చేస్తుంది. శరీరంలో ఉండే దాదాపు మొత్తం ఎరిత్రోప్రోటీన్‌ను మూత్రపిండాలు ఉత్పత్తి చేస్తాయి. అక్కడినుంచి ఎరిత్రోప్రోటీన్‌ బోన్‌మారోకు చేరుతుంది. ఇక్కడే ఎర్ర రక్తకణాలు తయారవుతాయి. ఒక వ్యక్తి మూత్రపిండాల వ్యాధికి గురైన ప్పుడు మూత్రపిండాలు అవసరమైన స్థాయిలో ఎరిత్రోప్రోటీన్‌ను ఉత్పత్తి చేయలేవు. ఎరిత్రోప్రోటీన్‌ లేకుండా, బోన్‌మారో తగి నంత సంఖ్యలో ఎర్ర రక్తకణాలను తయారు చేయలేవు. ఫలితంగా శరీరావసరాలకు సరిపో యేంత ఆక్సిజన్‌ అందదు.మూత్రపిండాలు విషపదార్థాలను, ద్రవాలను శరీరంనుంచి తొలగిస్తాయి. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారిలో ఈ పని డయాలిసిస్‌ ద్వారా కొంత జరుగుతుంది.కాని, ఎరిత్రోప్రోటీన్‌ను తయారు చేయడం మాత్రం మూత్రపిండాల వ్యాధికి గురైన ప్పుడు సంభవం కాదు.

కారణాలు : స్త్రీలలో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనత – రక్తం తక్కువగా ఉండడం ఇది ముఖ్యంగా మూడు కారణాల వలన వచ్చును.
1.పౌష్టికాహార లోపం – ఐరన్ (ఇనుము ధాతువు) కలిగిన ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారంలోను ఎక్కువ నిలువలుండును. ఇవి గలిగిన ఆహారం సమతుల్యంతో తీసుకోకపోవడం.
2.రక్తం నష్టపోవడం – స్త్రీలు ఋతుస్రావం ద్వారా, పిల్లలు కడుపులో పొట్టపురుగులు ద్వారా, క్రమేపి రక్తాన్ని కోల్పోయి, రక్తహీనతకి గురి అవుతారు.
3.రక్తం తయారీలో అవరోధం – జబ్బుల వలన ఉదా. మలేరియా, రక్తంలోని ఎర్ర కణాలు ధ్వంసం అయి మరల పెరగవు...దీంతో రక్తం తయారవక రక్తహీనత కనపడుతుంది.

లక్షణాలు :
బలహీనం, నిరాశక్తత, సాధారణ పనులకే ఆయాసం రావడం.
1) నాలుక, కనురెప్పలలోపలి భాగాలు పాలిపోవడం, 2) అలసట, 3) చికాకు, 4) ఆకలి లేకపోవడం, 5) మైకం, కళ్ళు తిరగడం, 6) అరచేతుల్లో చెమట, 7) చేతుల గోళ్ళు వంగి గుంటలు పడడం 8) పాదాలలో నీరు చేరడం, 9) చిన్న పిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం.

రక్త హీనత ఎవరిలో ఎక్కువగా కనబడుతుంద?

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 15-45 సం.వయస్సు గల స్త్రీలు, 11 సం.ల లోపు పిల్లలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. అయితే మగవారిలో కూడా రక్తహీనత చోటుచేసుకోవడం అసాధారణం కాదు.

రక్త హీనత వల్ల కలిగే దుష్పరిణామాలు
బలహీనత, గర్భస్రావం, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, పనిచేసే సామర్థ్యం తగ్గుదల, రోగాలు తేలికగా వెంటవెంటనే రావడం, చదువులో వెనుకపడడం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోవడం మైదలైనవి.

రక్త హీనతను నివారించడం ఎలా

చికిత్సా విధానం : చిన్న పిల్లలకి పొట్టపురుగుల మందు ఇవ్వాలి. మల విసర్జన తరువాత చేతులు సబ్బుతో తోముకునేలా అలవాటు చేయించాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం (ఆకుకూరలు, పొట్టుతోటి ధాన్యాలు, మాంసాహారం) తీసుకునేట్లు చేయాలి. యుక్త వయస్సు నుండి సంతానం పొందు వయసు మధ్యలో గల స్త్రీలందరికి ఎ.ఎన్.ఎం. సహాయంతో ఉచితంగా లభ్యం అయ్యే ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి.

రక్త హీనతను నివారించడానికి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒక ప్రజారోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది. రక్త హీనతకు తేలికగా గురికాగల గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఉపకేంద్రం ద్వారా ఇనుమున్న ఎర్రగోలీలు (ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు) ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ఈ గోలీలను గర్భిణీ స్త్రీలయితే 6వ నెల మొదటి నుండి 100 రోజుల పాటు, బాలింతలు చనుబాలు యిస్తున్నంత కాలం లేదా 100 రోజుల పాటు, 11 సం. వయస్సులోపున్న రక్త హీనతగల పిల్లలు సంవత్సరంలో కనీసం 100 రోజులపాటు క్రమం తప్పకుండా రోజుకొక్కగోలీ చొప్పున తీసుకోవడం వల్ల వారి శరీరానికి పూర్తి రక్తపుష్టి చేకూరుతుంది.
ఈ మాత్రలు తీసుకొనేవారి మలం నల్లబడడం, వికారం కల్గడం సహజం. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు.

ఆకుకూరలు రక్త హీనత నివారణకు సులభమైన ఉపాయం --- ఇనుము ఎక్కువగా వుండి, సులభంగా లభించి, చవకగా అందరికీ అందుబాటులో ఉండే అన్ని రకాల తాజా ఆకుకూరలు అంటే తోటకూర, పుంటికూర, పాలకూర, మెంతి కూర, బచ్చలి కూర, గంగబాయిల కూర రోజు తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. ఇవేగాక ఖరీదైన ఎండినపండ్లు, అంటే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూర్, మాంసం, కాలేయం వంటి పదార్థాల్లో కూడా యినుము పుష్కలంగా లభిస్తుంది. వీటితోపాటు, రోజూ తీసుకొనే ఆహారంలో మొలకెత్తిన పప్పుధాన్యాలు విటమిన్ సి ఎక్కువగా వుండి నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం ద్వారా రక్త హీనత రాకుండా చూసుకోవచ్చు.

రక్త హీనత నివారణకు నూతన పద్ధతి : దేశ ప్రజలలో అధికశాతం రక్తహీనతకు గురి అవుతున్నారు. కాబట్టి రక్తహీనత నివారణకు మనం మామూలుగా తీసుకొనే ఉప్పులో ఇనుమును కలిపే శాస్త్రీయ పద్ధతిని జాతీయ పోషకాహార సంస్థ వారు కనుగొన్నారు. మామూలు ఉప్పు బదులుగా క్రొత్తగా తయారుచేసిన ఇనుము కలిపిన ఉప్పును రోజూ వంటలో వాడడం ద్వారా ఇనుము లోపం వలన వచ్చే రక్త హీనతను నివారించవచ్చును. ఈ ఇనుము కలిపిన ఉప్పు ప్రస్తుతం కొన్ని పట్టణ ప్రాంతాల్లో లభ్యం అవుతోంది.

రక్త హీనతను అశ్రద్ధ చేయకండి. అది నీరసానికి బలహీనతకు మాత్రమే దారితీయదు. ప్రాణాహానిని కూడా కల్గించవచ్చు. రక్తహీనతను దరిచేరనీయకండి. ఇనుము పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు రోజూ తీసుకోండి. రక్తహీనత ఉన్నవారు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వందరోజులు తీసుకోండి. మీ గ్రామ ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందిని గాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గాని, ప్రభుత్వ ఆసుపత్రిలోగాని సంప్రదించి దీనిని నివారించే పద్ధతుల వివరాలను విపులంగా తెలుసుకొని పాటించండి.

మంచి ఆహారంతో ఎనీమియాకు దూరం...
--ప్రస్తుతం మహిళలను వేధిస్తోన్న సమస్య ఎనీమియా (రక్తహీనత). లేచింది మొదలు గొడ్డు చాకిరీ చేసే మహిళలకు రోజంతా... పనితోనే సరిపోతుంటే ఇక తినేందుకు సమయమెక్కడ ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా ఆ... ఏం తింటాలే... అని ఊరుకునే మహిళలు ఎంతమందో..! దీని ఫలితమే రక్తహీనత.

విటమిన్ బి12 తప్పనిసరి..!

తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలలోనూ.... ఇక పండ్ల విషయానికొస్తే... అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్‌లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది...

అంతేగాకుండా వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోవడం వల్ల, రుతుసమయంలో అధిక రక్తస్రావం వల్ల, ఫైల్స్ సమస్య వల్ల కూడా రక్తహీనత వస్తుంది. దీనివల్ల రక్తంలో ఎర్రకణాల సంఖ్య తగ్గిపోయి శారీరక బలహీనత ఏర్పడుతుంది. దీని కారణంగా ఒంట్లో నీరసంగా ఉండటం, కళ్ళు తిరగటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తలనొప్పి తదితర సమస్యలు కలుగుతాయి.

మరి దీనికి పరిష్కారమే లేదా..? అంటే ఉందని చెప్పాలి. అదేంటంటే... మందులకన్నా... ప్రతిరోజూ వీరు తీసుకునే ఆహారంలో ఐరన్ అధికంగా లభించే వాటినే తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా కాయగూరలు, పండ్లలో ఉంటుంది.

రక్తహీనత బారినపడొద్దు-ముందే జాగ్రత్త పడటం :
--మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్న స్త్రీలు, పిల్లలు ఎంతోమంది. దీని బారినపడ్డవారి రక్తంలో ఎర్రకణాలు తగ్గిపోతాయి. దీంతో శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్‌ సరిగా అందదు. రక్తహీనత తీవ్రతను బట్టి.. నిస్సత్తువ, పనులు చేస్తున్నప్పుడు శ్వాస కష్టంగా ఉండటం, మగతగా అనిపించటం, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి తగ్గటం, గుండె సరిగా కొట్టుకోకపోవటం వంటివీ ఉండొచ్చు. కాబట్టి రక్తహీనత బారిన పడకుండా ముందే జాగ్రత్త పడటం ఎంతో ఉత్తమం. అందుకు ఆహరంలో తగు మార్పులు చేసుకుంటే సరి.

* ఇనుముతో నిండిన యాపిళ్లు, అరటిపండ్లు, ఆకుకూరల వంటివి ఎక్కువగా తినాలి. మాంసం, ముడిధాన్యాలు కూడా మంచివే.

* సి విటమిన్‌ ఇనుమును ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. అందువల్ల బత్తాయి, నిమ్మ, ఉసిరి వంటి సి విటమిన్‌ గల పదార్థాలు, పానీయాలు కూడా అధికంగా తీసుకోవాలి.

* భోజనం చేసిన వెంటనే కాఫీ, టీలు తాగటం మానెయ్యాలి. ఇవి ఇనుమును గ్రహించుకోకుండా అడ్డుకుంటాయి. ఫోలిక్‌యాసిడ్‌, విటమిన్‌ బి12తో నిండిన పాలకూర వంటి ఆకుకూరలు, కాలేయం, ముడిధాన్యాలు తగినంత మోతాదులో ఉండేలా చూసుకోవాలి. కిస్‌మిస్‌ వంటి ఎండు ఫలాల్లోనూ ఇనుము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఆహారంలో విధిగా చేర్చుకోవాలి.





మన ఆరోగ్యాన్ని మనమే కాపాడు కోవాలి. ఎవరో వస్తారు ఏవోచేస్తారు ... అన్నింటికీ దేవుడే ఉన్నాడులే అని అనుకోకూడదు. -- డా.శేషగిరిరావు (శ్రీకాకుళం).
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/